పంజాబ్‌కు చెందిన శుబ్‌మన్ గిల్‌కు చిన్ననాటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి తండ్రి ప్రోత్సాహంతో మొహాలీలో శిక్షణ పొందాడు
పద్నాలుగేళ్ల వయసులోనే పంజాబ్ అండర్-16 జట్టు తరఫున 351 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు
ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన గిల్.. 372 పరుగులు సాధించి చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు
తద్వారా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి టీమిండియా ఎంట్రీకి బాటలు వేసుకున్నాడు
2018లోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు
అనతి కాలంలోనే జట్టులో కీలక సభ్యుడిగా మారిన గిల్.. రోహిత్ శర్మ వారసుడిగా పాతికేళ్ల వయసులోనే టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌గా ఎంపికయ్యాడు
ఇప్పటి వరకు టీమిండియా తరఫున 43 టెస్టులు, 67 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడిన గిల్..
టెస్టుల్లో 3043, వన్డేల్లో 3379, టీ20లలో 869 పరుగులు సాధించాడు. 23 ఏళ్ల వయసులోనే వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఘనత గిల్‌కు ఉంది.
సెప్టెంబరు 8, 1999లో జన్మించిన అతడు మంగళవారం 27వ వసంతంలోకి అడుగుపెట్టాడు.
Photo Credit: BCCI/ICC/Instagram


