తాడేపల్లి : మహనీయురాలు మదర్ థెరీసా జయంతి సందర్భంగా ఆమెకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళి అర్పించారు. మానవత్వానికి ప్రతిరూపం మదర్ థెరిసా అని, ఆమె జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకుందామని అన్నారు. ప్రేమ, కరుణ, నిస్వార్థ సేవతో తన జీవితాన్ని పేదలు, నిరాశ్రయులు, అనాథలు, అభాగ్యుల సేవకే అంకితం చేశారని పేర్కొన్నారు. ఎంత చిన్న పని అయినా మనిషి జీవితంలో గొప్ప మార్పును తీసుకురాగలదని ఆమె జీవితం మనకు చాటి చెబుతుందన్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడమే థెరిసాకు మనం అందించే నిజమైన నివాళి అని జగన్ పేర్కొన్నారు. మదర్ థెరిసా స్ఫూర్తితో ప్రేమ, దయ, సేవాభావాన్ని మన జీవితంలో భాగం చేసుకుందామని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
On the birth anniversary of Mother Teresa, we remember her life of love, compassion, and selfless service. Her legacy reminds us that even the smallest act of kindness can make a lasting difference. Let us honour her memory by caring for those around us. pic.twitter.com/Qfqvt4fdBH
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 26, 2026


