ఆ అక్కా తమ్ముళ్లది విమాన బంధం..! ఇద్దరూ.. | Two siblings from Manipur turned Air India cabin Goes Viral | Sakshi
Sakshi News home page

ఆ అక్కా తమ్ముళ్లది విమాన బంధం..! ఇద్దరూ..

Aug 28 2026 5:59 PM | Updated on Aug 28 2026 6:29 PM

Two siblings from Manipur turned Air India cabin Goes Viral

రాఖీ పూర్ణిమ సందర్భంగా కొన్ని బంధాలు నిజంగా ఆశ్చర్యం కలిగించేలా ఎలా స్ఫూర్తిగా ఉంటాయో తెలుసా..!. అందుకు ఈ ఇద్దరు తోబుట్టువులే ఉదాహరణ. ఔను మీరు వింటుంది నిజమే. ఒకే ఇంట్లోని ఏ తోబుట్టువులు కూడా ఒకే రంగంలో కొనసాగడం అనేది అత్యంత అరుదు. ఒకవేళ​ కొనసాగినా..సహోద్యోగులగా ఉండటం అనేది..చాలా వృత్తిల్లో సాధ్యం కాదు. కానీ ఈ అక్కా తమ్ముళ్లు ఒకే వృత్తిని ఎంచుకోవడమే కాదు..ఒకో చోట కొలిగ్స్‌గా ఉంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. అలా అని ఇద్దరికీ పెద్ద ఏజ్‌ గ్యాప్‌ ఉండదనుకుంటే పొరపాటే.

ఆ తోబుట్టువులే మణిపూర్‌కి చెందిన వాహెంగ్‌బామ్ సురేయా, రోహిత్‌ సింగ్‌లు. వారిద్దరికి విమానయానం ఉద్యోగానికి మించి అని చెప్పొచ్చు. ఇంఫాల్‌లో ఎనిమిదేళ్ల వయసు తేడాతో పెరిగిన ఇద్దరూ..ఎయిర్‌ ఇండియాలో క్యాబిన్ క్రూ సభ్యులు. ఇద్దరికి ఒకే రకమైన కఠినమైన షెడ్యూళ్లు, ఒకే చోట వేచి ఉండటం తదితరాలన్ని ఎదుర్కొంటుంటారు. అయితే వారి కుటుంబంలో విమానయాన రంగంలోకి ప్రవేశించిన తొలి వ్యక్తి సురేయా కాగా, ఆమె తమ్ముడు కూడా ఆమె బాటలో పయనించి ఈ వృత్తిని ఎంచుకోవడం విశేషం. 

అక్క సురేయా 2014లో విమానయాన జర్నీని ప్రారంభించింది. అయితే అక్క డ్యూటీ నుంచి తిరిగి వచ్చాక రోహిత్‌కి వివిధ ప్రాంతాలు, ఆ వృత్తి విధివిధానాల గురించి ఆమె కథలు కథలుగా చెప్పేది. ఆమె అనుభవాలు వింటూ పెరిగిన రోహిత్‌కి తెలియకుండానే ఆ వృత్తిపై అమితంగా ఆసక్తి పెరిగిపోయింది. అలా చివరికి కొన్నేళ్ల తర్వాత అక్క మాదిరిగానే ఎయిర్‌ ఇండియాలో చేరి తన చిన్న నాటి కలను వృత్తిగా మార్చుకుఉన్నాడు. 

అన్నింట్లకంటే విశేషం ఏంటంటే ఒకే ఎయిర్‌లైన్‌ పనిచేయడంతో వారి బంధం మరింత స్ట్రాంగ్‌గా మారింది. ఎంత బిజీ షెడ్యూళ్లు ఉన్నా ఒకరినొకరు సులభంగా అర్థ చేసుకుంటుంటారు. అలాగే ఒకరికొకరు తమ అనుభవాలను పంచుకుంటుంటామని చెబుతున్నారు. అయితే ఈ వృత్తి కారణంగా తోబుట్టువుల నుంచి సహోద్యోగులుగా కూడా మారామని నవ్వుతూ చెబుతుంటారు ఇద్దరూ. 

అలా తామిద్దరి లైఫ్‌స్టైల్‌ ఒకటే కాబట్టి ప్రతీది పూర్తిగా వివరించకుండానే..అవతల వాళ్ల బిజీని అర్థం చేసుకుంటామని అంటున్నారు. అలాగే తాము విరామ సమయాల్లో కలిసి గడుపుతామని, అది మాకు ఇంట్లో ఉన్న అనుభూతిని ఇస్తుందంటున్నారు. అంతేగాదు మాకు ఎయిర్‌ ఇండియా క్యాబ్‌ కేటాయించినప్పుడూ మా ఇద్దరి అడ్రస్‌ ఒకటే కావడంతో క్యాబ్‌ డ్రైవర్‌ ఎయిర్ ఇండియా ఫ్యామిలీ ప్యాకేజీలను ఎప్పుడు అద్దెకు ఇవ్వడం ప్రారంభించింది అని జోక్‌ చేస్తుంటాడని చెబుతున్నారు. 

ఒ​​క్కోసారి తన తమ్ముడు రోహిత్‌కి డ్యూటీ లేకపోతే తనకోసం వేడివేడిగా భోజనం తీసుకొస్తాడని, అది నాకు ఇంట్లో ఉన్న అనుభూతిని అందిస్తుందని చెబుతోంది సురేయా. ఇక తమ్ముడు రోహిత్‌ తన అక్క శ్రద్ధ , దయను ప్రశంసిస్తూ..క్యాబిన్‌ సిబ్బందిగా ఆమె ఆత్మవిశ్వాసం, వృత్తి నైపుణ్యం, ప్రవర్తించే తీరుకి తాను సదా అభిమానిని అంటున్నాడు. నిజంగా ఇలాంటి అదృష్టం ఎందరి సోదర సోదరీమణులకు దక్కుతుంది చెప్పండి. 

(చదవండి: హమ్మయ్యా ఎట్టకేలకు గంగానదిలో స్నానమాచరించా..! వీడియో వైరల్‌)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement