breaking news
Agriculture
-
బ్యాంక్ ఉద్యోగం వదిలేసి మైక్రోగ్రీన్స్ వ్యాపారం..! నెలకు రూ. 5 లక్షలు పైనే..
వ్యాపారం చేయాలనే ఆలోచన ఒక్కొక్కరికి ఒక్కోలా తడుతుంది. అవసరం వ్యాపారంలోకి దింపితే..అనుకోకుండా వెళ్లిన ప్రదేశం లేదా రుచి చూసిన ఆహార పదార్థాల వల్లో వస్తుంది. ఇతడి రెస్టారెంట్లో అందించిన భోజనం ద్వారా అట్రి బిజినెస్ చేయాలనుకున్నాడు. అలా అని అమాంతం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడలేదు. చిన్నగా ప్రయోగాలు చేస్తూ..సంస్థగా మార్చి ఏకంగా లక్షలు ఆర్జించే రేంజ్‌కు చేరుకుని ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలిచాడు. అతడే కొచ్చికి చెందిన అజయ గోపినాథ్. బెంగళూరులోని ఒక రెస్టారెంట్‌కి వెళ్లిన మైక్రోగ్రీన్స్ గురించి తెలుసుకున్నాడు. మైక్రోగ్రీన్స్ అంటే మొక్క తోటకూర లాంటి ఆకుకూరలు. వీటిని వంటకాలను అలంకరించడానికి, రుచి, పోషకాల కోసం విరివిగా ఉపయోగిస్తుంటారు. ఆ చిన్న ఆకుకూరల్లో ఉండే పోషక విలువల మీద ఆసక్తితో ఒకపక్క బ్యాంకు ఉద్యోగం చేస్తూనే చిన్న చిన్న ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందే ఇంటి వద్ద వాటిని పెంచుతూ..వాటి గురించి మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అలా రెండేళ్లు సాగు, పరిశోధనలతో గడిపేశాడు. అయితే తొలి ప్రయత్నంలో పెసలు పండించడానికి టిష్యూలు ఉపయోగిస్తే ఫలితం అంత బాగా రాలేదు. ఆన్లైన్లో తెలుసుకుందామాన్న..అది కూడా అంతగా ప్రయోజనం కనబడలేదు. దాంతో యూకేలోని ఒక మైక్రో నిపుణిడి సలహా తీసుకున్నాడు. సరైన విత్తనాలు ఎంచుకోవడం ఎలాగో తెలసుకున్నాడు. ముఖ్యంగా జన్యుపరంగా మార్పుచేయని హైబ్రిడ్ కాని రసాయనాలతో శుద్ధి చేయని, సహజ పరాగసంపర్కం చెందనివి ఎంచుకోవాలని అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత బెంగళూరు, పూణే, ఛత్తీస్‌గఢ్ వంటి ప్రదేశాల నుంచి విత్తనాలను సేకరించి, క్రమంగా తన సాగు ప్రక్రియను మెరుగుపరుచుకున్నాడు. సరైన పరిస్థితులను కల్పించడం, స్థిరమైన రుచి, నాణ్యతతో ఆకుకూరలను ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్టాడు. అందుకోసం తన ఇంట్లోనే జస్ట్ 80 చదరపు అడుగుల గదినే వ్యవసాయ క్షేత్రంగా మార్చాడు. ఈ ఏర్పాటు కేవలం రెండు ర్యాక్‌లు, కొన్ని ట్రేలతో ప్రారంభమైంది. మైక్రోగ్రీన్లను సాపేక్షంగా చిన్న స్థలంలో పెంచవచ్చు, కానీ విజయవంతమైన సాగుకు పెరిగే పరిస్థితులు, ఉష్ణోగ్రత, విత్తనాల నాణ్యతపై శ్రద్ధ అవసరం. అజయ్ కొన్ని రకాలతో ప్రారంభించి, క్రమంగా వాటి పరిధిని విస్తరించేందుకు బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆ తర్వాత గ్రో గ్రీన్స్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. దాంట్లో ఇప్పుడు ముల్లంగి, ఆవాలు, పొద్దుతిరుగుడు పువ్వు, బీట్రూట్ వంటి మైక్రోగ్రీన్లను సాగు చేస్తోంది. ఈ వ్యవసాయ క్షేత్రం ప్రతిరోజూ సుమారు 5 కిలోల తాజా మైక్రోగ్రీన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆకుకూరలను పురుగుమందులు లేదా ఎరువులు లేకుండా పండిస్తుండటం విశేషం. ఈ సంస్థలో సుమారు 35కి పైగా వివిధ రకాల మైక్రోగ్రీన్లను పండిస్తోంది. దీంతో అతడు నెలకు రూ. 5 లక్షలు పైనే ఆర్జిస్తుండటం విశేషం.ఇదీ చదవండి: ఒక్క రోజులో 450 కప్పులు అమ్మి..రూ. ఏకంగా 18 వేలు ఆదాయం..! -
రైతులకు కేంద్రం చేయూత
సాక్షి, మదనపల్లె: రైతాంగానికి కేంద్రప్రభుత్వం వివిధ పథకాల ద్వారా చేయూత ఇస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. స్వదేశీ–స్వరాజ్యం అన్న గాందీజీ, జై జవాన్– జైకిసాన్ అని పిలుపునిచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా రాయలసీమలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె బీకేపల్లి గ్రామంలో నిర్వహించిన సభలో రాయలసీమ హార్టికల్చర్ హబ్, రిలయన్స్ సంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శిలా ఫలకాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ బటన్ నొక్కి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌ను ఏర్పాటు చేస్తున్న రిలయన్స్ సంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మాదిరిగా దేశానికి ఉపయోగపడేలా రైతులకు సహకారం అందిస్తోందని తెలిపారు. ప్రధాని మోదీ రైతాంగానికి ఎరువుల కొరత లేకుండా చూస్తున్నారని తెలిపారు. యూరియా బస్తా ధర అంతర్జాతీయంగా రూ.3వేలు ఉంటే రైతులపై భారం పడకుండా రూ.300కే అందిస్తున్నామని, బస్తాకు కేంద్రం రూ.2,700 సబ్సిడీని భరిస్తోందన్నారు. వాతావరణాన్ని తట్టుకునేలా కొత్త వంగడాలు తెచ్చామన్నారు. మదనపల్లె పర్యటనలో మొక్కలు నాటి నీరుపోస్తున్న నిర్మలా సీతారామన్, చంద్రబాబు, అనంత్ అంబానీ, పవన్ కళ్యాణ్ గోబర్ధన్ విధానం ద్వారా బయోగ్యాస్, పీఎం కుసుమ్ యోజన ద్వారా సోలార్ పంపుసెట్లు ఇస్తున్నామన్నారు. రైతులకు పంట నష్టం రాకుండా కిసాన్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఆక్వా రైతులకు, పశువుల పెంపకానికి సంయుక్తంగా పథకాలు అందిస్తున్న ట్టు తెలిపారు. కాగా నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తుండగా టీడీపీ కూటమి శ్రేణులు తీవ్ర గందరగోళం సృష్టించారు. ‘ఒక్క నిమిషం నా మాట వినండి’ అంటూ ఆమె పదే పదే వేడుకొన్నా కూటమి శ్రేణులు అల్లరి మానకపోవడంతో ఆమె తీవ్ర అసహనానికి గురై రెండు చేతులూ జోడించారు. వాటర్‌మేన్ అంటుంటే ఆనందంగా ఉంది: సీఎం రాష్ట్రంలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను రానున్న మూడేళ్లలో పూర్తి చేయడంతోపాటు పోలవరం పూర్తి చేసి ప్రధాని ద్వారా జాతికి అంకితమిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. మదనపల్లెలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్ఏ) ఉద్యాన రంగానికి కీలకం అవుతుందన్నారు. గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌తో మరో రూ.లక్ష కోట్ల జీడీపీ పెరిగే అవకాశం ఉందన్నారు. వాటర్ మాన్ అంటుంటే తన మనసుకు ఎంతో ఆనందాన్నిస్తోందన్నారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రాయలసీమలో గత రెండేళ్లలో రూ.8 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టినట్టు ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ అన్నారు. సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రులు నారా లోకేశ్, కింజరాపు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో నూతన మార్పులకు వేదిక...అనంత్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నదాతల ఆదాయాన్ని పెంచుతూ, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో మదనపల్లెలో ఏర్పాటు కానున్న ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ (ఐఎస్ఏ) భారత వ్యవసాయ రంగంలో కీలక మైలురాయిగా నిలవనుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ పేర్కొన్నారు. మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (రిలయన్స్ భాగస్వామ్యంతో) శంకుస్థాపన కార్యక్రమం అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల సంప్రదాయ అనుభవంతో అనుసంధానించి, వ్యవసాయ రంగంలో నూతన మార్పులకు ఈ విద్యాసంస్థ వేదిక కానుందని తెలిపారు. మదనపల్లెలో అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ఈ విద్యాసంస్థను ఏర్పాటు చేయడం చారిత్రాత్మక పరిణామమని అభివర్ణించారు. సుమారు పాతికేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ఏర్పాటును ప్రస్తావిస్తూ ఇప్పుడు భారతీయ రైతులకు కూడా అదే తరహాలో ప్రత్యేక విద్యాసంస్థ అందుబాటులోకి రావడం విశేషమన్నారు. ప్రపంచానికి భారత్ అనేకమంది ప్రతిభావంతులైన సీఈఓలను అందించిందని, అదే స్ఫూర్తితో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ రైతులను తమ సొంత పొలాలకు సీఈఓలుగా తీర్చిదిద్దే దిశగా పనిచేస్తుందని అన్నారు. వ్యవసాయాన్ని కేవలం సంప్రదాయ వృత్తిగా కాకుండా, ఆధునిక సాంకేతికత, సమర్థవంతమైన నిర్వహణ, మార్కెట్ అవగాహనతో కూడిన లాభదాయక రంగంగా అభివృద్ధి చేయడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశమని వివరించారు.జై జవాన్.. జై కిసాన్.. జై విజ్ఞాన్.. జై అనుసంధాన్లాల్ బహదూర్ శాస్త్రి పిలుపు ఇచ్చిన జై జవాన్.. జై కిసాన్ నినాదానికి, అటల్ బిహారీ వాజ్‌పేయి జై విజ్ఞాన్‌ను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జై అనుసంధాన్‌ను జోడించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ నాలుగు నినాదాల స్ఫూర్తిని ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ పనిచేయనుందని పేర్కొన్నారు.వ్యవసాయాన్ని గర్వంగా ఎంచుకునే వృత్తిగా మారుద్దాం.. తాను ఒక పశు సేవకుడిని అనంత్ అంబానీ తెలిపారు. మన రైతులు పశుసంపద విలువను అర్థం చేసుకుంటారన్నారు. జామ్‌నగర్‌లోని తమ ’వంతార’ కేంద్రం హై–టెక్ పశుసంవర్ధక, వన్యప్రాణి సంరక్షణ సాంకేతికతను ఇక్కడ కూడా అమలు చేస్తామని చెప్పారు. వ్యవసాయాన్ని యువత గర్వంగా ఎంచుకునే వృత్తిగా మారుద్దాం.. వారికి నైపుణ్యాలు, సాంకేతికత కల్పిస్తే, వారు తమ గ్రామాల్లోనే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకుంటారని అన్నారు.వ్యవసాయంలో ఏఐ,డ్రోన్లు, రోబోటిక్స్ ఈ విద్యాసంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డ్రోన్లు, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అనంత్ అంబానీ వెల్లడించారు. పంటలకు చీడపీడలు సోకే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి రైతులను అప్రమత్తం చేసే పరికరాలు, పంట ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ నీరు, పోషకాలను సమర్థంగా వినియోగించుకునేలా సూచించే డ్రోన్లు అభివృద్ధి చేసే దిశగా యువ ప్రతిభావంతులు పనిచేయనున్నారని తెలిపారు. కష్టతరమైన వ్యవసాయ పనులను సులభతరం చేసి, పంట నష్టాలను తగ్గించేందుకు రోబోటిక్స్ సాంకేతికత ఉపయోగపడుతుందన్నారు. ఈ పాఠశాల శిక్షణ మాడ్యూళ్లను గ్రామీణ ప్రాంతాల్లోని లక్షల మంది రైతులకు వర్చువల్ క్లాస్‌రూమ్‌ల ద్వారా, వారి స్వంత భాషల్లో అందిస్తామన్నారు. జియో అభివృద్ధి చేసిన జియో కృషి ప్లాట్‌ఫారమ్ ద్వారా రైతులకు ప్రయోజనకరమైన ఉత్పత్తులను, జామ్‌నగర్‌లోని ఆధునిక బయో–ఎనర్జీ ఆర్అండ్డీ కేంద్రం జ్ఞానాన్ని పంచుకుంటామన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారి, ప్రతి రైతుకు సమాజంలో గౌరవం, ఆర్థిక ప్రయోజనం లభించినప్పుడే మహాత్మా గాంధీ ఆశయాలైన సర్వోదయ, అంత్యోదయలకు నిజమైన సార్థకత చేకూరుతుందన్నారు. భారతదేశం గ్రామాల్లోనే జీవిస్తుందన్న గాంధీజీ సందేశాన్ని గుర్తుచేస్తూ.. గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం దేశ ప్రగతికి పునాదులని స్పష్టం చేశారు. -
రైతులకు మరో ముప్పు.. ‘క్లైమేట్ఫ్లేషన్’ అంటే ఇదే!
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఒకప్పుడు రుతువుల ప్రకారం పడే వర్షాలు ఇప్పుడు ఆకస్మిక వరదలుగా, తీవ్రమైన ఎండలుగా మారి పంట చేలను నిలువునా దహించివేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పంట దిగుబడులు భారీగా పడిపోవడంతో ఆహార చిల్లర ధరలు ఆకాశాన్నంటుతున్నాయని తాజా పరిశోధన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్థిక నిపుణులు ఈ పరిస్థితిని ‘క్లైమేట్ఫ్లేషన్‘ (వాతావరణం కారణంగా ధరల పెరుగుదల) అని పిలుస్తున్నారు.జీరో కార్బన్ అనలిటిక్స్ అధ్యయనం ప్రకారం.. 2022 నుంచి 2026 మధ్య కాలంలో ఆహార ధరలు పెరగడానికి ప్రధాన కారణం తీవ్రమైన వాతావరణ మార్పులే. గోధుమ, మొక్కజొన్న, కొకో, చక్కెర వంటి ప్రధాన పంటల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. దీనితో ఐక్యరాజ్యసమితి ఆహార ధరల సూచిక నాలుగేళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. స్వయం సమృద్ధి సాధించిన దేశాల్లో కూడా దిగుబడులు పడిపోయి, ఎల్‌నినో ప్రభావంతో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా పంటలకు నష్టంఐరోపాలో అతిపెద్ద వ్యవసాయ దేశమైన ఫ్రాన్స్‌లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ దాటాయి. దీనివల్ల 1980 తర్వాత అత్యంత తక్కువ మొక్కజొన్న దిగుబడి నమోదైంది. దిగుబడి పడిపోవటంతో దాణా కొరత ఏర్పడి, పశుగ్రాసం ధరలు 16 శాతం వరకు పెరిగాయి. అమెరికాలో రికార్డు స్థాయి ఎండలు, నీటి కొరత వల్ల గత 75 ఏళ్లలోనే అత్యల్ప స్థాయికి పశువుల సంఖ్య పడిపోయింది. గడ్డి, తాగునీరు లభించక పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.స్పెయిన్ లో సాధారణం కంటే 175 శాతం అధిక వర్షపాతం నమోదై టొమాటో పంట నీట మునిగింది. మరోవైపు అమెరికాలో ఊహించని మంచు తుఫానుల వల్ల పంట దెబ్బతిని, కేవలం నాలుగు నెలల్లోనే టొమాటో ధరలు 40 శాతం ఎగబాకాయి. ఆసియా ్రపాంతంలో సముద్ర ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడంతో ఆహారంగా ఉపయోగపడే సీవీడ్ వంటి పంటల ఉత్పాదకత దెబ్బతింటోంది. పంట దిగుబడులు తగ్గుదల ధరలు పెరుగుదల తీరుమేల్కోవాల్సిన సమయంఈ వాతావరణ ముప్పు విదేశాలకే పరిమితం కాదు. మన దేశంలోనూ అకాల వర్షాలు, తీవ్ర ఎండలు తరచూ పంటలను నాశనం చేస్తున్నాయి. పంటలను కాపాడుకోవటానికి రైతులు వాతావరణ తీవ్రతను తట్టుకునేలా వ్యవసాయ పద్ధతులను మార్చుకోవాలి. తగిన విత్తనాలను ఎంచుకోవాలి. బిందు సేద్యం ద్వారా నీటిని పొదుపుగా వాడుకోవటం, పంట మార్పిడి పద్ధతులు, ప్రకృతి వ్యవసాయ విధానాలపై దృష్టి సారించటం తక్షణావసరం. ప్రభుత్వాలు కూడా రైతులకు పంట బీమా, అధునాతన వాతావరణ సూచనలను సకాలంలో అందించినప్పుడే ఆహార భద్రత నిలబడుతుంది.- నిర్వహణ: పంతంగి రాంబాబుఇదీ చదవండి: ‘‘సూర్యుడుండగానే వడియాలు ఎండేస్కో’’! -
‘బ్యాంకులు పంట రుణాలు వసూలు చేయవద్దు’
తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరవుతో అతలాకుతలమవుతున్న మహారాష్ట్రలో రైతులకు ఉపశమనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితుల దృష్ట్యా పంట రుణాల వసూళ్ల కోసం రైతుల ఇళ్లకు వెళ్లవద్దని బ్యాంకులు, పరపతి సంఘాలను రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాన్కులే సారథ్యంలోని ‘కరవు సహాయక క్యాబినెట్ సబ్‌కమిటీ’ ఆదేశించింది. రుణ వసూళ్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసేలా అధికారిక సర్క్యులర్ జారీ చేయాల్సిందిగా ఆర్బీఐని కోరేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేష్ అగర్వాల్‌ను కమిటీ ఆదేశించింది.రాష్ట్రంలోని మొత్తం 358 తాలూకాలలో 74 శాతానికి పైగా, అంటే 265 తాలూకాల్లో తీవ్ర కరవు పరిస్థితులు దాపురించాయని ప్రభుత్వం వెల్లడించింది. 2016 (2020లో సవరించిన) కరవు నిర్వహణ నియమావళిలోని ‘ట్రిగ్గర్-1’ (25 శాతం కంటే ఎక్కువ వర్షపాత లోటు, వరుసగా 21 రోజుల పొడి వాతావరణం) ఆధారంగా ఈ తాలూకాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించారు. మరో 43 తాలూకాలు ‘ట్రిగ్గర్-2’ (పంటల విస్తీర్ణం-నష్టం, భూగర్భ జలాలు, జలాశయాల నీటిమట్టం ఆధారంగా) పరిధిలోకి వస్తున్నాయని, వీటికి జాప్యం లేకుండా వెంటనే జీవో జారీ చేయాలని ఐఏఎస్ అధికారిణి వినీతా వేద్ సింఘాల్ పేర్కొన్నారు.తీవ్ర నీటి ఎద్దడి.. భవిష్యత్తు కార్యాచరణపట్టణ ప్రాంతాల్లో 10% నీటి సరఫరా కోత విధించాలని, ప్రస్తుతం సేకరించిన నీటిని వచ్చే ఏడాది జూన్ వరకు లభ్యమయ్యేలా బఫర్ స్టాక్‌గా నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 560 ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తుండగా రాబోయే 10 నెలల పాటు మంచినీరు, పశువుల మేత కొరత రాకుండా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తీవ్ర నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో గృహ, వాణిజ్య నిర్మాణ అనుమతులను తాత్కాలికంగా నిలిపివేయాలని పర్యావరణ మంత్రి పంకజా ముండే సూచించారు. సరస్సుల చుట్టూ జరిగే నీటి దొంగతనాలను అరికట్టేందుకు విద్యుత్తు కనెక్షన్లు తొలగించాలని మంత్రి గిరీష్ మహాజన్ ఆదేశించారు.ఇదీ చదవండి: ఈరోజు పెరిగినా రూ.లక్షన్నర కిందే బంగారం! -
రైస్ మిల్లుల్లో సంక్షోభం ఎందుకు?
తెలంగాణ అనగానే గోదావరి, కృష్ణా నదీ జలాలు, విశాలమైన వరి పొలాలు, అన్నదాతల శ్రమ గుర్తుకు వస్తాయి. 1980ల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశానికి అవసరమైన బియ్యాన్ని సమృద్ధిగా అందించి ‘అన్నపూర్ణ’గా ఖ్యాతి గడించింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా వరి ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చింది. ఇదే సమయంలో వేలాది రైస్ మిల్లులు రైతుల పంటకు సులభమైన మార్కెట్ కల్పిస్తూ వచ్చాయి.స్థానికులకు, బిహార్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాయి. ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించడంలోనూ కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 3,172 రైస్‌మిల్లులు ఉన్నాయి. వీటిలో బాయిల్డ్ రైస్ మిల్లులు 1,120, రా రైస్ మిల్లులు 2,052. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాల కోసం మిల్ లెవీ పద్ధతిలో మిల్లర్ల నుంచి బియ్యాన్ని నిర్బంధంగా సేకరించేది. ఇది తెలంగాణ బియ్యానికి ఉన్న బలమైన డిమాండ్‌ను సూచించేది.కాలక్రమేణా దేశవ్యాప్తంగా సాగునీటి సౌకర్యాలు విస్తరించడంతో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గతంలో బియ్యం కొరత ఉన్న అనేక రాష్ట్రాలు నేడు స్వయం సమృద్ధి సాధించి ఎగుమతులు కూడా చేస్తున్నాయి. తెలంగాణలో కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ వంటి భారీ ప్రాజెక్టుల వల్ల సాగునీటి లభ్యత పెరిగి వరి విస్తీర్ణం భారీగా పెరిగింది.ఇదే సమయంలో 2015–16 ఖరీఫ్ సీజన్ నుంచి కేంద్రం మిల్ లెవీ విధానాన్ని నిలిపివేసింది. రాష్ట్రాలు రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసి, కస్టమ్ మిల్లింగ్ ద్వారా బియ్యంగా మార్చి కేంద్రానికి సరఫరా చేసే విధానం అమల్లోకి వచ్చింది.టెండర్లు, దర్యాప్తులు, వివాదాలురాష్ట్ర అవసరాలకు మించిన ధాన్యాన్ని కూడా రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చింది. రాజకీయ, సామాజిక కారణాల వల్ల పంటను కొనకుండా వదిలేయడం సాధ్యం కాలేదు. అయితే అదనపు ధాన్యాన్ని విక్రయించే సమర్థవంతమైన వ్యవస్థ లేక పోవడంతో ప్రజా పంపిణీకి అవసరమైన పరిమాణం మినహా మిగిలిన ధాన్యం మిల్లుల వద్దే నిల్వలుగా పేరుకుపోయింది. సంవ త్సరాల తరబడి నిల్వలు పేరుకుపోవడం, నిర్వహణ ఖర్చులు పెరగడం, మార్కెట్ పరిస్థితులు మారడం వల్ల కొందరు మిల్లర్లు ప్రభుత్వ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించారు.పెరుగుతున్న కొనుగోలు వ్యయం, నిల్వల భారం కారణంగా ప్రభుత్వం 2022–23 నుంచి కస్టమ్ మిల్లింగ్ కింద ఉన్న ధాన్యాన్ని టెండర్ల ద్వారా విక్రయించడం ప్రారంభించింది. టెండర్ విజేతలు మిల్లులకు వెళ్లినప్పుడు రికార్డుల్లో ఉన్నంత ధాన్యం భౌతికంగా లేకపోవడం వెలుగులోకి వచ్చింది. దీంతో విజిలెన్ ్స దర్యాప్తులు, తనిఖీలు, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. బ్యాంకులు రుణ వసూళ్లకు ఒత్తిడి పెంచడంతో కొన్ని మిల్లులు మూతపడ్డాయి. కొందరు కోర్టులను ఆశ్రయించగా, మరికొందరు టెండర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం చేశారు. ప్రభుత్వం– మిల్లర్ల మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి.ఈ సంక్షోభానికి ఒక్క కారణాన్ని మాత్రమే ఆపాదించడం సరికాదు. కేంద్ర విధాన మార్పులు, రాష్ట్ర కొనుగోలు విధానం, దేశవ్యాప్తంగా వరి ఉత్పత్తి పెరుగుదల, బియ్యం మార్కెట్ డిమాండ్ తగ్గడం, నిల్వల నిర్వహణలో లోపాలు, కొందరు మిల్లర్ల వ్యాపార నిర్ణయాలు... ఇవన్నీ కలిసి పరిశ్రమను క్లిష్ట పరిస్థితిలోకి నెట్టాయి. ఒకప్పుడు రైతుకు భరోసా, వేలాది కుటుంబాలకు ఉపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చిన ఈ పరిశ్రమ నేడు మనుగడ కోసం పోరాడుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులు, కార్మికులు, బ్యాంకులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తంపై ప్రభావం పడుతుంది.– వెంగల్ దాస్ శ్రీధర్, టాక్స్ కన్సల్టెంట్ఇదీ చదవండి: రాహుల్ హెచ్చరించినట్లే ఓట్ల చోరీ నిజమైంది! -
జంతువుల పెంటతో నేలకు కొత్త జీవం.. పెరూలో శాస్త్రవేత్తలకు షాక్!
పెరూ ఆండీస్ పర్వతాల్లోని ‘వికూనా’ (ఒంటె జాతి జంతువు) మలం బంజరు నేలలను సారవంతంగా మారుస్తోందని తాజా పరిశోధన తెలిపింది. ఈ వ్యర్థాల వల్ల నేలలో సేంద్రియ కర్బనం 62 శాతానికి పెరిగి, తేమ నిలిచి కొత్త మొక్కలు మొలుస్తున్నాయి. రసాయనిక ఎరువులకు బదులు పశువుల పెంట, సహజ ఎరువులతో నేల సారాన్ని, జీవాన్ని ఎలా పునరుద్ధరించవచ్చో దక్షిణ అమెరికాలోని పెరూ ఆండీస్ పర్వతాల్లో జరిగిన తాజా శాస్త్రీయ అధ్యయనం నిరూపిస్తోంది.వాతావరణ మార్పుల తీవ్రతతో పాటు ఎల్‌నినో ప్రభావం వ్యవసాయ రంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగటం, వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటిపోవటం వంటి కారణాలతో నేలల్లోని తేమ క్షణాల్లో ఆవిరైపోతోంది. దశాబ్దాలుగా విచక్షణారహితంగా వాడుతున్న రసాయనిక ఎరువులు నేలను మరింత నిస్సారంగా, గట్టి రాతిలా మారుస్తున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో భూమిని ఎలా కాపాడుకోవాలనే ప్రశ్నకు దక్షిణ అమెరికాలోని పెరూ ఆండీస్ పర్వతాల్లో జరిగిన తాజా శాస్త్రీయ అధ్యయనం ఆచరణాత్మక పరిష్కారాన్ని చూపింది.పర్వత ప్రాంతాలలో హిమానీనదాలు కరిగిపోయిన తర్వాత మిగిలిన బంజరు నేలల్లో కనీసం గడ్డి మొలవడానికి కూడా సాధారణంగా శతాబ్దం పైగా పడుతుంది. అయితే అక్కడ సంచరించే ‘వికూనా’ (ఒంటె జాతికి చెందిన వన్యప్రాణి) అనే జంతువుల విసర్జితాల ద్వారా ఈ బంజరు భూములు కొద్ది కాలంలోనే పచ్చటి ఒయాసిస్లుగా మారుతున్నట్లు జేమ్స్ మాడిసన్, కొలరాడో విశ్వవిద్యాలయాల పరిశోధకులు గుర్తించారు. ఈ వివరాలు ప్రతిష్టాత్మక ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.ఎల్‌నినో సమయంలో తీవ్ర వర్షాభావం, అధిక ఎండల వల్ల పంటలు నిలబడాలంటే నేలలో సేంద్రియ కర్బనం (ఆర్గానిక్ కార్బన్) తప్పనిసరి. పెరూ పరిశోధన ప్రకారం, సహజ జంతు వ్యర్థాలు నేలలోని ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులను అరికట్టి తేమను ఎక్కువ కాలం నిలిపి వుంచాయి. రసాయనిక ఎరువుల కంటే పశువుల పెంట వంటి సహజ ఎరువులే నేలకు బలమైన రక్షణ కవచాలుగా నిలుస్తాయని ఇది స్పష్టం చేస్తోంది. మన రైతులు సంప్రదాయ ఎరువులను వాడటం ద్వారా కరవు పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవచ్చు.సాధారణ నేల వర్సెస్ జంతు వ్యర్థాల నేల!పరిశోధకులు సముద్ర మట్టానికి దాదాపు 18,000 అడుగుల ఎత్తులో మట్టి నమూనాలను పరీక్షించి అందించిన శాస్త్రీయ అధ్యయన వివరాలు ఈ పట్టికలో పొందుపరిచాం.రోజూ అక్కడే సామూహిక మల విసర్జన! ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన ముఖ్యమైన అంశం వికూనాల ప్రవర్తన. ఇవి మేత కోసం ఎక్కడ తిరిగినా, మలవిసర్జన చేయడానికి మాత్రం గుంపులుగా ఒకే నిర్దిష్ట ప్రదేశానికి వస్తాయి. శాస్త్రవేత్తలు వీటిని ‘కమ్యూనిటీ లెట్రిన్స్’ (సామూహిక మలమూత్ర విసర్జన కేంద్రాలు) అని పిలుస్తున్నారు.సహజ విత్తన భాండాగారం: అవి తిన్న గడ్డిలోని విత్తనాలు వాటి విసర్జితాల ద్వారా అక్కడే పడి, పేడలోని పోషకాల సాయంతో వేగంగా మొలకెత్తుతున్నాయి.తిరిగి అదే మేత: తాము వేసిన పెంట కుప్పలపై ఏపుగా పెరిగిన పచ్చికను మేయటానికి వికూనాలు క్రమం తప్పకుండా మళ్లీ అక్కడికే వస్తుండటం విశేషం.వన్యప్రాణుల రాక: అక్కడ వికసించిన పచ్చదనం, సూక్ష్మ జీవులను చూసి ఎత్తయిన కొండలపై ఎన్నడూ కనిపించని అరుదైన పక్షులు, చివరకు ప్యూమా వంటి పెద్ద మాంసాహార మృగాలు కూడా అక్కడ సంచరించటం కెమెరాల్లో నమోదైంది.మన పూర్వీకులు పొలాల్లో గొర్రెల, పశువుల మందలు కట్టించటం, పెంట కుప్పలను పొలమంతా వెదజల్లటం వెనుక ఉన్న శాస్త్రీయ అంతరార్థం ఇదే. ఎల్‌నినోను తట్టుకోవాలంటే నేలకు జీవం పోసే సహజ పద్ధతులను పునరుద్ధరించుకోవటమే ఏకైక మార్గం.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ఇదీ చదవండి: పుల్ల మజ్జిగతో మొక్కలకు భలే లాభాలు.. కానీ ఈ తప్పు చేయొద్దు! -
కార్పొరేట్ ఉద్యోగాన్ని కాదని క్యాప్సికమ్ సాగు..! ఇవాళ ఏకంగా..
క్యాప్సికమ్ ఎంత టేస్టీగా ఉంటుందో తెలిసిందే. కడాయి పనీర్ నుంచి ఫ్రైడ్ రైస్ వరకు విభిన్న వంటకాల్లో దీని డిమాండ్ వేరేలెవెల్. అలాంటి క్యాప్సికమ్‌ని ఎలా సాగు చేస్తారో తెలుసా..మాములు కూరగాయలు పండించినట్లుగా మాత్రం కాదు. దీని గురించి పూర్తిగా తెలుసకునే ఈ సాగుకి దిగాలి. కానీ ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్ ఆ సాహసం చేసి కోట్లు లబ్ధి పొందుతోంది. మరి ఆమె ఎలా ఈ వ్యసాయం రంగాన్ని ఎంచుకుని లాభాలు గడిస్తుందో చూద్దామా..!.ఆ యువతే మహారాష్ట్రలోని జున్నార్‌లో ఒక వ్యవసాయ కుటుంబానికి చెందింది ప్రణితి వామన్. ఎంబిఏ గ్రాడ్యుయేట్ అయిన ప్రణిత కార్పొరేట్ ఉద్యోగాల వైపుకి మళ్లకుండా..నేల తల్లి వైపే అడుగులు వేసింది. అంతేగాదు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి ఎంబీఏ చేసిన వెంటనే ఫుడ్‌ప్రాసెసింగ్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేసింది. అయినా కూడా కార్పొరేట్ ఉద్యోగం వద్దనుకుని వ్యవసాయం రంగంలోకి వెళ్లేందుకే మొగ్గు చూపింది. తన ఇంటర్న్‌షిప్ సమయంలోనే వ్యవసాయ-పారిశ్రామికవేత్తగా మారాని భావించిందట. అదే తన లక్ష్యంగా ఏర్పరుచుకుని మరి ఈ ఫీల్డ్‌లోని వచ్చింది ప్రణిత. ఆమె హై-టెక్ వ్యవసాయంలోని సామర్థ్యాన్ని గుర్తించి..2020లో కేవలం ఒక ఎకరం భూమిలో పాలీహౌస్లో క్యాప్సికమ్ సాగుని ప్రారంభించింది. ఫాలీహౌస్ సాగులో ఉష్ణోగ్రత, తేమ, ఇతర అంశాలను నియంత్రించడం ద్వారా పంటలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తారు. ఈ పద్ధతి కొన్ని పంటలను ఏడాది పొడవున పండించేందుకు వీలు కల్పిస్తుందట. అలా ఆమె బ్రోకలీ, లెట్యూస్ వంటి కూరగాయలను పరిశీలించి ఆ తర్వాతే క్యాప్సికమ్ పండించాలని నిర్ణయించుకుందట. రెస్టారెంట్, హోటళ్లలో దీని డిమాండ్ చూసి ప్రణితి ఈ కూరగాయను సాగు చేయాలని నిర్ణయించుకుందామె. లాక్‌డౌన్‌కి కొద్ది రోజుల ముందు నుంచి మార్చి 2020లో క్యాప్సికమ్ సాగుని ప్రారంభించింది. నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి విత్తనాలు కొనడానికి ఇతర అవసరాల కోసం సుమారు రూ. 20 లక్షలు పెట్టుబడి పెట్టింది. తన వ్యాపార ఆలోచనను ప్రారంభించేందుకు అవసరమైన మిగిలిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో పొందింది ప్రణిత. ఇంత కష్టపడితే..సరిగ్గా పంట కోత సమయానికి లాక్డౌన్ రావడంతో హోల్‌సేల్ కూరగాయల వ్యాపారుల గురించి తెలుసుకోవడం కష్టమైపోయింది. ఆ సమయంలో రైతులంతా సాగుని నిలిపేయడంతో కూరగాయలను కొనుగోలు చేసే వ్యాపారిని గుర్తించడానికి ఎన్నో పాట్లు పడింది. చివరికి ఎంతో శ్రమించి ఒక వ్యాపారిని గుర్తించి తన పంటను అమ్మే ప్రయత్నాలు చేసింది. అలా ఆమెకు మొదటి పంటలో 40 టన్నుల క్యాప్సికమ్ దిగుబడి రాగా, రూ. 32 లక్షల టర్నోవర్ ఆర్జించింది. ప్రస్తుతం ఆమె ఈ పంటతో ఏడాదికి రూ. 4 కోట్లు టర్నోవర్ ఆర్జిస్తోంది. దానిలో రూ. 2.25 కోట్లకు పైగా లాభాలను అందుకోవడం విశేషం. ఇక ప్రణిత తన ఉత్పత్తులను నాసిక్, దాదర్, జైపూర్ తదితర ఇతర ప్రాంతాల్లోని టోకు వ్యాపారులకు నేరుగా విక్రయిస్తోంది.ఇదీ చదవండి: ఆ రెస్టారెంట్లో మెనూనే ఉండదట..! ఫుడ్ ఎలా ఆర్డర్ చేస్తారంటే..) -
గేదెలతో ప్రకృతి వ్యవసాయం
పశువు లేనిదే వ్యవసాయం లేదని మన దేశంలో ముందు తరం రైతులు ఆచరించి చెప్పిన మాట. ఇదే సంప్రదాయ సేద్య పద్ధతిని తాతల నాటి నుంచి వందేళ్లకు పైగా ఆచరిస్తున్న విలక్షణమైన క్షేత్రం ఒకటుంది. అనేక కోణాల్లో ఈ క్షేత్రం రైతులకు చక్కని పాఠాలు చెబుతోంది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సింగరాజుపాలెం గ్రామానికి చెందిన ప్రగతిశీల రైతు గద్దె సతీష్ బాబు వినూత్న సంప్రదాయ సేంద్రియ సేద్యంతో ఆదర్శంగా నిలిచారు. తమ అనువంశిక 25 ఎకరాల భూమిలో ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా, కేవలం గేదెల ఆధారిత సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తూ ఆశ్చర్యకరమైన, ఆదర్శవంతమైన ఫలితాలను సాధిస్తున్నారు. ఈ విలక్షణ క్షేత్రాన్ని మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సహదేవరెడ్డితో పాటు పలువురు శాస్త్రవేత్తల బృందం సందర్శించి ఈ విధానాన్ని ప్రశంసించటం విశేషం.25 ఎకరాలు.. 26 గేదెలు...సతీష్ బాబు తన 25 ఎకరాల ఫారమ్‌లో 16 ఎకరాల్లో కొబ్బరి తోటను, మిగతా 9 ఎకరాల్లో పశుగ్రాసం, వరి, బొబ్బర, పిల్లిపెసర తదితర పంటలను సాగు చేస్తున్నారు. ఈ క్షేత్రంలో మొత్తం 26 గేదెలు ఉన్నాయి. విశేషమేమిటంటే.. ఈ గేదెల నుంచి అసలు పాలు పిండరు. పాలన్నీ పూర్తిగా దూడలకే వదులుతారు. దీనివల్ల దూడలు ఆరోగ్యంగా పెరిగి త్వరగా ఎదుగుతాయి. ఇక ఈ పశువులను పొలంలో రోజుకో చోట క్రమపద్ధతిలో మారుస్తూ కట్టేస్తుంటారు. దీన్నే ‘మంద కట్టటం’ లేదా ‘పెన్నింగ్’ అంటారు. పశువులు రాత్రివేళ పొలంలో వేసే పేడ, మూత్రం ద్వారా పొలానికి కావాల్సిన ఎరువు అంతా సహజంగానే అందుతుంది. దీనివల్ల అదనంగా ఎలాంటి ఎరువులు వేయాల్సిన అవసరమే ఉండదు. పశువులకు పచ్చిగడ్డి కోసం బొబ్బరను కొబ్బరి తోటలో అంతరపంటగా సాగు చేస్తారు.అధిక దిగుబడులు.. అద్భుతమైన నాణ్యత...ఈ సంప్రదాయ పద్ధతిలో పండించిన పంటల ద్వారా అసాధారణమైన ఫలితాలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పొలంలో పండించిన 75 కిలోల ధాన్యం బస్తా మరపట్టిస్తే, ఏకంగా 62 కిలోల నాణ్యమైన, అసలు నూకలు లేని బియ్యం వస్తున్నాయి. సాధారణంగా ఇతరులు పండించిన అదే రకం ధాన్యం మరపట్టిస్తే 47 కిలోల బియ్యం మాత్రమే వస్తాయని, కానీ ఈ పద్ధతి వల్ల 15 కిలోల అదనంగా బియ్యం దిగుబడి వస్తుందని పరిశీలనలో తేలింది. ఈ నాణ్యమైన సేంద్రియ బియ్యాన్ని కిలో రూ. 100 చొప్పున నేరుగా వినియోగదారులకు విక్రయిస్తూ రైతు సతీష్ బాబు రెట్టింపు ఆదాయాన్ని గడిస్తున్నారు.కొబ్బరి చెట్లకు కూడా ఇదే తరహాలో పశువుల మందను కట్టేస్తుండటం వల్ల చెట్లకు కావాల్సిన సహజ పోషకాలు అందుతున్నాయి. ఫలితంగా కొబ్బరి చెట్టుకు ఏడాదికి సరాసరి 280 కాయల వరకు దిగుబడి వస్తోంది. రైతుకు చక్కటి లాభాలు చేకూరుతోంది.పశువులే పెట్టుబడి...ఈ వ్యవసాయ పద్ధతిలో పర్యావరణ ప్రయోజనాలతో పాటు అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఫారమ్‌లో ఏటా 10 నుంచి 12 గేదె దూడలు పుడతాయి. ఎదిగిన దూడల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతోనే పొలంలో పనిచేసే ముగ్గురు పాలేర్లకు సరిపడా జీతాలు చెల్లిస్తున్నామని సతీష్ బాబు తెలిపారు. అంటే, ఎలాంటి అదనపు పెట్టుబడులు, రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఖర్చులు లేకుండానే వ్యవసాయం లాభసాటిగా సాగుతోంది.‘రసాయనాల అధిక వినియోగంతో నేల తల్లిని, మానవ ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్న నేటి రోజుల్లో.. సతీష్ బాబు అనుసరిస్తున్న ఈ గేదెల ఆధారిత సంప్రదాయ ప్రకృతి వ్యవసాయం దేశంలోని ప్రతి రైతుకూ గొప్ప మార్గదర్శకంగా నిలుస్తోంది. సేంద్రియ కర్బనం 0.72%కి పెరిగింది. నేల సారాన్ని కాపాడుతూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ, పెట్టుబడి ఖర్చులను పూర్తిగా తగ్గించుకోవటానికి, మంచి ఆదాయం పొందటానికి ఈ విధానం ఒక అద్భుతమైన మార్గమ’ని డాక్టర్ సహదేవరెడ్డి వ్యాఖ్యానించారు.గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డు, ఐఏఆర్ఐ ఫెలోషిప్ అవార్డు, ఐఐఆర్ఐ అవార్డు, ఆసియన్ అగ్రిహిస్టరీ ఫౌండేషన్ అవార్డు వంటి పురస్కారాలను సతీష్ అందుకున్నారు. మా గేదెలే బంగారం వ్యవసాయానికి ఆధారం!కొబ్బరిలో ఎకరానికి 42 ఏళ్ల నాటి 40 చెట్లున్నా ఏడాదికి రూ. 2 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. బీపీటీ 5204 వరి సాగులో ఎకరానికి 22–24 బస్తాల ధాన్యం వస్తుంది. వరి ఒకటే పంట. రెండో పంటగా పిల్లిపెసర వేస్తాం. 75 కిలోల ధాన్యం బస్తాకు 62 కిలోలు నూకలేని బియ్యం దిగుబడి వస్తుంది. కిలో రూ.105 నేరుగా ప్రజలకు అమ్ముతున్నా. ఎకరానికి రూ. 90 వేల నికరాదాయం వస్తోంది. 25 ఎకరాల్లో 26 గేదెలను రోజుకో చోట మండె కట్టటం ద్వారా నేలను సారవంతం చేస్తున్నాం. ఇంకే ఎరువూ వేయట్లేదు. పేడ పురుగుల రంధ్రాల్లోంచి వర్షపు నీరు భూమిలోకి పుష్కలంగా ఇంకుతోంది. రోజుకో చోట పడుకోవటం వల్ల గేదెలకు ఏ జబ్బూ రావట్లేదు. ఏడాదికోసారి 10 గేదెలను ఒకటికి రూ. 1,40,000 చొప్పున అమ్ముతున్నా. బంగారాన్ని మించి గేదెల ధర పెరుగుతోంది. ఈ ఏడాది ధర 40% పెరిగింది. ఇంతకన్నా మంచి వ్యవసాయం మరొకటి ఉందా? ముత్తాత కాలం నుంచే మా కుటుంబం ఈ ‘సింగిల్ క్రాప్. డబుల్ ఇన్‌కం’ వ్యవసాయం చేస్తున్నాం. – గద్దె సతీష్‌బాబు (99125 11244)సీనియర్ సేంద్రియ రైతునిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఎల్‌నినోపై సమగ్ర వ్యూహం
సాక్షి, హైదరాబాద్: ఎల్ నినో వల్ల తలెత్తిన నీటి ఎద్దడిని అధిగమించడానికి తక్కువ నీటి వినియోగంతో పండే పంటల సాగును కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఇందుకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను రాష్ట్రాలకు అందుబాటులో ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. దక్షిణాదిన వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఎల్ నినో ప్రభావం ఒకటని అన్నారు. ఈ ముప్పును ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో చౌహాన్ మాట్లాడారు.ఎల్ నినో ప్రభావం దక్షిణాదిపైనే అధికం ఎల్ నినో ప్రభావం ఒక రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకేలా ఉండదు. ఒక్కో జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉన్నందున, చాలా తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాలను గుర్తించి, వాటి కోసం ప్రత్యేకంగా జిల్లా ఆధారిత అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేశాం. రబీ సీజన్‌కు సిద్ధమవుతున్న తరుణంలో, ఎల్ నినో వల్ల మారే వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ముందస్తు చర్యలు తీసుకోవడం అత్యవసరం. కేంద్ర ప్రభుత్వం ఈ సవాళ్లను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్థాయిలో సాంకేతిక, ఆర్థిక సహాయసహకారాలు అందిస్తుంది. కేంద్ర–రాష్ట్రాలు కలిసికట్టుగా రైతులకు సానుకూల ఫలితాలు అందించాలి. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఎల్ నినో వాతావరణ మార్పుల ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపైనే ఎక్కువగా ఉంది. ఇక్కడి జిల్లాల్లో ఈ ఏడాది వర్షపాతం గణనీయంగా తగ్గింది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో సాగు నీటి కొరత ఏర్పడింది.రైతు అన్నదాతే కాదు.. జీవనదాతసాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ, కృత్రిమ మేధస్సు, యంత్ర పరిజ్ఞానం ప్రపంచాన్ని ఎంతగా శాసించినప్పటి కీ వ్యవసాయ రంగం ప్రాధాన్యత ఏమాత్రం తగ్గదు. యంత్రాలు రొట్టెలను తయారు చే యగలవు కానీ, పొలంలో గోధుమలను పండించలేవు. మానవ మనుగడకు అవసరమైన పండ్లు, కూరగాయలు, ధాన్యాలు కేవ లం పొలాల నుంచే వస్తాయి. వాటిని పండించే రైతు కేవలం ’అన్నదాత’ మాత్రమే కాకుండా ఈ సమాజానికి ’జీవనదాత’.రైతుల జీవితాల్లో మార్పే లక్ష్యం ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉందనే అంశంతో సంబంధం లేకుండా, దేశ మే ప్రథమం అనే నినాదంతో కేంద్ర ప్రభు త్వం పనిచేస్తుంది. రైతుల జీవితాల్లో సాను కూల మార్పులు తీసుకురావడమే మా లక్ష్యం. దేశంలోని 140 కోట్లకు పైగా ఉన్న జనాభాకు సంపూర్ణ ఆహార భద్రత కల్పించడం మామొదటి లక్ష్యం. ఆహార అవసరా ల కోసం భారత్ ఏ ఇతర దేశంపై ఆధారపడకూడదు. దేశానికి అన్నం పెట్టే రైతు సురక్షిత, సంపన్న జీవితాన్ని గడపాలి. రైతుల ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ ముఖ్య ప్రా ధాన్యత. ప్రజలకు కేవలం ఆహారం అందించడమే కాకుండా, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందుబాటులోకి తీసుకువస్తాం.పాత కొబ్బరి తోటల స్థానంలో.. సంవత్సర కాలంలో భారతదేశ కొబ్బరి ఎగుమతులు రూ.4,349 కోట్ల నుండి రూ.7,038 కోట్లకు చేరాయి. అంటే ఏకంగా 62 శాతం వృద్ధి నమోదు అయ్యింది. తాజాగా కొబ్బరి సాగును ప్రోత్సహించడానికి బడ్జెట్లో సరికొత్త పథకాన్ని ప్రకటించాం. అది త్వరలోనే అమలులోకి రానుంది. దేశంలో కొబ్బరి ఉత్పత్తిలో దక్షిణాది రాష్ట్రాలే అగ్రగామిగా ఉన్నందున, ఈ కొత్త పథకం పూర్తి ప్రయోజనాలను రైతులు పొందేలా రాష్ట్రాలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. 60–70 సంవత్సరాల నాటి పాత కొబ్బరి తోటల స్థానంలో విడతల వారీగా కొత్త మొక్కలను నాటేలా పునరుజ్జీవన వ్యూహాన్ని రూపొందించాలి. చట్టాలు, నిబంధనలు ప్రజల కోసమే ఏర్పడ్డాయి కానీ, చట్టాల కోసం ప్రజలు లేరు. కాలం చెల్లిన పాత చట్టాలను, సంక్లిష్ట విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షించి, అవసరమైన మార్పులు చేయాలి..’అని కేంద్రమంత్రి సూచించారు. సదస్సులో కేంద్ర సహాయ మంత్రులు రామ్‌నాథ్ ఠాకూర్, భగీరథ్ చౌదరి, దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు పాల్గొన్నారు. ఎల్ నినో సహాయ నిధి ఏర్పాటు చేయండి: మంత్రి తుమ్మలఎల్ నినో, అనిశ్చిత వర్షాలు, దీర్ఘకాలిక పొడి పరిస్థితుల నేపథ్యంలో ఎల్ నినో సహాయ నిధి ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కోరారు. సూక్ష్మ సేద్యం, నీటి పొదుపు చర్యలకు మరింత సహాయం అందించాలని విన్నవించారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని గుర్తుచేశారు. ఆయిల్‌పామ్ రైతులకు ధర భద్రత కల్పించాలని, క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తాజా ఆయిల్‌పామ్ గెలలకు టన్నుకు రూ.25 వేల కనీస గ్యారంటీ ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంటలకు ఎంఎస్పీ అమలులో కేంద్ర–రాష్ట్రాలు కలిసి బాధ్యత వహించాలని తుమ్మల అన్నారు.ఇదీ చదవండి: ముందస్తు కార్యాచరణ అమలు చేస్తున్నాం.. -
చింత చెట్టు గురించి ఈ విషయాలు తెలుసా?! తెలిస్తే ఆశ్చర్యపోతారు!
English Name: Tamarindశాస్త్రీయ నామం: ట్యామరిన్దస్ ఇండిక Scientific Name: Tamarindus indica L. Synonym (s): Tamarindus occidentalis Gaertn. Tamarindus officinalis Hook.Tamarindus umbrosa Salisb. కుటుంబం: ఫ్యాబేసి Family: Fabaceaeచింత చెట్లు పేర్లు: అస్సామీస్: టెట్లీ;ఇంగ్లీష్: ట్యామరిండ్;ఉర్దూ: ఇమ్లీ;ఒరియా: టెన్తులి, దాలిమ;గుజరాతీ: అమ్లీ; కన్నడ: హునిసేహన్ను, హులి;తమిళం: పులి;తెలుగు: చింత;పంజాబీ: ఇమ్లీ;బెంగాలీ: తెంన్టుల్, తెటుల్;మరాఠీ: చిన్చ;మలయాళం: పులి, వనంపులి;హిందీ: ఇమ్లీ; సంస్కృతం: అమ్లీకా, చింతడి;ఇటాలియన్: ట్యామరిండ్;ఫిలిప్పెన్స్: టమన్;నైజీరియా: హశస, థాయి: మఖ్;ఫ్రెంచ్: ట్యమరిన్; ఇండోనేషియా: ఆసాం;మెక్సికన్: ట్యామరిన్దోపూత: మే – జులైపండ్లు : జనవరి – ఏప్రిల్చింత నాటి–నేటి తరానికి తెలిసిన పండ్ల చెట్లు. ఇది రాబోయే తరాలకు కూడా గుర్తు ఉండగల పండు. దీని స్వస్థలం భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ఆఫ్రికాలోని ఉష్ణమండల ప్రాంతం. కానీ చింత చెట్లు అనాదిగా ఇండియాలో కూడ ఉన్నాయి. ప్రస్తుతం అత్యధికంగా చింతపండును ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఇండియా ప్రథమ స్థానంలో ఉంది. చింత చెట్టు సగటు జీవిత కాలం 200 సంవత్సరాలు. 800 సంవత్సరాల చింత చెట్టు బెంగుళూరు జీవవైవిధ్య పార్కులో ఉంది. ఇది రాజరాజ చోళుల కాలంలో నాటినట్లు చెప్తున్నారు. సౌత్ ఏషియా, ఉత్తర ఆస్ట్రేలియా, ఆసియా, తైవాన్, చైనా కూడా ఉంది. సౌత్ ఇండియాలో దీని ప్రాముఖ్యత అధికం.ఒకప్పుడు అడవికి పరిమితమైన ఈ చెట్లు రానురాను పంట పొలాలను తాకింది. బ్రిటిష్ కాలంలో రోడ్డుకు ఇరువైపుల నాటారు. కరువు కాలాల్లో పేదలకు ఆసరాగా ఉంటుందని నాటారు. ఉత్తర భారతం చలి ప్రాంతాల్లో చింత లేదు. పక్వ దశకు వచ్చిన చెట్టు నుండి దాదాపు 175 కిలోల పండు పొందవచ్చు. 12– 20 మీటర్ల ఎత్తువరకు పెరగగలదు. నీటి అవసరం తక్కువే. సూర్యరశ్మి ఉన్న చోట్ల చింత చెట్లు ఏపుగా పెరుగుతాయి. ఇవి అన్ని నేలల్లో పెరుగుతాయి. విత్తనం ద్వారా పునరుత్పత్తి జరుగుతుంది. చింత చెట్టు పోషకాలకు పెట్టింది పేరు. చెట్టు బెరుడు, ఆకులు (చిగురు), కాయలు, పండ్లు మొదలైన భాగాలను వినియోగిస్తున్నాం. చింత చెట్టు ఉపయోగాలు:చింత చెట్టు అన్ని భాగాలూ ఎంతో ఉపయోగపడతాయి. చింత కలప చాలా గట్టిది. చాలా సంవత్సరాలు మన్నికగా ఉంటుంది. ఫర్నీచర్ తయారీలో వాడతారు. నగిషీలు చెక్కడానికి ఉపయోగిస్తారు. దిమ్మలకు ప్రత్యేకంగా చింతనే వాడుతారు. మాంసం దుకాణదారులు ప్రత్యేకంగా చింత దిమ్మలనే మాంసాన్ని కట్ చేయటానికి వాడతారు.చింత చిగురు ఆకుకూరగా ఉపయోగపడుతుంది. పచ్చడి చేస్తారు. కొన్ని దేశాలలో చింత ఆకుల ‘టీ’ ని మలేరియా జ్వరానికి వైద్యంగా వాడతారు. చింత చిగురు పప్పు చాలా రుచిగా ఉంటుంది.పూతను పప్పులో వేస్తారు. వగరు, పులుపుతో కూడిన పప్పు విటమిన్ ‘సి’ని ఇస్తుంది.కాయలతో పచ్చడి పెడతారు. చింతకాయ పులిహోర రుచిగా ఉంటుంది.చింతపండు పులుసు చాలా ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. చింత పండు పులిహోర ప్రత్యేకం. సాస్ తయారు చేయటానికి, పచ్చళ్ళలో, కొన్ని పానీయాల తయారీలో విస్తృతంగా వాడతారు.కంచు, రాగి పాత్రల్ని శుభ్రం చేయటం, మెరుపు తేవడానికి ఉపయోగిస్తారు.చింత పిక్కల నుండి ΄ûడరు తయారు చేసి టెక్స్టైల్, జనుము ప్రాసెసింగ్‌లో వాడతారు. బిస్కెట్లు, జిగురు, మందుల తయారీలోను ఉపయోగిస్తారు.చింత కొమ్మల బొగ్గును చిత్రలేఖనంలో వాడతారు.చింతపండు జీర్ణక్రియకు ఉపయోగ పడుతుంది. అజీర్ణానికి విరుగుడుగా చింత ఆకులను ఉపయోగిస్తారు. పెప్టిక్ అల్సర్లను తగ్గించడానికి చింత పిక్కలను, చింత బెరడును ఉపయోగిస్తారు.చింతతో చేసిన మందులు ఇన్సులిన్ స్థాయిని మెరుగుపరచి మధుమేహ లక్షణాలను తగ్గిస్తాయి. అధిక రక్తపోటును తగ్గించటానికి ఉపయోగపడుతుంది. దురద, వాపు, ఎరుపుదనం, అసౌకర్యం వంటి లక్షణాలను తగ్గించటానికి ఉపయోగ పడుతుంది.చింతపండును అధిక మొత్తంలో తరుచుగా తీసుకోకుంటే పిత్తాశయంలో రాళ్ళు వస్తాయి. మధుమేహం తగ్గటానికి మందులు వాడుతున్నప్పుడు చింత పండును అధిక మొత్తంలో తరుచుగా వాడుతుంటే చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు వస్తాయి.దీనిపై అపారమైన పరిశోధనలు జరిగినప్పటికీ, అడవి చింతపై ఇంకా మెరుగైన పరిశోధనలు చెయ్యాల్సి ఉంది. అధిక దిగుబడులతో పాటు ప్రతి సంవత్సరం కాసే విధంగా చేయటం అవసరం.చింత బాగా కాస్తే కరువుకు సూచన అంటారు.చింతలో అనేక రకాలను అభివృద్ధి చేశారు. ఉదా: ప్రతిస్థాన్, అనంత రుధిర. నల్లమలలో (కుడి చింత బయలు, కొమ్మనిపెంట, సర్లపల్లి, అప్పాయిపల్లి మొదలగు ప్రాంతాల్లో ఉన్న చింతను వాటిలోని పోషకాలను బట్టి విభజించి పరిశోధనలు చేసి, మంచి వంగడాలను అభివృద్ధి చెయ్యాలి.- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924ఇదీ చదవండి: మొక్కలకు ఎప్సమ్ సాల్ట్.. ఇలా వాడితే అదిరిపోయే ఫలితాలు! -
రైతులకు గుడ్‌న్యూస్.. పొలాల్లో కార్బన్ పెంచితే ఇక నగదు ప్రోత్సాహకం!
పొలాల్లోని మట్టిలో సేంద్రియ కర్బనాన్ని పెంపొందించే పునరుజ్జీవ వ్యవసాయ పద్ధతులను స్థిరంగా అనుసరిస్తున్న రైతులకు నగదు ప్రోత్సాహక చెల్లింపులు ఇవ్వటం మన దేశంలో ప్రారంభమైంది. ఈ ‘వ్యవసాయ కార్బన్ మార్కెట్’ విధాన దశ నుంచి ప్రస్తుతం క్షేత్రస్థాయికి చేరింది. పంజాబ్, హర్యానాలలో పునరుత్పాదక (రీజెనరేటివ్) వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న 2,500 మందికి పైగా చిన్న రైతులు డిజిటల్ చెల్లింపులను అందుకుంటున్నారు.లుధియానాలోని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మొదటి చెల్లింపులు విడుదలయ్యాయి. సుస్థిర వ్యవసాయ పద్ధతులు పాటించే రైతులకు అదనపు ఆదాయాన్ని చేకూర్చే ఒక కొత్త వ్యవస్థకు ఇది శుభారంభం. పంజాబ్, హర్యానాలకు చెందిన 2,550 మంది రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీని కేంద్ర వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ కార్యదర్శి, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.ఎల్. జాట్ ప్రారంభించారు.ఏడేళ్ల క్రితం ‘ఆది’కి శ్రీకారంఐసీఏఆర్ సాంకేతిక మార్గదర్శకత్వంతో 2019లో ‘గ్రో ఇండిగో’ రైతు కార్బన్ కార్యక్రమమైన ‘ఆది’ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కింద 2019– 2022 మధ్య రైతులు నేరుగా విత్తే వరి (డైరెక్ట్ సీడెడ్ రైస్–డీఎస్ఆర్), మితంగా దుక్కి, పంట అవశేషాలను తగులబెట్టకుండా భూమిలో కలిపెయ్యటం వంటి పద్ధతులను అవలంబించారు. దీని ఫలితంగా తగ్గిన గ్రీన్ హౌస్ వాయువులు, నేలలో పెరిగిన సేంద్రియ కర్బనాన్ని కొలిచి, కార్బన్ క్రెడిట్లను జారీ చేయడానికి ముందు స్వతంత్రంగా ధృవీకరించారు. ఈ కార్యక్రమం ఏడు రాష్ట్రాలలో రెండు మిలియన్లకు పైగా ఎకరాలను, లక్షకు పైగా రైతులను కవర్ చేస్తుంది. వెర్రా వీఎం0042 పద్ధతి ప్రకారం వ్యవసాయ కార్బన్ క్రెడిట్లను జారీ చేసింది.గ్రీన్ హౌస్ వాయువుల గణన, పంట అనుకరణ నమూనాలు, నేల నమూనా సేకరణ పద్ధతులు, పరికరాల ధ్రువీకరణ, క్షేత్రస్థాయి బృందాలకు శిక్షణ, ఉపగ్రహ, రిమోట్ సెన్సింగ్ విధానాలు వంటి రంగాల్లో ఐసీఏఆర్ సంస్థలు తమ శాస్త్రీయ, క్షేత్రస్థాయి నైపుణ్యాన్ని అందించాయి. న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఐఏఆర్ఐ) ఈ ప్రక్రియలకు తోడ్పడగా, పునరుత్పత్తి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి గ్రో ఇండిగో కూడా ఐసీఏఆర్–అటారి, జోన్ 1తో కలిసి పనిచేస్తోంది.ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎంఎల్ జాట్ మాట్లాడుతూ, శాస్త్రీయ అంచనాచ కఠినమైన ధృవీకరణతో కూడిన వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులు నీటి సంరక్షణకు, మెరుగైన గాలి నాణ్యతకు దోహదపడుతూనే, చిన్న రైతులకు అదనపు ఆదాయ అవకాశాలను ఎలా కల్పించగలవో ఈ కార్యక్రమం నిరూపిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఐసీఏఆర్ సంస్థలు అందించిన సహకారాన్ని ప్రశంసించారు.పంట దిగుబడులనే కాక పర్యావరణ ప్రయోజనాలను కూడా అందించగల వ్యవసాయ పద్ధతులకు కార్బన్ చెల్లింపులు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తాయి. సాంప్రదాయంగా దమ్ము చేసి నాట్లు వేయటంతో ΄ోలిస్తే నేరుగా విత్తే వరి నీటిపారుదల అవసరాలను తగ్గించగలదు. అదే సమయంలో మెరుగైన పంట అవశేషాల నిర్వహణ గడ్డి కాల్చడం, దానితో సంబంధం ఉన్న వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. 2019–2022 మధ్య నమోదు చేసుకున్న పొలాల ద్వారా 4500 కోట్ల లీటర్ల నీరు ఆదా అవుతుంది. రెండు లక్షల టన్నులకు పైగా పంట అవశేషాలను కాల్చకుండా వినియోగిస్తారు. దీనివల్ల సుమారు 1,000 టన్నుల పీఎం 2.5 వాయు కాలుష్య ఉద్గారాల నివారణ జరిగిందని అంచనా.పొలాల ద్వారా ఉత్పత్తి అయిన కార్బన్ క్రెడిట్లలో రైతుల వాటా ప్రకారం వారికి చెల్లింపులు జరిగాయి. క్రెడిట్లు పూర్తిగా అమ్ముడు΄ోకముందే గ్రో ఇండిగో తన సొంత నిధుల నుండి డిజిటల్‌గా చెల్లింపులు చేసింది. మొదటి విడతలో సుమారు 30,000 ఎకరాలకు గాను 50,000కు పైగా కార్బన్ క్రెడిట్లకు చెల్లింపులు జరిగాయి. ఇందులో పాల్గొన్న రైతులు సుమారుగా రూ. 3,000 నుంచి రూ. 15,000ల వరకు అందుకున్నారు.అనేక సంవత్సరాల పాటు సేంద్రియ కర్బనం, కాలుష్య స్థాయిల కొలత, స్వతంత్ర ధృవీకరణ ప్రక్రియ తర్వాత ఈ చెల్లింపులు జరిగాయి. 2022 తర్వాత ఈ కార్యక్రమంలో చేరిన రైతులు వారి కార్బన్ క్రెడిట్లు జారీ అయినప్పుడు చెల్లింపులను అందుకుంటారు.గ్రో ఇండిగో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఉషా బర్వాలే జెహర్ మాట్లాడుతూ రైతుల పొలాల్లోని మట్టిలో నిల్వ ఉన్న సేంద్రియ కర్బనానికి దేశంలోనే మొదటిసారిగా డబ్బు చెల్లించామన్నారు. శాస్త్రీయ మదింపు, ధృవీకరణ ప్రక్రియలో రైతులు చూపిన నమ్మకాన్ని, సహనాన్ని ఆమె అభినందించారు. చెల్లింపులు అందుకున్న లుధియానాలోని నూర్పూర్ బెట్‌కు చెందిన రైతు హరిందర్జీత్ గిల్, సంగ్రూర్‌కు చెందిన అమన్ దీప్ కౌర్ కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. పునరుజ్జీవ వ్యవసాయ పద్ధతులను కొనసాగించటం, పంట వ్యర్థాలను కాల్చకుండా ఉండటం వల్ల కలిగే ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలను వారు ప్రముఖంగా ప్రస్తావించారు.లుధియానా కార్యక్రమం మన దేశ వ్యవసాయంలో వస్తున్న గుణాత్మక మార్పుకు సంబంధించిన మూడు పరస్పర సంబంధిత అంశాలను ఎత్తిచూపుతోంది. రైతు కేంద్రీకృత, క్షేత్రస్థాయి వ్యవసాయ పరిశోధన, ఐసీఏఆర్ పరిశోధనా సంస్థలు, అటారీలు, కేవీకేల ద్వారా అనుసరించే ‘ల్యాబ్–టు–ల్యాండ్’ విధానం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను పంచుకోవటానికి, విస్తరించటానికి అందించే అంతర్జాతీయ సహకారం వంటి అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి.పునరుజ్జీవ వ్యవసాయంపై శాస్త్రీయంగా లెక్కించిన పర్యావరణ ఫలితాలను, రైతులకు ఆర్థిక ప్రోత్సాహకాలతో ఎలా అనుసంధానించవచ్చో.. అదే సమయంలో వనరుల పరిరక్షణ, వాతావరణ ఒడిదుడుకులను తట్టుకోవటం ద్వారా సుస్థిర వ్యవసాయ ఉత్పత్తికి ఎలా దోహదపడవచ్చో మన దేశంలో రైతులకు అందించిన ఈ మొదటి మట్టి–కార్బన్ చెల్లింపుల వ్యవహారం నిరూపిస్తోంది.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ఇదీ చదవండి: 12 ఏళ్లకోసారి ప్రకృతిలో అద్భుత దృశ్యం! -
గులాబీలు పండిస్తూ.. నెలకు రూ. 2.5 లక్షలు..!
ఒక్కోసారి ఎప్పుడు సాగుచేసే పంటను సాగు చేసినా..ఊహించని విధంగా విపరీతమైన నష్టాలు చవిచూస్తుంటాం. అధిక దిగుబడి వల్ల గిట్టుబాటు ధర లేకోవడమో లేక ఇతర కారణాల వల్లే విపరీతమైన నష్టాలను చవిచూస్తుంటాం. అలాంటప్పడు సరైన నిర్ణయం తీసుకుని..కాస్త తెలివిగా వ్యవహరిస్తే..కనక వర్షం కురిసేలా లాభాలు కూడా పొందొచ్చు. అదే చేసి చూపించాడు ఈ యువ రైతు. అతడే మహారాష్ట్రకు చెందిన అర్జున్ సబాలే. అతడి కుటుంబం బంతి, చామంతి పువ్వులను సాగు చేసి, వాటి అమ్మకం కోసం ముంబై తీసుకువెళ్లేవారు. అయితే ధరలు పడిపోవడం, పోటీ పెరడగం వంటి కారణాలతో నష్టాలు రావడం మొదలైంది. తమ కుటంబ పొలం లాభదాయకంగా మార్చడానికి ఏం చేయాలో తోచేది కాదు. ఏం చేద్దాం అని సబాలే ఆలోచిస్తున్న తరుణంలో సురక్షిత వ్యవసాయం వైపుకి అడుగులు వేశాడు. సుమారు పావు ఏకరం భూమిలో ఈసారి గులాబీలు పెంచి చూడాలని అనుకున్నాడు. ఏదో చిన్న ప్రయోగంగా మొదలైన పూల పెంపకం కాస్తా ఏడాది పొడవునా ఆదాయన్ని అందించే పూల వ్యాపారంగా అభివృద్ది చెందింది. బీఏస్సీ అగ్రీకల్చర్ చదువుతున్నప్పుడే..వివిధ పంటలను అధ్యయనం చేయడానికి పొలాలను సందర్శించడం ప్రారంభించాడు. అక్కడ పాలీహౌస్ సాగును చూసి రక్షిత పూల సాగువైపుకి అడుగుపెట్టాడు. ఆ సమయంలోనే గులాబీల సాగుని క్షుణ్ణంగా గమనించాడు సబాలే. అలా బెంగుళూరుకి చెందిన ఒక రైతు నుంచి గులాబీ కాండాలను ఒక్కొక్కటి రూ. 12ల చొప్పున కావల్సినన్ని మొక్కలు కొని పావు ఎకరం భూమిలో నాటాడు. అందుకోసం సుమారు రూ. 8000లు వరకు పెట్టుబడి పెట్టాడు. జస్ట్ పదివేల చదరుపు అడుగుల భూమిలో గులాబీలు ప్రారంభించి, క్రమంగా విస్తరించాడు. ఆ తోటలో సుమారు 500 గులాబీలు పైనే పూసేవి, వాటిని ఒక్కోక్కటి కనీసం రూ. 5లకు చొప్పున అమ్మిన రోజుకు దాదాపు రూ. 25000/- దాక సంపాదించేవాడు. ఈ రాబడితో అతడు తోటను విస్తరించడమే గాక జెర్బెరా వంటి డెకరేటెడ్ పూల మొక్కలను కూడా పెంచడం ప్రారంభించాడు. అలా పావు ఎకరం నుంచి ఎకరం భూమిలో ఒక్కో రకం 16,000 మొక్కలతో గులాబీలు, జెర్బెరాలను పండించడం ప్రారంభించాడు. అలా సబాలే తన వ్యవసాయ క్షేత్రంలో ప్రతిరోజూ సుమారు వెయ్యి గులాబీలు, రెండు వేల జెర్బారాలు పూస్తున్నాయి. ఒక్కో గులాబీకి రూ. 5లు, ఒక్కో జెర్బెరా కాడకు రూ. 4 లు చొప్పున రోజుకు రూ. 5వేల నుంచి రూ. 8 వేల దాక ఆదాయం వస్తోంది. అంటే నెల వచ్చేటప్పటికీ రూ. 3.5 లక్షల టర్నోవర్‌ని ఆర్జిస్తున్నాడు. అంటే నికర లాభం రూ. 2.5 లక్షలు ఉంటుంది. సబాలే గులాబీలు, జెర్బెరాలను సహజసిద్ధమైన వెంటిలేషన్ ఉన్న పాలీహౌస్లో పెంచుతాడు. గాలి ప్రసరణ కోసం పవర్డ్ కూలింగ్ ఫ్యాన్లకు బదులుగా రూఫ్ వెంట్లు, సైడ్ కర్టెన్లను ఉపయోగిస్తారు. ఆయన పావు ఎకరంలో ప్రారంభించినప్పుడు వీటన్నింటిని ఏర్పాటు చేయడానికి దాదాపు రూ. 3 లక్షలు దాక ఖర్చయింది. అయితే ఈ మొక్కలు ఐదు నుంచి ఏడేండ్ల వరకు దిగుబడి ఇస్తూనే ఉంటాయి కాబట్టి పెట్టుబడిని చాలా ఏళ్లు పాటు విస్తరించుకోవచ్చు అని అంటున్నాడు సబాలే. అలాగే తన పువ్వులను నేరుగా స్టాల్స్, హోల్‌సెల్ మార్కెట్లకు అమ్ముతుంటాడు. అయితే డిమాండ్‌ని బట్టి పువ్వులను బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబైలకు సరఫరా చేస్తుంటానని చెబుతున్నాడు సబాలే.ఇదీ చదవండి: అది మన డీఎన్ఏలోనే ఉంది ..! మాధవన్ కుమారుడు వేదాంత్ -
12 గంటలు ఉత్త 'కోతలే'
విద్యుత్ కోతలతో నీరందించలేక ఎండిపోతున్న పొలాన్ని చూపిస్తున్న ఈ మహిళా రైతు పేరు ఈదెమ్మ. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం పెగడబండకు చెందిన ఈమె పది ఎకరాల్లో వరి సాగు చేసింది. రెండు బోర్లలో నీళ్లున్నా.. కరెంట్ కోతలతో పారించలేకపోతోంది. ఉదయం 7.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు త్రీఫేస్ కరెంట్ ఇస్తున్నారని.. మధ్యమధ్యలో నాలుగైదు పర్యాయాలు కోత పెడుతున్నారని.. మొత్తంగా 8 గంటలు ఇవ్వడం లేదని చెబుతోంది. ఇప్పటివరకు 8 ఎకరాల్లో పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకు 1.80 లక్షల పెట్టుబడి కాగా.. కరెంట్ ట్రిప్, లోఓల్టేజీతో మూడుసార్లు మోటారు కాలిపోయిందని.. దీనికి అదనంగా సుమారు రూ.25 వేలు ఖర్చయిందని వాపోయింది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎల్‌నినో, వర్షాభావంతో రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. వరుణుడు కరుణించకపోతాడా అనే ఆశతో వర్షాధారంగా సాగు చేసిన పంటలు ఇప్పటికే చేతికందకుండా పోయాయి. బోర్లు, బావుల కింద వేసినవి సైతం ఎండుముఖం పడుతుండటంతో రైతాంగం కన్నీరుమున్నీరవుతోంది. వ్యవసాయానికి త్రీఫేస్ కరెంట్ సరఫరాలో అప్రకటిత కోతలు అమలు చేస్తుండడమే ఇందుకు కారణం. నీళ్లున్నా, విద్యుత్ కోతలతో తడులందించలేని దుస్థితిలో పలు ప్రాంతాల్లో రైతులు రోడ్డెక్కుతున్నారు. దాదాపుగా 5 నుంచి 8 గంటలు మాత్రమే.. రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో మొత్తంగా 1,19,55,375 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 50,92,817, పత్తి 48,21,503 ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయశాఖ నివేదికలు చెబుతున్నాయి. మొత్తం సాగులో వరి, పత్తి పంటల వాటా 82.9 శాతంగా ఉంది. అయితే వ్యవసాయానికి 12 గంటలపాటు త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. ఐదు నుంచి ఎనిమిది గంటలే ఇస్తున్నట్లు ‘సాక్షి’బృందం పరిశీలనలో తేలింది. ఉదయం 5.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిరంతరాయంగా త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా.. దఫాల వారీగా అనధికారికంగా కోతలు అమలు చేస్తున్నారు. జిల్లాల వారీగా సరఫరా సమయాలతోపాటు కోతల సమయంలోనూ తేడాలు ఉన్నాయి. ఒక్కో జిల్లాలో ఒక్కోలా.. – జోగుళాంబ గద్వాల జిల్లాలో జిల్లాలో వ్యవసాయానికి కేవలం ఐదారు గంటలు మాత్రమే త్రీఫేస్ కరెంట్ ఇస్తున్నారని.. అది కూడా లో ఓల్టేజీతో సరఫరా చేస్తుండడంతో మోటార్లు కాలి పోతున్నాయి. – ఖమ్మం జిల్లాలో రోజుకు ఐదు నుంచి ఏడు గంటలే వ్యవసాయ విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాంతాల వారీగా ఉదయం 8 నుంచి 12 గంటల వరకు కోత పెడుతుండడంతో చివరి పంటకు నీరందడం లేదు. వేంసూర్ మండలంలో బోరుబావుల్లో నీళ్లున్నా.. తడులందకపోవడంతో పలువురు రైతులు ఎండిన వరిని తొలగించి.. జొన్న సాగు చేపట్టారు. – కామారెడ్డి జిల్లాలో రోజుకు ఆరు నుంచి ఏడు గంటలు మాత్రమే వ్యవసాయానికి త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. కరెంట్ ట్రిప్ కావడం, లోఓల్టేజీ సమస్యతో మోటార్లు తరచు కాలిపోతున్నాయని.. ఒకసారి మరమ్మతుకు వస్తే అదనంగా రూ.10 వేల వరకు ఖర్చు వస్తోందన్నారు. – నిజామాబాద్ జిల్లాలో ఉదయం 8, 9 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటల వరకు త్రీఫేస్ కరెంట్ ఇస్తున్నారు. మధ్యమధ్యలో రెండు గంటల పాటు కోత పెడుతున్నారు. – ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయ కరెంట్ ఉదయం 7.30 గంటలకు ఇస్తున్నారు. మధ్యమధ్యలో కోతలతో మొత్తం 8 గంటలపాటే సరఫరా చేస్తున్నట్లు రైతులు తెలిపారు. విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో.. గత ఏడాది ఇదే నెల తొమ్మిదిన గరిష్ట విద్యుత్ డిమాండ్ 15,906 మెగావాట్లు కాగా.. ఈ సంవత్సరం అదే సమయంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ ఆల్‌టైం రికార్డుస్థాయిలో 19,543 మెగావాట్లకు చేరింది. ఈ లెక్కన 23 శాతం మేర పెరిగినట్లు తెలుస్తోంది. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావంతో రైతులు పూర్తిగా బోరు బావులపైనే ఆధారపడాల్సి రావడం, పంప్ సెట్ల నిరంతర వాడకంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం అమాంతంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. కనీసం 15 గంటలు ఇవ్వాలి.. నాకు సొంతంగా ఉన్న 3 ఎకరాల్లో మిరప, మరో 7 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశా. రెండు బోర్లు ఉన్నా, రోజుకు 8 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు. దీంతో పత్తి పంటకు నీరందించలేక పోతున్నా. దీంతో ఎదుగుదల లేకుండా పోగా.. ఎకరాకు కనీసం క్వింటా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. మిరపకు మాత్రమే తడులు పెడుతున్నా. వ్యవసాయానికి ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 15 గంటలు నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలి – లక్ష్మీనారాయణ, రైతు, అయిజ, జోగుళాంబ గద్వాల కోతలు లేకుండా సరఫరా చేయాలి తొలుత వచ్చిన గోదావరి జలాలు, వ్యవసాయ బోరు నమ్ముకొని ఐదు ఎకరాల్లో వరి సాగు చేశా. ఎండలకుతోడు విద్యుత్ శాఖ ఎడాపెడా కోతలు విధిస్తుండడంతో ఒక మడి తడిసి మరో మడిలోకి నీరు పోవడం లేదు. దీంతో ఏ మడికామడికి పైపులు వేస్తూ పంటను కాపాడుకునేందుకు కష్టాలు పడుతున్నా. కోతల్లేని విద్యుత్ అందిస్తేనే పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. – ఎ.సత్యనారాయణరెడ్డి, రైతు, అడసర్లపాడు, వేంసూరు, ఖమ్మం -
ఆరోగ్యకరమైన నేలే మనిషి ఆరోగ్యానికి మూలం
నీరు, గాలి, వాతావరణ నాణ్యత క్షీణించడానికి నిస్సారమైన మట్టి దారితీస్తుంది. నేల ఆరోగ్యం క్షీణించడం వల్ల మొక్కలు, జంతు వులు, మానవుల ఆరోగ్యం దెబ్బతింటుంది. నేల స్వయంగా ఒక జీవ వ్యవస్థ. అలాగే ఇతర జీవరాశులకు ఆధారభూతమైనది కూడా. నేల, మొక్కలు, జంతువులు, మానవులు, పర్యావరణ వ్యవస్థ, భూగ్రహం ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడివడి విడదీయలేని ‘ఏకైక ఆరోగ్యం’ (వన్ హెల్త్)గా ఉంటాయి.‘ఆరోగ్యమైన నేల– ఆరోగ్యమైన మొక్క– ఆరోగ్యమైనజంతువు– ఆరోగ్యమైన మనిషి’ అనే భావనే వన్ హెల్త్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మనుషులు, జంతువులు, మొక్కలు, పర్యా వరణం పరస్పరం అనుసంధానమై ఉంటాయి. ఈ నాలుగు ఆరో గ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ‘ఏకైక ఆరోగ్యం’ భావనను, భారతదేశంలో జరిగిన జీ–20 సమావేశాలలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక టీ స్పూన్ ఆరోగ్యకరమైన నేలలో కోట్ల నుండి వందల కోట్ల వరకు సూక్ష్మజీవులు ఉంటాయి. వీటిలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు (ఫంగి), యాక్టినోమైసెట్స్, ప్రోటో జోవా, నులిపురుగులు (నీమటోడ్లు), వానపాములు వంటి జీవులు ప్రధానమైనవి. ఈ సూక్ష్మజీవులు, నేల జీవులు కలిసి సేంద్రియ పదార్థాలను కుళ్లించి మొక్కలకు అవసరమైన పోషకాలను అందుబాటులోకి తెస్తాయి. నేలలో ఉండే ఖనిజాలు (జింక్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సల్ఫర్ వంటివి) మొక్కల వేర్ల ద్వారా గ్రహించబడి ధాన్యాలు, కూర గాయలు, పండ్లు ఇతర ఆహార పంటలలో నిల్వ అవుతాయి. ఈ పంటలను మనం ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆ ఖనిజాలు, పోషకాలు మన శరీరానికి అందుతాయి. ‘నేలలో పోష కాలు సమృద్ధిగా ఉంటేనే ఆహారం పోషకవంతంగా ఉంటుంది; ఆహారం పోషకవంతంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.’నేల ఆరోగ్యాన్ని కాపాడే పద్ధతులుసేంద్రియ పదార్థాల వినియోగం నేల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పశువుల ఎరువు, కంపోస్ట్, వర్మీకంపోస్ట్, గ్రీన్ మెన్యూర్, బయోచార్ వంటి సేంద్రియ పదార్థాలు నేలలో సేంద్రియ కార్బన్‌ను పెంచి, నేల సారాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి నేలలో ఉపయోగకరమైన సూక్ష్మజీవుల వృద్ధిని ప్రోత్సహించి, మొక్కలకు అవసరమైన పోషకాలను క్రమంగా అందుబాటులోకి తీసుకు వస్తాయి. పంటల మార్పిడి మరో పద్ధతి. ఒకే భూమిలో ఒకేపంటను వరుసగా సాగు చేయకుండా, వివిధ రకాల పంటలను క్రమపద్ధతిలో సాగు చేయాలి. పప్పు ధాన్యాలైన శనగ, పెసర, మినుము, కంది, అలసంద వంటివాటి వేర్లపై ఉండే రైజోబియం అనే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని గ్రహించి, మొక్కలు ఉపయోగించుకునే రూపంలో నేలలో స్థిరీకరిస్తాయి.మరీ ముఖ్యంగా పంట అవశే షాలను కాల్చకూడదు. కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ కార్బన్, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు పోష కాలు నష్టపోతాయి. పంట అవశేషాలను మల్చింగ్ చేయడం ద్వారా నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండి, కలుపు మొక్కల పెరుగు దల తగ్గుతుంది. అవసరానికి మించి తరచుగా దుక్కి దున్నడం వల్ల నేల సహజ నిర్మాణం దెబ్బతింటుంది. నేలలో నిల్వ ఉన్న సేంద్రియ కార్బన్ వేగంగా విచ్ఛిన్నమైపోతుంది. అతి దుక్కిని నివారించాలి. ‘ఏకైక ఆరోగ్యం’ భావన విజయవంతం కావడంలో రైతు పాత్ర కీలకం. రైతు అనుసరించే వ్యవసాయ పద్ధతులే నేల, మొక్కలు, పశువులు, పర్యావరణం, చివరకు మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. నేల ఆరోగ్యాన్ని కాపాడటం అనేది రైతు పొలం దిగుబడికే కాదు, సమాజ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు భవిష్యత్ తరాలకు చేసే గొప్ప పెట్టుబడి.– డా‘‘ కె. తేజస్వరరావు, డా‘‘ ఎం.ఎం.వి. శ్రీనివాసరావు, డా‘‘ బి. సహదేవ రెడ్డి ‘ సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు -
చిటిమిటి పండుతో బోలెడన్ని లాభాలు..!
