సాక్షి, తాడేపల్లి: నేడు మిలాద్-ఉన్-నబీ. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘ప్రేమతో మనసులు గెలవాలనీ.. కరుణతో కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలనీ.. క్షమ, సహనం, సోదరభావాలతో శాంతియుత సమాజాన్ని నిర్మించాలనీ.. మహ్మద్ ప్రవక్త మానవాళికి అందించిన సందేశం సదా అనుసరణీయం. మహ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు.
ప్రేమతో మనసులు గెలవాలని.. కరుణతో కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలని.. క్షమ, సహనం, సోదరభావాలతో శాంతియుత సమాజాన్ని నిర్మించాలని మహ్మద్ ప్రవక్త మానవాళికి అందించిన సందేశం సదా అనుసరణీయం. మహ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ…
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 26, 2026


