న్యూయార్క్: ప్రముఖ ల్యాండ్‌మార్క్ ఎంపైర్ స్టేట్ భవనాన్ని ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండా అక్రమంగా ఎక్కిన కేసులో నెట్‌ఫ్లిక్స్ తారలు ఇవాన్ కుజ్నెత్సోవ్ (32), ఏంజెలీనా నికోలావ్ (33) న్యూయార్క్ నగర కోర్టులో హాజరయ్యారు. న్యూజెర్సీకి చెందిన ఈ జంటపై బర్గరీ (అనధికార ప్రవేశం/చొరబాటు), నిర్లక్ష్యంతో ప్రాణాలకు ముప్పు కలిగించడం, క్రిమినల్ మిస్‌చీఫ్ తదితర అభియోగాలను నమోదు చేశారు.
గత జూలై 1న జరిగిన ఈ ఘటనలో, న్యూయార్క్ నగరానికి దాదాపు 1,500 అడుగుల ఎత్తున నికోలావ్‌కు కుజ్నెత్సోవ్ వివాహ ప్రతిపాదన చేశారు. అనంతరం ఆమె తన నిశ్చితార్థపు ఉంగరాన్ని ప్రదర్శించారు. ఆ సమయంలో వారిద్దరూ ముసుగులు ధరించి, చేతిలో ప్లకార్డు పట్టుకుని భవనం పైభాగంలో కనిపించారని, అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఎన్వైపీడీ బాడీక్యామ్ దృశ్యాల్లో పోలీసులు భవనం పైకి వెళ్లగా, రక్షణ పట్టీలు (హార్నెస్‌లు) లేకుండా ఉన్న ఈ జంట వారికి ఎదురయ్యారు. ఈ సాహసం తర్వాత వారిని పోలీసులు అరెస్టు చేశారు.
The daredevil couple who went viral for their engagement stunt on top of the Empire State Building appeared in court on Monday.
The pair face multiple charges, including reckless endangerment, burglary and criminal mischief. pic.twitter.com/jD02e4ES5k— ABC News (@ABC) August 24, 2026
సోమవారం కోర్టు విచారణ అనంతరం బయటకు వస్తూ ఈ జంట కెమెరాల ఎదుట ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. ఈ విచారణకు రెండు రోజుల ముందు నికోలావ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. హద్దులను సవాలు చేసే వ్యక్తులే మానవాళి ప్రగతికి దోహదపడతారని తాము నమ్ముతున్నామని పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియను గౌరవిస్తామని, తమ నిర్ణయాల పర్యవసానాలను స్వీకరిస్తామని ఆమె తెలిపారు. ఈ కేసు విచారణను న్యాయస్థానం సెప్టెంబరుకు వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: షాకింగ్ రిపోర్ట్: పాముకాటు కేసుల్లో టాప్‌లో భారత్!