అల్లోపతి వైద్యం అందుబాటులో లేనప్పుడు వృక్ష వైద్యమే శరణ్యమనే రోజుల్లో చిటిమిటి పండ్ల చెట్లకు అపారమైన ఆదరణ ఉండేది. ఈ చెట్టుకు ప్రాంతాల వారీగా పైన తెలిపిన పేర్లున్నాయి. ఈ పండు చెట్టు అన్ని భాగాలు ఉపయోగపడతాయి. గార్డినియా జినస్లో దాదాపు 250 పుష్పించే జాతులులు ఉన్నాయి. అందులో ఇది ఒకటి. ఉనికి... చిటిమిటి స్వస్థలం భారత ఉప ఖండం ముఖ్యంగా ఉష్ణ మండలపు ఆకులు రాల్చే అడవులలో విరివిగా పెరుగుతుంది. ఆఫ్రికా, ఆసియా, మడగాస్కర్, పసిఫిక్ ద్వీపాలు, ఆస్ట్రేలియాలో ఈ చెట్లు ఉన్నాయి. ఈ చెట్టు అంత పెద్దగా పెరగదు. నేలను బట్టి దాదాపు 3–5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. కాబట్టి పెరటిలో పెంచుకోవటానికి అనుగుణంగా ఉంటుంది. చిటిమిటి చెట్లు తెలుగు రాష్ట్రాలలోని అడవులు ముఖ్యంగా చిత్తూరు, ప్రకాశం, కడప, కర్నూల్, విశాఖపట్టణం, తెలంగాణలోని నాగరకర్నూల్, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ తదితర జిల్లాల అడవుల్లో ముఖ్యంగా నల్లమల అడవుల్లో విరివిగా ఉన్నాయి. కర్ణాటకలో (అన్ని జిల్లాల్లో), ఒరిస్సా (గంజాం, మయూర్ బంగ్, అంగూల్, కాలహండి, సంబాల్పూర్ జిల్లాల్లో), తమిళనాడు (ఇంచుమించు అన్ని జిల్లాల్లో) ఉన్నాయి. కేరళ (ఇడుక్కు జిల్లాలో) ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కానీ తక్కువ.చిటిమిటి ప్రయోజనాలు చిటిమిటి చెట్టు అన్ని భాగాలూ ఉపయోగపడతాయి. కాబట్టి నిరంతర పరిశోధన ప్రాంతాల వారీగా చేస్తే ఎంతో మేలు చేకూరుతుంది. ఎందుకంటే దేశం నలుమూలల అడవుల్లో దీని ఉనికి ఉన్నది. కలప వంట చెరకుగా వాడొచ్చు. వాసాలు (పోల్స్) గా పందిళ్ళకు వాడవచ్చు. దీని బెరడు, జిగురు ఆయుర్వేదంలో అనేక మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ పండ్లను ఆయుర్వేద వైద్యంలో వాడతారు. పండు రుచిగా ఉంటుంది, నేరుగా తినవచ్చు. పండ్ల గుజ్జులో యాంటిమైక్రోబియల్, యాంటి రాడికల్, కీటకనాశిని గుణాలు ఉన్నాయి. ఆకుల కషాయంలో కూడా కీటక నాశిని, యాంటీ మైక్రోబియల్ విలువలు ఉన్నాయి. ఆయుర్వేద మందులు ముఖ్యంగ రక్త విరేచనాలకు, విరేచనాలకు ఈ చెట్టు భాగాలను ఉపయోగిస్తారు. మందులు బాగా పనిచేస్తాయి. కడుపు ఉబ్బరానికి దీనితో చేసిన మందు దివ్య ఔషధంగా చెప్పవచ్చు. కడుపులో మంటకు కూడా దీనితో చేసిన మందులు వాడితే నయమతుంది. అజీర్తిని కూడా దూరం చేస్తుంది. ఆకులు, పండ్లను ఆరనిచ్చి, పొడి చేసి దాన్ని వాడితే విత్తనం ద్వారా సోకే ఫంగస్‌ను అరికట్టవచ్చని నిరూపితమైంది. కీటకాల మీద మంచి ప్రభావం చూపించటం వల్ల దీన్ని కీటకనాశినిగా కూడా వాడవచ్చు (ఇజ్చిnఛీట్చ – ఝ్చజ్ఛిటజి, 2013).ఔషధ గుణాలుచిటిమిటి చెట్టు భాగాలతో చేసిన మందు యాంటిసెప్టిక్ గుణం కలిగి ఉంటుంది. అదేవిధంగా కఫం, వాత దోషాలను దూరం చేస్తుంది. ఇది మంచి పెయిన్ కిల్లర్. పుండ్లను నయం చేయటంలో దోహదకారిగా పని చేస్తుంది. చర్మ రోగాలను నయం చేస్తుంది. నట్టలను పారదోలుతుంది. దగ్గు నుంచి ఉపశమన పరుస్తుంది, ఆస్తమాను దూరం చేస్తుంది. ఇది గుండె, లివరు, ప్లీహాన్ని ఉత్తేజపరిచి చక్కటి దారిలో ఉంచుతుంది. జ్వరాలను తగ్గించి శరీర ఉష్ణోగ్రతలను లయబద్ధంగా ఉంచుతుంది. ఈ చెట్టు నుంచి జిగురు వస్తుంది. దాన్ని వైద్యం, ఇతర మందుల్లో పనికి వస్తుంది. జిగురుతో చేసిన చూర్ణాన్ని తేనెలో కలుపుకొని పండ్లు తోముకుంటే పంటి, చిగుళ్ళ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. చూర్ణం పుండ్లపైన రాస్తే పైన చీము పట్టకుండా చేసి పుండ్లు త్వరగా మానటానికి దోహదం చేస్తుంది. ఈ పండ్లను మధుమేహం ఉన్న వారు కూడా తినవచ్చు. చిటిమిటి పండ్లు అందరూ తినదగినవి, రుచికరమైనవి. ఆటుపోట్లను తట్టుకున్న జాతులుచిటిమిటి చెట్లు అనేక రాష్ట్రాల్లో ఉన్నప్పటికి నల్లమల అడవుల్లో ఉన్న చిటమిటికి కొంత వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడి వాతావరణంలో మార్పులు ఇక్కడ పెరుగుతున్న వృక్షజాలాన్ని ఎన్నో ఆటుపోట్లకు గురిచేశాయి. తీవ్ర నీటి ఎద్దడిని తట్టుకొన్న ఈ జాతి చెట్లను కాపాడుకోవటం అత్యవసరం. వీటిలో మెరుగైన పోషక, ఔషధ విలువలు ఉన్నందున వీటి పండ్లను అందుబాటులోకి తెచ్చే విధంగా పరిశోధనలు చేపట్టాలి. ఈ అరుదైన అటవీ పండ్ల జాతుల సంపదను పెంచగలిగితే లాభసాటిగా ఉంటుంది. చిటిమిటి పెరటి చెట్టుగా మారితే ఆ ఇంట్లో వారి ఒంట్లో పోషక లోపాలు తీరినట్లే భావించవచ్చు. డాక్టర్ మొరుపోజు పద్మయ్య,విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్.మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: పురుగులను అరికట్టే జిగురు అట్టలు) -
పురుగులను అరికట్టే జిగురు అట్టలు
సేంద్రియ మిద్దె తోటలు/ పెరటి తోటలు/ ఇంటిపంటల్లో మొక్కలను ఆశించే వివిధ రకాల రసం పీల్చే పురుగులను నివారించటానికి పసుపు, బ్లూ (నీలం) రంగు జిగురు అట్టలు ఎంతో ఉపయోగపడతాయి. ఇవి రసాయన రహితమైనవి, తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. 1. ప్రకాశవంతమైన రంగులను చూసి పురుగులు ఆకర్షించబడి, అట్టలకు ఉన్న జిగురుకు అతుక్కుని చనిపోతాయి.2. తెల్లదోమ వంటి పురుగులు వైరస్ తెగుళ్లను వ్యాపింపజేస్తాయి. వీటిని ఈ అట్టల ద్వారా నివారించడం వల్ల మొక్కలకు వైరస్ సోకకుండా కాపాడుకోవచ్చు.3. తోటలో ఏ రకమైన పురుగులు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఇవి తోడ్పడతాయి.4. క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించడం ద్వారా సాగు ఖర్చు తగ్గుతుంది. 5. పసుపు రంగు జిగురు అట్టలు: ఇవి ప్రధానంగా తెల్లదోమ, పచ్చదోమ (అఫిడ్స్), లీఫ్ మైనర్స్, వివిధ రకాల ఈగలను ఆకర్షిస్తాయి. టమాట, వంగ, బెండ లాంటి కూరగాయలు , పండ్ల తోటలు, మిరప పంటల్లో ఇవి బాగా పనిచేస్తాయి.6. బ్లూ/నీలం రంగు జిగురు అట్టలు ముఖ్యంగా తామర పురుగులు (థ్రిప్స్), నల్ల తామర (బ్లాక్ థ్రిప్స్) పురుగులను ఆకర్షించడానికి ఉపయోగిస్తారు. మిరప వంటి పంటల్లో తామర పురుగుల ఉధృతిని తగ్గించడానికి ఇవి చాలా కీలకం.7. మొక్కల ఎత్తును బట్టి అట్టలను కర్రలకు కట్టి భూమికి లేదా కుండీకి కొంత ఎత్తులో అమర్చాలి. మిద్దె తోటల్లో అవసరాన్ని బట్టి 4–5 అట్టలు సరిపోతాయి. 8. మిద్దె లేదా పెరటి తోటల్లో పండు ఈగ సమస్యను నివారించడానికి ఫెరోమోన్ ట్రాప్స్ మార్కెట్లో దొరుకుతాయి. ఇవి మగ పండు ఈగలను ఆకర్షించి చంపడం ద్వారా సంతానోత్పత్తిని తగ్గిస్తాయి.9. పండు ఈగలు పసుపు రంగుకు ఆకర్షితమవుతాయి. పసుపు రంగు అట్టలపై జిగురు పూసి తోటలో అక్కడక్కడ ఉంచడం వల్ల అవి వాటికి అతుక్కుపోతాయి.10. పాత ప్లాస్టిక్ బాటిల్ తీసుకుని, దానికి చిన్న రంధ్రాలు చేయాలి. అందులో పండిన అరటిపండు ముక్కలు, కొంచెం బెల్లం నీళ్లు లేదా వెనిగర్ వేసి తోటలో వేలాడదీయడం ద్వారా ఈగలను ఆకర్షించవచ్చు. 11. పండ్లు బాగా పక్వానికి రాకముందే కోయాలి. పండ్లు మరీ పండిపోతే పండు ఈగలను త్వరగా ఆకర్షిస్తాయి.12. చెట్టు కింద రాలిపోయిన లేదా కుళ్ళిన పండ్లను వెంటనే తీసివేయాలి. ఇవి పండు ఈగలు గుడ్లు పెట్టడానికి అనువైన ప్రదేశాలు. 13. సన్నని మెష్ ఉన్న నెట్లను మొక్కలకు కప్పడం ద్వారా ఈగలు పండ్ల దగ్గరకు వెళ్లకుండా నిరోధించవచ్చు.14. కాయలు చిన్నవిగా ఉన్నప్పుడే వాటికి కాగితపు సంచులు లేదా సన్నని బట్ట సంచులను కట్టడం ద్వారా రక్షణ కల్పించవచ్చు. 15. లీటరు నీటిలో 5 ఎం.ఎల్. వేప నూనె, కొద్దిగా కుంకుడు రసం కలిపి మొక్కలపై క్రమం తప్పకుండా పిచికారీ చేయడం వల్ల పండు ఈగలు రాకుండా ఉంటాయి.16. వెల్లుల్లి, పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి ఆ ద్రావణాన్ని నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా కూడా ఈగలను నివారించవచ్చు.కొల్లి కృష్ణ కుమారి,అడ్మిన్, గుంటూరు జిల్లా మిద్దె తోటల బృందంమొబైల్: 94906 02366 (చదవండి: చాపగుత్తి: చూడటానికి చిన్న చెట్టే.. ఉపయోగాలు తెలిస్తే షాకే!) -
అర ఎకరం..ఏడాదికి రూ. 80 లక్షలు!
పొలంలోకి దిగి వ్యవసాయ పనులు చేయడాన్ని చూసి ఆమెను ఎగతాళి చేశారు. కానీ ఆ మాటలకు సమాధానం చెప్పడానికి ఆమె మాటలను ఎంచుకోలేదు.. పనినే ఎంచుకుంది. అలా అర ఎకరంతో మొదలు పెట్టి 40 ఎకరాల వ్యవసాయ సామ్రాజ్యాన్ని నిర్మించింది పంజాబ్‌లోని మోగా ప్రాంతానికి చెందిన మణ్‌దీప్ కౌర్ ఖైరా. వ్యవసాయంలోకి అడుగుపెట్టినపుడు ఆమెకున్నది కేవలం అరెకరం పొలం మాత్రమే. కానీ ఆమెకు అది అడ్డంకిగా అనిపించలేదు. భూమిని లీజుకు తీసుకుని కూడా వ్యవసాయం చేయవచ్చునని ఆలోచించింది. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ చివరకు 40 ఎకరాల్లో వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించే స్థాయికి చేరుకుంది. ఇందులో ఎక్కువ భూమి లీజుకు తీసుకున్నదే. అలా పొలంలో పనిచేయడం నుంచి పదిమందితో పెద్ద ఎత్తున వ్యవసాయం చేయించే స్థాయికి చేరుకుంది మణ్‌దీప్. అయితే 40 ఎకరాల స్థాయిలో వ్యవసాయం చేయాలంటే కేవలం భూమి ఉంటే సరిపోదు. యంత్రాలు, పరికరాలు, పెట్టుబడి, నిర్వహణ సామర్థ్యం కూడా అవసరం. ఇందుకోసం మణ్‌దీప్ కౌర్ మూడు ట్రాక్టర్లు, ఏడు ట్రాలీలు, ఇతర వ్యవసాయ పనిముట్లను కూడా సొంతంగా కొనుగోలు చేసింది. అలా ఈ మహిళా రైతు ఏడాదికి వ్యవసాయం ద్వారా 80 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. సమాజంలో ఎక్కువ భూమి ఉన్నవారినే పెద్ద రైతులుగా భావించే పరిస్థితి ఉంది. కానీ మణ్‌దీప్ కౌర్ కథ ఈ ఆలోచనకు భిన్నమైనది. సొంత భూమి లేదని ఆగిపోకుండా.. తనకున్న ఆలోచనతో ముందుకు సాగి అందరి మన్ననలు పొందుతోంది. (చదవండి: ఒకప్పుడు సైన్యం కోసం రాకెట్లు..ఇవాళ చిన్నారుల ఫుడ్ బ్రాండ్ వ్యాపారం!) -
బొప్పాయి మన దేశంలో పుట్టలేదా? ఘనాంకాలు ఏం చెప్తున్నాయంటే?
మన దేశంలో ఏడాది పొడవునా దొరికే పండ్లలో బొప్పాయి ఒకటి. నిజానికి బొప్పాయి మన దేశానికి స్థానిక ఫలం కాదు. బొప్పాయి ఉత్పాదనలో ఇప్పుడు మన భారత దేశమే అగ్రస్థానంలో కొనసాగుతోంది. బొప్పాయి విశేషాలను గణాంకాల్లో తెలుసుకుందాం...చాలా పండ్ల జాతుల మాదిరిగానే పోర్చుగీసు నావికుల ద్వారా పదహారో శతాబ్దంలో మన దేశానికి చేరుకుంది. బొప్పాయిని భారతీయులు అమితంగా ఇష్టపడటంతో దీని సాగును బాగా పెంచారు. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ బొప్పాయిని పండిస్తున్నారు.ఇవి కూడా చదవండి: గతం గతః! ఆలోచన మారితే ఆరోగ్యం మారుతుందా? -
ఒక్క చెట్టు 4,000 పండ్లు.. ఈ చెట్టు కథ విన్నారా?
జపాన్‌లో ఒక ఊరు ఉంది. ఆ ఊరంతా పియర్ చెట్లే! ఆ ఊరి పేరు టొట్టోరి. అక్కడ ఇంటి ముందు, బడి ముందు, రోడ్ల పక్కన అంతా పియర్ చెట్లే కనిపిస్తాయి. ఎందుకో తెలుసా? టొట్టోరి కొండ వాలు ఊరు. వర్షం పడితే నీళ్లు నిలవకుండా వెళ్లిపోతాయి.ఇలాంటి చోటు పియర్ చెట్లకు చాలా ఇష్టం. భలే పెరుగుతాయి. అందుకే ఇక్కడ పండ్లు ఎంతో జ్యూసీగా, తియ్యగా పండుతాయి. టొట్టోరి రైతులు పియర్ చెట్లను చాలా ప్రేమగా చూసుకుంటారు. అక్కడ ఒక పెద్ద పియర్ చెట్ల మ్యూజియం కూడా ఉంది. అందులో 20 మీటర్ల వెడల్పున్న ఒక పెద్ద చెట్టు ఉంది.అది ఒక్కటే ఏడాదికి 4000 పండ్లు ఇస్తుంది! అందుకే టొట్టోరిలో కొత్త సీజన్ వస్తే మొదటి పియర్ బాక్స్ లక్షల రూపాయలకు అమ్ముడవుతుంది. ఆగస్టు 27న ఒసాకా నగరంలో మొదటి పియర్ పండ్ల వేలం జరిగింది. 10 కిలోల ఒక బాక్స్ పండ్లు ఏకంగా 6,00,000 యెన్లు అంటే మన లెక్కలో దాదాపు 3 లక్షల 40 వేల రూపాయలకు అమ్ముడుపోయింది! ఇది రికార్డ్.ఇవీ చదవండి: కొండపై నుంచి జారుతూ రేసు.. ఈ వింత పండుగ ఎక్కడో తెలుసా? -
రైతన్నకు మూడు లాభాలు.. ఇదే అగ్రివోల్టాయిక్స్!
ఎండ తీవ్రత నానాటికీ పెరుగుతున్న వేళ.. వ్యవసాయ రంగానికి, ఎండనక వాననక పొలాల్లో చెమటోడ్చే రైతులు, రైతు కూలీలకు ఊరటనిచ్చే సరికొత్త మార్గం వెలుగులోకి వచ్చింది. వ్యవసాయ భూముల్లో పంటల పైన సౌర ఫలకాలు (సోలార్ ప్యానెల్స్) అమర్చే ‘అగ్రివోల్టాయిక్స్’ విధానం ద్వారా కేవలం విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాకుండా, పంట దిగుబడులు కూడా రైతుకు అందుతాయి. అయితే, ఈ రెంటికీ మించి పర్యావరణపరమైన సౌలభ్యాలు కూడా అదనంగా లభిస్తాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. సౌర ఫలకాల మధ్య పంటలు సాగు చేసే పొలాల్లో పనిచేసే రైతులు, రైతు కూలీలకు తీవ్రమైన ఉష్ణతాపం నుంచి ఉపశమనం కూడా లభిస్తుందని అమెరికాకు చెందిన ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు. ‘జర్నల్ ఆఫ్ అడ్వాన్సెస్ ఇన్ మోడలింగ్ ఎర్త్ సిస్టమ్స్’ పత్రికలో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి.నీటి ఆదా.. ఉష్ణోగ్రత నియంత్రణపరిశోధకులు కంప్యూటర్ సిమ్యులేషన్ నమూనా ద్వారా టొమాటో తోటలపై సోలార్ ప్యానెళ్ల ప్రభావాన్ని విశ్లేషించారు. ప్యానెళ్ల నీడలో పెరిగే టొమాటో ఆకుల ఉష్ణోగ్రత సాధారణ తోటలతో పోలిస్తే సగటున 1.84 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. ముఖ్యంగా మధ్యాహ్నపు మండుటెండల్లో ఏకంగా 7.56 డిగ్రీల వరకు చల్లదనం పెరిగింది. ఈ చల్లని మైక్రో–క్లైమేట్ (సూక్ష్మ వాతావరణం) వల్ల ఆకుల నుంచి నీటి ఆవిరి కావడం 22.4 శాతం తగ్గింది. అలాగే పంట, నేల నుంచి జరిగే మొత్తం తేమ నష్టం ఏకంగా 42.6 శాతం వరకు తగ్గింది. దీనివల్ల వేసవిలో సాగునీటి వినియోగాన్ని భారీగా ఆదా చేసుకోవచ్చని స్పష్టమైంది.రైతు కూలీలకు వడదెబ్బ నుంచి రక్షణసాధారణంగా తీవ్రమైన ఎండల వల్ల పొలాల్లో పనిచేసే కూలీలు వడదెబ్బకు గురికావడం, అలసటతో పనిచేసే శక్తి, సమయం తగ్గిపోతూ ఉంటుంది. ఆ మేరకు పని ఉత్పాదకత తగ్గుతుంది. అయితే, ఈ ప్యానెళ్ల నీడలో పనిచేసే శ్రామికులకు సగటున 4.46 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత తగ్గిన అనుభూతి కలుగుతుందని గుర్తించారు. తీవ్ర ఎండలో 39 డిగ్రీలుగా ఉండే తాపం, ప్యానెళ్ల కింద సుమారు 35 డిగ్రీలకు తగ్గిపోతుంది. ఇది శ్రామికుల ఆరోగ్యానికి, పనితీరు మెరుగుదలకు దోహదం చేస్తుంది.పంటలకు ప్యానెళ్లకూ ప్రయోజనంఅగ్రివోల్టాయిక్స్ పద్ధతిలో కేవలం పంటలకే కాక, సోలార్ ప్యానెళ్లకు కూడా లబ్ధి చేకూరుతుంది. పంటల నుంచి వెలువడే తేమ గాలిని చల్లబరచడం వల్ల సోలార్ ప్యానెళ్ల ఉష్ణోగ్రత 5.6 డిగ్రీల సెల్సియస్ తగ్గింది. ఫలితంగా అధిక వేడిమి వల్ల ప్యానెళ్లలో జరిగే విద్యుత్ సామర్థ్య నష్టం 15 శాతం వరకు తగ్గి, అధిక విద్యుత్ ఉత్పత్తికి కారణమైంది. ప్యానెళ్ల వల్ల పంటకు సూర్యరశ్మి 47 శాతం తగ్గినా, కిరణజన్య సంయోగక్రియ కేవలం 31 శాతమే తగ్గిందని, చల్లటి వాతావరణం వల్ల పంట ఎదుగుదల బాగానే ఉంటుందని పరిశోధకులు వివరించారు. భూగర్భ జలాలు తరుగుతున్న ప్రస్తుత రోజుల్లో విద్యుత్, నీరు, దిగుబడి మూడింటినీ కాపాడుకోవడానికి ‘అగ్రివోల్టాయిక్స్’ ఒక మేలైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
కోకోపోనిక్స్ కూరగాయలు
ఎల్‌నినో తీవ్ర ప్రభావంతో ఆరుబయట పొలాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల సాగు పెను సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అర్బన్ అగ్రికల్చర్‌ను నగర/పట్టణాభివృద్ధి ప్రణాళికల్లో చేర్చాల్సిన ఆవశ్యకత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) అభివృద్ధి చేసిన ‘కోకోపోనిక్స్’ బహుముఖ ప్రయోజనాలను అందించే అత్యాధునిక అర్బన్ వ్యవసాయ పద్ధతిగా రూపుదాల్చింది. కొన్ని సంవత్సరాల క్రితం నుంచే ఈ సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి, శిక్షణ ఇస్తున్న ఐఐహెచ్ఆర్ కృషి ఫలితంగా ఇప్పటికే బెంగళూరు తదితర ప్రాంతాల్లో మిద్దెతోటలు, ఇంటిపంటలను మరింత శాస్త్రీయంగా కొందరు సాగు చేస్తున్నారు. ఆరోగ్యాభిలాషులైన మిద్దెతోటలు, ఇంటిపంటల సాగుదారులతో పాటు మహానగరాల్లో, నగర పరిసరాల్లోని గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీల నిర్వహణ సంఘాల ద్వారా పార్కులు, ప్రభుత్వ/ప్రైవేటు స్థలాల్లో కచ్చితమైన ఫలితాలు లక్ష్యంగా సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, ఔషధ మొక్కల పెంపకాన్ని మరింత విస్తృతంగా చేపట్టడానికి అవకాశం ఉంది. ఈ దిశగా పాలకులు యువతను, మహిళా సంఘాలను, విశ్రాంత ఉద్యోగులను అర్బన్ అగ్రికల్చర్లో నిమగ్నం చేసే దిశగా విధాన నిర్ణయాలు తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ‘కోకోపోనిక్స్’ ప్రయోజనాలు, ప్రత్యేకతలు, యోగ్యతలేమిటో ఈ కథనంలో పరిశీలిద్దాం...సాంప్రదాయ సాగులో మట్టి, ఎరువుల మిశ్రమంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఔషధ మొక్కలు పెంచుతారు. అయితే, మట్టి లేకుండానే మొక్కలు బలంగా పెరిగేలా చేసే సాయిల్ లెస్ సాగు పద్ధతి కోకో΄ోనిక్స్. కొబ్బరి పీచు నుంచి తయారయ్యే కొబ్బపొట్టే కోకోపీట్. మట్టికి బదులుగా దీన్ని కుండీలు, మడుల్లో విస్తృతంగా ఉపయోగించే ఒక సేంద్రియ పదార్థం ఇది. సిల్పాలిన్ బ్యాగ్‌లలో శుద్ధి చేసిన కొబ్బరి పొట్టు ఎరువును నింపి, నిర్ధారిత పరిమాణాల్లో వివిధ రకాల సూక్ష్మ, స్థూల పోషకాలతో కూడిన ద్రావణాన్ని డ్రిప్ ద్వారా అందించడమే ఈ పద్ధతిలో ప్రత్యేకత. వాణిజ్య స్థాయిలో నాణ్యమైన, ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను సులువుగా పండించేందుకు అవసరమైన శుద్ధి చేసిన కోకోపిట్ ఎరువు(అర్కా ఫెర్మెంటెడ్ కోకోపిట్)ను, పోషకాలతో కూడిన ద్రావణాన్ని (అర్కా సస్యపోషక్ రస్‌ను) రూపొందించిన ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులోకి తెచ్చారు.తక్కువ ఖర్చు.. తక్కువ శ్రమకోకో΄ోనిక్స్ పద్ధతిలో అతి తక్కువ పెట్టుబడితో రకరకాల పండ్లు, కూరగాయలు, ఔషధ, పూల పంటలను పండించవచ్చని బెంగళూరులోని ఐసీఏఆర్–ఐఐహెచ్ఆర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ జి. సెల్వకుమార్ తెలిపారు. మట్టి ఆధారిత సాగుతో పోలిస్తే, కోకో΄ోనిక్స్ పద్ధతిని టెర్రస్‌లు/బాల్కనీలలో తక్కువ శ్రమతో చేపట్టవచ్చు. సూర్యరశ్మి తక్కువగా ఉండే బాల్కనీలలో నీడను ఇష్టపడే ఔషధ మొక్కలు, ఆకుకూరలను సులభంగా పెంచటం సాధ్యమవుతుందన్నారాయన. రోజుకు 30–45 నిమిషాలు చాలుసాధారణంగా ఎక్కువ మంది వినియోగించే ఆకుకూరలు, కూరగాయలను ఆరు బయట నేల మీద, గచ్చు మీద, మేడ మీద లేదా గ్రీన్/ పాలీహౌస్‌లలో గ్రోబ్యాగ్స్లలో పెంచే సాయిల్ లెస్ సాగు పద్ధతులపై ఐఐహెచ్ఆర్ ఒక రోజు శిక్షణ ఇస్తోంది. ఆకు కూరలు, టమాటా, మిరప కాయలు, క్యాబేజీ, దోసకాయలు, ఫ్రెంచ్ బీన్స్, బఠానీలు, పొట్లకాయలు, గుమ్మడికాయలతో పాటు విదేశీ రకాలైన రంగు క్యాబేజీ, జుకిని వంటి రకాలపై ఐఐహెచ్‌ఆర్‌లో మట్టి రహిత సేద్య పద్ధతిలో గ్రోబ్యాగ్స్‌లో ప్రయోగాత్మకంగా సాగు చేసి సత్ఫలితాలు సాధించామని ఐఐహెచ్ఆర్ సీనియర్ శాస్త్రవేత్త డా. డి. కలైవనన్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. కూరగాయ మొక్కల పెరుగుదలకు అవసరమైన అన్ని పోషక ద్రావణాలను సమతులంగా, సకాలంలో అందించడం వల్ల పోషక లోపం లేని కూరగాయలను, ఆకుకూరలను పిండించగలుగుతున్నామని ఆయన అన్నారు. అనేక రకాల స్థూల, సూక్ష్మ పోషకాలను ద్రావణం ద్వారా అందిస్తుండగా, మరికొన్ని పోషకాలు కొబ్బరి పొట్టు ఎరువు ద్వారా, మరికొన్ని నీటి ద్వారా అందుతాయన్నారు. ఈ పద్ధతిలో కూరగాయల పెంచటానికి రోజుకు 30–∙45 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఉద్యోగం చేసే దంపతులకు ఇది అనుకూలంగా ఉంటుందన్నారు.కోకోపిట్ ఎంత వాడాలి?గ్రో బ్యాగ్‌లో శుద్ధి చేసిన కోకోపిట్ ఎరువును నింపి.. విత్తనాలు లేదా మొక్కలు నాటి పోషకాలతో కూడిన ద్రవాన్ని డ్రిప్ ద్వారా అందించాలి. 12“12 అంగుళాలు లేదా 15“15 అంగుళాల సైజు గ్రో బ్యాగ్‌లో 8 నుంచి 10 కిలోల వరకు శుద్ధి చేసిన కోకోపిట్ ఎరువును వాడాల్సి ఉంటుంది. వంగ, టమాటా, మిరప, చిక్కుడు, బఠాణీ, బెండ మొక్కలతోపాటు.. సొర, బీర, ఆనప, గుమ్మడి వంటి తీగ జాతి మొక్కల్ని సైతం ఈ సైజు గ్రోబ్యాగ్‌లో ఒక్కొక్కటి పెంచి, వాణిజ్య స్థాయిలోనూ మంచి దిగుబడులు పొందవచ్చని డా. కలైవనన్ తెలిపారు. అదేవిధంగా, ఒక అడుగు ఎత్తు, అడుగు వెడల్పు, 4 అడుగుల పొడవు ఉండే సిల్పాలిన్ గ్రో బెడ్లో అయితే 45 కిలోల శుద్ధి చేసిన కొబ్బరిపొట్టు ఎరువు ΄ోసి కూరగాయలు పెంచుకోవచ్చన్నారు. కొబ్బరి పొట్టు ఎరువు ఒక్కసారి కొని వేసుకుంటే చాలు. ప్రతి పంట పూర్తయ్యాక 5–10 శాతం కొబ్బరి పొట్టు ఎరువు వేసి, కలియదిప్పి, కొత్త పంటను వేసుకోవచ్చు. కొబ్బరిపొట్టు కొన్ని పంటల తర్వాత పూర్తిగా చివికి చక్కని ఎరువుగా మారుతుంది. పాతదాన్ని మార్చాల్సిన అవసరం ఉండదని డా. కలైవనన్ స్పష్టం చేశారు. పది రోజులు ముందే పూత, కాతవాణిజ్య స్థాయిలో మట్టి లేని సేద్యంలో కూరగాయలు, ఆకుకూరలను నేల మీద గానీ, మేడ/గచ్చు మీద గానీ గ్రోబ్యాగ్స్‌లో సాగులో మంచి దిగుబడులు తీయవచ్చని డా. కలైవనన్ తెలిపారు. జుకిని, ఆకుకూరలు, గ్రీన్ క్యాబేజీ, కీరదోస, బఠాణీ వంటివి మట్టిలో కన్నా కోకోపిట్లోనే ఎక్కువ దిగుబడి వచ్చింది. బీన్స్, చిక్కుడు, మిరప, కలర్ క్యాబేజీ వంటి పంటల్లో మంచి దిగుబడులు వచ్చాయన్నారు. అన్ని పంటల్లోనూ పది రోజులు ముందే పూత, కాత రావటం గమనించామన్నారు. కూరగాయల రకాన్ని బట్టి 1 రూపాయి పెట్టుబడికి రూ. 2–11 వరకు ఆదాయం వస్తుందన్నారు. ఇందులో కలుపు సమస్య అసలు ఉండదని, భూమిని దుక్కి చేసే ఖర్చు కూడా ఉండదన్నారు. నీటిలో కలిపే పోషకాలు అత్యంత శుద్ధమైనవి. ఇవి నూటికి నూరు శాతం నీట కరిగి మొక్కల వేర్లకు చప్పున అందుతాయి. మట్టిలో వేసిన రసాయనిక ఎరువుల మాదిరి 50–75% వరకు ఏదో ఒక రకంగా వృథా కావటం.. భూమిని, నీటిని కలుషితం చేయటం అనే సమస్యలు ఇందులో ఉండవని ఆయన అన్నారు. మట్టి లేని సేద్యంలో పండిన కూరగాయలు, ఆకుకూరలు రుచిగా, ఎక్కువ కాలం తాజాగా ఉంటాయన్నారు. సారవంతమైన భూమి అందుబాటులో లేని చోట్లలో, నగరాలు, పట్టణాల్లో మిద్దెలపైన, గేటెడ్ కమ్యూనిటీల్లో ఐఐహెచ్ఆర్ సూచిస్తున్నట్లు మట్టి లేని సేద్యం ఎంతో ఉపయోగకరం. సులభంగా కూరగాయల సాగుస్థలం పరిమితంగా ఉండే మెట్రో నగరాల్లో సేంద్రియ కూరగాయల తోట పెంచటం ఒక సవాలుగా ఉంటుంది. సిమ్లాకు చెందిన హర్‌ప్రీత్ కౌర్ బెంగళూరులోని తన అపార్ట్మెంట్లో ఒక బాల్కనీ కూరగాయల తోట పెంచాలని కలలు కన్నారు. ఆమె తన బాల్కనీలో వివిధ రకాల మొక్కలను పెంచటానికి ప్రయత్నించారు. కానీ, కుండీల్లో మట్టి గట్టిపడటం, పిండి నల్లి వంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆ తదనంతరం కోకోపోనిక్స్ పద్ధతిలో సులభంగా కూరగాయల సాగు చేస్తున్నారు. అలాగే, మట్టి ద్వారా సంక్రమించే తెగుళ్లు, మట్టిని సమకూర్చుకోవటం, కలుపు వంటి సమస్యలను పరిష్కరిస్తుందని తెలుసుకున్నారు. నీటి వినియోగం సగానికి పైగా తక్కువగా ఉండే ఇటువంటి వినూత్న సాంకేతికతలను ఆమె ఉత్సాహంగా స్వాగతిస్తున్నారు.చికిత్సాత్మకమైన కార్యకలాపం‘తోట పని ఒక చికిత్సాత్మకమైన కార్యకలాపం. తోట పనిని సులభతరం చేసే కోకోపోనిక్స్ వంటి కొత్త సాంకేతికతలు రావటం ఒక శుభ పరిణామమ’ని బెంగళూరులోని ‘పాఖీ లైఫ్ అండ్ హెల్త్‌కేర్ సర్వీసెస్’ వ్యవస్థాపకురాలు రేఖా గోపీనాథ్ అంటున్నారు. విత్తనాలు మొక్కలుగా పెరిగే క్రమాన్ని గమనించటం, పువ్వులు వికసించడాన్ని గమనించటం, పండ్లు, కూరగాయలు కోయటం వంటి పనులు ఏదో సాధించిన భావనను కలిగిస్తాయని గోపినాథ్ తెలిపారు. ‘కోకోపోనిక్స్ ద్వారా మంచి దిగుబడిని పొందొచ్చు. అంతేకాకుండా, ఉత్పత్తులు అధిక నాణ్యతను కలిగి ఉంటాయ’ని బెంగళూరులోని క్యాప్స్బర్ అగ్రిసైన్స్ వ్యవస్థాపకురాలు, సీఈఓ రూప మనోజ్ కుమార్ అన్నారు. డా డి కలైవనన్ఐఐహెచ్ఆర్, సీనియర్ శాస్త్రవేత్తపతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్(చదవండి: గరగాయతో బోలెడన్ని ఉపయోగాలు..!) -
‘మిద్దె’కు మద్దతిస్తే..‘అర్బన్’కు ఆరోగ్యమే!
సాక్షి, స్పెషల్ డెస్క్: నగరాల్లో మిద్దెతోటలు, ఇంటిపంటల సాగు పెరుగుతున్నా, అది కేవలం గృహస్తుల హాబీగానే మిగిలిపోతోంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో అర్బన్ అగ్రికల్చర్‌ను మునిసిపల్ మాస్టర్ ప్లాన్లలో చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే మొత్తం ఆహారంలో సుమారు 70 శాతం నగరాల్లోనే వినియోగమవుతోందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ) చెబుతోంది. విధానపరమైన చర్యల ద్వారా నగరాలను ‘ఎడిబుల్ సిటీ’లుగా అంటే.. పర్యావరణ అనుకూల, సుస్థిర ఆహారోత్పత్తి కేంద్రాలుగా మార్చవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.భువనేశ్వర్‌లో ఇటీవల జరిగిన అధ్యయనం మిద్దె తోటలపై ఆసక్తిని తెలియజెప్తోంది. 70% మంది గృహస్తులు మిద్దె తోటలపై ఆసక్తి చూపుతున్నా, 35% మాత్రమే ప్రస్తుతం పండిస్తున్నారు. 56% ప్రభుత్వ/విద్యా సంస్థల్లో ఖాళీ స్థలాలు, 67% సంస్థల్లో అనువైన టెర్రస్‌లు ఖాళీ స్థలాలున్నాయి. అయితే, అర్బన్ అగ్రికల్చర్ ప్రోత్సాహక విధానాల్లేవు. భువనేశ్వర్ మాదిరిగా ఇక్కడ కూడా లోతైన అధ్యయనాలు చేసి తగిన విధానాలు అమల్లోకి తేవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఏం చెయ్యాలి?⇒ అర్బన్ అగ్రికల్చర్ విస్తరణకు స్థల కొరత, నీటి కొరత పెద్ద అవరోధాలు. వీటిని అధిగమించటానికి నిపుణులు కింది ఆచరణాత్మక పరిష్కారాలను సూచిస్తున్నారు.⇒ వాణిజ్య భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలలో రూఫ్‌టాప్ లేదా వర్టికల్ గార్డెనింగ్‌కు స్థలాన్ని తప్పనిసరి చేయటం.⇒ ఇళ్లు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో మురుగునీటి శుద్ధి వ్యవస్థలు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలను స్థానిక మిద్దె తోటలు, ఇంటిపంటల సాగుకు అనుసంధానించటం.⇒ తడి చెత్తతో కంపోస్టింగ్ చేసి నాణ్యమైన సేంద్రియ ఎరువులను పంపిణీ చేయటం.⇒ తోటలు పెంచే ఇళ్లకు ఆస్తి పన్నులో 5–10% రాయితీ, బిందు సేద్యం కిట్లపై సబ్సిడీలు అందించటం.⇒ ప్రజా స్థలాలు, భవనాల్లో ఆహారోత్పత్తిని పట్టణ ప్రణాళికలో భాగం చేసి స్థానిక మార్కెట్లతో అనుసంధానించటం.‘ఎడిబుల్ సిటీ’లకు విధానాల మద్దతువాతావరణ మార్పుల నేపథ్యంలో పట్టణాలు, నగరాల్లో కుటుంబాలకు తాజా, పోషక ఆహారాన్ని అందించడంలో అర్బన్ అగ్రికల్చర్ కీలక పాత్ర పోషిస్తుంది. పెరటి, మిద్దె, బాల్కనీ తోటలను విస్తరించటానికి అనుకూలమైన ప్రభుత్వ విధానాల మద్దతు అవసరం. వ్యవసాయ, పట్టణాభివృద్ధి, పర్యావరణ శాఖల సమన్వయంతో ‘ఎడిబుల్ సిటీల’ను అభివృద్ధి చేసి, పర్యావరణ అనుకూల నగరాలను తీర్చిదిద్దడం అత్యవసర వ్యూహం. – డా. వినీత కుమారి, డిప్యూటీ డైరెక్టర్, ‘మేనేజ్’, సెంటర్ ఫర్ అర్బన్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్ నగర ప్రణాళికలో భాగం చేయాలివాతావరణ మార్పులు, వేగవంతమైన పట్టణీకరణ వల్ల ఆహార పంపిణీ వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతున్నందున మిద్దె తోటలు వంటి అర్బన్ అగ్రికల్చర్ పద్ధతులను నగర ప్రణాళికలో భాగం చేయాలి. ‘కోకోపోనిక్స్’వంటి మట్టిలేని ఆధునిక సాగు పద్ధతులు స్థల కొరత, నీటి కొరతను అధిగమించి స్థానిక ఆహార భద్రతను పెంచుతాయి.అందువల్ల రాష్ట్ర విధానాలు పట్టణ వ్యవసాయాన్ని, వ్యర్థాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించి నగరాలను పర్యావరణ అనుకూలంగా తీర్చిదిద్దాలి. – డాక్టర్ డి. కలైవనన్, శాస్త్రవేత్త, భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్), బెంగళూరుమిద్దెతోటల్లో ఎల్‌నినో జాగ్రత్తలుఎల్నినో వర్షాభావ పరిస్థితుల్లో మిద్దె తోటల్లో నీటిని ఆదా చేయడం ముఖ్యం. కుండీల్లో ఎండుటాకులు లేదా కొబ్బరి పొట్టుతో మల్చింగ్ చేసి, తేమ ఆవిరవకుండా చూడాలి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లోనే అవసరమైనంత నీరు పోయాలి. బాల్కనీల్లో బాటిల్ డ్రిప్ వాడడం, ఎండ తీవ్రతను తగ్గించేందుకు 50% గ్రీన్ షేడ్ నెట్ ఏర్పాటు చేయటం వల్ల తక్కువ నీటితో కూరగాయలు, పండ్ల మొక్కలను రక్షించుకోవచ్చు.– తుమ్మేటి రఘోత్తమరెడ్డి, సీనియర్ మిద్దెతోట నిపుణుడు, హైదరాబాద్ -
వరి పొలంలో 3డీ ఆర్ట్.. రైతుల సూపర్ క్రియేటివిటీ!
మీరు పేపర్ మీద బొమ్మ వేస్తారు కదా? మరి వరి పొలంలోనే బొమ్మ వేస్తే? ఇది చైనాలో వరిపొలం. అక్కడ రైతులు వరి మొక్కలతోనే పెద్ద పెద్ద బొమ్మలు వేస్తారు. దీన్ని ‘ప్యాడీ ఆర్ట్’ లేదా ’టాన్బో ఆర్ట్’ అంటారు. అసలు ఈ ఆర్ట్ జపాన్ లో మొదలైంది, ఇప్పుడు చైనాలో సూపర్ ఫేమస్.ఈ ఫోటోలోని అమ్మాయి జుట్టు, చీర, వాయిద్యం అన్నీ వరి మొక్కలే! కింద నుంచి చూస్తే పొలం మామూలుగా ఉంటుంది. టవర్ మీద జనం ఎక్కి చూస్తేనే బొమ్మ కనిపిస్తుంది. అందుకే దీన్ని 3డి పెయింటింగ్ అంటారు.రంగు ఎలా వస్తుంది? మనకు తెల్ల బియ్యం ఉన్నట్టే, నల్ల బియ్యం, ఎర్ర బియ్యం, ఊదా బియ్యం కూడా ఉంటాయి. వాటి ఆకులు కూడా అదే రంగులో ఉంటాయి. ఆకుల్లో ‘ఆంథోసైనిన్’ అనే సహజ రంగు ఉంటుంది. రైతు ఏ చోట ఏ రంగు కావాలో, ఆ చోట ఆ రంగు విత్తనం నాటుతాడు. మొక్కలు పెరిగేకొద్దీ బొమ్మ పెద్దదవుతుంది!ఈ ఆర్ట్ చైనాలో షెన్యాంగ్ నగరంలో చాలా ఫేమస్. అక్కడ ‘రైస్ డ్రీమ్ పార్క్’ అనే పెద్ద పార్క్ ఉంది. అక్కడి రైతులు ప్రతి ఏడాది 13 హెక్టార్లలో 17 పెద్ద బొమ్మలు వేస్తారు. మొక్కల ఎత్తును కూడా కంట్రోల్ చేసి 3డి ఎఫెక్ట్ తెస్తారు. రైతు అంటే అన్నం పండించేవాడే కాదు, ఆర్టిస్ట్ కూడా! మనం కూడా మన పొలంలో బతుకమ్మ బొమ్మ వేయొచ్చు కదా!- నిర్వహణ: కెఇవీ చదవండి: గుర్రం కోపంగా లేదు.. అది భయం! 12 ఏళ్లలోనే అలెగ్జాండర్ సాహసం! -
గరగాయతో బోలెడన్నీ ఉపయోగాలు..!
గరగాయను ‘గోలిక’ అని కూడా అంటారు. ఈ చెట్టుకు కొన్ని ప్రాంతాల్లో మంచి గుర్తింపు ఉంది. దీని ఆకులు, వేప చెట్టు ఆకులను పోలి పెద్దగా ఉంటాయి. కాయలు వేపకాయల కంటే పెద్దగా ఉండి గుండ్రంగా (గోళీ కాయల వలె) ఉంటాయి. ఈ చెట్లు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. కొండ వేప అనడానికి వీటి ఆకులే కారణమనవచ్చు.English Name : Garuga/Grey Downy Balsamశాస్త్రీయ నామం : గరుగ పిన్నెటScientific Name : Garuga pinnata Roxb.Synonym (s) : Kunthia pinnata (Roxb.) Kuntze, Garuga kenghar Buch.-Ham.కుటుంబం : బుర్సెరేసిFamily : Burseraceaeఉనికి: ఈ చెట్లు ఎక్కువగా కొండ ప్రాంతాలలో పెరుగుతుంటాయి. ఇవి దాదాపు 40–50 అడుగుల ఎత్తువరకు పెరుగ గలవు. గరగాయ చెట్టుకు ఆకులు రాల్చే స్వభావం ఉంది. ఈ చెట్లకు ఇండియా, బంగ్లాదేశ్, మలేసియా, పాకిస్తాన్, చైనా, ఫిలిప్పైన్స్ తదితర దేశాల్లో పెట్టింది పేరు. గరగాయ చెట్టు అన్ని నేలల్లో పెరుగుతుంది. కానీ చౌడు భూములు అనుకూలం కావు. కొన్ని ప్రాంతాలలో ఈ చెట్లను పొలంగట్టు, పెరటి స్థలంలో పెంచుకుంటారు. సముద్రమట్టానికి 400–1200 అడుగుల ఎత్తున్న ప్రాంతాల్లో వీటి ఉనికి ఉంటుంది. గరగాయ చెట్ల ప్రవర్ధనం విత్తనాలు, వేర్ల ద్వారా చేస్తుంటారు.కొండ వేప ఉపయోగాలు:చెట్టు పెద్దగా ఎదిగినా, కలప మాత్రం అంత గట్టిగా ఉండదు. గరగాయ చెట్ల అన్ని భాగాలు మాత్రం ఔషధ గుణాలు కూడినవని గుర్తింపు ఉంది. కలపను వంట చెరుకుగా, చిరు ఫర్నీచర్, చెక్కపెట్టెలు మొదలగు వాటికి ఉపయోగపడతాయి. తీగ తోటల్లో ఆధారం కోసం నాటుతారు (ఉదా: మిరియాల తీగ). చెట్ల మాను నుంచి జిగురును తీయవచ్చు (జిగురు తీస్తే చెట్లు త్వరగా అంతరిస్తాయి). బెరుడు నుంచి ‘ట్యానిన్స్’ లభిస్తాయి. దీన్ని పరిశ్రమల్లో ఉపయోగిస్తారు (ఉదా: తోళ్ళ పరిశ్రమ). వీటి కాయలు ఆకుపచ్చ రంగులో గుండ్రంగా ఉంటాయి. పండ్లుగా మారినప్పుడు నలుపురంగుకు మారతాయి. వీటిని తింటారు. కాయలను మాత్రం ఊరగాయ తొక్కుగా ఉపయోగిస్తారు. కాయలు చేదుగా ఉన్నప్పటికి ఊరగాయలో రుచిగా ఉంటాయి. ఆయుర్వేదంలో, నాటు వైద్యంలో ఈ చెట్లను విరివిగా వాడతారు. ఆకుల రసాన్ని బ్యాక్టీరియా, ఫంగస్ జబ్బులను తగ్గించడానికి వాడతారు. క్యాన్సర్, కడుపు నొప్పి, చక్కెర రోగం, ఆస్త్మా (ఉబ్బసం), ఊబకాయం తదితర రోగాలను తగ్గించే ఔషధాల్లో వాడతారు.గరగాయ చెట్లను పెరటిలోను, పొలంగట్లపైన, రోడ్డుకు ఇరువైపుల నాటుకోవచ్చు. ఈ చెట్లు మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. దీని కాయలు పక్షులకు, కోతులకూ ఆహారంగా ఉపయోగపడతాయి. ఈ పండ్లల్లో సీ, ఈ విటమిన్లు, ఫోలిక్ ఆసిడ్, మినరల్స్ (కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పోటాషియం, భాస్వరం, సోడియం..) ఉంటాయని నిర్ధారణైంది. ఈ చెట్లు నల్లమల ప్రాంతంలో అధికంగా లేకున్నా, రాష్ట్రంలోని ఇతర అడవుల్లో వీటి ఉనికి ఉంది. వీటిపైన పరిశోధనలు ముఖ్యంగా ఆయుర్వేదంలో జరిగినప్పటికీ.. వ్యవసాయ, అటవీ రంగాల్లో అనుకున్నంతగా పరిశోధనలు జరగలేదు. కాబట్టి వ్యవసాయ పరంగా (ఆగ్రోఫారెస్ట్రీ) పరిశోధనలు చేపట్టినట్లయితే, ఫలితాలు రైతులకే కాకుండా ఇతరులకు ఉపయోగపడతాయి. వివిధ భాషల్లో గరగాయ చెట్టు పేర్లు: అస్సామీ: పమా, రహిమోల, తూట్ మల ఇంగ్లీష్: గరుగ, గ్రేడౌని బల్సం ఒరియా: కేకడొగట్చో కన్నడ: ఆరనెల్లి, బిలిగడ్డె, కాశతనెల్లి గుజరాతీ: కాకెడ్, కుసుంబితమిళం: ఆరునెత్ల, కరువెంపు తెలుగు: గరగ, కొండ వేప బెంగాలీ: జుం, కపిల మరాఠీ: కకడ్మలయాళం: కెరయా, అన్నక్కార, కాట్టు కాట్టు నెత్త కోస్ రంబ, కారె యాం, కరువెంపు హిందీ: ఖర్పత్సంస్కృతం: కర్లీకార్, కిని కిరత్, నేపాలీ: డబోదబె, రంసిన్పూత: జనవరి – ఫిబ్రవరిపండ్లు: జూన్ – ఆగస్టు -
నాన్న కల కోసం..29 ఏళ్లకే రిటైర్మెంట్! చివరికి ఇద్దరూ..
ఇటీవల ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక కాలేజ్‌లలో చదివిన చాలామంది ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు వదిలి నచ్చిన పనిలో ఆనందం వెతుక్కుంటున్న వారిని ఎందరినో చూశాం. మరికొందరు లక్షల్లో జీతాలు ఆర్జించి..చీకు చింతా లేని రిటైర్మెంట్ కోసం సేవింగ్స్ ప్లాన్ చేసుకుని మరి త్వరితగతిని పదవీవిరణమ చేస్తున్న వారిని చూశాం. కానీ అలా కాకుండా సంపాదన మొదలయ్యే స్టేజ్‌లోనే రిటైర్మెంట్ ప్రకటించి ఈ మహిళ ఏం చేస్తుందో తెలిస్తే..ఆశ్చర్యపోవడమే కాదు అభినందించకుండా ఉండరు కూడా. ఎందుకంటే..ఇంతకీ ఆమె ఏం చేస్తోందంటే..మహారాష్ట్రకి చెందిన స్నేహా రాజ్‌గురు అనే మహిళ తాను ఆధునిక పోటీ ప్రపంచపు ఒత్తిడిని వద్దనుకుని మరి పెర్మాకల్చర్(కృత్రిమ ఎరువులు, రసాయనాలకు దూరంగా సహజ పద్ధతిలో వ్యవసాయం చేయడం)ను ఎంచుకున్నట్లు తెలిపింది. ఆ నిర్ణయం తనకు ఎన్ని విధాలుగా మేలు చేసిందో వివరిస్తూ..ఆ జర్నీ గురించి వీడియో రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తాను ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే 29 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలిపింది. అంతేగాదు తాను భూమిని ఎలా కొనుగోలు చేసి, పండ్లు, కూరగాయలు పండించడం ప్రారంభించిందో వీడియోలో వివరించారు. తాను ఒకప్పుడూ.. బాలీవుడ్లో పనిచేసేదాన్ని అని, తనకు ప్రయాణాలపై ఉన్న మక్కువ కారణంగా ఈ ఫెర్మాకల్చర్ గురించి తెలుసుకునే అవకాశం ఏర్పండిందని వెల్లడించింది. ఇక తన తండ్రి టాటా మోటర్స్‌లో 30 ఏళ్లకు పైగా పనిచేశారని, పదవీవిరమణ తర్వాత ప్రకృతికి దగ్గరగా జీవించాలని ఆశించినట్లు చెప్పుకొచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇలా ఇద్దరం కలిసి ఫామ్ ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చామని తెలిపింది. ఇక తన ఫెర్మాకల్చర్ జర్నీ గురించి మాట్లాడుతూ..ముందుగా తాను చిన్న భూభాగాన్ని కొనడమే తన మొదటి అడుగుగా పేర్కొంది. దానికి బాప్బేటీ ఫామ్(తండ్రి కూతుళ్ల) ఫామ్ అని పేరుపెట్టినట్లు వెల్లడించింది. ఆ తర్వాత పండ్ల చెట్లను నాటినట్లు పేర్కొంది. దీనికి తక్కువ శ్రమ పైగా మనతోపాటే పెరుగుతాయి. పైగా ఏళ్ల తరబడి చక్కగా పండ్లను అందిస్తాయన్నారు. దీనివల్ల మన ఆహారాన్ని మనమే స్వయంగా పండించుకుని తింటున్న ఆనందం దక్కుతుందని అంటోంది. అలాగే లాక్డౌన్ లేదా యుద్ధం లాంటివి వచ్చినప్పుడూ ఎవ్వరిపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడదని చెబుతోంది. అదీగాక అన్నింటి కన్నా ముఖ్యంగా కడుపు నింపుకునేలా మంచ ఆహారాన్ని అందించే స్థలాన్ని పొందామనే ఆనందం సొంతమవుతుందని అంటోంది. ఇక్కడ పదవీవిరమణ అనేది వయసుకి సంబంధించింది కాదని, ఒత్తిడిని వద్దని శాంతిని ఎంచుకోవడం గురించని నొక్కి చెబుతోంది. చివర్లో మీరు కూడా ఇలాంటి జీవితం గురించి కలలు కంటున్నారా అని ప్రశ్నిస్తూ.. తన సంభాషణను ముగించింది వీడియోలో. నెటిజన్లు కూడా 29 ఏళ్లకే పదవీ విరమణ చేయడం అద్భుతం!!. నిజంగా ఇది చాలా బాగుంది అంటూ పోస్టులు పెట్టారు. కాగా, ఈ బాప్బేటీ ఫామ్ మహారాష్ట్రలోని కోయాలిలో, సరస్సు కనిపించే ఒక కొండప్రాంత వ్యవసాయ క్షేత్రం. View this post on Instagram A post shared by Baapbeti Permaculture Farm | Farmstay in Pune (@baapbetifarm) (చదవండి: 'తిరంగా' దుస్తుల వివాదం..ఊర్వశి రౌతేలా స్పందన ఇదే..!) -
కష్టాల కావడి మోస్తున్న కౌలురైతు
రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయాన్ని బతికిస్తున్న కౌలురైతుల బతుకులు దుర్భరమవుతున్నాయి. సొంతగా భూమి సాగుచేసే రైతు కన్నా ఇతరుల భూమి కౌలుకు తీసుకొని సాగుచేస్తున్న రైతు మరిన్ని కష్టాల్లో కూరుకుపోతున్నాడు. ప్రభుత్వ పథకాలు, విత్తన–ఎరువుల సబ్సిడీలు, బ్యాంకు రుణాలు, నష్టపరిహారాలు, రుణమాఫీలు, మద్దతు ధర, బోనస్.... ఇటువంటివేవీ నేరుగా కౌలురైతులకు అందటం లేదు. ఎన్నికల హామీలతో ఊదరగొట్టి గద్దెనెక్కిన పార్టీలు, కౌలు రైతాంగానికిచ్చిన మాట తప్పిన ఫలితమే ఈ దుఃస్థితి!పెద్ద ఎత్తున ప్రజాధనం వెచ్చించి వ్యవసాయానికి మద్దతుగా నిర్వహిస్తున్న ప్రభుత్వ వివిధ పథకాల లబ్ధి కౌలురైతులకు అందడం లేదు. నిజానికి క్షేత్రంలో ఉండి, పెట్టుబడి పెట్టి, పరి స్థితుల్ని ఎదుర్కొని సాగుచేసేది కౌలు రైతు. కానీ, వారిని గుర్తించి, ఆ మేరకు ప్రయోజనాలు కల్పించడానికి ప్రభుత్వాలు జంకుతున్నాయి. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి! అన్ని బాధలూ వారివే! సర్కారు లెక్కల ప్రకారం తెలంగాణలో కోటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి సాగులో ఉంది. చిన్న, మధ్యతరహా, పెద్ద...అంతా కలిపి సుమారు 70 లక్షల మంది రైతులుగా నమోదై పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఉన్నారు. వారంతా రైతు భరోసా (ఇదివరకటి రైతుబంధు) లబ్ధిదారులు. అందులోనే కొందరు, తమ భూమికి తోడు ఇతరుల భూమి తీసుకొని కౌలు చేస్తున్నారు. మరికొందరు, సొంత భూమే లేకున్నా ఇతరుల భూమి కౌలుకు చేస్తున్నారు. తెలంగాణలో 36 శాతం మంది కౌలురైతులున్నట్టు 2022లో ‘రైతు స్వరాజ్య వేదిక’ (ఆరెస్వీ) జరిపిన సర్వే లెక్కలు చెబుతున్నాయి. సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ ఎరువులు, పంట రుణాలు, రుణమాఫీ లబ్ధి, రైతు భరోసా, పంట బీమా/పంట నష్ట పరిహారం, మద్దతు ధర, అదనపు బోనస్... ఇటువంటి ప్రయో జనం ఏదీ నేరుగా కౌలురైతుకు అందటం లేదు. ప్రభుత్వం, అనుబంధ విభాగాలు వ్యవసాయ రంగంలో ఆధు నిక సాంకేతికతను వినియోగించడం మొదలెట్టాక ‘యాప్’లతో భూయజమానుల మొబైల్, పాస్‌పుస్తకాలు లింక్ చేయడం, ‘ఓటీపీ’లు వారికే రావడం, ఎరువుల సమాచారమైనా, ధాన్యం విక్రయ వివరాలైనా నేరుగా వారి మొబైల్‌కు, బ్యాంకు ఖాతాలకే చేరుతోంది. కౌలు డబ్బు, పెట్టుబడి వ్యయం పెరిగి, మద్దతు ధర కూడా లభించక కౌలురైతు రెండింతలు నష్టపోతున్నాడు. ప్రభుత్వ సహాయమూ అందక మూడు రకాల భారం మోయాల్సివస్తోంది.కష్టాన్ని కళ్లకు కడుతున్న సర్వేలుతెలంగాణ గ్రామీణ జనాభాలో దాదాపు సగం మందికి సెంటు భూమి కూడా లేదు. ముఖ్యంగా వెనుకబడిన, దళిత, మైనారిటీ, గిరిజన వర్గాలవారిలో అత్యధికులకు భూమి లేదు, ఉన్నా ఒకటీ, అర ఎకరాలు మాత్రమే! ఇటీవల ‘కౌలురైతుల గుర్తింపు సాధన కమిటి’ వారు కూడా తెలంగాణలో సర్వే నిర్వహించారు. 22 జిల్లాలు, 47 మండలాలు, 57 గ్రామాల్లోని 1,836 మంది కౌలు రైతులను ‘ప్రాతినిధ్య నమూనా’లుగా ఎంపిక చేశారు. ప్రధానంగా వ్యక్తి గత ఇంటర్వ్యూ పద్ధతిలో సమాచారం రాబట్టారు. ఏపీలో ‘ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం’తో కలిసి ‘పీపుల్స్ పల్స్’ సర్వే నిర్వహించింది. మొత్తం 26 జిల్లాల్లో జిల్లాకు సగటున 100 నుంచి 125 ‘నమూనా’ల చొప్పున మొత్తం 3000 శాంపిల్స్‌తో నెల రోజుల పాటు ఈ సర్వే జరిగింది. కౌలురైతులకు ఏపీలో అరకొరగా గుర్తింపుకార్డు లిచ్చారు. 12.3 శాతం మంది తమకు లభించాయని చెబితే, కార్డు లేవీ అందలేదని 87.7 శాతం మంది వెల్లడించారు. 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల వారే ఏపీలో కౌలురైతులు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీరేట్లు, యంత్రాల అద్దెలు అసాధారణంగా పెరిగాయని 67.2 శాతం రైతులు చెబితే, కౌలు డబ్బు/ధాన్యం పెరగటం వల్ల ఇబ్బందులని 12.5 శాతం మంది, గిట్టుబాటు ధరలు లేక కష్టాలు పెరిగాయిని 10.8 శాతం మంది, అధిక వడ్డీల ప్రయి వేటు అప్పుల భారమనీ, మార్కెట్ సమస్యలనీ మరో పది శాతం మంది చెప్పారు. కొన్ని చోట్ల కౌలు రేట్లు యేటా ఎకరాకు 53 వేల రూపాయల వరకు చేరాయని, సగటున 14,936గా చెల్లిస్తున్నామని తెలంగాణ కౌలురైతులు చెప్పారు. చిన్న కమతాల్లో కౌలు గిట్టుబాటు కాక ఎక్కువ ఎకరాల్లో కౌలు చేయాల్సి వస్తోందని, ఇదివరకు సగటున రైతుకు 5 ఎకరాలున్న కౌలుసాగు ఇప్పుడు 6.7 ఎకరాలకు పెరిగిందని వారంటున్నారు. 5కు పైగా ఎకరాలు కౌలుసాగు చేస్తున్న రైతుల సంఖ్య 31 నుంచి 42 శాతానికి పెరిగింది. మాట తప్పిన ‘రాజకీయాలు’కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి, అన్ని సంక్షేమ పథకాలతో పాటు బీమాను వారికే వర్తింపజేస్తామని ఏపీలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ‘ప్రజాగళం’ పేరిట ప్రకటించిన ఎన్నికల మాని ఫెస్టోలో చెప్పింది. అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపు కౌలు రైతు లకు ప్రత్యేకచట్టం తెస్తామన్న మాట కూడా గాలికిపోయింది. కూటమి భాగస్వామి, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (జనసేన) ఎన్నికల ముందు ఉత్తర కోస్తా, మధ్య కోస్తా, రాయలసీమ... ఎక్కడి కక్కడ కౌలురైతుల సమావేశాలు పెట్టి, వారికి ఆర్థిక సహాయం అందించి నానా హడావుడి చేశారు. ఇప్పుడు కిమ్మనటం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కౌలురైతుల పట్ల కక్ష కట్టినట్టే వ్యవహరించింది. 2016 వరకు తెలంగాణలోని రెవెన్యూ రికార్డుల్లో ప్రతిసీజన్ భూయజమానితో పాటు వాస్తవ సాగులో ఉన్న (కౌలు రైతు) పేరు విడిగా నమోదు చేసే అవకాశం ఉండేది. అలా నమోదు కోసం ఉన్న సాగు కాలమ్‌ను 2017లో ఒక చట్ట సవరణ ద్వారా తొలగించింది. కౌలురైతుల్ని గుర్తించడానికి, వారికి గుర్తింపు కార్డుల ద్వారా ఎంతోకొంత ప్రయో జనం కల్పించడానికి వీలు కల్పించే ‘భూ అధీకృత సాగుదారుల చట్టం–2011’ అమలును 2015 నుంచి దాదాపు నిలిపివేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు, నాటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘2023 సెప్టెంబర్’లో కౌలురైతు లకు బహిరంగ లేఖ రాస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు అన్యాయం జరిగిందనీ, తాము అధికారంలోకి రాగానే 2011 చట్టాన్ని అమలు చేయడమే కాకుండా అన్ని ప్రభుత్వ పథ కాలు వారికి వర్తించేలా చర్యలు తీసుకుంటామనీ పేర్కొన్నారు. గద్దెనెక్కి రెండున్నరేళ్లు దాటినా నేటికి అతీగతీ లేదు. ఏ రకంగా చూసినా కౌలురైతు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నష్టపోతున్నాడు. రెండింతల కష్టాల కావడి మోస్తున్నాడు.దిలీప్ రెడ్డివ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రిసెర్చి సంస్థ డైరెక్టర్ -
కార్బోసల్ఫాన్‌పై పూర్తి నిషేధం.. కేంద్రం ప్రతిపాదన
రైతులకు వాతావరణ సవాళ్లు ఒకవైపు చుట్టుముడుతుంటే, పంటలను ఆశించే పురుగుల సంహారానికి వాడే రసాయనాలు మరొకవైపు ప్రాణసంకటంగా మారుతున్నాయి. వ్యవసాయ రంగంలో విరివిగా ఉపయోగిస్తున్న కార్బోసల్ఫాన్ (Carbosulfan) కీటకనాశిని ఉత్పత్తి, దిగుమతి, విక్రయం, వాడకంపై పూర్తి నిషేధం విధించాలని కేంద్ర వ్యవసాయ శాఖ తాజాగా ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది. 1968 కీటకనాశినుల చట్టం ప్రకారం ఈ విషపూరిత రసాయనాన్ని శాశ్వతంగా రద్దు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.నిపుణుల కమిటీ నివేదికనిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కార్బోసల్ఫాన్ భూమిలోకి లేదా మొక్కల్లోకి చేరిన తర్వాత అత్యంత ప్రమాదకరమైన 'కార్బోఫ్యూరాన్'గా రూపాంతరం చెందుతుంది. దీనివల్ల మానవులతో పాటు పెంపుడు జంతువులకు తీవ్రమైన విషప్రయోగం జరుగుతుందని పరిశోధనల్లో తేలింది. అత్యంత ఆందోళనకరమైన విషయమేమిటంటే.. ఈ రసాయనం ప్రభావానికి గురైతే తక్షణమే కోలుకోవడానికి నిర్దిష్టమైన విరుగుడు కూడా అందుబాటులో లేదు. ముందు జాగ్రత్త కన్నా నివారణే మేలు అన్న చందంగా జీవవైవిధ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఈ రసాయనానికి స్వస్తి పలకడమే శ్రేయస్కరమని సర్కారు భావించింది.వరి, పత్తి పంటల్లో..ముఖ్యంగా వరి, పత్తి పంటలలో నివారణకు వాడే ఈ మందును నిషేధిస్తే ప్రత్యామ్నాయంగా రసాయన రహిత పురుగుమందులను (బయో ఫెస్టిసైడ్స్) ప్రోత్సహించాల్సి ఉంటుంది. పర్యావరణానికి వినాశకరంగా మారిన కార్బోసల్ఫాన్‌పై పడుతున్న ఈ ఎఫెక్ట్ వల్ల యూపీఎల్ వంటి ప్రముఖ అగ్రోకెమికల్ కంపెనీల మార్కెట్‌పై ప్రభావం పడనుంది. చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవడం మంచిది కాబట్టి విషపూరిత పురుగుమందుల స్థానే పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను త్వరితగతిన రైతులకు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
పర్యావరణ హిత జీవన సేద్యం
ఆధునిక సాంకేతికత సహాయంతో అటవీ విస్తీర్ణానికి, చెట్లను పరిరక్షించడానికి కృషి చేస్తోంది ఫార్మర్స్ ఫర్ ఫారెస్ట్స్ (ఎఫ్4ఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ. కృతికా రవిశంకర్ ఈ సంస్థ కో–ఫాండర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. వ్యవసాయం, ఆహారభద్రత, ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన రంగాలలో కృతికకు దశాబ్దకాల అనుభవం ఉంది. పుణే కేంద్రంగా పనిచేస్తున్న ఎఫ్4ఎఫ్... వాతావరణం, జీవవైవిధ్యం, గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరిచే జీవవైవిధ్య క్షేత్రాలు, అడవులను సృష్టించడం లక్ష్యాలుగా పనిచేస్తోంది.అద్భుత మార్పుకాలేజీ రోజుల్లో...రాలెగావ్ సిద్ధిలో అన్నాహజారే చేస్తున్న సామాజిక సేవకు సంబంధించిన విషయాలు వింటూ ఉండేది కృతిక. 25 సంవత్సరాల నిరంతర కృషితో నీటి పరీవాహక ప్రాంతాల నిర్వహణ, అటవీకరణ ద్వారా తన గ్రామం తలరాత మారేలా చేయగలిగారు హజారే.చెట్లు వాతావరణ పరిరక్షకులు. గాలిలోని కార్బన్‌ను గ్రహించడమే కాకుండా భూగర్భ జలాలు పెరిగేలా, నేల సారవంతం అయ్యేలా చేస్తాయి. నీటి మట్టాలు పెరగడంతో, పంటలకు ఎక్కువ నీరు, ఆవులకు ఎక్కువగా గ్రాసం దొరికింది. పంట దిగుబడులు, పాడి ఆదాయం పెరిగింది.ఒక గ్రామం పూర్తిగా మారిపోయింది!...ఇలాంటి విషయాలెన్నో విన్న కృతికా రవిశంకర్ పర్యావరణహిత మార్గం వైపు అడుగులు వేసింది.అసలైన బలం‘మార్పుతో ఏదైనా సాధ్యమే’ అనే మాట కాలేజీ రోజుల్లోనే కృతిక మదిలో బలంగా నాటుకుపోయింది.‘మనం ఆశించే ఫలితాలు వెంటనే రావు. చాలా ఓపిక కావాలి. ప్రకృతి చాలా సమయం తీసుకుంటుంది. ఈలోపు ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. తప్పులు జరుగుతూ ఉంటాయి. వాటిని దిద్దుకుంటూ ముందుకుసాగుతాం. ఇదొక నిరంతరప్రక్రియ’ ఎఫ్4ఎఫ్‌ను ఉద్దేశించి అంటుంది కృతిక.బీడుగా మారిన వ్యవసాయ భూములను జీవవైవిధ్యం గల భూములుగా మారుస్తోంది ఎఫ్4ఎఫ్. మొక్కలు నాటినందుకే కాకుండా వాటిని సంవత్సరాల తరబడి పోషించి కాపాడినందుకు ‘ఎఫ్4ఎఫ్’ ద్వారా రైతులకు ప్రతిఫలం కూడా లభిస్తుంది.‘మా అసలు సిసలు బలం ఆత్యాధునిక సాంకేతికత కాదు. రైతులు’ అంటుంది కృతిక రవిశంకర్. -
ఆరోగ్యాన్ని సాగు చేసే దిశగా...
భారత వ్యవసాయం దశాబ్దాలుగా ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించింది. ఆకలి నుంచి దేశాన్ని బయటకు తీసుకువచ్చింది. ఆహార ధాన్యాల కొరతతో బాధపడిన దేశాన్ని ఆహార భద్రత కలిగిన దేశంగా మార్చింది. ఇప్పుడు మన ముందున్న సవాలు మాత్రం భిన్నమైనది. ప్రజలకు తినడానికి ఆహారం ఉండటమే కాదు... వారు తింటున్న ఆహారం వారిని ఆరోగ్యంగా ఉంచుతున్నదా? అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన సమయం వచ్చింది.ఈ నేపథ్యంలో 2026 మే 11న భారత వైద్య పరిశోధనామండలి (ఐసీఎంఆర్), భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్) సంయుక్తంగా ప్రారంభించిన ‘సెహత్’ (సైన్స్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెల్త్ త్రూ అగ్రికల్చరల్ టాన్స్ఫర్మేషన్) ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యవసాయం, పోషకాహారం, ప్రజారోగ్యాన్ని ఒకే వేదిక పైకి తెచ్చి, వ్యవసాయ పరిశోధన ఫలితాలను నేరుగా ప్రజల ఆరోగ్య ఫలితాలతో అనుసంధానించడం దీని ప్రధాన లక్ష్యం. జీవ పోషక సమృద్ధి కలిగిన, పోషక విలువలు అధికంగా ఉన్న పంటలు; వైవిధ్యభరిత సమగ్ర వ్యవసాయ వ్యవస్థలు; రైతుల వృత్తిపర ఆరోగ్యం; మధుమేహం, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధుల నివారణ; ఒకే ఆరోగ్యం– ఇవీ దీని ఐదు ప్రధాన దిశలు.పరస్పర విరుద్ధ పరిస్థితిఇది భారతదేశానికి అవసరమైన విధాన మార్పు. ఒకవైపు పోషకాహార లోపం కొనసాగుతుండగా, మరోవైపు ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటివి పెరుగుతున్నాయి. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్) ప్రకారం,దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం 35.5 శాతం నుంచి 29.3 శాతానికి తగ్గడం ఆశాజనకం. కానీ తక్కువ బరువున్న పిల్లలు ఇప్పటికీ 31.8 శాతం ఉన్నారు. అదే సమయంలో 15–49 ఏళ్లమధ్య ఉన్న మహిళల్లో అధిక బరువు/ఊబకాయం జాతీయ స్థాయిలో 30.7 శాతానికి చేరింది. అంటే ఒకే సమాజంలో పోషకా హార లోపం, అధిక పోషణ రెండూ కనిపిస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సర్వే ప్రకారం 15–49 ఏళ్ల మహిళల్లో ఏకంగా 47.9 శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు; గత ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఇది 36.3 శాతం. పురుషుల్లోనూ ఇది 31.1 నుంచి 41.5 శాతానికి పెరిగింది. మహిళల్లో 21.8 శాతం, పురుషుల్లో 24.1 శాతం మంది అధిక రక్త చక్కెర స్థాయులు లేదా మధుమేహ మందుల వినియోగం ఉన్న వర్గంలోకి వస్తున్నారు. అదే సమయంలో పిల్లల్లో ఎదుగుదల లోపం 31.2 నుంచి 24.6 శాతానికి తగ్గడం మంచి పరిణామం.తెలంగాణలోనూ ఇదే చిత్రం దర్శనమిస్తోంది. ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం 33.1 శాతం నుంచి 27 శాతానికి తగ్గింది. కానీ 6–23 నెలల పిల్లల్లో సరిపడా ఆహారం అందుకుంటున్న వారు కేవలం 15.3 శాతమేమే. మరోవైపు మహిళల్లో 36.3 శాతం, పురుషుల్లో 35.5 శాతం అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. మహిళల్లో రక్తంలో అధిక చక్కెర ఉన్నవారు లేదా మధుమేహ మందుల వినియోగం చేయవలసిన స్థితిలో ఉన్నవారు 19.6 శాతం ఉండగా, పురుషుల్లో 24.5 శాతం మంది ఉన్నట్లుతేలింది. ఈ గణాంకాలు ఆరోగ్య సమస్యను కేవలం ఆసుపత్రిలో మాత్రమే పరిష్కరించలేమనీ, దానిలో ఒక భాగాన్ని పొలంలోనే పరిష్కరించాల్సి ఉంటుందనీ సందేశం ఇస్తున్నాయి.వైవిధ్యానికి ప్రాధాన్యంఇప్పటివరకు వ్యవసాయ రంగంలో సాధించిన విజయాన్ని ప్రధానంగా దిగుబడి, ఉత్పత్తి, ధర, రైతు ఆదాయం ఆధారంగా కొలిచాం. ఇకపై పోషక విలువ, ఆహార వైవిధ్యం, ఆహార భద్రత, ఆరోగ్య ఫలితాలు కూడా వ్యవసాయ ప్రణాళికలో భాగం కావాలి. బియ్యం, గోధుమలతో కేలరీల భద్రత సాధించాం. ఇప్పుడు పప్పులు, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, నూనెగింజలు, పాలు, గుడ్లు, చేపలు వంటి ఆహార వైవిధ్యానికి ప్రాధాన్యంపెంచాలి. తెలుగు రాష్ట్రాల్లో ఇందుకు అపారమైన అవకాశం ఉంది.ఆంధ్రప్రదేశ్‌కు ఉద్యానవన పంటలు, మత్స్యరంగం, చిరు ధాన్యాలు, పప్పుధాన్యాల్లో బలం ఉంది. తెలంగాణకు చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనెగింజలు, ఉద్యానవన పంటలు, పశుసంపద రంగాల్లో ప్రత్యేక సామర్థ్యం ఉంది. అధిక ఐరన్, జింక్ ఉన్న జీవపోషక సమృద్ధి పంటలు; మంచి మాంసకృత్తుల నాణ్యత కలిగిన పప్పుధాన్యాలు; రక్తంలో తక్కువ చక్కెర ప్రతిస్పందనకు అనుకూలమైన చిరుధాన్యాలు; యాంటీఆక్సిడెంట్లు, సూక్ష్మపోష కాలు సమృద్ధిగా ఉన్న పండ్లు, కూరగాయలు– ఇవన్నీ వ్యవసాయ పరిశోధన, విత్తన వ్యవస్థ, సాగు విస్తరణలో ప్రాధాన్యం పొందాలి. సెహత్ కూడా పోషక విలువలు అధికంగా ఉన్న, జీవపోషక సమృద్ధి పంటలను ప్రత్యేక ప్రాధాన్యంగా గుర్తించింది.రైతు ఆరోగ్యమూ ముఖ్యమే!అయితే రైతు ఆరోగ్యాన్ని మర్చిపోకూడదు. వ్యవసాయం ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడమే కాకుండా, ఆ ఆహా రాన్ని పండించే రైతు కూడా సురక్షితంగా ఉండాలి. పురుగుమందుల ప్రభావం, తీవ్రమైన వేడి, యంత్ర ప్రమాదాలు, జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు వంటి అంశాలను వ్యవసాయ విస్తరణలో భాగం చేయాలి. ఇదే సెహత్లో వృత్తిపర ఆరోగ్యం, ఏక ఆరోగ్యానికి ఇచ్చిన ప్రాధాన్యం వెనుక ఉన్న భావన.ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాల యాలు, వైద్య కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీలు కలిసి పనిచేసే కొత్త నమూనా అవసరం. ఒక జిల్లాలోఏ పోషకాహార లోపం లేదా అసాంక్రమిక వ్యాధులు ఎక్కువగా ఉన్నాయో ఆరోగ్య శాఖ గుర్తిస్తే... ఆ అవసరానికి తగిన పంటలు, వ్యవసాయ వ్యవస్థలు, ఇంటి తోటలు, పోషకాహార తోటలు,జీవ పోషక సమృద్ధి రకాలను వ్యవసాయ వ్యవస్థ ప్రోత్సహించ వచ్చు. జిల్లా ఆరోగ్య స్థితి వివరాలకు జిల్లా వ్యవసాయ ప్రణాళిక స్పందించాలి. అలాగే ప్రభుత్వ సేకరణ విధానం కూడా మారాలి. పాఠశాల మధ్యాహ్న భోజనం, అంగన్ వాడీలు, వసతి గృహాలు, ఆసుపత్రుల ఆహారంలో స్థానిక పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు వంటి వాటికి స్థిరమైన డిమాండ్ సృష్టిస్తే ఒకేసారి రైతుకు మార్కెట్, పిల్లలకు పోషణ లభిస్తాయి.ఇప్పటి వరకు మనం ఆహార భద్రత గురించి మాట్లాడాం.ఇక ఆరోగ్య భద్రత దిశగా అడుగు వేయాలి. మన వ్యవసాయశాస్త్రం ఒకప్పుడు ఆకలిని జయించింది. ఇప్పుడు మధుమేహం, ఊబకాయం, సూక్ష్మపోషక లోపాలు, ఆహార సంబంధిత వ్యాధులతో పోరాడటంలో కూడా తన పాత్రను విస్తరించాలి. ఆసుపత్రులు అనారోగ్యానికి చికిత్స చేస్తాయి. కానీ ఆరోగ్యకరమైన వ్యవసాయం ఆ అనారోగ్యాన్నే రాకుండా చేయగలదు. సెహత్ ఇచ్చే అసలైన సందేశం ఇదే. పొలం నుంచి పళ్లెం వరకు మాత్రమే కాదు; పళ్లెం నుంచి ప్రజారోగ్యం వరకూ వ్యవసాయ పాత్ర ఉందనిగుర్తించి ఆ దిశగా అడుగులు వేయాలి.-వ్యాసకర్త ఐకార్–అటారి, హైదరాబాద్ డైరెక్టర్-డా‘‘ షేక్ ఎన్. మీరా -
కోలజెమ్మెడు.. పంటగా మారితే.. మెట్ట రైతులకు కొత్త ఆదాయ మార్గం!
Name: Columnar Cactusశాస్త్రీయ నామం: సెరెస్ ప్టెరొ గోనస్Scientific Name: Cereus pterogonus LemSynonym (s) : Cereus repandus (L.) Mill. కుటుంబం: క్యాక్టేసిFamily: Cactaceaeకోలజెమ్మెడు పండును వేర్వేరు భాషల్లో ఏమని పిలుస్తారంటే.. ఇంగ్లీష్: సెంటి నేల్ క్యాక్టస్, డాగ్ టేల్ క్యాక్టస్, హెడ్జ్ క్యాక్టస్ తమిళం: సిప్పాల్ కథలై;మలయాళం: పుచ్చముళ్ళు;బెంగాలీ: మానస తెలుగు: కోలజెమ్మెడు, జెమ్మడు, నిటారు జెమ్మెడు.వేరే భాషల్లో దీనికి గుర్తింపు తక్కువ. గ్రామాల్లో ఉండే జెమ్మెడు రకాలలో కోలజెమ్మెడు ఒకటి. ఊర్లలో చాలామందికి తెలిసిన చెట్టు. ఈ జెమ్మెడులో కూడా డ్రాగన్ ఫ్రూట్ మాదిరిగా మే నుంచి నవంబర్ మాసం వరకు అంచెలంచెలుగా పూత–కాత వస్తుంది. దీన్ని నైట్ బ్లూమింగ్ సెరెస్ అని కూడ అంటారు. దీనిలో దాదాపు 33 జాతులు ఉన్నాయని అంచనా.ఉనికి:ఇవి మెట్ట ప్రాంత మైదానాలు, అడవుల్లో ఎక్కువగా పెరుగుతాయి. నిటారుగా గుంపులుగా పెరుగుతాయి. దాదాపు 3–6 మీటర్ల ఎత్తువరకు పెరగగలవు. వీటికి కణుపులు ఉంటాయి. వీటి ఉనికి ఎక్కువగా ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణమండలపు ప్రాంతాల్లో ఉంది. దీనికి డ్రాగన్ పండు చెట్టుకు అతిదగ్గరి పోలిక ఉంది. దీనికి ముళ్లతో కూడుకున్న ఆరు నుంచి ఎనిమిది భుజాలు ఉంటాయి. వీటి స్వస్థలం, బ్రెజిల్, ఊరుగామ్, అర్జెంటీనా. వీటి ఉనికి దక్షిణ అమెరికా, ఇండియా, చైనా, శ్రీలంక, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా ఉంది. ఇండియాలో చాలా రాష్ట్రాలలో వీటి ఉనికి ఉంది. నల్లమల అడవులతో పాటు మైదానపు ప్రాంతాలు, పొలం గట్లు తదితర చోట్ల పెరుగుతుంది. ఈ చెట్లు వాతావరణ మార్పులను తట్టుకోగలవు.పోషక ఔషధ నిధులుకోలజెమ్మెడు చెట్లను పొలం చుట్టూ జీవ కంచెగా పెంచుతారు. వీటిని అందం కోసం కుండీలలో పెంచుకోవచ్చు. పండ్లను తింటారు, చప్పటి రుచి ఉంటాయి. కాని నల్లమల అడవుల్లో ఈ పండ్లను జనం తినరు. ఈ పండ్లు డ్రాగన్ ఫ్రూట్‌ని పోలిన రంగులో ఉంటాయి. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. ఇతర దేశాల్లో ప్రజలు ఈ పండ్లను బాగా ఇష్టపడతారు. ఇవి అన్నికాలాల్లో వాతావరణ మార్పులను తట్టుకొని నిలువగలవు. తక్కువ నీరు మాత్రమే ఈ చెట్లకు అవసరం.సమగ్ర పరిశోధనలు జరిపి, పంట పొలాలకు తేగల్గితే, మెట్ట రైతులకు ఎంతో లాభసాటిగా ఉంటుంది. దీనికి మంచి ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా ఛాతి నొప్పి, మూత్ర సంబంధిత సమస్యలను నయం చేయటానికి వాడతారు. కోలాజెమ్మెడు జన్యువులను ఉపయోగించుకొని డ్రాగన్ ఫ్రూట్, కొలజెమ్ముడు కొత్తరకాలను తీసుకువస్తే వాటిని బంజరు భూముల్లో కూడా సాగు చేయవచ్చు. కాబట్టి ఈ జీవ వైవిధ్యాన్ని పరిశోధకులు, ఇతరులు ప్రయోగాలకు ఊతమిస్తే, ఈ క్యాక్టేసి కుటుంబంలో ఒక కొత్త ఒరవడి వెలుగు చూడగలదు. డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే పోషకాలు ఇందులో కూడా ఉంటాయి. వీటిపైన అధ్యయనం ఎంతో అవసరం. పోషక విలువల్లో డ్రాగన్ ఫ్రూట్ కు తీసిపోని పండు కోలజెమ్మెడు. టీఎస్ఎస్ కూడా డ్రాగన్ ఫ్రూట్లో ఉన్నంత స్థాయిలో ఉంది.- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
‘పెండింగ్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వెంటనే మంజూరు చేయాలి’
సాక్షి,వైఎస్సార్: జిల్లాలో నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను రైతులకు వెంటనే మంజూరు చేయాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాలో విద్యుత్ పరికరాల కొరత, పెండింగ్ కనెక్షన్ల సమస్యపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు ఎంపీ లేఖ రాశారు. అనంతరం వారితో ఫోన్లో మాట్లాడి జిల్లాలోని పరిస్థితులను వివరించారు. గత రెండేళ్లుగా జిల్లాలో రైతులకు కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో వారు సాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,800 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు నెలల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోయాయని ఆయన వెల్లడించారు.కనెక్షన్ల మంజూరుకు ప్రధాన అవరోధంగా మారిన విద్యుత్ పరికరాల కొరతను అధిగమించాలని ఆయన కోరారు.పెండింగ్ కనెక్షన్లను క్లియర్ చేయడానికి అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, కండక్టర్లను వెంటనే విడుదల చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ యాజమాన్యానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
అన్నదాతకు ఆర్థిక స్వాతంత్ర్యం రావాలంటే..
భారతీయ వ్యవసాయ రంగంలో రైతు కేవలం ఉత్పత్తిదారుడు మాత్రమే కాదు, ఒక ‘వ్యవసాయ పారిశ్రామికవేత్త’గా మారినప్పుడే నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం లభిస్తుంది. సాంప్రదాయ పద్ధతుల్లో పంటలు పండించడంతో పాటు శాస్త్రీయ ఆర్థిక నిర్వహణ, పంటల వైవిధ్యం, ప్రభుత్వ పథకాల సద్వినియోగం ద్వారా మాత్రమే వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా మలచవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.రైతుల కోసం కొన్ని ప్రభుత్వ ఆర్థిక పథకాలురైతులు తమ పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవడానికి, భద్రత పొందడానికి కింది పథకాలను వినియోగించుకోవాలి.పీఎం-కిసాన్: భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6,000 మూడు విడతల్లో పెట్టుబడి సహాయంగా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. (రాష్ట్ర ప్రభుత్వాల ప్లాన్ల ద్వారా అదనపు సాయం అందుబాటులో ఉంటుంది).కిసాన్ క్రెడిట్ కార్డ్: బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకే (నగదు రహిత సబ్సిడీతో కలిపి 4 శాతానికే) పంట రుణాలు పొందే వెసులుబాటు.ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన: ప్రకృతి వైపరీత్యాలు, పురుగుల తాకిడి వల్ల పంట నష్టం వాటిల్లినప్పుడు కనీస ప్రీమియం (ఖరీఫ్ 2%, రబీ 1.5%) చెల్లించి పూర్తి ఆర్థిక రక్షణ పొందవచ్చు.పీఎం కుసుమ్: సోలార్ పంప్సెట్ల ఏర్పాటుకు 60 శాతం వరకు సబ్సిడీ పొందడం ద్వారా విద్యుత్తు ఖర్చులను పూర్తిగా తగ్గించుకోవచ్చు.రైతు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సూత్రాలుపంటల డిజిటల్ బుక్వ్యవసాయం నష్టపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎక్కడ దారి మళ్లుతుందో లెక్క లేకపోవడం. సాధారణ డైరీ రాయడం కంటే ఫార్మ్చేంజ్, అగ్రీకాంబస్ లేదా ఉచిత ఖాతాబుక్/డిజిటల్ రిజిస్టర్ యాప్‌లను ఉపయోగించాలి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ట్రాక్టర్ డీజిల్, రోజువారీ కూలీల ఖర్చులను ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేయాలి.పంట చివరిలో ఏ రసాయనం, ఏ పని వల్ల ఎంత లాభం వచ్చిందో స్పష్టత వస్తుంది. అనవసర పురుగుమందుల ఖర్చులను 20-30% వరకు తగ్గించుకోవచ్చు.వ్యవసాయ అత్యవసర నిధివాతావరణ మార్పులు, అకాల వర్షాలు లేదా ధరల పతనం వంటి ఆకస్మిక నష్టాల నుంచి రైతును కాపాడే రక్షణ కవచం ఇది. ప్రతి పంట అమ్మకం ద్వారా వచ్చే నికర ఆదాయంలో కనీసం 10-15% నిధిని వేరు చేయాలి. ఈ డబ్బును ఇంట్లో ఉంచకుండా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా బ్యాంకులో ‘స్వీప్-ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్’ రూపంలో పెట్టాలి. దీనివల్ల సాధారణ సేవింగ్స్ ఖాతా కంటే ఎక్కువ వడ్డీ రావడమే కాకుండా అత్యవసర సమయంలో వెంటనే విత్‌డ్రా చేసుకోవచ్చు. పంట నష్టపోయినప్పుడు మళ్లీ విత్తనాలు/ఎరువుల కొనుగోలు కోసం వడ్డీ వ్యాపారుల వద్ద 24-36% ఎక్కువ వడ్డీకి అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు.రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్‌పీఓ)ఒంటరిగా పోరాడే రైతు కంటే 100 మంది రైతులు ఒక సమూహంగా ఏర్పడితే మార్కెట్లో బేరమాడే శక్తి పెరుగుతుంది. ఎఫ్‌పీఓ ద్వారా విత్తనాలు, ఎరువులు, యంత్రాలను హోల్‌సేల్ ధరలకు నేరుగా కంపెనీల నుంచే కొనుగోలు చేయడం వల్ల ఇన్పుట్ ఖర్చులు 15-20% తగ్గుతాయి. పంటను నేరుగా కమీషన్ దారులకు అమ్మకుండా ఎఫ్‌పీఓ ద్వారా గ్రేడింగ్, ప్రాసెసింగ్ (ఉదాహరణకు: కందిపప్పుగా మార్చడం, నూనె తీయడం), ప్యాకింగ్ చేసి రిటైల్ మార్కెట్‌కు లేదా సూపర్ మార్కెట్లకు అమ్మాలి. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లైన ‘ఈ-నామ్’ ద్వారా దేశంలో ఎక్కడ మంచి ధర ఉంటే అక్కడ అమ్ముకునే వీలుంటుంది.సమగ్ర బీమా రక్షణతీవ్రమైన అనారోగ్యం లేదా ఊహించని పంట నష్టం మొత్తం కుటుంబ ఆర్థిక పరిస్థితులను మార్చేస్తుంది. కాబట్టి మెరుగైన బీమా రక్షణ అత్యవసరం.పంట బీమా.. వాతావరణ ఆధారిత పంట బీమాను కేవలం రుణం తీసుకునేటప్పుడే కాకుండా ప్రతి సీజన్ గడువు ముగిసేలోగా ప్రీమియం చెల్లించి నమోదు చేసుకోవాలి. స్థానిక వ్యవసాయ అధికారి ద్వారా నష్ట పరిహార నమోదు విధానంపై స్పష్టత ఉండాలి.ఆరోగ్య బీమా.. ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భారత్ లేదా ఆరోగ్యశ్రీ కార్డులు ప్రతి రైతు కుటుంబానికి తప్పనిసరి. ఇవి కాకుండా రూ.3,000-రూ.5,000 ప్రీమియంతో అదనపు కుటుంబ ఆరోగ్య బీమా తీసుకోవడం వల్ల ఆసుపత్రి ఖర్చుల కోసం పొలం అమ్మాల్సిన పరిస్థితి రాదు.వ్యక్తిగత ప్రమాద బీమా.. పీఎం సురక్ష బీమా యోజన ద్వారా కేవలం రూ.20లకే లభించే ప్రమాద బీమాను ప్రతి రైతు పొంది ఉండాలి.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. -
సాగునీరు ఇచ్చే సన్నద్ధత లేదా?
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల నదుల్లో నీటి నిల్వలు పడి పోయాయనీ, అందువల్ల కృష్ణా డెల్లాకు సాగునీరు ఇవ్వలేమనీ జూలై 24న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రకటించింది. వరి పంట వేయ వద్దనీ, వరి పంట వేస్తే తర్వాత నీరు లేక నష్టపోయేది రైతులేననీ హెచ్చరిక జారీ చేశారు మంత్రిపుంగవులు. ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షాభావంతో పాటు కరవు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు ఖరీఫ్‌కు చాలాముందే ప్రకటించారు. శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. కాని చంద్రబాబు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోలేదు.జూన్– జూలై నెలల మధ్య సాగు నీరు విడుదల విషయంలో కూటమి ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చింది. జూన్ నెలలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగు నీరు విడుదల తేదీలను కూటమి మంత్రులు ప్రకటించారు. మంత్రుల ప్రకటనతో అప్పులు చేసి సేద్యానికి కావాల్సిన వనరులను రైతులు సమకూర్చుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ నినో ప్రభావం వల్ల ఇప్పుడు సాగు నీరు ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పడం వల్ల రైతాంగం తీవ్రమైన మనోవేదనకు గురౌతున్నారు.జల వనరుల వ్యవస్థ తాజా గణాంకాల ప్రకారం ప్రకాశం బ్యారేజి నీటి నిల్వ 2.978 టీఎమ్సీలు కాగా, పూర్తి నీటి మట్టం 3.071 టీఎమ్సీలు. 96.97% నీటి నిల్వ ఉన్నందువల్ల సాగు నీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం లేదని నిపుణులు చెబుతున్నారు. పులిచింతలలో ప్రస్తుతం 29.039 టీఎమ్సీల నీరు ఉంది. మరి కూటమి ప్రభుత్వం సాగునీరు ఎందుకు విడుదల చేయడం లేదు?కృష్ణా డెల్టాలో ప్రధాన సేద్యం వరి. అలాంటి వరి సేద్యం చేయవద్దంటే, రైతులు ఖరీఫ్ సేద్యానికి దూరం కావడమే కదా! ప్రకాశం బ్యారేజి కుడి, ఎడమ కాల్వలకు సాగునీరు విడుదల చేయకపోతే ఆ పంటల సేద్యం సాధ్యం కాదు. చెరువులు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకుని, పూడికలు తీసి నీటితో వాటిని నింపి ఉంటే, వాటి ద్వారా నీరు లభించేది. ఇది పాలకుల వైఫల్యం కాదా?రాష్ట్రంలోని 608 మండలాల్లో 250 మండలాలు తీవ్ర కరువు మండలాలుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో కరవును ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. కరవు మండలాల్లో గ్రామీణ ఉపాధి హామీ పనులను 250 రోజులకు పెంచి గ్రామీణ పేద కుటుంబాలకు పనులు కల్పించాలి. ఆ పనుల వేతనం పెంచాలి. రైతాంగానికి కావాల్సిన ఎరువులు, విత్తనాలను చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా ఇవ్వాలి. వారు తీసుకున్న పంట రుణాలు రద్దు చేయాలి. తాగు నీటి సమస్య లేకుండా చూడాలి. ఈ డిమాండ్ల సాధన కోసం రైతాంగం, ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలి.- బొల్లిముంత సాంబశివరావు, వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్), రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు -
పురుగుమందులు విఫలం.. పంట మార్పిడి సఫలం!
పంటలను వ్యాధులు, తెగుళ్ల నుంచి కాపాడుకోవటానికి నేడు చాలా మంది రైతులు క్రిమిసంహారక రసాయనాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే, మితిమీరిన రసాయనాల వాడకం అనుకున్న ఫలితాలను ఇవ్వకపోగా, రైతులపై పెట్టుబడి భారాన్ని విపరీతంగా పెంచుతోంది. ఒడిశాలోని సినాపాలి బ్లాక్ బార్గావ్ గ్రామానికి చెందిన రైతు మురళీధర్ నాయక్ అనుభవాలే దీనికి స్పష్టమైన నిదర్శనం. ఈ రైతు అనుభవాన్ని ప్రాతిపదికగా చేసుకొని, ప్రస్తుత వ్యవసాయంలో క్రిమిసంహారక మందుల పరిమితులు, పంట మార్పిడి ప్రాముఖ్యతను వివరించే కథనం.మురళీధర్ తన 2.5 ఎకరాల పొలంలో బిందు సేద్యం (డ్రిప్), సోలార్ పంప్, ప్లాస్టిక్ మల్చింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో టొమాటోలు, వంకాయలు, పుచ్చకాయలను ఏక పంటలుగా సాగు చేస్తున్నారు. కానీ, ఇటీవలి భారీ వర్షాలు, నీటి పారుదల సమస్యల కారణంగా ఆయన టొమాటో పంటకు ‘ఎండు తెగులు’ సోకింది. పంటను కాపాడుకోవటానికి వేల రూపాయలు వెచ్చించి ఎంతగా క్రిమిసంహారక మందులు పిచికారీ చేసినా తెగులు అదుపులోకి రాలేదు.పంట మార్పిడే శాశ్వత పరిష్కారంఈ రసాయన వ్యర్థాల చక్రబంధం నుంచి బయటపడటానికి ‘పంట మార్పిడి’ ఒక్కటే సరైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఒకే భూమిలో ప్రతి సీజన్లో లేదా ప్రతి ఏటా వేర్వేరు కుటుంబాలకు చెందిన పంటలను మార్చి మార్చి సాగు చేయటం వల్ల తెగుళ్ల జీవచక్రం తెగిపోతుంది. ఉదాహరణకు: పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, ఆకుకూరలు. దీనివల్ల నేలలో వ్యాధికారక క్రిముల ఉనికి తగ్గి, మట్టి సారవంతమవుతుంది.జైవిక సమతుల్యతే కీలకండ్రిప్ ఇరిగేషన్, ప్లాస్టిక్ మల్చింగ్ వంటి సాంకేతికతలు నీటిని, శ్రమను ఆదా చేయగలవు. కానీ నేలలో జీవ సంబంధమైన సమతుల్యతను పునరుద్ధరించలేవు. పంటకు తెగులు రాగానే రసాయనిక పురుగు మందుల వాడటం వల్ల ఖర్చు పెరగటమే తప్ప పంట దిగుబడి పెరగదు. సాంకేతికతతో పాటు నేల స్వభావానికి అనుగుణంగా ‘పంట మార్పిడి’ పద్ధతిని పాటించటమే రైతుల ఆర్థిక భద్రతకు, సుస్థిర దిగుబడులకు అసలైన మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఇవీ ప్రధాన పంట కుటుంబాలుతెగుళ్ల చక్రాన్ని తెగ్గొట్టి వాటి తీవ్రతను తగ్టించటానికి, భూసారాన్ని పరిరక్షించటానికి వేర్వేరు కుటుంబాలకు చెందిన పంటలను మార్చి మార్చి సాగు చేయాలి. ప్రధాన పంట కుటుంబాలు, వాటి ఉదాహరణలు...పప్పుధాన్యాలు (లెగ్యుమినేసి / ఫాబేసే): పెసర, మినుము, కంది, బఠాణీలు, శనగలు, వేరుశనగ తదితర పప్పుధాన్యాలు. ఇవి నేలలో నత్రజనిని స్థిరీకరించి భూసారాన్ని పెంచుతాయి.ధాన్యపు పంటలు (గ్రామినేసి / పోయేసే): వరి, గోధుమ, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి తదితరాలు.బంగాళదుంప కుటుంబం (సోలనేసే): టొమాటో, వంగ, మిరప, బంగాళదుంప తదితరాలు.ఆవాలు/ క్యాబేజీ కుటుంబం (బ్రాసికేసే / క్రసిఫెరే): క్యాబేజీ, కాలీఫ్లవర్, ముల్లంగి, ఆవాలు, బ్రోకలీ తదితరాలు.తీగజాతి కూరగాయలు (కుకుర్బిటేసే): గుమ్మడి, దోస, కాకర, సొరకాయ, కీర తదితరాలు.క్యారెట్ కుటుంబం (అంబెలిఫెరే / అపిసే): క్యారెట్, కొత్తిమీర తదితరాలు.ఈ విధంగా ఒక కుటుంబానికి చెందిన పంట తర్వాత వేరే కుటుంబానికి చెందిన పంటను వేయటం వల్ల ఒకే రకమైన తెగుళ్లు లేదా పురుగులు ఆశించకుండా వాటి జీవచక్రం తెగిపోతుంది.రసాయనాలకు లొంగని తెగుళ్లు: అసలు కారణం ఏమిటి?ఉద్యానవన శాఖ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టొమాటోలు, వంకాయలు, బంగాళాదుంపలు, మిరప కాయలు వంటివి ఒకే ‘సోలనేసి’ అనే వృక్ష కుటుంబానికి చెందిన పంటలు. ఒకే పొలంలో వరుసగా ఒకే కుటుంబానికి చెందిన పంటలను సాగు చేయటం వల్ల ఆ నేలలో వ్యాధికారక శిలీంధ్రాలు, బాక్టీరియాల తీవ్రత భారీగా పెరిగిపోతుంది. ఒకసారి నేల ద్వారా సంభవించే ఎండు తెగులు తీవ్రత పెరిగితే, ఎలాంటి క్రిమిసంహారక రసాయనాలు చల్లినా పెద్దగా ప్రయోజనం ఉండదు. -
మన వ్యవసాయ విధానాలకు పరీక్ష
ఎల్ నినో కేవలం ఏదో ఒక పరిణామం కాదు. అది భూగోళం మొత్తంమీద వాతావరణ మార్పు వైపరీత్యానికి సంకేతం. పరస్పరాధారిత జీవావరణ వ్యవస్థలకు, వ్యవసాయ రంగానికి, ఆహార భద్రతకు ఎదురవుతున్న సవాళ్ళను గుర్తు చేస్తున్న ప్రమాదఘంటిక. ఈ రకమైన ఉపద్రవం తరచు తలెత్తుతున్నా దాని దీర్ఘకాలిక పర్యవసానాలను ఎదుర్కోవడంలో భారతదేశ సన్నద్ధత అసమతుల్యంగానే ఉంది. ఎల్ నినో ప్రభావాలను రైతులకు ఎరుక పరచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత కృషి చేస్తున్న మాట వాస్తవమే. అయితే, వ్యవసాయ ఉత్పత్తి చుట్టూ అలముకుంటున్న అస్థిరత, పంటల తీరుతెన్నులపై పెరిగిపోతున్న ఒత్తిడిపై మరింతగా దృష్టి సారించవలసిన అవసరం ఉంది. అనిశ్చితిలోనూ స్థిరమైన పనితీరుఈ నేపథ్యంలో, వ్యవసాయ స్థితిస్థాపకత విధానపరంగా ఒక ముఖ్యమైన ప్రాధాన్యతను సంతరించుకోవాలి. పంట నష్టాలను తగ్గించుకోవడం మాత్రమే స్థితిస్థాపకత అనిపించుకోదు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ, సాపేక్షంగా చూస్తే స్థిరమైన పనితీరు కనబరచగల వ్యవసాయ పద్ధతులను రూపొందించుకోవాలి. దీర్ఘకాలిక స్థితిస్థాపక శక్తిని సమకూర్చుకునేందుకు మౌలిక వసతులు, టెక్నాలజీ, జల నిర్వహణ, ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగల వంగడాలను అభివృద్ధి చేయడం, పరిశోధనలపై పెట్టుబడులు అవసరమవుతాయి. వాతావరణ అశనిపాతాల పట్ల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తు న్నాయన్నది ఒక పార్శ్వం మాత్రమే. అటువంటి షాక్‌లు ఎదురవ డానికి ముందే ప్రభుత్వ సంస్థలు రైతులను ఎంత పకడ్బందీగా సన్నద్ధపరుస్తున్నాయన్నది కీలక ప్రశ్న. పంట మార్పిడిలను ప్రోత్సహించడంలో ప్రభుత్వాల ప్రయత్నాలు ఎంతవరకు సఫల మవుతున్నాయి? ప్రత్యామ్నాయ పంటలు, వాటిని నాటవలసిన కాల పరిధులు, రిస్క్–మేనేజ్మెంట్ వ్యూహాల గురించి రైతులకు సలహాలిచ్చేందుకు తగినంత సామగ్రి దిగువ స్థాయి వ్యవసాయ వ్యవస్థల వద్ద ఉంటోందా? పంటలకు నష్టాలు వాటిల్లినప్పుడు పరిహారం, బీమా, ఇతర సహాయక యంత్రాంగాలు దెబ్బతిన్న రైతుల ముంగిళ్ళకు ఎంత వేగంగా చేరుకోగలుగుతున్నాయి? కేవలం అధిక దిగుబడులను సాధించడంపైనే కాకుండా, వాస్తవిక పరిస్థితులలో స్థిరమైన పనితీరును నిలబెట్టుకోగలగడంపైనే భారత వ్యవసాయ రంగ భవిష్యత్తు ఆధారపడి ఉంది. దేశంలో కర్షకులు సుమారుగా 11.88 కోట్ల మంది ఉన్నారని, వ్యవసాయ కూలీలు 14.43 కోట్ల మేరకు ఉంటారని 2011 నాటి జనాభా లెక్కల వివరాలు వెల్లడిస్తున్నాయి. వాతావరణ వైపరీత్యాల ప్రభావం పంట పొలాలకే పరిమితం కాదనీ, అవి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆహార భద్రత, విస్తృత గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయనీ గుర్తుంచుకోవాలి. సాంకేతిక సాయంభారత వ్యవసాయ రంగం ప్రధానంగా రుతువుల మార్పులపై ఆధారపడి నడుస్తోంది. వాతావరణానికి సంబంధించి తగినంత సమాచారం లేకుండా నారుపోయడం లేదా ఇతర సేద్య కార్యకలా పాలు చేపట్టడంలో ఇబ్బందులున్నాయి. తీరా అవి చేపట్టాక వర్ష పాత ధోరణుల్లో మార్పులొస్తే, రైతులు ఆర్థికంగా నష్టపోతారు. వ్యవసాయ రంగానికి సంబంధించి పైకి అంతగా కనిపించని దుర్భ లత్వాలలో ఇది ఒకటి. పంటలు దెబ్బతిన్నప్పుడు వచ్చే నష్టాలే కాకుండా, అనువుకాని సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా రైతులు నష్టపోయే అవకాశం ఉంది. వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న ఈ సమస్య ఒక పూర్తి స్థాయి సంక్షోభంగా పరిణమించకముందే, ఆ ముప్పు ఏర్పడగల అవకాశాన్ని గుర్తించడంలో ప్రవర్ధమాన టెక్నాలజీలు ముఖ్యంగా ఉపగ్రహ ఆధారిత భూ పరిశీలనలు తోడ్పడుతున్నాయి. దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు తరిగిపోతున్న వృక్ష సంపద ఆరోగ్యాన్ని గుర్తించడంలో, విస్తారమైన వ్యావసాయిక ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గుదల వంటివాటిని గుర్తించడంలో ఉపగ్రహ పరిశీ లనలు సహాయపడతాయి. కనుక, ఎల్ నినో విసురుతున్న సవాల్‌ను ఎదురు దెబ్బగా చూడనవసరం లేదు. భారతీయ వ్యవసాయ వ్యవస్థలను పటిష్టపరచుకునేందుకు లభించిన ఒక అవకాశంగా దీన్ని పరిగణించవచ్చు. అనిశ్చిత పరిస్థితుల్లో ఏ పంటలు పండించగలుగుతున్నాం, దానికి ఏ విధమైన సేద్యపు విధానాలు అనుసరిస్తున్నాం, సంస్థా పరమైన స్పందనల మెరుగుదల వంటి అంశాలకు సంబంధించి విలువైన పరిజ్ఞానాన్ని ప్రతి క్లిష్టమైన వ్యవసాయ సీజన్ నుంచి గ్రహించవచ్చు. వాతావరణంలో మార్పు గురించిన సాధారణ హెచ్చరికలు చేస్తే రైతులకు సరిపోదు. పరిస్థితిని బట్టి వివిధ పంటలు వేసుకోగల వెసులుబాటు కల్పించాలి. ప్రత్యామ్నాయ ఉపకరణాలు, వంగడాలను అందుబాటులోకి తేవాలి. సమర్థ పంట బీమా అవసరం. అస్థిర పరిస్థితులను తట్టుకోగలిగిన విధంగా సంస్థాపరమైన మద్దతును కూడా అందించాలి.ప్రపంచమంతటా పెను ప్రభావమే!ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తిపైన కూడా వాతావరణ వ్యత్యాస ప్రభావం పెరుగుతూ వస్తోందని 2026 ఆగస్టు 6న ప్రచురించిన గ్లోబల్ క్రాప్ మానిటర్ నివేదిక వెల్లడించింది. అది నాలుగు ప్రధాన (గోదుమ, మొక్కజొన్న, వరి, సోయాబీన్) పంటల స్థితిగతులను మదింపు చేసింది. సాపేక్షంగా చూస్తే గోదుమకు సానుకూల పరిస్థితులున్నాయని ఆ నివేదిక తెలిపింది. బియ్యానికి పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. వరి రైతులు వాతావరణ ప్రతికూలత, నీటి సౌలభ్యం తక్కువగా ఉండటం, పంటకు చీడపీడలు సోకడంతో పాటు, దిగుబడులకు సంబంధించి ఇతర ప్రతిబంధకాలను కూడా ఎదుర్కొంటున్నారు. భారత్ విషయంలో దీని ప్రధాన సందేశం ముఖ్యమైంది. వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేని పరిస్థితులు పెరుగు తున్నాయి. వాటిని తట్టుకుని నిలబడగలిగిన విధంగా పంటలు రూపొందాలి. వ్యవసాయ విధానాలు వేగంగా మారిపోతున్న రిస్కు లకు తగ్గట్లుగా స్పందించగలిగిన సామర్థ్యం ఉన్నవై ఉండాలి. మరింత ఆహారాన్ని ఉత్పత్తి చేయడం మాత్రమే భారత వ్యవసాయ రంగ భవిష్యత్తు కాదు. అది మెరుగైన సమాచారంతో మెరుగైన నిర్ణయాలు తీసుకోగలిగినదిగా ఉండాలి. క్షేత్ర స్థాయిలో మారుతున్న పరిస్థితులను అవగాహన చేసుకుని, ఎదురుకాగల ముప్పులను ఊహించగలిగినప్పుడే ప్రభుత్వాలు స్థితిస్థాపక శక్తి కలిగిన వ్యవసాయ వ్యవస్థలను నిర్మించగలుగుతాయి. అప్పుడే ఎల్ నినోను అడపాదడపా తలెత్తే వాతావరణ భూతంగా కాక దేశ వ్యవసాయ పాలనకు ఒక పరీక్షగా చూడటం సాధ్యపడుతుంది.– డా‘‘ సుంకరి సత్యం ‘ అసిస్టెంట్ ప్రొఫెసర్;– కంచర్ల శ్రీదేవి ‘ రిసెర్చ్ స్కాలర్; కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్, హైదరాబాద్ -
తెలంగాణ వ్యవసాయ రంగంలో 52.26 శాతం మహిళలు
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) 2025 నివేదిక ప్రకారం తెలంగాణలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మొత్తం శ్రామిక శక్తిలో మహిళల వాటా 52.26 శాతంగా ఉందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. వ్యవసాయ గణన 2015–16 నివేదిక ప్రకారం తెలంగాణలో మహిళల పేరిట ఉన్న భూకమతాలు 23.00 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో వ్యవసాయంలో మహిళా శ్రామిక శక్తి 59.81 శాతం కాగా, భూ యాజమాన్యం 13.96 శాతంగా ఉందన్నారు. -
అనుబంధ వ్యవసాయమే జీవధార
ఈ రోజుల్లో రైతు వ్యవసాయం చేయడం ఒక్కటే సరిపోవడం లేదు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరుగుతుండగాపంటల ధరలు మాత్రం ఎప్పుడూ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. కొన్ని సంవత్సరాల్లో వర్షాభావం, మరికొన్ని సంవత్సరాల్లో అధిక వర్షాలు, తెగుళ్లు రైతును నష్టాలకు గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం రావాలంటే వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయ మార్గాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఇదే భావనతో శాస్త్రవేత్తలు, ప్రభుత్వం, వ్యవ సాయ విశ్వవిద్యాలయాలు ‘ద్వితీయ వ్యవసాయం’ (సెకండరీ అగ్రికల్చర్) అనే భావనను ప్రోత్సహిస్తున్నాయి.పంటను పండించడం ప్రాథమిక వ్యవసాయం. ఆ పంటను ప్రాసెసింగ్ చేయడం, విలువను పెంచడం, ప్యాకింగ్ చేయడం, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి కొత్త ఉత్పత్తులను తయారు చేయడం, పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను ద్వితీయ వ్యవసాయం అంటారు. ‘పంటను మాత్రమే అమ్మకుండా, పంటతో పాటు మరిన్ని ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పెంచుకోవ డమే ద్వితీయ వ్యవసాయం’.విలువ జోడించండి–ఎక్కువ ధరను పొందండిచాలా మంది రైతులు పంట కోసిన వెంటనే మార్కెట్‌కు తీసు కెళ్లి అమ్మేస్తారు; అప్పుడు ధర తక్కువగా ఉంటుంది. అదే పంటను ప్రాసెసింగ్ చేసి అమ్మితే మంచి లాభం వస్తుంది. వరిని బియ్యంగా మార్చడం, బియ్యంతో అటుకులు, మరమరాలు తయారు చేయడం, వేరుశనగతో నూనె, పీనట్ బటర్ తయారు చేయడం, మిరపతో మిరప పొడి తయారు చేయడం, పసుపును పాలిష్ చేసి పసుపు పొడిగా విక్రయించడం, మామిడితో జ్యూస్, జామ్, పల్ప్ తయారు చేయడం ఈ కోవలోకే వస్తాయి. దీనివల్ల రైతు సాధారణంగాపొందే ధర కంటే 20–100 శాతం వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. చిరుధాన్యాలకు విలువ జోడించడం ద్వితీయ వ్యవసాయంలో అత్యంత లాభదాయకమైన, స్థిరమైన మార్గం. ముడి ధాన్యాన్ని మాత్రమే విక్రయించే బదులు, పిండి, రవ్వ, రెడీ–టు–కుక్, రెడీ–టు–ఈట్, బేకరీ, ఆరోగ్య ఆహార ఉత్పత్తులుగా మార్చి బ్రాండ్ పేరుతో విక్రయిస్తే గణనీయమైన ఆదాయాన్ని పొందవచ్చు. భారతదేశంలో ప్రతి సంవత్సరం పండ్లు, కూరగాయలు, ధాన్యాలలో గణనీయమైన నష్టం కోత అనంతరం సంభవిస్తుంది. సరైన నిల్వ, గ్రేడింగ్, ప్యాకింగ్ లేకపోవడం దీనికి ప్రధాన కారణం. ఒక గ్రామంలోనే చిన్న రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, పప్పు మిల్లు లేదా మసాలా పొడి తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే రైతులకు దగ్గరలోనే మార్కెట్ లభిస్తుంది. అదనంగా గ్రామ యువతకు కూడా ఉపాధి లభిస్తుంది.అనుబంధ ఆదాయ మార్గాలురైతు ఇంట్లో రెండు ఆవులు లేదా గేదెలు ఉన్నా ప్రతి రోజు నగదు ఆదాయం వస్తుంది. పాలను నేరుగా అమ్మడం కంటే పెరుగు, నెయ్యి, పనీర్, వెన్న, చీజ్ తయారు చేసి అమ్మితే మరింత లాభం వస్తుంది. పాడి పరిశ్రమ రైతు కుటుంబానికి సంవత్సరం పొడవునా ఆదాయాన్ని అందించే అత్యుత్తమ అనుబంధ వృత్తి. అలాగే తేనెటీగల పెంపకానికి ఎక్కువ భూమి అవసరం లేదు. దీని ద్వారా తేనె, బీస్వాక్స్, రాయల్ జెల్లీ లభిస్తాయి. వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు వంటి వ్యవసాయ అవశేషా లను ఉపయోగించి పుట్టగొడుగులను పెంచవచ్చు. చిన్న గదిలోనే సాగు చేయవచ్చు. వ్యవసాయ కుంటలు, చెరువులు, ఫార్మ్పాండ్లలో చేపల పెంపకం చేపట్టవచ్చు. వరిసాగుతో పాటు చేపల పెంపకం చేపడితే ఒకే భూమి నుండి రెండు రకాల ఆదాయంపొందవచ్చు. వ్యవసాయం, పశుపోషణ ఒకదానికొకటి పరస్పర అనుబంధమైనవి. పంట అవశేషాలు పశుగ్రాసంగా ఉపయోగపడ తాయి. వర్మీ కంపోస్ట్, బయోగ్యాస్, సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి పశువుల పేడ ఉపయోగపడుతుంది. చాలా మంది రైతులు వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, చెరకు ఆకులు వంటి అవ శేషాలను కాల్చివేస్తారు. అలా చేయకుండా వాటిని ఉపయోగించి వర్మీకంపోస్ట్, బయోగ్యాస్, బయోచార్‌కు వినియోగించ వచ్చు.స్వపరాగ సంపర్క పంటల్లో వరి, శనగ, పెసర, మినుము, ఉలవలు, వేరుశనగ నాణ్యమైన విత్తన ఉత్పత్తి అనేది ద్వితీయ వ్యవసాయం కింద అత్యంత లాభదాయకమైన కార్యకలాపాలలో ఒకటి. తక్కువ విస్తీర్ణంలో సాగుచేయగలిగే మల్లె, గులాబీ, బంతి వంటి పూల సాగుతో పాటు తులసి, కలబంద, అశ్వగంధ, లెమన్ గ్రాస్ వంటి ఔషధ, సుగంధ మొక్కల సాగు ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. ఇటీవలి కాలంలో నగర ప్రజలు గ్రామీణ జీవనశైలిని అనుభ వించడానికి ఆసక్తి చూపుతున్నారు. రైతులు తమ పొలాల్లో ప్రకృతి సందర్శన, సేంద్రీయ వ్యవసాయ ప్రదర్శనలు, గ్రామీణ ఆహారం, పంటల సందర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కూడా అదనపు ఆదాయం పొందవచ్చు.పోషకాహార లోపం తొలగించేలా...పంటల సాగు నిలిచిపోతే రైతులు, గ్రామీణ కుటుంబాల ఆదాయం దెబ్బ తింటుంది. దీనిని నివారించేందుకు ప్రతి ఇంటా నాటుకోళ్లను పెంచాలి. సొంత వినియోగానికే కాకుండా... గుడ్లు, మాంసానికి సంవత్సరమంతా ఆదాయం ఉంటుంది. గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, స్వర్ణధార, శ్రీనిధి వంటి మేలురకం కోడి పిల్లలను పెంచవచ్చు.గ్రామీణ ప్రాంతాల్లో ఐదు సంవత్సరాల్లోపు పిల్లల మరణాలకు 69 శాతం కారణం పోషకాహార లోపమే.సంప్రదాయ భారతీయ ఆహారంలో ప్రొటీన్ల లోపం ఉంటుంది. వంద గ్రాముల కోడిగుడ్లలో లభించే 6.9 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్ తక్కువ ధరకే లభిస్తుంది. కోడి మాంసంలో కూడా 22 శాతం ప్రొటీన్ ఉండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్లు, కోడి మాంసంలో 75–80 శాతాన్ని పట్టణాల్లో ఉండే 25 శాతం జనాభా తింటుంటే... గ్రామీణ ప్రజలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి పెరటి కోళ్ళ పెంపకం ఎంతో దోహదపడుతుంది.ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ధి పథకం, జాతీయ తేనెటీగలు మరియు తేనె మిషన్, డెయిరీ అభివృద్ధి పథకాలు, నాబార్డ్ గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పథకాలు, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా శిక్షణ, రుణాలు, సబ్సిడీలు పొందవచ్చు. నేటి పరిస్థితుల్లో ‘పంట పండించడం మాత్రమే కాదు... పంటకు విలువ జోడించడం కూడా రైతు విజయానికి కీలకం. ‘వ్యవసాయంలో వైవిధ్యం – రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం’ అనే లక్ష్యంతో ద్వితీయ వ్యవసాయాన్ని ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రోత్సహించాలి.– డా‘‘ కె. తేజస్వర రావు, డా‘‘ బి. సహదేవ రెడ్డి-ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ సీనియర్ శాస్త్రవేత్తలు -
Sagubadi: దుంపలు ఎప్పుడు నాటాలి?
ఇంటిపంటలు, మిద్దె తోటల్లో కుండీలు, మడుల్లో క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, కంద, చేమదుంప వంటి దుంపలు పండించడానికి సరైన కాలం, సరైన సాగు పద్ధతులు ఏమిటో తెలుసుకుందాం. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వంటి దుంప పంటలను ప్రధానంగా చలికాలంలో లేదా వర్షాకాలం అంటే సెప్టెంబర్ /అక్టోబర్ నుంచి జనవరి వరకు నాటుకోవడం ఉత్తమం.ఈ కాలంలో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండటం వల్ల దుంపలు బాగా ఊరతాయి. ముల్లంగిని ఆగస్టు నుంచి కూడా నాటుకోవచ్చు. కంద, చేమదుంప వేసవి, వర్షాకాలం పంటలు. వీటిని సాధారణంగా ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో నాటుకోవచ్చు. మార్కెట్లో దొరికే దుంపలు తెచ్చి నాటుకోవచ్చు.దుంప జాతి మొక్కలకు నత్రజని కంటే భాస్వరం, పొటాషియం ఎక్కువగా అవసరం. విత్తనాలు నాటేటప్పుడే మట్టిలో బాగా చివికిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ కల΄ాలి. మొక్కలు 4–6 అంగుళాల ఎత్తు పెరిగినప్పుడు (నాటిన 30–45 రోజుల తర్వాత) ఒకసారి ద్రవ ఎరువులు లేదా కొద్దిగా వర్మీ కంపోస్ట్ ఇవ్వాలి.తాజా పశువుల ఎరువు వాడకూడదు. వాడితే క్యారెట్, ముల్లంగి దుంపలు రెండుగా చీలిపోయే అవకాశం ఉంది. దుంపలు భూమిలో సులభంగా పెరగడానికి మట్టి చాలా గుల్లగా, మెత్తగా ఉండాలి.1 వంతు ఇసుకతో ఉన్న ఎర్రమట్టి లేదా తోట మట్టి (మామూలు ఎర్ర మట్టి అయితే కొద్దిగా ఇసుక కల΄ాలి), 1 వంతు కోకోపీట్ /వరి పొట్టు (మట్టి గుల్లగా ఉండటానికి), 1 వంతు వర్మీ కంపోస్ట్ లేదా బాగా చివికిన పశువుల ఎరువు కొద్దిగా వేప పిండి (మట్టిలో పురుగులు చేరకుండా ఉండటానికి)తో కలిపి మట్టి మిశ్రమం తయారు చేసుకోవాలి.ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు తీసేయాలి..క్యారెట్ – బీట్రూట్ నాటుకోవటం కోసం కనీసం 12–14 అంగుళాల లోతు, 12 అంగుళాల వెడల్పు ఉన్న కుండీలు లేదా గ్రో బ్యాగ్స్ వాడాలి. ముల్లంగి నాటుకోవటానికి 8–10 అంగుళాల లోతు సరిపోతుంది.కంద – చేమదుంప నాటుకోవటానికి పెద్ద కుండీలు అవసరం. కనీసం 15–20 లీటర్ల సామర్థ్యం ఉన్న కుండీ లేదా పెద్ద టబ్బులు వాడితే దుంపలు పెద్దగా పెరుగుతాయి.మట్టిలో రాళ్లు, గడ్డలు లేకుండా చూసుకోవాలి, లేదంటే దుంపల ఆకారం దెబ్బతింటుంది. బీట్రూట్, క్యారెట్ విత్తనాల మధ్య కనీసం 2–3 అంగుళాల దూరం ఉండాలి.కంద/చేమదుంప నాటేటప్పుడు దుంప మొలక పైకి ఉండేలా చూసి, 2–3 అంగుళాల లోతులో నాటాలి. ఈ మొక్కలకు రోజుకు కనీసం 6 గంటల ఎండ అవసరం.కుండీ అడుగున రంధ్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేకపోతే నీరు నిల్వ ఉంటే దుంపలు కుళ్ళిపోతాయి.ముల్లంగి అన్నిటికంటే వేగంగా వస్తుంది. విత్తనాలు నాటిన 25 నుంచి 45 రోజులలోపు తీసి వాడుకోవచ్చు. బీట్రూట్ విత్తనాలు నాటిన 50 నుంచి 80 రోజుల్లో తీసుకొని వాడుకోవచ్చు.. కొన్ని రకాలు 3 నెలల వరకు సమయం తీసుకోవచ్చు. క్యారెట్ కొంచెం నిదానంగా పెరుగుతుంది. సాధారణంగా విత్తనాలు నాటిన తరువాత 60 నుంచి 100 రోజులు పడుతుంది. కొన్ని రకాలకు 120 రోజుల వరకు సమయం పట్టవచ్చు. క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ దుంపలు పెరిగినప్పుడు వాటి పైభాగం మట్టి పైన కొద్దిగా కనిపిస్తాయి. చేమదుంపలు నాటిన 150 నుంచి 180 రోజులకు (అంటే 5 నుంచి 6 నెలలు) తవ్వి తీసుకోవచ్చు.కంద.. ఇది అన్నిటికంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. నాటిన తరువాత సాధారణంగా 210 నుంచి 240 రోజులు (7 నుంచి 8 నెలలు) పడుతుంది. కంద, చేమదుంప మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోవటం జరిగిన తరువాత తీసుకొని వాడుకోవాలి. ముల్లంగి విత్తనాలను ఆగస్టు మొదటి వారంలో నాటుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ విత్తనాలను సెప్టెంబర్ /అక్టోబర్‌లో నాటుకోవచ్చు.- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
Sagubadi: ఏఐతో తెగుళ్లకు చెక్!
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత నూతన దారులు చూపుతోంది. పంటలకు సోకే తెగుళ్లను ఆరంభ దశలోనే గుర్తించి, సరైన నివారణో΄ాయాలు సూచించేలా హైదరాబాద్‌లోని ‘విఎన్ ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’ పరిశోధకులు ఒక అత్యాధునిక ఏఐ వ్యవస్థకు రూపకల్పన చేశారు.కన్వొల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్స్‌ను ఉపయోగించి ఆకుల తెగుళ్లను గుర్తించే విధా రూపొందించారు. ఈ ఆవిష్కరణను సీఎస్ఈ విభాగానికి చెందిన సీనియర్ అసిస్టెంట్ ్ర΄÷ఫెసర్ డాక్టర్ ఆర్ విజయ సరస్వతి మరో 9 మంది పరిశోధకులతో కలసి రూపొందించిన ఈ సాంకేతికతకు భారత ప్రభుత్వ పేటెంట్ లభించింది. పంటలకు వచ్చే రకరకాల తెగుళ్లను సకాలంలో గుర్తించకపోవటం వల్ల రైతులు ప్రతి సంవత్సరం తీవ్ర దిగుబడి నష్టాన్ని చవిచూస్తున్నారు.టొమాటో, బంగాళాదుంప, క్యాప్సికమ్ పంటలకు చెందిన 20 వేల ఆకుల చిత్రాల డేటాసెట్‌ను ఉపయోగించి వీఎన్ ఆర్ వీజీఐఈటీ నిపుణులు పరిశోధన చేశారు. పంటల్లో సాధారణంగా కనిపించే ప్రధాన తెగుళ్లను అత్యంత కచ్చితత్వంతో గుర్తించేలా దీన్ని తీర్చిదిద్దారు. ఈ ఏఐ వ్యవస్థ పంట ఆకుల చిత్రాలను విశ్లేషించి 97.7% కచ్చితత్వంతో ఆరంభ దశలోనే తెగుళ్లను పసిగడుతుంది. అంతేకాకుండా, ఆ తెగులు నివారణకు వాడాల్సిన తగిన క్రిమిసంహారక మందులను కూడా సూచిస్తుంది. దీనివల్ల కిరణజన్య సంయోగక్రియ, పరాగసంపర్కం, మొక్క పెరుగుదల దెబ్బతినక ముందే జాగ్రత్తపడొచ్చని డా. విజయ సరస్వతి తెలి΄ారు.రైతులకు త్వరలోనే అందుబాటులోకి..!నేను రైతు కుటుంబంలో పుట్టి పెరిగాను. పంటలను ఆశించే తెగుళ్లను ఆలస్యంగా గుర్తించటం వల్ల ఎకరాలకు ఎకరాలు పంట నాశనమై రైతులు పడే ఆవేదనను దగ్గర్నుంచి చూశాను. ఆ అనుభవమే ఈ పరిశోధనకు పునాది వేసింది. ప్రస్తుతం వెబ్ ఇంటర్ఫేస్లో ఈ సాంకేతికత అందుబాటులో ఉంది. మొబైల్ అప్లికేషన్‌ను రూపొందిస్తున్నాం. ఇది త్వరలోనే రైతులకు అందుబాటులోకి వచ్చి పంట నష్టాలను తగ్గిస్తుందని ఆశిస్తున్నాను.– డాక్టర్ విజయ సరస్వతి, వీఎన్ ఆర్ వీజీఐఈటీ, ప్రధాన పరిశోధకురాలునిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
రైతుకు ఆదాయం – ప్రకృతికి చికిత్స
వాతావరణ మార్పులు ప్రపంచ వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా కరవుప్రాంతాల్లో వ్యవసాయం అనిశ్చితితో కూడిన జీవనోపాధిగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో అగ్రోఫారెస్ట్రీ– వ్యవసాయ పంటలతో పాటు వృక్షాలను సమీకృతంగా పెంచే విధానం– పర్యావరణ పరిరక్షణతో పాటు రైతుకు అదనపు ఆదాయాన్ని అందించే మార్గంగా ఎదుగుతోంది. చెట్లు వాతావర ణంలోని కార్బన్ ను బంధించడం ద్వారా ఏర్పడే కార్బన్ క్రెడిట్లను రైతుల ఆదాయంగా మలచడ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది.భారతదేశం 2070 నాటికి నెట్– జీరో లక్ష్యాన్ని ప్రకటించిన నేపథ్యంలో వ్యవసాయం కూడా కార్బన్ ఉద్గారాల నియంత్రణలో భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది. రైతులను కేవలం ఆహార ఉత్పత్తిదారులుగా కాకుండా పర్యావరణ సేవలను అందించే భాగ స్వాములుగా గుర్తించే విధానాలు రూపొందాలి. కార్బన్ మార్కెట్లు అదే దిశగా ముందడుగు వేస్తున్నాయి.అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో యాక్షన్ ఫ్రెటర్నా–ఎకాలజీ సెంటర్ (ఏఎఫ్ ఎకాలజీ సెంటర్) ఈ భావనను ఆచరణలోకి తీసుకొస్తోంది. నెదర్లాండ్స్‌కు చెందిన రాబోబ్యాంక్ ప్రోత్సహి స్తున్న ‘అకార్న్’ కార్యక్రమానికి స్థానిక భాగస్వామిగా ఉంటూ, సంస్థ రైతులను అగ్రోఫారెస్ట్రీ వైపు మళ్లిస్తూ, కార్బన్ ఆదాయ వ్యవస్థలో చేర్చుతోంది. ఇప్పటికే సుమారు 8,300 మంది రైతులు, దాదాపు 10,000 హెక్టార్ల భూమిని ఈ కార్యక్రమంలో నమోదు చేయించింది. రైతుల భూములకు జియో–ట్యాగింగ్, ధ్రువీకరణ ప్రక్రియలు పూర్తి చేశారు. రెండు లక్షలకు పైగా మొక్కల పంపిణీ చేసి, ఏకపంట తోటలను బహుళ వృక్ష వ్యవస్థలుగా మార్చి ఈ కార్యక్ర మానికి బలమైన పునాది వేశారు. తొలి విడత కార్బన్ ఆదాయం 2027లో అందే అవకాశం రైతుల్లో విశ్వాసాన్ని పెంచుతోంది.ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ కేవలం కార్బన్ క్రెడిట్ల నమోదు వద్దే ఆగిపోలేదు. ప్రకృతి వ్యవసాయం, నీటి సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను సమ గ్రంగా అనుసంధానిస్తూ రైతుల స్థిరమైన జీవనోపాధిని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. కార్బన్ ఆదాయాన్ని రైతు సంక్షేమంతో అనుసంధానించిన ఈ నమూనా దేశవ్యాప్తంగా అధ్యయనం చేయదగినది. అయితే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. కార్బన్ ధరల్లో హెచ్చుతగ్గులు, ధ్రువీకరణ ప్రక్రియల క్లిష్టత్వం, చిన్న రైతుల సామర్థ్య పరిమితులు వంటిఅంశాలను విధానపరంగా పరిష్కరించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రో ఫారెస్ట్రీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు,సాంకేతిక సహాయం, పారదర్శక కార్బన్ మార్కెట్ వ్యవస్థను అందిస్తే ఈ కార్య క్రమం మరింత విస్తరిస్తుంది.భవిష్యత్తు వ్యవసాయం కేవలం దిగుబడుల గురించే కాదు; ప్రకృతిని పునరుద్ధరించడంపైనా ఆధారపడిఉంటుంది. రైతు పెంచే ప్రతి చెట్టు వాతావరణ మార్పులను తగ్గించడమే కాకుండా కుటుంబ ఆదాయాన్ని కూడా పెంచగలదని ఈ కార్యక్రమం నిరూపిస్తోంది. రైతు–ప్రకృతి–మార్కెట్ మధ్య సమ తుల్యతను సాధించే ఇటు వంటి ప్రయత్నాలే సుస్థిర వ్యవసా యానికి బాటలు వేస్తాయి.-వ్యాసకర్త డైరెక్టర్, ఎ.ఎఫ్. ఎకాలజీ సెంటర్, అనంతపురం-డా‘‘ వై.వి. మల్లారెడ్డి -
నూతన యూరియా విధాన సవాళ్లు
హార్మూజ్ జలసంధి మూసుకుపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధర ఒక్కసారిగా టన్నుకు దాదాపు వెయ్యి డాలర్లకు పెరిగింది. దేశ యూరియా అవసరాల్లో నాలుగో వంతును దిగుమతి చేసుకునే భారత్‌కు ఇది దిగుమతుల మీద ఆధారపడే పాత భయాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే నూతన యూరియా పెట్టుబడి విధానం రూపంలో స్పందన వచ్చింది. దేశం ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న కోటి టన్నుల యూరియాను ఇక్కడే తయారు చేసేందుకు ఎనిమిది–తొమ్మిది కొత్త గ్యాస్ ఆధారిత కర్మాగారాలను నెలకొల్పడమే దీని లక్ష్యం.వేసిన నత్రజని పనికొచ్చేనా?తర్కంగా చూస్తే ఇది సరైన నిర్ణయమే. కానీ ఆ తర్కమే అసలు సమస్య. సరఫరా సంక్షోభం వచ్చినప్పుడు మన వ్యవసాయ విధానం చూపే ప్రతిస్పందన ఒక్కటే– ఎరువును మరింత ఎక్కు వగా ఉత్పత్తి చేయడం. కానీ ఎవరూ అడగని ప్రశ్న ఒకటుంది. పద్నాలుగు కోట్ల రైతు కుటుంబాలు, ప్రపంచంలోనే అతిపెద్ద పశు సంపద, ప్రతి శీతాకాలంలో తగలబెట్టే కోట్లాది టన్నుల పంట వ్యర్థాలు– ఇవన్నీ ఉన్న దేశం ఇంత భారీ మొత్తంలో కృత్రిమ నత్రజనిని ఎందుకు దిగుమతి చేసుకోవాలి?గత అరవై ఏళ్లుగా మన వ్యవసాయ విధానాన్ని ఒక నమ్మకం శాసిస్తోంది– ప్రతి ఉత్పాదకత సమస్యా ఎరువుల సమస్యే; దాన్ని మరిన్ని ఎరువులు ఉత్పత్తి చేయడం, దిగుమతి చేయడం, రాయితీ ఇవ్వడం ద్వారానే పరిష్కరించాలి. హరిత విప్లవం కాలంలో ఇది నిజమే. అప్పుడు నత్రజని కొరత ఒక అడ్డంకి. కానీ ఇవాళ మన అసలు సమస్య నత్రజని కొరత కాదు; పంటకు నత్రజనిని అందించే నేల ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రభుత్వ నేల ఆరోగ్య కార్డుల డేటానే చూస్తే– దేశంలో దాదాపు 64 శాతం నేలల్లో నత్రజని తక్కువ, 48.5 శాతం నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువ.మరో గణాంకం మరింత భయపెడుతుంది. హరిత విప్లవం తొలినాళ్లలో ఒక కిలో ఎరువుకు దాదాపు పదమూడు కిలోల అదనపు ధాన్యం వచ్చేది– అంటే 1:13 నిష్పత్తి. ఇవాళ అది 1:2.7కి పడి పోయింది. అంటే అదే కిలో ఎరువు ఇప్పుడు నాలుగో వంతు ధాన్యాన్ని మాత్రమే ఇస్తోంది. మనం వేసే నత్రజనిలో అరవై శాతానికి పైగా పంటకు అందకుండా గాలిలోకి, భూగర్భ జలాల్లోకి కొట్టుకుపోతోంది. నత్రజని చౌకగా దొరకడంతో రైతులు దాన్నే మోతాదు మించి వాడుతున్నారు; ఫలితంగా ఎన్ పీకే(నత్రజని, భాస్వరం, పొటాషియం) నిష్పత్తి 4:2:1 ఉండాల్సిన చోట దాదాపు 11:4:1కి చేరింది.ఒక ప్రాథమిక తేడాను మనం మరచిపోయాం. పంటకు పోషకాలు అందించడం వేరు, నేల సారాన్ని కాపాడటం వేరు. యూరియా పంటకు తక్షణ ఆహారం అందిస్తుంది. కానీ నేలలో సేంద్రియ కర్బనం, సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, వానపాములు– వీటిని అది పెంచదు. నిజానికి మోతాదు మించిన నత్రజని వీటిని దెబ్బతీస్తుంది. ఈ జీవరాశే నేలకు నీటిని పట్టి ఉంచే శక్తిని, గాలి ఆడే నిర్మాణాన్ని, పోషకాలను చక్రంలా తిప్పే సామర్థ్యాన్ని ఇస్తుంది. వీటిని రసాయనిక ఎరువులతో తిరిగి నిర్మించలేం– ఎందుకంటే ఎన్పీకే అనేది కర్బనం కాదు, జీవం అసలే కాదు.నిజంగా ఇది స్వావలంబనా?నూతన యూరియా విధానం చెప్పే స్వావలంబన కూడా చాలావరకు భ్రమే. యూరియా అమోనియా నుంచి, అమోనియా సహజ వాయువు నుంచి తయారవుతాయి. ఆ సహజ వాయువులో చాలా భాగం మనం ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) రూపంలో దిగుమతి చేసుకునేదే. యూరియా ఉత్పత్తి వ్యయంలో ఇది 70–80 శాతం. అంటే కొత్త కర్మాగారం అంటే దిగుమతి చేసుకున్న వాయువును ఇక్కడ యూరియాగా మార్చే యంత్రం మాత్రమే. మన ఆధారపడటం పోలేదు, కేవలం ఒక మెట్టు పైకి జరిగింది. భాస్వరం, పొటాష్ విషయంలో అయితే మనం దాదాపు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడతాం.అమెరికా ఉదాహరణ చూడండి: ఆ దేశం నత్రజనిలో స్వావలంబన సాధించిన మాట నిజమే, కానీ కర్మాగారాలు కట్టడం వల్ల కాదు. దానికి సొంత షేల్ గ్యాస్ ఉంది; మొక్కజొన్న–సోయాబీన్ మార్పిడి సాగులో పప్పుజాతి పంట తనకు తానే నత్రజనిని స్థిరీక రించుకుంటుంది. ఈ రెండూ మనకు లేవు. అక్కడి వాతావరణం కూడా వేరు. మన ఉష్ణోగ్రతలకు సేంద్రియ కర్బనం తొందరగా కోల్పోతాం. అక్కడ సంవత్సరానికి ఒక పంట కాలమే, రెండో కాలంలో నేల పునర్జీవనం కావటానికి అవకాశం ఉంది. కాబట్టి అమెరికా బాటలో కేవలం కర్మాగారాల స్థాపనను కాపీ చేస్తే, భారం మిగులుతుంది తప్ప భద్రత రాదు.నిజమైన స్వావలంబన అంటే మనం అదుపులో ఉంచుకోగల వనరుల నుంచి పంట అవసరాలను తీర్చుకోవడం. పప్పు ధాన్యాలు, జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు, అజొల్లా ద్వారా జీవ నత్రజని స్థిరీకరణ, పంట వ్యర్థాల పునర్వినియోగం, పశువుల ఎరువు, అన్నిటికీ ఆధారమైన నేలలో సేంద్రియ పదార్థం– ఇవి పెరిగితే వేసే ప్రతి కిలో ఎరువూ మరింత సమర్థంగా పనిచేస్తుంది.జీవసారం పెంచితే ప్రోత్సాహకాలుఇప్పుడు డబ్బుల మాట. దేశ ఎరువుల రాయితీ దాదాపు రూ.1.7 లక్షల కోట్లు; అందులో యూరియాదే రూ.1.19 లక్షల కోట్లు. తగ్గిపోతున్న రసాయనిక ఎరువుల సామర్థ్యం, వృథా అవు తున్న సగం నత్రజని– వీటిని చూస్తే ఇది తక్కువ ప్రయోజనం ఇచ్చే ఖర్చు. ఈ రాయితీలో సగాన్ని– అంటే దాదాపు 85 వేల కోట్లను– నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి మళ్లిస్తే ఏమవుతుంది?ఒక టన్ను యూరియా ఒక్క సీజన్ కే అయిపోతుంది, మళ్లీ కొనా ల్సిందే. కానీ నేలలో పెరిగిన సేంద్రియ కర్బనం ఏళ్ల తరబడి నిలు స్తుంది. ప్రతి ఏటా దిగుబడిని, నీటి నిల్వను, ఎరువుల సామర్థ్యాన్ని పెంచుతుంది. నేల బాగుపడిన కొద్దీ దానికి కావాల్సిన నత్రజని తగ్గుతుంది, దాంతోపాటే రాయితీ భారమూ తగ్గుతుంది.అందుకే ఒక జాతీయ/రాష్ట్ర స్థాయి నేల ఆరోగ్య పునరుద్ధరణ మిషన్ అవసరం. నేలలో సేంద్రియ కర్బనం, జీవసారం పెరిగిన కొద్దీ రైతుకు నేరుగా ప్రోత్సాహకం అందాలి. గ్రామ స్థాయి కంపోస్ట్, పంట వ్యర్థాల పునర్వినియోగం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో జీవ ఎరువుల యూనిట్లు– వీటిని ఉపాధి హామీ పథకం, ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానం చేయాలి.‘రసాయనిక ఎరువులు లేకుండా దేశాన్ని పోషించలేం’ అనే వాదన రావచ్చు. ఎరువులను పూర్తిగా వదిలేయాలని అనడం లేదు. మొదట్లో రసాయనికం, జీవసంబంధం రెండింటినీ కలిపి వాడే సమీ కృత పోషక యాజమాన్యమే మార్గం. భారత్ తదుపరి వ్యవసాయ విప్లవం మరిన్ని రసాయనిక ఎరువులపై కాదు– ప్రాణమున్న నేల లను తిరిగి నిర్మించడంపై ఆధారపడాలి. ఏ ఓడరేవు, గ్యాస్ పైప్‌లైన్ కోసం మనం ఎదురుచూడనక్కర్లేదు– మన అతిపెద్ద ఎరువుల కర్మాగారం ప్రతి రైతు కాళ్ల కింద, నేల జీవంలోనే ఉంది. - డా. జి.వి. రామాంజనేయులు, వ్యాసకర్త సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) కార్యనిర్వాహక సంచాలకులు -
వ్యవసాయ భవిష్యత్తుకు కొత్త ఊపిరి
భారత వ్యవసాయం వందల ఏళ్లుగా కరవులను, వరదలను, ధరల పతనా లను, విధాన మార్పులను తట్టుకుని నిల బడింది. అభిరుచులు, మార్కెట్లు, సాంకే తికతలు మారుతున్న కొద్దీ పంటలు వచ్చాయి, పోయాయి. కొన్ని పంటలు రైతులకు తాత్కాలిక ఊరటనిస్తే, కొన్ని వారిని అప్పుల్లో పడేశాయి. చరిత్ర చెప్పే నిజం ఏమిటంటే– సరైన విధానం, ముందుచూపు తోడైతే ఒక్క పంట కూడా ఊరు, దేశం ఆర్థిక పరిస్థితినే మార్చగలదు. ప్రపంచంలో వంట నూనెలకు డిమాండ్ పెరుగుతున్న ఈ కాలంలో, ఆ మార్పు తెచ్చే పంట ఆయిల్ పామ్. తెలంగాణకు ఆయిల్ పామ్ కేవలం ఒక కొత్త పంట కాదు– ఇది దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహం. ఒక గేమ్ ఛేంజర్ కాగల పంట.ప్రధాన ఆర్థిక వనరుతెలంగాణ ఏర్పడిన మొదటి పదేళ్లలో మిషన్ కాకతీయ లాంటి పథకాల ద్వారా సాగునీటిని వసతులని పునరుద్ధరించడం సబబే. కానీ కేవలం వరి, పత్తి పంటల పైనే ఆధారపడిన వ్యవసాయం వాంఛనీయం కాదు. రాష్ట్రం రెండో పదేళ్లలోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో, మన వ్యవసాయ భవిష్యత్తుకు ఒక కొత్త ఆధారం కని పిస్తోంది. ఆయిల్ పామ్‌ను ఒక చిన్న పంటగా చూడటం మానేసి, నర్సరీ నుంచి రిఫైనరీ దాకా పూర్తి వ్యవస్థను నిర్మించే కొత్త గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దీన్ని పునాదిగా చూడాల్సిన సమయం వచ్చింది.ఆయిల్ పామ్ ఎందుకింత ముఖ్యమో అర్థం కావాలంటే మనం మన దేశ సరిహద్దులు దాటి చూడాలి. జనాభాలో మన కంటే చాలా తక్కువగా ఉన్న ఇండోనేషియా, మలేషియా దేశాలు ఈ ఒక్క పంటతో తమ గ్రామాల రూపురేఖలనే మార్చేశాయి. సుమారు 28.3 కోట్ల జనాభా ఉన్న ఇండోనేషియా, దాదాపు 4.2 కోట్ల ఎక రాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తూ, ఏటా సుమారు 4.6 కోట్ల టన్నుల పామ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తోంది. ఆ దేశ జీడీపీలో ఆయిల్ పామ్ వాటా సుమారు 4.5 శాతం, ప్రత్యక్షంగా, పరోక్షంగా 16 లక్షలకు పైగా కుటుంబాలకు ఇది జీవనోపాధి.మలేషియా కథ కూడా ఇలాంటిదే. కేవలం 3.56 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం దాదాపు 1.4 కోట్ల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తూ, ఏటా సుమారు 2 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తోంది. 1970లు, 1980లలో రబ్బరు ధరలు పెరగకుండా, గ్రామాల్లో ఆదాయం తగ్గి నప్పుడు, మలేషియా వ్యూహాత్మకంగా ఆయిల్ పామ్ వైపు మళ్లింది. భద్రత–స్థిరత్వం 147 కోట్ల జనాభా ఉన్న మన భారత ప్రజానీక ఆశలు, తినే అలవాట్లు వేగంగా మారుతున్నాయి. మన దేశంలో పండించే వంట నూనె మన అవసరంలో సగం మాత్రమే తీరుస్తోంది. ప్రతి ఏటా సుమారు 130 లక్షల టన్నుల వంట నూనెలను బయటి నుంచి తెచ్చుకుంటున్నాం. కేవలం పామ్ ఆయిల్ కోసమే ఏటా సుమారు రూ.1 లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నాం. సూటిగా చెప్పాలంటే, మనం మన విలువైన విదేశీ మారకాన్ని బయటికి పంపి, దానికి బదులు అనిశ్చితిని తెచ్చుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా సరఫరాలో ఏ చిన్న ఆటంకమైనా, ఏ దేశాల మధ్య ఉద్రిక్తతైనా, అంతర్జాతీయ ధరలు పెరిగినా, దాని ప్రభావం నేరుగా మన వంట గదులపైనా, మన రైతులపైనా పడుతుంది.ఇలా బయటి నుంచి తెచ్చుకోవాల్సి రావడానికి కారణం మన రైతులకు సామర్థ్యం లేకపోవడం కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగును బాగా పెంచగల వాతావరణం, నేలలు ఉన్నాయి. అయినా, దేశం మొత్తం మీద కేవలం 10 లక్షల ఎకరాల్లోనే ఆయిల్ పామ్ సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, తక్కువ మొత్తంతో మొద లైనా తెలంగాణ ఇప్పటికే రెండో స్థానానికి చేరుకుంది. భద్రత, స్థిరత్వం ఇచ్చే ఈ పంటను చేపట్టడానికి తెలంగాణ రైతుల్లో ఉన్న ఆసక్తిని, సంసిద్ధతను ఇది చూపిస్తుంది.ఈ రోజు తెలంగాణలో సుమారు 2.8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది, అందులో అవిభక్త ఖమ్మం జిల్లా ఒక్కటే దాదాపు 1.35 లక్షల ఎకరాలు కలిగి ఉంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాబోయే సంవత్సరాల్లో ఈ సాగును 10 లక్షల ఎకరాలకు పెంచాలని రాష్ట్రం ఒక పెద్ద, కానీ సాధించగల లక్ష్యాన్ని పెట్టుకుంది.ఆయిల్ పామ్ తోట దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల పాటు దిగుబడి ఇస్తుంది. ఒకే పంటకోతపై, ఒకే మార్కెట్ ధరపై ఆధారపడే కాలానుగుణ పంటల్లా కాకుండా, ఏడాది పొడవునా తాజా పండ్ల గెలలు ఇస్తుంది. అంటే ఏడాదికోసారి వచ్చే పెద్ద మొత్తం కాదు, ప్రతి నెలా చేతికి డబ్బు అందుతుంది. తోటలు పూర్తి దిగుబడికి వచ్చాక, దిగుబడి, నిర్వహణను బట్టి, ఇప్పటి ధరల ప్రకారమే రైతులు ఎకరాకు ఏటా రూ.2 లక్షల వరకు సంపాదించ గలుగుతున్నారు. తాజా పండ్ల గెలల ధర టన్నుకు రూ. 22,000 నుంచి రూ.24,500 వరకు ఉంటూ, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ పామ్ (ఎన్ ఎంఈఓ–ఓపీ) లాంటి పథ కాల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి తోడ్పాటునందిస్తుండటంతో, చాలా గ్రామీణ కుటుంబాలకు ఆయిల్ పామ్ నెలనెలా జీతం లాంటిదిగా మారింది. దీనికి తోడు, మొక్కలు, ఇన్ పుట్లు, మొదట్లో అయ్యే ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు సుమారు రూ.50,000 వరకు సబ్సిడీ ఇస్తోంది. దీనితో పూర్తి దిగుబడి రాకముందు మొదటి మూడు, నాలుగేళ్లలో రైతులపై పడే భారం తగ్గుతుంది.విత్తనం నుంచి నూనె ప్యాకెట్ దాకా...ఆయిల్ పామ్‌లో ఏదీ వృథా పోదు. పండు నుంచి ముడి పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ తీస్తారు. పీచు, పెంకులను కరెంటు తయారీకి వాడొచ్చు. మిగిలిన వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా, పశుగ్రాసంగా మార్చొచ్చు. కోకో, జాజికాయ, మిరియాలు, పూలు లాంటి నీడలో పెరిగే పంటలను కలిపి వేసుకుంటే, ఆయిల్ పామ్ తోటలు ఒకే పంట తోటలుగా కాక, రకరకాల ఆదాయాలు ఇచ్చే తోటలుగా మారతాయి.పొలం గట్టు దాటి కూడా, ఆయిల్ పామ్ వల్ల ఉద్యోగాలు, వ్యాపారాలు పుడతాయి. నర్సరీలు, ఇన్ పుట్లు అమ్మేవారు, కోత సేవలు, రవాణా చేసేవారు, ఫ్రూట్ కలెక్షన్ కేంద్రాలు, క్రషింగ్ యూనిట్లు, రిఫైనరీలు, ప్యాకింగ్ యూనిట్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు, వీళ్లందరూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భాగమై ఉపాధిని పెంచుతారు.అశ్వారావుపేట, దమ్మపేట లాంటి ప్రాంతాల్లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇప్పటికే వ్యాపార కేంద్రాలుగా మారడం చూశాం. సిద్దిపేటలో కొత్త ఫ్యాక్టరీ ఇప్పటికే ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా కొణిజర్లలో గోద్రెజ్ సంస్థ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. ‘విత్తనం నుంచి నూనె ప్యాకెట్ దాకా‘ ఒకే గొలుసుగా చేయడమే తెలంగాణ వ్యూహం.ఆయిల్ పామ్ పర్యావరణానికి హానికరం అని కొందరు అంటున్నారు. ఈ అభిప్రాయం ఎక్కువగా వేరే దేశాల్లో సున్నితమైన అడవులు, తడి నేలల్లో పెద్ద ఎత్తున అడవులను కొట్టేసిన అనుభవాల నుంచి వచ్చింది. తెలంగాణ పరిస్థితి పూర్తి భిన్నం. మనం అడవు లను కొట్టేయడం గురించి మాట్లాడటం లేదు; తక్కువ దిగుబడి ఉన్న, వర్షాధార లేదా ఒకే పంట పండే భూములను సరైన నీటి వాడకంతో మంచి విలువ ఇచ్చే చెట్ల తోటలుగా మార్చడం గురించి మాట్లాడుతున్నాం. సరిగ్గా ప్రణాళిక వేసుకుంటే, ఆయిల్ పామ్ తోటలు పచ్చదనాన్ని పెంచుతాయి, గాలిలో కార్బన్‌ను ఎక్కువగా పీల్చుకుంటాయి, కొండ ప్రాంతాల్లో నేల కొట్టుకుపోకుండా చూస్తాయి, తేమను నిలుపుతాయి. సహజ అడవులను కొట్టేయకుండా కఠినంగా ఉంటూ, అంతర పంటలు, జీవవైవిధ్యానికి మేలు చేసే పద్ధతులను ప్రోత్సహిస్తూ ఉంటే, ఆయిల్ పామ్ తెలంగాణలో పర్యావరణానికి శత్రువు కాదు, స్నేహితుడు కాగలదు.- తుమ్మల నాగేశ్వర రావు, వ్యాసకర్త, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి -
రైతు కాళ్ల కిందే కర్మాగారం
హార్మూజ్ జలసంధి మూసుకుపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధర ఒక్కసారిగా టన్నుకు దాదాపు వెయ్యి డాలర్లకు పెరిగింది.దేశ యూరియా అవసరాల్లో నాలుగోవంతును దిగుమతి చేసుకునే భారత్‌కు ఇది దిగుమతుల మీద ఆధారపడే పాత భయాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే నూతన యూరియా పెట్టుబడి విధానం రూపంలో స్పందన వచ్చింది. దేశం ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న కోటి టన్నుల యూరియాను ఇక్కడే తయారు చేసేందుకు ఎనిమిది–తొమ్మిది కొత్త గ్యాస్ ఆధారిత కర్మాగారాలను నెలకొల్పడమే దీని లక్ష్యం.వేసిన నత్రజని పనికొచ్చేనా?తర్కంగా చూస్తే ఇది సరైన నిర్ణయమే. కానీ ఆ తర్కమే అసలు సమస్య. సరఫరా సంక్షోభం వచ్చినప్పుడు మన వ్యవసాయ విధానం చూపే ప్రతిస్పందన ఒక్కటే– ఎరువును మరింత ఎక్కు వగా ఉత్పత్తి చేయడం. కానీ ఎవరూ అడగని ప్రశ్న ఒకటుంది. పద్నాలుగు కోట్ల రైతు కుటుంబాలు, ప్రపంచంలోనే అతిపెద్దపశు సంపద, ప్రతి శీతాకాలంలో తగలబెట్టే కోట్లాది టన్నుల పంట వ్యర్థాలు– ఇవన్నీ ఉన్న దేశం ఇంత భారీ మొత్తంలో కృత్రిమ నత్రజనిని ఎందుకు దిగుమతి చేసుకోవాలి?గత అరవై ఏళ్లుగా మన వ్యవసాయ విధానాన్ని ఒక నమ్మకం శాసిస్తోంది– ప్రతి ఉత్పాదకత సమస్యా ఎరువుల సమస్యే; దాన్ని మరిన్ని ఎరువులు ఉత్పత్తి చేయడం, దిగుమతి చేయడం, రాయితీ ఇవ్వడం ద్వారానే పరిష్కరించాలి. హరిత విప్లవం కాలంలో ఇది నిజమే. అప్పుడు నత్రజని కొరత ఒక అడ్డంకి. కానీ ఇవాళ మన అసలు సమస్య నత్రజని కొరత కాదు; పంటకు నత్రజనినిఅందించే నేల ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రభుత్వ నేల ఆరోగ్య కార్డుల డేటానే చూస్తే– దేశంలో దాదాపు 64 శాతం నేలల్లో నత్రజని తక్కువ, 48.5 శాతం నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువ. మరో గణాంకం మరింత భయపెడుతుంది. హరిత విప్లవం తొలినాళ్లలో ఒక కిలో ఎరువుకు దాదాపు పదమూడు కిలోల అదనపు ధాన్యం వచ్చేది– అంటే 1:13 నిష్పత్తి. ఇవాళ అది 1:2.7కి పడి పోయింది. అంటే అదే కిలో ఎరువు ఇప్పుడు నాలుగో వంతు ధాన్యాన్ని మాత్రమే ఇస్తోంది. మనం వేసే నత్రజనిలో అరవై శాతానికి పైగా పంటకు అందకుండా గాలిలోకి, భూగర్భ జలాల్లోకి కొట్టుకుపోతోంది. నత్రజని చౌకగా దొరకడంతో రైతులు దాన్నే మోతాదు మించి వాడుతున్నారు; ఫలితంగా ఎన్ పీకే(నత్రజని, భాస్వరం, పొటాషియం) నిష్పత్తి 4:2:1 ఉండాల్సిన చోట దాదాపు 11:4:1కి చేరింది. ఒక ప్రాథమిక తేడాను మనం మరచిపోయాం. పంటకు పోషకాలు అందించడం వేరు, నేల సారాన్ని కాపాడటం వేరు. యూరియా పంటకు తక్షణ ఆహారం అందిస్తుంది. కానీ నేలలోసేంద్రియ కర్బనం, సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, వానపాములు– వీటిని అది పెంచదు. నిజానికి మోతాదు మించిన నత్రజని వీటిని దెబ్బతీస్తుంది. ఈ జీవరాశే నేలకు నీటిని పట్టి ఉంచే శక్తిని, గాలి ఆడే నిర్మాణాన్ని, పోషకాలను చక్రంలా తిప్పే సామర్థ్యాన్ని ఇస్తుంది. వీటిని రసాయనిక ఎరువులతో తిరిగి నిర్మించలేం– ఎందుకంటే ఎన్పీకే అనేది కర్బనం కాదు, జీవం అసలే కాదు.నిజంగా ఇది స్వావలంబనా?నూతన యూరియా విధానం చెప్పే స్వావలంబన కూడా చాలావరకు భ్రమే. యూరియా అమోనియా నుంచి, అమోనియా సహజ వాయువు నుంచి తయారవుతాయి. ఆ సహజ వాయువులో చాలా భాగం మనం ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) రూపంలో దిగుమతి చేసుకునేదే. యూరియా ఉత్పత్తి వ్యయంలో ఇది 70–80 శాతం. అంటే కొత్త కర్మాగారం అంటే దిగుమతి చేసుకున్న వాయువును ఇక్కడ యూరియాగా మార్చే యంత్రం మాత్రమే. మన ఆధారపడటం పోలేదు, కేవలం ఒక మెట్టు పైకి జరిగింది. భాస్వరం, పొటాష్ విషయంలో అయితే మనం దాదాపు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడతాం.అమెరికా ఉదాహరణ చూడండి: ఆ దేశం నత్రజనిలో స్వావలంబన సాధించిన మాట నిజమే, కానీ కర్మాగారాలు కట్టడం వల్ల కాదు. దానికి సొంత షేల్ గ్యాస్ ఉంది; మొక్కజొన్న–సోయాబీన్ మార్పిడి సాగులో పప్పుజాతి పంట తనకు తానే నత్రజనిని స్థిరీక రించుకుంటుంది. ఈ రెండూ మనకు లేవు. అక్కడి వాతావరణం కూడా వేరు. మన ఉష్ణోగ్రతలకు సేంద్రియ కర్బనం తొందరగా కోల్పోతాం. అక్కడ సంవత్సరానికి ఒక పంట కాలమే, రెండోకాలంలో నేల పునర్జీవనం కావటానికి అవకాశం ఉంది. కాబట్టి అమెరికా బాటలో కేవలం కర్మాగారాల స్థాపనను కాపీ చేస్తే, భారం మిగులుతుంది తప్ప భద్రత రాదు.నిజమైన స్వావలంబన అంటే మనం అదుపులో ఉంచుకోగల వనరుల నుంచి పంట అవసరాలను తీర్చుకోవడం. పప్పు« దాన్యాలు, జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు, అజొల్లా ద్వారా జీవ నత్రజని స్థిరీకరణ, పంట వ్యర్థాల పునర్వినియోగం, పశువుల ఎరువు, అన్నిటికీ ఆధారమైన నేలలో సేంద్రియ పదార్థం– ఇవి పెరిగితే వేసే ప్రతి కిలో ఎరువూ మరింత సమర్థంగా పనిచేస్తుంది. జీవసారం పెంచితే ప్రోత్సాహకాలుఇప్పుడు డబ్బుల మాట. దేశ ఎరువుల రాయితీ దాదాపు రూ.1.7 లక్షల కోట్లు; అందులో యూరియాదే రూ.1.19 లక్షల కోట్లు. తగ్గిపోతున్న రసాయనిక ఎరువుల సామర్థ్యం, వృథా అవు తున్న సగం నత్రజని– వీటిని చూస్తే ఇది తక్కువ ప్రయోజనం ఇచ్చే ఖర్చు. ఈ రాయితీలో సగాన్ని– అంటే దాదాపు 85 వేల కోట్లను– నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి మళ్లిస్తే ఏమవుతుంది?ఒక టన్ను యూరియా ఒక్క సీజన్ కే అయిపోతుంది, మళ్లీ కొనా ల్సిందే. కానీ నేలలో పెరిగిన సేంద్రియ కర్బనం ఏళ్ల తరబడి నిలు స్తుంది. ప్రతి ఏటా దిగుబడిని, నీటి నిల్వను, ఎరువుల సామర్థ్యాన్ని పెంచుతుంది. నేల బాగుపడిన కొద్దీ దానికి కావాల్సిన నత్రజని తగ్గుతుంది, దాంతోపాటే రాయితీ భారమూ తగ్గుతుంది.అందుకే ఒక జాతీయ/రాష్ట్ర స్థాయి నేల ఆరోగ్య పునరుద్ధరణ మిషన్ అవసరం. నేలలో సేంద్రియ కర్బనం, జీవసారం పెరిగిన కొద్దీ రైతుకు నేరుగా ప్రోత్సాహకం అందాలి. గ్రామ స్థాయి కంపోస్ట్, పంట వ్యర్థాల పునర్వినియోగం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో జీవ ఎరువుల యూనిట్లు– వీటిని ఉపాధి హామీ పథకం, ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానం చేయాలి.‘రసాయనిక ఎరువులు లేకుండా దేశాన్ని పోషించలేం’ అనే వాదన రావచ్చు. ఎరువులను పూర్తిగా వదిలేయాలని అనడం లేదు. మొదట్లో రసాయనికం, జీవసంబంధం రెండింటినీ కలిపి వాడే సమీ కృత పోషక యాజమాన్యమే మార్గం. భారత్ తదుపరి వ్యవసాయ విప్లవం మరిన్ని రసాయనిక ఎరువులపై కాదు– ప్రాణమున్న నేల లను తిరిగి నిర్మించడంపై ఆధారపడాలి. ఏ ఓడరేవు, గ్యాస్ పైప్‌లైన్ కోసం మనం ఎదురుచూడనక్కర్లేదు– మన అతిపెద్ద ఎరువుల కర్మాగారం ప్రతి రైతు కాళ్ల కింద, నేల జీవంలోనే ఉంది. -వ్యాసకర్త సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) కార్యనిర్వాహక సంచాలకులు-డా‘‘ జి.వి.రామాంజనేయులు -
దుర్భిక్ష పర్వం
ఈ ఏడాది వానలు ముఖం చాటేస్తున్నాయి. రైతుల కళ్లల్లో దిగులు మబ్బులు కనిపిస్తున్నాయే గాని, ఎక్కడా చినుకుల సవ్వడి వినిపించడం లేదు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవకుంటే, చాలినన్ని తిండి గింజలు పండక కరవు కాటకాలు తప్పవు. అనావృష్టి తెచ్చిపెట్టే కరవు కాటకాలు సామాన్యుల బతుకులను దుర్భరం చేస్తాయి. ప్రధానంగా మనది వ్యవసాయాధారిత దేశం. వ్యవసాయాన్నే నమ్ముకుని, దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న కర్షక జనాభా వర్షాభావం వల్ల కష్టాల్లో పడితే, యావత్ దేశానికే కష్టాలు తప్పవు. వర్షాల కోసం క్రమం తప్పక యజ్ఞయాగాదులు చేసే సంస్కృతి మనది. వర్ష ప్రాధాన్యం పట్ల ఎరుక కలిగిన జాతి మనది. ‘అనావృష్టి మతీత్యైవ మహతీ వర్షసంతతిః/ భూతానాం సంక్షయం చక్రే దుర్భిక్ష పరిపీడితమ్’ అని విష్ణుపురాణం చెబుతోంది. అనావృష్టి వల్ల పంటలు పండక దుర్భిక్షంతో మనుషులే కాదు, సమస్త ప్రాణులూ సంక్షోభానికి, నాశనానికి లోనవుతాయి. కరవు కాటకాలు మన దేశానికి కొత్త కాదు. వానలు లేక, నేల నెర్రెలు పడిన దుర్భర దుర్భిక్ష వర్ణనలు మన పురాణ సాహిత్యం మొదలుకొని ఆధునిక సాహిత్యం వరకు చాలానే ఉన్నాయి. ‘అదే పెన్న! అదే పెన్న!/ నిదానించి నడు/ విదారించు నెదన్, వట్టి/ ఎడారి తమ్ముడు!’ అంటూ ‘పెన్నేటి పాట’ రాసిన విద్వాన్ విశ్వం ఒకనాటి రాయలసీమ కరవు దృశ్యాన్ని హృదయ విదారకంగా చిత్రించారు. కరవు కాటకాలను ముందుగా తెలుసుకునే సాంకేతికత ఇదివరకు ఉండేది కాదు. అందువల్ల దుర్భిక్షాన్ని దైవఘటనగానే పరిగణించేవారు. ఇటీవలి కాలంలో సాంకేతిక పెరిగింది. అతివృష్టి, అనావృష్టి పరిస్థితు లను; అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానుల వంటి ప్రకృతి విపత్తులను ముందు గానే గ్రహించి, వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేయగలుగుతున్నారు.పాలకులు బాధ్యతనెరిగిన వారైతే, వాతావరణ శాస్త్రవేత్తల హెచ్చరికలను పట్టించుకుని కార్యాచరణను ప్రారంభిస్తారు. పాలకులు బాధ్యతను మరచి, హాలికులను వారి కర్మానికి వారిని విడిచిపెడితే, దుర్భిక్ష పర్యవసానాలు మరింత దుర్భరంగా ఉంటాయి. ఈసారి ‘సూపర్ ఎల్ నినో’ పరిస్థితులు ఏర్పడనున్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు వేసవిలోనే హెచ్చరికలు చేశారు. ఈ హెచ్చరికలు ఒకవైపు రైతులలో గుబులు పెంచుతుంటే, మరోవైపు చీకటి వ్యాపారులలో, రాజకీయ దళారులలో, అవినీతిలో మునిగితేలే అధికార గణాల్లో సంబరాన్ని పెంచుతున్నాయి. కరవును కూడా సొమ్ముచేసుకోగల సమర్థులు మనకు కొత్త కాదు. ఇలాంటి దౌర్భాగ్యాన్ని గురించే పాత్రికేయుడు సాయినాథ్ ‘ఎవ్రీబడీ లవ్స్ ఎ గుడ్ డ్రౌట్’ పుస్తకాన్ని ముప్పయ్యేళ్ల కిందటే రాశారు.‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అని నేలను నమ్ముకున్న రైతు కలలోనైనా కరవు కాటకాలను కోరుకోడు. రోజువారీ పనులు చేసుకుంటూ అన్నం తిని బతికే సామాన్య ప్రజలు కూడా కరవు కాటకాలను కోరుకోరు. ప్రతి సంక్షోభాన్నీ స్వీయ సంక్షేమ అవకాశంగా మార్చుకొనే దౌర్భాగ్యులే దుర్భిక్షాన్ని కోరుకుంటారు. ‘వార్ధుషికః వణిగ్బంధుః యే చ ప్రభూతమన్న సంగ్రహం/ కృత్వా దుర్భిక్షం వాంఛంతి తే పి వార్ధుషికా’ అని ప్రాచీన సుభాషిత శ్లోకం చెబుతుంది. వర్తకులకు అధిక వడ్డీలకు అప్పులిచ్చి, జనాలను పీడించే వడ్డీ వ్యాపారులు దేశంలో కరవు కాటకాలు రావాలని కోరుకుంటారని ఈ శ్లోక సారాంశం. ఇప్పటి కాలంలో వడ్డీ వ్యాపారులకు జతగా కార్పొరేట్ ఫైనాన్స్ కంపెనీల నిర్వాహకులు, రాజకీయ దళారులు, లంచగొండి అధికారులు కూడా జనాలకు దాపురించారు.వీళ్లందరూ కరవులో అధికమాసం లాంటివారు.ఈ ఏడాది ‘సూపర్ ఎల్ నినో’ కారణంగా భారత్ సహా ఎనభై ఎనిమిది దేశాలు తీవ్ర వర్షాభావంతో అల్లాడనున్నాయి. ఇది కేవలం ప్రకృతి పరిణామం మాత్రమే కాదు, ఇంగితం లేని పాలకుల చర్యలకు పర్యవసానం కూడా! భూతాపం పెరుగుదలపై పర్యావరణవేత్తలు మొత్తుకుంటూనే ఉన్నా, కొందరు దేశా«ధినేతలు యుద్ధ విధ్వంసాల్లో మునిగితేలుతున్నారు. ఇంకొందరు అభివృద్ధి పేరుతో అడవుల నరికివేతకు ఊత మిస్తున్నారు. ఈకాలం దుర్భిక్షం బాధ్యతెరుగని పాలకుల స్వార్థఫలం. -
స్మార్ట్‌గా.. సాగు!
రాష్ట్రంలో వ్యవసాయం ‘స్మార్ట్’గా మారుతోంది. సాగు ఆధునికతను సంతరించుకుంటోంది. యంత్ర పరికరాలకు తోడుగా ఫోన్ ఆధారిత వ్యవసాయం పెరుగుతోంది. రైతన్నలు వివిధ రకాల యాప్‌లను వినియోగిస్తున్నారు. పంటల సాగులో మెళకువలు తెలుసుకుంటున్నారు. వాతావరణ హెచ్చరికలు గమనిస్తున్నారు. చీడ పీడల గురించి ముందే తెలుసుకుని జాగ్రత్త పడుతున్నారు. పెట్టుబడిని తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడి పొందుతున్నారు.ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో రైతు చేతిలోని ఫోన్‌నే పంటల సాగుకు ఉపకరిస్తోంది. ‘ఈ పొలంలో 3 రోజుల్లో చీడ దాడి చేసే అవకాశం 80 శాతం ఉంది..’అంటూ తెలుగులో వాయిస్ అలర్ట్ నేరుగా రైతుకు వస్తోంది. కృత్రిమ మేధస్సు అంటే ఏఐ సాంకేతికతను వినియోగించుకుంటూ రైతులు దిగుబడి పెంచుకుంటున్నారు. ప్రభుత్వం, స్టార్టప్‌లు కలిసి రాష్ట్ర వ్యవసాయాన్ని స్మార్ట్‌గా మారుస్తున్నాయి. ఎప్పటికప్పుడు అలర్ట్‌లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని 22 గ్రామాల్లో ఇప్పటికే ఏఐ విప్లవం మొదలైంది. ఇక్కడ 56 వేల ఎకరాలు, 15 వేల మంది రైతులతో ‘కృషివాస్’యాప్ ప్రయోగాత్మకంగా నడుస్తోంది. ఉపగ్రహం ద్వారా వచ్చే డేటాను బట్టి పొలంలో నీటి కొరత, పోషకాల లోపం, చీడపీడల దాడిని 3 ్ఠ 3 మీటర్ల కచ్చితత్వంతో ముందే గుర్తిస్తోంది. ఈ ప్రాజెక్టును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.మరోవైపు వికారాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ‘ఫార్మ్ప్రై’సెజ్ యాప్‌ను రైతులు విరివిగా వాడుతున్నారు. వాటర్‌షెడ్ ఆర్గనైజేషన్ ట్రస్ట్ డేటా ప్రకారం ఈ యాప్‌లోని ఏఐ చీడపీడల ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ద్వారా పత్తి, సోయాబీన్ రైతులు తెగులు వచ్చే 7–10 రోజుల ముందే హెచ్చరిక అలర్ట్ అందుకుంటున్నారు. దీనివల్ల అనవసరంగా పురుగుమందులు కొట్టడం తగ్గి, ఎకరానికి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఆదా అవుతోంది. యాప్ తెలుగులో ఉండటంతో చదువు తక్కువ ఉన్న రైతులు కూడా సులభంగా వాడుతున్నారు.⇒ ఫీల్డ్వైజ్ యాప్‌లో ఆకు ఫొటో పెడితే వెంటనే సమాధానం వస్తుంది. ఏ తెగులో గుర్తించి ఏ మందు వాడాలో సూచిస్తుంది. ఉపగ్రహం, డ్రోన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, జీఐఎస్ డేటాను కలిపి పంట ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది. తెలుగులో వాయిస్ ద్వారా సలహాలు ఇచ్చే జీఏఐ చాట్‌బాట్ కూడా ఉంది. గత ఏడాది చీడ వల్ల నష్టపోయా. ఈసారి ముందుగానే జాగ్రత్త పడ్డా. ఏఐ లేకపోతే ఇంత లాభం వచ్చేది కాదు. – నాయుడు, రైతు, చెన్నిపాడు గ్రామం, మనోపాడ్ మండలం, జోగుళాంబ గద్వాల జిల్లావాతావరణం తెలుసుకుంటున్నా.. కృషివాస్ యాప్ ద్వారా వాతావరణం, మార్కెట్ రేట్లు రోజూ తెలుసుకుంటున్నా. వర్షం ఎప్పుడు వస్తుందో ముందే తెలిస్తే ఎరువులు వేసుకునే విషయంలో జాగ్రత్త పడొచ్చు. పిల్లాడు ఫోన్లో నేరి్పంచాడు. ఇప్పుడు నేనే అందరికీ చెబుతున్నా. – మారెప్ప, రైతు, సల్కాపురం, గట్టు మండలం, జోగుళాంబ గద్వాల జిల్లాసాగు ఖర్చు 20% తగ్గింది గతంలో పురుగు ఆశించిన తర్వాతే తెలిసేది. ఇప్పుడు ఫార్మ్ప్రై సెజ్ యాప్‌లో ఏఐ అలర్ట్ వచ్చిన వెంటనే స్ప్రే చేస్తున్నా. 5 రోజుల వాతావరణ సూచన, మార్కెట్ ధరలు. పత్తి, సోయాబీ¯న్లో చీడపీడలను ముందే అంచనా వేసే హెచ్చరిక వ్యవస్థ ఇందులో ఉంది. ఫొటో తీసి అప్లోడ్ చేస్తే ఏ తెగులు, ఏ మందు కొట్టాలో చెబుతుంది. నా 5 ఎకరాల పత్తి సాగులో ఈసారి ఖర్చు 20% తగ్గింది. యాప్‌లో తెలుగు భాషా సౌలభ్యం ఉండటం వల్ల మా నాన్న కూడా యాప్‌ను సులభంగా వాడుతున్నారు.– చాకలి నరేష్, యువ రైతు, ఐనెల్లి గ్రామం, తాండూరు మండలం, వికారాబాద్ జిల్లాశుభ పరిణామం జిల్లాలో రైతులు వివిధ యాప్‌లు వినియోగిస్తున్నారు. టెక్నాలజీతో వ్యవసాయం చేస్తున్నారు. కొంత మంది రైతులు తమ పిల్లల ద్వారా నేర్చుకుంటున్నారు. ఈ యాప్‌ల వల్ల రైతులకు ఎంతో లబ్ది చేకూరుతోంది. ప్రస్తుతానికి పూర్తిస్థాయిలో జరగకున్నా ఇదొక మంచి పరిణామం. - ఎం.సుజాత, రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారివిదేశాల్లో ఇలా.. అమెరికాలో ప్లాంట్విలేజ్ నురు యాప్ ఆకు ఫోటో తీస్తే 96% కచ్చితత్వంతో తెగులును గుర్తిస్తుంది. నెదర్లాండ్స్‌లో ఫామ్21 + ఏఐ వ్యవస్థ సెన్సార్ల ద్వారా డేటాను విశ్లేషించి వాట్సాప్‌లో హెచ్చరిక పంపుతుంది. టమోటా, మిర్చి పంటల్లో 30% దిగుబడి పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. -
క‘మెషన్ల’ పంచాయితీ !
