నాన్న కల కోసం..29 ఏళ్లకే రిటైర్మెంట్‌! చివరికి ఇద్దరూ.. | Woman leaves city hustle to start farmstay with dad in Maharashtra village | Sakshi
Sakshi News home page

ఒకప్పుడు బాలీవుడ్‌ పనిచేసేదామె..సడెన్‌గా 29 ఏళ్లకే రిటైర్మెంట్‌! ఎందుకో తెలుసా..

Aug 26 2026 1:47 PM | Updated on Aug 26 2026 2:11 PM

Woman leaves city hustle to start farmstay with dad in Maharashtra village

ఇటీవల ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక కాలేజ్‌లలో చదివిన చాలామంది ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు వదిలి నచ్చిన పనిలో ఆనందం వెతుక్కుంటున్న వారిని ఎందరినో చూశాం. మరికొందరు లక్షల్లో జీతాలు ఆర్జించి..చీకు చింతా లేని రిటైర్మెంట్‌ కోసం సేవింగ్స్‌​ ప్లాన్‌ చేసుకుని మరి త్వరితగతిని పదవీవిరణమ చేస్తున్న వారిని చూశాం. కానీ అలా కాకుండా సంపాదన మొదలయ్యే స్టేజ్‌లోనే రిటైర్మెంట్‌ ప్రకటించి ఈ మహిళ ఏం చేస్తుందో తెలిస్తే..ఆశ్చర్యపోవడమే కాదు అభినందించకుండా ఉండరు కూడా. ఎందుకంటే..

ఇంతకీ ఆమె ఏం చేస్తోందంటే..మహారాష్ట్రకి చెందిన స్నేహా రాజ్‌గురు అనే మహిళ తాను ఆధునిక పోటీ ప్రపంచపు ఒత్తిడిని వద్దనుకుని మరి పెర్మాకల్చర్‌(కృత్రిమ ఎరువులు, రసాయనాలకు దూరంగా సహజ పద్ధతిలో వ్యవసాయం చేయడం)ను ఎంచుకున్నట్లు తెలిపింది. ఆ నిర్ణయం తనకు ఎన్ని విధాలుగా మేలు చేసిందో వివరిస్తూ..ఆ జర్నీ గురించి వీడియో రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. తాను ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే 29 ఏళ్లకే రిటైర్మెంట్‌ తీసుకున్నట్లు తెలిపింది. అంతేగాదు తాను భూమిని ఎలా కొనుగోలు చేసి, పండ్లు, కూరగాయలు పండించడం ప్రారంభించిందో వీడియోలో వివరించారు. 

తాను ఒకప్పుడూ.. బాలీవుడ్‌లో పనిచేసేదాన్ని అని, తనకు ప్రయాణాలపై ఉన్న మక్కువ కారణంగా ఈ ఫెర్మాకల్చర్‌ గురించి తెలుసుకునే అవకాశం ఏర్పండిందని వెల్లడించింది. ఇక తన తండ్రి టాటా మోటర్స్‌లో 30 ఏళ్లకు పైగా పనిచేశారని, పదవీవిరమణ తర్వాత  ప్రకృతికి దగ్గరగా జీవించాలని ఆశించినట్లు చెప్పుకొచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇలా ఇద్దరం కలిసి ఫామ్‌ ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చామని తెలిపింది. ఇక తన ఫెర్మాకల్చర్‌ జర్నీ గురించి మాట్లాడుతూ..ముందుగా తాను చిన్న భూభాగాన్ని కొనడమే తన మొదటి అడుగుగా పేర్కొంది. 

దానికి బాప్‌బేటీ ఫామ్‌(తండ్రి కూతుళ్ల) ఫామ్‌ అని పేరుపెట్టినట్లు వెల్లడించింది. ఆ తర్వాత పండ్ల చెట్లను నాటినట్లు పేర్కొంది. దీనికి తక్కువ శ్రమ పైగా మనతోపాటే పెరుగుతాయి. పైగా ఏళ్ల తరబడి చక్కగా పండ్లను అందిస్తాయన్నారు. దీనివల్ల మన ఆహారాన్ని మనమే స్వయంగా పండించుకుని తింటున్న ఆనందం దక్కుతుందని అంటోంది. అలాగే లాక్‌డౌన్‌ లేదా యుద్ధం లాంటివి వచ్చినప్పుడూ ఎవ్వరిపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడదని చెబుతోంది. 

అదీగాక అన్నింటి కన్నా ముఖ్యంగా కడుపు నింపుకునేలా మంచ ఆహారాన్ని అందించే స్థలాన్ని పొందామనే ఆనందం సొంతమవుతుందని అంటోంది. ఇక్కడ పదవీవిరమణ అనేది వయసుకి సంబంధించింది కాదని, ఒత్తిడిని వద్దని శాంతిని ఎంచుకోవడం గురించని నొక్కి చెబుతోంది.  చివర్లో మీరు కూడా ఇలాంటి జీవితం గురించి కలలు కంటున్నారా అని ప్రశ్నిస్తూ.. తన సంభాషణను ముగించింది వీడియోలో. నెటిజన్లు కూడా 29 ఏళ్లకే పదవీ విరమణ చేయడం అద్భుతం!!. నిజంగా ఇది చాలా బాగుంది అంటూ పోస్టులు పెట్టారు. కాగా, ఈ బాప్‌బేటీ ఫామ్‌ మహారాష్ట్రలోని కోయాలిలో, సరస్సు కనిపించే ఒక కొండప్రాంత వ్యవసాయ క్షేత్రం. 
 

 

(చదవండి: 'తిరంగా' దుస్తుల వివాదం..ఊర్వశి రౌతేలా స్పందన ఇదే..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement