Photo Credit: Twitter
షేర్-ఇ-పంజాబ్ టీ20 లీగ్‌లో మొహలీ కింగ్స్ వరుస విజయాలతో దుమ్మురేపుతుంది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ రమన్‌దీప్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. తాజాగా సోమవారం లుధియానా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రమన్‌దీప్ విధ్వంసంతో మొహలీ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన లుధియానా లయన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అర్జున్ రాజ్‌పుత్ (46 బంతుల్లో 78), అభిజిత్ గార్గ్ (48 బంతుల్లో 78) రాణించడంతో లుధియానా భారీ స్కోరు చేసింది. మొహాలీ కింగ్స్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 3 వికెట్లు తీయగా, రమన్‌దీప్ సింగ్ 2, ఆయుశ్ గోయల్ ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన మొహాలీ కింగ్స్ సరిగ్గా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసి గెలుపొందింది. రమన్‌దీప్ (35 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా, అన్‌మోల్‌ప్రీత్ సింగ్ (50) అర్థసెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 41 బంతుల్లోనే 86 పరుగులు జోడించడంతో మొహాలీ విజయం దిశగా పరిగెత్తింది.
బౌలింగ్‌లో రెండు వికెట్లు, బ్యాటింగ్‌లో 85 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్‌తో మెరిసిన రమన్‌దీప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఆరు మ్యాచ్‌ల్లో మొహలీ కింగ్స్‌కు ఇది నాలుగో విజయం కాగా, పట్టికలో తొలి స్థానంలో కొనసాగుతోంది. 5 మ్యాచ్‌ల్లో మూడు ఓటములతో లుధియానా ఐదో స్థానంలో కొనసాగుతోంది.
ఇక రమణ్‌దీప్ విషయానికి వస్తే.. టీమిండియా తరపున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2024లో సౌతాఫ్రికా టూర్‌లో ఆడిన రమణ్‌దీప్‌కు తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు. ఇండియా-ఎ టీమ్‌లో మాత్రం అతడు కీలక సభ్యునిగా ఉన్నాడు. ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో మరింత మెరుగ్గా రాణించి సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని ఈ పంజాబ్ ఆల్‌రౌండర్ భావిస్తున్నాడు.
85(34) with the bat.🌟
2/31 (4) with the ball.🤛
Ramandeep Singh owned the game from start to finish. A true all-round Masterclass. 💜🔥 pic.twitter.com/s0HyFEbJcS— Rokte Amar KKR (@Rokte_Amarr_KKR) September 7, 2026