సాక్షి, అమరావతి: వ్యవసాయ యాంత్రీకరణ పథకం అవినీతికి ఆలవాలంగా తయారైంది. వరుసగా రెండో ఏడాదీ కమీషన్ల పంచాయితీ తేలక పట్టాలెక్కలేకపోతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు 2 నెలలు గడిచింది. కానీ ఇప్పటి వరకు పర్సంటేజ్‌లు తేలక పోవడంతో ఈ పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఆది నుంచి ఆపసోపాలే.. చంద్రబాబు సర్కారు గద్దెనెక్కగానే వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా ఏటా లక్ష మందికిపైగా వ్యక్తిగత పరికరాలు ఇస్తామంటూ గొప్పగా ప్రకటించింది. ఆచరణకు వచ్చే సరికి 2024–25లో రూ.343 కోట్ల కేంద్ర నిధులతో దాదాపు లక్ష మందికి వ్యక్తిగత పరికరాలు, సీహెచ్‌సీ గ్రూపులకు వెయ్యి కిసాన్ డ్రోన్స్, క్లస్టర్ స్థాయిలో 100 కంబైన్డ్ హార్వస్టర్స్ ఇస్తామని ఆశ చూపి, చివరికి ఆర్థిక శాఖ కోతలతో రూ.129 కోట్లతో 25వేల వ్యక్తిగత పరికరాలు, 875 డ్రోన్లతో సరిపెట్టారు. 2025–26 సీజన్లో రూ.240 కోట్లతో ఎఫ్‌పీవోలు, ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు 1000, ఇంజనీరింగ్ పట్టభద్రులకు 75 కిసాన్ డ్రోన్స్, సీహెచ్‌సీ లకు 164 హైకాస్ట్ మిషనరీ,1050 ట్రాక్టర్లతో పాటు 50వేలకు పైగా వ్యక్తిగత పరికరాలిస్తామని ప్రకటించగా కమీషన్ల పంచాయతీ తెగకపోవడం గతేడాది ఈ పథకం అటకెక్కిపోయింది. అమలుకాని మార్గదర్శకాలు గతేడాది బడ్జెట్‌తోనే ఈ ఏడాది కొనసాగించేలా మే 4న మార్గదర్శకాలు జారీ చేశారు.ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు, మహిళా లబ్దిదారులకు యంత్రాల యూనిట్ ధరలో 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం చొప్పున సబ్సిడీ ఇస్తున్నారు. తొమ్మిది రకాల పరికరాలను ఈసారి సరఫరా చేస్తున్నారు. వీటిలో ప్రధానంగా పవర్ టిల్లర్లు, రోటేవేటర్లు, హార్వెస్టింగ్ థ్రెషర్లు, పురుగు మందులు పిచికారీ చేసే స్ప్రేయర్లు ఉన్నాయి. వీటితో పటు నూరి్పడి యంత్రాలు, విత్తన గొర్రులు, ట్రాక్టర్‌తో పనిచేసే పరికరాలు, 40 హెచ్‌పీ వరకు సామర్థ్యం కలిగిన 2డబ్ల్యూడీ, 4 డబ్ల్యూడీ ట్రాక్టర్లను రైతులకు రాయితీపై అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం మే 5 నుంచి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదం పొందిన తర్వాత జిల్లా జాయింట్ కలెక్టర్ల సమక్షంలో మే 23–25వ తేదీ మధ్యలో లాటరీ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. వారి నుంచి నాన్ సబ్సిడీ వాటా వసూలు చేసిన తర్వాత జూన్ 26వ తేదీ నుంచి యంత్రాలను కంపెనీల నుంచి నేరుగా డెలివరీ చేయాలి. క్షేత్రస్థాయిలో గ్రౌండింగ్ అయ్యాయో లేదో పరిశీలన తర్వాత జూన్ 30 నుంచి సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేస్తామని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం మే 5 నుంచి 19 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అందిన దరఖాస్తుల ఆధారంగా రైతుల నుంచి వచ్చే డిమాండ్ మేరకు మే 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జిల్లా వ్యవసాయ శాఖాధికారులు లక్ష్యాలను నిర్దేశించారు. రెండు నెలలుగా ఇన్చార్జి మంత్రి లాగిన్‌లోనే దాదాపు ప్రతి జిల్లా నుంచి 5వేలకు పైగా దరఖాస్తులు రాగా, ఇన్చార్జి మంత్రుల ఆమోదానికి పంపారు. అయితే వాటిని నియోజకవర్గాల వారీగా విభజించి స్థానిక ఎమ్మెల్యేల పరిశీలనకు పంపారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. ఈ పరికరాల పంపిణీలో అందిన కాడకి దండుకోవాలన్న ఆలోచనతో యూనిట్ అంచనా విలువలో కనీసం 15–20 శాతం వరకూ కమీషన్ కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కమీషన్లో ఎవరికి వారు తమకు మెజార్టీ వాటా కావాలని పట్టుబడుతున్నారని చెబుతున్నారు. ఇన్చార్జి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల మధ్య కమీషన్ పంచాయతీ తేలకపోవడంతో దరఖాస్తులు రెండు నెలలుగా ఇన్చార్జి మంత్రి లాగిన్‌లోనే ఉండిపోయాయి. మెజార్టీ వాటా తమకే ఇవ్వాలంటూ కొంతమంది స్థానిక ఎమ్మెల్యేలు పట్టుబడుతుండగా, మరికొంత మంది ఎమ్మెల్యేలు లబ్దిదారుల నుంచి సబ్సిడీలో వాటాల కోసం ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఇలా ఎడాపెడా సంబంధిత మంత్రితోపాటు ఇన్చార్జి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల మధ్య కమీషన్ వ్యవహారం కొలిక్కిరాకపోవడంతో ఈ పథకం అమలు మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. ఏదేమైనా సీజన్ ప్రారంభమై 45 రోజులైనా పరికరాలు చేతికి రాకపోవడంతో ప్రభుత్వ తీరుపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. -
ఈ చెట్టుతో పాములు పారిపోతాయి..
కలిమి పండు చాలా మందికి తెలిసిన పండే. కానీ కొండ ప్రాంతాలు, బంజరు భూములు, పొలంగట్లు మొదలగు ప్రాంతాల్లో వచ్చే కలిమి మాత్రం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు.వీటికాయలు వగరు రుచి కలిగి ఉంటాయి. ఇవి నేరుగా తినటానికి అంత అనుకూలంగా లేకున్నా ఇతర ఉపయోగాలెన్నో ఉన్నాయి. పండుగా మారినప్పుడు తియ్యగా ఉండి (నలుపు రంగుకు మారుతుంది) తినటానికి యోగ్యంగా ఉంటుంది. ఈ కాయలు కోసినప్పుడు తొడిమ దగ్గర పాలు కారతాయి. కాబట్టి పండ్లను కడిగి తినటం మంచిది. పండ్లు గుత్తులుగా, ఒకటి, రెండుగా కూడా ఉంటాయి. పండ్లు బఠాణీ గింజ సైజు ఉంటాయి. మేలు రకమైన కలిమి పండ్లను ‘వాక్కాయ’లు అంటారు. ఇవి గచ్చకాయంత ఉంటాయి.‘కలిమి కాస్తే కాలం అవుతుంది’ అంటారు. అంటే.. సుభిక్షంగా పంటలు పండుతాయని రైతులు, పల్లెవాసుల ప్రగాఢ నమ్మకం. కరువును తట్టుకొని నిలబడే సత్తా ఈ చెట్టుకుంది.శాస్త్రీయ నామం: క్యారస్స క్యరండస్కుటుంబం: ఆపోసైనేసికలిమి పండు పేర్లు: ఉరూ: కశౌండ ఒరియా: సుశేన కన్నడ: కవలి, హువు, కవలి కాయ్. గరిచే, గర్ని, గర్తి, కరండ, అస్సామీ: కరెంజా, కర్ణటెంగ ఇంగీష్: కరండస్ బెర్రి, క్రేన్ బెరీ, కరౌండ కరమకిరె తమిళం: కాలక్కాయి, కలక్కాయి తెలుగు: కలిమి, కలిమిక్కాయ, వాక్కాయ(పెద్ద పండ్లు) మరాఠీ: కర్వండ, కర్విండ, కాలిమైన, బోరోండ మలయాళం: కరక్కా పంజాబీ: గర్న బెంగాలీ: కరోంమ్చా హిందీ: కరోండ, కరౌండ, కరండ సంస్కృతం: కరమర్డ్, కరమర్ది, కరోండ అని పిలుస్తారు. ఇంగ్లాండ్‌లో కరండస్ ప్లం, ఇండోనేసియాలో కరండన్, కరెండంగ్ అని, చైనీస్‌లో కు హౌంగీ అని, పాకిస్తాన్లో గర్నే, కరండ, కక్రుండ అని, వియత్నాంలో క్యాసిరో, క్జోరో అని, మలేసియాలో బెరెండ, కరెండ, కరెండింగ్ అని పిలుస్తారు.పూత: ఏప్రిల్ – మే. పండ్లు కోత: నవంబర్– డిసెంబర్.ఉనికి:ఇది సతతహరిత ఆకులురాల్చే గుల్మం (పొదలాంటిది). నేల స్వభావాన్ని బట్టి 2–5 మీటర్ల ఎత్తు పెరగగలదు. గుబురైన మండలు (కొమ్మల), కురుచైన ముళ్లు ఉంటాయి. అందువల్ల దీన్ని క్రిష్ థార్న్ అని అంటారు.గుత్తులుగా తెలటి పూలు, అందంగా ఉంటాయి. కాయలు కూడా గుత్తుగా కాస్తాయి. పెద్ద వాక్కాయ పండు నల్లగా ఉంటుంది. కానీ రుచిగా ఉండదు. అదే కలిమి (చిన్నది) పండు నల్లగానే వుంటాయి. కానీ రుచిగా ఉంటాయి.ఈ చెట్లు మన దేశంలో తూర్పు, పడమటి కనుమల అడవుల్లో, నేపాల్, శ్రీలంక, సౌత్ ఈస్ట్ ఆసియాలోని దేశాల్లో ఉన్నాయి. వాక్కాయ చెట్లను మాత్రం రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పండిస్తున్నారు.వాక్కాయి చెట్టు ఆకులు పశుగ్రాసంగా పనికొస్తాయి..కలిమి చాలా ఉపయోగకరమైన చెట్టు. పెద్ద ఎత్తుగా పెరగకపోయినా ఎక్కువ పంగలు/కొమ్మలతో గుబురుగా ఉంటుంది. ముళ్లతో కూడుకున్న ఈ చెట్లను పొలం చుట్టూ కంచెగా బాగా పని చేస్తాయి.దీని వేర్లను దంచగా వచ్చిన లేపనాన్ని పశువుల పుళ్లపై రుద్దితే పురుగులు చనిపోయి పుళ్లు త్వరగా మానిపోతాయి.దీని వేర్లతో చేసిన పౌడరు/పొడిని నీళ్లలో కలిపి చల్లితే ఆ ప్రదేశాల నుంచి పాములు పారిపోతాయి.వీటి ఆకులను పూల దండల్లో అందం కోసం పెడతారు. త్వరగా వాడిపోవు.కాయలను పచ్చడి తయారు చేయటానికి, అట్లే పూలిహోరలో కూడా వాడుతారు. దీని పచ్చడికి మంచి గిరాకీ ఉంది.ఈ పండ్లతో జామ్, జల్లీ, పానీయాలు తయారు చేస్తారు.ఆకులు గొర్రెలు, మేకలకు గ్రాసంగా ఉపయోగపడతాయి.ట్యానింగ్ పరిశ్రమల్లో ఎండిన ఆకులను వాడుతారు.పండ్లు రుచికరంగా ఉండటం వల్ల పిల్లలు బాగా ఇష్ట పడతారు.ఈ చెట్టు బెట్టెను తట్టుకోగలదు, అన్ని నేలల్లో వస్తుంది.దీని పండ్లను ఆయుర్వేదంలో విరివిగా వాడతారు. ముఖ్యంగా అసిడిటీ, అజీర్తి, పుండ్లు, చర్మవ్యాధులు, మూత్ర సంబంధిత, డయాబెటిక్ అల్సర్, కడుపు నొప్పి, అజీర్తి, రక్తహీనత, ఆకలి లేకపోవటం, పైత్యం, మనోవికల్పం మొదలగునవి నయం చేయటానికి వాడతారు.ఆకుల కషాయాన్ని, జ్వరాన్ని, విరేచనాలను, చెవి పోటును తగ్గించడానికి ఉపయోగిస్తారు.పోషక విలువలు మెండుకలిమి పోషక విలువలను గమనిస్తే చాలా విస్తృతంగా ఉంటాయి. విటమిన్–సి, విటమిన్ బిలు, ఇనుము ఉండటం వల్ల రక్తహీనత త్వరగా నయమవుతుంది. ఈ పండ్లలో మైరేడ్ యాంటిఆక్సిడెంట్స్, అవియే ఫ్లేవనాయిడ్స్, అల్కలాయిడ్స్, టానిన్స్, క్యారిస్సోన్, ట్రైటర్ ఫెనాయిడ్స్.. ఇవి ఉండటం వల్ల యాంటిపైరెడిక్, కార్డియోటానిక్, అనాల్జిన్ కారకాలుగా ఉపయోగపడతాయి.ఇందులోని పీచు పదార్థం ఉదర సంబంధిత రోగాల అదుపునకు ఉపయోగపడుతుంది. విటమిన్–సి జ్వరాలను అడ్డుకోడానికి, అదుపునకు ఉపయోగపడుతుంది. ఈ పండ్లలోని మెగ్నీషియం ఇతర విటమిన్లు, ట్రిప్టెఫాన్ వల్ల న్యూరోట్రాన్స్‌మిట్టర్ సెరటోనిన్ ఉత్పత్తి పెరిగి మానసిక వొత్తిడిని అదుపు చేసి ఆరోగ్యంగా ఉంచగలదు.కలిమి పండులో పెక్టిన్ అధికంగా ఉండడంవల్ల జాం, జెల్లీల తయారీలో ఉపయోగిస్తారు.కాయల రసం మధుమేహ రోగ నివారిణిగా ఉపయోగపడుతుంది. ∙ప్రతిరోజు వాక్కాయల రసం తీసుకోవటం వలన ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కొంతవరకు నివారించుకోవచ్చు. ∙దంతాలు పుచ్చిపోకుండా, నోటి నుంచి దుర్వాసన రాకుండా కలిమి పండు కాపాడగలదు. ప్రాంతాలను బట్టి పండ్ల పోషక విలువలలో వ్యత్యాసం ఉంటుంది. నల్లమలలో ఉండే పండ్ల విలువలపై విశ్లేషణ తరుచూ చేయడం అవసరం. ఈ కలిమి లేక వాక్కాయపై వైద్యపరంగా ఎంత పరిశోధన జరిగినప్పటికీ, వీటిలో అనువైన, అధిక దిగుబడులనిచ్చ వంగడాల తయారీలో క్షేత్రస్థాయి పరిశోధనలు తక్కువని చెప్పవచ్చు.పొలం చుట్టూ కంచెకలిమి తెలుగు రాష్ట్రాలలో విరివిగా పెరిగే గుల్మం లేక చిరు చెట్టు అనవచ్చు. నల్లమల అడవుల్లో కలిమి ఎక్కువగానే ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల వల్ల వీటి ఉనికికే ముప్పు పొంచి ఉంది. కాబట్టి పూత దశ నుంచి మొదలుకొని, పండు దశ వరకు పరిశీలించటం ముఖ్యం. అందులోని వేరియంట్స్‌ను గమనించి క్షేత్రస్థాయికి తీసుకురాగలిగితే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.ప్రస్తుతానికి రైతులు ఈ చెట్టును పొలం చుట్టూ కంచెగా వాడుతున్నారు. కాయలను (అడవి కలిమికాదు, వాక్కాయను) మార్కెట్ చేసుకోవచ్చు. అక్కడక్కడా వాక్కాయ తోటలు పెంచుతున్నట్లు దాఖలాలు ఉన్నాయి. కాబట్టి, అడవి కలిమిపై సరైన పరిశోధనలు చేపట్టి తినటానికి అనువుగా మార్చటం, నిల్వ సామర్థ్యాన్ని పెంచే దిశగా కృషి చెయ్యాలి. కలిమి పండ్లను అతిగా తింటే వాంతులు, విరేచనాలు రావచ్చు. కాబట్టి, ఎందుకైనా మంచిది మితంగా తినాలి.- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఈ కుండీలో నాచు ఎందుకుందో తెలుసా?
మిద్దె తోటలు, ఇంటి పంటలు, పెరటి తోటల్లో మొక్కలు ఆరోగ్యంగా పెరగటానికి నీటి యాజమాన్యం చాలా ముఖ్యం. ముఖ్యంగా కుండీల్లో పెంచే మొక్కలకు నీటిని అందించేటప్పుడు అదనంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుండీల్లో మొక్కలకు నీరిచ్చే ఉత్తమ పద్ధతేమిటో తెలుసుకుందాం.మొక్కలకు నీటిని ఎప్పుడూ ఉదయం ఎండ రాకముందే లేదా సాయంత్రం వేళల్లో అందించాలి. దీనివల్ల నీరు ఆవిరి కాకుండా వేర్లకు చేరుతుంది.మొక్కలకు అవసరానికి మించి నీరు పెడితే బ్యాక్టీరియా అభివృద్ధి చెంది ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది, దీనివల్ల వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది.వేసవిలో కుండీల్లో లేదా నేల పైభాగంలో ఎండుటాకులు, గడ్డి లేదా పాత గోనె సంచులను కప్పటం ద్వారా మట్టిలోని తేమను ఎక్కువ కాలం నిలుపుకోవచ్చు.కుండీల్లో అడుగున రంధ్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. నీరు నిలిచిపోతే మొక్కలు వ్యాధుల బారిన పడతాయి.ఆకుకూరలు, పూల మొక్కలపై నీటిని తుంపర్లలా చల్లడం వల్ల ఆకులపై ఉన్న దుమ్ము పోవడమే కాకుండా మొక్కలు తాజాగా ఉంటాయి.మట్టిలో నీరు ఎక్కువగా ఉంటే వేర్లకు ఆక్సిజన్ అందదు. దీనివల్ల వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది.ఆకులు రంగు మారి, వాలిపోయినట్లు కనిపిస్తాయి. ఇది మొక్కకు నీరు ఎక్కువైందని చెప్పే ప్రాథమిక సంకేతం.ఎక్కువ నీరు పోయటం వల్ల మట్టిలోని ముఖ్యమైన పోషకాలు కొట్టుకుపోతాయి, ఫలితంగా మొక్క ఎదుగుదల ఆగిపోతుంది.తడిగా ఉన్న నేల బ్యాక్టీరియా, ఫంగస్ పెరగటానికి అనువుగా ఉంటుంది. దీనివల్ల మొక్కల మొదళ్లు, ఆకులపై తెగుళ్లు వస్తాయి.నిరంతరం నీటితో నిండి ఉండటం వల్ల మట్టిలోని రంధ్రాలు మూసుకుపోయి మట్టి గట్టిగా మారుతుంది, ఇది వేర్ల విస్తరణను అడ్డుకుంటుంది.కుండీలోని మట్టి నుంచి దుర్వాసన రావటం, మట్టి పైన పాచి పట్టటం, కొత్తగా వచ్చే ఆకులు లేదా చిగుర్లు నల్లగా మారి రాలిపోతుంటే.. ఈ మూడు సమస్యలకు కారణం ఒక్కటే కావచ్చు. అదేమిటంటే.. మొక్కల కుండీల్లో నీరు బయటకు సరిగ్గా వెళ్లటం లేదని. నీరు వెళ్లడానికి తగినంత రంధ్రం ఉందో లేదో ఒకసారి తనిఖీ చేయండి.మట్టిలో నీరు ఎక్కువగా నిలిచి ఉంటే వేర్లు ఊపిరి తీసుకోలేవు. ఈ ఒత్తిడి వల్ల మొక్క తనపై ఉన్న భారాన్ని తగ్గించుకోవటానికి పువ్వులు, మొగ్గలు, కాయలను రాల్చేస్తుంది.అధిక నీరు పోయడం వల్ల మట్టిలోని పోషకాలు కొట్టుకుపోతాయి. పూత నిలబడటానికి అవసరమైన కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు అందక పిందెలు రాలిపోతాయి.మట్టిలో నీరు ఎక్కువ ఉంటే శిలీంధ్రాలు చేరి వేర్లు కుళ్ళిపోతాయి. దీనివల్ల మొక్క బలహీనపడి పిందెలను పోషించలేక వాటిని రాల్చేస్తుంది.నీరు ఎక్కువవటం వల్ల మొక్కలో ఎథిలిన్ వంటి హార్మోన్లు పెరిగి, పూలు, కాయలు కాండం నుంచి∙విడిపోయేలా చేస్తాయి.మట్టి పై పొర 1–2 అంగుళాల వరకు ఆరితేనే నీరు పోయాలి, వేలితో తాకి చూస్తే ఇది తెలుస్తుంది.మొక్క పూత మీద ఉన్నప్పుడు నీటిని తగ్గించి, నేల తేమగా ఉండేలా మాత్రమే చూసుకోవాలి.మొక్క కాయను పెంచడానికి చాలా శక్తి కావాలి. నీరు ఎక్కువగా ఉండి వేర్లు సరిగ్గా పని చేయకపోతే, మట్టిలోని పోషకాలు కాయలకు చేరవు, ఫలితంగా కాయలు రాలిపోతాయి.కొన్నిసార్లు మట్టి బాగా ఎండిపోయినప్పుడు ఒక్కసారిగా ఎక్కువ నీరు పోస్తే, ఆ తేమలో వచ్చే మార్పును భరించలేక మొక్క కాయలను రాల్చుతుంది.కాయలు ఎదుగుతున్న దశలో నీరు సమానంగా అందాలి. ఒకరోజు తక్కువ, ఒకరోజు ఎక్కువ ఇవ్వకూడదు.మట్టిలో నీరు ఎక్కువగా ఉంటే వేర్లకు ఆక్సిజన్ అందదు. దీనివల్ల వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది. నీరు కుండీలో నిల్వ వుంటే మట్టిలోని పోషకాలు కాయలకు చేరవు, ఫలితంగా కాయలు రాలిపోతాయి.- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
పోషకలోపాన్ని తగ్గించే 'ఎర్రజాన'
ఎర్ర జాన కూడా ఉష్ణ మండలపు ఆకులురాల్చే చెట్ల తెగకు సంబంధించినది. ఈ చెట్లు 5–8 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆకులు, పూలు ఇంచు మించు ఫాల్సా ఆకులను పోలి ఉంటాయి. కొమ్మలు కిందికి సాగి ఉంటాయి.ఈ చెట్లు నలమల అడవి అంతటా లేవు. మల్లాపూర్, అప్పాపూర్ పోయే దారిలో తారసపడుతాయి. ఎర్ర జాన ఎక్కువగా ఇండియన్ సబ్ కాంటినెంట్ మొదలు చైనా వరకు ఉంటాయి. యున్సోవ్, మలేషియా, మైన్మార్, లాహోస్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం, బంగ్లాదేశ్, కంబోడియా తదితర దేశాలు వీటి స్థలాలు. ఈ చెట్లు దాదాపు సముద్ర మట్టం నుంచి 100 మీటర్ల ఎత్తులో కూడ ఆటు పోట్లను తట్టుకొని పెరుగుతాయి.తెలుగు: ఎర్ర జానబెంగాలీ: ధమిన్మరాఠీ: థమన్మలయాళం: చడచి, దనౌనిఇంగ్లీష్: థమన్కన్నడ: బుటలెగుజరాతీ: థమన్తమిళం: వృక్షం, అన్నంహిందీ: థమన్, కహ్ రాచిసంస్కృతం: దన్ వృక్షం అని పిలుస్తారు. ప్రాంతాలను బట్టి ఉచ్ఛారణలో కొంత తేడా ఉంటుంది.పూత: మార్చి– ఏప్రిల్పండ్లు: మే– జూన్ ఉపయోగాలు...ఈ చెట్ల అన్ని భాగాలు ఉపయోగపడుతాయి. ఎర్ర జాన పండ్ల పై పొట్టు ఎరుపు– కాషాయ వర్గం కలిగి ఆకరణీయంగా ఉంటాయి.పండ్లలో ఒక గింజ, రెండు గింజలు, కొన్నిటిలో మూడు, నాలుగు గింజలు కూడా ఉంటాయి.గింజలపై ఉండే పలుచటి పొర రుచికరంగా తీపిదనం కలిగి ఉంటుంది. ఈ పండ్లను చెంచులు ఇష్టంగా తింటారు.ఆకులను పశువులు, జీవాలు ఇష్టంగా తింటాయి. కలపను చిన్న చిన్న వ్యవసాయ పనిముట్లకు, ఇతర కట్టె వస్తువుల తయారీలో వాడవచ్చు.వంట చెరకుగా కూడా ఉపయోగపడుతుంది.బెరడు నుండి కషాయం చేసి, దాన్ని అనేక రుగ్మతలను ముఖ్యముగా పుండ్లు నయం చేయటానికి, వాత, పిత్త, కఫాలను తగ్గించటానికి వైద్యంలో వాడతారు.కడుపులో మంట పోటానికి ఈ బెరడు ఎంతో ఉపయోగపడుతుందని చెంచులు చెప్పారు.ఎర్ర జాన పండ్లలో సూక్ష్మ ధాతువులు, ముఖ్యంగా విటమిన్లతో పాటు యాంతోసైనిన్స్, ఫినాల్స్, ప్లేవనైడ్స్ మొదలగునవి ఉంటాయి.పండ్లలో ఓ మోస్తరు యాంటిఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.వ్యవసాయం పంటలు, చెట్లతో కలిపి (ఆగ్రో–ఫారెస్ట్రీ) పెంచదగిన అనువైన చెట్టు.ఎన్నో ఉపయోగాలు కలిగిన ఈ చెట్ల జాతిని అభివృద్ధి ఎంతో అవసరం.ఎర్ర జాన చెట్లపై తగిన పరిశోధనలు జరిపి పల్లపు ప్రాంతాల్లో వీటి ఉనికిని చాటాలి.తద్వారా ప్రజల్లో, ముఖ్యంగా పేద ప్రజల్లో, పోషకలోపాన్ని తగ్గించటంలో ఎంతో ఉపయోగపడగలదని ఆశించవచ్చు.- డాక్టర్ మొరుపోజు పద్మయ్యవిశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
Sagubadi: ఆ దేశాల్లో 20 రెట్లు ఎక్కువ!
2035 నాటికి సంపన్న దేశాల్లో వ్యవసాయ కార్మికుల ఆదాయాలు దక్షిణాసియా, సబ్–సహారా ఆఫ్రికా కంటే 20 రెట్లు ఎక్కువగా ఉండవచ్చని ఒక నివేదిక పేర్కొంది. 2035 నాటికి ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తి 13% పెరుగుతుంది. అదే సమయంలో అధికాదాయ దేశాల్లో వ్యవసాయ కార్మికుల వార్షిక ఆదాయం 22,155 డాలర్లు ఉంటుందని అంచనా.దక్షిణాసియా, ఉప–సహారా ఆఫ్రికాలో ఈ ఆదాయాలు 1,100 డాలర్ల స్థాయిలోనే ఉండిపోతాయని అంచనా. ప్రత్యక్ష వ్యవసాయ గ్రీ¯Œ హౌస్ వాయు ఉద్గారాలు పెరుగుతున్నప్పటికీ, అల్పాదాయ దేశాల్లో ఆహార భద్రత, పోషకాహార అంతరాలు కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ), ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) సంయుక్తంగా విడుదల చేసిన కొత్త నివేదిక హెచ్చరిస్తోంది.ఉత్పాదకత మెరుగుదల కారణంగా రాబోయే దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి కార్మికునికి సగటు స్థూల వ్యవసాయ ఆదాయం 9 శాతం మేర పెరుగుతుందని అంచనా. ముడిసరుకుల ఖర్చులు పెరుగుతున్నప్పటికీ, వాస్తవ వ్యవసాయ ధరలు స్థిరంగానే ఉంటాయని ఆశిస్తున్నారు.ఈ నివేదిక ప్రకారం, ప్రతి వ్యవసాయ కార్మికుని వాస్తవ స్థూల ఆదాయంగా లెక్కించిన ప్రపంచ సగటు వ్యవసాయ కార్మిక ఉత్పాదకత 2035 నాటికి 3,800 డాలర్లుగా ఉంటుంది. ఇది సగటు మాత్రమేన. అధికాదాయ, అల్పాదాయ దేశాల్లోని కార్మికుల మధ్య అంతరం కూడా పోరిగిపోతోంది. అధిక ఆదాయ దేశాలలో 2023–25లో వ్యవసాయ కార్మిక ఉత్పాదకత 21,100 డాలర్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంది. 2035 నాటికి ఇది 22,155 డాలర్లకు పెరుగుతుందని భావిస్తున్నారు.ఉత్తర అమెరికా, పశ్చిమ ఐరోపా, ఓషియానియాప్రాంతాల్లో అత్యధిక తలసరి వ్యవసాయోత్పత్తి నమోదవుతుందని అంచనా. ఈప్రాంతాల్లో విస్తారమైన భూకమతాలు ఉంటాయి. తక్కువ శ్రమ, అత్యధిక స్థాయి యాంత్రీకరణ జరుగుతుందని నివేదిక పేర్కొంది. మరోవైపు, సహారా ఉప–్రపాంత ఆఫ్రికా, దక్షిణాసియాలోని అల్ప ఆదాయప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు ప్రస్తుతం సగటున సంవత్సరానికి సుమారు 930 డాలర్లు సంపాదిస్తున్నారు. ఈ ఆదాయం 2035 నాటికి కేవలం 1,100 డాలర్లకు మాత్రమే పెరుగుతుంది. అంటే దశాబ్ద కాలంలో సుమారు 170 డాలర్లు మాత్రమే పెరుగుతుందని నివేదిక అంచనా వేస్తోంది.వ్యవసాయ కార్మికుల సగటు ఆదాయాల్లో అంచనా వేసిన 9 శాతం పెరుగుదల ఏమాత్రం సురక్షితం కాదు. వ్యవసాయ మార్కెట్లు అస్థిరతకు గురవుతూ ఉంటాయి. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, 2035లో ప్రతి కార్మికునికి స్థూల వ్యవసాయ ఆదాయం, అంచనా వేసిన ్రపాథమిక స్థాయి కంటే కనీసం 12 శాతం తక్కువగా ఉండే అవకాశం లేకపోలేదని నివేదిక చెబుతోంది. అల్పాదాయ దేశాల్లో అ లోటు 20 శాతానికి మించి ఉండవచ్చని అంచనావేస్తున్నారు.ఆదాయాల్లో ఈ వ్యత్యాసం ఆహార భద్రత, వినియోగ సరళిలో కూడా ప్రతిబింబిస్తుందని నివేదిక కనుగొంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ్రపోత్సహించడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, సంపన్న దేశాల్లో అధిక ఆహార వినియోగం కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు, తక్కువ గృహ ఆదాయాలు, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా, అల్పాదాయ దేశాలు ఆహార భద్రత, పోషణలో వెనుకబడి ఉంటాయని అంచనా.పెరగనున్న వ్యవసాయ ఉద్గారాలువ్యవసాయ ఉత్పత్తిలో అధిక వృద్ధి నమోదవుతుందని అంచనా వేసినప్పటికీ, సాగుభూమి, పశువుల సంఖ్యను రానున్న పదేళ్లలో ఇంకా కొంత విస్తరించాల్సి ఉంటుంది. దీని ఫలితంగా, రాబోయే దశాబ్దంలో ప్రత్యక్ష వ్యవసాయ గ్రీ¯Œ హౌస్ వాయు ఉద్గారాలు 6.5 శాతం మేర పెరుగుతాయని అంచనా. రానున్న పదేళ్లలో పెరిగే వ్యవసాయ ఉద్గారాలలో సుమారు 77 శాతం వాటా పశువుల పెంపకందే ఉంటుందని అంచనా. అధిక నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాల ద్వారా కృత్రిమ ఎరువులు మిగిలిన 23 శాతానికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు.‘ఉత్పాదకత వృద్ధిని వేగవంతం చేయటం, సాంకేతిక అంతరాలను పూడ్చటం ద్వారా ఉద్గారాల పెరుగుదలను నెమ్మదింపజేయడానికి లేదా తగ్గించటానికి వీలు కల్పించటమే విధానపరమైన సవాలు. పెరుగుతున్న జనాభాలో మారుతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యంలో.. ప్రపంచ ఆహార భద్రతను, మెరుగైన పోషకాహారాన్ని అందిస్తూనే వ్యవసాయ ఉద్గారాలను నియంత్రించాలి’ అని నివేదిక పేర్కొంది.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఆ ముగ్గురు చేసిన తప్పేంటి?
జల్సాలు.. అప్పులు.. ఆస్తి వివాదం.. ఒక హత్య. చివరకు నాలుగు ప్రాణాలను మింగేసింది. హత్య కేసులో నిందితుడిగా మారిన వ్యక్తి అరెస్ట్ భయంతో తన ప్రాణం తీసుకోవడమే కాదు, ప్రపంచం అంటే ఏమిటో కూడా తెలియని ఇద్దరు చిన్నారులను, తనను నమ్ముకుని వచ్చిన భార్యను కూడా మరణం వైపు నడిపించాడు. బావ హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న హరికృష్ణ తీసుకున్న ఈ నిర్ణయం.. ఓ కుటుంబాన్ని పూర్తిగా తుడిచి పెట్టేసిన విషాదం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ ముగ్గురు చేసిన తప్పేంటి?. అభం శుభం తెలియని ఐదేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు, భర్తే లోకంగా భావించిన ఓ భార్య. వీరికి హత్య కేసుతో సంబంధం లేదు. కానీ నేరం చేసిన వ్యక్తి తను శిక్షను తప్పించుకోవాలని చూసి.. తన కుటుంబానికే శాశ్వత శిక్ష విధించాడు. భావావేశంలో తీసుకున్న నిర్ణయంతో నాలుగు జీవితాలు రైలు పట్టాలపై ముగిశాయి. నెల్లూరు: బుచ్చిరెడ్డిపాళెం వ్యవసాయశాఖ అధికారి శ్రీహరి హత్యోదంతం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఆస్తి కోసం మేనబావను హత్య చేసిన బావమరిది హరికృష్ణ ఉదంతం వెలుగులోకి రావడం, ఉలిక్కి పడిన నిందితుడు హరికృష్ణ కుటుంబంతో కలిసి ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్లో రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ రెండు కుటుంబాల్లో కన్నీటి సుడులు మిగిలి్చంది. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతున్నాయి. పోలీస్‌శాఖ అవినీతి, నిర్లక్ష్యం వెరసీ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడు హరికృష్ణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘోర కలికి కారణమైంది. ఆ రోజే స్పందించి ఉంటే.. వ్యవసాయశాఖ అధికారి శ్రీహరి హత్య జరిగిన రోజే కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఉంటే.. ఈ రోజు ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడేది కాదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హత్య కేసును ఆ రోజే నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడంలోనే కాదు.. ప్రస్తుతం దర్యాప్తు దశలో కూడా పోలీస్ శాఖ నిర్లిప్తత, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏ1 నిందితుడిగా ఉన్న హరికృష్ణ కదలికలపై నిఘా పెట్టలేకపోయారు. హరికృష్ణ తన కుటుంబ సభ్యులతో టచ్‌లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. భార్యాపిల్లలు ఆమె పుట్టింట్లో ఉండగా, మంగళవారం తెల్లవారుజామున వచ్చి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. హరికృష్ణ, అతని కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్, కదలికలపై నిఘా ఉండి ఉంటే.. అభం శుభం తెలియని చిన్నారులతోపాటు జీవితాన్ని పంచుకున్న భార్య బతికుండేది. వారేం తప్పు చేశారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన రోజునే హరికృష్ణ తాను చనిపోతున్నానంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు వచ్చినా.. పోలీస్‌శాఖ నిర్లిప్తతగా వ్యవహరించిందని జిల్లా ప్రజలు నిందిస్తున్నారు. హత్య కేసులో ఇరుక్కుని.. కుటుంబాన్ని బలి తీసుకుని జల్సాలకు అలవాటు పడ్డాడు. ఖర్చులు బాగా పెట్టేవాడు. అంతే స్థాయిలో అప్పుల పాలయ్యాడు. మేనబావ కాక చెల్లి భర్త అయిన బావ ఆస్తిని కాజేయాలని బావ హత్య కేసులో ఏ–1 నిందితుడిగా మారాడు. చివరకు పోలీసులు గాలిస్తున్నారని అరెస్ట్‌కు భయపడి తనతోపాటు అభం శుభం తెలియని చిన్న పిల్లలు, భార్యతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని వాడు. గ్రామంలో చురుగ్గా ఉండే శ్రీహరి స్థానిక రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ఉండేవాడు. అయితే ఏఓ శ్రీహరి రెండో వివాహానికి హరికృష్ణ చెల్లెలను ఇచ్చారు. శ్రీహరి మేనమామ కూడా కావడం వల్ల ఇద్దరి మధ్య ఆస్తి వ్యవహారాలు ఉండేవి. ఈ క్రమంలో శ్రీహరిని హరికృష్ణ అంతమొంచాడని పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య కేసులో హరికృష్ణకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా ఏ–1 నిందితుడిగా ఉన్న హరికృష్ణ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ కేసులో ఇరుక్కుని తన జీవితాన్ని నాశం చేసుకోవడంతోపాటు కుటుంబాన్ని కూడా బలి తీసుకున్నాడు. బుచ్చిరెడ్డిపాళెం ఏఓ శ్రీహరి హత్య కేసులో నిందితుడిగా ఉన్న హతుని బావమరిది కుడుముల హరికృష్ణ (32) ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్‌కు వెళ్లి భార్య ప్రణతి (29), కుమార్తె మూగాంబిక (5), కుమారుడు కౌశిక్(3)లతో కలిసి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన ఘోరకలి తోటపల్లిగూడూరు మండలం వరిగొండ పంచాయతీ రావులవారి కండ్రికలో విషాదం నెలకొంది. వెంటాడిన అమావాస్య ఏఓ శ్రీహరి గత నెల 15వ తేదీన అమావాస్య నాడు హత్యకు గురయ్యాడు. సరిగ్గా నెల తిరగకుండానే అదే అమావాస్య అయిన 14వ తేదీ మంగళవారం హరికృష్ణ తన కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడడం యాదృచ్చికంగానే భావిస్తున్నారు.తెల్లవారు జామున ఇంటికొచ్చి.. హరికృష్ణ మంగళవారం తెల్లవారు జామున ఇంటికొచ్చాడు. భార్య ఇద్దరు పిల్లలను తన వెంట తీసుకుని సింగరాయకొండకు వెళ్లాడు. అక్కడే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల భయం పట్టుకుని అరెస్ట్ చేస్తే బయటకు రావడం కష్టంగా మారుతుందని తన భార్య, పిల్లలు దిక్కులేని వారవుతారనే ఉద్దేశంతోనే హరికృష్ణ అఘాయిత్యానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. -
కుక్కల్ని చంపే ఇంజెక్షన్ ఎక్కించి ఏవో హత్య..!
నెల్లూరు జిల్లా: బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యవసాయ అధికారి (ఏవో) శ్రీహరి హత్య ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. జూన్ 15న జరిగిన ఈ ఘోర హత్యను తొలుత గుండెపోటుగా చిత్రీకరించి ఆధారాలు కాజేసే ప్రయత్నం చేయగా, తాజాగా పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు బయటపడ్డాయి. ఆస్తి వివాదాల నేపథ్యంలో శ్రీహరిని ఆయన సొంత బావమరిది హరికృష్ణ పక్కా ప్రణాళికతో హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో హత్యకు సహకరించిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడు హరికృష్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఏవో శ్రీహరి తన బావమరిది హరికృష్ణను అమితంగా నమ్మి కోట్ల విలువైన ఆస్తితో పాటు భారీగా అప్పుగా డబ్బులు ఇచ్చారు. అయితే, ఇటీవల శ్రీహరి తనకు మంచి ఇల్లు కట్టుకోవాలని ఉందని, తాను ఇచ్చిన ఆస్తిని, డబ్బును తిరిగి ఇవ్వాలని హరికృష్ణను కోరారు. ఆస్తిని తిరిగి ఇవ్వడం ఇష్టం లేని హరికృష్ణ.. బావను వదిలించుకోవాలని స్కెచ్ వేశాడు. ఇందుకోసం రవీంద్ర, యానాది అనే ఇద్దరు వ్యక్తులను డబ్బు ఆశ చూపి నియమించుకున్నాడు.జూన్ 15న దైవదర్శనం పేరుతో బావను నమ్మించి పెంచలకోనకు కారులో తీసుకెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో చేజర్ల మండలం సమీపంలో కారును ఆపాడు. అప్పటికే అక్కడ కాపుకాసిన రవీంద్ర, యానాదిలు కారులో ఉన్న శ్రీహరిని గట్టిగా పట్టుకోగా.. హరికృష్ణ కుక్కలను చంపేందుకు ఉపయోగించే రెండు బలమైన ఇంజెక్షన్లను శ్రీహరికి బలవంతంగా గుచ్చాడు. ఆ ఇంజెక్షన్ల ప్రభావంతో శ్రీహరి కారులోనే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.హత్య అనంతరం దీనిని గుండెపోటుతో జరిగిన సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అనుమానాస్పద పరిస్థితులు, సేకరించిన ఆధారాల ఆధారంగా కేసును ఛేదించారు. ఈ కేసులో హత్యకు సహకరించిన రవీంద్ర, యానాదిని పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడు హరికృష్ణ పరారీలో ఉన్నాడు. అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సెల్ఫీ వీడియోతో తెరపైకి కొత్త అంశాలు ఈ క్రమంలో హరికృష్ణ పేరుతో విడుదలైన ఓ సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. తాను చనిపోతున్నానంటూ పేర్కొంటూ విడుదల చేసిన ఈ వీడియోలో తన వ్యక్తిగత విషయాలు, ఆస్తులు, అప్పుల వివరాలను ప్రస్తావించారు. తాను ఎవరికీ ఎలాంటి నష్టం చేయలేదని, తనపై కావాలనే తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని వీడియోలో పేర్కొన్నట్లు సమాచారం. వీడియో చివరలో తన భార్య, పిల్లల గురించి ప్రస్తావిస్తూ వారికి జాగ్రత్తలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సెల్ఫీ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించబడిందనే అంశంపైనా పోలీసులు దృష్టి సారించి, అతని కోసం గాలిస్తున్నారు. హరికృష్ణ పట్టుబడితే కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించే అవకాశం ఉంది. -
సాగు వృద్ధిలో రాష్ట్రం దూకుడు
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు వర్షాధార వ్యవసాయంపై ఆధారపడిన తెలంగాణ.. ఇప్పుడు దేశ వ్యవసాయ పటంలో వేగంగా ఎదిగిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. వ్యవసాయరంగ పనితీరుకు కీలక సూచిక అయిన స్థూల రాష్ట్ర విలువ జోడింపు (జీఎస్వీఏ) వృద్ధిలో దేశంలోని అన్ని రాష్ట్రాలను తెలంగాణ అధిగమించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ గణాంకాల ఆధారంగా రూపొందించిన విశ్లేషణలో.. 2016–17 నుంచి 2024–25 మధ్య తెలంగాణ వ్యవసాయ రంగం 6.9 శాతం సగటు వార్షిక వృద్ధి నమోదు చేసినట్లు వెల్లడైంది. దేశంలోని మరే రాష్ట్రం ఈ స్థాయి వృద్ధిని సాధించలేదు. వ్యవసాయ జీఎస్వీఏలో తెలంగాణ తర్వాత తమిళనాడు 5.99 శాతం, మణిపూర్ 5.59 శాతం, అస్సాం 5.45 శాతం, ఉత్తరప్రదేశ్ 5.28 శాతం వృద్ధితో నిలిచాయి. వ్యవసాయం, పశుసంవర్థక, మత్స్య తదితర ప్రాథమిక రంగాల్లో జరిగిన విస్తరణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయరంగ ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. సాగునీటి విస్తరణతో మారిన వ్యవసాయ ముఖచిత్రం తెలంగాణ వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులకు సాగునీటి విస్తరణ కీలకంగా మారింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ, నీటివనరుల వినియోగం పెరగడం వంటి అంశాలు పంటల సాగు విస్తీర్ణంపై ప్రభావం చూపాయి. గతంలో అనేక ప్రాంతాల్లో వర్షాలపై ఆధారపడిన సాగు ఉండగా.. తర్వాతి కాలంలో నీటి లభ్యత పెరగడంతో పంటల సాగు విస్తరించింది. దీంతోపాటు రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి రావడం, వ్యవసాయ యాంత్రీకరణ పెరగడం, మార్కెట్ సదుపాయాలు మెరుగుపడటం వంటి అంశాలు ఉత్పత్తి పెరుగుదలకు దోహదపడ్డాయి. వ్యవసాయ జీఎస్వీఏ అనేది కేవలం పంటల ఉత్పత్తినే కాకుండా.. పశుసంవర్థక, మత్స్య, అటవీ రంగాల విలువను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ రంగాల్లో వచ్చిన వృద్ధి కూడా తెలంగాణ వ్యవసాయ విలువ పెరుగుదలకు తోడ్పడింది. వరి ఉత్పత్తిలో రికార్డు స్థాయి వృద్ధి తెలంగాణ వ్యవసాయ రంగంలో అత్యంత స్పష్టంగా కనిపించిన మార్పు వరి సాగు విస్తరణ. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి గత దశాబ్దంలో గణనీయంగా పెరిగింది. సాగునీటి లభ్యత, రైతుల పంటల ఎంపికలో మార్పు, అధిక దిగుబడి వంగడాల వినియోగం, కొనుగోలు వ్యవస్థ వంటి అంశాలు వరి దిగుబడి పెరుగుదలకు కారణమయ్యాయి. రాష్ట్రం ఇటీవలి సంవత్సరాల్లో దేశంలో ప్రధాన ధాన్యం దిగుబడి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. ఖరీఫ్, రబీ సీజన్లలోనూ వరి సాగు విస్తరించడం వ్యవసాయ జీఎస్వీఏ పెరుగుదలలో కీలకపాత్ర పోషించింది. అదే సమయంలో పత్తి, మొక్కజొన్న, కంది, సోయాబీన్ వంటి పంటలు కూడా రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన స్థానాన్ని కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో ప్రముఖ రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. అనుబంధ రంగాల అండతో పెరిగిన వ్యవసాయ విలువ వ్యవసాయరంగ వృద్ధిలో పశుసంవర్థక, మత్స్య రంగాల పాత్ర కూడా గణనీయంగా ఉంది. పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, మేకల పెంపకం, కోళ్ల పరిశ్రమ వంటి రంగాలు గ్రామీణ కుటుంబాలకు అదనపు ఆదాయ మార్గాలుగా మారాయి. అలాగే రాష్ట్రంలోని చెరువులు, రిజర్వాయర్ల ఆధారంగా మత్స్య సంపద పెరగడం కూడా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చింది. అయితే వ్యవసాయ రంగం ముందు సవాళ్లు కూడా ఉన్నాయి. వాతావరణ మార్పులు, వర్షపాతం అస్థిరత, సాగు వ్యయాల పెరుగుదల, మార్కెట్ ధరల హెచ్చుతగ్గులు రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతున్నాయి. భవిష్యత్‌లో పంటల వైవిధ్యం, విలువ ఆధారిత వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధి కీలకంగా మారనుంది. ఆర్బీఐ హ్యాండ్‌బుక్ గణాంకాలు మాత్రం ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2016–17 నుంచి 2024–25 మధ్య కాలంలో తెలంగాణ వ్యవసాయ రంగం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వేగంగా విస్తరించింది. వ్యవసాయం, అనుబంధ రంగాల సమష్టి వృద్ధి రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. జీఎస్వీఏ అంటే.. ఒక రాష్ట్రంలో వ్యవసాయం, పశుసంవర్థక, మత్స్య, అటవీ వంటి ప్రాథమిక రంగాలు ఒక ఏడాదిలో సృష్టించే ఆర్థిక విలువను స్థూల రాష్ట్ర విలువ జోడింపు (జీఎస్వీఏ)గా పరిగణిస్తారు. ఆర్బీఐ హ్యాండ్‌బుక్‌లో ఈ గణాంకాలను స్థిర ధరల ఆధారంగా లెక్కిస్తారు. దీనివల్ల ధరల పెరుగుదల ప్రభావం కాకుండా వాస్తవ ఉత్పత్తి, వ్యవసాయరంగ విస్తరణను అంచనా వేయవచ్చు. -
ఉఫ్.. ఖరీఫ్
వ్యవసాయానికి వాతావరణం అనుకూలించడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు కరుణించడం లేదు. దీంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. అన్నదాతలకు దిక్కుతోచని దుస్థితి దాపురించింది. తీవ్రమైన కరువు తలెత్తే ప్రమాదం పొంచి ఉందని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో మరింత ఆందోళన చెందుతున్నారు. అరకొర జల్లులతో సేద్యం చేయలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు సైతం అడుగంటి పోతున్నాయని వాపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇప్పటికే సాగు చేసిన పంటలను సైతం నష్టపోతామని దిగాలుపడుతున్నారు.సాక్షి ప్రతినిధి, తిరుపతి : వ్యవసాయంలో ఆరుద్ర నక్షత్రం, మృగశిర కార్తె వర్షాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది, ఆరుద్ర కరుణిస్తే దారిద్య్రం ఉండదని అన్నదాతల నమ్మకం. ఆరుద్ర నక్షత్రంలో వర్షాలకు కురిస్తే.. వరుసగా ఆరు కార్తెలు వానలు ఉంటాయని పల్లెల్లో సామెతలు ఉన్నాయి. పంటలు సాగు చేసేందుకు అదే సమయంలో దుక్కులు సిద్ధం చేసే పనిలో రైతులు బిజీబిజీగా గడుపుతారు. కానీ, ఈ సారి ఎల్‌నినో కారణంగా వర్షాలు కురవక పోవడంతో ఖరీఫ్‌పై ఆశలు సన్నగిల్లాయి. అందులో భాగంగానే ఖరీఫ్ సాగు నెమ్మదించిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది జూలైతో పోలిస్తే ప్రస్తుతం వాతావరణంలో చాలా తేడా కనిపిస్తోంది. వరుణుడు ఊరించి ముఖం చాటేస్తున్నాడు. మబ్బులు కమ్ముకున్నప్పటికీ చిన్నపాటి జల్లులకే పరిమితం అవుతున్నాడు. నిత్యం భారీ వర్షాలు అని వాతావరణ శాఖ చేస్తున్న ప్రకటలను సైతం తలకిందులు చేస్తున్నాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడా ఆశించిన స్థాయిలో వానలు పడడం లేదు. దీంతో పంటలపై భారీ ఆశలు పెట్టుకున్న రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్నాయి ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉప్ణోగ్రతలు నేపథ్యంలో పంటకు వదిలిన నీరు వెంటనే ఆవిరైపోతున్నాయి. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చివోలుతోపాటు పలు ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు వరిపంట సాగుచేశారు. అయితే పంటకు నీరు అందక ఎండిపోతున్న క్రమంలో ఆందోళన చెందుతున్నారు. చెరువులు సైతం నీరు లేక బావురుమంటున్నాయి.. సమీప ప్రాంతాల్లోని చిన్న చిన్న బావుల్లో ఉన్న నీటిని వరిపంటను తడుపుకోవడానికి ప్లాస్టిక్ పట్టల ద్వారా రైతులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా నీరు అవిరైపోపోతోది. ఒక్క ముచ్చివోలు గ్రామంలోనే 500 ఎకరాలకు పైగా వరి పంట ఎండిపోయిందని రైతులు వాపోతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. సూపర్ ఎల్‌నినోతో కరువు? ఇప్పటికే ప్రభావం చూపుతున్న ఎల్‌నినో మరింత ప్రమాదకరంగా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది శీతాకాలం నాటికి సూపర్ ఎల్నినోగా మారే అవకాశముందని వాతావరణ శాఖ, వ్యవసాయశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. రుతుపవనాలు బలహీనంగా ఉన్నా యని చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 ప్లస్ డిగ్రీలకు చేరుకోవడాన్నే సూపర్ ఎల్‌నినో అంటారని వివరిస్తున్నారు. పడిపోతున్న నీటి నిల్వలు తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. వర్షాలు లేక అడవుల నుంచి ఎలాంటి ఇన్‌ఫ్లో లేక పోవడంతో జలాశయాలు అడుగంటిపోతున్నాయి. కల్యాణీ, తెలుగుగంగ, కండలేరు, స్వర్ణముఖి, నీవా నది పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. అదే విధంగా చెరువుల్లో నీరు ఖాళీ అవుతోంది. ఫలితంగా ఇప్పటి వరకు సాగైన పంటలు గట్టెక్కుతాయా?లేదా? అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అయోమయంలో అన్నదాతలుఓ వైపు వాతావరణం అనుకూలించక తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే.. మరో వైపు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అన్నదాతలు మరిన్ని ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 44,267 హెక్టార్లు ఉంటే.. ఇప్పటి వరకు కేవలం 7,374 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు చేశారు. ఇందులో వేరుశనగ 21వేల హెక్టార్లకుపైగా సాగవ్వాల్సి ఉంది. అందుకు తగ్గట్టే జిల్లాకు 27వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కేటాయించినట్లు ప్రభుత్వం ఏప్రిల్‌లో ప్రకటించింది.. అయితే ఇప్పటి వరకు పంపిణీ చేసింది కేవలం 6వేల క్వింటాళ్లు మాత్రమే. విత్తనాల గురించి అధికారులను అడిగితే.. రాలేదనే సమాధానం వస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే ఇంకా 21వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయలేక చేతులెత్తేశారని చెప్పొచ్చు. తిరుపతి జిల్లాలో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3,456 హెక్టార్లు ఉంటే.. ఇప్పటి వరకు సాగైంది 1,106 హెక్టార్లు మాత్రమే. వరి సాధారణ విస్తీర్ణం కంటే.. అధికంగా సాగైనా రైతులకు యూరియా కష్టాలు తప్పలేదు. ప్రైవేటు ఎరువు దుకాణాల్లో యూరియా బస్తా కావాలంటే రెండు నానో డీఏపీ ప్యాకెట్లు లేదా నానో యూరియా కొనాలని ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. -
ఏం పండించాలో ప్రభుత్వమే చెప్పాలా?
ఇటీవల ఏడు సన్నరకాల వరి రకాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం క్వింటాలుకు రూ. 500 బోనస్ ప్రకటించింది. గతంలో 33 నోటిఫైడ్ రకాల వరికి ఈ ప్రోత్సాహకం ఉండగా, ఇప్పుడు బీపీటీ–5204, తెలంగాణ సోనా (ఆర్ఎన్ ఆర్–15048), కునారం సన్నాలు (కేఎన్ ఎం–1638), జైశ్రీరామ్, హెచ్ఎంటీ సోనా, డబ్ల్యూజీఎల్–44 (సిద్ధి), కేఎన్ ఎం–7715 అనే ఏడు రకాలకే పరిమితం చేశారు. ఇందుకు ప్రభుత్వం చెప్పే కారణం ఏమిటంటే... ఈ రకాలకే మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. మిల్లింగ్ సులభంగా ఉంటుంది. ప్రభుత్వ సేకరణ ప్రక్రియ, వ్యయం కూడా తగ్గుతుంది. ఈ కారణాలు పరిపాలనా పరంగా సరైనవే కావచ్చు. కానీ ఈ నిర్ణయం వ్యవసాయ భవిష్యత్తుపై కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అభివృద్ధి సంస్థలు రైతులకు పంటల వైవిధ్యం, రకాల వైవిధ్యం, తక్కువ నీరు వినియోగించే పంటలు, వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయం గురించి చెబుతున్నాయి. సంప్రదాయ విత్తనాలను కాపాడాలని కూడా ప్రోత్సహిస్తున్నాయి. అయితే మరోవైపు కేవలం ఏడు సన్న వరి రకాలకే బోనస్ ఇవ్వడం ద్వారా రైతులకు భిన్నమైన సంకేతం వెళుతోంది. రూ. 500 బోనస్ చిన్న మొత్తం కాదు. ఏ రకం విత్తనం వేయాలనే నిర్ణయాన్ని ఇది ప్రభా వితం చేస్తుంది. క్రమంగా రైతులు ఇతర రకాలను వదిలి బోనస్ ఉన్న రకాలవైపు వెళ్లే అవకాశం ఉంది.రైతులు ఒక వరి రకాన్ని కేవలం మార్కెట్ ధర చూసి మాత్రమే ఎన్నుకోరు. నేల స్వభావం, నీటి లభ్యత, పంట కాలం, చీడపీడల నిరోధకత, గింజ నాణ్యత, గడ్డి దిగుబడి, ఇంటి అవసరాలు, స్థానిక వాతావరణ పరిస్థితులు– ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక మండ లంలో బాగా పండే రకం, మరో మండలంలో అదే స్థాయిలో ఫలితం ఇవ్వకపోవచ్చు.తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే రకం ఎంటీయూ–1010. మంచి దిగుబడి, స్థిరమైన పనితీరు, వివిధ నేలల్లో అనుకూలత, తక్కువ ప్రమాదం కారణంగా వేలాది మంది రైతులు ఈ రకాన్ని ఇష్టపడి సాగుచేస్తున్నారు. కానీ ఈ రకం బోనస్ జాబితాలో లేదు. మరోవైపు బీపీటీ–5204 వంటి రకం మంచి నాణ్యత కలిగిన బియ్యాన్ని ఇస్తుంది. కానీ ఎక్కువ కాలం, ఎక్కువ నీరు అవసరం. అగ్గితెగులు, దోమ పోటు వంటి చీడపీడలకు ఎక్కువగా గురవుతుంది.ప్రతి రకానికి దాని బలాలు, బలహీనతలు, ప్రాముఖ్యం ఉంటాయి. రాష్ట్రమంతా ఈ ఏడు రకాలపైనే ఆధారపడితే, విత్తనాలకు డిమాండ్ అకస్మాత్తుగా పెరిగి, కృత్రిమ కొరత ఏర్పడుతుంది. ఇది విత్తన ధరలను పెంచి, రైతులను ప్రైవేట్ విత్తన కంపెనీలపై మరింతగా ఆధారపడేలా చేస్తుంది. పరిమిత రకాల వల్ల మిల్లు యజమానులకు కొనుగోలు, మిల్లింగ్ ప్రక్రియ సులువు కావచ్చు; కానీ ప్రభుత్వ విధానాల వల్ల రైతులకూ, జీవ వైవిధ్యానికీ కలిగే ప్రయోజనాలు ఏమిటి?వైవిధ్యమే రైతుకు రక్షణవికారాబాద్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రైతులతో చేసిన చర్చల్లో మరో వాస్తవం బయటపడింది. కొంతమంది రైతులు మార్కెట్ లేకపోవడంతో మంచి దిగుబడి ఇచ్చే రకాలను వదిలేశారు. మరికొందరు స్థానిక పరిస్థితులకు అనుకూలంగా ఉండే గోదావరి ఇసుకలు, సిద్ధ సన్నాలు, కుళ్లకర్వంటి సాంప్రదాయ రకాలను ఇప్పటికీ సాగు చేస్తున్నారు. అవి తక్కువ నీటితో పండుతాయి. ఇంటి వినియోగానికి అనుకూలం. కొన్ని రకాలు ఎండలను, మరికొన్ని అధిక వర్షా లను తట్టు కుంటాయి.ఇప్పుడు వాతావరణ మార్పులు మరింత తీవ్రమవుతున్నాయి. వర్షపాతం అనిశ్చితంగా మారుతోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చీడపీడల సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైవిధ్యమే రైతుకు రక్షణ. ఒకే రకాన్ని పెద్ద ఎత్తున సాగుచేస్తే ఒక చీడపీడ లేదా వ్యాధి వచ్చినప్పుడు భారీ నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. కానీ వివిధ రకాలు సాగు చేస్తే ప్రమాదం తగ్గుతుంది. ఇదే వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయానికి పునాది. సంప్రదాయ రకాలు మన వ్యవసాయ వారసత్వం. అవి కేవలం గతానికి చెందినవి కావు. భవిష్యత్తుకు కూడా అవసరమైన జన్యు సంపద. ఇవి కనుమరుగైతే తిరిగి రైతుల పొలాల్లోకి తీసుకురావడం చాలా కష్టం.ఇక్కడ అసలు ప్రశ్న ఏడు రకాలు మంచివా? కాదా? అనేది కాదు. రైతుల ఎంపికను ప్రభుత్వ ప్రోత్సాహకాల ద్వారా కుదించడం సరైన విధానమా? అనేదే అసలు ప్రశ్న. కొన్ని రకాలకే బోనస్ ఇవ్వడం కాకుండా, స్థానిక పరిస్థితులకు అనువైన రకాలను సాగు చేసే రైతులను ప్రోత్సహించవచ్చు. నీటి వనరులను వర్షాధార పంటల రక్షణకు సంధానించే వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే రైతు సమూహాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. వాతావరణ మార్పులు పెరుగుతున్న ఈ కాలంలో... రైతులు ఎంచుకుంటున్న రకాలు, పంటలను మన విధానాలు తగ్గించకూడదు. మరింత విస్తరించేలా ఉండాలి.- భాగ్యలక్ష్మి, వ్యాసకర్త, వాటర్‌షెడ్ సపోర్ట్ సర్విసెస్ అండ్ యాక్టివిటీస్ నెట్వర్క్ (వాసన్) అసోసియేట్ డైరెక్టర్ -
అన్నదాతలకు అభయహస్తం
సమాజానికి వెన్నెముక అయిన రైతులకు అధిక ప్రాధాన్యతిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. ‘రైతు భరోసా’తో రైతుల్లో పూర్తి విశ్వాసం కలిగిస్తోంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అన్నదాతలకు అభయం హస్తం అందిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు ‘రైతు భరోసా’ అందించిన ప్రభుత్వం మరోసారి 2026 జూన్ 30న ఖరీఫ్ సీజన్‌కుగానూ ఇచ్చేందుకు సిద్ధమైంది.రైతు సంక్షేమమే ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు వరంగల్ వేదికగా ‘రైతు డిక్లరేషన్’లో ప్రకటించిన విధంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్నా లకు బోనస్, రైతు బీమా, రైతు కూలీలకు ‘ఇందిరమ్మ భరోసా’ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తమది రైతు పక్షపాత ప్రభుత్వమని నిరూపించుకుంది.ప్రభుత్వం ఏటా ఎకరాకు రూ. 12 వేలు రైతు భరోసాగా అందిస్తోంది. 2025 జూ¯Œ లోనూ, 2026 మార్చిలోనూ 70 లక్షల మందికి అందించింది. మూడోసారి జూన్‌లో ఒకే విడతలో ఈ సాయం అందించనున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేసింది. దీంతో 25 లక్షల రైతు కుటుంబాలకు రూ. 21 వేల కోట్ల మేలు చేకూరింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా సన్న వరికి బోనస్ అందించడంతో రాష్ట్రంలో సన్నాల సాగు 60 శాతం పెరిగింది. దేశంలోనే తొలిసారిగా రైతు కూలీలను గుర్తించి వారిలో విశ్వాసం కలిగించేలా ‘ఇందిరమ్మ రైతు భరోసా’ అందిస్తోంది. రైతు కుటుంబాలందరికీ ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తూ వేల కోట్ల రూపాయలతో రైతు బీమా కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకా రాలు లభించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం భారీగా పంటలను కొనుగోలు చేస్తోంది.నిధులు దుర్వినియోగం కాకుండా...అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటే భరించలేని బీఆర్ఎస్ పార్టీ అక్కసుతో అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. గతంలో వారి ప్రభుత్వం ‘రైతు బంధు’ పేరిట ఎకరాకు రూ. 10 వేలు మాత్రమే ఇస్తే... కాంగ్రెస్ సర్కార్ మరో రెండువేలు అధికంగా ఇస్తోంది. గత ప్రభుత్వ అవకతవకలు పునరావృతం కాకుండా ఉండాలనే లక్ష్యంతో ప్రస్తుత సర్కారు వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా అందించాలని నిర్ణయించింది. అందుకే ప్రజా నిధులు దుర్వినియోగం కావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి ఏమాత్రం ఉపయోగపడని భూములకు రైతుబంధు పథకం కింద రూ. 22 వేల కోట్లకుపైగా చెల్లించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసింది.రైతులకే కాకుండా రైతు కూలీలకు కూడా సమన్యాయం జరి గేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూమిలేని రైతు కూలీలకు ప్రభుత్వ నిర్ణయం శాపంగా మారకూడదని, వారిని కూడా ఆదుకోవాలనే లక్ష్యంతో ‘వరంగల్ డిక్లరేషన్’లో ప్రకటించినట్టు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం కింద ఏటా రూ. 12 వేలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంతో వ్యవసాయ యజ్ఞంలో పాల్గొనేవారందరికీ న్యాయం చేసినట్టయ్యింది.శుభప్రదమైన ఏరువాక పౌర్ణమి మరుసటి రోజు జూన్ 30న ప్రభుత్వం నిర్వహించనున్న రైతు భరోసా పంపిణీ మరోసారి అన్న దాతల పట్ల కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనంగా నిలవనుంది. రైతు సంతోషమే రాష్ట్ర సుభిక్షతకు పునాది అనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.- బి. మహేశ్ కుమార్ గౌడ్, వ్యాసకర్త ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు -
ఐఐఎంఆర్‌లో చిరుధాన్య విత్తనాలు
ఎల్‌నినో నేపథ్యంలో తక్కువ నీటితో, అధిక ఉష్ణోగ్రతల్లోనూ మంచి దిగుబడిని ఇవ్వగలిగే సీ4 పంటలే చిరుధాన్య పంటలు. ప్రస్తుత రోజుల్లో మారుతున్న జీవనశైలి వల్ల వస్తున్న ఆరోగ్య సమస్యల నివారణకు చిరుధాన్యాల ఆహారమే ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారిన విషయం తెలిసిందే. దేశంలో చిరుధాన్యాల సాగును మరింత విస్తరింపజేసేందుకు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఐసీఏఆర్ సంస్థ భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఐఐఎంఆర్) కృషి చేస్తోంది. రైతులు మంచి దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనాలు వాడటం ఎంతో ముఖ్యం.ప్రస్తుత ఖరీఫ్ పంట కాలంలో విత్తుకోవటానికి అనువైన నాణ్యమైన చిరుధాన్యాల విత్తనాలను హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని తమ ప్రధాన కార్యాలయం నుంచి రైతులు నేరుగా కొనుగోలు చేయొచ్చని ఐసీఏఆర్–ఐఐఎంఆర్ సంచాలకులు డాక్టర్ తార సత్యవతి ‘సాక్షి సాగుబడి’తో చె΄్పారు.జొన్న, సజ్జ, రాగు, కొర్ర, అరికె, సామ, ఒరిగ వంటి అన్ని రకాల చిరుధాన్యాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని ఐఐఎంఆర్ విత్తన శాస్త్రవేత్త డాక్టర్ సూగన్న తెలిపారు. అన్ని రకాల చిరుధాన్య విత్తనాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. సూటి రకం పచ్చజొన్న, కొర్ర (సూర్యనంది) విత్తనాలు అధిక మొత్తంలో ఉన్నాయన్నారు. తెల్లజొన్న హైబ్రిడ్ రకాల విత్తనాలు కూడా తమ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు.జొన్న వంటి పెద్ద గింజ చిరుధాన్యాలు ఎకరానికి 3 కిలోల విత్తనం అవసరం. కొర్ర వంటి చిన్న గింజ చిరుధాన్యాలు ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుందని డా. సూగన్న ‘సాక్షి సాగుబడి’కి వివరించారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థకు స్వయంగా వచ్చి రైతులు విత్తనాలు కొనుక్కోవాల్సి ఉంటుంది. అదనపు సమాచారం కోసం 040–24599305 నంబరులో పని దినాల్లో ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 4 గం. మధ్య సంప్రదించవచ్చు. వ్యవసాయ పరిశోధనా కేంద్రం నంద్యాల, విజయనగరం, పాలెం, రాజేంద్రనగర్‌లోని పీజేటీఏయూలలో కూడా చిరుధాన్యాల విత్తనాలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
రైతన్నకు మార్గం చూపే అభియాన్
నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, వ్యవసాయ భూమిని కాపాడటం, రైతుల మధ్య శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా చేపట్టిన దేశవ్యాప్త ప్రచారాన్ని ‘ఖేత్ బచావో అభియాన్’గా పిలుస్తున్నారు. ‘నేలను కాపాడండి, వ్యవసాయాన్ని కాపాడండి, రైతులను కాపాడండి’ అనే ప్రధాన సందేశంతో 2026 జూన్ 1 నుండి జూన్ 30 వరకు ఈ ప్రచారం సాగుతోంది.ఎరువులను నిరంతరం వాడటం, అది కూడా అసమతుల్యంగా ఉపయోగించడం వల్ల అనేక ప్రాంతాలలో పోషకాల కొరత ఏర్పడి, నేల నాణ్యత క్షీణిస్తోంది. మేలు చేసే సూక్ష్మజీవులు నశించి పోతు న్నాయి. వానపాములకు నష్టం వాటిల్లుతోంది. నీటి నిల్వ సామర్థ్యం పడిపోతోంది. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. రైతులు వీటిని దృష్టిలో పెట్టుకుని సాగు చేయాల్సి ఉంది. అందుకు కేంద్రం భారీ ఎత్తున ఈ విషయా లపై అవగాహన కల్పించేందుకు రంగంలోకి దిగింది. ఖేత్ బచావో అభియాన్ ప్రధానాంశాలు:1. మట్టి పరీక్ష – మట్టి ఆరోగ్య కార్డులకు ప్రోత్సాహం: రైతులను క్రమం తప్పకుండా మట్టి పరీక్షలు చేయించుకోవడానికీ, పోషక అవసరాలను శాస్త్రీయంగా నిర్ధారించడానికీ మట్టి ఆరోగ్య కార్డులను ఉపయోగించేలా ఈ ప్రచారం ప్రోత్సహిస్తుంది. ఇది సమతుల్య ఎరువుల వాడకాన్ని సాధ్యం చేస్తుంది. అనవసర ఖర్చు లను తగ్గిస్తుంది. పంట ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలి కంగా నేల సారాన్ని కాపాడుతుంది.2. సమతుల్య పోషక నిర్వహణ: అధిక రసాయన ఎరువులపై ఆధారపడకుండా, వాస్తవ నేల అవస రాలకు అనుగుణంగా ఎరువులను ఉపయోగించేలా రైతులను ప్రోత్స హిస్తున్నారు. సమతుల్య పోషక నిర్వహణ నేల నాణ్యతను మెరుగు పరుస్తుంది. సుస్థిర వ్యవసాయ ఉత్పత్తిని నిర్ధారిస్తుంది.3. సహజ – సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహం: ఈ ప్రచారం కృత్రిమ రసాయ నాలపై ఆధారపడటాన్ని తగ్గించి, పర్యావరణ సుస్థిరతను మెరుగు పరిచే సహజ వ్యవసాయ పద్ధతులకు మద్దతు ఇస్తుంది.4. నీటి సంరక్షణ: నీటి కొరత – భూగర్భ జలాల క్షీణతపై పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి సమర్థవంతమైన నీటి నిర్వహణ పద్ధతులను ప్రోత్సహిస్తున్నారు.5. శాస్త్రీయ వ్యవ సాయ పద్ధతులు: ఆధునిక విత్తే పద్ధతులు, విత్తన శుద్ధి, పంట ప్రణాళిక, సాంకేతికత ఆధారిత వ్యవసాయ పద్ధతులను పాటించ డానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నారు.6. పచ్చిరొట్ట ఎరువు–నేల సారం: నేలలోని సేంద్రియ పదార్థాన్ని మెరుగుపరచ డానికీ, నేల సారాన్ని సహజంగా పెంచడానికీ పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు.7. పంట మార్పిడి ఆవశ్యకత: వరి వంటి కొన్ని పంటలకే పరిమితం కాకుండా వ్యవసాయాన్ని ఏక రూప పంట విధానం నుంచి బహుళ పంటల సాగు వైపునకు మళ్లించి... సిఫారసు చేసిన పంటల సరళిని, అంతర పంటలను, సమగ్ర వ్యవసాయాన్ని చేపట్టే విధంగా రైతాంగాన్ని ప్రోత్సహించడం మరో అంశం. దీని వల్ల వ్యవసాయం లాభసాటిగా ఉండటమే కాకుండా సుస్థిర అభివృద్ధి జరుగుతుంది.8. సమగ్ర సస్య రక్షణ: రైతులు తాము పండించే పలు పంట లలో ఆశించే పురుగులు, తెగుళ్ళు, కలుపు వంటి వాటి నుండి పంటను కాపాడుకోవడానికి ఎక్కువగా పెస్టిసైడ్స్ (పురుగు మందులు) వాడుతున్నారు. చాలా ఏళ్ళుగా పంటలలో పురుగు మందు లను విచ్చలవిడిగా, అధిక మోతాదుల్లో, అనేకసార్లు వాడటం వలన అనేక దుష్ప్రభావాలు చూస్తున్నాము. అందుకే పంటలో ఉన్న అసలు సమస్యను వీలైనంత తొందరగా గుర్తించి ఆ సమస్యకు తగ్గట్టుగా రసాయనాలు వాడాలి. ఉదా: పురుగుకు పురుగు మందు, తెగుళ్ళకు తెగులు మందులు, నల్లికి నల్లి మందులు వాడాలి.చీడపీడలు, కలుపు కనిపించిన వెంటనే రసాయన మందులను వాడాల్సిన అవసరం లేదు. వీటి ఉధృతి ఒక స్థాయి దాటినప్పుడు మాత్రమే రసాయనాలు పిచికారీ చేసుకోవాలి. ఉత్పాదకతను ప్రతి కూలంగా ప్రభావితం చేసి, ఆర్థిక నష్టాలను పెంచే నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల నుండి రైతులను రక్షించాలి. – డా. కె. తేజేశ్వరరావు, డా. బి. సహదేవ రెడ్డిప్రధాన శాస్త్రవేత్తలు, ఆచార్య ఎన్ .జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం -
సాహిత్యంలో డిగ్రీ... వ్యవసాయంలో జీవితం
అతడు చదువుకున్న మేథావి. ఆంగ్ల సాహిత్య పిపాసి. కానీ అతని మనసు భూమాతకే అంకితం అన్నది. పుస్తకాలు మేథస్సును తీర్చిదిద్దినా..హృదయాన్ని గెలుచుకుంది మాత్రం వ్యవసాయమే. అందుకే ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్ డిగ్రీ చేసినా వ్యవసాయం వైపుకే మళ్లీ రైతుగా మారి..ఎన్ని పంటలు పండించాడో వింటే విస్తుపోతారు. వేసిన ప్రతిపంట లాభాలే తెచ్చిపెట్టింది. నేలమ్మకు మించిన బంగారం ఏముంది అని నిరూపించాడు.అతడే అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన కళింగ్ సిరామ్ . అతడు ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. అయితే అందరిలా వైట్ కాలర్ జాబ్‌లు కాకుండా వ్యవసాయం వైపుకి మళ్లాడు. తన నిజమైన అభిరుచి వ్యవసాయమే అంటూ రైతుగా మారాడు. అందుకు తన తల్లే స్ఫూర్తి అని చెబుతాడు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తూర్పు సియాంగ్ జిల్లాలోని సిల్లే అనే సుందరమైన గ్రామంలో వైవిధ్యభరితమైన పంటలు పండించి మంచి రైతుగా పేరుతెచ్చుకున్నాడాయన. అమ్మనాన్నల కారణంగానే ఇలా..!తన బాల్యంలో స్వగ్రామమైన దేబింగ్లో అరవై ఏళ్ల వయసులో ఉన్న తన తల్లి పెద్ద ఎత్తున రబ్బరు, నారింజ, పసుపు, అల్లం పండించడాన్ని చూశానని చెప్పాడు. అదే సమయంలో చనిపోయిన తన తండ్రి, ఒక పాఠశాల ఉపాధ్యాయుడు, అయినప్పటికీ వ్యవసాయంతోనే ఎక్కువ గడిపేవాడని చెప్పుకొచ్చాడు. అలా తనకు వ్యవసాయంపై ఆసక్తి కలిగిందని అంటాడు సిరమ్. అందువల్లే మాస్టర్ డిగ్రీ పూర్తయ్యాక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించలేదని అంటాడు. తాను కాంట్రాక్టర్‌గా పనిచేసి ఆదా చేసిన సొమ్ముతో 2017లో సిల్లేలో దాదాపు 40 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపాడు. అక్కడే ఫామ్ హౌస్ నిర్మించుకుని పాడి వ్యవసాయంపై దృష్టి పెట్టాడు. పాల అమ్మకం ద్వారా నెలకు 15 వేల నుంచి 20 వేలు వరకు లాభం పొందాడు. ఆ తర్వాత చేపల చెరువుల, కోళ్లు, మేకల పెంపకంతో ప్రయోగాలు చేశాడు. వాటిల్లోనూ లక్షల్లో లాభాలు ఆర్జించాడు. ఆ తర్వాత వరి తోపాటు, ఆవాలు, నువ్వులను పండించాడు. అలాగే అవకాడో, డ్రాగన్ ఫ్రూట్, మాంగోస్టీన్, లాంగన, మాకాడమియా వంటి అరుదైన పంటలను కూడా పండించినట్లు వెల్లడించాడు. ఈ ఏడాది డ్రాగన్ ఫ్రూట్ లాభదాయకమైన పంట అవుతుందని..వీటితో టోకు ధరల ప్రకారం సుమారు రూ. 12 లక్షల వరకు ఆదాయం రావొచ్చని అంటున్నాడు. ఇక తన తదుపరి ఆశయం, తేయాకు, పామాయిల్ సాగులోకి ప్రవేశించడమేనని చెబుతున్నాడు. ఆయన పంటలన్నింటి శాస్త్రియ పద్ధతుల్లోనే పండించి లాభలు గడించడం విశేషం. అంతేగాదు ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఏడాది పొడవునా సుమారు పది మంది కార్మికులు పనిచేస్తుంటారు. వాళ్లకు నెలకు సుమారు రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు జీతాలు ఇస్తానని అన్నాడు. ఉద్యోగం కన్నా వ్యవసాయమే బెటర్..చివరగా ఆయన యువతను వ్యవసాయం వైపు మళ్లండి, సొంత భూమి ఉన్నప్పటికీ..ప్రభుత్వం ఉద్యోగాల వైపుకి వెళ్తున్నారు, కానీ అవి పరిమితంగానే ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు వ్యవసాయం చేపడితే నువ్వే స్వయంగా యజమనిగా ఉంటావు, పైగా నీపై ఎవరి ఒత్తిడి ఉండదని పిలుపునిస్తున్నాడు సిరామ్. రైతుగా పనిచేస్తున్నా.. తన సాహిత్య అభిలాషను మాత్రం వదలుకోడు సిరామ్. ఏ కాస్త సమయం దొరికిన షేక్స్పియర్, మిల్టన్, చార్లెస్ డికెన్స్ రచయితల పుస్తకాలు చదివేస్తుంటాడట. నిజంగా గ్రేట్ కదా..! ఇతడి కథ మహర్షి మూవీలోని మహేశ్ బాబు స్టోరీలా ఉంది కదూ..!.(చదవండి: ఆ మెటర్నిటీ డ్రెస్ అంత ధర పలకదు..!: ఇచ్చిపడేసిన ఉషా వాన్స్) -
ఈ చెట్టుకు ఔషధ గుణాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది..!
ఉనికి.. ఇరికి పండ్ల చెట్లు 3–4 మీటర్ల ఎత్తు వరకు పెరిగి గొడుగు ఆకారంలో విస్తరించగలవు. బరువైన నేలలో వీటి సగటు ఎత్తుకంటే ఎక్కువగా పెరిగే ఆస్కారం ఉంటుంది. ఈ చెట్లు సముద్ర మట్టానికి 1500 మీటర్ల ఎత్తులో కూడా పెరగ గలవు. ఉప హిమాలయప్రాంతం నుండి కన్యాకుమారి వరకు ఈ చెట్లు విస్తరించాయి.పొడి – తడి ఆకులు రాల్చే అడవులలోనూ వీటి ఉనికి అధికంగా ఉంటుంది. ఈ చెట్టు స్వస్థలం చైనా, జపాన్, తైవాన్, ఇండియా అయినప్పటికీ.. పాకిస్తాన్, శ్రీలంక, కంబోడియా, లావోస్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియా, మయన్మార్, మలేషియా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడ విరివిరిగా ఉన్నట్లు ఆనవాలు. మన దేశంలోని అన్ని రాష్ట్రాలలో బంక చెట్లకు మంచి గుర్తింపు ఉన్నది. పడమటి – తూర్పు కనుమలలో వీటి ఉనికి అధికమని చెప్పవచ్చు.కాబట్టి వీటిపై పరిశోధనలతో పాటు పల్లె ప్రజలకు ఈ చెట్ల ఉపయోగాలపై అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉపాధి కల్పించే విధంగా ప్రయోగ ఫలితాలు ఉంటే, గ్రామవాసులకే కాకుండా పట్టణ వాసులకు ఎంతో లబ్ది చేకూరుతుంది. ఉపయోగాలువీటి కలప గట్టిగా ఉన్నా వర్షానికి నానితే త్వరగా చెడిపోతుంది. దీన్ని ఫర్నీచర్, చిన్న చిన్న వ్యవసాయ పనిముట్లు తయారీలో వాడతారు.ఈ పండ్లు లేత గులాబీ రంగు కలిగి ఆకర్షణీయంగా ఉండి గుత్తులు గుత్తులుగా విపరీతంగా కాస్తాయి. గుజ్జు మాత్రం బంకతో కూడుకొని ఉండటం చేత దీనికి బంక పండు అని పేరొచ్చింది. పండ్లు ఓ మోస్తురు తీపి వగరుతో ఉంటాయి.వీటి ఆకులను మేకలు ఇష్టంగా తింటాయి. పచ్చి కాయలను ఊరగాయగా, కూరగాయగా గ్రామాలలో కొందరు వాడతారు.ఈ పండ్లలోని గుజ్జును పేపర్లు మొదలగు వాటిని అతికించటానికి ఉపయోగించేడివారని అమరాబాదు గ్రామస్తులు తెలిపారు.ఈ చెట్టుకు ఔషధ గుణాలు ఉన్నాయని చరిత్ర చెపుతున్నది. ఈ చెట్టు బెరుడు, వేర్లు, చిగుర్లు, ఆకులు మొదలగునవి అనేక రకాల రోగాలను నయం చేయటానికి నాటు వైద్యులు వాడేవారట. ముఖ్యంగా బెరుడుతో చేసిన కషాయాన్ని విరేచనాలు, జ్వరం, కడుపు నొప్పి, తల నొప్పి మొదలగు రుగ్మతల నుండి ఉపశమనం పొందటానికి మూలికా వైద్యులు ఇప్పటికీ వాడతారని చెంచులు చెప్పారు. బెరడు కషాయాన్ని నోటి అల్సర్లు ఉన్నపుడు నోటిలో పోసుకుని మూడు పూటలా పుక్కిలించాలి. మూడు రోజుల్లో తగ్గుతుంది.పండ్ల గుజ్జును దగ్గు, గొంతు నొప్పి, ఛాతీ నొప్పికి వాడే మందుల తయారీలో ఉపయోగిస్తారు.అట్లే పండ్లను పెరుగులో నాన బెట్టి రోజుకు రెండు సార్లు ఒళ్ళంతా పట్టిస్తే ఎండ పొడ నుంచి విముక్తి పొందవచ్చు. ఇరికి పండ్లలో అనేక పోషకాలు ఉన్నాయని పరిశీలనలో రుజువైంది.నల్లమల అడవులు, ఇతర అడవులతో పాటు మైదానపుప్రాంతాల్లో కూడా పెరుగుతాయి. రాను రాను ఈ చెట్లు నిరాదరణకు గురి కావడం చేత చాలా వరకు కొట్టి వేతకు గురవుతున్నాయి. బంక పండ్లపై ప్రత్యేకించి న్యూట్రీటివ్ విలువలపైన, ఔషధాల పరంగా ఎన్నో దేశాల్లో పరిశోధనలు చేశారు. ప్రయోగాల ఫలితాలు రైతుల చెంతకు చెరలేదనవచ్చు. కాబట్టి ఈ పండ్ల దిగుబడి, విలువ ఆధారిత ప్రయోజనాలపై తగినన్ని పరిశోధనలు చేయగలిగితే, ఈ పండ్ల చెట్లు రైతుల చెంతకే కాకుండా మిద్దె తోటలతో పాటు పెరటి పండ్లుగా మారే అవకాశం ఎంతగానో ఉంది. ఇందుకు ఉద్యాన శాఖ, ఫారెస్ట్ (పరిశోధన, అభివృద్ధి), ఇతర శాఖలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరమున్నది.వివిధ భాషల్లో ఇరికి / బంక పండు పేర్లు- అస్సామీ: గోబోహాట్, బహుబర - ఇంగ్లీష్: ఇండియన్ చెర్రి, క్లమ్మి చెర్రి, ఫ్రాగ్రాంట్ మంజక్, స్పోట్టిగోబ్బల్స్, కుమ్మింగ్ కార్డియా, గ్లుచెర్రి, అనోనంగ్, పింక్ పర్, బర్ లైంట్రీ. - ఉర్దూ: లసుర, లస్సోర : ఒరియా: భురపత, లసోర. - కన్నడ: కెంజుల, చలైహన్ను, హడిగే, దొడ్డచల్లు, మన్నడికె కెండిల్, గోండెమర, కడుచలె. - గుజరాత్: వడ్ గుండ : తమిళం: నరువిలి, సిటం, నరువలి. - తెలుగు: బోటీగిరి, ఇరికి పండు, బంక పండ్లు, బంకనక్కెర.- మరాఠీ: బోకర్, సేలు. - హిందీ: లసోడ, లసోర, లంగ్రీ, గుండ- సంస్కృతం: బహు వరహా- పంజాబి: లసురే. - బెంగాలి: భోకరీ, బహుబర, బోచో. - నేపాలి: బొహొరి, కాలో బొహరి అని పిలుస్తుంటారు.ప్రాంతాలను బట్టి ఈ పండు పేరు ఉచ్ఛారణలో కొంత తేడా ఉండవచ్చు. - డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్, మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
పారిశ్రామికవేత్తగా గృహిణి..! ఏడాదికి రూ. 1.85 కోట్లు..
అప్పటి వరకు గృహిణిగా గడిపిన ఆమె పారిశ్రామికవేత్తగా మారడం అంటే సాధారణ విషయం కాదు. కానీ ఒక మహిళ తలుచుకుంటే లక్ష్యాన్ని సాధించకుండా ఏది ఆపలేదు అనేందుకు ఉదాహరణగా మారింది గుజరాత్‌కు చెందిన ఈ గృహిణి. అంతేగాదు ఆమె గ్రామీణ భారతదేశంలోని మహిళ పారిశ్రామికవేత్తకు ప్రతీకగా నిలిచించి. ఇంటి పనులు నిర్వహిస్తూనే పశువుల సంరక్షణతో కోట్లాది రూపాయాలు ఆర్జిస్తోందామె.గుజరాత్‌కు చెందిన దర్యాబెన్కు 18 ఏళ్లకే వివాహమైంది. ఆ తర్వాత అత్తగారింట్లో గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉండేది. తన అత్తమామలకు చేదోడు వాదుడుగా ఉంటూ.. పశువుల సంరక్షణ కూడా చూసుకుంటూ ఉండేది. అలా దర్యాబెన్ డైరీ కార్యకలాపాల్లో పాలుపంచుకుంది. కాలక్రమేణ తాను దాంతోనే వ్యాపారాన్ని నిర్మిస్తానని అనుకోలేదు. మొదట్లో పశువుల పోషణ, పాలు సేకరించడం వరకే చూశారామె. తన వంతు ఇంటికి సహాయపడదామనే ఉద్దేశ్యంతో పశువుల సంరక్షణనే వ్యాపారంగా మార్చుకుంది. అలా చిన్న డైరీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసింది. అందుకోసం పాల ఉత్పత్తిని మెరుగుపరిచింది. ఆ తర్వాత ఇంట్లో ఉండే కొన్ని పశువుల సంఖ్యను కూడా పెంచి అనతి కాలంలోనే అతిపెద్ద డైరీగా మార్చింది. ప్రస్తుతం ఆమె వద్ద సుమారు 200 గేదెలు, 100 ఆవులు, వెరసి మొత్తం 300 పశువులు ఉన్నాయి. అంతేగాదు తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి 14 మంది కార్మికులను కూడా నియమించుకుంది. ఆమె రోజు ఉదయం 3.30 గంటలకు పాలు సేకరించడంతో మొదలై ఫామ్ నిర్వహణకు సంబంధించిన పనులతో పూర్తవుతోంది. ప్రతిరోజు సుమారు వెయ్యిలీటర్లపైనే పాలు బనస్ డైరీకి సరఫరా చేసేది. ఈ మొత్తం ప్రక్రియ ద్వారా నెలకు సుమారు రూ. 20 లక్షల పైనే చొప్పున ఏటా ఏకంగా రూ. 1.85 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోందామె. ఇక్కడ 48 ఏళ్ల దర్యాబెన్ పాడి పరిశ్రమను సొంతం చేసుకోవడమే కాకుండా సమర్థవంతమైన నిర్వహణ, పాల ఉత్పత్తి వ్యూహాలు, పాడి సహకార సంఘాల నెట్‌వర్క్‌తో బలమైన అనుసంధానం తదితరాలతో మంచి విజయం అందుకుంది. ఇక బనాస్ డైరీ గుజరాత్‌లోనే అతిపెద్ద పాడి సహకార సంఘాల నెట్‌వర్క్‌లలో ఒకటి. ఇది లక్షలాదిమంది పాల ఉత్పత్తిదారులతో అనుసంధానమై ఉంది. ఈ డైరీ రైతులకు క్రమం తప్పని చెల్లింపులు, సాంకేతిక మార్గదర్శకత్వం, నమ్మకమైన మార్కెట్ సదుపాయం అందించి గ్రామీణ ఆదాయాలను గణనీయం పెంచడంలో సహాయపడుతుండటం విశేషం. అంతేగాదు ఎంతోమంది మహిళలను పారిశామ్రికవేత్తలుగా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. అలా లబ్ధి పొందిన అనేకమంది మహిళల్లో దర్యాబెన్ కూడా ఒకరు. ఒకరకంగా ఇది గ్రామీణ పాంతంలోని మహిళలు కేవలం ఇంటి పనులకు, పశువులను చూసుకోవడానికే పరిమితం కాదని ఈ డైరీ నిరూపించింది కదూ. (చదవండి: ఏరోస్పేస్ ఉద్యోగాన్ని వదిలి కేఫ్..! ఏడాదికి రూ. 1.44 కోట్లు..) -
ఎల్‌నినోను తట్టుకునే ఉపాయాలు!
ముందు నుంచే అనుకుంటున్నట్లు ఎల్‌నినో ప్రారంభమైందని భారతీయ వాతావరణ విభాగం కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రకటించింది. దీని అర్థం ఏమిటి? ఈ ఏడాది వర్షాలు తక్కువ, వేడి ఎక్కువ. వర్షం ఎప్పుడు, ఎంత పడుతుందో తెలియదు.. వర్షాల మధ్య ఎంత గ్యాప్ ఉంటుందో తెలియదు.. ఉన్నట్టుండి ఎప్పుడు కుండపోత వర్షం పడుతుందో తెలియదు.. ఇటువంటి కరువు పరిస్థితులను రైతులు కొంతమేరకైనా తట్టుకునేందుకు ఉపయోగపడే వ్యవసాయ, నీటి సంరక్షణ పద్ధతులపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం.. విత్తన గుళికలుతక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు వంటి వాతావరణ ఒడిదుడుకులను తట్టుకోవడానికి విత్తనాలను గుళికలుగా మార్చడం ఎంతో లాభదాయకం. ఈ పద్ధతిని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో, రైతులు ఇప్పటికే అనుసరిస్తున్నారు. బీజామృతంతో శుద్ధి చేసిన విత్తనాలపై బంకమట్టి, ఘనజీవామృతం పొడి, కట్టె బూడిదను పొరలు పొరలుగా (గోనె పట్టా సహాయంతో ఒక ప్రత్యేక పద్ధతిలో) లేపనం చేయడం ద్వారా సాధారణ విత్తనం కంటే 3–5 రెట్లు పెద్దవైన విత్తన గుళికలు సిద్ధమవుతాయి. ఇవి పక్షులు, కీటకాల నుంచి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. మట్టిలో కేవలం 10–15 మి.మీ.ల వర్షపాతం కురిసినా సులభంగా మొలకెత్తుతాయి. తగిన తేమ లేకపోయినా ఆరు నెలల వరకు జీవంతో ఉండి, మొలకెత్తిన తర్వాత 25–40 రోజుల పాటు నీటి ఎద్దడిని తట్టుకోగలవు. పప్పుధాన్యాలు, జొన్న, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు, జనుము, జీలుగ, మొక్కజొన్న, కొన్ని రకాల నూనె గింజలు, కొన్ని రకాల కూరగాయ విత్తనాలు విత్తన గుళికల తయారీకి అనువైనవి. కచ్చితంగా 5 సెం.మీ. (2 అంగుళాల) లోతులో మాత్రమే విత్తుకోవాలి.కందకాలుకురిసిన వర్షపు నీరు బయటకు పోకుండా భూమిలోకి ఇంకింపజేసుకుంటే పంటలకు నీటి భద్రత దొరుకుతుంది. అందుకు కందకాలు ఉపయోగపడతాయి. పొలంలో వాలుకు అడ్డంగా.. ప్రతి 50 మీటర్లకు ఒక చోట.. 1 మీటరు లోతు, 1 మీటరు వెడల్పు, 25 మీటర్ల పొడవున కందకం తవ్వాలి. రెండు కందకాల మధ్య 5 మీటర్లు ఖాళీ వదలాలి. తవ్విన మట్టిని కందకం లోతట్టు వైపు కట్టగా పోయాలి. ఇసుక కలిసిన ఎర్ర నేలలు, చల్కా నేలలు ఏటవాలుగా ఉంటే పొలం మధ్యలో 50 మీటర్లకు ఒక్కటి చొప్పున కందకాలు తవ్వుకోవాలి. ఎర్ర చల్కా చేను సమతలంగా ఉంటే.. అర ఎకరం లేదా ఎకరానికి ఒక మడి చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. మడుల కట్టలు కనీసం అర మీటరు ఎత్తుగా వేసి.. పక్కనే కందకం తవ్వాలి. నల్ల రేగడి నేలలు ఏటవాలుగా ఉన్నా, సమతలంగా ఉన్నా, పొలం మధ్యలో కందకాలు తవ్వకూడదు. పొలం చివరన బావి లేదా బోరు కింద వాలులో.. ఒకే ఒక పెద్ద కందకం 2,3 మీటర్ల లోతున తవ్వుకుంటే చాలు. ఇతర వివరాలకు.. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక సీనియర్ నేతలను సంప్రదించవచ్చు: సంగెం చంద్రమౌళి (ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ – రిటైర్డ్): 98495 66009, మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ – రిటైర్డ్) 99638 19074.ఎత్తు మడులుసాగు చేసే పంట ఏదైనా సరే ఎత్తుమడులు లేదా బోదెల (రెయిజ్డ్ బెడ్స్)పైనే పంటలు విత్తుకోవటమే రైతుకు అన్ని విధాలా మేలని నిపుణులు చెబుతున్నారు. వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా.. వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజుల వ్యవధి వచ్చినా.. నల్ల రేగడైనా, ఎర్ర నేలైనా, బంక మట్టి అయినా సరే.. ఎత్తు మడులు చేసి లేదా బోదెలు తోలి పంటలు విత్తుకుంటే రైతుకు ఆదాయ భద్రత చేకూరుతుందని ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా. ప్రవీణ్‌కుమార్ రైతులకు సూచిస్తున్నారు. పత్తి + కంది, మిర్చి, పసుపు, సోయా, వేరుశనగ, కూరగాయలతో పాటు ఇంకా ఏ ఇతర ఆరుతడి పంటలైనా సరే ఎత్తుమడులపై విత్తుకుంటే అనావృష్టి / అతివృష్టి వంటి వైపరీత్యాల నుంచి పంటలను రక్షించుకోవచ్చని ఆయన తెలిపారు. ఎత్తుమడులపై పంటల సాగుపై అనేక ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. అనుసరిస్తున్న రైతులు సైతం చక్కటి ఫలితాలు సాధిస్తున్నారు. పత్తిలో అంతరపంటగా కందిని విత్తు కుంటే ఒక పంట దెబ్బతింటే, మరో పంటైనా రైతును ఆదుకుంటుందన్నారు. ఇతర వివరాలకు డా. ప్రవీణ్ కుమార్‌ను 91822 67666 నంబరులో సంప్రదించవచ్చు.లాం ఫారంలో అమ్మకానికి మేలు రకం మిరప విత్తనాలు గుంటూరు సమీపంలోని లాం ఫారంలో ఈ నెల 16వ తేదీ నుంచి ఎల్.సి.ఎ–625, ఎల్.సి.ఎ–643 మిరప రకాల ఫౌండేషన్ విత్తనం అమ్ముతున్నట్లు లాం ఫారం ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ టి. సుశీల తెలిపారు. ఎల్.సి.ఎ–643 రకం పచ్చిమిర్చికి, ఎండు మిర్చికి అనువైనది. కాయలు ఎండిన తరువాత కొంచెం ముడత కలిగి ఆకర్షణీయమైన ఎరుపు రంగు కలిగి, బ్యాడగి రకంలా ఉంటాయి. బెట్టను బాగా తట్టుకొంటుంది. కొంతవరకు జెమిని వైరస్‌ను కూడా తట్టుకొంటుంది. నల్లతామర పురుగు ఉధృతి ఉన్నా కొద్దిపాటి పురుగు మందుల పిచికారీతో అధిక దిగుబడినివ్వగలిగిన రకం. ఎల్.సి.ఎ–625 రకం ఎండు మిరపకు అనువైనది. సూటి రకాల్లో కెల్లా అధిక ఘాటు (45,000–50,000 ఎస్.హెచ్.యు), మంచి ఆకర్షణీయమైన ఎరుపు రంగు (60–65 ఎ.ఎస్.టి.ఏ) కలిగిన రకం. కాయ తోలు పలచగా ఉండి, అధిక ఘాటు వలన కాయకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. తాలు కాయలు చాలా తక్కువగా వస్తాయి.లాం ఫారంలో ఈ నెల 16వ తేదీ నుంచి ప్రతి రోజు ఉ. 9 గం.–సా. 4 గం. లోపు రైతులు నేరుగా వచ్చి కొనుక్కోవచ్చు. ఒక్క రైతుకు 250 గ్రాముల విత్తనం మాత్రమే రూ. 300లకు అమ్ముతారు. ఇవే పేర్లతో బయట ఎవరైనా ఈ విత్తనాలు అమ్మజూపితే రైతులు వాటిని ఖరీదు చేసి మోసపోవద్దని డా. సుశీల విజ్ఞప్తి చేశారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 99898 09554 / 94405 92982సేంద్రియ సేద్యంపై ‘అక్షయకల్ప’ ఫెలోషిప్వ్యవసాయ భూమి గల లేదా వ్యవసాయ నేపథ్యం ఉన్న యువతను సేంద్రియ రైతు పారిశ్రామికవేత్తలుగా లేదా రైతు విస్తరణ నిపు ణులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ’అక్షయకల్ప –రెయిన్ మ్యాటర్ ఫెలోషిప్’ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుంది. పాడి పశువుల పెంపకం, నాటు కోళ్ల పెంపకం,బయోగ్యాస్ ఉత్పత్తి, బయోడైజెస్టర్ ద్వారా తయారుచేసుకునే సేంద్రియ ఎరువులతో లాభదాయక సమీకృత సేంద్రియ వ్యవసాయ పద్ధతిపై 19–27 మధ్య వయస్కులైన యువతకు 9 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని ఈదులాపల్లిలోని అక్షయకల్ప సేంద్రియ వ్యవసాయ ప్రాంతీయ పరిశోధన–శిక్షణా కేంద్రంలో ఎంపికైన 30 మందికి మొదటి 3 నెలలు రెసిడెన్షియల్ శిక్షణ, తరు వాత 6 నెలలు ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. ఉచిత భోజనం, వసతితో పాటు ఉపకార వేతనం ఇస్తారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల అభ్యర్థులకు ప్రాధాన్యం. వివరాలకు.. 89043 96761 / 91132 03476 / 70222 77155 / 89043 96761 నిర్వహణ: పంతంగి రాంబాబు,సాక్షి సాగుబడి డెస్క్ -
వ్యవసాయ రంగంలో మార్పులకు సహకార సంఘాలే కీలకం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగంలో సహకార సంఘాల ప్రాధాన్యం మరోసారి చర్చనీయాంశమైంది. చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచడంలో సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పీఓలు) కీలక పాత్ర పోషిస్తాయని జాతీయ వ్యవసాయ శాస్త్రాల అకాడమీ (ఎన్ఏఏఎస్–నాస్) వెలువరించిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ‘బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్ ఇన్ ది గ్లోబల్ అరేనా’పేరుతో విడుదలైన నివేదికలో ప్రపంచంలోని విజయవంతమైన సహకార నమూనాలను విశ్లేషించి భారత పరిస్థితులకు అన్వయిస్తూ పలు కీలక సూచనలు చేసింది. రైతులను మార్కెట్‌తో అనుసంధానించడం, విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం, ప్రాసెసింగ్, నిల్వ సదుపాయాలు కల్పించడం ద్వారా సహకార వ్యవస్థ వ్యవసాయంలో గణనీయమైన మార్పు తీసుకురాగలదని పేర్కొంది. భారత్‌లో దాదాపు 90 శాతం వ్యవసాయ కుటుంబాలు చిన్న, సన్నకారు రైతులవే. విత్తనాలు, ఎరువులు, యంత్రాలు, రుణాలు, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వంటి సేవలను ఒకే వేదికపై అందించే సామర్థ్యం సహకార సంఘాలకు ఉందని వివరించింది.భారత్‌లో 8 లక్షలకుపైగా సహకార సంఘాలుప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 లక్షలకుపైగా సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. వీటిలో 30 కోట్లకు పైగా సభ్యులు ఉన్నారు. వ్యవసాయం, పాల ఉత్పత్తి, ఎరువులు, గ్రామీణ రుణాలు, మార్కెటింగ్, నిల్వ తదితర రంగాల్లో ఇవి సేవలందిస్తున్నాయి. పాల రంగంలో అమూల్, ఎరువుల రంగంలో ఇఫ్కో వంటి సంస్థలు సహకార వ్యవస్థ ద్వారా ప్రపంచస్థాయి విజయాలు సాధించిన ఉదాహరణలుగా అధ్యయనం పేర్కొంది. తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) ప్రధానంగా రుణాల పంపిణీకే పరిమితమవుతున్నాయి. భవిష్యత్‌లో వీటిని బహుళ సేవల కేంద్రాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అధ్యయనం సూచించింది. రైతులకు రుణాలతో పాటు విత్తనాలు, ఎరువులు, గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్లు, మార్కెటింగ్, డిజిటల్ సేవలు, విలువ వృద్ధి కార్యక్రమాలు అందించే కేంద్రాలుగా పీఏసీఎస్‌లను తీర్చిదిద్దాలని పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికే 311 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఎఫ్పీఓలుగా మార్చినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల వెల్లడించారు. రైతులకు విత్తనాల సరఫరా, నేల పరీక్షలు, మార్కెటింగ్, ప్రాసెసింగ్ వంటి సేవలను ఒకేచోట అందించే కేంద్రాలుగా పీఏసీఎస్‌లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ‘నాస్’అధ్యయనం కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది.ముల్కనూరు మోడల్‌కు గుర్తింపుఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముల్కనూరు సహకార సంఘం దేశంలోనే విజయవంతమైన సహకార నమూనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. రైతులకు రుణాలు, ఎరువులు, మార్కెటింగ్, నిల్వ సదుపాయాలు ఒకే వేదికపై అందించడం ద్వారా సహకార వ్యవస్థ ఎలా విజయవంతమవుతుందో ఈ నమూనా చూపించిందని ‘నాస్’వర్క్‌షాప్‌లో నిపుణులు ప్రస్తావించారు. -
‘పంట’ మారితేనే సాగు.. బాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరి, పత్తి పంటల ఉచ్చు నుంచి బయటపడకపోతేభవిష్యత్తులో వ్యవసాయం ప్రమాదకరంగా మారనుందా..? అవుననే అంటోంది రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్. వరి, పత్తి పంటలనే నమ్ముకుంటే దీర్ఘకాలంలో అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. ఆర్థికంగా, పర్యావరణపరంగా తీవ్ర నష్టమని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యవసాయాన్ని వరి, పత్తి ఆధారిత వ్యవస్థ నుంచి అధిక ఆదాయం, తక్కువ నీటి వినియోగం, మెరుగైన పర్యావరణ సమతుల్యత కలిగిన వైవిధ్యభరిత వ్యవసాయ విధానంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పింది.సుస్థిర వ్యవసాయం, రైతుల ఆదాయ భద్రత, సహజ వనరుల పరిరక్షణ కోసం పంటల మార్పిడి తప్పనిసరని తేల్చిచెప్పింది. ఈ మేరకు రైతు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి నేతృత్వంలో రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. వరి, పత్తికి విని యోగిస్తున్న ఎరువులు నేలతల్లిని నిస్సారంగా మారుస్తున్నాయని నివేదిక పేర్కొంది. మరికొన్నాళ్లు అదే పరిస్థితి కొనసాగితే ఆ భూముల్లో గడ్డి మొలవడం కూడా కష్టమేనని వెల్లడించింది. 2013–14లో ఉన్న పంటల సాగు 2024–25 నాటికి పూర్తిగా మారిపోయిందని చెప్పింది. ముఖ్యంగా వరి, పత్తి సాగును క్రమంగా తగ్గించి ఉద్యానవన పంటలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని సూచించింది. ఈ మేరకు రూపొందించిన ‘పంటల మార్పిడి’నివేదికను శనివారం విడుదల చేశారు. వరి, పత్తిని సర్కారే సేకరిస్తుండటంతో... వరి, పత్తికి మాత్రమే కనీస మద్దతు ధర, ప్రభుత్వ కొనుగోళ్ల భరోసా ఉండటంతో రైతులు ఏకపంట సాగు వైపు మొగ్గుచూపుతున్నారని కమిషన్ పేర్కొంది. దీనివల్ల భూసారం క్షీణించడం, నీటి వినియోగం పెరగడం, ఎరువులు, పురుగుమందుల వినియోగం అధికమవడం, పంటల వైవిధ్యం తగ్గిపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం వరి, పత్తి కొనుగోళ్లను పరిమితం చేసే అవకాశం కూడా ఉండటంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కమిషన్ సూచించింది. వానాకాలం, యాసంగి సీజన్లు కలిపి ఏటా 1.30 కోట్ల ఎకరాల్లో వరి సాగయ్యే పరిస్థితి ఏర్పడింది. పత్తికి కూలీల సమస్య ఉన్నప్పటికీ, పురుగు మందులను వినియోగిస్తే అధిక పంటతో గిట్టుబాటు కలుగుతుందనే భావనతో రైతులు వరి తరువాత పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉద్యాన పంటలకు అడ్డంకులు ఉద్యాన పంటలు తక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నప్పటికీ రైతులకు అధిక ఆదాయం అందిస్తున్నాయని నివేదిక పేర్కొంది. అయినప్పటికీ మార్కెటింగ్ సదుపాయాల కొరత, ధరల అనిశ్చితి, కోల్డ్ స్టోరేజీలు లేకపోవడం, ప్రాసెసింగ్ యూనిట్ల కొరత రైతులను ఉద్యాన పంటల నుంచి దూరం చేస్తున్నట్లు వివరించింది. వీటికి తోడు ఇటీవలి కాలంలో అధికమైన కోతులు, అడవి పందులు, జింకల బెడద రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్ల తోటలపై వన్యప్రాణుల దాడులు పెరగడంతో రైతులు ఉద్యాన పంటల నుంచి దూరమవుతున్నారని కమిషన్ గుర్తించింది.ఈ సమస్యకు పరిష్కారంగా నాబార్డు సహకారంతో సోలార్ ఫెన్సింగ్‌కు సబ్సిడీ ఇవ్వాలని సూచించింది. అలాగే రంగారెడ్డి, వికారాబాద్, సిద్ధిపేట జిల్లాలను ‘వెజిటబుల్ జోన్’లుగా ప్రకటించి హైదరాబాద్ మార్కెట్ అవసరాలను స్థానికంగా తీర్చాలని ప్రతిపాదించింది. ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’విధానాన్ని అమలు చేసి, ఆయా జిల్లాల్లో ప్రత్యేక పంటలకు ప్రోత్సాహకాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని పేర్కొంది.ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పండ్ల తోటలు, పూల సాగు, ఆయిల్ పామ్, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కమిషన్ సూచించింది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్పీఓలు), పంట కాలనీలు, ఫుడ్‌ప్రాసెసింగ్ పరిశ్రమలు, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తేనే పంటల మార్పిడి విజయవంతమవుతుందని నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం తీరు ఇలా (విస్తీర్ణం ఎకరాల్లో)... పంట 2013–14 2024–25 వరి 49,28,000 1,27,03,000 పత్తి 15,00,000 45,00,000 పండ్ల తోటలు 9,11,200 4,48,960 కూరగాయలు 5,52,352 1,02,698 పూల తోటలు 17,220 6,248 ఆయిల్‌పామ్ 33,742 2,43,498 పసుపు 1,52,445 42,246 పప్పుధాన్యాలు 10,20,418 8,83,710 నూనెగింజలు 12,41,845 7,13,572 చిరుధాన్యాలు 19,58,378 18,84,528 మొత్తం ఉద్యాన పంటలు 19,82,270 12,46,032 -
సాగుకు ఊతం.. రైతుకు భరోసా
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గడచిన పుష్కర కాలంలో దేశ వ్యవసాయ రంగం రూపురేఖలు మారిపోయాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేవలం రాయితీలు, సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా.. సాగును లాభసాటిగా మార్చే దిశగా కేంద్ర విధానాలు అమలయ్యాయని పేర్కొంది. బడ్జెట్ కేటాయింపుల పెంపు నుంచి మొదలుపెట్టి కనీస మద్దతు ధరల (ఎంఎస్పీ) సవరణ, మౌలిక వసతుల కల్పన, డిజిటల్ టెక్నాలజీ జోడింపు వరకు ప్రతి అడుగూ ఉత్పాదకతను పెంచేలా పడ్డాయని.... ఫలితంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం రికార్డులు సృష్టిస్తోందని కేంద్రం తెలిపింది. 2014 నుంచి 2026 వరకు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వచ్చిన మార్పులు, సాధించిన ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సమగ్ర నివేదిక విడుదల చేసింది. రెట్టింపైన వ్యవసాయ ఆదాయం గత పన్నెండేళ్లలో సాగు రంగానికి నిరంతర విధానపరమైన మద్దతు లభించింది. దీంతో మొత్తం స్థూల విలువ ఆధారిత (జీవీఏ)లో ఈ రంగం వాటా 18 శాతానికి చేరింది. 2014–15లో రూ.20.9 లక్షల కోట్లుగా ఉన్న వ్యవసాయ జీవీఏ.. 2023–24 నాటికి ఏకంగా రూ.48.7 లక్షల కోట్లకు పెరిగింది. పంటల విభాగం జీవీఏ సైతం రూ.12.92 లక్షల కోట్ల నుంచి రూ.26.52 లక్షల కోట్లకు చేరింది. 2013–14లో కేవలం రూ.27,663 కోట్లుగా ఉన్న వ్యవసాయ శాఖ బడ్జెట్ 2026–27 నాటికి రూ.1.40 లక్షల కోట్లకు చేరడం ఈ రంగం ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. సిరులు పండిస్తున్న నేలఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం సరికొత్త రికార్డులు నమోదు చేసింది. 2013–14లో 26.50 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి కాగా, 2024–25 నాటికి ఈ రికార్డు 35.77 కోట్ల టన్నులకు చేరింది. వరి ఉత్పత్తి 42 శాతం పెరిగి 15.01 కోట్ల టన్నులకు చేరుకోగా, ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్ నిలిచింది. గోధుమలు 11.79 కోట్ల టన్నులు, మొక్కజొన్న 4.34 కోట్ల టన్నులు, నూనెగింజలు 4.29 కోట్ల టన్నుల మేర ఉత్పత్తి సాధించాయి. ఉద్యానవన రంగం సైతం 36.90 కోట్ల టన్నుల ఉత్పత్తితో వ్యవసాయ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. గిట్టుబాటుకు గ్యారెంటీపంటల ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం అదనంగా ఉండేలా ఎంఎస్పీని నిర్ణయిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2014–2026 మధ్య కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ప్రభుత్వ సేకరణ 76 శాతం పెరిగి 122.92 కోట్ల టన్నులకు చేరింది. ఈ పుష్కర కాలంలో రైతులకు దక్కిన ఎంఎస్పీ విలువ రూ.26.32 లక్షల కోట్లు. 2014–15తో పోలిస్తే 2026–27 సీజన్‌కు రాగుల మద్దతు ధర అత్యధికంగా 236 శాతం పెరిగింది. వరి (సాధారణ రకం) మద్దతు ధర రూ.1,360 నుంచి రూ.2,441కి చేరింది. పత్తి రూ.3,750 నుంచి రూ.8,267కి చేరగా.. పప్పుదినుసులు, నూనె గింజల ధరల్లోనూ భారీ పెరుగుదల నమోదైంది.పెరిగిన రుణ లభ్యత రైతులకు సకాలంలో రుణాలు అందించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డుల (కేసీసీ) ఖాతాలను 7.81 కోట్లకు పెంచారు. వ్యవసాయ రంగానికి సంస్థాగత రుణాలు 2013–14లో రూ.7.30 లక్షల కోట్లు ఉండగా, 2024–25 నాటికి ఈ మొత్తం రూ.28.67 లక్షల కోట్లకు చేరింది. ఫార్మ్ గేట్ వద్ద మౌలిక వసతుల కల్పనకు ఏఐఎఫ్ (వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి) కింద రూ.84,202 కోట్ల రుణాలను మంజూరు చేశారు. ఈ–నామ్ వేదికగా 1,656 మార్కెట్లను అనుసంధానించారు. మట్టి నాణ్యతను ధ్రువీకరించేందుకు ఇప్పటివరకు 26 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులను జారీ చేశారు. పీఎం కుసుమ్ ద్వారా 21.77 లక్షల మంది రైతులకు సౌర పంపుసెట్లను అందించారు.లాభసాటిగా అనుబంధ రంగాలు సాంకేతికత జోడింపుతో వ్యవసాయం ఆధునికతను సంతరించుకుంటోంది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద 7.63 కోట్ల మంది రైతులకు ప్రత్యేక ఐడీలు సృష్టించారు. 23.5 కోట్ల పంట భూములను డిజిటైజ్ చేశారు. నమో డ్రోన్ దీదీ కింద వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. వ్యవసాయంతో పాటు పాడి, మత్స్య రంగాలు రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారాయి. పాల ఉత్పత్తి 2024–25 నాటికి 247.87 మిలియన్ టన్నులకు చేరింది. మత్స్య సంపద ఉత్పత్తి 19.78 మిలియన్ టన్నులకు చేరుకుంది. వ్యవసాయ, ప్రొసెస్డ్ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరిగి 51.1 బిలియన్ డాలర్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వ నివేదిక పేర్కొంది. పెట్టుబడికి సాయం.. పంటకు రక్షణ.. రైతులకు పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఏటా రూ.6,000 చొప్పున అందిస్తున్నారు. ఇప్పటివరకు 22 విడతల్లో 9.44 కోట్ల కుటుంబాలకు రూ.4.28 లక్షల కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులను ఆదుకునేందుకు పీఎం ఫసల్ బీమా యోజన అండగా నిలుస్తోంది. ఏటా 4 కోట్ల మంది రైతులు పంటల బీమా చేయించుకుంటున్నారు. 2016 నుంచి డిసెంబర్ 2025 వరకు 24.31 కోట్ల మంది రైతులకు రూ.1.96 లక్షల కోట్ల మేర పరిహారం మంజూరైంది. -
మొక్కజొన్న చొప్పతో జెట్ ఇంధనం!
మొక్కజొన్న కంకుల్ని కోసిన తర్వాత మిగిలే ఎండు చొప్పతో జెట్ విమానాలను నడిపే ఖరీదైన ఇంధనాన్ని రూపొందించడం ద్వారా ఖర్చు తగ్గించుకోవటంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. పశ్చమాసియా యుద్ధం ్ర΄ారంభమైన తర్వాత విమానయాన ఇంధనం ధర రెట్టింపైంది. విమానయాన సంస్థలు పెట్రోలియంకు ప్రత్యామ్నాయాలను కనుగొని, తమ ఉద్గారాలను తగ్గించుకోవాలని చూస్తున్నాయి. మొక్కజొన్న పంట వ్యర్థాలను ఇంధనంగా మార్చడం దీనికి ఒక గొప్ప ఆరంభం కానుంది. ప్రతి పంట కోత కాలం తర్వాత అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న పొలాలు ఎండిన చొప్ప, ఆకులతో నిండి΄ోతాయి. మొక్కజొన్న కంకులను సేకరించిన తర్వాత మిగిలి΄ోయే వ్యర్థాలు ఇవి. కొంతమంది రైతులు ఈ చొప్పను జంతువులకు మేతగా వేస్తారు లేదా పంటల మధ్యన ఆచ్ఛాదనగా లేదా సహజ కం΄ోస్టు ఎరువుగా తయారు చేసి భూసారాన్ని పెంచటానికి ఉపయోగిస్తారు. కానీ, అమెరికా వంటి దేశాల్లో మొక్కజొన్న వ్యర్థాల్లో చాలా భాగం సరిగ్గా ఉపయోగపడకుండానే మిగిలిపోతోంది.వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ (డబ్ల్యూఆర్ఐ) తాజా పరిశోధన ప్రకారం.. విమానయాన రంగంలో ఉద్గారాలను తగ్గించటం అత్యంత క్లిష్టతరమైన పని. అయితే, మొక్కజొన్న వ్యర్థాలను ఈ పని కోసం సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని తేలింది. మొక్కజొన్న చొప్ప నుంచి జెట్ ఇంధనాన్ని తయారు చేయటం ద్వారా ఈ ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను వాతావరణ మార్పులకు దోహదపడకుండా తీర్చవచ్చు.ఇరాన్‌పై యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి మూసివేతతో ముడి చమురుతో తయారయ్యే సాంప్రదాయ జెట్ ఇంధనం ధర ప్రపంచవ్యాప్తంగా ఇటీవల రెట్టింపు అయ్యింది. కానీ, ప్రపంచ ఉద్గారాల్లో 2.4% కాలుష్యానికి కారణమవుతున్న పెట్రోలియం జెట్ ఇంధనానికి ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసే కృషి ఈ యుద్ధానికి ముందే మొదలైంది. విమాన ప్రయాణానికి డిమాండ్ పెరిగేకొద్దీ, 2050 నాటికి ఈ ఇంధన కాలుష్యం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా.చొప్పతో 10% జెట్ ఇంధనంమొక్కజొన్న చొప్ప వ్యర్థాలతో జెట్ ఇంధనం తయారీ ప్రక్రియ మనుషులకూ, పర్యావరణానికీ కూడా మేలు చేసే ఒక మెరుగైన ప్రత్యామ్నాయం అని డబ్ల్యూఆర్ఐ పరిశోధనలో తేలింది. నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి పొలాల్లోనే వదిలివేయాల్సిన భాగాన్ని మినహాయించిన తర్వాత, అమెరికాలో ప్రతి సంవత్సరం 9 కోట్ల టన్నుల మొక్కజొన్న చొప్ప అందుబాటులో ఉంటుందని అంచనా. ఇది 300 కోట్ల గ్యాలన్ల నిజమైన సుస్థిర ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి సరిపోతుంది. ఈ మొత్తం అమెరికా వైమానిక ఇంధన కాలుష్యాన్ని 75% తగ్గింపునకు దోహదపడుతుంది. అంతేకాకుండా, అమెరికా జెట్ ఇంధన అవసరతను 10 శాతం వరకూ తీరుస్తుంది. ప్రస్తుతం అమెరికాలో మొక్కజొన్న ఇథనాల్‌ను జెట్ ఇంధనంగా మార్చుతున్నారు. ఈ పనికి స్వస్తి చెప్పటం ద్వారా ఆహార ధాన్యాలను ఇంధనానికి వాడటం మానుకోవచ్చు. దీని వలన కలిగే ప్రయోజనం కేవలం వాతావరణానికి మాత్రమే పరిమితం కాదు. మొక్కజొన్న చొప్ప ఇంధనోత్పత్తి అనేక ఉద్యోగాలను, ఇతర ఆర్థిక ప్రయోజనాలను సృష్టించగలదని నిపుణులు చెబుతున్నారు. డబ్ల్యూఆర్ఐ పరిశోధన ప్రకారం, సంవత్సరానికి 300 కోట్ల గ్యాలన్ల మొక్కజొన్న చొప్పతో వైమానిక ఇంధనం ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టడం వల్ల 99 వేల నుంచి 2.14 లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చు. సంబంధిత ఆర్థిక కార్యకలా΄ాలు వేలాది కోట్ల డాలర్ల పన్ను రాబడి అదనంగా చేకూరుతుందని అంచనా.ప్రాథమిక దశలో పరిశోధనలుమొక్కజొన్న చొప్పను జెట్ ఇంధనంగా మార్చే సాంకేతికతలపై పరిశోధనలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి. సాంప్రదాయ జెట్ ఇంధనాలతో ధరల పరంగా ఈ ప్రత్యామ్నాయ ఇంధనం ఇంతకుముందు వరకు ΄ోటీపడలేక΄ోవడం కూడా ఇందుకు ఓ కారణం. కానీ ఇరాన్‌పై యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ సంఘర్షణల కారణంగా సాంప్రదాయ ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఈ అంతరం తగ్గుతోంది. దీనివల్ల కొత్త రకాల విమానయాన ఇంధనోత్పత్తి రంగం పెట్టుబడిదారులకు, విమానయాన సంస్థలకు మరింత ఆకర్షణీయంగా మారుతోంది.పరిశోధన, అభివృద్ధికి విధానపరమైన మద్దతు, విస్తరణ ప్రోత్సాహకాలు లేకుండా మొక్కజొన్న చొప్పతో ఇంధనం ఉత్పత్తి సాంకేతికతల అభివృద్ధి యజ్ఞం నెరవేరదు. డబ్ల్యూఆర్ఐ పరిశోధన ప్రకారం, అన్ని సమస్యలకు ఒకే పరిష్కారంగా పనిచేసే సాంకేతికత అంటూ ఏదీ లేదు. దానికి బదులుగా, ఏ సాంకేతికతలకు అత్యధిక సామర్థ్యం ఉందో అర్థం చేసుకోవడానికి, విభిన్న రకాల సాంకేతికతల పరిశోధన, అభివృద్ధికి విధానాల మద్దతు ఇవ్వాలి. మొక్కజొన్న చొప్ప అమెరికాలో అత్యంత సవృద్ధిగా లభించే వ్యవసాయ వ్యర్థం. చొప్ప ఆధారిత విమానయాన ఇంధనోత్పత్తి పరిశ్రమ మన ఇంధన భద్రతకు దోహదపడటంతో పాటు, విమానయాన ఉద్గారాలను తగ్గించి, మొక్కజొన్న ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చెయ్యగలదని నిపుణులు భావిస్తున్నారు. (చదవండి: అడవి పండ్లు: ఆనె పరిగెతో ఇన్ని లాభాలా!) -
ఎరువుల సంక్షోభం ముంచుకొస్తోంది..
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో తీవ్రమైన ఎరువుల సంక్షోభం ముంచుకొస్తోందని ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త డాక్టర్ అశోక్ గులాటి హెచ్చరించారు. ఈ సంక్షోభాన్ని ప్రధానంగా రెండు కోణాల్లో చూడాల్సి ఉంటుందని ఆయన విశ్లేషించారు. త్వరలోనే ఖరీఫ్ సాగు సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ప్రస్తుతానికి మన దగ్గర తగినన్ని ఎరువుల నిల్వలు ఉండటం రైతులకు ఊరట కలిగించే శుభవార్త అని ఆయన పేర్కొన్నారు. అయితే, దీర్ఘకాలికంగా చూస్తే ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై, సబ్సిడీలపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆందోళన వ్యక్తం చేశారు. డా. అశోక్ గులాటి తెలిపిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తనున్న ఎరువుల సంక్షోభాన్ని ప్రధానంగా రెండు కోణాల్లో చూడాలి. ఖరీఫ్ సాగు సీజన్ త్వరలో మొదలవనున్న నేపథ్యంలో మన దగ్గర తగినన్ని నిల్వలు ఉన్నాయన్నది రైతులకు శుభవార్త.ఇక రెండోది మన వ్యవసాయానికి అత్యంత కీలకమైన యూరియా. మనం ఏటా సుమారు 40 మిలియన్ టన్నుల యూరియా వాడుతున్నాం. గతేడాది 11 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకున్నాం. ఇటీవలే ప్రభుత్వం యూరియా దిగుమతి కోసం టన్నుకు 935 డాలర్ల కనీస ధరతో టెండర్లు ఆహ్వానించింది. రైతులకు విక్రయిస్తున్న ధర సుమారు 65 డాలర్లు.ఒకవేళ ధరలు పెరగకుంటే ఈ ఏడాది బడ్జెట్లో రూ.1.71 లక్షల కోట్లుగా కేటాయించిన ఎరువుల సబ్సిడీ తడిసిమోపడవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది రూ.2.5 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. పశ్చిమాసియా సంక్షోభం త్వరగా చల్లారకపోతే, సబ్సిడీ మొత్తం ఏకంగా రూ. 3 లక్షల కోట్లను కూడా దాటిపోవచ్చనేది ఎరువుల శాఖ అధికారుల తాజా లెక్క.హార్మూజ్ జలసంధిలో దిగ్బంధనం మరో 2–3 నెలలు పాటు కొనసాగితే, రాయితీల విషయంలో ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులు తలెత్తుతాయి. ఇంతకు మించిన ఆందోళన ఏంటంటే, ఎరువుల కోసం మనం 70% దిగుమతులపైనే ఆధారపడుతున్నాము.దేశీయంగా యూరియా ఉత్పత్తి కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. ఎందుకంటే, దీనికి అవసరమైన గ్యాస్ (ఎల్ఎన్జీ)లో 85% దిగుమతి చేసుకోవాల్సిందే. దీనివల్ల ఉత్పత్తి వ్యయం భారీగా ఎగబాకుతుంది, మొత్తంమీద ఖరీఫ్ సీజన్ మధ్యలోనో, లేదంటే చివర్లోనో తీవ్రమైన ఎరువుల సంక్షోభం పొంచి ఉంది.ఎరువుల ధరలు పెంచకపోతే, సబ్సిడీల భారం పెరిగి ద్రవ్యలోటు ఎగబాకుతుంది. స్థూల ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటాయి. విదేశీ పెట్టుబడుల తగ్గుదల, రూపాయి మరింత పతనం వంటి దుష్ర్పభావాలు తీవ్రమవుతాయి.ఈ సంక్షోభాన్ని సదవకాశంగా మలచుకొని సంస్కరణలకు నడుంబిగించాలి. ఎరువుల ధరల సబ్సిడీ విధానం నుంచి ఆదాయ మద్దతు విధానానికి మారాలి. రైతులతో మాట్లాడి, ఎరువుల ధర రాయితీలకు బదులు ఆదాయపరమైన రాయితీలతో ఆదుకుంటామన్న భరోసా కల్పించాలి. దీనికి ఒక వ్యవస్థ ఉండాలి. అవసరమైతే ‘పీఎం కిసాన్’ పథకంలో విలీనం చేయవచ్చు. దీని ద్వారా కూడా రైతులకు రూ. 2 లక్షల కోట్ల రాయితీలను నేరుగా ఇవ్వొచ్చు. తద్వారా కనీసం రూ. 40,000 కోట్లు ఆదా చేయగలుగుతారు.ప్రభుత్వం ఇంత భారీ సబ్సిడీలను ఇప్పుడున్నట్లే ఇవ్వాలనుకుంటే, వినియోగ పరిమితులను విధించాల్సి ఉంటుంది. అంటే, పొలం విస్తీర్ణాన్ని బట్టి, పండించే పంట ఆధారంగా రైతుకు అందించే ఎరువుల పరిమాణాన్ని కేటాయించాలి.15 ఏళ్లుగా వరి, గోధుమలు.. ఇలా అనేక ఉత్పత్తుల కనీస మద్దతు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కానీ యూరియా ధరలు మాత్రం అక్కడే ఉండిపోయాయి. ఈ విధానం సరికాదు. ఎరువుల సరఫరా వ్యవస్థలో లీకేజీల (వృథా/అక్రమాలు) కారణంగా సబ్సిడీ నిథులు పక్కదారి పడుతున్నాయి. ఎరువుల ధరలు సహజ మార్కెట్ స్థాయికి చేరుకుంటే, లీకేజీలన్నీ వాటంతటవే మాయమైపోతాయి.– డా. అశోక్ గులాటి, వ్యవసాయ ఆర్థికవేత్త -
చేను రాష్ట్రానిది చట్టం కేంద్రానిది!
భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్లో వ్యవసాయం స్పష్టంగా రాష్ట్ర జాబితాలో ఉంది. జాబితా–2 లోని 14వ నమోదు (ఎంట్రీ) ప్రకారం వ్యవసాయం, వ్యవసాయ విద్య, పరిశోధన, పంట రక్షణ.. ఇవన్నీ రాష్ట్రాల ప్రత్యేక అధికారం. 18వ నమోదులో భూమి, కౌలు, బదిలీ, వ్యవసాయ రుణాలు ఉన్నాయి. 28వ నమోదులో మార్కెట్లు, సంతలు ఉన్నాయి. వ్యవసాయం స్థానికమైనది. నేలలు, వర్షాలు, పంటల చక్రాలు, కౌలు విధానాలు, విత్తన సంస్కృతులు రాష్ట్రాల మధ్యే కాదు, జిల్లాల మధ్య కూడా మారతాయి అని రాజ్యాంగ నిర్మాతలకూ తెలుసు.కేంద్రీకృత వ్యవసాయ విధానం వ్యవసాయ శాస్త్రపరంగా అసంబద్ధం. అందుకే వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉంది. స్వాతంత్య్రానంతరం ఎనిమిది దశాబ్దాలు గడిచిన తరువాత కూడా వరి కనీస మద్దతు ధర, పప్పుధాన్యాల దిగుమతి సుంకం, పురుగుమందుల రిజిస్ట్రేషన్, జీఎం పంటల అనుమతి, ఎరువుల సబ్సిడీ నిర్మాణం, పంటల బీమా రూపకల్పన, రైతు డేటాబేస్ ఫార్మాట్, మట్టి, కార్బన్ క్రెడిట్ ప్రోటో కాల్లు, రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్లను కేంద్ర ప్రాధాన్యతలకు పరిమితం చేసే కేంద్ర పథకాల షరతులు... వీటన్నింటినీ నిర్ణయిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే! రాష్ట్రాలు కేవలం ఆ పథకాల అమలు సంస్థలుగా మిగిలిపోయాయి. కేంద్ర మార్గదర్శకాల ద్వారా, కేంద్ర గుర్తింపుతో పథకాలను అమలు చేస్తూ, కృషి భవన్, వాణిజ్య భవన్లలో తీసుకున్న నిర్ణయాల పర్యావరణ భారాన్ని రాష్ట్రాలు మోస్తున్నాయి.ఇరవై ఏళ్లుగా మొలకెత్తని విత్తన బిల్లు!వ్యవసాయాన్ని రాష్ట్ర జాబితాలో ఉంచిన అసలు ఏర్పాటు నిశ్శబ్దంగా క్రమేణా శూన్యమైపోయింది. వాణిజ్య అధికారాలు, ఉమ్మడి జాబితా నమోదులు, నిత్యావసర వస్తువుల చట్టం, ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాల కింద అంతర్జాతీయ నిబద్ధతలు, జీఎస్టీ ద్వారా ఆర్థిక కేంద్రీకరణ, షరతులతో కూడిన కేంద్ర పథకాల విస్త రణ... ఇవన్నీ కలిసి రాజ్యాంగ సవరణ లేకుండానే జరిగిపోయాయి. క్షేత్రస్థాయి పరిశీలన ఈ సమస్యను స్పష్టంగా చూపిస్తుంది. 2003–04లో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పెద్ద ఎత్తున పత్తి పంట నాశనమైంది. నాణ్యత లేని బి.టి. హైబ్రిడ్లపై కాయతొలుచు పురుగు దాడి, నకిలీ విత్తనాలు అమ్మిన అవినీతి డీలర్లు, వాతావరణ ఒత్తిడి... వీటన్నిటి కారణంగా అప్పుల్లో ఉన్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో విత్తన నాణ్యత పరీక్ష, కంపెనీల జవాబుదారీతనం, రైతుల పరిహారం కోసం విత్తన నష్ట పరిహార చట్టం ముసాయిదాను తయారు చేసింది. అయితే ఆ ముసాయిదాపై కేంద్ర ప్రభుత్వ స్పందన ఆశ్చర్యకరంగా ఉంది. జాతీయ విత్తన బిల్లు సిద్ధంగా ఉందనీ, రాష్ట్ర చట్టం గందరగోళం సృష్టిస్తుందనీ కేంద్ర అధికారులు వాదించారు. రాష్ట్రాన్ని ఆగమని కోరారు. 2004 విత్తన బిల్లు దాదాపు రెండు దశాబ్దాలుగా పార్లమెంటులో మూలుగుతూ ఉంది. ఈ మధ్య లోని కాలంలో రైతులకు అనేక సమస్యలు ఎదురైనా వాటికి ఎలాంటి చట్టపరమైన పరిష్కారమూ లభించ లేదు.పురుగుమందుల విషయంలో మరింత దారుణమైన అసమ తుల్యత ఉంది. 1968 క్రిమిసంహారక చట్టం సెక్షన్ 27 ప్రకారం, ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకర పురుగుమందు అమ్మకాన్ని నిషేధించ గలిగేది గరిష్ఠంగా 90 రోజులు (మొదట 60 రోజులు, తర్వాత 30 రోజులు) మాత్రమే. అంటే తన ప్రజలను ప్రమాదకర రసాయనం నుండి కాపాడుకోవడానికి ఒక రాష్ట్రానికి అందుబాటులో ఉన్న చట్టపరమైన అవకాశం 90 రోజులు మాత్రమే. ఆసుపత్రి అడ్మిషన్లు, దీర్ఘకాలిక నాడీ వ్యాధులు, విషం తాగి ఆత్మహత్యలు వీటన్నిటినీ భరించే రాష్ట్రానికి స్వయంగా నిర్ణయం తీసుకునే వెలుసుబాటు లేదు. ఉదా: కేరళ 2001లో ఎండోసల్ఫా¯Œ ను నిషేధించింది. కేంద్రం దానిని జాతీయ స్థాయిలో నిషేధించడానికి దాదాపు పదేళ్లు పట్టింది. నియంత్రణలకు రాష్ట్రాల సమ్మతి ఏదీ?తెలంగాణలో వరి సాగును పరిశీలించండి. దాదాపు 40 లక్షల హెక్టార్లలో, ఎక్కువగా బోర్వెల్ నీటిపై ఆధారపడి, రాష్ట్రం ఇచ్చే ఉచిత విద్యుత్‌తో పంపింగ్ చేసే భూగర్భ జలంతో ఇది సాగుతోంది. వరి సాగుకు ప్రోత్సాహం ఇచ్చే కనీస మద్దతు ధరపై రాష్ట్రా నికి అధికారం లేదు. ఎరువుల సబ్సిడీపై అధికారమూ పరిమితమే. చిరుధాన్యాలను ప్రోత్సహించేలా ‘సేకరణ’ విధానాన్ని మార్చలేదు. వాణిజ్యంలో రాజ్యాంగ వైరుధ్యం మరింత పదునుగా కని పిస్తుంది. వ్యవసాయం రాష్ట్ర అంశం. వ్యవసాయ వాణిజ్యం కేంద్ర అంశం. అంటే ఉల్లి సాగును మహారాష్ట్ర నియంత్రిస్తుంది. ఉల్లి ఎగుమతిని వాణిజ్య భవన్ నియంత్రిస్తుంది. 2007–08, 2010, 2019, మళ్లీ 2023లో దేశీయ ధరల ఒత్తిడికి స్పందనగా, ఎగుమతి మార్కెట్‌ను ఆశించి పంటలు వేసిన రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే కేంద్రం బియ్యం, గోధుమపై హఠాత్తుగా ఎగుమతి నిషే ధాలను విధించింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు పరిస్థితిని మరింత జటిలం చేశాయి. ‘ఏషియన్’ దేశాలు, జపాన్, కొరియాలతో ద్వైపాక్షిక ఒప్పందం.. వీటిల్లో ఏ ఒక్కదానిపైనా రాష్ట్రాల అధికారిక భాగస్వామ్యంతో చర్చ జరగలేదు.మరి పరిష్కారం? మొదట, వ్యవసాయ సమాఖ్య కమిషన్ ఏర్పాటు చేయాలి. సర్కారియా (1988), పుంఛీ (2010) కమిషన్లు కేంద్ర రాష్ట్ర సంబంధాలపై దృష్టి పెట్టినా, ప్రత్యేకించి వ్యవసాయంపై పెట్టలేదు. అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యంతో, రాజ్యాంగ సవ రణలు, చట్టపరమైన మార్పులు, ఆర్థిక పునర్నిర్మాణం... వీటిని సిఫార్సు చేయగల అధికారంతో ఈ కమిషన్ ఉండాలి. రెండవది, నిర్దిష్ట చట్టపరమైన స్పష్టతలు కావాలి. నిత్యావసర వస్తువుల చట్టంలో సవరణ, ఎగుమతి, నిల్వ నియంత్రణలు విధించే ముందు రాష్ట్ర సమ్మతి తప్పనిసరి. హానికర పురుగుమందులను శాశ్వతంగా నిషేధించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలి.గిట్టుబాటు కాని పంటలకు బోనస్మూడవది, పర్యావరణ అనుకూల వ్యవసాయం వైపు ఆర్థిక వికేంద్రీకరణ. జీడీపీలో దాదాపు 1.7 శాతం ఉన్న ఎరువుల సబ్సి డీని (ప్రస్తుతం దాదాపు పూర్తిగా తయారీదారులకు చెల్లిస్తున్న దానిని) క్రమంగా ‘రైతువారీ పర్యావరణ పరివర్తన చెల్లింపు’గా మార్చాలి. స్థానిక ప్రాధాన్యతల ప్రకారం రాష్ట్రాలు దీనిని వినియో గించుకోవాలి. మార్కెట్ దొరకని పంటలకు సేకరణ, గిట్టుబాటు కాని పంటలకు బోనస్ ఇచ్చే పద్ధతి కావాలి. భూగర్భ జలాలను కాపాడే, మట్టి కార్బన్‌ను నిల్వ చేసే, సంప్రదాయ విత్తనాల్ని రక్షించే రాష్ట్రాలకు పర్యావరణ ఆర్థిక బదిలీలు అందించాలి.నాల్గవది, ప్రాంతీయ ఆహార వ్యవస్థల ప్రణాళిక. భారత వ్యవ సాయ వైవిధ్యానికి ఒకే జాతీయ ఆహార విధానం కాదు, ప్రతిప్రాంత వ్యవసాయ పర్యావరణం, ఆహార సంస్కృతి, ఆర్థిక నిర్మాణానికి అనుగుణంగా రూపొందించిన ప్రాంతీయ ఆహార వ్యవస్థ ప్రణాళికల సమాఖ్య సరైనది. తూర్పు కనుమల చిరుధాన్య ప్రాంతం, ఇండో–గంగా మైదానం, పశ్చిమ కనుమల సుగంధ ద్రవ్య ప్రాంతం, ఈశాన్య పోడు వ్యవసాయ ప్రాంతం, పశ్చిమ భారత పప్పుల ప్రాంతం, దక్షిణ ద్వీపకల్ప నీటిపారుదల వరి బెల్ట్... ప్రతిదీ ఒక ప్రత్యేక వ్యవసాయ పర్యావరణ మండలం. ఏక రూప పంటల విధానం రుద్దడం కాకుండా, ప్రాంతీయ ఆహార వ్యవస్థల కలయికగా జాతీయ ఆహార భద్రతను నిర్మించవచ్చు.డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
ఇంధన ధరల షాక్
ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థ అధిక ఇంధన ధరలు, సరఫరా సమస్యలను ఎదుర్కొంటోందని.. దీనికితోడు ఎల్‌నినో పరిస్థితులు వ్యవసాయరంగం ఉత్పాదకతను దెబ్బతీయొచ్చని ఆర్బీఐ తెలిపింది. అయినప్పటికీ కార్పొరేట్ సంస్థలు, బ్యాంకుల బ్యాలన్స్ షీట్లు పటిష్టంగా ఉండడం, ప్రభుత్వం నుంచి మూలధన వ్యయాలు మెరుగ్గా ఉండడం, పలు దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు, వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని 2025–26 సంవత్సరం ఆర్బీఐ వార్షిక నివేదిక పేర్కొంది. ఆర్థిక వృద్ధి.. 2025–26లో విదేశీ వాణిజ్యానికి సంబంధించి ఎన్నో సవాళ్లు నెలకొన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు నమోదు చేసింది. బలమైన ప్రైవేటు వినియోగం, స్థిరమైన పెట్టుబడులు, పటిష్టమైన స్థూల ఆర్థిక పరిస్థితులు అనుకూలించాయి. 2026–27 సంవత్సరానికి సైతం బలమైన స్థూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వృద్ధిపై అంచనాలు సానుకూలంగానే ఉన్నాయి. అయితే పశ్చిమాసియా ఘర్షణ ఎక్కువ కాలం పాటు కొనసాగితే వృద్ధి తగ్గిపోయే రిస్క్ ఉంది. అధిక ఇంధన ధరలు, సరఫరా సమస్యలు, ఆర్థిక మార్కెట్లలో అస్థిరతలు, అంతర్జాతీయ వాణిజ్య విధానాల్లో అనిశ్చితులు, వాతావరణ సంబంధిత ప్రతికూలతలు స్వల్పకాలంలో వృద్ధి తగ్గేందుకు, ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీయొచ్చు. వ్యవసాయ ఉత్పాదకత తగ్గే రిస్క్ నైరుతి రుతుపవనాల పురోగతి, విస్తరణపైనే 2026–27లో వ్యవసాయ రంగం వృద్ధి ఆధారపడి ఉంటుంది. ఎల్‌నినో పరిస్థితులు వ్యవసాయ ఉత్పాదకతను ప్రభావితం చేయొచ్చు. జూన్–సెప్టెంబర్ నైరుతి కాలంలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం 90 శాతంగా ఉండొచ్చంటూ వాతావరణ శాఖ శుక్రవారం ప్రకటించడం గమనార్హం. అదుపులోనే ధరలు.. ద్రవ్యోల్బణం లకి‡్ష్యత శ్రేణిలోనే (4ప్లస్2) ఉండొచ్చు. సరిపడినన్ని ఆహార నిల్వలు, రిజర్వాయర్లలో తగినంత నీటి వనరులు ఉన్నందున ఎల్‌నినో తదితర అసాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ ధరలు అదుపులోనే ఉండొచ్చు. అయితే, అంతర్జాతీయంగా చమురు ధరలు, కమోడిటీ ధరలు పెరిగిపోవడం, తయారీ, వేతన వ్యయాలు అధికం కావడం, కరెన్సీ మారకం విలువపై ప్రభావం పడడం వంటివి ద్రవ్యోల్బణాన్ని పెంచే రిస్క్ కూడా ఉంది. వీటిని పరిగణనలోకి తీసుకుని చూస్తే 2026–27లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.6 శాతం స్థాయిలో ఉండొచ్చు. ఇంతకంటే కొంత అధికమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. రూ.48,021 కోట్ల మోసాలు 2025–26లో బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల్లో రూ.48,021 కోట్ల విలువకు సంబంధించి 10,114 మోసం కేసులు నమోదయ్యాయి. 2024–25లో 23,722 కేసులకు సంబంధించి మోసపోయిన మొత్తం రూ.32,803 కోట్లుగా ఉంది. గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఆర్థిక మోసాల కేసులు తగ్గుతూ వస్తున్నప్పటికీ.. మోసపోయిన మొత్తం పెరుగుతూ పోతోంది. కార్డు/ఇంటర్నెట్/డిజిటల్ చెల్లింపులకు సంబంధించి మోసాలు ఎక్కువగా ఉంటున్నాయి. రూపాయి వర్తకం రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మార్చేందుకు ఆర్బీఐ గత కొన్నేళ్లుగా తీసుకుంటున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి రూపాయి వర్తకం పెరుగుతోంది. 2022 ఆగస్ట్ నుంచి 2025 జూలై మధ్యకాలంలో దిగుమతులకు సంబంధించి ఏటా 20.9 శాతం, ఎగుమతులకు సంబంధించి రూపాయి ఇన్వాయిసింగ్ ఏటా 12.7 శాతం చొప్పున పెరిగింది. 2025–26లో రూపాయి ఇన్వాయిసింగ్ విలువ రూ.2.85 లక్షల కోట్లుగా ఉంది. 2023–24లో ఇది రూ.1.94 లక్షల కోట్లు కావడం గమనార్హం. రూ.20, రూ.500 నకిలీ నోట్లు ఎక్కువ గత ఆర్థిక సంవత్సరంలో 2,29,746 నకిలీ నోట్లను బ్యాంకులు గుర్తించాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 5.7 శాతం పెరిగాయి. వీటిల్లో రూ.20, రూ.500 నోట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇతర డినామినేషన్ నోట్లలో నకిలీలు తగ్గాయి. వ్యవస్థలో అన్ని నోట్లలోకి రూ.500 నోట్ల చలామణి ఎక్కువగా ఉంది. 2025–26లో 11.2 శాతం పెరిగింది. -
సాగుబడి: నీటి భద్రత కోసం.. బోరుకు నీరు తాపండి!
పంట పొలాల్లో లేదా ఇళ్ల దగ్గర ఉన్న బావులు లేదా బోర్ల ద్వారా ఎప్పుడూ నీటిని తీసుకోవటమే కాకుండా.. వర్షాకాలంలో నీటిని తాపి వాటి దాహం తీర్చితే అవి ఎండిపోకుండా ఉంటాయి. పెద్ద వర్షాలు పడినప్పుడు వాన నీటిని వృథాగా మురుగు కాలువల్లోకి, వాగులు వంకల్లోకి పోనివ్వకుండా ఎక్కడివక్కడ ఇంకింపజేసుకుంటే.. అక్కడి బావులు, బోర్లలో కరువు కాలంలో కూడా పంటలకు లేదా ఇంటి అవసరాలకు నీటి కరువే ఉండదు అని భూగర్భ జల నిపుణులు చెబుతున్నారు.నీరు ఎండిపోయిన బోర్ల ద్వారా అయినా లేదా నీరు కొద్దోగొప్పో పోస్తున్న బోర్ల ద్వారా అయినా వర్షపు నీటిని ఇంకింపజేసుకునే అవకాశం ఉంది. నీటికి ఇంకింపజేసుకోవటం చెప్పినంత సులభం కాదు. అలాగని, అసాధ్యమూ కాదు. కొంచెం మనసు పెట్టి బోరు చుట్టూతా గుంత తీసి రాళ్లు, చిప్స్, ఇసుకతో పూడ్చ వలసి వుంటుంది.అయితే, బోరు చుట్టూతా ఇంకుడుగుంత తవ్వుకోవడానికి ముందు మనం తెలుసుకోవలసిన ముఖ్యవిషయం ఏమిటంటే.. అది ఇంటి దగ్గరైనా, పొలంలో అయినా.. మన బోరుకు– నీటిని ఇంకింపజేసుకునే సామర్థ్యం ఉందా? లేదా? అనేది తెలుసుకోవాలి. ఆ సామర్థ్యం ఉంటే, ఎంత మేరకు ఉంది? అనే విషయాలను నిపుణులను సంప్రదించి తెలుసుకోవాలి.మన బోరుకు నీటిని రీచార్జ్ చేయటానికి అవకాశం ఉందని పరీక్షలో తేలితే.. బోరు చుట్టూతా గుంత తవ్వి రాళ్లు, చిప్స్, ఇసుకతో నింపి ఇంకుడుగుంత తయారు చేయాలి. దాని చుట్టూ సిమెంటు పిట్ట గోడ కట్టాలి. వాన నీరు వాలును బట్టి బోరు చుట్టూ నిర్మించిన ఇంకుడుగుంతలోకి వెళ్లేలా దారి ఏర్పాటు చేస్తే.. వర్షాలు పడినప్పుడు పారే నీరు బోరు దగ్గరకు చేరి భూమి లోపలికి ఇంకుతుంది. బోరు కరువు కాలంలో కూడా ఎండిపోకుండా నీటిని అందిస్తుంది. నీటి భద్రత చేకూరుతుంది. బోరు చుట్టూ రీచార్జ్ పిట్గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో బోరు చుట్టూ ఇంకుడు గుంత నిర్మించుకునే విధానం తెలుసుకుందాం. నిర్మాణంలో వివిధ పద్ధతులు ఉన్నాయి. బోరు చుట్టూ గుంత తవ్వాలి. కేసింగ్ పైపుకు సన్నని గాట్లు పెట్టాలి. గుంతను రాళ్లు, చిప్స్, ఇసుకతో దొంతర్లుగా నింపాలి. రాళ్ళపై మెష్‌ని పరచాలి. గుంత చుట్టూ రాతి గోడను నిర్మించాలి. వర్షపు నీటిని వాలుకు అనుగుణంగా గుంత వైపు మళ్ళించాలి. బోరు చుట్టూ ఇంకుడుగుంతను నిర్మించిన తర్వాత ఏడాదికోసారి దానిపై మొక్కలు తీసేసి శుభ్రం చేసుకోవటం ద్వారా నీటి సంరక్షణ సక్రమంగా జరుగుతుంది.- నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
పాత మట్టిని మళ్లీ వాడుకోవచ్చా?
టెర్రస్ గార్డెన్ లో ఒకసారి వాడిన మట్టిని తీసి పారెయ్యాలా? మళ్లీ వాడుకోవచ్చా? అని చాలా మందికి సందేహం ఉంటుంది. నిస్సందేహంగా మళ్లీ మళ్ళీ వాడుకోవచ్చు. ప్రతి సారీ కొత్త మట్టి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.ఎటువంటి పరిస్థితి లో పాత మట్టి మార్చాలి?1. ఎక్కువ ఫంగస్ ఉంటే2. వేరుకుళ్లు వస్తే3. ఉప్పుదనం పెరిగితే.4. మట్టి బిగుసుకుపోతే మార్చాలిపాత మట్టిని మళ్లీ వాడే ముందు చేయాల్సిన పనులు:మొక్క కుండీలోనో మడిలోనో ఒక సీజన్ అంతా పెరిగిన తర్వాత ఆ మట్టిలో ఉన్న నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ప్రధాన పోషకాలు తగ్గిపోతాయి. అలాగే మట్టిలో ఉన్న ఉపయోగకర సూక్ష్మజీవులు తగ్గి, కొన్నిసార్లు హానికర ఫంగస్ పెరుగుతుంది. ఎరువులు లేదా హార్డ్ వాటర్ వాడటం వల్ల ఉప్పదనం పెరిగి.. పోషకాలు తీసుకునే శక్తి వేర్లకు తగ్గుతుంది.పాత మట్టి గట్టిపడి గాలి ప్రసరణ కూడా తగ్గుతుంది. అందుకే పాత మట్టిని నేరుగా కాకుండా, శుభ్రపరచి, మళ్లీ జీవన ఎరువులు కలిపి వాడాలి. పాత మట్టిలో ఉన్న వేర్లు, ఎండిన ఆకులు తీసెయ్యకూడదు. వాటిని అలాగే ఉంచితే మట్టిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. వేర్లు, ఎండిన ఆకులకు ఫంగస్ ఉంటే తీసేయాలి. మట్టిలో చెత్త తీసేయాలి.మడులు, కుండీల్లో వాడిన మట్టిలో మళ్లీ మొక్కలు, విత్తనాలు వేసే ముందు 2 నుంచి 3 రోజులు ఎండలో ఎండ బెట్టాలి. దీనివల్ల ఫంగస్ తగ్గుతుంది. పురుగు గుడ్లు నశిస్తాయి. మట్టి సహజ శుద్ధి అవుతుంది.నీరు ఎంత పోయాలి?కుండీలో, మడిలో మొక్కలు/విత్తనాలు పెట్టుకున్న తర్వాత ఎప్పుడూ మట్టి ఎండిపోకుండా చూడాలి. మట్టి ఎండిపోతే మనం వేసిన జీవన ఎరువుల్లోని సూక్ష్మ జీవులు చనిపోతాయి. మట్టి ఎప్పుడూ తేమగా ఉండేలా చూడాలి. నీరు ఎక్కువ పోస్తే మనం ఇచ్చిన పోషకాలు కుండీ నుంచి నీటితో పాటు కారిపోతాయి. ఇపుడు ఎండలు బాగా ఉన్నాయి. మిద్దె/పెరటి తోట సేద్యదారులు పాత మట్టి ఎండబెట్టి ఎరువులు కలిపి సిద్ధం చేసుకోవచ్చు.మట్టి మిశ్రమం (పాటింగ్ మిక్స్) తయారీ ఎలా?60% పాత మట్టి20% కంపోస్ట్ (సేంద్రియ ఎరువు)10% కోకోపీట్/వరి పొట్టు 10% వర్మికంపోస్ట్ లేదా ఇసుక కొద్దిగా వేపపిండి, చెక్క బూడిద కొద్దిగా.. కలపాలి. వేరు కుళ్ళుడు రాకుండా కొద్దిగా ట్రైకోడెర్మా కలపవచ్చు. ఈ నిష్పత్తిలో మట్టి మిశ్రమాన్ని కలపడం వల్ల కుండీలు, మడుల్లో గాలి ప్రసరణ పెరుగుతుంది. అదనపు నీరు నిల్వ ఉండదు. వేర్లు బాగా పెరుగుతాయి. మట్టి మిశ్రమం తయారు చేసిన తర్వాత 5 నుంచి 7 రోజులు అలాగే ఉంచితే సూక్ష్మజీవులు చురుకుగా పనిచేస్తాయి. తరువాత కుండీలో, మడిలో వేసుకొని విత్తనాలు, మొక్కలు నాటుకోవటానికి సిద్ధం చేసుకోవచ్చు.- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా,మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366 - నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఐటీ జాబ్ వదిలి వ్యవసాయం.. చివరికి విషాదం
మైసూర్: కర్ణాటకలో విషాదం జరిగింది. 43 ఏళ్ల ఐటీ నిపుణుడు మృతిచెందారు. వ్యవసాయ పనుల్లో ఉండగా.. పిడుగు పడి టెక్కీ రోషన్ బాలకృష్ణ మరణించారు. మడికేరి పట్టణానికి చెందిన రోషన్.. కుటుంబంతో కలిసి పొలానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన ఇటీవలే వ్యవసాయం మీద ఆసక్తితో తన ఐటీ జాబ్‌ను వదిలేసి.. ఒక స్నేహితుడితో కలిసి సాగు బాట పట్టారు. అలాగే రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను విక్రయించే (మార్కెటింగ్) వ్యాపారంలో కూడా ఆయన భాగస్వామిగా ఉన్నారు. ఇంటి నుంచే ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.రోషన్ తన వ్యవసాయ ప్రణాళికల్లో భాగంగా ఒక భూమిని పరిశీలించడానికి మైసూర్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఆయనతో పాటు భార్య, కుమారుడు కూడా ఉన్నారు. ఆ పొలం సమీపంలో రోషన్.. ఒక మామిడి చెట్టు దగ్గర కాయలు కోయడానికి ఆగిన సమయంలో ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి.రోషన్ బాలకృష్ణ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మొత్తంలో రూ.4 లక్షలను రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) నుండి, మిగిలిన రూ.1 లక్షను జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF) నుండి విడుదల చేయనున్నారు. -
వ్యవసాయానికి జీవవైవిధ్యం ఎందుకు ముఖ్యమైనది?
ప్రపంచవ్యాప్తంగా మే 22న పాటించే అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం ఈ ఏడాది ‘ప్రపంచవ్యాప్త ప్రభావం కోసం స్థానికంగా పనిచెయ్యటం’ అనే అంశంపై దృష్టి కేంద్రీకరిస్తోంది. అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు సచివాలయం సమన్వయంతో ఈ సంవత్సరం జీవవైవిధ్య దినోత్సవం ముఖ్య ఉద్దేశం కున్మింగ్–మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్‌లో ΄పొందుపరిచిన 23 ప్రతిష్టాత్మక లక్ష్యాలను నెరవేర్చేందుకు ఎక్కడికక్కడ స్థానికంగా చేసే అనేక రోజువారీ పనులు నేరుగా దోహదపడతాయి. వీటిలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోని నివాసయోగ్యమైన భూమిలో వ్యవసాయం దాదాపు సగభాగాన్ని ఆక్రమిస్తుంది. ఇది పర్యావరణ వ్యవస్థపై ఒత్తిడికి ప్రాథమిక చోదకంగానూ, పర్యావరణ పునరుద్ధరణకు కీలక పరిష్కారంగానూ పనిచేస్తుంది.ముఖ్యాంశాలు:ప్రపంచంలోని 75% పైగా ఆహార పంటలు, 35% ప్రపంచ పంట దిగుబడులు తేనెటీగలు, సీతాకోకచిలుకల వంటి మేలుచేసే వాటి ద్వారా జరిగే పరాగ సంపర్కంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి.వ్యవసాయంలో అధిక స్థానిక రకాల విత్తనాలు, పశు జాతుల వైవిధ్యం ద్వారా తీవ్ర వాతావరణ సంఘటనలు, తెగుళ్ల వ్యాప్తి, మారుతున్న వాతావరణ ఒత్తిళ్లను తట్టుకునే శక్తిని పెంపొందుతుంది.భూమిలోని ఎన్నెన్నో విభిన్న సూక్ష్మజీవుల సమూహాలు, శిలీంధ్రాలు, సూక్ష్మజీవులు ఉంటాయి. పోషకాలను విచ్ఛిన్నం చేసి, కార్బన్‌ను సంగ్రహించి, దీర్ఘకాలంలో నేల సారాన్ని పెంపొందిస్తాయి.విభిన్నమైన దేశవాళీ లేదా స్థానిక విత్తన రకాలను పరిరక్షించడం ఎందుకు అవసరమంటే.. ఏదో ఒకటే పంటను నిరంతరం సాగు చేసే ఏక పంటల వైఫల్యాల ముప్పు నుంచి తరతరాల పంట పొలాలను కాపాడుతుంది.2026 థీమ్‌కు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్ఈపీ), ఆహార – వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ)లు ప్రకృతి/ సేంద్రియ/ బయోడైనమిక్/ ఆగ్రోఫారెస్ట్రీ తదితర స్థానిక సుస్థిర వ్యవసాయ మార్గాలను ప్రోత్సహించమని వివిధ దేశాల, రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచిస్తున్నాయి.రైతులు, స్థానిక సంఘాలు స్థానికంగా అనుసరిస్తున్న తేనెటీగల పరిరక్షణ చర్యలను పెంపొందించటానికి విషపూరిత రసాయన వ్యవసాయంపై ఆధారపడటాన్ని తగ్గించటం, సామూహిక విత్తన బ్యాంకులను స్థాపించటం అవసరమని ఎఫ్ఏవో నొక్కి చెబుతోంది.స్థానిక ప్రజలను వైవిధ్యమైన సంప్రదాయ ఆహారోత్పత్తుల వినియోగం వైపు ప్రోత్సహించటం జీవవైవిధ్య పరిరక్షణకు ముఖ్యం. శాకాహారపు అలవాట్ల వైపు మళ్లించడం, అలాగే స్థానిక పంటలను ప్రోత్సహించటం వల్ల బహుళ పంటల సాగు పెరిగి, ఆ మేరకు జీవవైవిధ్యానికి నష్టం చేసే ఏక పంట(మోనోకల్చర్) వ్యవసాయాన్ని తగ్గిస్తుంది.ఈ సంవత్సరం చివర్లో ఆర్మేనియాలో జరగనున్న ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్య సదస్సు (కాప్17)లో పర్యావరణంలో జీవవైవిధ్యానికి కలుగుతున్న నష్టాన్ని అరికట్టడానికి ప్రపంచ దేశాలు పునరంకితం కావాల్సిన అవసరం ఉంది.నిర్వహణ: పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్( చదవండి: Rice Husk: వరిపొట్టుతో ఇన్ని ఉపయోగాలా..!) -
మిద్దెతోటల్లో కోకో పీట్తో ఇన్ని ఉపయోగాలా..?!
మిద్దెతోటలు లేదా టెర్రస్ గార్డెన్లు లేదా పెరటి తోటల్లో కోకో పీట్ (కొబ్బరి పొట్టు) వాడకం మొక్కల ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తుంది. ఇది కొబ్బరి పీచు నుంచి తయారయ్యే ఒక సేంద్రియ పదార్థం. దీని ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి:1 కోకో పీట్ తన బరువు కంటే 8–10 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకొని నిల్వ ఉంచుకోగలదు. దీనివల్ల మొక్కల వేర్లకు ఎక్కువ సేపు తేమ అందుతుంది, వేసవిలో కూడా మొక్కలు త్వరగా ఎండిపోవు.2 మట్టి కంటే కోకో పీట్ చాలా తక్కువ బరువు ఉంటుంది, కాబట్టి మేడపై కుండీల వల్ల భారం పడకుండా ఉంటుంది.3 దీని నిర్మాణం గుల్లగా ఉండటం వల్ల వేర్లకు గాలి బాగా అందుతుంది. ఇది మొక్క వేర్లు బలంగా, ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.4 విత్తనాలతో మొక్కలు పెంచటానికి ఇది ఒక అద్భుతమైన మాధ్యమం. ఇందులో విత్తనాలు చాలా వేగంగా మొలకెత్తుతాయి.5 ఎర్రమట్టి లేదా ఇతర రకాల మట్టితో కలిపి వాడినప్పుడు, ఇది నేల బిగుసుకుపోకుండా చూస్తుంది.6 ఇది కొబ్బరి వ్యర్థాల నుండి తయారవుతుంది కాబట్టి పూర్తిగా సహజమైనది, పర్యావరణానికి ఎటువంటి హాని చేయదు.7 కూరగాయల మొక్కల వేర్లు త్వరగా విస్తరించడానికి కోకో పీట్ మట్టిని గుల్లగా ఉంచుతుంది. 30% కోకో పీట్ + 40% ఎర్రమట్టి + 30% వర్మీ కంపోస్ట్ లేదా పశువుల ఎరువు కలుపుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి, బెండ వంటి కూరగాయలు మొక్కలకు ఈ మిశ్రమం ద్వారా పోషకాలు, తేమ సమపాళ్లలో అందుతాయి.8 పూలు బాగా పూయాలంటే నేలలో గాలి ప్రసరణ (ఎయిరేషన్) ఉండాలి. 40% కోకో పీట్ + 20% ఇసుక + 40% వర్మీ కంపోస్ట్ కలిపి మట్టి మిశ్రమం తయారు చేసుకోవాలి. మందార, గులాబీ, చామంతి వంటి మొక్కల కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా, అదనపు నీరు సులభంగా బయటకు పోయేలా కోకో పీట్ సహాయపడుతుంది.9 నిమ్మ, జామ, దానిమ్మ లాంటి పండ్ల మొక్కలు ఎక్కువ కాలం కుండీల్లోనే ఉండాలి కాబట్టి మట్టి గట్టిపడకుండా ఉండటం ముఖ్యం. 25% కోకో పీట్ + 50% ఎర్రమట్టి + 25% కంపోస్ట్, కొద్దిగా వేప పిండి కలిపి మట్టి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఇది మొక్క వేర్లు బలంగా నాటుకోవడానికి, ఎక్కువ పండ్లు కాయడానికి అవసరమైన పోషకాలను నెమ్మదిగా విడుదల చేస్తుంది.10 మార్కెట్లో దొరికే కోకో పీట్ బ్లాక్స్‌ను ఉపయోగించే ముందు.. నీటిలో నానబెట్టి, అది మెత్తగా అయ్యాక అందులోని లవణాలను పోగొట్టడానికి 2–3 సార్లు నీటితో కడిగి, తర్వాత వాడాలి.11 కోకో పీట్ మట్టిని గుల్లగా ఉంచుతుంది కాబట్టి, అదనపు నీరు కుండీ అడుగున ఉన్న రంధ్రాల ద్వారా సులభంగా బయటకు పోతుంది.12 కుండీలలో మట్టి కొన్ని రోజుల తర్వాత రాయిలా గట్టిగా మారుతుంది. కోకో పీట్ కలిపితే మట్టి ఎప్పుడూ మెత్తగానే ఉంటుంది, దీనివల్ల వేర్లకు ఆక్సిజన్ బాగా అందుతుంది.13 కోకో పీట్లో సొంతంగా పోషకాలు ఉండవు. అది కేవలం ఒక మాధ్యమం మాత్రమే. కాబట్టి, తప్పనిసరిగా వర్మీ కంపోస్ట్ లేదా ఏదైనా సేంద్రియ ఎరువు కలిపితేనే మొక్కకు బలం అందుతుంది.14 మిద్దె తోటలో కుండీల్లో వాడటం కోసం మట్టి మిశ్రమాన్ని తయారు చేసేటప్పుడు వరి పొట్టు, కోకో పీట్ రెండూ ఉపయోగకరమైనవే.15 వరి పొట్టు మట్టిలో గాలి ప్రసరణను మెరుగుపరచడానికి, నీరు త్వరగా బయటకు వెళ్లడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది మట్టిని గుల్లగా ఉంచుతుంది, తద్వారా వేర్లకు గాలి అందుతుంది. అదనపు నీరు నిలవకుండా బయటకుపోతుంది.16 వరి పొట్టులో సిలికా అధికంగా ఉంటుంది, ఇది మొక్కల కణజాలాన్ని దృఢపరిచి తెగుళ్లు, వ్యాధులను తట్టుకునే శక్తిని ఇస్తుంది.17 వరి పొట్టు కోకో పీట్ కంటే నెమ్మదిగా కుళ్ళిపోతుంది, కాబట్టి కుండీలో మట్టి ఎక్కువ కాలం గట్టిపడకుండా ఉంటుంది. ఇది సాధారణంగా కోకో పీట్ కంటే చౌకగా లభిస్తుంది. – కొల్లి కృష్ణ కుమారి, మిద్దె తోటల సాగుదారు, గుంటూరుమొబైల్: 9490602366నిర్వహణ: పంతంగి రాంబాబుసాక్షి సాగుబడిడెస్క్ చదవండి: అపురూపమైన అడవి మామిడి పండ్ల జాతులు -
పల్లెటూరి అమ్మాయి ఘనత.. రైతన్నల కోసం..!
