హైదరాబాద్, ఆగస్టు 2026: స్పోర్ట్స్, ఫిట్‌నెస్, న్యూట్రిషన్, వెల్‌నెస్ రంగాలకు సంబంధించిన స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 రెండు రోజుల ప్రదర్శన శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రారంభమైంది.
హైటెక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో తయారీదారులు, ప్రముఖ బ్రాండ్లు, డిస్ట్రిబ్యూటర్లు, పరిశ్రమ నిపుణులు, స్పోర్ట్స్ కమ్యూనిటీలు, వినియోగదారులు ఒకే వేదికపైకి వచ్చారు.
ఈ 9వ ఎడిషన్ స్పోర్ట్ ఎగ్జిబిషన్‌ను హైటెక్స్ డైరెక్టర్ కున శంకర్, ఎన్‌ఎండీసీ డైరెక్టర్ పర్సనల్ కృష్ణ కుమార్ ఠాకూర్ , హైదరాబాద్ రన్నర్స్ రేస్ డైరెక్టర్ రాజేష్ వెట్చా కలిసి శుక్రవారం ప్రారంభించారు.
ఈ ప్రదర్శన శనివారం కూడా కొనసాగుతుందని, సందర్శకులకు ప్రవేశం ఉచితం అని తెలిపారు.


