బరువు తగ్గాలంటే స్ట్రిక్ట్ డైట్, కఠినమైన వర్కౌట్లుతోనే సాధ్యం అనే అభిప్రాయాన్ని తుడిచిపెట్టేయండని అంటోంది ఈ కంటెంట్ క్రియేటర్ శివాని అగర్వాల్. రోజువారి అలవాటల్లో జస్ట్ చిన్న చిన్ని స్థిరమైన మార్పులతో ఈజీగా బరువు తగ్గొచ్చని నమ్మకంగా చెబుతోంది. తాను ఎనిమిది కేజీల బరువుని ఎనిమిది అలవాట్లతో తగ్గించానంటూ తన అనుభవాన్ని పంచుకున్నారామె. అదేంటో చూద్దామా..!.
కంటెంట్ క్రియేటర్ శివాని అగర్వాల్ తన జీవనశైలిని పూర్తిగా మార్చుకోకుండానే బరువు తగ్గేందుకు ఉపయోగపడిన ఎనిమిది అవాట్ల గురించి మాట్లాడారు. తాను కేవలం ఆహారం, వ్యాయామాల పట్ల ఉన్న దృక్పథాన్నే మార్చుకున్నట్లు వెల్లడించారు. అయితే మార్పులు చేసిన వాటిని నిలకడగా అనుసరించానని అన్నారు. మరి ఆమె వెయిట్‌లాస్ జర్నీలో ఎనిమిది కేజీల బరువుకి చెక్‌పెట్టేందుకు హెల్ప్ అయిన ఎనిమిది అలవాట్లు లేక మార్పులు ఏంటో చూద్దామా..!
జంక్ ఫుడ్‌ను పూర్తిగా మానేయవద్దు
ఏదైనా సరే పూర్తిగా మానేయొద్దని అంటోంది. నియంత్రించడం వల్ల తెలియకుండానే ఎక్కువ తినేస్తామని అన్నారు. తినాలి అనిపించినప్పుడూ జాగురకతతో హాయిగా ఆస్వాదించేదాన్ని అని అంటోంది. వాస్తవికంగా సాధ్యమయ్యే అవాట్లతోనే బరువు తగ్గడం అనేది జరగుతుందని చెబుతోంది ఈ ఇన్‌ఫ్లుయెన్సర్.
ప్రతిరోజూ వాకింగ్..
ఎల్లప్పుడూ పదివేల అడుగులు నడవాలనే ఒత్తిడి పెట్టుకోకూడదని, ప్రతి రోజు నడిచేలా చూస్తే చాలని అంటోంది. ఎందుకంటే తాను కొన్ని రోజులు తక్కువగానూ మరికొన్ని రోజులు మెరుగ్గా నడిచినట్లు వెల్లడించింది. అది క్రమంగా కొవ్వు తగ్గడానికి ఉపకరించిందని అంటోంది.
రాత్రి భోజనంలో కార్బోహైడ్రేట్లు తగ్గించడం
రాత్రిపూట అన్నం, రోటీ తీసుకోవడం తగ్గించి..గుడ్లు, పనీర్, పప్పు, చికెన్ వంటి ఆహారాల ద్వారా ప్రోటీన్ చేర్చుకున్నట్లు తెలిపింది.
నెమ్మదిగా తినడం ప్రారంభించాను
గతంలో తాను నిమిషాల్లోనే ఆహారం ముగించేసేదాన్ని అని చెప్పింది. అయితే నిధానంగా నెమ్మదిగా తినడం వల్ల కడుపు నిండిన అనుభూతిని ఆస్వాదించొచ్చని అంటోంది. ఎందుకంటే..కడుపు నిండిన సంకేతాలను మెదడుకు పంపడానికి సుమారు 20 నిమిషాలపైనే పడుతుంది.
ప్రతి భోజనానికి ముందు నీళ్ళు
ఆమె భోజనానికి ముందు ఒక గ్లాసు నీళ్ళు తాగడాన్ని అలవాటు చేసుకుంది. ఈ చిన్న మార్పు, తినే ఆహార పరిమాణాన్ని సమర్థవంతంగా నియంత్రించుకోవడానికి సహాయపడుతుందని చెబుతోంది.
ప్రతిరోజూ బరువు చూడొద్దు..
శివాని ప్రతిరోజూ బరువు చూసుకోవడం మానేసినట్లు తెలిపింది. ఎందుకంటే అది మన మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటోంది.
నిద్రవేళలను సరిచేసుకోవడం
బరువు తగ్గాలనుకునే వారికి తగిన నిద్ర అత్యంత ముఖ్యమని నొక్కి చెబుతోంది. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మన జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి ఆకలి కోరికలపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని అంటోంది
వాయిదాకు అవకాశం ఇవ్వకుండా..
అయితే తినాలనిపించిన వాటిని దూరం పెట్టేలా వాయిదా వేయకుండా..ఒకవేళ్ల స్వీట్స్, లేదా జంక్‌ఫుడ్ లాంటి అనారోగ్యకరమైన అలవాట్లపై మనసు లాగితే..అయ్యే దూరం చేసుకున్నాననే భావం మనుసులో రాకుండా..ధైర్యంగా తినేసి..ముందుకు సాగిపోవడం నేర్చుకోవడం మంచిదని చెబుతోంది. ఎందుకంటే అది బాధకరమైన వెయిట్‌లాస్ జర్నీగా మారదని అంటోంది.
ఇక్కడ శివాని చెప్పేది ఆరోగ్యకరమైన అలవాట్లనే హాయిగా తెలివిగా చేస్తే.. బరువు తగ్గడం కూడా ఒక ఎంజాయ్‌మెంట్‌గా మారుతుందని చెబుతోందామె. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి..!.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: Weight Loss Tips: జస్ట్ మూడు నెలల్లో 20 కేజీల బరువు..! ఐతే ఆహారంలో..)