పిల్లలూ! ప్రతిరోజు మనం పాఠశాలకు వెళ్లి ఏం చేస్తాం? పాఠాలు వింటాం.. స్నేహితులతో ఆడుకుంటాం కదా.. కానీ పూజ అనే మనలాంటి ఒక విద్యార్థిని మాత్రం తను ప్రతిరోజూ పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం కనిపెట్టాలనుకుంది. ఆలోచన వచ్చిందే ఆలస్యం ఒక యంత్రాన్ని ఆవిష్కరించేసింది. అది ఆ పాఠశాల విద్యార్థుల సమస్యని పరిష్కరించడమే కాదు.. మనకు అన్నం పెట్టే అన్నదాతల ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తోంది. మరి మంచి పనులు చేస్తే ఏం జరుగుతుందో తెలుసుగా .. పూజా పేరు దేశమంతటా ప్రశంసలతో మార్మోగింది.. ఎన్నో బహుమతులనూ సొంతం చేసుకుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా...పేద కుటుంబానికి చెందిన పూజ ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ బడిలో చదువుకునేది. పంట కోతల సమయంలో పొలాల్లోని యంత్రాల (థ్రెషర్లు) నుంచి వచ్చే దుమ్ము, ధూళి గాలిలో కలిసి ఆమె తరగతి గదిలోకి వచ్చేవి. దానివల్ల పిల్లలకు సరిగ్గా ఊపిరి ఆడక΄పోయేది, పుస్తకాలు కూడా కనబడకపోయేవి. మరోవైపు ఈ కాలుష్యం వల్ల ఎంతో మంది రైతులు అనారోగ్యం పాలవ్వడం పూజను బాధించింది. ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఆలోచించింది.డస్ట్ ఎక్స్ట్రాక్టర్ఒకరోజు ఇంట్లో తన తల్లి పిండిని జల్లెడ పట్టడం పూజ చూసింది. సన్నని పిండి కిందకు పడితే, గరుకుగా ఉండేవి జల్లెడలో ఉండిపోయాయి. అదే సూత్రం పూజను పరిష్కారం దిశగా ఆలోచించేలా చేసింది. పంటలోని దుమ్మును వేరు చేస్తే బాగుంటుందని ఆలోచించింది. వెంటనే తన సైన్స్ మాస్టారు సహాయంతో పాత రేకులు, వెల్డింగ్ మిషన్ ఉపయోగించి ఒక ప్రత్యేక యంత్రాన్ని తయారు చేసింది. దీనికి ఆమె డస్ట్ ఎక్స్ట్రాక్టర్ అని పేరు పెట్టింది. ఈ యంత్రం పొలాల్లో పని చేస్తున్నప్పుడు, పంట నూర్పిడి సమయంలో వెలువడే దుమ్మును పీల్చుకుని, ఒక చోట సేకరిస్తుంది. దీనివల్ల రైతులు పీల్చే గాలి శుభ్రంగా ఉంటుంది, తద్వారా ఆస్తమా, టీబీ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అలాగే ఈ యంత్రాన్ని ఎవరైనా సులభంగా కొనుగోలు చేసేలా, అందుబాటులో ఉండే వస్తువులతోనే పూజ దీనిని రూపొందించింది.దేశం గర్వించే గుర్తింపు!పూజ సాధించిన ఈ విజయానికి గానూ, ఎన్నో ప్రశంసలతోపాటు, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అందుకుంది. సైన్స్ అండ్ ఇన్నోవేషన్‌లో తను చూపించిన ప్రతిభకు గాను జపాన్‌కి వెళ్లే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. అక్కడ ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలతో కలిసి పూజ తన యంత్రం గురించి వివరించింది. అలాగే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమెను ‘బాల శాస్త్రవేత్త’గా గుర్తించి లక్ష రూపాయల నగదు బహుమతిని అందించింది.పర్యావరణంపై చైతన్యంపూజ భవిష్యత్తులో ఒక గొప్ప శాస్త్రవేత్త కావాలని కలలు కంటోంది. పర్యావరణ పరిరక్షణపై తన గ్రామంతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ చైతన్యం తీసుకువస్తోంది. పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల కలిగే నష్టాల గురించి రైతులకు వివరిస్తోంది. ఒక సాదాసీదా పల్లెటూరి అమ్మాయి తన తెలివితేటలతో దేశానికే ఆదర్శంగా నిలిచింది. మనందరం ఆమెను చూసి నేర్చుకుందాం కదూ!మన చుట్టూ సమస్యలు ఉన్నప్పుడు భయపడకూడదు. వాటికి పరిష్కారం ఆలోచించాలి. మన దగ్గర డబ్బు లేక΄ోయినా, పట్టుదల ఉంటే ఆకాశమంత ఎత్తుకు ఎదగవచ్చు.– పూజ (చదవండి: ఇద్దరు సిస్టర్స్ కృషి: 'యాత్రి'కుల కోసం..) -
ఉచిత డిజిటల్ సహకార కోర్సులు
సహకార రంగానికి సంబంధించి 160కి పైగా ఆన్లైన్ డిజిటల్ కోర్సులను తెలుగు సహా 8 భాషల్లో ఉచితంగా కేంద్ర సహకార శాఖ ఆఫర్ చేస్తోంది. రైతులు, ఎగుమతిదారులు, విద్యార్థులకు ఉపయోగపడేలా కృత్రిమ మేధ తోడ్పాటుతో ఈ కోర్సులను రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘సవిద్య.సీఓఓపి’ పేరిట ఒక వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది.‘సవిద్య’ అంటే ‘సహకార విద్యాలయం’. (Sahakar Vidyalaya) ఇది దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ సహకార విద్యా వేదిక. రైతులు, విద్యార్థులు, ఎగుమతిదారుల్లో సహకార విజ్ఞానాన్ని పెంపొందించటానికి ఉద్దేశించిన వేదిక ఇది. సహకార మంత్రిత్వ శాఖ ‘సహకార్ సే సమృద్ధి’ (సహకారం ద్వారా శ్రేయస్సు) చొరవలో భాగంగా ప్రారంభించిన ఈ వేదిక సహకార రంగంలో నిపుణుల నేతృత్వంలో ఉచిత శిక్షణను అందిస్తుంది. వ్యవసాయ పద్ధతులు, ఎగుమతి వ్యూహాలు వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేసే 160కి పైగా ఉచిత వీడియో కోర్సులు. తెలుగు సహా 8 భారతీయ భాషల్లో గ్రామీణులకు కూడా అందుబాటులో ఉండేలా ఈ కోర్సులను రూపొందించారు. కృత్రిమ మేధ ఆధారిత ఫీచర్లను ఉపయోగించి కంటెంట్‌ను వ్యక్తిగతీకరిస్తుంది. లక్షలాది వినియోగదారులకు మరింత సమర్థవంతంగా జ్ఞానాన్ని అందించేందుకు ఏఐ వాడినట్లు కేంద్ర సహకార శాఖ తెలిపింది.వినియోగదారులు తమ మొబైల్ పరికరాల ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ వీడియో కోర్సులు చదువుకోవడానికి వీలుంది. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను నేర్చుకోవడానికి, పంట దిగుబడిని మెరుగుపరచుకోవడానికి ఇందులో కోర్సులు ఉన్నాయి. విద్యార్థులు సహకార రంగంలో వృత్తి, పరిశోధన అవకాశాలను అన్వేషించడానికి ఉపయోగపడే కోర్సులు ఉన్నాయి. అంతేకాదు, ఎగుమతిదారులు ప్రపంచ మార్కెట్ అవసరాలు, అంతర్జాతీయ వాణిజ్యంపై అవగాహన పొందడానికి అవసరమైన కోర్సులను సైతం ఇందులో పొందుపరచటం విశేషం.నేషనల్ కో–ఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్సీఈఎల్), క్రిబ్కో వంటి సహకార సంస్థలు ఉమ్మడి కృషితో సహకార విద్యా ప్లాట్‌ఫారమ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 17,000 సహకార సంఘాలను 2 కోట్ల మందికి పైగా రైతులకు అనుసంధానం చేయటమే దీని లక్ష్యం. మీరు savidya.coopలో నేరుగా కోర్సులను ఎంపిక చేసుకొని, సులువుగా, ఉచితంగా నేర్చుకోవడం ప్రారంభించవచ్చు. -
పిల్లల పొలం బడి
మీరెప్పుడైనా పచ్చని పంట పొలాల దగ్గరకి వెళ్లారా? వ్యవసాయం గురించి ఏమైనా మీకు తెలుసా?’ అని అడిగితే... మీలాంటి పిల్లలలో చాలామంది చెప్పే జవాబు...‘వెళ్లలేదు’... ‘తెలియదు’ పాలు ఎక్కడినుంచి వస్తాయి? ఒక అమ్మాయిని ఎవరో అడిగారట... ‘పాలు ఎక్కడి నుంచి వస్తాయి?’ అని! దానికి ఆ పాప... ‘టెట్రా ప్యాక్‌లో నుంచి వస్తాయి’ అని చెప్పిందట!ఇది విన్న ఆ పాప తండ్రి కిరుబ శంకర్ ఆశ్చర్యపోయారు. కిరుబ శంకర్ వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. చిన్నప్పుడు ఆయనకు పంటపొలాలు మరో స్కూల్. స్కూల్ అయిపోగానే అక్కడికి పరుగెత్తుకు వెళ్లేవాడు. గొర్రెలతో, మేకలతో ఆడుకునేవాడు. అతడికి చిన్నప్పటి నుంచి వ్యవసాయం గురించి చాలా విషయాలు తెలుసు.వెల్కమ్ టు వక్సాన ఫార్మ్స్మరేమో, మీ తరం పిల్లల విషయానికి వస్తే... చాలా మందికి వ్యవసాయం గురించి బొత్తిగా తెలియదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని శంకర్ అంకుల్ తమిళనాడులోని రెట్టనై గ్రామంలో మీలాంటి పిల్లల కోసం వ్యవసాయ ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. పద్నాలుగు ఎకరాల ఈ వ్యవసాయ క్షేత్రం (వక్సాన ఫార్మ్స్)లోకి మీరు అడుగుపెడితే వ్యవసాయం గురించి సమస్త విషయాలు తెలుసుకోవచ్చు. ‘వక్సాన’ అంటే పచ్చదనంతో నిండిన సారవంతమైన భూమి అని అర్థం.ఎంచక్కా... విత్తనాలు నాటవచ్చు, పొలం దున్నవచ్చు...‘వక్సాన ఫార్మ్స్’లో పంటలు, రకరకకాల చెట్లు, జంతువులు, కాలువలు... ఎన్నో ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకోవచ్చు. పొలంలోనే మధ్యాహ్నం భోజనం వడ్డిస్తారు. భోజనం తరువాత కొద్దిసేపు విశ్రాంతి. ఆ తరువాత జంతుప్రపంచంలోకి తీసుకువెళతారు. అక్కడ గొర్రెలు, మేకలు, గుర్రాలు, ఒంటె... మొదలైన వాటితో పాటు బాతులు, హంసలు, టర్కీలు ఉంటాయి.‘జంతువులు, వ్యవసాయం వేరు కాదు’ అంటూ వ్యవసాయ ప్రపంచంలో జంతువుల ప్రాముఖ్యం, కష్టం గురించి తెలియజేస్తారు. మీలాంటి పిల్లలకు ఇప్పుడు ఈ ‘ఫార్మ్ క్యాంప్’ ఫెవరెట్ స్పాట్ అయింది. ఈ ‘ఫార్మ్స్ క్యాంప్’లో మీరు ఒక రోజు పూర్తిగా గడపవచ్చు.పొలం దున్నడం, సాగు కోసం భూమిని ఎలా సిద్ధం చేస్తారో తెలుసుకోవడం, విత్తనాలు నాటడం, కలుపు తీయడం, ట్రాక్టర్ సవారీలు... ఇలా ఎన్నో ఉంటాయి. ఈ పనులన్నీ మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. ఎద్దులను ఉపయోగించి చేసే సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను కూడా మీకు ఇక్కడ పరిచయం చేస్తారు. ఆధునిక వ్యవసాయానికి, ఒకప్పటికి వ్యవసాయానికి తేడా ఏమిటో వివరంగా చెబుతారు. పిల్లలు వాటికి ఆహారం పెడతారు. వాటి ప్రవర్తనను దగ్గరి నుంచి గమనిస్తారు. పొలం పనులకు అవి ఎలా ఉపయోగపడుతాయో ప్రత్యక్షంగా చూస్తారు.రాత్రి ఆరు బయట భోజనం... ఆ తరువాత కథలుసాయంత్రం కావడానికి ముందు పొలానికి దగ్గరలోని చెరువులో పిల్లలు ఈత కొడతారు. పంపు సెట్ల కింద స్నానం చేస్తారు. పొలాల్లో నడుస్తూ, కూరగాయలు కోసి రాత్రి భోజనానికి ఏమి వండాలో చెబుతారు. తల్లిదండ్రులు, అక్కడ ఉన్నవారితో కలిసి వంట చేస్తారు. రాత్రి భోజనాన్ని ఆరుబయట వడ్డిస్తారు. ఆ తరువాత మంట చుట్టూ చేరి కథలు చెప్పుకుంటారు. ఉదయం అయిదు గంటలకు నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీలాంటి పిల్లలు రైతు జీవితాన్ని గడపవచ్చు. మీరు ఒకరోజు పొలంలో పనిచేయడం వల్ల వ్యవసాయం గురించి మాత్రమే కాదు పర్యావరణం గురించి కూడా తెలుసుకోవచ్చు. బంబరం, తాయంబాస్, కిట్టి పుల్, ఉరియడిలాంటి సంప్రదాయ గ్రామీణ ఆటలను, వ్యాయామాలను పరిచయం చేస్తారు. ‘పిల్లలు భవిష్యత్‌లో తల్లిదండ్రులవుతారు. వారు ఇక్కడ పొందిన అనుభవం వారి భవిష్యత్‌కు బాగా ఉపయోగపడుతుంది’ అంటున్నారు కిరుబ శంకర్.24 గంటలుప్రతి క్యాంపులో పదిమంది పిల్లలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఫార్మ్క్యాంప్లో ఏప్రిల్, మే నెలలో క్యాంప్‌లు నిర్వహిస్తారు. మేలో జరిగేవి... 9–10 మే, 16–17 మే, 30–31 మే. కార్యక్రమాలు శనివారం ఉదయం పదిగంటల నుండి ఆదివారం ఉదయం పది గంటల వరకు జరుగుతాయి.vaksanafarms.in/special/summer-camp/– యాకూబ్ -
వ్యవసాయ యాంత్రీకరణలో కమీషన్ల దందా
సాక్షి, అమరావతి: వ్యవసాయ యాంత్రీకరణ పథకం చంద్రబాబు ప్రభుత్వంలో దోపిడీ పథకంగా మారిపోయింది. అధికారులతో కుమ్మక్కై ‘నీకింత.. నాకింత’ అంటూ పంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు బేరసారాలు సాగిస్తున్నారు. తొలి ఏడాది మొక్కుబడి తంతుగా అమలు చేసిన ఈ పథకాన్ని రెండోఏడాది పూర్తిగా అటకెక్కించేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరం ముగిసినా ఒక్కటంటే ఒక్క పరికరం పంపిణీ చేయలేదు. గతేడాది మంజూరైన కేంద్ర నిధులతోనే ఈ ఏడాది పథకం అమలు పేరిట పర్సంటేజ్‌లు దండుకుంటున్నారు. మరోవైపు సామర్థ్యం లేని చైనా పరికరాలను అధిక ధరలకు కోట్‌చేసి ఎడాపెడా దోచుకుంటున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం(స్మామ్) కింద 2024–25లో రూ.343 కోట్ల కేంద్ర నిధులతో దాదాపు లక్షమందికి వ్యక్తిగత పరికరాలు, సీహెచ్‌సీ గ్రూపులకు వెయ్యి కిసాన్ డ్రోన్లు, క్లస్టర్ స్థాయిలో 100 కంబైన్డ్ హార్వెస్టర్లు ఇస్తామని ప్రకటించారు. ఆచరణకు వచ్చేసరికి రూ.129 కోట్లతో 25 వేల వ్యక్తిగత పరికరాలు, 875 డ్రోన్లు పంపిణీ చేశారు. కమీషన్ల కోసం అవసరం లేని పరికరాలను అంటగట్టారని రైతుల నుంచి విమర్శలు రాగా, టెండర్ నిబంధనలను తారుమారుచేసి అస్మదీయ కంపెనీలకు కిసాన్ డ్రోన్ల కాంట్రాక్టు కట్టబెట్టారంటూ అర్హతగల కంపెనీలు కోర్టులను ఆశ్రయించాయి. తొలి ఏడాది బిల్లుల చెల్లింపులో 15–20 శాతం కమీషన్ (రూ.25 కోట్లకుపైగా) అధికారులతో కలిసి అచ్చెన్న బృందం దండుకుందన్న ఆరోపణలు వచ్చాయి.కమీషన్ల కోసం చైనా ఉత్పత్తులకు పచ్చజెండా 2025–26 సీజన్లో రూ.240 కోట్లతో ఎఫ్‌పీవోలు, ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు వెయ్యి, ఇంజనీరింగ్ పట్టభద్రులకు 75 కిసాన్ డ్రోన్లు, సీహెచ్‌సీలకు 164 హైకాస్ట్ మిషనరీ, 1,050 ట్రాక్టర్లతో పాటు 40 వేలకు పైగా వ్యక్తిగత పరికరాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కంపెనీల నుంచి పర్సంటేజ్‌లు వసూలు చేసి ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారంటూ ఆరోపించిన ఏపీ ఆగ్రోస్ జీఎం రాజమోహన్‌ను బదిలీచేసి విజిలెన్స్ నివేదికను తొక్కిపెట్టేశారు. నోడల్ ఏజెన్సీగా ఏపీ ఆగ్రోస్‌ను తప్పించి వ్యవసాయశాఖకు అప్పగించారు. తొలి ఏడాది పరికరాల పంపిణీకి ముందు కమీషన్లు దండుకోగా, రెండో ఏడాది ఎంపానల్‌మెంట్‌కు ముందుగానే కంపెనీలతో బేరసారాలు సాగించారు. డ్రోన్లతోపాటు వ్యక్తిగత పరికరాల విలువలో 20–25 శాతం ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని, ఓ బినామీ డీలర్ ద్వారా కంపెనీల నుంచి కమీషన్ దండుకుంటున్నారని సమాచారం. ఈ పథకం కింద అనేక ఉత్పత్తులను చైనా నుంచి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా సరఫరా చేసేందుకు పచ్చజెండా ఊపారు. దేశీయ ఉత్పత్తులతో పోలిస్తే వీటి సామర్థ్యం, ధర తక్కువే అయినా.. భారతీయ ఉత్పత్తుల ధరలకే కోట్‌చేసిన కంపెనీలతో ఎంపానల్మెంట్ చేసుకున్నారు. వీటిలో ప్రధానంగా బ్యాటరీ స్ప్రేయర్లు, హైప్రెజర్ నాప్సాక్ స్ప్రేయర్లు, పవర్ వీడర్/రీపర్, బ్రష్ కట్టర్, హార్వెస్టర్, రోటో టిల్లర్, బేలర్లు, చాప్ కట్టర్లు వంటివి ఉన్నాయి. పవర్ వీడర్లు పూర్తిగా చైనా నుంచే వస్తున్నాయి. చైనాకు చెందిన పవర్ వీడర్ ఎమ్మార్పీ రూ.36 వేలు కాగా, స్మామ్‌లో రూ.57,500గా, రూ.18 వేలున్న బ్రష్కట్టర్ ధరను రూ.25 వేలుగా నిర్దేశించారు.పనితీరుతో పనిలేదురైతులకు పంపిణీ చేసే పరికరాల పనితీరును తప్పనిసరిగా పరీక్షించాల్సి ఉన్నా అలాంటిదేమీ జరగడం లేదు. మన హార్వెస్టర్ల ద్వారా వరికోతలు చేస్తే ధాన్యం నష్టం 1.5 శాతం నుంచి 2 శాతం ఉంటే.. చైనా హార్వెస్టర్ ఉపయోగిస్తే ఈ నష్టం 7.5 శాతం ఉంటుందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నా చైనా పరికరాలకే మొగ్గుచూపుతున్నారు. రైతులు డిమాండ్ చేస్తున్నారనే సాకుతో సామర్థ్యం లేని పరికరాలను నేరుగా చైనా నుంచి డెలివరీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తగ్గిన జీఎస్టీ మేరకు కంపెనీలు కోట్‌చేసే ధరలు తగ్గాలి. కానీ అలా జరగడం లేదు. ఉదాహరణకు ఏపీ ఆగ్రోస్ ద్వారా ఇటీవల పిలిచిన టెండర్లో స్ప్రేయర్లకు 12 శాతం జీఎస్టీతో ఎల్1 కోట్‌చేసిన ధర రూ.23 వేలు. ఇదే స్ప్రేయర్లను నేడు 5 శాతం జీఎస్టీతో కలిపి కమిటీ ఆమోదించిన ధర రూ.26 వేలు. ఇలా అడ్డగోలుగా ధరలు పెంచడం వెనుక భారీ కుంభకోణం ఉంది. ఈసారి రూ.80 కోట్ల వరకు దండుకోవాలన్న లక్ష్యంతో ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. యాంత్రీకరణ పేరిట జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటూ పలు దేశీయ కంపెనీలు ప్రధానితో పాటు కేంద్ర వ్యవసాయశాఖకు ఫిర్యాదు చేశాయి. కాగా, ఆన్లైన్లో పిలవాల్సిన టెండర్లను పూర్తిగా ఆఫ్‌లైన్‌లో పిలిచారు. ఇక్కడ పరీక్ష నివేదికలు, ధరల కొటేషన్లు, స్పెసిఫికేషన్లు వంటి పత్రాలను అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునే వీలు కల్పించారు. అదే ఆన్లైన్లో పిలిస్తే ఒకసారి అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లను ఇష్టానుసారంగా మార్పులు చేర్పులు చేయడం సాధ్యం కాదు. తమకు పర్సంటేజ్‌లు భారీగా ఇచ్చే కంపెనీలకు మేలు చేసేందుకే ఈ విధంగా ఆఫ్‌లైన్‌లో టెండర్లు పిలిచారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. -
సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం : సజ్జల
సాక్షి,తాడేపల్లి: కూటమి పాలనలో వ్యవసాయం రంగం సంక్షోభంలో చిక్కుకుందని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రైతు సమస్యలపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. శుక్రవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రైతు విభాగం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సజ్జల మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాబు ధరలేదు. అధికార పార్టీ, దళారులు కుమ్మక్కై మోసం చేస్తున్నారు. సమస్యలు గాలికొదిలేసి మంత్రులు విదేశాల్లో తిరుగుతున్నారని’ధ్వజమెత్తారు. రైతు విభాగం సమావేశంలో వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురామ్, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు సహా రైతు విభాగం నేతలు పాల్గొన్నారు. -
అధిక వేడితో పెనుముప్పు
తీవ్రమైన వేడి ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాలను ప్రమాదం అంచుకు నెడుతోంది. ప్రధాన వ్యవసాయ ప్రాంతాల్లో వడగాలులు తీవ్రతరం అవుతుండటంతో పంటలు, పశుసంపదపై ఒత్తిడి పెరుగుతోంది. యావత్ సమాజం ఉద్గారాలను తగ్గించుకునేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటే తప్ప ఆహార, వ్యవసాయ వ్యవస్థలకు, 120 కోట్లకు పైగా ప్రజల జీవనోపాధులు, ఆహార భద్రత పెను ముప్పును ఎదుర్కోక తప్పదని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ), ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) హెచ్చరించాయి. ధరిత్రీ దినోత్సవం సందర్భంగా బుధవారం ఐక్యరాజ్యసమితి సంస్థలు ఉమ్మడి నివేదికను విడుదల చేశాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తరచుగా సంభవిస్తున్న వడగాలులు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఆహారోత్పత్తిని దెబ్బతింటున్నది. తీవ్రమైన వేడి కారణంగా ఇప్పటికే పనులు చేసుకోలేని పరిస్థితులు పెరుగుతున్నాయని, ప్రతి సంవత్సరం 50 వేల కోట్ల పని గంటలు కోల్పోతున్నామని, ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ ఈ ప్రభావాలు మరింత తీవ్రతరం కానున్నాయని ఈ నివేదిక హెచ్చరించింది.పశువులు, పంటలకు కష్టంవ్యవసాయ పద్ధతులన్నింటిలోనూ అధిక వేడి ప్రభావాలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రత పెరిగినప్పటి నుంచే మొక్కజొన్న, సోయా వంటి అనేక ప్రధాన పంటలదిగుబడులు తగ్గడం మొదలవుతోంది. దీనివల్ల పంట మొక్కలు బలహీనపడి, ఉత్పాదకత తగ్గుతోంది. ఉష్ణోగ్రత 25 డిగ్రీలు దాటినప్పటి నుంచే పశువులు, ముఖ్యంగా పందులు, కోళ్లు ఒత్తిడికి గురవుతుంటాయి. వేడిని తట్టుకోలేనందున వాటి పెరుగుదల తగ్గిపోతుంది. పాల దిగుబడి తగ్గుతుంది. తీవ్రమైన సందర్భాల్లో అవయవ వైఫల్యం కూడా సంభవిస్తుందని నివేదిక హెచ్చరించింది. సముద్రాలలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తున్నాయి. దీనివల్ల సముద్ర జలాల్లోని చేపలు ఒత్తిడికి గురవుతున్నాయి. తీవ్రమైన వేడి కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం కలిగించి, కార్చిచ్చుల ప్రమాదాన్ని పెంచుతుండటంతో అడవులు కూడా ప్రభావితమవుతున్నాయి. తీవ్రమైన వేడి నేరుగా నష్టపరచటమే కాకుండా ఇతర పర్యావరణ సమస్యలను సైతం ప్రేరేపిస్తుంది. కరువులను ప్రేరేపించగలదు, నీటి కొరతను మరింత తీవ్రతరం చేయగలదు, కార్చిచ్చు ప్రమాదాలను పెంచగలదు. అంతేకాదు, తెగుళ్లు, వ్యాధుల వ్యాప్తిని వేగవంతం చేయగలదు. ఇలాంటివన్నీ కలిసి మొత్తం పర్యావరణ వ్యవస్థలపై పెను ప్రభావం చూపే స్థితికి చేర్చుతాయని నివేదిక తెలిపింది.పనులు చెయ్యలేని రోజులు..తీవ్రమైన వేడి ఒత్తిడి ప్రభావాలు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే తీవ్రంగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. పంటలు, పశువులకే కాదు మనుషులకు కూడా నష్టం అంతే తీవ్రంగా ఉంది. దక్షిణాసియా, సహారా ఉప–ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఆరుబయట పనులు చేయడానికి వీలుకాని రోజుల సంఖ్య సంవత్సరానికి 250కి పెరగొవచ్చు. ఇది లక్షలాది మంది వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని ప్రమాదంలో పడేసి, ఆహార ఉత్పత్తిని దెబ్బతీస్తుందని నివేదిక హెచ్చరించింది.ఉదాహరణకు, 2025లో కిర్గిజ్‌స్థాన్‌లో సంభవించిన వడగాడ్పుల కాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సుమారు 10 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగాయి. ఇది ధాన్యం దిగుబడుల్లో 25 శాతం తగ్గుదలకు కారణమవ్వటానికే కాకుండా, ఎడారి మిడతల దండును ప్రేరేపించి, నీటిపారుదల సామర్థ్యాన్ని కూడా తగ్గించింది.ఇతర ప్రాంతాలలో, 2023 మరియు 2024లో బ్రెజిల్లో దీర్ఘకాలం పాటు కొనసాగిన వేడి మరియు కరువు పరిస్థితులు సోయాబీన్ దిగుబడులను 20 శాతం వరకు తగ్గించాయి , అదే సమయంలో 2021లో ఉత్తర అమెరికా అంతటా సంభవించిన తీవ్రమైన వడగాలులు పండ్ల పంటలలో గణనీయమైన నష్టాలకు మరియు అటవీ అగ్నిప్రమాదాలలో తీవ్రమైన పెరుగుదలకు దారితీశాయి.తక్షణ చర్యలు తీసుకోవాలిఅధిక వేడిని తట్టుకునే పంట రకాలను తయారు చేసుకోవటం, నాట్లు వేసే సమయాలను వేడికి అనుగుణంగా సర్దుబాటు చేయటం, వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడం వంటి తక్షణ చర్యలతో నష్టనివారణకు గల అవకాశాలను అందిపుచ్చుకోవాలని పాలకులకు పిలుపునిచ్చింది. పెరుగుతున్న వాతావరణ ప్రమాదాలను ఎదుర్కోవడంలో రైతులకు సహాయపడటానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, బీమా, సామాజిక భద్రత వంటి ఆర్థిక సహాయ పథకాలను అందుబాటులోకి తేవటం కూడా చాలా కీలకం. చదవండి: 'అరటిపండు'ని ప్రపంచ ఫలం అంటారు ఎందుకో తెలుసా..!వ్యవసాయ భవిష్యత్తును పరిరక్షించడానికి, ప్రపంచ ఆహార భద్రత పరిరక్షణకు, వాతావరణ మార్పును తట్టుకునే శక్తిని పంటలకు పెంపొందించాలి. కర్బన ఉద్గారాలను భవిష్యత్తులో భారీగా తగ్గించుకోవటం కూడా అవసరమని ΄పాలకులకు ఎఫ్ఏఓ, ఐడబ్ల్యూఓ పిలుపునిచ్చాయి.బలహీనతలు తీవ్రతరంవ్యవసాయం, అనుబంధ రంగాలు, ఆహార పంపిణీ వ్యవస్థల్లో పని పరిస్థితులను తీవ్రమైన వేడిమి అతలాకుతలం చేస్తోంది. వ్యవసాయ, ఆహార పంపిణీ వ్యవస్థల్లో ఇప్పటికే ఉన్న బలహీనతలను మరింత తీవ్రతరం చేసే ఒక ‘సంక్లిష్ట ప్రమాద కారకం’గా అధిక వేడి పనిచేస్తోందని ΄ాలకులు గుర్తించాలి.– సెలెస్ట్ సౌలో, డైరెక్టర్ జనరల్, ప్రపంచ వాతావరణ సంస్థ ఆహార భద్రతపై ఒత్తిడితీవ్రమైన వేడి పంటలు, పశుసంపద, మత్స్య సంపద, అడవులపై, అలాగే వాటిపై ఆధారపడి జీవిస్తున్న రైతులు, కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తోంది. ఆహార భద్రతపై ఒత్తిడిని పెంచుతోంది. – క్యు డోంగ్యు, డైరెక్టర్ జనరల్, ఐక్యరాజ్యసమితి ఆహార–వ్యవసాయ సంస్థ నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడిడెస్క్ -
భారత్‌ను లొంగదీసుకోవడం చాలాకష్టం: అమెరికా
అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ భారత్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ అంత సులువుగా లొంగే దేశం కాదని అమెరికా చట్ట సభల్లో మాట్లాడుతూ అన్నారు. వాణిజ్య పన్నుల విషయంలో వారి దేశ ప్రయోజనాలను ఎట్టిపరిస్థితుల్లో వారు పణంగా పెట్టరని తేల్చిచెప్పారు.ఇటీవల కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి దర్పణ్ జైన్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల ప్రతినిధుల బృందం అమెరికాతో వాణిజ్య చర్చల కోసం వాషింగ్టన్కు వెళ్లింది. అమెరికా తరపున చర్చలకు దక్షిణ మరియు మధ్య ఆసియాకు సంబంధించిన అసిస్టెంట్ USTR అయిన బ్రెండన్ లించ్ నేతృత్వం వహించారు. మూడు రోజుల పాటు ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులు సోయాబీన్, ఎథనాల్ మరియు సుంకాల తగ్గింపుపై ఇరు దేశాలు తమ వాదనలను బలంగా వినిపించాయి. అనంతరం భారత ప్రతినిధులతో జరిగిన చర్చల సారాంశాన్ని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసర్ గ్రీర్ చట్టసభల్లో ప్రస్థావించారు.జేమీసర్ గ్రీర్ అమెరికా చట్టసభల్లో మాట్లాడుతూ... "ఇండియా వ్యవసాయ ఆధారిత దేశం. అది చాలాకాలంగా వ్యవసాయ మార్కెట్లకు సంరక్షురాలిగా ఉంది, కనుక ఆ రంగలో రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. భారత్ అంత సులువుగా లొంగదు. ఆ దేశాన్ని లొంగదీయడం చాలా కష్టం" అన్నారు. భారత్ తన మార్కెట్‌ను అంత సులభంగా అమెరికాకు వదిలిపెట్టడం లేదని, చర్చల్లో భారత్ చాలా పట్టుదలగా వ్యవహరిస్తోందని గ్రీర్ అభిప్రాయపడ్డారు.ఏ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలుఅమెరికా తన వ్యవసాయ ఉత్పత్తులు సోయాబీన్, పప్పు ధాన్యాలు, పాల ఉత్పత్తులు మొదలైనవి భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని చూస్తోంది. అయితే, భారత ప్రభుత్వం మన దేశ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కఠినమైన నిబంధనలను, టారిఫ్‌లను (సుంకాలను) అమలు చేస్తోంది. వాటిని తగ్గించాలని అమెరికా ప్రతినిధులు కోరగా భారత్ దేశ రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఒప్పుకోనట్లు తెలుస్తోంది.కాగా ఇటీవల ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య చర్చలు జరిగాయి. రాబోయే ఐదేళ్లలో అమెరికా నుండి దాదాపు 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను (ముఖ్యంగా ఇంధనం, టెక్నాలజీ, బొగ్గు) కొనుగోలు చేసే దిశగా ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
వెండితెర తార... నేల పైకి
మాధవన్ విలక్షణ పాత్రలకు పేరొందిన ఆర్.మాధవన్ హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దాకా సాగించిన వైవిధ్యభరిత ప్రయాణం మనందరికీ తెలిసిందే. అయితే మనలో చాలా మందికి తెలియనిది రైతుగా ఆయన సాధించిన అపురూపమైన విజయం....తమిళనాడులోని పళనిలో ఉన్న ఒక బీడు భూమి మాధవన్ విజయానికి కేంద్రబిందువుగా మారింది. ఆ బీడు భూమిని కొనుగోలు చేసిన మాధవన్ ... కేవలం మూడేళ్లలోనే ఫలవంతమైన కొబ్బరితోటగా మార్చారు. నిరంతర కృషి, ప్రయోగాల ద్వారా సాధించిన ఈ మార్పు, తీయని నీరు, విలక్షణమైన సువాసనకు ప్రసిద్ధి చెందిన నాన్ –హైబ్రీడ్ కొబ్బరి తోటగా రూపుదిద్దుకుంది.నేలతల్లి నుంచి నేర్చుకున్నా...‘వ్యవసాయంలో ప్రతి అడుగు ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేలా చేసింది. ఇది ఎంతో సంతృప్తికరమైన అనుభవం. నా జీవితంలో అత్యంత ప్రతి ఫలదాయకమైన అనుభవాలలో ఒకటి. భూమి పునర్జీవం ΄పొంది, అది ఫలాలను ఇవ్వడాన్ని చూడటం అద్భుతంగా అనిపించింది. సరైన మల్చ్‌తో భూమిని సిద్ధం చేయడం నుంచి బావిలో సరైన చేపలను వదలడం వరకు నేను నేర్చుకున్న ప్రతి విషయం అమూల్యమైనది. ఎంతో విలువైనది’ అంటారు మాధవన్ ఎంతో సంతోషంగా...కొబ్బరిచెట్ల ప్రాజెక్ట్!తన కొబ్బరి చెట్ల పెంపకాన్ని ఒక ప్రాజెక్ట్‘ గా పేర్కొంటారు మాధవన్ . ‘ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. దీనిలో దాదాపు బీడుగా ఉన్న భూమిలో అత్యంత తీయని, సువాసనగల నాన్ –హైబ్రిడ్, స్వచ్ఛమైన ΄పొట్టి రకం కొబ్బరికాయలను పండించాము. త్వరలో నేను స్థానిక రైతుల కోసం ఒక వ్యాసం రాస్తున్నాను’ అంటున్నారు మాధవన్. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నాన్ హైబ్రిడ్ కొబ్బరి తోటల గురించి కల కంటున్నారు మాధవన్.కొత్త ఫలంకోవిడ్ లాక్డౌన్ సమయంలో, మాధవన్ తన అందమైన టెర్రస్ గార్డెన్‌ను వీడియోల ద్వారా చూపించారు. ఒక వీడియోలో చిన్న చెర్రీ పండ్లను చూపిస్తూ, ‘ముంబై టెర్రస్‌కు ఒక కొత్త ఫలం వచ్చింది’ అంటూ సంబరంగా చెప్పారు. నటిస్తే ఆదాయం, అవార్డులు రావచ్చు. రైతుగా అడుగులు వేస్తే... ఆ అడుగులు ముందుతరాలకు కొత్త దారులు చూపిస్తాయి. ఈ విషయంలో మార్గదర్శిగా నిలుస్తున్నారు మాధవన్.సామాజిక గళంసామాజిక సందేశాల కోసం గళాన్ని వినిపించడంలో ముందుంటారు మాధవన్. పశుపోషణకు సంబంధించిన విషయాలను, దాని పర్యావరణ ప్రభావాన్ని తెలియజేసేలా పెటా ఇండియా విడుదల చేసిన ‘గ్లాస్ వాల్స్’ అనే వీడియోకు మాధవన్ వ్యాఖ్యానం అందించారు. ‘వధశాలలకు గాజు గోడలు ఉంటే, ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారిపోయేవారు’ అన్న ఒక ప్రసిద్ధ ఆంగ్లోక్తిని ఆయన ఈ వీడియోలో మనకు వినిపిస్తారు. మాంసం, పాల పరిశ్రమలలోని రకరకాల దశలను ఈ వీడియో చిత్రీకరిస్తుంది. జంతువుల పట్ల వ్యవహరించే తీరును చూపిస్తూ, నైతికతకు సంబంధించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. తెర వెనుకసినిమా తారలు తెర వెనుక తమను తాము సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఒకవైపు నటనను కొనసాగిస్తూనే మరోవైపు తమవైన అభిరుచులను ఆస్వాదిస్తున్నారు. బైక్, కార్ రేసింగ్‌లకు పేరొందిన అజిత్ లాంటి తమిళ టాప్ హీరోల నుంచి వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటుతున్న ప్రగతి లాంటి టాలీవుడ్ నటీమణుల దాకా...విభిన్న రంగాల్లోనూ తమను తాము నిరూపించుకుంటున్నారు. వృత్తిజీవితాన్ని, ప్రవృత్తిని సమన్వయం చేసుకుంటున్నారు.– ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
‘యువత వ్యవసాయంపై దృష్టి పెట్టాలి’
హైదరాబాద్: హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రతిభ పురస్కారాన్ని వ్యవసాయ రంగంలో విశేష సేవలందించిన ‘ఐసీఏఆర్–ఐఏఆర్ఐ ’ డైరెక్టర్, వైస్ ఛాన్స్లర్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావుకు అందజేయడం ఆనందంగా ఉందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రిటైర్డ్ ఐసీఏఆర్ ఉద్యోగుల సంఘం, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా 2024–25 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక 9వ ‘ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్ అవార్డు’ పంపిణీ కార్యక్రమం శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ) ఇనిస్టిట్యూట్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ చైర్మన్ మండవ ప్రభాకరరావు, రిటైర్డ్ ఐసీఏఆర్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్ రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా ఎంఎస్ స్వామినాథన్ ప్రతిభా పురస్కారాన్ని వెంకయ్యనాయుడు.. డాక్టర్ శ్రీనివాసరావుకి ప్రదానం చేసి సత్కరించారు.ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. వ్యవసాయం, పర్యావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని దేశానికి అవసరమైన విధానాలను రూపొందించడంలో శ్రీనివాస్‌రావు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ దేశానికి మార్గదర్శకత్వం వహిస్తున్నందుకు ఈ పురస్కారం దక్కిందన్నారు. ప్రతిభకు గౌరవం ఇవ్వడం ద్వారా సమాజానికి ప్రేరణ కలుగుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో మండవ వెంకటరామయ్య చేసిన కృషిని స్మరించుకుంటూ, ఆయన స్థాపించిన విత్తన సంస్థను ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు.వ్యవసాయం దేశ భవిష్యత్తుకు కీలకమని, యువత ఈ రంగంపై దృష్టి సారించాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ప్రకృతిని పరిరక్షించుకోవడం, పశుసంపదను కాపాడుకోవడం అవసరమని సూచించారు. వ్యవసాయం ల్యాబ్‌లకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయికి చేరాలని, శాస్త్రవేత్తల పరిశోధనలు రైతులకు అందాల్సిన అవసరం ఉందన్నారు. భూసార పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, రసాయన ఎరువుల అధిక వినియోగం భూమి నాణ్యతను దెబ్బతీస్తుందని హెచ్చరించారు.అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. భారత గ్రీన్ రివల్యూషన్ శిల్పి ప్రొఫెసర్ స్వామినాథన్ జన్మ శతాబ్ది సందర్భంగా శ్రీనివాసరావుకు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. భారత వ్యవసాయాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడంలో ఎంఎస్ స్వామినాథన్ గారి పాత్ర గొప్పదని ఈ సందర్భంగా చెప్పారు. వ్యవసాయ శాస్త్రవేత్తల కృషి సాధారణ రైతులకు పూర్తిగా చేరడం లేదని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్‌లో భూమిని పరిరక్షించకపోతే గ్రీన్ రివల్యూషన్ ఫలితాలు ప్రతికూలమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నవారిని ప్రోత్సహించాలని, మంచి కార్యక్రమాలను కొనసాగించాలని మండవ ప్రభాకర్ రావును కోరారు.వ్యవసాయానికి సేవ చేసిన వారికి గౌరవం దక్కుతుందని, క్లైమేట్ మార్పులకు తట్టుకునే వ్యవసాయం, సహజ వనరుల నిర్వహణలో డాక్టర్ శ్రీనివాసరావు చేసిన విశేష కృషికి ఈ అవార్డు లభించిందని నూజివీడు సీడ్స్ లిమిటెడ్ చైర్మన్ మండవ ప్రభాకరరావు అన్నారు. ఆయన దేశ వ్యాప్తంగా లక్షల హెక్టార్లలో వనరుల సంరక్షణ సాంకేతికతలను విస్తరించడం, జిల్లా స్థాయి కంటింజెన్సీ ప్రణాళికలను రూపొందించడం ద్వారా వ్యవసాయ స్థిరత్వం, ప్రతిఘటన సామర్థ్యాన్ని గణనీయంగా పెంచినట్లు తెలిపారు. -
ముంచుకొస్తున్న వ్యవసాయ, ఆహార విపత్తు!
అత్యవసర వ్యవసాయ ఉత్పాదకాలైన ఎరువుల ఉత్పత్తి కోసం సహజ వాయువును తీసుకువెళ్లే ఓడలను హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించటాన్ని వెంటనే పునఃప్రారంభించకపోతే ప్రపంచ ఆహార ధరలు ఈ ఏడాది చివర్లో విపరీతంగా పెరిగే ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) తీవ్రస్వరంతో హెచ్చరిస్తోంది. హార్ముజ్ జలసంధిలో రవాణాకు దీర్ఘకాలిక అంతరాయాలు కోవిడ్–19 అనంతర కాలాన్ని గుర్తుచేసే విధంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను, సరఫరా గొలుసులో ఆటంకాలను ప్రేరేపించగలవని ఎఫ్ఏఓ హెచ్చరించింది.పంటల క్యాలెండర్ల ప్రకారం ఎరువులు, ఇంధన ఉత్పాదకాలు సకాలంలో అందకపోవటం, అధిక ధరల కారణంగా పేద దేశాలు అత్యధిక ప్రమాదంలోకి కూరుకుపోతున్నాయని ఎఫ్ఏఓ ముఖ్య ఆర్థికవేత్త మాక్సిమో టొరెరో ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్ఏఓ ఆర్థిక విభాగం డైరెక్టర్ డేవిడ్ లాబోర్డ్తో కలిసి ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. ముడి చమురు, నత్రజని ఎరువుల తయారీకి ఉపయోగించే సహజ వాయువు, ఇంకా ఇతర ఎరువులు రవాణా కావడం లేదు. ఫాస్ఫేట్ ఎరువుల తయారీకి ఉపయోగించే సల్ఫర్ రవాణా కూడా స్తంభించిందని ఆయన అన్నారు. నౌకలు కదలకపోతే, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ–ఆహార వ్యవస్థకు, ఆర్థిక వృద్ధికి, ఇంకా అనేక రంగాల రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన కీలక వనరులపై గణనీయమైన ప్రభావం పడుతుందని టొరెరో హెచ్చరించారు. రాబోయే రోజుల్లో నౌకలు కదలడం ప్రారంభిస్తాయని ఆశిస్తున్నానన్నారు. ‘సమయం గడిచిపోతోంది..’ ‘సమయం గడిచిపోతోంద’ని ఎఫ్ఏఓ ప్రధాన ఆర్థికవేత్త టొరెరో అన్నారు. వ్యవసాయ–ఆహార వ్యవస్థకు సంబంధించిన ప్రతిదీ పంటల క్యాలెండర్‌తో ముడిపడి ఉందని వివరించారు. మనం పంటల క్యాలెండర్‌ను పాటించకపోతే, విత్తనాలు/ నాట్లు వేసే సమయంలో రైతుల దగ్గర పెట్టుబడులు లేక΄ోతే తక్కువ పెట్టుబడులతో వ్యవసాయం చేయవలసి వస్తుంది. అందువల్ల రానున్న ఒకటి, రెండు పంటకాలాల్లో దిగుబడులు తగ్గి΄ోవచ్చు. అలాగే ఆహారం, నిత్యావసరాల ధరలు పెరిగిపోవచ్చు. ప్రస్తుతం మనం ఈ అత్యవసర పరిస్థితిలో ఉన్నాం. దీనివల్ల వడ్డీ రేట్లు పెరుగుతాయని, అది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందన్నారు. కోవిడ్–19 నుండి కోలుకున్న తర్వాత అనుసరించిన విధానాల మాదిరిగానే, అన్ని దేశాలు ధరలను తగ్గించే విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది. అందువల్ల, ఈ నౌకలు ఇప్పుడు కదలడం ప్రారంభించడం చాలా ముఖ్యం అని టొరెరో నొక్కి చెప్పారు.ఆహార పంటల సాగు తగ్గొచ్చుధరల సూచి ఏప్రిల్‌లో పెరుగుతోందని, మేలో అది మరింత తీవ్రమవుతుందని టొరెరో పేర్కొన్నారు. ఎరువుల లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపికలను మార్చుకోవాలా వద్దా? పెరిగిన చమురు ధరలతో ప్రయోజనం పొందడానికి జీవ ఇంధనాల ఉత్పత్తికి అనువైన పంటల సాగుకు ఎక్కువ భూమిని, వనరులను కేటాయించటంపై రైతులు నిర్ణయాలు తీసుకుంటారు. దీని వల్ల ప్రపంచ ఆహార సరఫరా తగ్గిపోతుంది. అందుకే కాల్పుల విరమణ కొనసాగడం, జలసంధిలోని నౌకలు కదలటం అత్యవసరమని అన్నారు. ముఖ్యంగా ఇంధనం, ఎరువులపై ఎగుమతి ఆంక్షలను నివారించాలని ఎఫ్ఏఓ అన్ని దేశాలను కోరింది.మాక్సిమో టొరెరో ఎఫ్ఏఓ ముఖ్య ఆర్థికవేత్త -
'అరటిపండు'ని ప్రపంచ ఫలం అంటారు ఎందుకో తెలుసా..!
ప్రపంచవ్యాప్తంగా సామాన్యులకు కూడా అత్యంత అందుబాటులో ఉండే పండు అరటి పండు. అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యధికంగా ఎగుమతయ్యే పండు అరటి పండు. ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మందికి అరటి పంట జీవనాధారంగా నిలిచింది. దీన్ని సాగు చేసి విక్రయించి ఆదాయాన్ని పొందుతున్న రైతులు కొందరైతే... అరటి ఉత్పత్తులనే దైనందిన ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఆధారపడుతున్న వారు మరికొందరు. ప్రపంచ అరటిపండు దినోత్సవం ప్రతి ఏప్రిల్ నెల మూడో బుధవారం జరుపుకుంటున్నారు.ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు తింటున్న, ఎగుమతి చేస్తున్న పండ్లలో అరటి ఒకటి. పండుగా తినటమే ఎక్కువ. పచ్చి కాయను కూరగా వండి లేదా కాల్చి లేదా పిండి చేసి నిల్వచేసుకొని దైనందిన ఆహారంగా తినే దేశాలూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న పరిమాణ పరంగా మొదటి పది ప్రధాన పంటల్లో అరటి ఒకటిగా నిలుస్తుంది. ప్రపంచ అరటి పరిశ్రమ విలువ సంవత్సరానికి సుమారు 2,500 కోట్ల డాలర్లు. ఆహార భద్రత, పౌష్టికత, గ్రామీణాభివృద్ధిలో అరటి పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి.150కి పైగా దేశాలలో అరటిని పండిస్తారు. ముఖ్యంగా తక్కువ ఆదాయం గల, ఆహార కొరత ఉన్న దేశాల్లో రోజువారీ ముఖ్యమైన ఆహారంగా అరటిని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా, లక్షలాది మంది చిన్న రైతులకు వాణిజ్య పంటగా కీలకమైన ఆదాయ వనరుగా కూడా ఉంది. మొత్తంగా, ప్రపంచవ్యాప్తంగా అరటి ఆర్థిక వ్యవస్థ సుమారు 40 కోట్ల మంది ప్రజల జీవనోపాధికి దోహదం చేస్తోందని అంచనా. అరటి తోటల్లో లక్షలాది మంది కార్మికులకు ప్రత్యక్ష ఉపాధి దొరుకుతోంది. ప్యాకింగ్, రవాణా, మార్కెటింగ్‌లో పరోక్ష ఉద్యోగాలు పొందే వారు చాలా మంది ఉన్నారు. ఉత్పత్తి చేసే దేశాల్లోనే కాకుండా అరటి ఆధారిత పరిశ్రమ ముడిసరుకుల తయారీ నుండి అంతర్జాతీయ రవాణా, ఓడరేవు సేవలు, టోకు మార్కెట్లు, చిల్లర మార్కెట్ల వరకు ప్రపంచ అరటి విలువ గొలుసు అంతటా ఎంతో మందికి అరటి ఉపాధిని కల్పిస్తోంది.ప్రపంచ అరటి పండ్ల ఉత్పత్తి గత కొన్ని దశాబ్దాల్లో గణనీయంగా పెరిగింది. 2023 నాటికి ఇది 13.93 కోట్ల టన్నులకు చేరుకుంది. భారతదేశం, చైనా, ఇండోనేషియా, నైజీరియా, ఈక్వెడార్ అగ్రగామి అరటి ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. అధిక శాతం అరటిపండ్లు స్థానికంగా వినియోగించబడుతుంటాయి. సుమారు 15 శాతం అంతర్జాతీయ వాణిజ్యంలోకి ప్రవేశిస్తున్నాయి. 2024 నాటికి ప్రపంచ ఎగుమతులు 19.7 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. ప్రపంచ నికర అరటిపండ్ల ఎగుమతులలో దాదాపు 80 శాతం వాటాతో ఈక్వెడార్, ఫిలిప్పిన్స్, కోస్టారికా, గ్వాటెమాల, కొలంబియా అగ్రగామి ఎగుమతి దేశాలుగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్, అమెరికా, చైనా, రష్యా, జపాన్ అతిపెద్ద దిగుమతి మార్కెట్లుగా కొనసాగుతున్నాయి.అరటి సాగులో భారత్ వాటా29% ప్రపంచ అరటి ఉత్పత్తిలో 25–29% వాటాతో భారత్ అగ్రస్థానంలో ఉంది. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లలో అరటి తోటల సాగు విస్తారంగా ఉంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి 1993లో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జాతీయ అరటి పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పింది. ఈదురుగాలులకు అరటి తోటలు కూలిపోవటం రైతులకు అపారమైన నష్టాన్ని కలిగిస్తోంది. ఈ సమస్యను అధిగమించటానికి జీ9 మాదిరిగా అధిక దిగుబడినిచ్చే పాటి అరటి రకాన్ని ఈ కేంద్రం ఇటీవలే రూపొందించటం విశేషం.వెయ్యికి పైగా అరటి రకాలుప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా అరటి రకాలు ఉన్నాయని అంచనా. అయితే, ప్రపంచ ఎగుమతులలో ప్రధానంగా ‘కావెండిష్’ అరటి పండు రకానిదే ఆధిపత్యం. మన దేశంలో వాణిజ్యపరంగా ఉత్పత్తి చేస్తూ విరివిగా విక్రయిస్తున్న గ్రాండె నైన్ (జీ9) రకం దీనికి సంబంధించినదే. 20వ శతాబ్దం మధ్యకాలం వరకు, ప్రధాన ఎగుమతి రకం గ్రోస్ మిషెల్. రుచికి మరియు రవాణాలో తట్టుకునే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. అయితే, ఫ్యూసేరియం విల్ట్ రేస్ 1 అనే మట్టి ద్వారా వ్యాపించే శిలీంధ్రపు తెగులు మహమ్మారిగా మారి లాటిన్ అమెరికా అంతటా గ్రోస్ మిషెల్ తోటలను నాశనం చేసింది. దీంతో ఆ తెగులును తట్టుకోగల కావెండిష్ రకాల వైపు మళ్లవలసి వచ్చింది.కావెండిష్ అరటిపండ్లు సాగులోకి వచ్చిన కొద్ది కాలంలోనే అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రాధాన్యత గల ఎంపికగా మారాయి. అధిక దిగుబడి, ఏకరీతి రూపం, ఎక్కువ కాలం నిల్వ ఉండే గుణం, సుదూర ప్రాంతాలకు రవాణాలో తట్టుకునే శక్తి, స్పష్టమైన పక్వ లక్షణాలే ఇందుకు కారణాలు. నేడు ప్రపంచ అరటి ఎగుమతులలో 90 శాతం, ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు సగం వాటా కావెండిష్ అరటి పండ్లదే. అయినప్పటికీ, కావెండిష్ రకంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అరటిపండ్లు సాగులో ఉన్నాయి. ఇవి స్థానిక ఆహారపు అలవాట్లు, మార్కెట్లు, సంస్కృతులలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో వంటకు ఉపయోగించే రకాలు (ప్లాంటైన్లు, ఇతర పిండి పదార్థాలు అధికంగా ఉండే అరటిపండ్లు), పండించి తినే అనేక ఇతర రకాల అరటి రకాలు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటీ ప్రత్యేకమైన వ్యవసాయ లక్షణాలు, పోషక ప్రయోజనాలు, గుణాలను కలిగి ఉండి జీవవైవిధ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కొత్త రకాల అభివృద్ధిఅరటిపండ్లు ఆగ్నేయాసియాలో ఉద్భవించాయి. అడవి అరటిపండ్ల సహజ సంకరీకరణ వలన ఆ ప్రాంతంలో, పసిఫిక్‌లో వాటిని తొలుత సాగు చెయ్యటం ప్రారంభమైంది. అన్ని అరటిపండ్లు ముసేసి కుటుంబంలోని మూసా ప్రజాతికి చెందినవి, ఇందులో ఎన్సెటే, ముసెల్లా ప్రజాతులు కూడా ఉన్నాయి. కాలక్రమేణా కొత్త రకాల అభివృద్ధి జరిగింది. తోటల సాగు, పోషకాల అవసరాలు, పంటకోత అనంతర సవాళ్లను పరిష్కరించడానికి మెరుగైన రకాలను అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం విస్తృత శ్రేణిలో ప్రజనన (బ్రీడింగ్) ప్రయత్నాలు జరుగుతున్నాయి. అరటి, ప్లాంటైన్ ప్రజనన కార్యక్రమాల ముఖ్య ఉద్దేశాలలో ఫ్యూసేరియం విల్ట్ ట్రాపికల్ రేస్ 4 (టిఆర్4), బ్లాక్ సిగాటోకా (మైకోస్ఫెరెల్లా ఫిజియెన్సిస్), ఎల్లో సిగాటోకా (సూడోసెర్కోస్పోరా ముసే), బనానా బంచీ టాప్ వైరస్ (బీబీటీవీ) వంటి ప్రధాన వ్యాధులను తట్టుకునే రకాలను అభివృద్ధి చేస్తున్నారు.అరటి ప్రజనన కార్యక్రమాలు కరువు, లవణీయత, తీవ్ర ఉష్ణోగ్రతలు వంటి ఒత్తిళ్లను తట్టుకునే రకాలను అభివృద్ధి చేయడం ద్వారా మెరుగైన, నాణ్యమైన రకాలను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రూపొందిస్తున్నాయి. తద్వారా మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో స్థిరమైన దిగుబడిని పొందటం సాధ్యపడుతుంది. పండ్ల నిల్వ కాలాన్ని పొడిగించడం, ఎంజైమాటిక్ బ్రౌనింగ్‌ను తగ్గించడం, పండ్ల దృఢత్వాన్ని, నిర్వహణ నష్టాన్ని తట్టుకునే శక్తిని పెంచడం ద్వారా కోత అనంతర సమస్యలను తగ్గించటంపై కూడా దృష్టి సారిస్తున్నారు. అదే సమయంలో, విటమిన్ ఎ, ఇనుము, జింక్‌తో బయోఫోర్టిఫికేషన్ ద్వారాపోషకాలను పెంచుతున్నారు. అలాగే అరటిపండ్లు, కూర అరటి రకాల నాణ్యతను మెరుగుపరచడానికి పిండిపదార్థం, చక్కెర కూర్పును సరిచేయడంపై కూడా ఈ ప్రజనన కార్యక్రమాలు దృష్టి సారిస్తున్నాయి. అదే సమయంలో, మారుతున్న మార్కెట్, వినియోగదారుల డిమాండ్లను తీర్చడానికి మెరుగైన రుచి, ఆకృతి, ప్రాసెసింగ్ అనుకూల లక్షణాలతో కూడిన రకాలను అభివృద్ధి చేయడం కూడా జరుగుతోంది.ఒకే రకం సాగుతో ముప్పుఆర్థిక అనిశ్చితి, వాతావరణ మార్పులు అరటి పంటపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జీవనోపాధి కోసం, ఆహార భద్రత కోసం లక్షలాది మంది ఆధారపడే అరటి పంట ఉత్పత్తి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది. ఒకే రకంపై ఎక్కువగా ఆధారపడటం, అరటిలో అంతర పంటలు వెయ్యకుండా ఏక పంట సాగుపై ఆధారపడటం వల్ల అరటి తోటల సాగు పర్యావరణ పరంగా, చీడపీడల పరంగా ఒత్తిళ్లకు గురవుతోంది. అదేవిధంగా మార్కెట్లో ఎదురయ్యే ఒడిదుడుకులు అరటి రంగాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. కావెండిష్ అంటే జీ9 రకం ఒక్కదాన్నే సాగు చెయ్యటం మానుకోవాలని ప్రపంచ అరటి ఫోరమ్ ప్రచారం చేస్తోంది. ‘అరటి రకాల్లో ఇప్పటికీ విస్తృతంగా సాగు చెయ్యని అపారమైన వ్యవసాయ వైవిధ్యం ఉంది. ఆ వైవిధ్యపూరిత రకాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చెయ్యాలి. స్థానిక మార్కెట్లలో అత్యంత ప్రజాదరణ పొంది, సాగు జరిగే ప్రాంతాల్లోని సాంస్కృతిక వారసత్వంలో భాగమైనవైనప్పటికీ, అంతర్జాతీయ వాణిజ్య అవసరాలకు మనం ఇచ్చిన ప్రాధాన్యం రీత్యా మరుగునపడ్డాయి. ఈ అరటి రకాలను తిరిగి సాగులోకి తేవాలి. ఉదాహరణకు.. మైసూరు అరటి రకం. ఈ సంప్రదాయ రకాలు అరటి తోటల్లో వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తాయి. చీడపీడలను, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవటంలో అరటి రంగం సామర్థ్యాన్ని పెంచడానికి, కొత్త మార్కెట్ అవకాశాలను తెరవడానికి ఈ స్థానిక రకాలు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ విషయాలను ప్రచారంలోకి తేవాల’ని ప్రపంచ అరటి ఫోరమ్ ప్రపంచ దేశాలకు సూచిస్తోంది. అరటి సాగులో సవాళ్లుఅంతర్జాతీయంగా అరటి పంట బాగోగులు, తీరుతెన్నులను పరిశీలిస్తూ ప్రపంచ దేశాలకు తగిన సూచనలు ఇచ్చే సంస్థ ప్రపంచ అరటి ఫోరమ్. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉండే ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ఏర్పాటు చేసిన ఈ ఫోరం ఏమంటోందంటే? ‘ప్రపంచంలో అత్యధికంగా ఎగుమతి అయ్యే తాజా పండ్లు అరటి పండ్లే. సంవత్సరానికి దాదాపు వెయ్యి కోట్ల డాలర్లు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వేలాది గ్రామీణ కుటుంబాలకు అరటి పండ్లు ఒక ముఖ్యమైన ఆదాయ వనరు. అయితే, అరటి సాగులో వ్యవసాయ రసాయనాలపై అధికంగా ఆధారపడటం, రైతుల చేతికందే ఆదాయం బాగా తగ్గటంతోపాటు గణనీయమైన పర్యావరణ, సామాజిక సవాళ్లు తలెత్తాయి. సంబంధిత వర్గాలన్నీ చురుకుగా సహకరించుకుంటేనే వీటిని సమర్థవంతంగా పరిష్కరించగలం’.– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: రైతమ్మల గెలుపుకి.. సాంకేతిక సామాజిక స్ట్రాటజీ..) -
కొత్త డిస్కం.. జగన్ విజన్‌కు తార్కాణం
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి పాతికేళ్లపాటు పగటిపూట తొమ్మిది గంటలు విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టకేలకు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి కొనసాగించక తప్పలేదు. ఎన్ని కుట్రలు చేసినా, ఎంత విష ప్రచారం చేసినా.. తుదకు జగన్ తీసుకొచ్చిన సంస్కరణలే మంచివనే నిర్ణయానికి వచ్చినట్టుంది. ఈ క్రమంలో వైఎస్ జగన్ తీసుకువచ్చిన వ్యవసాయానికి ప్రత్యేక డిస్కం ప్రతిపాదనను తిరిగి తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం మూడు డిస్కంల ఆధ్వర్యంలో ఉన్న 11 కేవీ వ్యవసాయ ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర మంత్రి మండలి (క్యాబినెట్) శుక్రవారం ఆమోదం తెలిపింది. దీంతో విజన్ ఉన్న నాయకుడు జగన్ అని మరోసారి రుజువైంది. ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి అండగా నిలవడంతో పాటు అధికారంలోకి వచ్చాక వారికి మంచి చేయాలనే లక్ష్యంతో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన వైఎస్ జగన్‌కు అప్పట్లో పంట చేలల్లో వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతన్నలు అడుగడుగునా తమ గోడును చెప్పుకున్నారు. రాత్రనకా, పగలనకా సాగు నీటి కోసం బోర్ల వద్ద పడిగాపులు కాస్తూ, విద్యుత్ కోసం పడుతున్న బాధలను కన్నీళ్లతో వివరించారు. వారి కష్టాలను కళ్లారా చూసిన జగన్.. అధికారంలోకి రాగానే రైతులకు ఉచిత విద్యుత్‌ను హక్కుగా అందించాలని అప్పుడే నిశ్చయించుకున్నారు. 30 ఏళ్ల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు ఢోకా లేకుండా చేయాలనుకున్నారు. అది కూడా పగటిపూట 9 గంటల పాటు నిరంతరాయంగా అందించాలనుకున్నారు. అది సౌర విద్యుత్ వల్లనే సాధ్యమవుతుందని భావించారు. దానికి తగ్గట్టుగానే అధికారంలోకి రాగానే సౌర విద్యుత్‌ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, వ్యవసాయానికి సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఉచిత విద్యుత్ సరఫరా చేసేలా సామర్థ్యం కలిగిన వ్యవసాయ ఫీడర్లను అప్‌గ్రేడ్ చేయడం కోసం రూ.1,700 కోట్లు ఖర్చు చేశారు.కొత్త డిస్కంకు అప్పుడే అంకురార్పణ అన్నదాతలకు ఉచిత విద్యుత్‌ను హక్కుగా అందించాలనే సంకల్పంతో 2020 ఫిబ్రవరి 15న గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఈసీఎల్) ను ఏర్పాటు చేసి, సౌర విద్యుత్ సమీకరణకు శ్రీకారం చుట్టారు. ఆ నిర్ణయాన్ని మెచ్చి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) 2021 సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. రైతుల శ్రేయస్సు కోసం ఓ రాష్ట్ర ప్రభుత్వం ఇంతటి ముందు చూపుతో ఆలోచించి సౌర విద్యుత్ సేకరణకు ప్రయత్నించడం అభినందనీయమని ఆ లేఖలో పేర్కొంది. యూనిట్ రూ.2.49కే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను తామే సరఫరా చేస్తామంటూ ప్రతిపాదన చేసింది. సెకీతో ఒప్పందం కోసం ఏపీజీఈసీఎల్ పేరును ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్ (ఏపీఆర్‌ఏపీఎస్‌సీఎల్)గా మార్పు చేస్తూ 2021 నవంబర్ 3న జగన్ ప్రభుత్వం జీఓ నంబర్ 152ను విడుదల చేసింది. అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలు (ఐఎస్టీఎస్) నుంచి మినహాయింపు పొందడంలో భాగంగానే వ్యవసాయానికి ప్రత్యేక డిస్కం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతితో ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఇది వ్యవసాయానికి అత్యంత అవశ్యకం కావడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏపీఆర్ఏపీఎస్సీఎల్కు ఆంధ్రప్రదేశ్ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ (ఏపీఆర్‌ఏపీఎల్) అనే పేరును ఖరారు చేసింది.నాడు అంతా విష ప్రచారమని తేటతెల్లంరాష్ట్రంలో తూర్పు (ఏపీఈపీడీసీఎల్), మధ్య (ఏపీసీపీడీసీఎల్), దక్షిణ (ఏపీఎస్పీడీసీఎల్) ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లున్నాయి. వీటి పరిధిలో 22 లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులున్నాయి. వీటన్నిటినీ కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురానున్నారు. మూడు డిస్కంలకు చెందిన విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏపీఆర్‌ఏపీఎల్‌కు బదిలీ చేస్తున్నారు. సర్వీసులు, ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, స్తంభాలు ఇలా వ్యవసాయ విద్యుత్ సరఫరాకు వినియోగిస్తున్నవన్నీ కొత్త డిస్కంలో విలీనం చేస్తారు. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలుపడంతో ఇంధన శాఖ ఏపీఈఆర్సీకి ఫైలును పంపనుంది. మండలి ఆమోదం అనంతరం ఏపీఆర్‌ఏపీఎల్‌కు ప్రత్యేక కార్యాలయం, సిబ్బంది కేటాయింపు ప్రక్రియ మొదలవుతుందని ఇంధన శాఖ ఉన్నతాధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు. దీన్నిబట్టి ఇన్నాళ్లూ సెకీ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్ల భారం పడుతుందని చంద్రబాబు అండ్ కో చేసిందంతా కూడా తప్పుడు, విష ప్రచారం అని తేలిపోయింది. -
రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!
ఐదంకెల జీతం, కార్పొరేట్ హోదా..ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటే అదో గొప్ప స్టేటస్. కానీ ఇపుడు కథ మారిపోయింది. ఏ క్షణాన ఉద్యోగం ఊడిపోతుందో తెలియదు. ప్రముఖ ఐటీ సంస్థ ఒరాకిల్ (Oracle)12 వేల మంది టెకీల ఉద్వాసన కథ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇదేదో తక్కువ పెర్ఫార్మర్కే పరిమితం కాదు..ఎంతో అనుభవం ఉన్నా, నిపుణులకు కూడా ఇది తప్పలేదు. దీంతో ఆయా ఐటీ ఉద్యోగులు తమ బాధలను, భవిష్యత్ ప్రణాళికలను పంచుకోవడం నెట్టింట చర్చకు దారి తీస్తోంది. అలాగే ఆర్థిక స్వేచ్ఛ, కార్పొరేట్ ఒత్తిడిలుని జీవితం వంటి అంశాలపై చర్చలను రేకెత్తించింది.పదేళ్ల పాటు అంకితభావంతో సేవలందిస్తూ, ఏడాదికి రూ. 37 లక్షల వేతనం అందు కున్న వ్యక్తి ఉన్నట్టుండి, లేఆఫ్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయినప్పటికీ ఏమాత్రం కుంగిపోకుండా తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వనేష్ మాలి అనే ఎక్స్ యూజర్ తన స్నేహితుడి ఉదంతాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.దీని ప్రకారం సదరు ఐటీ ఉద్యోగికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ఒక్క ఫోన్ కాల్ కూడా చేయకుండా ఉన్నపళంగా ఉద్యోగం నుండి తొలగించారు. రేపటినుంచి నీ సేవలు అనవసరం అన్న సందేశం వేలాదిమంది ఐటీ ఉద్యోగులకు అశనిపాతంలా తగిలిన మాట వాస్తవం. ఎందుకంటే.. బోలెడన్ని కమిట్మెంట్స్, ఈఎంఐలు, ఫీజులు లాంటి అవసరాలెన్నో కళ్లముందు మెదులుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఆందోళన చెందుతారు. కానీ, మనం చెప్పుకోబోయే టెకీ మాత్రం చాలా ప్రశాంతంగా ఆలోచించాడు. ఎలాంటి నిరాశ లేదా ఆందోళనకు బదులుగా, ప్రశాంతంగా ఈ పెను తుఫానులాంటి పరిస్థితిని స్వీకరించడం విశేషం. "నేను దీనిగురించి అస్సలు బాధపడటం లేదు. నిజానికి నేను సంతోషంగా ఉన్నాను. ఇకపై నేను ఏ ఐటీ కంపెనీలోనూ పని చేయను. నేను వ్యవసాయంపై దృష్టి పెడతాను." అనే నిర్ణయానికి వచ్చేశాడు.వ్యవసాయమే ఎందుకూ అంటేఇదేదో తాత్కాలిక ఆలోచనో, కేవలం భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం కాదిది. దీని వెనుక ముందు చూపుతో చాలా తెలివిగా వ్యవహరించిన బలమైన ఆర్థిక ప్రణాళిక ఉంది. గత 10 ఏళ్లుగా సంపాదించిన సొమ్మును తెలివిగా పొదుపు చేశాడు. భవిష్యత్తులో ఉద్యోగం పోయినా అతను ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా తగిన ఆర్థిక భద్రతను కల్పించుకున్నాడు. ఇపుడిక ఎలాంటి దిగులు లేకుండా తన తండ్రికి వ్యవసాయంలో సహాయం చేస్తూ, కుటుంబంతో సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు. ఈ 'ర్యాట్ రేస్' (Rat Race) అని పిలిచే ఈ కార్పొరేట్ పోటీ ప్రపంచాని దూరంగా, ప్రశాంత జీవనం గడపడమే అతని లక్ష్యం.ఇదీ చదవండి : లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి !ఈ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. చాలామంది దీనిని 'ఆస్పిరేషనల్ మూవ్' (ఆదర్శవంతమైన అడుగు) అని అభివర్ణిస్తున్నారు. లేఆఫ్స్ అనేవి కొన్నిసార్లు మన జీవితాన్ని మనకు నచ్చినట్టు మార్చుకోవడానికి దేవుడు ఇచ్చే అవకాశాలని కొందరు కామెంట్ చేశారు. సొంత రూల్స్‌తో ర్యాట్ రేస్‌నుంచి వైదొలగడం అరుదైన ఉదాహరణ అని పేర్కొన్నారు. కార్పొరేట్ జీవితం కంటే వ్యవసాయం, కుటుంబాన్ని ఎంచుకోవడానికి ధైర్యం , దృఢ విశ్వాసం అవసరమని మరొకరు పేర్కొన్నారు. అంతేకాదు జీవితంలో పొదుపు ప్రాముఖ్యత అందర్నీ ఆకట్టుకుంది. ఆకస్మికంగా ఉద్యోగం పోయినా తట్టు కోవాలంటే ఆర్థికంగా ముందుగానే సిద్ధంగా ఉండాలని ఈ ఘటన నిరూపించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. లక్షల జీతం కన్నా తనవాళ్ల మధ్య మనశ్శాంతిగా జీవించడంతోపాటు, భూమాతను నమ్ముకున్న తీరు ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.ఇదీ చదవండి : పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్‌లు, వీడియో వైరల్ -
2025లో స్వల్పంగా తగ్గిన నిరుద్యోగం
న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం గతేడాది (2025లో) 3.1 శాతానికి తగ్గింది. 2024లో ఇది 3.2 శాతంగా ఉంది. పీరియాడిక్ లేబర్‌ఫోర్స్ సర్వే, 2025 వివరాలను కేంద్ర ప్రణాళికలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం.. ⇒ 15 ఏళ్లకు వయసుపైబడిన మహిళల్లో నిరుద్యోగం 2024 మాదిరే 2025లోనూ 3.1% వద్దే ఉంది. పురుషుల్లో ఇది 3.3% నుంచి 3.1 శాతానికి తగ్గింది. ⇒ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 2024లో 2.4 శాతంగా ఉంది. అంతక్రితం ఏడాది ఇది 2.5%గా ఉంది. పల్లెల్లో పురుషుల నిరుద్యోగం 2.6 %గా ఉంటే, మహిళల్లో 2.1%గా నమోదైంది. ⇒ స్వయం ఉపాధి రేటు 2024లో ఉన్న 57.5 % నుంచి 2025లో 56.2 శాతానికి తగ్గింది. ⇒ సాధారణ లేబర్ పనుల్లో ఉపాధి 20.2%గా ఉంది. ⇒ వ్యవసాయ రంగంలో ఉపాధి 2025లో 43 శాతంగా నమోదైంది. 2024లో ఉన్న 44.8 శాతంతో పోల్చితే తగ్గింది. ⇒ నిర్మాణ రంగంలో ఉపాధి రేటు 12.3 శాతం నుంచి 12 శాతానికి తగ్గింది. ఇతర సేవల్లో ఇది 12.2 శాతం నుంచి 13.1 శాతానికి పెరిగింది. ⇒ కార్మికుల ఆర్జన మెరుగుపడింది. పురుషుల సగటు ఆర్జన 2024లో రూ.22,891గా ఉంటే, 2025లో రూ.24,217కు పెరిగింది. మహిళా కార్మికుల ఆర్జన రూ.17,126 నుంచి రూ.18,353కు వృద్ధి చెందింది. -
పప్పుధాన్యాలు తగ్గుతున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయ రంగం కొన్నేళ్లుగా స్థిరమైన పురోగతిని నమోదు చేస్తున్నప్పటికీ, పంటల వైవిధ్యంలో వెనుకబడిపోతోంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల ఉన్నప్పటికీ.. వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ మినహా ఇతర పంటల సాగులో వెనుకబడిపోతున్నట్లు సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది. గత మూడేళ్లలో వివిధ పంటల సాగు తీరుతెన్నులను ఈ సర్వే కళ్లకు కట్టింది. పంటల మార్పిడి విషయంలో రైతులు మేల్కొనకపోతే రాష్ట్రంలో పప్పుధాన్యాల సాగు కనుమరుగయ్యే పరిస్థితి రానుంది. 2023–24లో 207.95 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 2024–25 కల్లా 232.10 లక్షల టన్నులకు పెరిగింది. 2025–26 నాటికి ఇది 236.87 లక్షల టన్నులకు చేరుకుంది. దీంతో రాష్ట్రంలో పంటల మార్పిడిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు ఎంతగా చెబుతున్నా, రైతుల ఆలోచనలో మార్పు రావడం లేదు. ఇతర పంటలకు కోతులు, అడవి పందుల బెడద ఉండటం, దిగుబడిపై ఉన్న అనుమానాలను వ్యవసాయ అధికారులు నివృత్తి చేయకపోవడంతో రైతులు కొంతకాలంగా అలవాటైన పత్తి, వరి వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో రైతుల ఆలోచనల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం ఇతర పంటలు సాగు చేసే రైతులకు బోనస్ ఇవ్వాలని యోచిస్తోంది. అందులో భాగంగానే ఈసారి బడ్జెట్లో పంటల బోనస్ కోసం రూ. 3,500 కోట్లు కేటాయించింది. ఇప్పుడు సన్న వడ్లకు ఇస్తున్న బోనస్‌ను పప్పుధాన్యాలు, నూనె గింజల పంటలకూ ఇచ్చే ఆలోచనలో ఉంది. ఇదే విషయాన్ని నర్మెటలో ఆదివారం జరిగిన సభలో రేవంత్‌రెడ్డి చెబుతూ, పంటల వైవిధ్యం పెంచడానికి ఏంచేయాలనే అంశంపై నిర్ణయానికి రావాలని మంత్రి తుమ్మలకు సూచించారు. పప్పుధాన్యాల్లో తగ్గిన స్థిరత్వం రాష్ట్రంలో పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్థిరత్వం తగ్గింది. హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 2023–24లో 3.61 లక్షల టన్నులుగా ఉన్న పప్పు ధాన్యాల ఉత్పత్తి 2024–25లో 3.99 లక్షల టన్నులకు పెరిగినప్పటికీ, 2025–26లో ఇది 3.48 లక్షల టన్నులకు తగ్గే అవకాశం ఉందని అంచనా. పెసర, కంది, శనగలు, మినుముల ఉత్పత్తి పడిపోతుండటం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి లభ్యత పెరగడంతో గతంలో పప్పుధాన్యాలు సాగు చేసిన భూముల్లోనూ వరి, పత్తికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించే విధానాలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఒకేసారి స్థిరత్వం–మార్పు రాష్ట్రంలో పంటల ఎంపికలో స్థిరత్వం, మార్పు అనే రెండు ధోరణులను ఒకేసారి చూపిస్తోంది. ముఖ్యంగా వానాకాలం, యాసంగి సీజన్లలో వరి ఆధిపత్యం కొనసాగుతుండగా, మొక్కజొన్న వంటి పంటలు క్రమంగా విస్తరిస్తున్నాయి. సోయాబీన్, కందిపప్పు వంటి పంటలు తగ్గుదల చూపుతున్నాయి. యాసంగిలో జొన్న కొంత పెరుగుదల చూపుతుండగా, శనగ, వేరుశనగ తగ్గుతూ ఉన్నాయి. మొక్కజొన్న పంట 9.8 శాతం నుంచి 13 శాతం వరకు పెరగడం రైతుల్లో మార్పు సంకేతంగా కనిపిస్తోంది. -
మహిళల నీటి కష్టాలు మూడురెట్లు!
ప్రపంచంలో మన దేశానికి ఉన్నది 4% మంచినీరు మాత్రమే. కానీ, ప్రపంచ జనాభాలో 18% మన దేశంలోనే నివశిస్తున్నారు. నీటి కొరత ఇప్పటికే మనకు పెనుసవాలుగా మారింది. ముఖ్యంగా వేసవిలో నీటి చుక్క కోసం అల్లాడే పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు ప్రతిరోజూ నీటి సేకరణకు 25 కోట్ల గంటలు వెచ్చిస్తున్నారు. ఇది పురుషులు, బాలురు వెచ్చిస్తున్న దాని కంటే 3 రెట్లు ఎక్కువ. నీటి గణాంకాల గురించి సాధారణంగా క్యూబిక్ మీటర్లలో చెబుతూ ఉంటాం. కానీ ఈ ప్రతి సంఖ్య వెనుక ఒక మానవ ముఖం ఉంది. ఆ ముఖం, చాలా సార్లు, మహిళదే! ఇది కల్పన కాదు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునెస్కో, యూఎన్ ఉమెన్, భారత జలశక్తి మంత్రిత్వ శాఖ గణాంకాల సహితంగా నమోదు చేసిన వాస్తవం ఇదే. నీటి భద్రతే లింగ సమానత్వానికి భూమిక.ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా మార్చి 22న ‘ప్రపంచ నీటి దినోత్సవం’ నిర్వహిస్తూ మనలో నీటి చైతన్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తోంది. ఈ ఏడాది ఇతివృత్తం: ‘ప్రజలందరికీ నీరు: స్త్రీ పురుషులకు సమాన హక్కులు– సమాన అవకాశాలు’. నీటి దినోత్సవ ప్రచార నినాదం: ‘నీరు ప్రవహించే చోట, లింగ సమానత్వం వికసిస్తుంది’! అది సాగు నీరైనా, తాగు నీరైనా సరే.. నీటికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అయినా మహిళల అభిప్రాయాలకు, ఆకాంక్షలకు సముచితమైన చోటివ్వటం ద్వారా సమానత్వాన్ని వికసింపజేయాలని ఐరాస పిలుపునిస్తోంది! ఇది మనందరం ఆలకించాల్సిన మానవీయమైన పిలుపు!!వ్యవసాయానికి అవసరమైన శ్రమను, గృహ, ఉత్పాదక అవసరాలకు నీటిని అందించడంలో మహిళలే ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ.. అధికారిక నీటి నిర్వహణ, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియల నుంచి వారిని క్రమపద్ధతిలో మినహాయిస్తున్నారు. వ్యవసాయ పనులను 37%–42% వరకు మహిళలే చేస్తున్నారు. ఒక పంట కాలంలో సగటున 3,300 గంటలు పనిచేస్తారు. పురుషుల 1,860 గంటలు మాత్రమే. కలుపు తీయటం, మొక్కలు నాటటం, నీరు పెట్టటం వంటి చేతులతో చేసే పనులు, ఎక్కువ నీరు అవసరమయ్యే పనులతో ΄ాటు, పశువులకు నీరు పెట్టటం వంటి పశు΄ోషణ పనుల్లో ఎక్కువ భాగాన్ని చక్కబెట్టే బాధ్యతలను మహిళలు నెరవేర్చుతున్నారు. క్షేత్ర స్థాయిలో వీరే ‘వాస్తవ‘ నీటి నిర్వాహకులు అయినప్పటికీ, వారి ΄ాత్రను తక్కువగా చూస్తున్నారు. టైమ్ పావర్టీభూగర్భ జలమట్టాలు తగ్గి΄ోతున్నందున, మహిళలు నీటిని తెచ్చుకోవడానికి మరింత దూరం ప్రయాణించవలసి వస్తుంది. మన దేశంలో మహిళలు కొన్నిసార్లు దీనికోసం రోజూ నాలుగు గంటల వరకు సమయం వెచ్చిస్తున్నారు. బుందేల్‌ఖండ్, విదర్భ, రాయలసీమ వంటి కరువు పీడిత ప్రాంతాల్లో వేసవికాలంలో 15–20 లీటర్ల బిందెలను నెత్తిన పెట్టుకని రోజుకు 5–20 కిలోమీటర్ల దూరం నడచి మరీ కుటుంబాలకు మహిళలు, బాలికలు నీటిని సమకూర్చుతున్నారు. ఒక అంచనా ప్రకారం.. గ్రామీణ భారతీయ మహిళ నీటి సేకరణ కోసం 210 గంటల (27 పూర్తి పనిదినాలకు సరిపడా) సమయాన్ని ప్రతి ఏటా కేటాయిస్తోంది. ఇంటì దగ్గరకే కుళాయి వస్తే ఈ సమయం అంతా మహిళలకు ఆదా అవుతుంది. ఈ శ్రమకు విలువ కడితే దేశం యావత్తూ ఒక రోజు ఆర్జించే ఆదాయానికి సమానం. ఈ పనుల వల్ల మహిళలు, బాలికలకు తీరిక దొరక్క (టైమ్ పావర్టీ) చదువు లేదా మరింత లాభదాయకమైన వ్యవసాయ కార్యకలాపాల్లో పాల్గొనలేకపోతున్నారు. కేవలం 5% మంది మహిళలకు మాత్రమే కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. సోలార్ పంపులు వంటి వాతావరణ మార్పుల్ని తట్టుకునే టెక్నాలజీలు అందుబాటులో లేవు. అందు వల్ల, మహిళా రైతులు ఎక్కువగా కరువు బాధితులుగా మారుతున్నారు. వాతావరణ మార్పులను తట్టుకోగల సేంద్రియ వ్యవసాయ నమూనాలకు మహిళా రైతులు పెద్దపీట వేస్తున్నారు. చిరుధాన్యాలను పండించటం, ఆహారంలో భాగం చేసుకోవటంలోనూ మహిళా రైతులు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఇవన్నీ ఆహార భద్రతను పెంచుతాయని, నీటి వినియోగాన్ని తగ్గిస్తాయని అనేక సంస్థల అనుభవాలు నిరూపించాయి.పురుషులతో పోలిస్తే మహిళలు వాతావరణ మార్పుల పట్ల ఎక్కువ సున్నితంగా ఉంటారని చటర్జీ (2021) అధ్యయనంలో వెల్లడైంది. నీటి లభ్యత, వ్యవసాయ ఉత్పాదకత, పశువుల సమస్యలు వంటి వివిధ రంగాలలో పురుషుల కంటే మహిళలే వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎక్కువగా గమనిస్తారని కూడా అధ్యయనాలు ఎత్తి చూపుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం, దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో 55%–65% వాటా మహిళా రైతులదే. పురుష రైతులు వ్యవసాయ రంగాన్ని విడిచిపెట్టి, వ్యవసాయేతర రంగాలలో కూలీలుగా మారుతున్న ప్రస్తుత ధోరణిని బట్టి చూస్తే, భారతదేశంలో మహిళా రైతుల సంఖ్య పెరుగుతోంది.లింగ సమానత్వానికి అడ్డంకులుమన దేశంలో నీటి హక్కులు సాధారణంగా భూ యాజమాన్యంతో ముడిపడి ఉంటాయి. సాగులో ఉన్న భూముల్లో కేవలం 13.5% మాత్రమే మహిళల ఆధీనంలో ఉన్నాయి. అధికారిక నీటి వినియోగదారుల సంఘాలు, సాగునీటి హక్కుల విషయంలో నిర్ణయాలు తీసుకోవటంలో మహిళల పాత్ర అంతంత మాత్రంగా మిగిలిపోయింది.సమావేశాలకు హాజరు కావడానికి భర్త అనుమతి అవసరం కావడం, వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసం లేకపోవడం, ‘నీటిపారుదల పురుషుల పని’ అనే భావన వంటివి నీటి నిర్వహణలో లింగ సమానత్వానికి అడ్డంకులుగా నిలుస్తున్నాయి. 2012లో ప్రభుత్వం ప్రకటించిన జాతీయ జల విధానం మహిళల అవసరాలను ప్రస్తావించింది. అయినప్పటికీ, జల పరిపాలనలో పురుషులతో సమానంగా మహిళలకు నిజంగా అవకాశాలు కల్పించడానికి ఇందులో నిర్దిష్ట మార్గదర్శకాలు లేవని విమర్శకులు వాదిస్తున్నారు. మహిళల మహా శ్రమప్రతి రోజూ 20 కోట్ల మంది భారతీయులు నడిచి వెళ్లి దూరం నుంచి నీటిని తెచ్చుకుంటారు. వీరిలో అత్యధికులు మహిళలు, బాలికలు (భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ). భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది, అంటే 60 కోట్ల మంది, తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు (నీతి ఆయోగ్ సీడబ్ల్యూఎంఐ 2018). ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ఫలితంగా ప్రతిరోజూ మహిళలు నీటిని తెచ్చేందుకు ఖర్చు చేసే 5.5 కోట్ల గంటల సమయం ఆదా అవుతోంది (జల్ శక్తి మంత్రిత్వ శాఖ, 2023).ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు ప్రతిరోజూ నీటి సేకరణకు 25 కోట్ల గంటలు వెచ్చిస్తున్నారు. ఇది పురుషులు, బాలుర కంటే 3 రెట్లు ఎక్కువ (యూఎన్ ఉమెన్, 2024).ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా మహిళలు, అంటే మొత్తం మహిళల్లో 27 శాతానికి పైగా, సురక్షిత తాగునీటి సేవలను పొందలేకపోతున్నారు (యూఎన్ ఉమెన్/యూఎన్డిఈఎస్ఏ, 2023).సురక్షితమైన తాగునీరు అందక భారతదేశంలో ప్రతి సంవత్సరం 2 లక్షల మంది మరణిస్తున్నారు (నీతి ఆయోగ్ సీడబ్ల్యూఎంఐ).మన దేశంలోని నదులు, రిజర్వాయర్లు, చెరువుల్లోని నీటిలో 70 శాతం కలుషితమైంది. జల నాణ్యత సూచికలో 122 దేశాల్లోకెల్లా భారతదేశం 120వ స్థానంలో, చివరి నుంచి మూడో స్థానంలో, ఉంది (నీతి ఆయోగ్ / ప్రపంచ బ్యాంకు). ప్రపంచవ్యాప్తంగా 14% దేశాల్లో నీటికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో పురుషులతో సమానంగా మహిళలు పాల్గొనడానికి ఇప్పటికీ ఎలాంటి యంత్రాంగాలు లేవు (యూఎఈ ఈపీ–డీహెచ్ఐ, జీడబ్ల్యూపీ, యూఎన్ ఉమెన్, 2025).నీటిపారుదల సామర్థ్యంవ్యవసాయరంగంలో నీటిపారుదల సామర్థ్యం ప్రపంచ సగటు 50–60%. మన దేశ వ్యవసాయ నీటిపారుదల సామర్థ్యం కేవలం 38% మాత్రమేనని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. పంటలకు నీటి వినియోగ సామర్థ్యాన్ని 60%కి పెంచితే, ఏటా 200 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బీసీఎం) పైగా నీరు అందుబాటులోకి వస్తుంది. ఇది గృహ, పారిశ్రామిక అవసరాల కొరత మొత్తాన్ని తీర్చడానికి సరి΄ోతుందని నీతి ఆయోగ్ అంచనా.సమానమైన దిగుబడి కోసం అమెరికా, చైనా లేదా ఇజ్రాయెల్‌లోని రైతులతో ΄ోలిస్తే భారతీయ రైతులు (ఒక్కో పంట యూనిట్‌కు) 3–5 రెట్లు ఎక్కువ నీటిని ఉపయోగిస్తున్నారు. ఇది రైతుల వైఫల్యం కాదు. ఇది విధానపరమైన మౌలిక సదుపాయాల వైఫల్యమని నీతి ఆయోగ్ / ఎఫ్ఏఓ తేటతెల్లం చేశాయి.ప్రపంచంలోనే అత్యధికంగా భూగర్భ జలాలను తోడే దేశం భారతదేశం. ఏటా 239–241 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని తోడేస్తున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా తోడుతున్న నీటిలో నాలుగో వంతు కంటే ఎక్కువ. 1,592 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని అధికంగా వినియోగిస్తున్నామని అంచనా.భారతదేశంలోని నదులు, చెరువులు, రిజర్వాయర్లు, కాలువల్లోని 70% నీరు కలుషితమయ్యాయి. జల నాణ్యత సూచికలో 122 దేశాలలో భారతదేశం 120వ స్థానంలో ఉంది. మనం కేవలం నీటిని కోల్పోవడమే కాదు, మిగిలి ఉన్న నీటిని కూడా విషపూరితం చేస్తున్నామని నీతి ఆయోగ్/ప్రపంచ బ్యాంకు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మహిళలకే గ్రామస్థాయి జల నాయకత్వం నీటి సేకరణకు అనుదినం మహిళలు, బాలికలు వెచ్చించే సమయం నుంచి ఆదా చేసే ప్రతి గంట సమయమూ.. మహిళాభివృద్ధిలో, విద్యలో, వాణిజ్యంలో, సమాజ పరివర్తనలో పెట్టుబడిగా పెట్టడానికి అదనంగా దొరికిన సమయమే. నీటి భద్రత, లింగ సమానత్వం అనేవి వేర్వేరు అంశాలు కావు. నీటి భద్రతతోనే లింగ సమానత్వం సాధ్యం. ఒకే సంక్షోభం, ఒకే అవకాశం. జల్ జీవన్ మిషన్ సహా ప్రభుత్వ నీటి పథకాలన్నిటికి సంబంధించి గ్రామ స్థాయిలో మహిళలను ప్రాథమిక జల పరిపాలన నాయకులు’గా అధికారికంగా గుర్తించాలి. నీటిని పరిపాలన బాధ్యతలు మహిళలకిస్తే సమాజాలు అభివృద్ధి చెందుతాయని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. 5, 6 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, విక్సిత్ భారత్ లక్ష్యం కూడా తద్వారా నెరవేరుతాయి. – మర్ది కరుణాకర్ రెడ్డి, ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, జల సంరక్షణ ప్రచార కార్యకర్త– నిర్వహణ: పంతంగి రాంబాబుసాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: మహిళా రైతులకు మద్దతిస్తే..!) -
మహిళా రైతులకు మద్దతిస్తే..!
