breaking news
Empire State Building
-
డేరింగ్ ప్రపోజల్ చేసిన నెట్‌ఫ్లిక్స్ జంటపై క్రిమినల్ కేసులు!
న్యూయార్క్: ప్రముఖ ల్యాండ్‌మార్క్ ఎంపైర్ స్టేట్ భవనాన్ని ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండా అక్రమంగా ఎక్కిన కేసులో నెట్‌ఫ్లిక్స్ తారలు ఇవాన్ కుజ్నెత్సోవ్ (32), ఏంజెలీనా నికోలావ్ (33) న్యూయార్క్ నగర కోర్టులో హాజరయ్యారు. న్యూజెర్సీకి చెందిన ఈ జంటపై బర్గరీ (అనధికార ప్రవేశం/చొరబాటు), నిర్లక్ష్యంతో ప్రాణాలకు ముప్పు కలిగించడం, క్రిమినల్ మిస్చీఫ్ తదితర అభియోగాలను నమోదు చేశారు.గత జూలై 1న జరిగిన ఈ ఘటనలో, న్యూయార్క్ నగరానికి దాదాపు 1,500 అడుగుల ఎత్తున నికోలావ్కు కుజ్నెత్సోవ్ వివాహ ప్రతిపాదన చేశారు. అనంతరం ఆమె తన నిశ్చితార్థపు ఉంగరాన్ని ప్రదర్శించారు. ఆ సమయంలో వారిద్దరూ ముసుగులు ధరించి, చేతిలో ప్లకార్డు పట్టుకుని భవనం పైభాగంలో కనిపించారని, అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఎన్‌వైపీడీ బాడీక్యామ్ దృశ్యాల్లో పోలీసులు భవనం పైకి వెళ్లగా, రక్షణ పట్టీలు (హార్నెస్‌లు) లేకుండా ఉన్న ఈ జంట వారికి ఎదురయ్యారు. ఈ సాహసం తర్వాత వారిని పోలీసులు అరెస్టు చేశారు. The daredevil couple who went viral for their engagement stunt on top of the Empire State Building appeared in court on Monday.The pair face multiple charges, including reckless endangerment, burglary and criminal mischief. pic.twitter.com/jD02e4ES5k— ABC News (@ABC) August 24, 2026సోమవారం కోర్టు విచారణ అనంతరం బయటకు వస్తూ ఈ జంట కెమెరాల ఎదుట ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. ఈ విచారణకు రెండు రోజుల ముందు నికోలావ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. హద్దులను సవాలు చేసే వ్యక్తులే మానవాళి ప్రగతికి దోహదపడతారని తాము నమ్ముతున్నామని పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియను గౌరవిస్తామని, తమ నిర్ణయాల పర్యవసానాలను స్వీకరిస్తామని ఆమె తెలిపారు. ఈ కేసు విచారణను న్యాయస్థానం సెప్టెంబరుకు వాయిదా వేసింది.ఇది కూడా చదవండి: షాకింగ్ రిపోర్ట్: పాముకాటు కేసుల్లో టాప్‌లో భారత్! -
1,450 అడుగుల ఎత్తులో ప్రపోజల్.. ఇంతలో ఊహించని ట్విస్ట్!
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అత్యంత ఎత్తైన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ (1,454 అడుగులు) పైభాగాన ఉన్న ట్రాన్స్మిషన్ టవర్‌ను ఎక్కిన ఒక జంట అక్కడ ఒక శాంతి సందేశం బ్యానర్‌ను ప్రదర్శించి సంచలనం సృష్టించింది. నలుపు రంగు దుస్తులు ధరించిన ఈ జంట టవర్ పైకి చేరి, ‘అధికారంపై ప్రేమ అజమాయిషీ చేసినప్పుడు ప్రపంచంలో శాంతి వర్ధిల్లుతుంది’ అని రాసి ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించింది.ఈ సాహసం తర్వాత వారు టవర్ కింద ఉన్న ఒక ప్లాట్‌ఫారమ్‌కు చేరుకున్నాక, సదరు వ్యక్తి ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చుని తనతో ఉన్న మహిళకు పెళ్లి ప్రతిపాదన చేశాడు. దానిని ఆమె అంగీకరిస్తూ తన ముఖానికి ఉన్న ముసుగును తొలగించి, అతడిని ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకుంది. ఈ దృశ్యాలను చూసిన అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. WATCH: Masked individuals climb Empire State Building and unfurl banner reading ‘When the power of love beats the love of power the world knows peace’ pic.twitter.com/rLohX2VeOE— Rapid Report (@RapidReport2025) July 1, 2026సమాచారం అందుకున్న న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ హెలికాప్టర్ వెంటనే రంగంలోకి దిగింది. మధ్యాహ్నం 12:35 గంటల సమయంలో ఆ జంట కిందకు దిగుతుండగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను న్యూజెర్సీకి చెందిన ఇవాన్ కుజ్నెత్సోవ్ (32), ఏంజెలీనా నికోలావ్ (33)గా గుర్తించారు. వీరు గతంలో కూడా ఇలాంటి సాహసాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన కారణంగా భవనంలో ఉన్న సందర్శకులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ప్రతినిధి తెలిపారు.ఇది కూడా చదవండి: ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడి.. ‘కీవ్’ అతలాకుతలం -
భారీ సౌధంపై పిడుగు పడితే..
-
భారీ సౌధంపై పిడుగు పడితే..
మన్‌హట్టన్‌లోని 102 అంతస్తుల భారీ సౌధం ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై తాజాగా ఓ పిడుగు విరుచుకుపడింది. నడి వేసవి నడిరాత్రిలో తుఫాన్ చుట్టుముట్టిన సమయంలో సంభవించిన ఈ ఆకాశ అద్భుతాన్ని ఓ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై పిడుగులు పడటం సాధారణ విషయమే. పిడుగులు పడినా తట్టుకొని ఉండేలా ఈ భవనానికి ఏర్పాట్లు చేశారు. తాజాగా కూడా రాత్రిసమయంలో ఓ పిడుగు భారీ మెరుపుతో భవనాన్ని ఢీకొంది. దీనిని ఫొటోగ్రాఫర్ హెన్రిక్ మోల్ట్కే తన కెమెరాతో పర్ఫెక్ట్గా క్లిక్ మనిపించారు. అంతేకాకుండా దీనిని వీడియో కూడా తీశారు. ఈ ఫొటో, వీడియోను యూట్యూబ్, ట్విట్టర్లో అప్లోడ్ చేశారు. ఇవి వెంటనే వైరల్‌గా మారిపోయింది. -
డాక్యుమెంటరీ కొత్త హంగులు