ఒక మహిళా రైతు సాధికారితను పెంపొందిస్తే (అంటే, మద్దతు ఇస్తే లేదా బలోపేతం చేస్తే).. ఏమవుతుంది? ఆ కుటుంబం, సమాజం బాగుపడుతుంది. ఇందుకోసమే 2026 అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (యూఎన్–ఎఫ్ఏఓ) మహిళా రైతుల సాధికారితపై నాలుగు మాటల్లో ఏమంటోందో చూద్దాం..మీకు తెలుసా? దాదాపు ప్రతి గ్రామీణ మహిళ ఒక కార్మికురాలే, తిని కూర్చునే వారెవరూ లేరు! ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం, 2021లో ప్రపంచ వ్యవసాయ రంగం, ఆహార శుద్ధి, పంపిణీ రంగాల్లో పనిచేస్తున్న వారిలో మహిళలు 41% ఉన్నారు. అయినప్పటికీ గ్రామీణ మహిళలు అసమానతలను ఎదుర్కొంటున్నారు. వారి ఉపాధికి గ్యారంటీ లేదు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. హక్కులను పరిమితంగా మాత్రమే పొందగలుగుతున్నారు.ఆదాయం వచ్చే పొలం పనుల కన్నా ‘వేతనం లేని కుటుంబ సంరక్షణ పనుల’కు మహిళా రైతులు ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. ఇది లేబర్ మార్కెట్లో వారి విలువను తగ్గిస్తోంది. ఆర్థిక సాధికారత తగ్గిపోతోంది. ఈ పరిస్థితులు మహిళా రైతులకు అంత శ్రేయస్కరంగానూ లేదు. ప్రపంచవ్యాప్తంగా, మహిళలు, బాలికలు చేసే కుటుంబ సంరక్షణ పనులకు విలువ కడితే ఎంతవుతుందో తెలుసా? ఏడాదికి ఏకంగా రూ.9,95,264 కోట్లు అవుతుంది!మహిళా రైతులు సాధారణంగా పురుషుల కంటే చిన్న కమతాల్లోనే పంటలు పండిస్తున్నారు. పురుషులతో సమానమైన విస్తీర్ణం గల పొలాల్లో పంటలు పండిస్తున్న చోట్ల కూడా.. మహిళా రైతులకు వనరుల లభ్యత, వ్యవసాయ శిక్షణ, సలహాల అందుబాటు అరకొరగా అందుతుండటంతో ఉత్పాదకతలో వెనుకబడుతున్నారు. వీరి ΄పొలాల్లో పంటల దిగుబడి 24% తక్కువగానే వస్తోందని బెంగళూరుకు చెందిన ‘ఫౌండేషన్ ఫర్ అగ్రేరియన్ స్టడీస్’ చెబుతోంది.ఆహార అభద్రత పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువ. ప్రపంచం లో ఏ ప్రాంతంలో చూసినా పరిస్థితి ఇలాగే ఉంది. ఉపాధి, విద్య, ఆదాయంలో లింగపరమైన వివక్షలను తొలగించటం ద్వారా ఈ అంతరం 52% పోతుందని నిపుణులు చెబుతున్నారు.మన దేశంలో మహిళా రైతుల పరిస్థితేమిటి?ఫౌండేషన్ ఫర్ అగ్రేరియన్ స్టడీస్ సర్వేల (2017–18) ప్రకారం, వ్యవసాయ సీజన్లో 92% గ్రామీణ మహిళలు ఆదాయం వచ్చే వ్యవసాయ పనులు చేస్తున్నారు. పనులు అంతగా ఉండని సీజన్ లో కూడా 64% మంది ఏదో ఒక పని చేస్తున్నారు. ఏడాది పొడవునా గ్రామీణ మహిళలు చాలా మంది పనిలో నిమగ్నం అవుతున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.పాడి పనుల్లో నిమగ్నమయ్యే వారిలో దాదాపు 70% మంది మహిళలే. అయినప్పటికీ ఈ రంగం యొక్క అసంఘటిత స్వభావం కారణంగా వారి పనిని చాలా సార్లు చిన్న చూపు చూస్తున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకారం, 2022–23లో, ఉపాధి హామీ పనులు చేసే శ్రామికుల్లో 57.43% మంది మహిళలు ఉన్నారు.సాధికార మహిళా రైతులువారి కుటుంబాలు, సమాజాల శ్రేయస్సుకు దోహదపడుతుంది. ఆహార కొరత తగ్గుతుంది.అనేక రకాల ఆహారం, పౌష్టికాహారం మరింత మెరుగ్గా అందుతుంది. రైతు కుటుంబాల ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయి.రకరకాల ఒడొదుడుకులను తట్టుకునే శక్తి కుటుంబాలకు పెరుగుతుంది. (చదవండి: సేంద్రియ ఆహార మార్కెట్లకు చోటివ్వండి!) -
రైతన్నపై రుణపాశం!
సాక్షి, న్యూఢిల్లీ, సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కకపోవడం.. ఏ దశలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోకపోవడంతో మోసపోయిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణ బకాయిల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉండటం రాష్ట్రంలో సాగు రంగం దుస్థితి, రైతన్నల కడగండ్లకు నిదర్శనంగా నిలుస్తోంది. పెట్టుబడి సాయం అందకపోవడం.. ఎరువుల కోసం నరకయాతన.. ఉచిత పంటల బీమా అటకెక్కడం.. ఇన్పుట్ సబ్సిడీ ఎగిరిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 20 నెలలుగా పెద్ద ఎత్తున రైతుల బలవన్మరణాలు కలవరపరుస్తున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ఇదే విషయం మరోసారి స్పష్టమైంది. దేశవ్యాప్తంగా రైతుల వ్యవసాయ రుణ బకాయిల్లో ఏపీ రెండో స్థానంలో ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభకు వెల్లడించారు. 55 శాతం రైతు కుటుంబాలకు రుణ సదుపాయంగతేడాది డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ రైతుల వ్యవసాయ రుణ బకాయిలు రూ.3,75,254.59 కోట్లు కాగా ఇందులో పంట రుణ బకాయిలు రూ.2,01,744.41 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.1,73,510.18 కోట్లుగా ఉన్నాయి. గత డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా రైతుల వ్యవసాయ రుణ బకాయిలు రూ.31,34,807.42 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. ఇందులో పంట రుణ బకాయిలు రూ.16,34,219.07 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.15,00,588.35 కోట్లు ఉన్నాయి. నేషనల్ రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే నివేదిక ప్రకారం దేశంలో 55 శాతం వ్యవసాయ కుటుంబాలు క్రెడిట్ సౌకర్యాన్ని పొందుతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. బ్యాంకులకు ప్రాధాన్యతా రంగ రుణ లక్ష్యాలను నిర్దేశించడంతోపాటు కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం కిసాన్, పీఎం ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన లాంటి పథకాలతో రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పంకజ్ చౌదరి చెప్పారు. ఇక తెలంగాణలో వ్యవసాయ రుణ బకాయిలు మొత్తం రూ.1,75,960.56 కోట్లుగా ఉన్నాయి. ఇందులో పంట రుణాలు రూ. 95,167.98 కోట్లు, టర్మ్ రుణాలు రూ. 80,792.58 కోట్లుగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. కాగా రూ.5,06,290.45 కోట్ల వ్యవసాయ రుణ బకాయిలతో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది.అన్నదాతల నోట్లో మట్టి..చంద్రబాబు పాలనలో గత 20 నెలల్లో రాష్ట్రంలో రైతన్నలు అన్ని విధాలుగా మోసపోయారు. తామ అధికారంలోకి వస్తే కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఇచ్చిన హామీని తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు. ఏటా రూ.20 వేల చొప్పున రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.30 వేలు ఎగ్గొట్టి రూ.10 వేలతో సరిపెట్టారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉండగా 6,72,428 మందికి పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో రూ.21,433.46 కోట్లు పెట్టుబడి సాయంగా అందించాల్సి ఉండగా కేవలం రూ.4,685.84 కోట్లు విదిల్చారు. రైతులకు మొత్తం రూ.16,748 కోట్లు సాయాన్ని ఎగ్గొట్టారు.ఉచిత పంటల బీమాను అటకెక్కించి.. ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిచంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాను అటకెక్కించారు. స్వచ్ఛంద నమోదు బీమా అంటూ రైతుల నోట్లో మట్టికొట్టారు. 2023–24 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి రైతుల వాటాతో పాటు ప్రభుత్వ వాటా ప్రీమియం మొత్తం రూ.930 కోట్లు 2024 జూన్‌లో జమ చేయాల్సి ఉండగా, అదే సమయంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఫలితంగా రూ.1,324 కోట్ల బీమా పరిహారం రైతులకు అందకుండా మోకాలొడ్డారు. 2024 ఖరీఫ్ సీజన్లో రైతుల వాటాతో పాటు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.834.44 కోట్లతో పాటు రబీ 2024–25, ఖరీఫ్–2025 సీజన్లలో ప్రభుత్వం తమ వాటా కింద చెల్లించాల్సిన రూ.260.67 కోట్లు ఎగ్గొట్టడంతో రబీ 2025–26 సీజన్లో ఏపీని కంపెనీలు బ్లాక్ లిస్ట్‌లో పెట్టేశాయి. ఇలా రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం రైతులకు అందకుండా చంద్రబాబు సర్కారు దగా చేసింది. మరోవైపు దాదాపు 12 లక్షల మందికి రూ.500 కోట్ల మేర సున్నా వడ్డీ రాయితీ సొమ్మును ఎగ్గొట్టారు. వరుస వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న దాదాపు ఆరున్నర లక్షల మందికి రూ.వెయ్యి కోట్లకు పైగా పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) ఇవ్వకుండా ఎగనామం పెట్టారు.దక్కని ‘మద్దతు’... ఆత్మహత్యలు..మద్దతు ధర దక్కని సమయంలో మార్కెట్లో జోక్యం చేసుకొని రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ఉద్దేశించిన ధరల స్థిరీకరణ నిధిని చంద్రబాబు ఎత్తేశారు. ధాన్యం మొదలు పత్తి, మిరప, ఉల్లి, చీనీ, పొగాకు, టమాటా, పసుపు, పెసర, మినుము, కంది.. ఇలా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక అల్లాడుతున్నా ఆదుకున్న దాఖలాలు లేవు. రైతులకు పైసా సాయం చేసిన పాపాన పోలేదు. పెరిగిన పెట్టుబడి ఖర్చులకు తోడు వరుస వైపరీత్యాలతో సాగు, దిగుబడులు తగ్గిపోయి భారీగా నష్టం వాటిల్లింది. గత 20 నెలల్లో దిగుబడులు తగ్గిపోవడం, మద్దతు ధర కోల్పోయి దాదాపు రూ.35 వేల కోట్లకుపైగా రైతులు నష్టపోయారు. మరోవైపు రైతు ఆత్మహత్యలు కలవరపరుస్తున్నాయి. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది దాదాపు 150 మందికి పైగా చనిపోగా 2025–26లో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలకు ఒడిగట్టినట్లు రాష్ట్ర పోలీస్ శాఖే అధికారికంగా వెల్లడించడం రాష్ట్రంలో రైతన్నల దయనీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. -
అత్యంత విషపూరితమైన గడ్డిమందు పారాక్వాట్..!
అత్యంత విషపూరితమైన (హై అక్యూట్ టాక్సిసిటీ) గడ్డి/కలుపు మందు పారాక్వాట్‌ను నిషేధించాలన్న డిమాండ్ ఊపందుకుంది. దీన్ని 9 పంటల్లో గడ్డి/కలుపు నివారణకు వినియోగించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, 25 పంటల్లో దీన్ని తెలిసో తెలియకో వాడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ మందును చల్లేటప్పుడు జాగ్రత్తలు తగిన రీతిలో తీసుకోకపోవటం వల్ల రైతులు, రైతుకూలీలు ఆ విషప్రభావానికి తీవ్రఅస్వస్థతకు గురై చనిపోతున్నారు. ఈ ప్రమాదకరమైన రసాయనం గాలి ద్వారా పీల్చినా, క్షణికావేశంలో తాగినా, దీన్ని చల్లిన నేలపై నడిచేటప్పుడు ముల్లు గుచ్చుకున్నా శరీరం విషపూరితమవుతుంది. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె దెబ్బతింటాయి. దీని ప్రభావాన్ని అడ్డుకోవటానికి ఇప్పటి వరకు విరుగుడు చికిత్స అందుబాటులో లేదు. ఈ కారణంగా పారాక్వాట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిషేధించాలన్న డిమాండ్ నానాటికీ బలపడుతోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డాక్టర్స్ ఎగెనెస్ట్ పారాక్వాట్ పాయిజన్ సంస్థలు సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌లో పలువురు పాల్గొని నిషేధం కోసం పోరాడతామన్నారు. ఇప్పటికే ఒడిషా, కేరళ రాష్ట్రాల్లో నిషేధించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ నిషేధించాల్సిన అవసరం ఉంది. పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా కొన్ని సంవత్సరాల క్రితమే రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి నిషేధించాలని కోరింది. ఈ నేపథ్యంలో అసలు పారాక్వాట్ కలుపు/గడ్డి మందు పూర్వాపరాలేమిటో తరచి చూద్దాం...పారాక్వాట్ డైక్లోరైడ్.. నాన్–సెలెక్టివ్ కాంటాక్ట్ హెర్బిసైడ్. అంటే.. ఏదో ఒక రకం కలుపు మొక్కనో లేదా ఏవో కొన్ని రకాల కలుపు మొక్కల్నో నిర్మూలించడానికి ఉద్దేశించింది కాదు. ఇది తాకిన అన్ని ఆకుపచ్చ మొక్కల కణజాలాలను చంపుతుంది లేదా దెబ్బతీస్తుంది. వేగంగా పనిచేసే రసాయనం. ఇలాంటి కలుపు మందులు పారిశ్రామిక ప్రాంతాల్లో, రోడ్ల పక్కన చెట్లు, గడ్డిని నియంత్రచడానికి.. తేయాకు, పత్తి, బంగాళాదుంపలు తదితర పంటల్లో కలుపు మొక్కలను తొలగించడానికి పయోగిస్తారు.ఇటువంటి గడ్డి మందులు మొక్కల కణ త్వచాలను నాశనం చేయడం ద్వారా, కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం కలిగించడం ద్వారా ఆ మొక్కలు ఎండిపోయేలా చేస్తాయి. దీనివల్ల గంటల్లోనే మొక్కల భాగాలు వేగంగా, స్పష్టంగా ఎండిపోతాయి, వాడిపోతాయి. పారాక్వాట్‌ను గడ్డి, పెద్ద ఆకులతో కూడిన కలుపు మొక్కలను వేగంగా నాశనం చేయడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు.1964 నుంచి వాణిజ్యపరంగా ఉత్పత్తిపారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందుకు 140 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ప్రపంచంలో అత్యంత విసృతంగా ఉపయోగంలో ఉన్న, వివాదాస్పదమైన కలుపు మందులలో ఒకటి. 19వ శతాబ్దం చివరలో మొదటిసారిగా సంశ్లేషణ చేయబడినప్పటికీ, కలుపును చంపే దీని సామర్థ్యాన్ని 20వ శతాబ్దం మధ్యలో మాత్రమే గుర్తించారు. ఆస్ట్రియన్ రసాయన శాస్త్రవేత్తలు హ్యూగో వీడెల్, ఎం. రస్సోలు 1882లో మొదట అయోడైడ్ ఉప్పుగా సంశ్లేషణ చేశారు. 1955లో ఇంగ్లాండ్‌లోని ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్ (ఐఇఐ) శాస్త్రవేత్తలు వ్యవసాయ రసాయనంగా దాని సామర్థ్యాన్ని గుర్తించారు. 1962 నుంచి వాణిజ్య పరంగా ఉత్పత్తి చెయ్యటం ్ర΄ారంభమైంది. 1964 మొదట అమెరికాలో పురుగుమందుగా ఉపయోగించడానికి నమోదైంది. 1970 దశకం చివరలో మెక్సికన్ గంజాయి పొలాలపై పారాక్వాట్‌ను అమెరికా స్ప్రే చేయించింది. 1985లోజూన్లో వెండింగ్ మెషిన్ ద్వారా విక్రయించిన పానీయాలలో ఈ రసాయనం కలవటం ఫలితంగా కనీసం 10 మంది మరణించారు. 2007లో నిషేధించిన ఈయూఅమెరికా 1978లో పారాక్వాట్‌ను అధిక విషపూరిత స్వభావం కారణంగా గుర్తించి, పరిమితంగా వాడే పురుగుమందుగా వర్గీకరించింది. 1980–90 దశకాల్లో అనేక దేశాలు దీన్ని నియంత్రించటం ప్రారంభించాయి. పారాక్వాట్ వల్ల ప్రజారోగ్యానికి తీరని హాని జరుగుతోందని స్వీడన్, తదితర ఐరోపా దేశాలు పట్టుబట్టటంతో 2007లో యూరోపియన్ యూనియన్ నిషేధించింది. ప్రస్తుతం చైనా (దేశీయ వినియోగం మాత్రమే), బ్రెజిల్, థాయిలాండ్‌తో సహా 70కి పైగా దేశాల్లో పారాక్వాట్ గడ్డి మందు వాడకాన్ని నిషేధించాయి లేదా దశలవారీగా వాడకాన్ని నిలిపివెయ్యటానికి నిర్ణయాలు తీసుకున్నాయి. అయినప్పటికీ అమెరికాతో పాటు భారత్ సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇప్పటికీ విస్తృతంగా ఉపయోగిస్తూనే ఉన్నారు.అమెరికాలో త్వరలో ఉత్పత్తి నిలిపివేతపారాక్వాట్ గడ్డి మందు ప్రభావానికి గురైన వారికి పార్కిన్సన్స్ వ్యాధి వస్తోందని నమ్ముతున్నారు. దీని తయారీదారులపై ప్రస్తుతం అమెరికాలో వేలాది వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ నాటికి పారాక్వాట్ గడ్డి మందు తయారీని నిలిపివేస్తానని సింజెంట బహుళ జాతి కంపెనీ ప్రకటించినట్లు ద గార్డియన్‌లో తాజాగా కథనం ప్రచురితమైంది. ఈ నిర్ణయం ప్రజారోగ్యంలో ఒక మైలురాయి వంటిదని ఫ్లోరిడా యూనివర్సిటీలోని ఫిక్సెల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ మైఖేల్ ఓకున్ వ్యాఖ్యానించారు. యూరప్ దేశాలు సహా అనేక దేశాలు నిషేధించినప్పటికీ అమెరికాలో సోయాబీన్స్, పత్తి, మొక్కజొన్న, ద్రాక్ష, పిస్తా, వేరుశనగ వంటి ఎన్నో పంటల్లో ఇప్పటికీ దీన్ని వాడుతూనే ఉన్నారు.భారత్‌లో పరిస్థితులుభారతదేశంలో పారాక్వాట్ డైక్లోరైడ్ వాడకాన్ని నిషేధించాలన్న డిమాండ్ ప్రబలంగా ఉంది. దీన్ని ఉపయోగించడానికి జాతీయ స్థాయిలో అనుమతి ఉంది. అయినప్పటికీ.. దీని అత్యధిక విషపూరిత స్వభావం, దీన్ని తాగటం ద్వారా ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య పెరుగుతుండటంతో ఒడిషా, కేరళ వంటి రాష్ట్రాలు నిషేధించాయి. ఒడిశా రాష్ట్రంలో ΄ారాక్వాట్ అమ్మకం, పంపిణీ, వాడకంపై నిషేధం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2023 చివరిలో నిషేధించింది. ప్రతి ఆరు నెలలకోసారి నిషేధాన్ని పొడిగిస్తోంది. కేరళ గతంలో నిషేధాన్ని అమలు చేసింది. కానీ, పురుగుమందుల తయారీదారులు చట్టబద్ధంగా సవాలు చేసిన తర్వాత 2022లో దాన్ని రద్దు చేసింది.ఈ నేపధ్యంలో తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పారాక్వాట్ విష ప్రభావంతో వందలాది మంది మరణిస్తున్నందున దీన్ని నిషేధించాలని పిటిషనర్లు కోరుతున్నారు. కలుపు మందుపై మీ వైఖరేమిటో వివరించమని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.9 పంటలకే అనుమతిపారాక్వాట్ కలుపు మందును టీ, కాఫీ, పత్తితో సహా తొమ్మిది నిర్దిష్ట పంటలపై మాత్రమే ఉపయోగించడానికి కేంద్ర క్రిమిసంహారకాల బోర్డు రిజిస్ట్రేషన్ కమిటీ అనుమతించింది. అయితే, దేశంలో 25 రకాల పంటలపై ఉపయోగించబడుతున్లట్లు పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా సర్వే నివేదికలు సూచిస్తున్నాయి. ఇలా వాడటం భారతీయ క్రిమిసంహారకాల చట్టాన్ని ఉల్లంఘించటమే. భారత దేశంలో 1,500 కంటే ఎక్కువ తయారీ యూనిట్లు పారాక్వాట్‌ను ఉత్పత్తి చేయడానికి లైసెన్స్ పొందగా, వీటిలో 35 ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నియమించిన అనుపమ్ వర్మ కమిటీ 2015లో పారాక్వాట్‌ను సమీక్షించి, ‘కఠినమైన పరిమితులు’, మెరుగైన ప్యాకేజింగ్ పద్ధతులు పాటిస్తూ వినియోగాన్ని కొనసాగించడానికి అనుమతించింది. అయితే ఈ చర్యలు సమర్థంగా అమలు కావటం లేదని నిపుణులు వాదిస్తున్నారు.సైనైడ్ కన్నా ప్రమాదకరంవైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు పారాక్వాట్‌ను ‘సైనైడ్ కంటే ప్రమాదకరమైనది‘ అని అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే దీనికి విరుగుడు లేదు. అందువల్ల పొలాల్లో దీన్ని పిచికారీ చేసే క్రమంలో దాని విషప్రభావానికి గురైన వారు లేదా దీన్ని క్షణికావేశంలో తీసుకున్న వారికి చికిత్స చేసి రక్షించటం కష్టసాధ్యమైంది. దీంతో మరణాలు రేటు పెరుగుతోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వంటి వైద్య సంఘాలు దీన్ని వెంటనే పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి.దేశవ్యాప్తంగా నిషేధించాలిపారాక్వాట్ వంటి అత్యంత విషతుల్యమైన వ్యవసాయ రసాయనాల వాడాకాన్ని వదిలించుకోవడానికి, వాటి వల్ల కలిగే హానిని నిలువరించటానికి పనిచేస్తున్నాం. క్లోర్‌పైరిఫోస్, ఫి్ర΄ోనిల్ పురుగుమందులు, అలాగే అట్రాజిన్, పారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందులపై అధ్యయనం చేశాం. పారాక్వాట్‌ను 9 పంటల్లో వాడటానికి ప్రభుత్వ అనుమతి ఉంటే 25 పంటల్లో వాడుతున్నట్లు మా అధ్యయనంలో తేలింది. దీన్ని వాడే క్రమంలో చాలా మంది దీని విషప్రభావానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని క్షణికావేశంలో తాగి ఆత్మహత్యల పాలవుతున్న రైతులు, రైతు కూలీల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్రాథమికంగా ప్రాణాలను చంపడానికి రూపొందించబడిన పురుగుమందుల దీర్ఘకాలిక పరిణామాలను రైతులు, వినియోగదారులు అర్థం చేసుకోవాలి. పురుగుమందుల హానికరమైన ప్రభావాలపై శాస్త్రవేత్తలు మరింత పరిశోధన చేయాలి. విధాన నిర్ణేతలు కూడా తమ అవగాహనను పెంచుకోవాలి. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ఈ విష రసాయనాలను నియంత్రించడంపై దృష్టి పెట్టాలి. వాతావరణ మార్పుకు ప్రధాన కారకాల్లో విధ్వంసక పురుగుమందులు కూడా ఉన్నాయి. అత్యంత విషతుల్యమైన పారాక్వాట్ గడ్డి మందును దేశవ్యాప్తంగా నిషేధించాలి. – డాక్టర్ దొంతి నరసింహారెడ్డి, విధాన నిపుణుడు, పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా స్టీరింగ్ కమిటీ సభ్యుడు -
ఆహార వృథాను అరికట్టే ‘అర్క ట్రైసైకిల్’
ఎండలు ఏటేటా అంతకంతకూ మండిపోతున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తోపుడు బండ్ల ద్వారా వినియోగదారుల ఇళ్ల దగ్గరకు తెచ్చి చిరు వ్యాపారులు (కొందరు సేంద్రియ / ప్రకృతి వ్యవసాయదారులు కూడా) అమ్ముతూ ఉంటారు. అయితే, ఇలా పండిన పంట తినేవారి ఇంటికి చేర్చే లోగా రోజువారీగా 10–15% వరకు ఎండకు వడపడి, రంగు మారి, దుమ్మూ ధూళి పడి పాడైపోయి వృథా అవుతున్నాయని అంచనా. ఈ వృథాను అరికట్టగలిగితే విలువైన ఆహారం వృథా కాకుండా ఉంటుంది. రిటైల్ విక్రయదారుల ఆదాయమూ పెరుగుతుంది. సాధారణ తోపుడు బండ్ల వల్ల జరిగే ఈ నష్టాన్ని అరికట్టడానికి బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) సౌర విద్యుత్తుతో నడిచే ట్రైసైకిల్‌ను రూపొందించింది. దీనికి ‘అర్క ట్రైసైకిల్’ అని పేరు పెట్టారు (కర్ణాటకలో ‘అర్కావతి’ నది ఒడ్డున ఐఐహెచ్ఆర్ ఉంది. అందుకే ఈ సంస్థలో రూపొందే కొత్త వంగడాలు, ఇతర ఉత్పత్తులకు కూడా ముందు అర్క అని పెడుతూ ఉంటారు. అర్క అని ఏ వంగడం, ఉత్పత్తి పేరులో ఉంటే అది బెంగళూరు ఐఐహెచ్ఆర్ అభివృద్ధి చేసిందని తెలుసుకోవచ్చు). అందంగా, సౌకర్యవంతంగా ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ ట్రైసైకిల్.. సౌర విద్యుత్తుతో నడుస్తుంది. ఇందులో ఉంచే కూరగాయలు, పండ్లు తదితర ఉత్పత్తులు పాడైపోకుండా ఉష్ణోగ్రత, తేమలను ‘ఎవాపరేటివ్ కూలింగ్’ పద్ధతిలో నియంత్రించవచ్చు. కూరగాయల బరువుతో కూడిన తోపుడు బండిని నెట్టుకుంటూ వెళ్లే చాకిరీని అర్క ట్రైసైకిల్ చాలా వరకు తగ్గిస్తుంది. సాధారణ తోపుడు బండితో తిరిగే ప్రాంతాల కన్నా ట్రైసైకిల్ ద్వారా ఎక్కువ ప్రాంతాల్లో వేగంగా తిరుగుతూ.. తక్కువ కాలంలోనే ఎక్కువ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. సౌర విద్యుత్తు ద్వారా చల్లగాలి ప్రసరించే ఏర్పాటు ఉండటం వల్ల అర్క ట్రైసైకిల్ ద్వారా తీసుకెళ్లే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పుట్టగొడుగులను కోత తర్వాత 36–48 గంటల పాటు తాజాగా ఉంచుకుంటూ అమ్ముకోవడానికి వీలవుతుంది. తక్కువ కష్టంతో తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాంతాల్లో ట్రైసైకిల్ తిరుగుతుంది. కూరగాయలు, పండ్లు, ఆకుకూరల నాణ్యత, నిల్వ సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన వ్యవసాయోత్పత్తులను నాణ్యంగా, తాజాగా వినియోగదారుల ఇళ్లకు తీసుకెళ్లి ఇవ్వటం అర్క ట్రైసైకిల్ వల్ల సాధ్యమవుతుందని దీన్ని రూపొందించిన ఐఐహెచ్ఆర్ ప్రధాన శాస్త్రవేత్త డా. జి. సెంథిల్ కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. అర్క ట్రైసైకిల్ ప్రత్యేకతలుభారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఏఆర్) కు అనుబంధ సంస్థ అయిన బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) రూపకల్పన చేసినది. దీని పైనే సౌర ఫలకాలు ఉంటాయి. ఎండలో తిరిగేటప్పుడే బ్యాటరీ చార్జ్ అవుతూ ఉంటుంది. ఆ శక్తితోనే ట్రైసైకిల్ నడుస్తుంది. దీన్ని నడిపే వ్యక్తి సైకిల్ తొక్కనవసరం లేదు. నెట్టుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ కష్టం తప్పుతుంది. బ్యాటరీ ఫూర్తిగా చార్జి అయితే 50 కిలోమీటర్ల దూరం నిరాటంకంగా ప్రయాణిస్తుంది.ఇందులో 20 ప్లాస్టిక్ క్రేట్స్‌ను పెట్టుకునే ఏర్పాటు ఉంది. ఒక్కో క్రేట్లో 10 కిలోల సరుకును పెట్టవచ్చు. 200 కిలోల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పుట్టగొడుగులను తీసుకెళ్లవచ్చు.సౌరవిద్యుత్తుతో ఎవాపరేటివ్ కూలింగ్ సిస్టం ద్వారా గాలిని చల్లబరిచి ఈ ట్రైసైకిల్లోని పచ్చి సరుకు పాడవకుండా ఉండేందుకు సరిపోయే చల్లదనాన్ని ఇచ్చే వ్యవస్థ ఉంది. రాత్రి పూట అమ్మకాలు చేయడానికి వీలుగా ఎల్ఇడి బల్బులు ఉన్నాయి. డిజిటల్ కాటా ఉంది. ప్రజలకు వినిపించేలా ఉత్పత్తుల వివరాలు పెద్దగా వినపడేలా చెప్పడానికి సోలార్ విద్యుత్‌తో నడిచే మైక్ ఉంటుంది. మబ్బులున్నప్పుడు దీన్ని విద్యుత్‌తో చార్జ్ చేసుకోవచ్చు.వినియోగదారుల భద్రత కోసం ఆటోమేటిక్‌గా శానిటైజర్ పరికరం ఉంది. తోపుడు బండ్ల వ్యాపరులకు కూరగాయలు, పండ్ల వృథాను తగ్గించుకొని అధిక ఆదాయం పొందేందుకు ట్రైసైకిల్ ఉపయోగపడుతుంది. తమ ఇళ్ల దగ్గరకే వచ్చి పరిశుభ్రంగా, తాజాగా ఉండే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పుట్టగొడుగులు అమ్ముతున్నందున అర్క ట్రైసైకిల్ పట్ల వినియోగదారులు ఆకర్షితులవుతారు. అర్క ట్రైసైకిల్ ధర రూ. లక్షన్నర. తోపుడు బండిపై అమ్మితే వృథా అయ్యే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ట్రైసైకిల్ ద్వారా నిక్షేపంగా అమ్ముకోవచ్చు కాబట్టి రెండేళ్లలో దీని ఖర్చును తిరిగి రాబట్టుకోవచ్చు. నిర్వహణ పతంగి రాంబాబుసాక్షి, సాగుబడి డెస్క్(చదవండి: జస్ట్ మూడు నెలల్లో 14 కిలోలు బరువు తగ్గాలంటే..!) -
ఎవుసానికి ఏఐ ఊపు!
కృత్రిమ మేధ (ఏఐ).. ఇప్పుడు ఏ రంగం చూసినా దీని ప్రభావానికి ఆవల లేదు. అందుకు వ్యవసాయ రంగం కూడా మినహాయింపు కాదు. ‘అందరి సంక్షేమం–అందరి సంతోషం’ కోసం ఏఐని వినియోగించుకునే కృషి ఊపందుకుంది. ఈ దిశగా జరిగే కృషిలో ‘ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. 135 దేశాల ఏఐ నిపుణులు, ఆవిష్కర్తలు, సీఈవోలు పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మక ఏఐ శిఖరాగ్రసభ వివిధ రంగాలను ప్రభావితం చేస్తున్న ఏఐ సాంకేతికతలను వెలుగులోకి తెచ్చింది. మన రైతులకు ఉపయోగపడే 26 ఉత్తమ కృత్రిమ మేధ ఆధారిత వ్యవసాయ ఆవిష్కరణలను భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఎంపిక చేసి, సంకలనాన్ని వెలువరించింది. రైతులోకం ఆదరణ పొందుతున్న మహిళల సార«థ్యంలోని ఏఐ వ్యవసాయ సంబంధ ఆవిష్కరణలపై ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి సాగుబడి’ స్పెషల్ ఫోకస్...కార్బన్ డేటాకు ఏఐ సొబగుఆర్మ్స్4 ఏఐ... వరి సాగులో వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు తడి పొడి నీటిపారుదల (ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రయ్యింగ్– ఎ.డబ్ల్యూ.డి.) పద్ధతి ఉపయోగపడుతుంది. నీటిని నిరంతరాయంగా నిల్వగట్టకుండా వరి పంటకు అవసరమైనప్పుడు తగినంతగా నీరు అందిస్తూ ఉండే పద్ధతి ఇది. హరిత గృహ వాయువు అయిన మీథేన్ వాయువు తీవ్రతతో పాటు ఎరువులు, సాగునీరు వినియోగం ఎ.డబ్ల్యూ.డి. పద్ధతి వరి సాగులో తక్కువగా ఉంటుంది. దిగుబడుల్లో రాజీ పడకుండా ఎ.డబ్ల్యూ.డి. పద్ధతిలో వరి సాగు చేసే రైతులకు కర్బన ఉద్గారాలను తగ్గించినందుకు ‘కార్బన్ క్రెడిట్లు’ ఇస్తారు. ఈ కార్బన్ క్రెడిట్లను వాతావరణాన్ని కలుషితం చెయ్యక తప్పని పరిశ్రమల యజమానులు కొనుగోలు చేస్తారు. ఆ విధంగా ఈ రైతులకు కొంత ఆదాయం కూడా వస్తుంది. అయితే, ఎ.డబ్ల్యూ.డి. పద్ధతిని పాటించే ప్రతి పొలంలో క్రమం తప్పకుండా అన్ని వివరాలను, గణాంకాలను ఆధార సహితంగా నమోదు చెయ్యాల్సి ఉంటుంది. ఆ డేటాను థర్డ్‌పార్టీ వెరిఫికేషన్ తర్వాత కార్బన్ క్రెడిట్స్ మంజూరు చేస్తారు. అయితే, ఇక్కడే చిక్కంతా ఉంది. మన దేశంలో వరి రైతుల్లో కూడా అత్యధికులు చిన్న, సన్నకారు రైతులే. 'క్షేత్రస్థాయిలో సెన్సార్లు ఏర్పాటు చేసి, (వారానికి/ నెలకోసారి) తరచూ గణాంకాలను ప్రతి పొలంలోనూ నమోదు చేసే ప్రక్రియ (దీన్ని మానిటరింగ్, రిపోర్టింగ్, వెరిఫికేషన్– ఎం.ఆర్.వి. అంటారు) అత్యంత కష్టతరమైనది, వ్యయప్రయాసలతో కూడినది కూడా! ఈ సమస్యను అధిగమించేందుకు ఢిల్లీకి చెందిన ‘ఆర్మ్స్ 4 ఏఐ’ అనే స్టార్టప్ నూటికి నూరుశాతం ఉపగ్రహాలను ఉపయోగించి అత్యంత విశ్వసనీయమైన, ఆధారపడదగిన, సరిచూడదగిన డేటాను సేకరించే కృత్రిమ మేధతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ‘జియో ఏఐ – ఆధారిత డిజిటల్ ఎంఆర్వీ’ అని దీన్ని వ్యవహరిస్తున్నారు. ఈ పద్ధతిలో వరి పొలంలో నీటి తేమ, మీథేన్ స్థాయి వంటి వివరాల సేకరణకు ఎటువంటి సెన్సార్లను పెట్టాల్సిన పని లేదు. ఒక రైతు పొలం చిన్నదైనా, పెద్దదైనా, ఎన్ని పొలాల్లో అయినా ప్రతి రోజూ అధిక రెజొల్యూషన్‌తో కూడిన ఎర్త్ అబ్జర్వేషన్ చిత్రాలను సేకరించి, విశ్లేషించటం ద్వారా నమ్మదగిన డేటాను సేకరిస్తోంది. ఆర్మ్స్ 4 ఏఐ మొదట్లో 200 హెక్టార్ల వరి పొలాలతో ప్రారంభించి ఇప్పటికే 40 వేల హెక్టార్లలోని ఎ.డబ్ల్యూ.డి. వరి పొలాల్లో సేవలందిస్తోందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాగృతి దబస్ తెలిపారు. నెలకోసారి క్షేత్రస్థాయి గణాంకాలు సేకరించే పాత పద్ధతికి బదులు కొన్ని నిమిషాలకోసారి డేటాను తక్కువ ఖర్చుతోనే నమోదు చేసే అవకాశం తమ ఏఐ ఆధారిత సాంకేతికత వల్ల సాధ్యమైందని ఆమె తెలిపారు. ఆపరేషనల్ రిలయబిలిటీ అధికం కాబట్టి ఆడిటర్లు, కార్బన్ క్రెడిట్ల బయ్యర్లకు విశ్వసనీయత ఎక్కువగా ఉంటుందని జాగృతి వివరించారు.ఏఐ ఆధారిత డిజిటల్ బిడ్డింగ్అ΄్జావో ఆగ్రోటెక్... వరి ధాన్యం నుంచి పప్పుధాన్యాలు, చిరుధాన్యాల వరకు అమ్ముకునే సమయంలో రైతులు నానా కష్టాలు పడుతుంటారు. గుజరాత్‌కు చెందిన అ΄్జావో ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ధాన్యాల నాణ్యతా నిర్ధారణను ఆధునీకరించేందుకు కృత్రిమ మేధ ఆధారిత యంత్రాలను, వీటికి అనుసంధానంగా డిజిటల్ బిడ్డింగ్ సదుపాయాలను కూడా రూపొందించింది. వరి, పప్పుధాన్యాల నాణ్యతను కేవలం నిమిషంలో పది కోణాల్లో నిర్ధారించి, నివేదికలను డిజిటల్ ΄్లాట్‌ఫామ్‌లో ఈ యంత్రాలు నిమిషంలో నమోదు చేస్తాయి. చెయ్యటంతోపాటు ఎక్కడ, ఏ రైతు వాటిని పండించారనే కచ్చితమైన ట్రేసబిలిటీ సమాచారాన్ని అందిస్తాయి. ఏఐ ఆధారిత సాంకేతికతలకు గాను ఈ సంస్థకు రెండు పేటెంట్లు లభించాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఈ సాంకేతికతలకు ఆమోదం తెలిపింది. ఈ ఏఐ–ఆధారిత ధాన్యం విశ్లేషణా యంత్రం తేమ, శిలీంధ్రాలు, మచ్చలు తదితర పది అంశాలకు సంబంధించి ధాన్యాల నాణ్యతను నిష్పాక్షికంగా అంచనా వేస్తుంది. నాణ్యత గ్రేడ్ల ఆధారంగా ధర నిర్ణయానికి తోడ్పడుతూ బయ్యర్లను, రైతులను నేరుగా అనుసంధానిస్తుంది. ధాన్యాల నాణ్యతా విశ్లేషణ, ట్రేసబిలిటీ ద్వారా కోత అనంతర విలువ గొలుసు వాణిజ్య లావాదేవీలను కృత్రిమ మేధతో ఆధునీకరించిన ఘనత తమదని అ΄్జావో ఆగ్రోటెక్ సహ వ్యవస్థాపకురాలు నీరజా మెహతా చె΄్పారు. డిజిటల్ ఓపెన్–మార్కెట్ ట్రేడింగ్ ΄్లాట్‌ఫామ్‌ను కూడా అ΄్జావో సంస్థ ఏర్పాటు చేసింది. డిజిటల్ బిడ్డింగ్ ద్వారా రైతులు ఏ సమయంలోనైనా ఏ నమోదిత వ్యాపారికైనా ఉత్పత్తులను విక్రయించడానికి వీలవుతుంది. రైతు మెరుగైన ధరకు అమ్ముకునే అవకాశాలను మెరుగుపరుస్తుంది. పరాఖ్ ΄్లాట్‌ఫామ్ ద్వారా ఓపెన్ డిజిటల్ ట్రేడింగ్‌ను మొట్టమొదటిగా వరి, సజ్జ ధాన్యాలను 300 మందికి పైగా గుజరాత్ రైతులు సుమారు రూ. 5 కోట్ల మేర అమ్మకాలు చేశారు. డిజిటల్ ట్రేడ్‌లో ఎక్కడెక్కడి నుంచో వ్యాపారులు పోటీ పడతారు. ధర విషయంలో పారదర్శకత ఏర్పడుతుంది. స్థానిక బ్రోకర్లు మోసం చెయ్యలేరు. తత్ఫలితంగా రైతులు 7% అధిక ధర పొందగలిగారు. గుజరాత్ సహకార శాఖ ధాన్యం కొనుగోళ్లలో కూడా ఈ ఏఐ ఆధారిత గ్రెయిన్ క్వాలిటీ అసెస్మెంట్ మిషన్లను వాడారు. సుమారు 500 మంది రైతులకు చెందిన 32 వేల పైచిలుకు ధాన్యపు బస్తాలను దాదాపు రూ. పది కోట్లకు విక్రయించారు. రైతులకు 5% అదనపు ఆదాయం వచ్చిందని నీరజా మెహతా వివరించారు.లక్షలాది రైతుల చేతుల్లో ‘ఫార్మర్‌చాట్’డిజిటల్ గ్రీన్ ట్రస్ట్.. లాభాపేక్షలేని అంతర్జాతీయ సాంకేతిక స్వచ్ఛంద సంస్థ. 17 ఏళ్ల అనుభవం గల ఈ సంస్థ రూపొందించిన ఏఐ అడ్వయిజరీ ΄్లాట్‌ఫామ్ ‘ఫార్మర్‌చాట్’. 4 లక్షల భారతీయ రైతులతో పాటు కెన్యా, నైజీరియా, ఇథియోపియా, బ్రెజిల్లో దాదాపు 10 లక్షల మంది వ్యవసాయదారులు, పశుపోషకులు, విస్తరణ సిబ్బంది, ఎఫ్పీఓలు, స్వయం సహాయక బృందాల సభ్యులు ఇప్పటికే దీని ద్వారా సలహాలు, సూచనలు పొందుతున్నారు. తమ పంటలు, పశువులకు సంబంధించిన ఫొటోలను రైతులు అప్లోడ్ చేసి స్థానిక భాషలో ప్రశ్నలు అడిగితే.. రైతులకు స్థానిక భాషలోనే వాయిస్, టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా, వారికి అత్యంత అవసరమైన సమయంలో మార్గదర్శనం చెయ్యటం ఈ మొబైల్ యాప్ ప్రత్యేకత. తాజా వాతావరణ స్థితిగతులతో పాటు, స్థానిక పరిస్థితులకు అనుగుణమైన చర్యలపై ‘ఫార్మర్‌చాట్’ సమాచారాన్నిస్తోంది. చిన్న, సన్నకారు రైతుల అనుభవాల ఆధారంగా రూపుదిద్దుకున్న ‘ఫార్మర్‌చాట్’ డిజిటల్ విప్లవపు కొత్త శకానికి నిదర్శనమని డిజిటల్ గ్రీన్ ట్రస్ట్ ఇండియా సీఈఓ నిధి భాసిన్ తెలిపారు. మన దేశంలో 15 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతు కుటుంబాలుంటే వారిలో 58%కి సరైన విస్తరణ సేవలందటం లేదన్నారు. ఈ కొరత తీర్చటానికి కృషి చేస్తున్నామన్నారు. ఫార్మర్‌చాట్ జెనెరిక్ ఏఐ అవుట్పుట్స్పై యాంత్రికంగా ఆధారపడదని, అనుభవజ్ఞులైన వ్యవసాయ నిపుణుల అనుభవాలపై ఆధారపడి సూచనలు ఇస్తుందన్నారు. సంప్రదాయ విస్తరణ వ్యవస్థలో ఒక్కో రైతుపై 35 డాలర్లు ఖర్చు చేస్తుండగా, తాము కేవలం ఒక డాలర్ ఖర్చుతోనే సేవలందిస్తున్నామన్నారు. ఒక సర్వే ప్రకారం.. 74% మంది రైతులు ఫార్మర్‌చాట్ సూచనలు చాలా బాగా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. 83%మంది సులువుగా సమాచారం తెలుసుకుంటున్నామన్నారు. 80% మంది సమగ్రంగా ఉన్నాయన్నారు. ఎరువులు, చీడపీడలు, పశుపోషణ సూచనలను 60%మంది రైతులు ఆచరిస్తున్నారు.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
వర్జిన్ కోకోనట్‌తో వండర్స్..!
సాధారణ కొబ్బరి తోటను ఒక అద్భుతమైన ‘సూపర్ ఫుడ్’ ఉత్పత్తి కేంద్రంగా, వ్యవసాయ పర్యాటక స్థలంగా మార్చవచ్చా? నిస్సందేహంగా అంటున్నాడు గోవాకు చెందిన యువ రైతు పారిశ్రామికవేత్త రోహన్. తన తండ్రి నాటిన తోట అది. కొబ్బరి కాయలను మాత్రమే అమ్మేవారు. కరోనా తర్వాత ఈ ఫామ్‌పై దృష్టి సారించిన రోహన్ ఈ తోట రూపు రేఖలు మార్చేశారు. ఐదేళ్లలో తన కలను సాకారం చేసుకున్నారు. కొబ్బరి కాయలు, బోండాలు అమ్మే చోట.. కొబ్బరి పాల నుంచి ప్రత్యేక పద్ధతిలో ‘వర్జిన్ కోకోనట్ ఆయిల్’ను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. చెట్టుకు కాసే కాయ నుంచి వర్జిన్ కొబ్బరి నూనె తయారీ వరకు చేసే పనులను స్వయంగా చూడాలనుకునే వారికి ఫామ్ విజిట్‌కు ఆహ్వానిస్తున్నారు. పనిలో పనిగా సంప్రదాయ గోవా గ్రామీణ వంటకాలను రుచిచూపిస్తున్నారు. ఇటు వ్యవసాయ పర్యాటకం, అటు ఆరోగ్యదాయకమైన నూనె ఉత్పత్తితో మంచి ఆదాయం గడిస్తున్న రోహన్ యువ కొబ్బరి ‘రైతు పారిశ్రామిక వేత్త’గా ఆదర్శప్రాయుడయ్యారు. కొబ్బరైనా మరొకటైనా కేవలం పండించి ముడిసరుకుగా అమ్మజూపితే రైతుకు దక్కేది మార్కెట్ ధరలో కొంచమే. రూపం మార్చి, కొంచెం వ్యాపార దృష్టిని కలిపి అమ్మటం నేర్చుకుంటేనే రైతుకు ఆర్థిక భద్రత, సుస్థిరత చేకూరుతుంది. రైతులు ఆర్ధికంగా నిలబెట్టే మెలకువలు బోధించే నిపుణులు చెబుతుండే ఈ సూత్రాన్ని తు.చ. తప్పకుండా పాటించారు రోహన్. మైక్రోబయాలజిస్ట్‌గా శిక్షణ పొందిన రోహన్ ఎంబీఏ పూర్తిచేసి 2021 వరకు బెంగళూరులో వివిధ సంస్థల్లో దశాబ్దానికి పైగా పనిచేశాడు. కరోనా తర్వాత కుటుంబానికి చెందిన సంప్రదాయ కొబ్బరి తోటపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి గుణాత్మకమైన మార్పు సాధించారు. ఉత్తర గోవాలోని ముల్గావ్ అనే గ్రామంలోని ఒక చిన్న కొబ్బరి తోట వారిది. ఆరోగ్య స్పృహతో కూడిన వర్జిన్ కొబ్బరి నూనె బ్రాండ్‌ను నిర్మించాడు. శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెస్ చేసి వర్జిన్ కొబ్బరి నూనెను ఉత్పత్తి చేస్తున్నారు. స్థానికులకు జీవనోపాధిని కల్పిస్తున్నారు. సాధారణ కొబ్బరి కాయలను ఉత్పత్తి చెయ్యటానికి బదులు సమాజానికి ఔషధగుణాలు కలిగి ఉండే వర్జిన కొబ్బరి నూనెను గౌరవప్రదంగా ఎలా ఉత్పత్తి చేసి లాభదాయకంగా ఎలా అమ్మొచ్చో తెలియజెబుతున్నారు. ‘నిదానంగా తయారు చేసిన నిజమైన ఆహారం’ గురించి తెలుసుకోవాలనుకునే వారికి చక్కటి వ్యవసాయాధారిత పరిశ్రమను కళ్ల ముందుంచుతున్నారు. నూనె ఉత్పత్తికి ఆరు గంటలు.. ఆ తోటలో రోహన్ తండ్రి చాన్నాళ్ల క్రితం నాటిన దాదాపు 200 ఎత్తుగా ఎదిగిన కొబ్బరి చెట్లు ఉన్నాయి. 150కి పైగా లేత మొక్కలున్నాయి. సాధారణ కొబ్బరి నూనె తలకు రాసుకునే నూనెగా, కొన్ని సార్లు వంట నూనెగా ఉపయోగించడానికి మించి ప్రజలకు మేలైన ఆరోగ్యాన్నందించే సూపర్‌ఫుడ్‌గా అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని అతను నమ్మాడు. కొబ్బరి పాలతో తయారు చేసే వర్జిన్ కొబ్బరి నూనె రూపంలోకి మార్చటానికి రోహన్ వ్యక్తిగత శ్రద్ధతో కృషి చేశారు. పచ్చి కొబ్బరి నుంచి పాలు తీసిన తర్వాత, ఆ పాల నుంచి ట్రేడ్‌మార్క్ చేసిన ‘హాట్ ఎక్స్ట్రాక్షన్ యాంటీఆక్సిడెంట్ లాడెన్’ పద్ధతిలో పోషకాలు పోకుండా నెమ్మదిగా నూనెను వెలికి తీస్తారు. ఈ ప్రక్రియకు 6 గంటల సమయం పడుతుంది. ఫలితంగా నూనె సహజంగా యాంటీఆక్సిడెంట్లు, లారిక్ ఆమ్లంతో సమృద్ధిగా ఉంటుంది. తల్లి పాలలో ఉండే ముఖ్యమైన కొవ్వు ఆమ్లం, దాని యాంటీమైక్రోబియల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది.మోస్తరు వేడితో నష్టం లేదు‘ఈ ప్రక్రియలో మోస్తరు వేడిని ఉపయోగించటం వల్ల నష్టమేమీ లేదు. విపరీతమైన వేడిని వాడితే నష్టం. స్వచ్ఛతను, విశిష్టతను కాపాడుతూ సూపర్ ఫుడ్‌ని ఉత్పత్తి చేస్తున్నాం’ అని రోహన్ వివరించాడు. ఈ తోటలో దేన్నీ వృథాగా పారెయ్యటం లేదు. కొబ్బరి పొట్టును చెట్ల కింద ఆచ్ఛాదనగా వేస్తున్నారు. ఈ పంట వ్యర్థం తిరిగి మట్టిలోకి చేరుతోంది. కొబ్బరి పెంకులను యాక్టివేటెడ్ కార్బన్‌గా మార్చి తిరిగి వినియోగిస్తున్నారు. నూనె ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే పిప్పితో వర్మీకం΄ోస్టు తయారు చేస్తున్నారు. కొబ్బరిలోని ప్రతి భాగం పర్యావరణ వ్యవస్థలో పాత్ర పోషించేలా చూసుకోవడమే లక్ష్యమని రోహన్ చెప్పారు.రోజూ ఒక చెంచా.. ‘వర్జిన్ కొబ్బరి నూనె పొట్ట ఆరోగ్యం, జీవక్రియ, కొలెస్ట్రాల్ నిర్వహణకు తోడ్పడుతుంది. దానిలోని యాంటీఆక్సిడెంట్లు, ప్రయోజనకరమైన మీడియం–చైన్ ఫ్యాటీ యాసిడ్ అయిన లారిక్ యాసిడ్ ఇందుకు ప్రధాన కారణం. అందుకే ప్రతి రోజూ ఒక చెంచా వర్జిన్ కొబ్బరి నూనెను తీసుకుంటే ఆరోగ్యం..’ అంటారు రోహన్. ‘నేను వర్జిన్ కొబ్బరి నూనె తీసే పని చేస్తాను. కొబ్బరి కాయల నుంచి కొబ్బరి తీసి ముక్కలు చేసి రుబ్బుతాం. అందులో నుంచి తర్వాత ΄ాలు తీస్తాం. ఇది దాదాపు ఆరు గంటల పాటు నెమ్మదిగా జరిగే ప్రక్రియ’ అని ఒక కార్మికుడు చె΄్పారు.వ్యవసాయ పర్యాటకంవిలువలకు నిలబడుతూ శ్రద్ధగా ఆరోగ్యదాయకమైన, ΄ోషకవంతమైన వ్యవసాయోత్పత్తులను ఉత్పత్తి చేసే వ్యవసాయ క్షేత్రం పర్యాటక కేంద్రంగా కూడా పేరుగాంచుతుందనటానికి రోహన్ క్షేత్రమే ఉదాహరణ. ఆసక్తి గల వారు బుక్ చేసుకొని 2.5 గంటల వ్యవసాయ ఆధారిత అనుభవాలను చవిచూస్తున్నారు. అతిథులు కొబ్బరి తోటల గుండా నడుస్తూ విషయాలు తెలుసుకుంటారు. చెట్టు నుంచి కాయలు కోయటం దగ్గరి నుంచి నూనె తయారీ వరకు జరిగే పనులన్నిటినీ చూస్తారు. స్థానిక పదార్థాలను ఉపయోగించి గ్రామీణ మహిళలు వండిన సాంప్రదాయ గోవా భోజనంతో ఈ అనుభవం ముగుస్తుంది.‘ఇది ఎక్కువ మందిని ఆకర్షించే పర్యాటకం కాదు. జీరో వేస్ట్ క్షేత్ర నిర్వహణ, ఆరోగ్యదాయకమైన ఆహారంపై సంభాషించడానికి మేం ఒక బ్యాచ్‌లో కొద్ది మందికి మాత్రమే ఆతిథ్యం ఇస్తామ’ని రోహన్ స్పష్టం చేశారు. త్వరలో కొబ్బరితో చిరుతిండ్లను ఉత్పత్తి చెయ్యనున్నామన్నారు. టోక్యోకి చెందిన అంతర్జాతీయ పర్యాటక సంస్థ స్కాల్ ఇంటర్నేషనల్ నుంచి గుర్తింపు దక్కటం ఆనందదాయకమని ఆయన సంబరపడుతున్నారు. -
చేలు.. ఏఐ మేలు
ఢిల్లీలో ఇటీవల జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో భాగంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఉపకరించే ఏఐ ఆధారిత సాంకేతికతలపై వెలువడిన సంకలనం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏఐ–అగ్రిటెక్ ఇన్నోవేషన్ సెంటర్, వాధ్వానీ ఏఐ, ప్రపంచ బ్యాంకు, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) సహకారంతో రూపొందిన ఈ సంకలనంలో 13 దేశాల్లో వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న 260 ఆవిష్కరణల్లోంచి 26 ఉత్తమ ఏఐ వ్యవసాయ ఆవిష్కరణలను పొందుపరిచారు. రైతులకు వ్యవసాయ సూచనలు ఇచ్చేందుకు 13 ఏఐ సాంకేతికతలు, కోత అనంతరం, ట్రేసబిలిటీ, మార్కెట్ అవకాశాలపై 4, రుణ పరపతికి సంబంధించినవి 2, కార్బన్ మార్కెట్లపై 2, మరో 5 అభివృద్ధి దశలో ఉన్న ఏఐ సాంకేతికతల గురించి ఇందులో వివరించారు.కొన్ని ఏఐ వ్యవసాయ సాంకేతికతలు.. వాటి పనితీరు ఇలా..⇒ మహారాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ‘మహా విస్తార్’ మొబైల్ అప్లికేషన్లు, వెబ్ ప్లాట్‌ఫామ్స్, వాయిస్ బేస్డ్ సరీ్వసులను రైతులకు అందిస్తోంది. పంటల సాగు, పశువులు/ కోళ్లు/ చేపల రైతులకు అవసరమయ్యే అన్ని సేవలను స్థానిక భాషలో అందిస్తూ బహుళ ప్రాచుర్యం పొందింది. ఈ యాప్‌ను ఇప్పటికే 22 లక్షల రైతులు డౌన్లోడ్ చేసుకొని వాడుతున్నారు. రైతులు అడిగిన 15 లక్షల ప్రశ్నలకు ఏఐ సహకారంతో జవాబులు ఇచ్చారు.⇒ డిజిటల్ జ్ఞానం తక్కువగా ఉండే చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే త్రీ–ఇన్–వన్ ఏఐ డిజిటల్ వ్యవస్థ ‘ఫామ్బెటర్’. కెన్యా రూపొందించగా ఆఫ్రికా దేశాల రైతులు వాడుతున్నారు. 30% వరకు దిగుబడి పెరిగింది. 15% వరకు కోత అనంతర నష్టాలు తగ్గాయి. ⇒ తెలంగాణలో విత్తనోత్పత్తి రైతులకు ఉపయోగపడుతున్న ఏఐ ఆధారిత సీడ్ ఇంటెలిజెన్స్ డాష్‌బోర్డ్ వ్యవస్థ ‘సీడ్‌వర్క్స్ కోపైలట్’. దీని ద్వారా 8 వేల హైబ్రిడ్ వరి విత్తన రైతులు లబ్ధి పొందారు.⇒ 17 ఏళ్ల అనుభవంగల డిజిటల్ గ్రీన్ సంస్థ రూపొందించిన ఏఐ అడ్వైజరీ ప్లాట్‌ఫామ్ ‘ఫార్మర్‌చాట్’. 4 లక్షల మంది భారతీయ రైతులతోపాటు కెన్యా, నైజీరియా, ఇథియోపియా, బ్రెజిల్ రైతులు వాడుతున్నారు. దీని సాయంతో రైతులకు వ్యవసాయ విస్తరణ వ్యయం 35 డాలర్ల నుంచి ఒక డాలర్‌కు తగ్గింది. ⇒ కాలిఫోర్నియా (అమెరికా)కు చెందిన ‘స్పోర్కామ్’గాలిలోని క్రిములను కనిపెట్టి రానున్న చీడపీడల గురించి రైతులకు ముందస్తు సూచనలిస్తుంది. 4 కోట్ల ఎకరాల్లో వాడుతున్నారు.⇒ తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో 1.2 కోట్ల మంది రైతులకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ‘ఫీల్డ్వైజ్’ఏఐ సేవలందిస్తోంది. ప్రభుత్వ పథకాల అమలుకు కూడా దోహదపడుతోంది. ⇒ పశువుల మెడలో సెన్సార్‌ను అమర్చడం ద్వారా జబ్బులను ముందే పసిగట్టేందుకు ‘కౌ నెక్లెస్ సెన్సార్స్’సంస్థ ఏఐ సేవలందిస్తోంది. ⇒ గుజరాత్‌కు చెందిన పరేఖ్ అగ్రిటెక్ ప్లాట్‌ఫామ్ డిజిటల్ మార్కెటింగ్ సేవలందిస్తోంది. రైతులు తమ ధాన్యానికి 5% నుంచి 7% అధిక ధర పొందుతున్నారు. ⇒ పండ్ల నాణ్యతను గుర్తించి గ్రేడింగ్ చెయ్యడంలో 95% కచ్చితత్వంతో ఏఐ ఆధారిత పరికరం పంజాబ్ రైతులకు సేవలందిస్తోంది. ⇒ సింగపూర్‌కు చెందిన ‘టీఆర్‌ఎస్‌టీ01’సంస్థ దక్షిణాసియా దేశాల్లోని లక్షన్నర మంది రైతులకు ట్రేసబిలిటీ సేవలందిస్తోంది. ⇒ ‘ఖేత్స్కోర్’సంస్థ రైతు పరపతి సామర్థ్యాన్ని తెలియజెప్పే స్కోర్‌ను అందిస్తోంది. ఈ స్కోర్ ఆధారంగా రైతులు సులువుగా రుణాలు పొందవచ్చు. ⇒ గులాబి పురుగు నుంచి పత్తిని కాపాడే ఏఐ స్మార్ట్ ఫెరమోన్ ట్రాప్ టెక్నాలజీని జాతీయ పత్తి పరిశోధనా సంస్థ రూపొందించింది. దీని సాయంతో 39% పురుగుమందుల వాడకం తగ్గింది. 18% దిగుబడి పెరిగింది. ⇒ ఐసీఏఆర్ రూపొందించిన ఏఐ ఆధారిత సాయిల్ టెస్టింగ్ వ్యవస్థ ‘వసుధ’. ⇒ ద్రాక్ష తదితర పండ్ల తోటల్లో పురుగుమందుల పిచికారీ చేసుకోవడానికి ఉపయోగపడే ఏఐ ఆధారిత ‘ఫామ్ గార్డియన్ రోవర్’వ్యవస్థ మహారాష్ట్రలో వినియోగిస్తున్నారు.⇒ దేశంలో 86% మంది చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడేలా రూపొందించిన మొబైల్ యాప్ ఆల్ట్ కార్బన్. నేలలోని 25 స్థూల, సూక్ష్మ పోషకాల స్థాయిని, వాతావరణ పరిస్థితులను మిళితం చేసి రైతులకు స్పష్టమైన సూచనలు చేసే విలక్షణ యాప్ ఇది. పశ్చిమ బెంగాల్లో 2,847 మంది వరి, తేయాకు రైతులు దీన్ని వాడటం ద్వారా 18% ఎరువుల వాడకం తగ్గించుకొని 20% నుంచి 32% మేరు దిగుబడి పెంచుకున్నారు. ఏఐతో సాగుకు సాయం...వ్యవసాయ సంబంధ నిర్ణయాలు తీసుకోవడంలో, ఒడిదుడుకులను తట్టుకుంటూ దిగుబడులను పెంచుకోవడంలో కృత్రిమ మేధ దోహదపడుతోంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, రైతులతో కలసి ఆచరణాత్మక శాస్త్రీయ దృష్టితో రూపొందించే ఏఐ వ్యవస్థలు ప్రయోజనకరమైన డిజిటల్ సూచనలను అందించగలుగుతున్నాయి. కానీ సంప్రదాయ వ్యవసాయ విజ్ఞానానికి ఏఐ ప్రత్యామ్నాయం కాదు. ఈ సాంకేతికతలను సక్రమంగా అమలు చేస్తే వాతావరణ మార్పులను, ఒడిదుడుకులను తట్టుకునేందుకు దోహదపడతాయి. – డాక్టర్ ఎం.ఎల్. జాట్, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ -
‘ఏపీలో తీవ్ర సంక్షోభంలో వ్యవసాయం’
తాడేపల్లి: రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోందని, దీని వల్ల గ్రామీణ ఆర్దిక వ్యవస్థ కుదేలవుతోందని, బడ్జెట్ లో ప్రభుత్వం పెట్టిన లెక్కలు చూస్తేనే ఇది అర్దమవుతోందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి ఆక్షేపించారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ మీద ఆధారపడిన రాష్ట్రం ఇప్పుడు వ్యవసాయ సంక్షోభంతో పూర్తిగా తిరోగమనంలో వెళ్తోందన్నారు. తగ్గిపోయిన పన్ను వసూళ్లే ఇందుకు నిదర్శమని తెలిపారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా చేస్తానని ఇప్పుడు ప్రభుత్వం చెప్తోందని, కానీ అప్పట్లో వైఎస్సార్, జగన్మోహన్ రెడ్డి రుణ బకాయిల రద్దు, ఉచిత విద్యుత్ తో ఎప్పుడో చేశారని ఎంవీఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు.తిరోగమనంలో రాష్ట్రంరెండు రోజుల క్రితం బడ్టెట్ లో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు ఎలా ఉందనే అంశంపై ప్రెస్ మీట్ పెట్టారు. ప్రతీ హామీ ఎంత మందికి అమలు చేస్తున్నారు, ఎంత మందికి ఎగ్గొట్టారనే అంశాలపై మాట్లాడారు. ఇందులో ఆయన మాట్లాడిన వ్యవసాయం సహా ఏ అంశంపైన అయినా ప్రభుత్వం స్పందిస్తుందేమో అని చూశాం కానీ సమాధానం రాలేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన అంశాలన్నీ నిజమేనని తేలిపోయింది. 2025-26 బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ వసూళ్లు 2 కోట్ల 17 లక్షల 976.53 కోట్లు చూపిస్తే, సవరించిన లెక్క లక్షా 96 వేల 903.53 కోట్లకు చేరింది. అంటే 9 నెలల్లో 21,073 వేల కోట్ల ఆదాయం తగ్గిపోయింది. అంటే మైనస్ ఆరు శాతం అన్నమాట. ఈ సంవత్సరం మళ్లీ రెవెన్యూ వసూళ్లు 2,34, 140.14 కోట్లకు పెరుగుతాయని చూపించారు. రూ. 21 వేల కోట్ల మైనస్ కు వెళ్లిన తర్వాత ఒక్కసారిగా 37 వేల కోట్లకు పెరుగుతుందని ఎలా చూపిస్తారు. అదే 2025-26 సంవత్సరానికి పన్ను వసూళ్లు బడ్జెట్ అంచనాల్లో 1,28,126 కోట్లు పెట్టారు. సవరించిన లెక్క చూస్తే 1, 11,865 కోట్లకు అంటే 16,261 కోట్లు తగ్గిపోయింది. అంటే 9 నెలల్లోనే 12.69 శాతం తగ్గిపోయింది. ఈసారి మళ్లీ బడ్జెట్ లో పన్ను వసూళ్ల అంచనా 1,37,320 కోట్లకు పెరుగుతుందని చూపించారు. అంటే 22.75 శాతం పెరుగుతుందని చూపించారు. రాష్ట్రం ఎంత సంక్షోభంలో ఉందో దీన్ని బట్టి అర్దమవుతోంది. వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం ఈ రంగంలో తిరోగమనంలో ఉందని తెలుస్తోంది.పడిపోతున్న పన్ను వసూళ్లురైతు కానీ, కౌలు రైతు కానీ, వ్యవసాయ కార్మికుడు కానీ తన ఆదాయం పెరిగి నిత్యావసరాలు కొనుక్కుంటే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. కానీ మద్దతు ధరలు లేక అమ్ముకునే పరిస్ధితుల్లోకి వెళ్లడం, ఉత్పత్తి తగ్గిపోవడం వంటి కారణాలతో వ్యవసాయం సంక్షోభంలోకి వెళుతోంది. ఇలాంటి ప్రధాన కారణాలను పక్కనబెట్టి బడ్జెట్ అంచనాలు పెంచుకుంటూ పోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మూలధన వసూళ్లు మాత్రం తగ్గలేదు. అప్పులు 78205 కోట్లు తీసుకుంటామని బడ్జెట్ లో చెప్పి 79456 కోట్లు 9 నెలల్లోనే తీసుకున్నారు. ఇతర రుణాలు 1500 కోట్లు చూపించి 2496 కోట్లు తీసుకున్నారు. ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది అనేది ప్రత్యక్ష పన్ను వసూళ్లలోనే కనిపిస్తోంది. రాష్ట్రంలో 2024-25లో వరి సాగు 13.97 లక్షల హెక్టార్లలో జరిగింది. 78.28 లక్షల టన్నులు ఉత్పత్తి జరిగింది. 2025-26 ఖరీఫ్ లో 15.59 లక్షల హెక్టార్లలో సాగు జరిగింది. అంటే గత సంవత్సరం కంటే లక్షా 65 వేల హెక్టార్లలో సాగు పెరిగింది. ఉత్పత్తి చూసుకుంటే మాత్రం 78.05 లక్షల టన్నులు మాత్రమే జరిగింది. ఇవి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ పరిధిలోని యూనిఫైడ్ పోర్టల్ ఫర్ స్టాటిస్టిక్స్ డేటా ఇది. పెరిగిన సాగు ప్రకారం చూస్తే 9 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి పెరగాలి. కానీ లక్ష టన్ను ధాన్యం కూడా పెరగలేదు. కానీ రైతులకు ఎరువుల ధరలు పెరిగాయి, యూరియా బ్లాక్ మార్కెట్లో కొనుక్కున్నారు. రైతుకు ఖర్చు పెరిగింది కానీ దిగుబడి పెరగలేదు’ అని ధ్వజమెత్తారు.గణనీయంగా పడిపోయిన సాగుజగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతు భరోసా కేంద్రం దగ్గర ట్రక్ షీట్ జనరేట్ అయితేనే ధాన్యం వెళ్లేవి. ట్రక్ షీట్ జనరేట్ అయిన దగ్గరి నుంచి ధాన్యం వచ్చే తేదీ లెక్కించేవాళ్లు. ఈ సంవత్సరం రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసి మధ్యవర్తుల ద్వారా మిల్లర్లకు చేరిపోయింది. మిల్లర్లు చెప్పిన తేదీకి రైతు భరోసా కేంద్రంలో లోడ్ చేశారు. అంటే వాళ్లకు అనుకూలమైన తేదీల్లో లోడ్ చేయించారు. రవాణా, కాటా కూలీ కానీ గతంలో ఇచ్చేవారు కాదు. గత ప్రభుత్వంలో వాళ్ల ఖాతాలకే డబ్బులు వేయడం మొదలుపెట్టారు. ఈసారి ఈ డబ్బులు కూడా వాళ్లకు అందలేదు. ప్రత్తి విషయానికొస్తే.. ఈ ఏడాది 3.99 లక్షల హెక్టార్లలో సాగు జరిగింది. మొంథా తుపాన్ దెబ్బకు 4 నుంచి 5 క్వింటాల్స్ మాత్రమే ఉత్పత్తి వచ్చింది. దీనికి తోడు రూ.8,110 మద్దతు ధర అయితే క్వాలిటీ లేదని 5 వేల నుంచి 6 వేలకు కూడా కొనుగోలు చేయని పరిస్ధితి. అంటే వేల కోట్లు రైతులు నష్టపోయారు. వేరుసెనగ చూస్తే 5.72 లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉంటే ఈ ఏడాది 2.08 లక్షల హెక్టార్లలో మాత్రమే. అంటే కేవలం 42 శాతం మాత్రమే సాగు జరిగింది. గణనీయంగా సాగు పడిపోవడం వల్ల వ్యవసాయ కార్మికులకు పని లేకపోవడం, రైతుకు ఆదాయం పడిపోతాయి. ఆగస్టు వరకూ ఉన్న డ్రై స్పెల్ మూలంగా అనంతపురం, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో సాగు 40 శాతానికి పడిపోయింది. కనీస మద్దతు ధరలు లేక తక్కువకు అమ్ముకున్న పరిస్ధితి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కటాఫ్ డేట్ అయిపోయాక కంది సాగు చేశారు. సరాసరి దిగుబడి తగ్గిపోయిందని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. అందుకే కర్నాటక నుంచి ప్రభుత్వం సేకరించాల్సి వచ్చింది. మొత్తం రూ.2400 మద్దతు ధర అయితే రైతులు గరిష్టంగా రూ.1800కు అమ్ముకున్నారు. మినుములు, పెసలదీ అదే పరిస్ధితి. రబీలో వర్షాల కారణంగా మళ్లీ సాగు పెరిగింది. సీమను హార్టీకల్చర్ హబ్ చేసింది వైఎస్సార్, జగన్ప్రభుత్వం ఇచ్చిన వీక్లీ రిపోర్ట్ లో 2024-25లో హెక్టార్ కు కేజీ 19 కిలోల ఉత్పత్తి జరిగింది. ఈ సంవత్సరం ఉత్పత్తి పెరుగుతుందన వ్యవసాయ మంత్రి చెప్పారు. ఆయన లెక్క ప్రకారం సాగు చూస్తే 4 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుంది. కానీ క్షేత్రస్థాయి పరిస్ధితుల్లో తీసుకుంటే రబీలో శెనగపంట దిగుబడి పెరిగింది. 5 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి వచ్చే అవకాశం ఉంది. ఇందులో 91 వేల టన్నులు మాత్రమే ప్రొక్యూర్ మెంట్ చేస్తున్నారంటే మెట్ట జిల్లాల్లో రైతులు నష్టపోయే అవకాశం ఉంది. దీని మీద తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టిసారించాలి. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వైఎస్సార్ హయాంలో విద్యుత్ బకాయిల రద్దు, ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం పెట్టినప్పుడే ఇది హార్టికల్చర్ హబ్ అయింది. గతేడాది సంక్షోభం మొదలైందే హార్టికల్చర్ పంటల నుంచి. ఇదంతా రాయలసీమ ప్రాంతంలోనే జరిగింది. మార్కెటింగ్ మీద దృష్టిపెట్టకపోవడమే ఇందుకు కారణం. గతంలో వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తే, తిరిగి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే పగలు 9 గంటల విద్యుత్ ఇచ్చారు. అంటే రాయలసీమను హార్డికల్చర్ హబ్ గా మార్చింది వైఎస్సార్, జగన్మోహన్ రెడ్డి మాత్రమే. పంటల ఉత్పత్తి లేక సంక్షోభం రావట్లేదు, కేవలం మార్కెటింగ్ లేకే సంక్షోభం వస్తోంది. రూరల్ ఎకానమీ బలహీనంగా ఉంది. రైతులు, వ్యవసాయ కార్మికుల దగ్గర డబ్బులు ఉంటేనే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వ్యాపారులు బాగుంటారు. ఈ 20 నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా ఎకరం భూమి ధర పెరగలేదు. దీనికి కారణం వ్యవసాయ సంక్షోభమే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వ్యవసాయ సంక్షోభంపై దృష్టిసారించాలని కోరుతున్నాం’ అని స్పష్టం చేశారు. -
ఏమయ్యా అచ్చెన్న.. 6,309 కోట్లు ఇచ్చావా ..? సిగ్గుందా కొంచెమైనా..!
-
ఏపీలో వ్యవసాయం.. బాబు సర్కారులో అపాయం
-
వరుసగా మూడో బడ్జెట్లోనూ అన్నదాతకు మొండిచెయ్యే
సాక్షి, అమరావతి: పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. కనీసం అన్నదాతకు యూరియా అందించలేని అన్యాయమైన పాలన ఇది. ఉచిత పంటల బీమా అటకెక్కింది.. ఇన్పుట్ సబ్సిడీ ఊసేలేదు.. సున్నా వడ్డీకి సున్నా చుట్టింది. మొత్తంగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు సర్కార్ ఈ మూడో బడ్జెట్లోనూ రైతుకు మొండిచెయ్యి చూపింది. రాష్ట్రంలో గత 20 నెలలుగా అన్ని విధాలుగా నష్టపోయి తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న రైతులను ఆదుకునే దిశగా వ్యవసాయ రంగంలో తగిన కేటాయింపులు జరపడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. అరకొర కేటాయింపులతో రైతులకు పంగనామాలు పెట్టింది. 3.32 లక్షల కోట్ల బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.12,152 కోట్లు, అనుబంధ శాఖలకు రూ.3,589 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిపారు. అంటే మొత్తం బడ్జెట్లో 4.74 శాతానికి మించలేదు. పైగా అసెంబ్లీ సాక్షిగా గతేడాది 46.86 లక్షల మంది రైతులకు రూ.6,309 కోట్ల పెట్టుబడి సాయం అందజేశామని.. జోన్, నాన్ జోన్‌తో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్ రూ.1.50 చొప్పున విద్యుత్ సరఫరా చేస్తున్నామంటూ పచ్చి అబద్ధాలు చెప్పు కొచ్చారు. మరో వైపు కొత్తగా రూ.లక్ష కోట్లతో రాయలసీమ, ప్రకాశం జిల్లాలను హార్టికల్చర్ హబ్‌గా తీర్చి దిద్దుతున్నామని, ఇందులో రూ.30 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెబుతూ.. ఉద్యాన శాఖకు మాత్రం రూ.1,123.86 కోట్లకు మించి కేటాయింపులు జరపక పోవడం విస్మయానికి గురి చేస్తోంది.పంటల బీమాకు మంగళం పాడేందుకేఐదేళ్ల పాటు రైతులపై పైసా భారం పడకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించేసిన చంద్రబాబు ప్రభుత్వం.. స్వచ్ఛంద నమోదు బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. 2024–25 బడ్జెట్లో పైసా కేటాయించలేదు. 2025–26లో రూ.1,023 కోట్లు కేటాయించినా పైసా ఖర్చు చేయలేదు. రెండేళ్లుగా ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన రూ.2,419.44 కోట్ల ప్రీమియం ఎగ్గొట్టడంతో ప్రస్తుత రబీ సీజన్ నుంచి కంపెనీలు ఏపీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టేశాయి. ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులకు రావాల్సిన రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం అందకుండా పోయింది. దీంతో ఈ ఏడాది ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తారని రైతులు ఆశపడ్డారు. కనీసం ఈ ప్రీమియం బకాయిలతో పాటు రానున్న వ్యవసాయ సీజన్‌కు తగిన నిధులు కేటాయిస్తారని భావించారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఈ పథకానికి కేటాయింపులు గతేడాదితో పోలిస్తే నాలుగో వంతుకు తగ్గించి, రూ.250 కోట్లతో సరిపెట్టారు. గతేడాది అరటి, మిరప, పొగాకు బొప్పాయి, మామిడి, చీనీ, టమాట, ఉల్లి వంటి పంటలకు గిట్టుబాటు ధర దక్కలేదు. అయినప్పటికీ మార్కెట్లో జోక్యం చేసుకొని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి ఆదుకున్న దాఖలాలు లేవు.ఈ హామీలన్నీ అటకెక్కినట్టేనా?⇒ రాయితీపై సోలార్ పంప్ సెట్ల ఏర్పాటు మాటేంటి? ⇒ గుర్తింపు కార్డులు అందజేసిన కౌలు రైతులకు అన్ని సంక్షేమ పథకాలు ఎప్పుడు అందిస్తారు? ⇒ రైతు కూలీలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు.. తద్వారా వారికి రాయితీలు, సంక్షేమ పథకాలు ఎప్పుడిస్తారు? ⇒ దళారుల దోపిడీని అరికట్టడానికి ఏపీఎంసీ యాక్టును పటిష్టంగా ఎప్పుడు అమలు చేస్తారు? ⇒ పాడి రైతులకు పశుగ్రాసం సాగు కోసం బంజరు భూములు కేటాయింపు ఎంత వరకొచ్చింది? ⇒ పశువుల కొనుగోళ్లు, దాణా, మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు ఏమయ్యాయి? ⇒ పశువులకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఎప్పుడు కల్పిస్తారు? ⇒ ఆక్వా రైతులకు జోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా అందరికీ యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా సంగతేంటి? ⇒ వీటిలో ఏ ఒక్క హామీ అమలు కోసం ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి అయినా కేటాయించారా? ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లేనా?‘ధరల స్థిరీకరణ నిధి కింద గతేడాది రూ.300 కోట్లు కేటాయించాం. ఈ ఏడాది దాన్ని రూ.500 కోట్లకు పెంచాం’ అని ప్రభుత్వం గొప్పగా చెప్పుకోవడం రైతులను ఆగ్రహానికి గురిచేస్తోంది. మరోవైపు నాన్ సబ్సిడీ విత్తనాలకు మంగళం పాడేశారు. సబ్సిడీ విత్తనానికి కోత పెట్టారు. గతేడాది రూ.182 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పిన ప్రభుత్వం ఈ ఏడాది రూ.240 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పుకొచ్చింది. వాస్తవానికి మార్కెట్లో విత్తన ధరలు భారీగా పెరిగాయి. ఈ కేటాయింపులు ఏమాత్రం సరిపోవని రైతులు చెబుతున్నారు. రెండేళ్లుగా సున్నా వడ్డీ రాయితీ పథకం కింద పైసా చెల్లించలేదు. ఈ ఏడాది రూ.250 కోట్లు కేటాయించడం పట్ల రైతులు మండిపడుతున్నారు. రెండేళ్లుగా కట్ట యూరియా కోసం రైతులు ఏవిధంగా ఇబ్బందుల పాలయ్యారో అందరూ ప్రత్యక్షంగా చూశారు. బఫర్ స్టాక్ కోసం రూ.200 కోట్లు ఖర్చు చేస్తామంటూ గొప్పగా ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం కేవలం రూ.40 కోట్లకు పరిమితం చేసింది. 20 నెలల్లో ప్రకృతి వైపరీత్యాల్లో దెబ్బతిన్న రైతులకు రూ.1,100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలుండగా, ఆ ఊసెత్తకుండా రూ.310 కోట్ల పెట్టుబడి రాయితీ ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం. పట్టు, మార్కెటింగ్, పశు సంవర్థక, మత్స్య శాఖల కేటాయింపులు పూర్తిగా సిబ్బంది జీత భత్యాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సరిపడా తప్ప కొత్తగా ఒక్క పథకాన్ని ప్రకటించలేదు. ఒక్క రూపాయి అదనంగా కేటాయింపులు జరపలేదు. -
వ్యవసాయ రంగంలో 10.4 శాతం వృద్ధి
సాక్షి, న్యూఢిల్లీ: 2024–25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగ స్థూల విలువ జోడింపు(జీవీఏ) 10.4 శాతం వృద్ధి సాధించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత ధరల ప్రకారం గత ఐదేళ్లలో వ్యవసాయ, అనుబంధ రంగాలు (పంటలు, పశుసంవర్ధక, మత్స్య, ఉద్యానవనం) వృద్ధిరేటు గణనీయంగా పెరిగినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ తెలిపారు. 2020–21లో 10.0 శాతం, 2021–22లో 10.6శాతం, 2022–23లో 8.5 శాతం, 2023–24లో 9.6 శాతం కాగా 2024–25లో 10.4శాతం నమోదుతో రికార్డు నెలకొలి్పనట్లు ఠాకూర్ చెప్పారు. 2024–25లో దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 3577.32 లక్ష మెట్రిక్ టన్నులు అని మంత్రి ప్రకటించారు. ఇది 2023–24లో నమోదైన 3322 లక్ష మెట్రిక్ టన్నులతో పోలిస్తే 254 లక్ష మెట్రిక్ టన్నుల (7.65 శాతం) కంటే ఎక్కువ అని ఇటీవల లోక్‌సభలో మంత్రి పేర్కొన్నారు. ఫీల్డ్‌స్థాయి పర్యటనలు నిర్వహిస్తున్నాం ‘‘వ్యవసాయ వృద్ధిని ప్రభావితం చేసే కీలక అంశాలైన రైతుల ఆదాయం, ఇన్పుట్ ఖర్చులు, వాతావరణ మార్పులు, సాగునీటి విస్తరణ, రుణ సౌకర్యం, మార్కెట్ అనుసంధానంపై ప్రభుత్వం నిరంతర సమీక్షలు, అధ్యయనాలు, ఫీల్డ్ స్థాయి పర్యటనలు నిర్వహిస్తోంది. రైతుల ఆదాయం పెంపు, వ్యవసాయ రంగ సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తోంది. పంటల ఉత్పత్తి పెంపు, ఉత్పత్తి ఖర్చుల తగ్గింపు, మెరుగైన ధరల సాధన, పంటల వైవిధ్యీకరణ, కోత అనంతర విలువ ఆధారం, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం వంటి అంశాలపై దృష్టి సారించాం’’అని మంత్రి తెలిపారు. ఇందుకోసం 2013–14లో రూ.21,933 కోట్లు కేటాయించగా, 2025–26 తాజా బడ్జెట్లో రూ.1,27,290 కోట్లు కేటాయించాం. 2018–19 నుంచి ఖరీఫ్, రబీ, వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధరలు ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం లాభం వచ్చేలా నిర్ణయించాం. రైతుల సంక్షేమం, ఆదాయం పెంపు, ఉత్పత్తి విస్తరణ కోసం పలు కేంద్ర రంగ, కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలులో ఉన్నాయి’’అని మంత్రి పేర్కొన్నారు. -
రూ.53వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్
సాక్షి, అమరావతి: స్వర్ణాంధ్ర–2047 లక్ష్య సాధనలో భాగంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రీ టెక్, ఫుడ్‌ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అనే పంచ సూత్రాల అమలుతో వ్యవసాయ రంగానికి ఊపిరి పోస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. శనివారం అసెంబ్లీలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.53,752.12 కోట్లతో ప్రతిపాదించిన వ్యవసాయ బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర జీఎస్డీపీ రూ.17.62 లక్షల కోట్లుగా నమోదు కాగా, అందులో వ్యవసాయ రంగం వాటా 33.2 శాతం (రూ.5.39 లక్షల కోట్లు)గా ఉందన్నారు. దేశ వ్యవసాయ రంగం వృద్ధిరేటు 0.80 శాతం కాగా, ఏపీలో 7.83 శాతంగా నమోదైందన్నారు. దేశ వ్యవసాయ ఉత్పత్తిలో ఏపీ వాటా 10 శాతంగా ఉందన్నారు. ఈ రంగం వృద్ధిరేటు పరంగా 3.91 శాతంగా నమోదైందని, 15 శాతం వార్షిక వృద్ధిరేటు సాధించే లక్ష్యంతో 11 పంటలను గ్రోత్ ఇంజన్లుగా గుర్తించామన్నారు. ‘అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,600 కోట్లు, విత్తన రాయితీకి రూ.240 కోట్లు, ప్రకృతి సాగుకు రూ.208 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.139.65 కోట్లు, వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ.250 కోట్లు, స్వచ్ఛంద పంటల బీమాకు రూ.250 కోట్లు, ఎన్ఎంఈఓ–ఓపీ(ఆయిల్‌పామ్)కు రూ.204 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లు, ఎన్పీడీడీ (డెయిరీ డెవలప్మెంట్)కి రూ.202.62 కోట్లు, వేట నిషేధ భృతికి రూ.260 కోట్లు, పీఎంఎంఎస్‌వైకి రూ.398 కోట్లు, వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం కోసం రూ.500 కోట్లు, వ్యవసాయ.. ఉద్యాన, పశువైద్య, మత్స్య వర్సిటీలకు రూ.804.31 కోట్లు కేటాయించాం’అని తెలిపారు. రంగాల వారీగా తీసుకుంటే వ్యవసాయ రంగానికి రూ.12,152.32 కోట్లు, ఉద్యాన రంగానికి రూ.1,123.86 కోట్లు, పట్టు పరిశ్రమ రంగానికి రూ.95.87 కోట్లు, మార్కెటింగ్ శాఖకు రూ.515.39 కోట్లు, సహకార శాఖకు రూ.209.30 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ.1,121.26 కోట్లు, మత్స్య శాఖకు రూ.523.52 కోట్లు, ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి రూ.13,722 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.14,276.89 కోట్లు కేటాయించామని వెల్లడించారు. -
‘రైతే ఎప్పటికీ రారాజు’.. అమెరికా ఒప్పందంలో స్పష్టం!
న్యూఢిల్లీ: భారత్-అమెరికా మధ్య కుదిరిన తాజా మధ్యంతర వాణిజ్య ఒప్పందం మన దేశీయ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప ఊరటను అందించింది. ఈ ఒప్పందంలో అమెరికా.. భారతీయ ఉత్పత్తులపై విధిస్తున్న దిగుమతి సుంకాలను గతంలో ఉన్న 50 శాతం నుండి ఏకంగా 18 శాతానికి తగ్గించింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ వస్తువుల ధరలు తగ్గి, మన ఎగుమతిదారులకు భారీగా ఆర్డర్లు వచ్చే అవకాశం ఏర్పడింది. ఈ భారీ రాయితీలను పొందుతూనే, భారతదేశం అత్యంత కీలకమైన వ్యవసాయ రంగం దెబ్బతినకుండా జాగ్రత్తపడింది.అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్ తన వ్యవసాయ, పాడి పరిశ్రమ రంగాల్లో ఎటువంటి దిగుమతి రాయితీలను ప్రకటించలేదు. ముఖ్యంగా వరి, గోధుమలు, పాలు, పౌల్ట్రీ, ఇథనాల్ తదితర ఉత్పత్తులపై పన్నులను తగ్గించకుండా రక్షణ కల్పించింది. అమెరికాలో వ్యవసాయం భారీ సబ్సిడీలతో నడుస్తుండటంతో, అక్కడి నుండి తక్కువ ధరకే ఉత్పత్తులు భారత్‌కు వస్తే.. మన చిన్న , ఉపాంత రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ ముప్పును ముందుగానే గుర్తించిన కేంద్రం సుమారు 70 కోట్ల మందికి ఆధారమైన వ్యవసాయ రంగాన్ని విదేశీ కార్పొరేట్ దిగ్గజాల నుండి కాపాడగలిగింది.భారతదేశం ప్రస్తుతం 51 బిలియన్ డాలర్ల(4.62 లక్షల కోట్లు) విలువైన వ్యవసాయ ఎగుమతులను కలిగివుంది. ఈ కొత్త ఒప్పందంతో రానున్న నాలుగేళ్లలో ఈ ఎగుమతులను 100 బిలియన్ డాలర్లకు చేర్చాలనేది ప్రభుత్వ లక్ష్యం. భారతదేశంలోని సుగంధ ద్రవ్యాలు, బియ్యం, టీ, కాఫీ, పండ్లు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందేందుకు ఈ టారిఫ్ తగ్గింపు రైతులకు ఒక వరంగా మారనుంది. దేశంలోని రైతుల జీవనోపాధికి ఎటువంటి ముప్పు కలుగకుండా.. అమెరికాతో ఈ ఒప్పందాన్ని కుదరుర్చుకోవడం భారత్ సాధించిన చారిత్రక విజయమని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: ‘మేక్ ఇన్ ఇండియా’కు గ్లోబల్ బూస్ట్: ప్రధాని మోదీ -
వ్యవసాయ, పాడి పరిశ్రమలకు పూర్తి రక్షణ: కేంద్ర మంత్రి
భారత్, అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్‌పై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో స్పష్టతనిచ్చారు. దేశంలోని అత్యంత సున్నితమైన రంగాలైన వ్యవసాయం, పాడి పరిశ్రమల ప్రయోజనాలను ఈ ఒప్పందంలో పూర్తిగా కాపాడినట్లు ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ప్రతిపక్షాల ఆందోళనల మధ్య వాయిదా పడిన ఈ ప్రకటనను ఆయన తర్వాత ఉభయ సభల్లో చదివి వినిపించారు.ఒప్పందంలోని ప్రధానాంశాలు..ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ ఒప్పందం ఒక కొలిక్కి వచ్చిందని గోయల్ తెలిపారు. ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు..అమెరికాకు భారత్ చేసే ఎగుమతులపై సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇది ఇతర పోటీ దేశాలపై అమెరికా విధిస్తున్న సుంకాల కంటే తక్కువ కావడం గమనార్హం.రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై గతంలో విధించిన 25 శాతం ప్రతీకార సుంకాన్ని అమెరికా పూర్తిగా తొలగించింది.భారత దిగుమతులపై ఉన్న 25 శాతం పరస్పర సుంకాన్ని కూడా 18 శాతానికి తగ్గించేందుకు అమెరికా అంగీకరించింది.కీలక రంగాలకు ఊతంఆగస్టు 2025 నుంచి అమలులో ఉన్న 50 శాతం అధిక సుంకాల కారణంగా వస్త్రాలు, తోలు వస్తువులు, సముద్ర ఉత్పత్తుల వంటి కార్మిక ఆధారిత రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజా తగ్గింపులతో ఈ రంగాలకు అంతర్జాతీయ మార్కెట్లో తిరిగి పోటీతత్వం లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశ ఇంధన భద్రతపై వస్తున్న సందేహాలకు మంత్రి సమాధానమిస్తూ, 140 కోట్లు భారతీయుల ఇంధన అవసరాలను తీర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా చమురు, ఇంధన వనరులను వివిధ మార్గాల ద్వారా సేకరించడం భారత వ్యూహంలో భాగమని చెప్పారు.ఇంధనం, విమానయానం, డేటా సెంటర్లు, అణుశక్తి వంటి రంగాల్లో అమెరికా అగ్రగామిగా ఉందని, ఈ రంగాల్లో వాణిజ్య సహకారం పెంచుకోవడం ద్వారా మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరుతాయని ఆయన వివరించారు. ఫిబ్రవరి 2025లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య విస్తృత చర్చలు జరిగాయి. ప్రస్తుతం సాంకేతిక ప్రక్రియలు, పత్రాల తయారీ తుది దశలో ఉందని, అవి పూర్తయిన వెంటనే ఒప్పందం పూర్తి వివరాలను తెలియజేస్తామని గోయల్ చెప్పారు.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం -
వ్యవసాయం, గ్రామీణ రంగాలకు మొండిచేయి!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇటీవలి బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ రికార్డు స్థాయిలో నిధులు కేటాయించింది. అయితే, వ్యవసాయ పరిశోధనలు, గ్రామీణాభివృద్ధి వంటి కీలక రంగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.దేశ ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా నిలిచే మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ఈసారి రూ.12.2 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని ప్రతిపాదించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 9 శాతం అధికం. ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు జీడీపీలో కేవలం 11.5% - 12.5% వద్దే స్థిరంగా ఉండటంతో (2004-2008లో ఇది 16% గా ఉండేది), ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి పెట్టుబడులను పెంచాలని నిర్ణయించింది.అంకెలు పెరిగినా.. ఆందోళనలు?వ్యవసాయ శాఖకు కేటాయింపులు రూ.1.23 లక్షల కోట్లు నుంచి రూ. 1.30 లక్షల కోట్లకు పెరిగాయి. ఇందులో ప్రధానంగా.. పీఎం కిసాన్, పీఎం కిసాన్ మాన్ ధన్ యోజనకు ఎక్కువ కేటాయింపులు చేశారు. అయితే ఆర్థిక మంత్రి ప్రసంగంలో పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య సంపద, వాల్నట్స్ వంటి అనుబంధ రంగాలపై దృష్టి సారించినప్పటికీ ప్రధాన పంటల రంగం, ఉద్యానవన రంగాల ప్రస్తావన లేకపోవడం గమనార్హం.దేశంలో విమానాశ్రయాలు, రహదారులు ప్రపంచ స్థాయికి చేరుకున్నా ఢిల్లీలోని ఆజాద్ పూర్ వంటి ప్రధాన వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధునీకరణకు బడ్జెట్ నుంచి ప్రత్యక్ష మద్దతు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.పరిశోధన నిధుల్లో కోతవాతావరణ మార్పులను తట్టుకునే విత్తనాలు, అధిక ఉత్పాదకత కోసం పరిశోధనలు అవసరమైన తరుణంలో వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ (డీఏఆర్ఈ) నిధులు రూ.10280 కోట్ల నుంచి రూ.9967 కోట్లకు తగ్గాయి. ప్రైవేట్ భాగస్వామ్యంతో ‘ఛాలెంజ్ మోడ్’లో నిధులు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందనేది స్పష్టత లేదు. మరోవైపు, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) నిధులను రూ.1500 కోట్ల నుంచి రూ.2500 కోట్లుకు పెంచడం సానుకూల పరిణామం.ఇదీ చదవండి: పౌరుల గోప్యతను హరించకూడదు: సుప్రీంకోర్టు ఆగ్రహం -
విరిసిన సేద్య పద్మాలు!
వ్యవసాయం, పశుపోషణ, సహకార రంగాల్లో విశేష కృషి చేసిన 9 మందికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. వీరిలో ఐదుగురు శాస్త్రవేత్తలు, ముగ్గురు రైతు శాస్త్రవేత్తలు, ఒకరు ప్రముఖ సహకార వేత్త. భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్ఐ, పూసా) మాజీ సంచాలకులు డా. అశోక్ కుమార్ సింగ్ (బాస్మతి వరి రకాల అభివృద్ధి), జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ, మొక్కల రకాలు రైతుల హక్కుల ప్రాధికార సంస్థల మాజీ చైర్మన్ డా. పి.ఎల్. గౌతమ్ (జీవవైవిధ్య పరిరక్షణ చట్టం, రైతుల విత్తన హక్కుల రక్షణ చట్టం రూపశిల్పి), తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ మాజీ వైస్ చాన్స్‌లర్ డా. కె.రామస్వామి (క్లైమేట్ ఒత్తిళ్లను తట్టుకునే వ్యవసాయ పద్ధతులపై పరిశోధన), రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ డా. జి.ఎల్. త్రివేది (ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయాభివృద్ధి), తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ మాజీ డీన్ డా. ఎన్. పుణ్యమూర్తి (ఎత్నో–వెటర్నరీ మెడిసిన్) పద్మశ్రీకి ఎంపికయ్యారు. వీరితో పాటు రైతు శాస్త్రవేత్తలు దివంగత రఘుపత్ సింగ్ (ఉత్తరప్రదేశ్), జోగేష్ డ్యూరి (అస్సాం), శ్రీరంగ్ దేవబా లాడ్ (మహారాష్ట్ర), దివంగత సహకార వేత్త మామిడి రామారెడ్డి (తెలంగాణ) పద్మశ్రీ 2026 పురస్కారాలకు ఎంపికయ్యారు.మాక్స్ చట్టం రూపశిల్పి రామారెడ్డితెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమలో సహకార సంఘాల పాత్రను బలోపేతం చేసేందుకు 50 ఏళ్లపాటు పాటుపడిన దార్శనిక సహకార నేత మామిడి రామారెడ్డి(83)కి మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రదానం చేయనుంది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన స్వగ్రామం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సర్పంచ్‌గా, రాజేంద్రనగర్ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. సహకార సమాఖ్య, కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ల ద్వారా సహకార వ్యవస్థ పటిష్టతకు రాజకీయాలకు అతీతంగా, స్వతంత్ర సహకార వేత్తగా నిబద్ధతతో సేవలందించారు. మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ (ఎంపీసీఎస్)లను ఏర్పాటు చేశారు. పీఏసీఎస్‌లలో ప్రభుత్వ ప్రత్యక్ష జోక్యాన్ని నిరోధించేందుకు జాతీయ స్థాయిలో ఉద్యమించి, చట్ట సవరణ సాధించారు. 1995లో మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ(మాక్స్) చట్టం రూపకల్పనలో రామారెడ్డి కీలకపాత్ర పోషించారని 5 దశాబ్దాలుగా రామారెడ్డితో కలసి నడుస్తున్న సహకార ధర్మపీఠం వ్యవస్థాపక ధర్మకర్త సంభారపు భూమయ్య ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. సహకార రంగంలో పద్మశ్రీ పురస్కారాన్ని గెల్చుకున్న తొలి నేత రామారెడ్డి కావటం సంతోషదాయకమన్నారు. ముఖ్యంగా మహిళల నేతృత్వంలోని సహకార సంస్థలను, స్వయం సహాయక బృందాలను ఇతోధికంగా ప్రోత్సహించారు. వరంగల్, కరీంనగర్ ప్రాంత మహిళా సహకార డెయిరీ ఏర్పాటులో చోదక శక్తిగా నిలిచారని ఆయన తెలిపారు. దూరదృష్టి గల నేత: ఎన్డీడీబీసహకార సంస్థలను బలోపేతం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన దూరదృష్టి గల నాయకుడు మామిడి రామారెడ్డి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావటం హర్షణీయమని జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు (ఎన్డీడీబీ) పేర్కొంది. సహవికాస – సహకార అభివృద్ధి ఫౌండేషన్ ద్వారా మహిళా సాధికారతపై బలమైన దృష్టితో తెలంగాణ అంతటా గ్రామీణ జీవనోపాధి అవకాశాలను కల్పించారు. సహకార చట్టాలను రూపొందించడంలో, జాతీయ స్థాయి విధాన సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. వేలాది మంది సభ్యుల యాజమాన్యంలోని స్వావలంబనతో కూడిన సహకార సంస్థలను ఆయన వారసత్వం విశ్వాసం, గౌరవం, స్థిరమైన గ్రామీణాభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళుతుందని ఎన్డీడీబీ ఆకాంక్షించింది.శ్రీరంగ్ దేవబా లాడ్ (మహారాష్ట్ర)వ్యవసాయ ఆవిష్కరణలతో ప్రసిద్ధి చెందిన రైతు శాస్త్రవేత్త శ్రీరంగ్ దేవబా లాడ్ (మహారాష్ట్ర). పత్తి ఉత్పత్తిని పెంచే ‘దాదా లాడ్ పద్ధతి’ని ఆయన అభివృద్ధి చేసినందుకు పద్మశ్రీ అందుకోనున్నారు. అధిక సాంద్రతలో పత్తి విత్తటం, మొక్కను 3 దశల్లో కొమ్మలు, పిలకలను కత్తిరించటం ద్వారా దిగుబడిని పెంచటం దాదా లాడ్ టెక్నిక్ ప్రత్యేకత. పత్తి పంట కాలాన్ని కుదించటం ద్వారా గులాబీ పురుగు బెడద నష్టాన్ని నివారించటం మరో ప్రయోజనం. నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ (సీఐసీఆర్) లాడ్ టెక్నిక్‌లో ప్రయోజకత్వాన్ని గుర్తించి, అధికారికంగా రైతులకు సిఫారసు చేయటం విశేషం. వర్షాధార, నీటిపారుదల సాగు పద్ధతుల్లోనూ సీఐసీఆర్ విస్తృత స్థాయిలో క్షేత్ర ప్రయోగాలు జరిపింది. ఈ టెక్నిక్ ద్వారా సగటున 48 నుంచి 76% వరకు పత్తి దిగుబడి పెరిగినట్లు రుజువైందని సీఐసీఆర్ ప్రకటించింది.రఘుపత్ సింగ్ (ఉత్తరప్రదేశ్)మొరాదాబాద్ జిల్లాలోని బిలారి ప్రాంతానికి చెందిన అభ్యుదయ రైతు రఘుపత్ సింగ్‌కు మరణానంతరం పద్మశ్రీ అవార్డు ప్రదానం చేయనున్నారు. 55 పైగా అంతరించిపోతున్న కూరగాయల వంగడాలను సంరక్షించి రైతులకు తిరిగి పరిచయం చేశారు. దాదాపు 100 కొత్త రకాలను అభివృద్ధి చేశారు.జోగేష్ డ్యూరి (అస్సాం)ముగా పట్టు పరిరక్షణలో కీలక పాత్ర పోషించిన జోగేష్ డ్యూరి పద్మశ్రీని అందుకోనున్నారు. ఆయన కృషి వేలాది గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని పెంచింది. ముగా పట్టుకు ప్రపంచ గుర్తింపు తెచ్చిపెట్టింది. -
సాగు.. ఫోకస్ మిస్!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1,62,671 కోట్లు కేటాయించారు. 2025–26 సవరించిన అంచనాల (రూ. 1,51,853 కోట్లు) కంటే ఈసారి 7.12 శాతం మాత్రమే కేటాయింపులు పెంచారు. దీంతో వ్యవసాయ రంగంలో ఏ విభాగంపై కూడా పెద్దగా ఫోకస్ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ రంగాన్ని ఆర్థిక మంత్రి పూర్తి నిర్లక్ష్యం చేశారని అఖిల భారత కిసాన్ సభ ఆరోపించింది. వ్యవసాయ రంగం వ్యూహాత్మక పునరుజ్జీవనం పట్ల ఎటువంటి నిబద్ధతను చూపలేదని ఆక్షేపించారు. అయితే, వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం ’సబ్కా సాథ్, సబ్కా వికాస్’ అనే దార్శనికతను కనబరిచిందని ఆర్థిక మంత్రి నిర్మలచెప్పారు. సంప్రదాయసాగుపై ఆధారపడటాన్ని తగ్గించి గ్రామీ ణ జీవనోపాధిని వైవిధ్యపరిచేందుకు బడ్జెట్ దోహదం చేస్తుందన్నారు. కొత్త ఏఐ టూల్.. » కేంద్రం ‘భారత్–విస్తార్ (వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చరల్ రిసోర్సెస్)’ అనే పేరుతో బహుళ భాషా కృత్రిమ మేధ టూల్‌ను ప్రకటించింది. దీనికోసం రూ.150 కోట్లు కేటాయించింది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి, రైతులకు సలహాలు అందించడానికి ఇది తోడ్పడుతుంది. ఈ టూల్ అగ్రిస్టాక్ పోర్టల్‌లను, సాగు పద్ధతులపై ఐకార్ ప్యాకేజీని ఏఐ వ్యవస్థలతో అనుసంధానం చేస్తుంది. » పండ్లు, కూరగాయల మిషన్‌ను క్రిష్నియోన్నతి యోజన కింద కలిపేసి రూ.700 కోట్లు కేటాయించారు. » మఖానా బోర్డు పేరును బిహార్, ఇతర రాష్ట్రాల్లో మఖానా అభివృద్ధి పథకంగా మార్చారు. దీనికి రూ.90 కోట్లు కేటాయించారు. » పీఎం–కిసాన్‌కు రూ.63,500 కోట్లు కేటాయించారు. » వ్యవసాయ విద్య, పరిశోధనకు 3 శాతం కోతవేసి రూ. 9,964 కోట్లు కేటాయించారు. » ఇన్లాండ్ ఫిషరీల కోసం 500 రిజర్వాయర్లు, అమృత్ సరోవర్లను స్టార్టప్‌లు, మహిళా సంఘాలు, చేపల పెంపకందారుల ద్వారా పటిష్టం చేస్తారు. ప్రధానమంత్రి సంపద యోజనకు కేటాయింపులను రూ.1,500 కోట్ల నుంచి 2,500 కోట్లకు పెంచారు. » కోస్తా, కొండ ప్రాంతాల్లో అధిక వ్యయమయ్యే పంటలైన కొబ్బరి, గంధం, కోకో, జీడిపప్పు, బాదం, వాల్నట్స్ సాగుకు రూ.350 కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించారు. » పేద, సన్నకారు రైతులకు వస్తున్న ఆదాయంలో దాదాపు 16 శాతం పశుసంపద నుంచి వస్తోందంటూ.. 20,000 కంటే ఎక్కువ పశువైద్య నిపుణుల లభ్యతను పెంచడానికి రుణ–సంబంధిత మూలధన సబ్సిడీ పథకాన్ని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ పథకం ప్రైవేట్ రంగంలో వెటర్నరీ, పారావెట్ (పారా–వెటర్నరీ) కళాశాలలు, వెటర్నరీ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు, బ్రీడింగ్ సౌకర్యాల స్థాపనకు తోడ్పడుతుంది. » గత బడ్జెట్లో ప్రకటించిన కాటన్ టెక్నాలజీ మిషన్, నేషనల్ మిషన్ ఫర్ హైబ్రిడ్ సీడ్స్‌కు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. దీంతో ఈ పథకాలు ఇంకా ప్రారంభంకాలేదు. చరిత్రాత్మక బడ్జెట్..అభివృద్ధి చెందిన, స్వావలంబన భారతదేశానికి బలమైన పునాది వేసే చరిత్రాత్మక బడ్జెట్ అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. ఇది రైతులు, యువత, మహిళలు, పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుందని చెప్పారు. – వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్మ్యాచ్ సమ్మరీఈ ఇన్నింగ్స్‌లో వ్యవసాయ రంగానిది విచిత్రమైన పరిస్థితి. బంతి నేరుగా వ్యయసాయ రంగం చేతిలోకి వచ్చింది. కానీ కీపర్ చేతిలోకి రాకుండానే జారిపోయింది. అంటే... అన్నీ ఉన్నా కొంచెం ఫోకస్ మాత్రం మిస్సయింది. కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. పెద్ద షాట్లు వస్తాయని ఆశించిన చోట బంతి జారిపోయింది. అటు బ్యాట్స్‌మన్‌కూ అందలేదు. ఇటు కీపర్‌కూ దొరకలేదు. సాగు, అనుబంధ రంగాల కేటాయింపుల్లో స్కోర్‌బోర్డు ముందుకు కదిలినట్టే కనిపించినా, ఫీల్డ్‌లో మాత్రం ఫోకస్ తప్పిన దృశ్యం స్పష్టంగా కనిపించింది. ఏఐ టూల్స్, పథకాలు ప్రకటించినా రైతులు ఎదురుచూస్తున్న అంశాలకు మాత్రం చోటు దొరకలేదు. వికెట్ పడలేదు. కానీ ఫోకస్ లేక వ్యవసాయానికి అవకాశం మిస్ అయింది. డేటా సెంటర్లలో 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులుకేంద్ర ప్రభుత్వం అంచనా న్యూఢిల్లీ: డేటా సెంటర్లలో 200 బిలియన్ డాలర్ల(రూ.18.33 లక్షల కోట్లు) పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ కోసం అణు ఇంధనంపై ఆధారపడాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 90 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని పేర్కొన్నారు. ఇందులో 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులు కార్యరూపం దాలుస్తున్నాయని వివరించారు. భారత్‌లో డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇండియాలో డేటా సెంటర్లు సహా ఏఐ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెడతామని గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, డిజిటల్ కనెక్షన్ వంటి సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. డేటా సెంటర్ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో 2047 దాకా ట్యాక్స్ హాలిడే ప్రకటించింది. దేశంలో సెమీ కండక్టర్ల తయారీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ప్రతిపాదిత ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0తో చిప్‌ల తయారీ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. క్యాన్సర్ బాధితులపై కరుణ17 రకాల క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకం రద్దుఅత్యాధునిక చికిత్సలు మరింత మందికి చేరువ సాక్షి, అమరావతి: క్యాన్సర్ బాధితులకు కేంద్రం భారీ ఆర్థిక ఊరట ఇచ్చింది. క్యాన్సర్ చికిత్సల్లో వినియోగించే 17 రకాల ప్రాణాధార ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి పూర్తి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే క్యాన్సర్ ఆధునిక ఔషధాల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. టార్గెట్, ఇమ్యునోథెరపీ లాంటి ఖరీదైన చికిత్సలు మరింత మందికి అందుబాటులోకి వస్తాయని వైద్య నిపుణులు అభిప్రాయపడు తున్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే క్యాన్సర్ మందులపై సాధారణంగా 10% కస్టమ్స్ సుంకం ఉంటుంది. తాజాగా దీన్ని మినహాయించనుండటంతో బాధి తులకు ఊరట లభించనుంది. శరీరంలో నిర్దిష్టంగా క్యాన్సర్ కణాలను మాత్రమే వెతికి పట్టుకుని నాశనం చేసే టార్గెటెడ్ థెరపీ, రోగ నిరోధక వ్యవస్థను శక్తిమంతం చేసి క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేసే ఇమ్యునోథెరపీ లాంటి ఆధునిక చికిత్సలు ప్రస్తుతం పేద రోగులకు అందుబాటులో లేవు. ఆ మందులు విదేశాల నుంచి దిగుమతి అవుతుండటమే దీనికి కారణం. ఇక 7 రకాల అరుదైన వ్యాధులకు సంబంధించి వ్యక్తిగతంగా దిగుమతి చేసుకునే ఔషధాలను కూడా సుంకాల మినహాయింపు జాబితాలో చేర్చారు. -
వ్యవసాయ సంక్షోభానికి విరుగుడు
దేశవ్యాప్తంగా 2026-27 కేంద్ర బడ్జెట్ కోసం సన్నాహాలు జరుగుతున్న వేళ అన్నదాత గళం మరోసారి బలంగా వినిపిస్తోంది. పెరుగుతున్న సాగు ఖర్చులు, అనిశ్చిత వాతావరణం, మందగిస్తున్న ఉత్పాదకత వంటి సవాళ్ల నడుమ.. వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ) రంగానికి భారీగా నిధులు కేటాయించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.పరిశోధన రంగానికి నిధుల కరువుభారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ పరిశోధనా వ్యవస్థల్లో ఒకటిగా ఉన్నప్పటికీ నిధుల కేటాయింపులో మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. గణాంకాలను పరిశీలిస్తే 2025-26 బడ్జెట్లో వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగం (DARE)కి రూ.10,466 కోట్లు కేటాయించారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే నామమాత్రపు పెరుగుదలే. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) బడ్జెట్లో సుమారు 85 శాతం నిధులు కేవలం శాస్త్రవేత్తల జీతాలు, పెన్షన్లు, నిర్వహణ ఖర్చులకే సరిపోతున్నాయి. వాస్తవ పరిశోధనలకు మిగిలేది అత్యల్ప వాటా మాత్రమే. అమెరికా, చైనా, ఇజ్రాయెల్ వంటి దేశాలు తమ వ్యవసాయ జీడీపీలో 2% నుంచి 4% వరకు పరిశోధనలపై ఖర్చు చేస్తుంటే భారత్ కేవలం 0.3% నుంచి 0.7%** మధ్యనే ఉండటం గమనార్హం.క్షేత్రస్థాయిలో వాస్తవాలువిత్తనాలు, ఎరువులు, ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుండగా పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కేవలం సబ్సిడీలు ఇస్తే సరిపోదు, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడినిచ్చే సాంకేతికత కావాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 50 శాతం సాగు వర్షాధారంగానే సాగుతోంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల కరువులు, అకాల వర్షాలు రైతులను దెబ్బతీస్తున్నాయి. వీటిని తట్టుకునే ‘క్లైమేట్ రెసిలెంట్’ (వాతావరణ నిరోధక) వంగడాల సృష్టికి నిధుల కొరత అడ్డంకిగా మారింది.బడ్జెట్‌పై ఆశలుప్రభుత్వం ‘జై జవాన్, జై కిసాన్’ నినాదానికి కట్టుబడి ఉండాలంటే ఈసారి బడ్జెట్లో విప్లవాత్మక మార్పులు అవసరం. ప్రధానంగా చేయాల్సినవి..1. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు పరిశోధనల కోసం ప్రత్యేక నిధుల కేటాయింపు.2. కీలకమైన వ్యవసాయ సమస్యల పరిష్కారానికి ‘జాతీయ వ్యవసాయ ఆవిష్కరణ టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు.3. పరిశోధనలు కేవలం ల్యాబ్‌లకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పొలాల వరకు చేరేలా విస్తరణ సేవల బలోపేతం.ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉండాలంటే వ్యవసాయ శాస్త్రంలో పెట్టుబడి పెట్టడం అత్యవసరం. బడ్జెట్ 2026 ద్వారా ప్రభుత్వం పరిశోధన రంగానికి పెద్దపీట వేసి, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తుందని ఆశిద్దాం.ఇదీ చదవండి: వ్యవసాయ రంగానికి పీఎంఓ దిశానిర్దేశం -
వ్యవసాయ రంగానికి పీఎంఓ దిశానిర్దేశం
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన వ్యవసాయ రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాబోయే కేంద్ర బడ్జెట్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా వ్యవసాయ రంగ వృద్ధిని పరుగులు తీయించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి కార్యాలయం ఆర్థిక మంత్రిత్వ శాఖకు కీలక సూచనలు చేసింది.ఆందోళన కలిగిస్తున్న వృద్ధి రేటువ్యవసాయ రంగ వృద్ధి రేటులో కనిపిస్తున్న మందగమనంపై పీఎంఓ ఆందోళన వ్యక్తం చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతంగా ఉన్న వ్యవసాయ వృద్ధి రేటు 2025–26 అంచనాల ప్రకారం 3.1 శాతానికి పడిపోయింది. 2020–21లో దేశ మొత్తం స్థూల విలువ జోడింపు (GVA)లో వ్యవసాయ రంగం వాటా 20.4 శాతం ఉండగా 2023–24 నాటికి అది 17.7 శాతానికి తగ్గింది. గత 5-6 ఏళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ కొవిడ్ ప్రభావం, వాతావరణ మార్పుల వల్ల సగటు జీవీఏ వృద్ధి 3–4 శాతం వద్దే నిలిచిపోయింది.బడ్జెట్‌పై అంచనాఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు బడ్జెట్లో భారీ నిర్మాణాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ క్రింది అంశాలపై దృష్టి సారించనున్నారు.1. చిన్న, సన్నకారు రైతులను ఏకం చేసి సహకార సంఘాల ద్వారా వారి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం.2. పంట పండించడమే కాకుండా అగ్రో-ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించడం.3. పంట కోత అనంతర నష్టాలను తగ్గించేందుకు గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ వంటి మౌలిక వసతుల కల్పన.4. అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చేందుకు ప్రత్యేక సంస్థల ద్వారా మార్కెట్ అవకాశాన్ని పెంచడం.ప్రభుత్వం ప్రతిపాదించబోయే ఈ సమగ్ర గ్రామీణ పునరుజ్జీవన కార్యాచరణ కేవలం వ్యవసాయానికే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల విస్తరణకు కూడా దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. సరఫరా గొలుసుల (Supply Chains) ఆధునీకరణ ద్వారా వినియోగదారులకు, రైతులకు మధ్య దళారీల ప్రభావం తగ్గి నేరుగా రైతుకే లాభం చేకూరే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా? -
సెంట్ ఎల్లో మెరుపులు!
వ్యవసాయంలో రైతులు ఆధునిక మార్గాల వైపు అడుగులు వేస్తున్నారు. కొత్త పద్ధతులతో పంటలను సాగు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఆన్ సీజన్లో(ఆఫ్ సీజన్) పంటలు సాగుచేస్తే ధరలు ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నారు. చలికాలంలో చామంతి పూలను ఎల్ఈడీ లైట్ల ద్వారా సాగుచేసే విధానానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో దీని ద్వారా చామంతి సాగులో అక్కడి రైతులు మంచి ఫలితాలను సాధించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని చిత్తూరు జిల్లాలోని పలమనేరు, కుప్పం ప్రాంతాలకు చెందిన పలువురు రైతులు ఈ కొత్త విధానాన్ని అవలంబిస్తున్నారు. పలమనేరు: సాధారణంగా చిత్తూరు జిల్లాలో పలమనేరు, కుప్పం ప్రాంతాలు శీతల వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ వేసవిలోనూ మంచు కురవడం సర్వసాధారణం. మామూలుగా చామంతి పూల సీజన్ మేలో మొదలై డిసెంబర్ కల్లా ముగుస్తుంది. ఆపై శీతల వాతావరణం కారణంగా ఆఫ్ సీజన్ కావడంతో మొగ్గరాక పంట సాగు కష్టంగా మారుతుంది. అయితే అన్ సీజన్ అయిన వేసవిలో చామంతికి భారీ డిమాండ్ ఉంటుంది. దీన్ని పసిగట్టిన కొందరు కర్ణాటక రైతులు పగటిపూట ఉండే ఉష్ణోగ్రతలే రాత్రుల్లో ఉండేలా తోటల్లో ఎల్ఈడీ బల్బులను అమర్చి మంచి దిగుబడులను సాధించారు. ఆ మేరకు జనవరిలో చామంతిని సాగుచేస్తే మూడు నెలల్లో ఏప్రిల్, మే, జూన్ దాకా దిగుబడి వస్తుంది. చామంతి ధరలు ఆశాజనకంగా ఉంటాయి. అందుకే రైతులు ఈ కొత్త పద్ధతితో సాగుచేస్తున్నారు. తేడా ఏంటంటే? సాధరణ సీజన్లో చామంతిని సాగుచేస్తే ఎకరానికి రూ.2 లక్షల ఖర్చవుతుంది. నాలుగు టన్నుల పూల ఉత్పత్తి ఉంటుంది. కిలో సగటున రూ.100 పలికినా నాలుగు టన్నులకు రూ.4 లక్షలు దాకా వస్తుంది. ఇందులో పెట్టుబడి రూ.2 లక్షలుపోగా రూ.2లక్షల నికర లాభం ఉంటుంది. అదే ఎల్ఈడీ పద్ధతిలో ఎకరానికి పంట పెట్టుబడి రూ.5 లక్షలుగా ఉంటుంది. పంట దిగుబడి 7 టన్నులకు పైగా వస్తుంది. అన్ సీజన్లో ధరలు కిలో రూ.200 నుంచి రూ.250 దాకా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో రూ.14 నుంచి రూ.16 లక్షల దాకా రాగా ఇందులో పంట పెట్టుబడి రూ.5 లక్షలు పోగా రూ.9 లక్షల దాకా నికర లాభాలుంటాయి. అందుకే రైతులు పెట్టుబడి ఎక్కువైనా ఎల్ఈడీ సిస్టమ్ వైపు ఆసక్తిని చూపుతున్నారు. ఎకరాకు రూ.60 వేల ఖర్చు ఎకరా పొలంలో చామంతి పంటకు 250 ఎల్ఈడీ లైట్లు, హోల్డర్లు, 260 మీటర్ల సిల్కువైరు, వెయ్యి మీటర్ల సర్వీసు వైరు, 250 ఉడెన్ఫోల్స్(నిలువు కర్రలు), ప్రత్యేకంగా విద్యుత్ సరీ్వసు, వీటి ఏర్పాటుకు కూలీలతో కలిపి ఖర్చు రూ.60 వేల దాకా అవుతోందని ఇక్కడి రైతులు చెబుతున్నారు. మంచి మార్కెట్ సదుపాయం ఈ ప్రాంతంలో పండిస్తున్న సెంట్ ఎల్లో చామంతి క్వాలిటీ బాగుంటుంది. బెంగళూరు మార్కెట్లో దీనికి మంచి గిరాకీ ఉంటుంది. దీంతోపాటు ఇక్కడికి బెంగళూరు వంద కిలోమీటర్లు దూరంలో ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణాకు సౌకర్యంగా ఉంది. అన్‌సీజన్ అయిన వేసవిలో చామంతి పూలు రావడంతో వీటికి డిమాండ్ ఎక్కువ. మంచి ధరలు పలికేందుకు అస్కారముంటుంది. ముఖ్యంగా వేసవిలో శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాల డెకరేషన్లకు ఇవే ట్రెండ్‌గా మారాయి. ఔత్సాహిక రైతులు ఎల్ఈడీ సేద్యంపై మక్కువ చూపుతున్నారు.ఎక్కువగా సెంట్ ఎల్లో సాగు!ఈ ప్రాంతంలో ఎక్కువగా రైతులు కలకత్తా నుంచి అందిన సెంట్ ఎల్లో సీడ్‌ను నాటారు. ఇది మూడు నెలల్లో పూల దిగుబడి మొదలై నాలుగు నెలల పాటు కోతలుంటాయి. నాటాక మొక్కలు పెద్దవయ్యే దాకా దాదాపు 40 రోజులపాటు ఎల్ఈడీ బల్బులను తోటలో ఏర్పాటు చేయాలి. లేదంటే ఇవి మొక్క దశలోనే చనిపోతాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 20 ఎకరాల్లో ఐదుగురు రైతులు ఎల్ఈడీ ద్వారా చామంతి పూలను సాగుచేస్తున్నారు. బైరెడ్డిపల్లి సమీపంలోని జాలారిపల్లి రోడ్డు వద్ద కర్ణాటకకు చెందిన రైతులు ద్వారా శంకరప్ప అనే రైతు ఎల్ఈడీ విధానం ద్వారా ఇటీవలే చామంతిని సాగుచేశారు.ఆఫ్ సీజన్లో పంటను తెప్పించే పద్ధతిది సాధారణంగా మామిడి కాయలు ఆ సీజన్లో వస్తాయి. కానీ వీటిని ఆఫ్ సీజన్లో పండిస్తే ఎంతటి గిరాకీ ఉంటుందో అదే విధంగా వేసవిలోనూ చామంతి పూలు రావాలంటే శీతల కాలంలో రాత్రుల్లో పగటి ఉష్ణోగ్రతలను ఎల్ఈడీ బల్బుల ద్వారా కల్పించే కృత్రిమ పద్ధతిది. దీంతో నాణ్యమైన పూలు, ఆశించిన దిగుబడి, ధరలుంటాయి. ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే ఎల్ఈడీ సాగు మొదలవుతోంది. రైతులు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా పంట సాగుపై మక్కువ చూపడం మంచి పరిణామం. – డా.కోటేశ్వరావు, సైంటిస్ట్, సెంటర్ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్, కుప్పం -
బడ్జెట్ 2026లో వ్యవసాయానికి కొత్త దిశ!
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే వ్యవసాయ రంగం ప్రస్తుతం వాతావరణ మార్పులు, అస్థిరమైన మార్కెట్ ధరల వల్ల సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రాబోయే కేంద్ర బడ్జెట్ 2026 (Budget 2026)లో వ్యవసాయాన్ని లాభసాటిగా, సుస్థిరంగా మార్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సంప్రదాయ సాగు పద్ధతుల నుంచి సాంకేతికతతో కూడిన ‘స్మార్ట్ అగ్రికల్చర్’ వైపు అడుగులు వేయడమే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యమని నిపుణులు అంచనా వేస్తున్నారు.వాతావరణానికి అనువైన వ్యవసాయంమారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల అకాల వర్షాలు, తీవ్రమైన ఎండలు పంట దిగుబడిని దెబ్బతీస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం స్థితిస్థాపక వ్యవసాయంపై దృష్టి సారిస్తోంది. అందులో భాగంలో కింది అంశాలను పరిశీలిస్తోందని నిపుణులు చెబుతున్నారు.కరువును, వరదలను తట్టుకునే అత్యధిక నాణ్యత గల విత్తనాల అభివృద్ధికి పరిశోధనా సంస్థలకు నిధులు పెంచడం.నీటి యాజమాన్యంలో భాగంగా సూక్ష్మ సేద్యం, భూసార పరిరక్షణ కోసం రైతులకు సబ్సిడీలు అందించడం.రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ సాగును ప్రోత్సహించడం ద్వారా భూసారాన్ని కాపాడటం.పీపీపీ మోడల్‌తో మౌలిక సదుపాయాలుప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పంట నష్టాన్ని తగ్గించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ పెట్టుబడులతో అధునాతన కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగుల నిర్మించాలని వ్యవసాయ సంఘాలు చెబుతున్నాయి. రైతుల నుంచి నేరుగా మార్కెట్‌కు పంటను తరలించేలా రవాణా నెట్‌వర్క్‌లను బలోపేతం చేయాల్సి ఉంది. ప్రైవేట్ సంస్థల వద్ద ఉన్న అధునాతన యంత్రాలను రైతులకు అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తేస్తే మరింత ఉత్పాదకత సాధ్యం అవుతుంది.అధిక విలువ కలిగిన పంటలువరి, గోధుమ వంటి సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే హార్టికల్చర్ (ఉద్యానవన పంటలు)పై బడ్జెట్ దృష్టి సారించాలి. తక్కువ నీటితో ఎక్కువ లాభం ఇచ్చే పండ్లు, ఔషధ మొక్కల సాగుకు ప్రోత్సాహకాలు అందించాలి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న సుగంధ ద్రవ్యాల సాగుపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.రైతన్నకు ‘స్మార్ట్’ అండసాంకేతికతను సామాన్య రైతుకు చేరువ చేయడమే డిజిటల్ ఇంటిగ్రేషన్ లక్ష్యం. మొబైల్ యాప్‌ల ద్వారా వాతావరణ సూచనలు, తెగుళ్ల నివారణా చర్యలను ఎప్పటికప్పుడు రియల్ టైమ్ డేటాతో అనుసందానించి అందించాలి. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల్లో దళారీ వ్యవస్థను అరికట్టేందుకు రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానించేలా ‘ఈ-నామ్’ (e-NAM) వంటి ప్లాట్‌ఫామ్‌లను మరింత బలోపేతం చేయాలి. పంటల అంచనా, రుణాల మంజూరు సులభతరం చేసేందుకు వ్యవసాయ రంగాన్ని పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలి.సుస్థిర సాగు, ప్రైవేటు పెట్టుబడులు, డిజిటల్ విప్లవంతో కూడిన వ్యూహం అమలులోకి వస్తే భారత వ్యవసాయ రంగం మరిన్ని ఫలితాలు సాధిస్తుంది. బడ్జెట్ 2026లో చేసే కేటాయింపులు అన్నదాతకు భరోసా కల్పించడమే కాకుండా దేశ ఆహార భద్రతను మరింత పటిష్టం చేస్తాయని ఆశిస్తున్నారు.ఇదీ చదవండి: ట్రంప్ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు -
నిధులు మూరెడు.. పనులు జానెడు!
భారతదేశ గ్రామీణ అభివృద్ధి పథంలో అసలైన సవాలు నిధుల కొరత కాదని నిపుణులు చెబుతున్నారు. ఆ నిధులను సమర్థంగా ఖర్చు చేస్తూ ఫలితాలుగా మార్చగల మానవ వనరుల కొరత ఎక్కువగా ఉందని విధానకర్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలు వేల కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులకు నిరంతర సాంకేతిక మద్దతు ఇచ్చే వ్యవస్థ లేకపోవడమే ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ లోటును పూడ్చేందుకు ప్రొఫెషనల్ వ్యక్తులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.అంకెల్లో నిధుల వెల్లువప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే గ్రామీణ ఉపాధికి నిధుల కొరత లేదన్నది స్పష్టమవుతోంది. కేంద్ర వ్యవసాయ శాఖ (2024-25)కు సుమారు రూ.1.32 లక్షల కోట్లు కేటాయించారు. ఎంజీనరెగా(ప్రస్తుతం వీబీ జీరామ్‌జీ)కు రూ.86,000 కోట్లు ఇచ్చారు. ఒడిశా వంటి రాష్ట్రాలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకే రూ.33,919 కోట్లు కేటాయించాయి. ఇంత భారీ పెట్టుబడులు పెడుతున్నా సమీక్షలు కేవలం ‘ఎంత మందికి లబ్ధి చేకూరింది? ఎన్ని ఎరువులు పంచారు?’ అనే గణాంకాలకే పరిమితమవుతున్నాయి. కానీ, ఆ పెట్టుబడుల వల్ల పంటల ఉత్పాదకత పెరిగిందా? రైతుల కుటుంబ ఆదాయం మెరుగుపడిందా? అన్న కీలక ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు.పరిష్కారమేంటి?ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం ఆఫీసు పనుల్లో నిమగ్నమై ఉండటంతో క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలిచే వ్యవస్థ అవసరం. దీనికోసం జాతీయ స్థాయిలో శిక్షణ పొందిన స్థానిక యువత పరిష్కారంగా తోస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.వీరి విధులు - బాధ్యతలుతమ సొంత గ్రామంలోనే ఉంటూ వాతావరణానుకూల సాగు, పశువైద్యం, నీటి నిర్వహణలో రైతులకు మార్గనిర్దేశం చేస్తారు.శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా ప్రభుత్వ గౌరవ వేతనంతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, స్వయం సహాయక సంఘాల నుంచి సర్వీసు ఫీజులు పొందవచ్చు.పంచాయతీ స్థాయిలో ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పథకాల అమలును పర్యవేక్షిస్తారు.తక్కువ ఖర్చు - ఎక్కువ లాభంశిక్షణలో పూర్తి చేసిన ఒక్కో వ్యక్తికి డిజిటల్ కిట్ కోసం సుమారు రూ.1 లక్ష వెచ్చిస్తే, 10,000 మందిని తయారు చేయడానికి అయ్యే ఖర్చు కేవలం రూ.100 కోట్లు మాత్రమే. ఇది వార్షిక వ్యవసాయ బడ్జెట్లో చాలా స్వల్ప భాగం. కానీ, ఈ చిన్న పెట్టుబడితో ప్రతి గ్రామంలో ఒక నిరంతర పర్యవేక్షణ, మద్దతు వ్యవస్థ ఏర్పడి వేల కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు వృథా కాకుండా సరైన ఫలితాలను ఇస్తాయి.తూర్పు ఆఫ్రికాలో కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తలు, కొన్ని ఆసియా దేశాల్లోని ఫీల్డ్ ఫెసిలిటేటర్లు ఇలాంటి విధానంతోనే విజయాలు సాధించారు. భారతదేశంలో ఇప్పటికే ఉన్న కృషి సఖీలు, ఎన్ఆర్ఎల్ఎం కేడర్లను కేవలం ప్రాజెక్టులకే పరిమితం చేయకుండా వారిని కీలక వనరులుగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: రూ.3,900 కోట్ల మద్యం బకాయిలు చెల్లించని ప్రభుత్వం -
ఉన్నట్లుండి ఆ ఊరిలో పెద్ద పెద్ద గుంతలు
ఒకటి కాదు.. రెండు కాదు.. వంద సింక్‌హోల్స్ (భారీ గుంతలు) ఏర్పడ్డాయి. అది కూడా ఈ మధ్య కాలంలోనే!. గ్రామం చుట్టూ.. కొన్ని ఇళ్ల పక్కనే ఈ గుంతలే కనిపిస్తున్నాయి. సింక్‌హోల్స్ తమ పొలాలను ఎక్కడ మింగేస్తాయోనని అక్కడి ప్రజలు నిత్యం భయంతో వణికిపోతున్నారు. ఆ ప్రాంతం సురక్షితమని ఏ సైంటిస్టు కూడా చెప్పలేకపోతున్నారు. ఇది టర్కీ(తుర్కియే) ధాన్యాగారంగా పేరున్న కోన్యా రీజియన్ పరిస్థితి.సెంట్రల్ అనాటోలియాలోని కోన్యా రీజియన్ ప్రధానంగా గోధుమ, ఇతర చిరుధాన్యాల సాగుకు ప్రసిద్ధి. అందుకే ఈ ప్రాంతానికి బ్రెడ్‌బాస్కెట్ అనే పేరు ముద్రపడింది. అయితే ఈ ఊరిని.. పంట పొలాలను భారీ గుంతలు మింగేస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 684 గుంతలు(బుధవారం నాటికి) ఏర్పడ్డాయి అక్కడ. ఈ మేరకు AFAD (Turkey Disaster Agency)గుర్తించిన ఆ గుంతల కొన్ని డ్రోన్ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎలా ఏర్పడ్డాయంటే..భూగర్భ జలాల అధిక వినియోగం.. దశాబ్దాలుగా సాగు కోసం అధికంగా నీటిని పంపింగ్ చేయడం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా ఉంది. దీనికి తోడు విపరీతమైన కరువు, వాతావరణ మార్పులు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రంగా మార్చాయి. ఇక్కడి భూగర్భ శిలల స్వభావం కూడా ఒక కారణమనే చెప్పొచ్చు. కార్బోనేట్, జిప్సం రాళ్లతో కూడిన "కార్స్ట్" భూభాగం. దీంతో.. సహజంగా గుహలు, ఖాళీలు ఏర్పడేలా ఉంటుంది. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో పాటు నేలల స్వభావం కూడా ఇలాంటి గుంతలు ఏర్పడడానికి కారణమైంది.ఈ ప్రభావంతో.. భూగర్భ జలాలు అడుగంటాయి. కొన్ని ప్రాంతాల్లో అది 60 మీటర్ల వరకు తగ్గాయి. సుమారు 30 మీటర్ల లోతైన గుంతలు పొలాలు, రహదారులు, నిర్మాణాలను మింగేస్తున్నాయి. రైతులు ప్రమాదకరమైన పొలాలను వదిలిపెట్టాల్సి వస్తోంది. శాస్త్రవేత్తలు సింక్‌హోల్ హాట్స్పాట్లను మ్యాప్ చేస్తున్నారు, భవిష్యత్తులో మరింత కుంగిపోవడం జరగవచ్చని హెచ్చరిస్తున్నారు.సాధారణ విషయమే కానీ..కొన్యా మైదానంలో సింక్‌హోల్స్ ఏర్పడడం కొత్తదేం కాదు. నేల స్వభావంతో అప్పుడప్పుడు(పదేళ్లకో.. పాతికేళ్లకో..) చిన్న చిన్న గుంతలు ఏర్పడేవి. అదీ సహజ ప్రక్రియలో నెమ్మదిగా కుంగిపోయేది. ఇప్పుడేమో వాతావరణ మార్పులు.. దీర్ఘకాలిక కరువు ఫ్లస్ అధిక భూగర్భ జల వినియోగం కారణంగా శరవేగంగా, పెద్ద సంఖ్యలో సింక్‌హోల్‌లు ఏర్పడుతున్నాయి. ఫలితంగా.. రైతుల పొలాలు, రహదారులు, చుట్టుపక్కల గ్రామాలు నేరుగా ప్రభావితమవుతున్నాయి.Nearly 700 sinkholes have appeared in parts of Turkey, with new ones showing up, fueled by extreme drought. pic.twitter.com/AaSdD3YNap— AccuWeather (@accuweather) December 12, 2025అన్ని రకాల నష్టాలు..కొన్యాలో తాజాగా ఏర్పడిన గుంతలు సాధారణమైనవేం కాదు. రైతుల జీవనోపాధి, గ్రామాల భద్రత, పర్యావరణ సమతుల్యత అన్నీ ఈ ప్రభావంతో కుదేలవుతున్నాయి. సుమారు 100 అడుగుల లోతు దాకా ఉంటున్నాయి. ఇవి గోధుమ, మొక్కజొన్న, బీట్ వంటి పంటలను నాశనం చేస్తున్నాయి. ప్రతి గుంత సగటున 1–3 హెక్టార్ల పొలాన్ని మింగేస్తోంది. అంటే కనీసం 700–2000 హెక్టార్లు పంట భూమి నష్టపోయింది. పొలాలు వదిలిపెట్టాల్సి రావడం వల్ల రైతులు ఆదాయం కోల్పోతున్నారు. పైగా ఈ కుంగుబాటుతో చుట్టుపక్కల భూములు కూడా నిస్సారంగా మారుతున్నాయి. రహదారులు, చుట్టుపక్కల ఉండే జనావాసాలు దెబ్బతింటున్నాయి. కొ ప్రమాదకర ప్రాంతాల నుంచి కొంతమంది రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.భూగర్భ జలాలు 60 మీటర్ల వరకు తగ్గిపోవడం వల్ల సహజ సమతుల్యత దెబ్బతింది. టర్కీ గత 50 ఏళ్లలో 186 సరస్సులను కోల్పోయింది. 1.5 మిలియన్ హెక్టార్ల వెట్‌ల్యాండ్ అదృశ్యమైంది. ఇది స్థానిక జీవవైవిధ్యాన్ని దారుణంగా దెబ్బతీసింది. సింక్‌హోల్‌లు కొత్త భూభాగ ఆకృతులను సృష్టిస్తూ, భూసంరక్షణకు సవాళ్లు విసురుతున్నాయి.పరిస్థితి మెరుగుపడాలంటే.. భూగర్భ జల వినియోగంపై కఠిన నియంత్రణలు అవసరమని.. లేకుంటే సింక్‌హోల్స్ మరింత పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు . తక్కువ నీటితో సాగు చేసే పంటలవైపు రైతుల మళ్లితే మంచిదని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. -
ఆగ్రో కెమికల్స్‌కు డిమాండ్
ఆగ్రో కెమికల్స్‌కు (వ్యవసాయ సంబంధిత రసాయనాలు) డిమాండ్ అంతర్జాతీయంగా కోలుకుంటుండడంతో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల ఆదాయం 6–7 శాతం పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా సాగుకు సంబంధించి నెలకొన్న సానుకూల సెంటిమెంట్‌తో ఎగుమతుల ఆదాయం 8–9 శాతం పెరుగుతుందని పేర్కొంది. అధిక వర్షాలతో పంటలు దెబ్బతినడం, ఉత్పత్తులు వెనక్కి రావడం, సాగు సన్నద్ధత వంటి అంశాలు దేశీయ డిమాండ్‌కు సమస్యలుగా ఉన్నట్టు తెలిపింది.‘‘రెండు సంవత్సరాల స్థిరీకరణ తర్వాత ఆగ్రో కెమికల్స్ రంగంలో ఆదాయం 2025–26లో 6–7 శాతం పెరగొచ్చు. ఇది కూడా ధరల పెంపు ద్వారా కాకుండా అధిక అమ్మకాల రూపంలో రానుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. ఇన్వెంటరీలు (స్టాక్ నిల్వలు) కూడా సాధారణ స్థాయికి చేరడం ఆదాయం వృద్ధికి అనుకూలిస్తుందని చెప్పారు.ఇక ఆగ్రోకెమికల్స్ పరిశ్రమ తన దీర్ఘకాల వృద్ధి అయిన 8–10 శాతానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేరుకోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. అయితే, ఎగుమతులు స్థిరంగా కొనసాగడం, దేశీ డిమాండ్ పుంజుకోవడంపై ఈ వృద్ధి ఆధారపడి ఉంటుందని పేర్కొంది. పరిశ్రమ ఆదాయంలో దేశీ, విదేశీ మార్కెట్లో చెరో సగం వాటా కలిగి ఉన్నట్టు తెలిపింది. ముడి సరుకుల ధరలు స్థిరంగా ఉండడం, అమెరికా టారిఫ్‌ల ప్రభావంతో నిర్వహణ మార్జిన్లు ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఒక శ్రేణి పరిధిలోనే ఉంటాయని అంచనా వేసింది.రుణ భారం నియంత్రణలోనే.. తక్కువ మూలధన వ్యయాలు, స్థిరమన మూలధన నిధులతో ఆగ్రో కెమికల్ కంపెనీల రుణభారం నియంత్రణల్లోనే ఉంటుందని, దీంతో రుణ పరపతిని మెరుగ్గా కొనసాగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. లాక్డౌన్ అనంతరం పేరుకున్న నిల్వలు తగ్గిపోవడంతో దేశీయంగా ఆగ్రోకెమికల్స్ ధరలు స్థిరపడినట్టు తెలిపింది.చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఆగ్రో కెమికల్Šస్పై కిలోకి 5 డాలర్ల ప్రయోజనం ఒనగూరుతోందని, గతేడాది స్థాయిలోనే ఉందని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఇదే కొనసాగొచ్చని అంచనా అంచనా వ్యక్తం చేసింది. నిల్వలు తగ్గడం, పర్యావరణ నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో సరఫరాలు స్థిరపడతాయని పేర్కొంది.‘‘ఆగ్రో కెమికల్స్ కంపెనీల నిర్వహణ మార్జిన్లు 12.5–13 శాతంగా ఉండొచ్చు. అయినప్పటికీ కరోనా ముందున్న 15 శాతం కంటే తక్కువే. 2024లో ప్రతికూలతల అనంతరం ఈ స్థిరత్వం నెలకొంది. మెరుగైన నిర్వహణ సామర్థ్యాలు, వ్యయ నియంత్రణలు ఇందుకు అనుకూలిస్తున్నాయి. దిగుమతులకు ప్రత్యామ్నాయంగా ఏటా రూ.5,500 కోట్ల పెట్టుబుడులు పెడుతుండడం, కొత్త ఉత్పత్తుల రిజి్రస్టేషన్లు, క్రమశిక్షణతో కూడిన మూలధన నిధుల నిర్వహణ వంటివి.. రుణ అవసరాలను తక్కువకు పరిమితం చేస్తాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ వివరించారు.అయినప్పటికీ ఈ రంగం పనితీరుపై వాతావరణ మార్పులు, నియంత్రణలను కఠినతరం చేయడం, రూపాయి మారకం విలువల ప్రభావాన్ని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. -
వ్యవసాయం ‘విలువ’ పెరిగింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగం నిరంతర వృద్ధి దిశగా సాగుతోందని ప్రభుత్వం రూపొందించిన ‘రైజింగ్ తెలంగాణ డాక్యుమెంట్’స్పష్టం చేస్తోంది. సుస్థిర వ్యవసాయ విధానాలు, రైతు సంక్షేమ పథకాల అమలు, క్షేత్రస్థాయి విస్తరణ ఫలితంగా తెలంగాణలో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం...గత రెండేళ్లలో వ్యవసాయ రంగం రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో (జీఎస్వీఏ:గ్రాస్ స్టేట్ వ్యాల్యూ యాడెడ్) 6.7 శాతం పెరుగుదలను నమోదు చేయడం అందుకు నిదర్శనం. 2023–24లో వ్యవసాయ రంగం విలువ రూ.1,00,004 కోట్లు ఉండగా, 2024–25 అంచనాల్లో ఇది రూ. 1,06,708 కోట్లకు పెరిగింది. రైతులకు ఇచ్చిన ప్రోత్సాహం, ఉచిత విద్యుత్, పంట రుణాల మాఫీ, పెట్టుబడి సాయం వంటి చర్యలు వ్యవసాయ రంగాన్ని నిలకడగా ఎదిగేలా చేశాయని ప్రభుత్వం పేర్కొంది. పంటల సాగు..ఉత్పత్తిలో ముందంజ పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలోనూ రాష్ట్రం ముందంజలో ఉంది. వరి పంటలో మాత్రం తెలంగాణ దేశంలోనే చరిత్ర సృష్టించింది. సాగు విస్తీర్ణం, దిగుబడిలో పంజాబ్‌ను దాటి నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. 2024–25 సీజన్లో వరి సాగు 127.03 లక్షల ఎకరాలకు చేరగా, ధాన్యం ఉత్పత్తి 284 లక్షల టన్నులను దాటి రికార్డు నమోదైంది. పత్తి, మక్కలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు అన్నీ కలిసి మొత్తం సాగు విస్తీర్ణం గతేడాది 209.62 లక్షల ఎకరాల నుంచి ఈ ఏడాది 220.77 లక్షల ఎకరాలకు పెరిగింది. మొత్తం పంట ఉత్పత్తి 296 లక్షల టన్నుల నుంచి 320.62 లక్షల టన్నులకు చేరింది. ఉచిత విద్యుత్‌కు సబ్సిడీ రూ. 10,444 కోట్లు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమల్లోకి తెచ్చిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌కు ఏటా దాదాపు రూ.10,444 కోట్లు సబ్సిడీగా చెల్లిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయంగా అందించే మొత్తానికి ఎకరాకు రెండు పంటలకు కలిపి రూ.12 వేలుగా చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. మొత్తం 1,57,51,000 ఎకరాలకు 69,86,548 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు జమ చేసింది. ఈ ఏడాది వానాకాలం పంటలకు రికార్డు వేగంతో రైతు భరోసా నిధులు పంపిణీ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 9 రోజుల్లోనే రూ.8,744 కోట్లు జమ చేసింది.రైతులకు అండగా ఉంటూ...» బీమా ఉన్న రైతులు ఏ కారణంతో మరణించినా రూ. 5 లక్షల పరిహారం ఆ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అందిస్తోంది. 42.16 లక్షల మంది రైతుల కుటుంబాల పేరిట ప్రభుత్వం జీవిత బీమా కంపెనీకి రైతు బీమా ప్రీమియం చెల్లించింది. గతంలో ఒక్కో రైతుకు రూ.3,400 చొప్పున చెల్లించిన ప్రీమియంను ప్రభుత్వం ఎల్ఐసీతో సంప్రదింపులు చేసి ఈసారి రూ.3,225కు తగ్గించింది. » సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ. 500 అదనంగా చెల్లిస్తున్న ప్రభుత్వం ఈసారి సన్నాలు విక్రయించిన రైతులకు రూ.314 కోట్ల బోనస్ చెల్లించింది. » గత ఏడాది మార్చి, సెప్టెంబర్‌లో వడగండ్లు, వర్షాలతో నష్టపోయిన 94,462 మంది రైతులకు రూ.95.39 కోట్ల పరిహారం అందించింది. ఇటీవల మార్చి, ఏప్రిల్‌లో వచ్చిన భారీ వర్షాలకు నష్టపోయిన 36,449 మంది రైతులకు రూ.44.19 కోట్ల పరిహారంగా అందించింది. -
చంద్రబాబు సర్కారు చేపట్టిన ‘రైతన్నా మీ కోసం’ అట్టర్ ఫ్లాప్
సాక్షి, అమరావతి: ప్రకటన ఆర్భాటం... ఆచరణ అధ్వానం..! ఇదీ చంద్రబాబు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల అమలు తీరు. ఈ కోవలోనే ‘రైతన్నా మీ కోసం’ అంటూ హడావుడి చేశారు. కానీ, హామీల ఎగవేత తప్ప ఏడాదిన్నర పాలనలో చేసిందేమీ లేకపోవడం, అన్నదాత సుఖీభవ అంటూ దగా చేయడం, విపత్తుల వేళ ఆదుకోకుండా గాలికి వదిలేయడంతో తొలిరోజే అన్నదాతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీంతో రెండో రోజు నుంచే మొహం చాటేశారు. కనీసం కరపత్రాలు కూడా పంచే సాహసం చేయలేకపోయారు. ప్రతి నెల సామాజిక పింఛన్ల పంపిణీలో ఫొటో షూట్‌తో నానా హంగామా చేస్తున్న సీఎం చంద్రబాబు రైతుల గడప తొక్కలేకపోయారు. రైతుల కోసం ప్రాణం ఇస్తానంటూ ఎన్నికల్లో నమ్మబలికిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అయితే పత్తా లేరు. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సైతం కూడా రైతుల వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలే కాదు చివరకు స్థానిక ప్రజా ప్రతినిధులకూ హాజరయ్యేందుకు ధైర్యం చాల్లేదు. ఫలితంగా ‘రైతన్నా మీ కోసం’ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. అసలు ఈ కార్యక్రమం కోసం పైసా కూడా విదిల్చ లేదంటేనే చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తోంది. పంచసూత్రాల్లేవ్.. ఇంటింటికీ పోలేదు.. ‘‘నేనూ రైతు బిడ్డనే. రాష్ట్రంలోని ప్రతి కర్షకుడి కష్టం నాకు తెలుసు. మీతో కలిసి నడవడానికి మీ సమస్యలు పరిష్కరించడానికి, మీకు పూర్తిగా అండగా ఉండేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం’’ అంటూ ‘రైతన్నా మీ కోసం’పై ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు గొప్పలు పోయారు. ప్రతి రైతు ఇంటికి వెళ్లి తమ ప్రభుత్వం గత ఏడాదిన్నరలో ఏం చేసిందో చెబుతామన్నారు. కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలతో పాటు అధికారులు కూడా పాల్గొంటారని, తానూ రైతుల ఇళ్లకు వెళ్తానని సీఎం స్వయంగా ప్రకటించారు. రైతును రాజును చేసేందుకు పంచ సూత్రాల పేరిట ముద్రించిన కరపత్రాలను అందించడంతో పాటు ప్రత్యేకంగా తెచ్చిన ఏపీఏఐఎంఎస్ (ఏపీ వ్యవసాయ సమాచార, నిర్వహణ వ్యవస్థ) యాప్‌ను వారి మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేయించి, దాని నిర్వహణపై అవగాహన కల్పించాలని ఆదేశాలిచ్చారు. ఆచరణకు వచ్చేసరికి ఆరంభ శూరత్వంగా మిగిలిపోయింది. తొలి రోజు హడావుడి, హంగామా చేసినా రైతుల నుంచి కనీస స్పందన లేదు. సరికదా పలుచోట్ల తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచి్చంది. టీడీపీ నేతలు తప్ప కూటమి ప్రభుత్వంలోని జనసేన, బీజేపీకి చెందిన ప్రజాప్రతినిదులు, నేతలు మచ్చుకైనా కనిపించలేదు. ఏ పంటకూ మద్దతు ధర లేదు.. ఇదే మీ నిర్వాకం ‘‘మిరప మొదలు అరటి వరకు 18 నెలలుగా ఏ పంటకూ గిట్టుబాటు ధర కాదు కదా మద్దతు ధర కూడా దక్కలేదు. ధాన్యానికి సైతం తేమ శాతం వంకతో మద్దతు ధర దక్కకుండా చేస్తున్నారు. ఓ వైపు ధరలు పతనమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం మద్దతు ధరకు సేకరించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు’’ అంటూ రైతన్నా మీ కోసంలో తొలిరోజే రైతులు ప్రజాప్రతినిధులను కడిగేశారు. మరోవైపు ‘ఉచిత పంటల బీమా ఎత్తేశారు. ప్రీమియం కట్టలేక బీమా చేయించుకోలేకపోయాం. వరుస విపత్తులతో పంటలు నష్టపోతే పైసా పరిహారం కూడా ఇవ్వలేదంటూ’ నిలదీశారు. ఎక్కడొచ్చింది అన్నదాత సుఖీభవ? అన్నదాత సుఖీభవ రెండు విడతల్లో పీఎం కిసాన్తో కలిపి రూ.14 వేలు జమ చేసినట్లు చెప్పి తప్పించుకుందాం అని కూటమి ప్రజాప్రతినిధులు భావించినా, ఆ సొమ్ము తమకు పడలేదంటే తమకు పడలేదని, తొలి విడతకు సంబంధించిన వినతులను కనీసం పట్టించుకోలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సమాధానం చెప్పలేక, రైతులను సముదాయించలేక జారుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో చేసేది లేక పాల్గొనలేదని పల్నాడుకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు. ‘‘అన్నదాత సుఖీభవ తొలి ఏడాది ఎగ్గొట్టాం. రెండో ఏడాది పీఎం కిసాన్తో కలిపి రెండు విడతల్లో రూ.14వేలు ఇవ్వడం తప్ప రైతులకు చేసిందేమి లేదు’’ అని కూటమి నేతలే బాహాటంగా చెబుతున్నారు. భజన మీడియా గప్‌చుప్.. సీఎం చంద్రబాబు బృందం కాలుబయటపెడితే చాలు.. అహో ఒహో అంటూ భజన చేసే పచ్చ మీడియా సైతం ‘‘రైతన్నా మీకోసం’’ గురించి ప్రస్తావించలేదు. దీంతోనే ఈ కార్యక్రమం ఎలా సాగిందో స్పష్టం అవుతోంది. రైతుల ఇళ్లకు వెళ్లినట్టు, వారు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్టు రోజువారీ నివేదికలివ్వడం తప్ప ప్రత్యక్షంగా రైతుల ఇళ్లకు వెళ్లిన దాఖలాలు మచ్చుకైనా కని్పంచలేదు. మెజార్టీ గ్రామాల్లో రైతులనే అధికారులు పిలిపించుకుని యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, లేదంటే మా ఉద్యోగాలు పోతాయంటూ బతిమిలాడిన పరిస్థితి నెలకొంది. రైతన్నా మీ కోసం ముగింపు సందర్భంగా ఈ నెల 3న ఆర్బీకేల పరిధిలో వర్కుషాపులు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. మా ఊరికి వస్తే నిలదీద్దామనుకున్నా.. ఎవరూ రాలేదు ‘నా వయస్సు 60 ఏళ్లు.. గత 45 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది రెండు విడతల్లో రూ.10 వేలు వేసామని చెబుతున్నారు. నాకు పడలేదు. ఎవరికి పడ్డాయో కూడా తెలియదు. సొంతంగా ఏడు ఎకరాలు, కౌలుకు మూడు ఎకరాలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. అప్పు చేసి పెట్టుబడి పెట్టి టమాట, పత్తి, కూరగాయలు పండించా. అధిక వర్షాల కారణంగా పత్తి 2–3 క్వింటాళ్ల దిగుబడే రాగా, మిగిలిన పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తికి క్వింటా రూ.5 వేలకు మించి ఇవ్వడం లేదు. కేంద్రానికి తీసుకెళ్తే కొనే పరిస్థితి లేదు. ఏంచేయాలో పాలు పోవడం లేదు. రైతన్నా మీ కోసం కార్యక్రమంలో మా గ్రామానికి వస్తే నిలదీద్దామనుకున్నా. ఏ ఒక్కరూ మాఇంటికి వచ్చిన పాపాన పోలేదు. -కె.తిమ్మయ్య, నలకలదొడ్డి, కర్నూలు జిల్లా బాబు సర్కారును రైతులు నమ్మడం లేదు మాటల గారడీ తప్ప రైతులకు కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు. మద్దతు ధర దక్కక ఓవైపు అరటి, ఉల్లి, మొక్కజొన్న, సజ్జ రైతులు గగ్గోలు పెడుతుంటే ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో చంద్రబాబు అన్నదాతల గడప తొక్కలేదు. అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తానని నమ్మబలికి తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టింది. రెండో ఏడాది రూ.10 వేలతో సరిపెట్టింది. కౌలు రైతులనైతే నిండా ముంచేసింది. అన్నింటా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం రైతన్నా మీ కోసం అంటూ ఆడుతున్న దొంగ నాటకాన్ని నమ్మే స్థితిలో రైతులు లేరు. – పి.జమలయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలు రైతు సంఘం -
తీవ్ర సంక్షోభంలో రాష్ట్ర వ్యవసాయ రంగం
సాక్షి, అమరావతి: తుపానుల ప్రభావం, గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ (అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్), వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అది పక్కనపెట్టి రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ప్రతిపక్ష నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆయన మండిపడ్డారు.దేశ సగటుకన్నా రాష్ట్ర సగటు సాగు విస్తీర్ణం పడిపోయినా ఈ ప్రభుత్వం మేల్కోవడం లేదని, మోంథా తుపాను, మద్దతు ధరలు లేకపోవడం వల్ల రాష్ట్రంలో మూడు ప్రధాన పంటలు వరి, పత్తి, మొక్కజొన్న సాగుచేస్తున్న రైతులు ఈ ఏడాది రూ.13,324 కోట్లు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తిరైతులు రూ. 9,209 కోట్లు, మొక్కజొన్న రైతులు రూ.1,536 కోట్లు నష్టపోయారని పేర్కొన్నారు.. టమాట, చీనీ, అరటి పంటలకు కనీస మద్దతు ధరలు కరువై పంటలను రాయలసీమలో రోడ్లపై పారబోస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. సాధారణ పంటలతో పోలిస్తే హార్టికల్చర్ సాగు విస్తీర్ణం తక్కువే అయినా జీఎస్డీపీలో మాత్రం మెజారిటీ వాటా పండ్ల తోటలదే అన్న విషయాన్ని ఈ ప్రభుత్వం విస్మరిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. 11 లక్షల ఎకరాల్లో వరి పంట నష్టం ‘మోంథా తుపాను వల్ల అన్ని పంటలు కలిపి 4 లక్షల ఎకరాల్లోనే దెబ్బతిన్నట్టు ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి మోంథా తుపాను ముందు వరకు రాష్ట్రంలో వరి సాగు బాగానే ఉన్నా తర్వాత బాపట్ల నుంచి శ్రీకాకుళం వరకు 28 లక్షల ఎకరాలపై తుపాను ప్రభావం తీవ్రంగా పడింది. అందులో 11 లక్షల ఎకరాల్లో దిగుబడులు పడిపోతున్నాయని గతంలోనే మా పార్టీ అధినేత వైఎస్ జగన్ చెప్పారు. ఒక్క వరిలోనే 11 లక్షల ఎకరాల్లో పంటదెబ్బతింటే అన్నిపంటలూ కలిపి 4 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయని ప్రభుత్వం చెబుతోంది. 83 లక్షల టన్నుల ఉత్పత్తి కూడా 73 నుంచి 74 లక్షల టన్నులకు పడిపోబోతోంది. 33 శాతం పైన పంట దెబ్బతింటేనే ఇన్పుట్ సబ్సిడీకి అర్హత ఉందంటున్నారు.అంతకన్నా తక్కువ నష్టం జరిగిన రైతుల గురించి చెప్పడం లేదు. 83 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే పరిస్థితి ఉందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టు, అందులో 51 లక్షల టన్నులు సేకరిస్తామని చెబుతున్నారు. గత రబీ సీజన్లో అమ్మిన పంటకు ఏప్రిల్ తరువాత నాలుగు నెలలపాటు డబ్బులు ఇవ్వకున్నా 24 గంటల్లోనే డబ్బులిస్తున్నట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పడం హాస్యాస్పదం. ఈ దిగుబడి మోంథా తుపాన్ కారణం గా ఉత్పత్తి తగ్గడం వల్ల సేకరణ కూడా 36 టన్నుల నుంచి 37 లక్షల టన్నులు దాటదు’ అని చెప్పారు.వరి రైతుకు రూ.2579 కోట్లు నష్టం ‘కల్లాల్లో ధాన్యం.. కళ్లల్లో దైన్యం! శీర్షికతో తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రిక ఈనాడులోనే రాశారు. ఇన్ని రోజులుగా వైఎస్సార్సీపీ రైతుల పక్షాన చెబుతున్న మాటలనే యథాతథంగా ఈనాడు కూడా రాసిందంటే ఎంత దయనీయ పరిస్థితులు ఉన్నాయనేది తెలిసిపోతోంది. తేమ శాతం చూపించి ధర తగ్గించడంతో రైతులు నష్టపోతున్నారు. ఎక్కడికెళ్లినా గన్నీ సంచులు దొరకడం లేదు. రవాణా చేద్దామంటే లారీలు లేవంటున్నారు. 75 కిలోల బస్తాకు మద్దతు ధర ప్రకారం రూ.1,777 దక్కాల్సి ఉంటే.. రైతుకు సగటున రూ.1,450 మాత్రమే లభిస్తోంది. ఈనాడు చెప్పే లెక్కల ప్రకారమే రైతు బస్తాకు రూ.250 నష్టపోతున్నాడు. ఈ లెక్కన ఒక్క ధాన్యం మీదనే రూ.2,579 కోట్లు వరి రైతు నష్టపోతున్నాడు’ అని వివరించారు. -
అడవే సేద్యానికి ఆధారం
అడవుల నరికివేతతో ఏటా 28 వేల మరణాలు : స్థానికంగా అడవులు నీడ, బాష్పీభవన ప్రేరణ ద్వారా చల్లని సూక్ష్మ వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఉష్ణ ఒత్తిడిని తగ్గిస్తాయని నివేదిక వివరించింది. అదే సమయంలో అటవులను నిర్మూలిస్తే ఆ కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇది వ్యవసాయం పైన మాత్రమే కాకుండా మానవ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా, 2001–2020 మధ్య, ఉష్ణమండలంలో అడవుల నరికివేత వల్ల ఏటా సుమారు 28,000 అదనపు ఉష్ణ సంబంధిత మరణాలకు దారితీసిందని ఎఫ్ఏవో అంచనా. అటవీ విస్తీర్ణం తగ్గితే పర్యావరణ సమస్యలు రావటంతో ΄ాటు ప్రజారోగ్యానికి ముప్పు ఎలా వస్తోందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అడవులు, చెట్లు వ్యవసాయానికి ముఖ్యమైన అనేక ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. పరాగ సంపర్కం, తెగుళ్ల జీవ నియంత్రణ, పోషక చక్రం పరిరక్షణ, రక్షక కవచం, వాతావరణ నియంత్రణ వంటి ప్రయోజనాలు చేకూరతాయి. ఇవి పంట దిగుబడిని పెంచుతాయి. పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతాయని ఎఫ్ఏవో పేర్కొంది. అందువల్ల అడవులు, చెట్లను వ్యవసాయ పొలాలతో ఆశ్రయ కేంద్రాలు, నదీ తీర బఫర్ జోన్లు, అటవీ ప్రాంతాలుగా అనుసంధానించి అభివృద్ధి చేసే విధానాలనుపాలకులు రూపొందించటం చాలా ముఖ్యం. ఈ వ్యూహాలు వ్యవసాయంలో కృత్రిమ ఎరువులు తదితర ఉత్పాదకాల వినియోగంపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. పంట పొలాలకు ప్రతికూల వాతావరణ పరిస్థితులను దీటుగా తట్టుకునే శక్తినిస్తాయి. వైవిధ్యమైన, పోషక–సాంద్రత కలిగిన ఆహార పదార్థాల ఉత్పత్తికి దోహదం చేస్తాయని నివేదిక పేర్కొంది.‘అడవి–వ్యవసాయం మధ్య పోటీ లేద’ని ఆహార వ్యవసాయ సంస్థ (యూఎన్–ఎఫ్ఏవో) తెలిపింది. బ్రెజిల్లో ఇటీవల ముగిసిన వాతావరణ మార్పుపై అంతర్జాతీయ శిఖరాగ్ర వార్షిక సమావేశం (కాప్ 30) సందర్భంగా ఒక కీలకమైన నివేదికను ఎఫ్ఏవో వెలువరించింది. ‘అడవులు, చెట్లు వ్యవసాయం కోసం వాతావరణ, పర్యావరణ సేవల ప్రయోజనాలు 2025’ పేరిట ఈ నివేదికను ఎఫ్ఏవో విడుదల చేసింది. చెట్లు, అడవుల వల్ల వ్యవసాయానికి ఒనగూరే ప్రయోజనాలను లెక్కగట్టే పద్ధతులను ఈ నివేదిక వెల్లడించింది. ఆహార భద్రత అడవులపై ఆధారపడి ఉంటుంది. వ్యవసాయ పొలాల్లో ఉత్పాదకతను పెంచడానికి అడవుల పరిరక్షణ, పునరుద్ధరణ కీలకమైన చర్యలుగా ఉపయోగపడతాయని నివేదిక వెల్లడించింది. ప్రపంచ అడవులు భూగోళంపైన వ్యవసాయ–ఆహార పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసే ముఖ్యమైన సేవలను అందిస్తాయి. అయితే, ఈ సేవల విలువను చాలా సార్లు తక్కువగా అంచనా వేస్తుండటం విచారకరం. అందుకే ఈ రెండు రంగాలను సమన్వయంతో అభివృద్ధి చేసేలా తగిన విధానాలు రూపొందించాలి, పెట్టుబడులను ప్రోత్సహించాలని నివేదిక పిలుపునిచ్చింది. వ్యవసాయ విస్తరణ కోసం భూమి అవసరమైనప్పుడల్లా అడవులు, చెట్లు వ్యవసాయంతో పోటీ ఏర్పడుతుంది. కానీ, అడవులను సంరక్షించడం, పునరుద్ధరించడం వాస్తవానికి వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించటానికి దోహదం చేసే చాలా ముఖ్యమైన పని’ అని ఎఫ్ఏవో ఫారెస్ట్రీ డైరెక్టర్ డా. జిమిన్ వు అన్నారు.అడవులు, చెట్ల వల్లే 50% వర్షపాతం ఎఫ్ఏవో, స్టాక్‌హోమ్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టిట్యూట్, కన్జర్వేషన్ ఇంటర్నేషనల్, ది నేచర్ కన్జర్వెన్సీ సంయుక్తంగా ప్రచురించిన నివేదిక ఇది. అడవుల నరికివేత వల్ల వాతావరణంపై, వ్యవసాయంపై తక్షణం పడే ప్రభావాలను, కొలవగల ప్రభావాలను ఈ నివేదిక నొక్కి చెబుతుంది. అడవులను పరిరక్షిస్తే కలిగే ప్రయోజనాలు.. పర్యావరణ వ్యవస్థలు ఉష్ణోగ్రతలను తగ్గించడంతోపాటు వర్షపాతాన్ని నిలబెట్టుకుంటాయి. నీటి చక్రాన్ని నియంత్రిస్తాయి. పంట ఉత్పాదకతపై నేరుగా ప్రభావం చూపుతాయి. స్థానిక వాతావరణ పరిస్థితులను స్థిరీకరిస్తాయి. గ్రామీణ ప్రజల ఆరోగ్యం, భద్రత, జీవనోపాధిని మెరుగుపరుస్తాయి.155 దేశాల్లోని వ్యవసాయ భూములు ఇతర దేశాల్లోని అడవులు అందించే పర్యావరణ సేవలపై ఆధారపడి వార్షిక వర్షపాతంలో 40% పొందుతున్నాయి. ఇది ముఖ్యంగా ఆఫ్రికాకు వర్తిస్తుంది. ఒక సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 శాతం వర్ష΄ాతం అడవులు, చెట్లు వాతావరణంలోకి వదిలే నీటి తేమ ద్వారా లభిస్తుంది. కాంగో వర్షారణ్యం దాని తేమలో 40 శాతానికి పైగా స్థానికంగా రీసైకిల్ చేస్తుంది. ఆఫ్రికాలో మారుమూల వ్యవసాయ ప్రాంతాలకు కూడా 10 శాతానికి పైగా వర్షపాతాన్ని అందిస్తుందని ఈ నివేదిక వెల్లడించింది. సగం అడవులను పునరుద్ధరిస్తే 1 డిగ్రీ వేడి తగ్గుతుందిప్రపంచంలో కోల్పోయిన ఉష్ణమండల అడవుల్లో సగాన్ని పునరుద్ధరిస్తే నేలపై ఉష్ణోగ్రతలు 1 డిగ్రీల సెల్సియస్ మేరకు తగ్గుతాయి. వ్యవసాయం, నీటి భద్రత సాధన కోసం అడవులు చెట్ల నీటి చక్రాల పునరుద్ధరణకు, వాతావరణ నియంత్రణ విధులను పునరుద్ధరణకు ఇది సహాయపడుతుంది. అయితే, ఈ లక్ష్యాల సాధన కోసం అడవుల పునరుద్ధరణకు దృఢచిత్తంతో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక ్ర΄ోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని నివేదిక వివరించింది. ఆహార భద్రత, ప్రజారోగ్యం, వాతావరణ ప్రతికూలతలను తట్టుకోవటం కోసం సుస్థిరమైన అటవీ నిర్వహణ బాధ్యతను బహుళ రంగాలకు ప్రయోజనం చేకూర్చే వ్యూహంగా గుర్తించాలని ఎఫ్ఏవో నివేదిక పేర్కొంది.రైతులు, స్థానిక ఆదివాసీ సమాజాలను భాగస్వాముల్ని చెయ్యాలి. అటవీ పునరుజ్జీవన, పరిరక్షణ పథకాల రూపుకల్పనలో, పర్యవేక్షణ కార్యకలాపాలను మెరుగుపరచడంలో వారిని పాల్గొనేలా చేయడం ద్వారా వారికి సాధికారత కల్పించాలి. అటవీ సంరక్షణ, పునరుద్ధరణ, సుస్థిరమైన పద్ధతుల్లో అడవిని ఉపయోగించుకోవటంపై పెట్టే పెట్టుబడులన్నీ వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయం కోసం, గ్రామీణ జీవనోపాధులు పెంపొందించటం కోసం, ప్రపంచ ఆహార భద్రత, నీటి భద్రత కల్పించటం కోసం పెట్టే మంచి పెట్టుబడులేనని అర్థం చేసుకోవాలి. అడవిని వ్యవసాయంతో సమన్వయీకరించి ్ర΄ోత్సహించడం ద్వారా ప్రజలు మరింత ఉత్పాదక, సుస్థిరమైన, సమానతతో కూడిన భవిష్యత్తు కోసం పని చేయటం సాధ్యపడుతుందని నివేదిక చివరలో ఎఫ్ఏవో స్పష్టం చేసింది.అడవి... వ్యవసాయానికి శత్రువని సాధారణంగా చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే, అది నిజం కాదు. నిజానికి అడవుల వల్ల వ్యవసాయానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అడవి, చెట్లు అందించే పర్యావరణ సేవలు వ్యవసాయాన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడే శక్తిస్తాయి. వర్షపాతం తగినంత పొందటానికి అడవులు అత్యవసరం. పంట భూముల్లో భూసారాన్ని పెంచుకునేందుకు అడవులు దోహదపడతాయి. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాల్లో ఉండే అడవులు ఆ అడవులున్న దేశాలకే కాదు వందలాది ఇతర దేశాలకు కూడా పర్యావరణ సేవలు అందిస్తున్నాయని గుర్తించండి. అడవి ఏ దేశ భూభాగంలో ఉన్నప్పటికీ అంతర్జాతీయ సంపదేనని గమనంలో పెట్టుకోండి. ఈ వ్యవసాయ ప్రాణాధార అడవుల్లో నరికివేసిన విస్తీర్ణంలో సగానికి సగంలోనైనా తిరిగి చెట్లను పెంచితే ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయానికి భూతాపోన్నతిని తట్టుకొని నిలబడే వనరులను సమకూర్చుతుందని పాలకులు గుర్తెరగాలి.అందుకు అనుగుణంగా విధానాలను రూపొందించి అమల్లోకి తేవాలి. స్థానిక ప్రజలను, రైతులను ఈ అడవుల పునరుజ్జీవన కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేస్తే లక్ష్యం సాధించటం సులభమవుతుంది. అడవిని రక్షించుకుంటే వ్యవసాయం చల్లగా పది కాలాలు బతుకుతుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (యూఎన్–ఎఫ్ఏవో) ఇటీవల వెలువరించిన ఓ కీలక నివేదికలో ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేసింది. ఉష్ణమండదేశాల్లో అడవి ఏ దేశంలో ఉన్నప్పటికీ విదేశాల్లో సేద్యానికి మేలు ‘‘155 దేశాల్లోని వ్యవసాయ భూముల్లో కురిసే వార్షిక వర్షపాతంలో 40% ఇతర దేశాల్లోని అడవులందించే పర్యావరణ సేవలే ఆధారం’’‘‘వ్యవసాయ విస్తరణ కోసం భూమి అవసరమైనప్పుడల్లా అడవులు, చెట్లు వ్యవసాయంతో ΄ోటీ ఏర్పడుతుంది. కానీ, అడవులను సంరక్షించడం, పునరుద్ధరించడం వాస్తవానికి వ్యవసాయ ఉత్పాదకతను పెం΄÷ందించటానికి దోహదం చేసే చాలా ముఖ్యమైన పని!’’– డా. జిమిన్ వు, ఫారెస్ట్రీ డైరెక్టర్, యూఎన్–ఎఫ్ఏవో – నిర్వహణ: పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్ -
విపత్తుల 'వైపరీత్యం'..
కరువు, వరదలు, తుపాన్లు, తెగుళ్లు, వాతావరణ మార్పులు వంటి విపత్తులు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఒక్క భారత్‌కే కాదు ప్రపంచవ్యాప్తంగా రైతన్నలపాలిట ఇవి శాపంగా మారాయి. గడిచిన 33 ఏళ్లలో అంతర్జాతీయంగా ఈ విపత్తులు రూ.2,88,99,900 కోట్ల మేర వ్యవసాయ నష్టాలను కలిగించాయని అంచనా. అంటే ఏటా రూ.8,75,754 కోట్లు. ఇది ప్రపంచ వ్యవసాయ జీడీపీలో దాదాపు 4 శాతం అన్నమాట. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) వ్యవసాయం, ఆహార భద్రతపై విపత్తుల ప్రభావం–2025 పేరుతో రూపొందించిన కొత్త నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 1991–2023 మధ్య విపత్తుల కారణంగా జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఈ కాలంలో ఊహలకు అందనంతగా 460 కోట్ల టన్నుల తృణధాన్యాలు, 280 కోట్ల టన్నుల పండ్లు, కూరగాయలు, 90 కోట్ల టన్నుల మాంసం, పాల ఉత్పత్తులు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ నష్టాలు రోజువారీ తలసరి 320 కిలో కేలరీల తగ్గింపునకు దారితీశాయి. అంటే సగటు శక్తి అవసరాల్లో 13–16 శాతం అన్నమాట. ప్రపంచ నష్టాల్లో ఆసియా అత్యధికంగా 47 శాతం వాటాతో ముందు వరుసలో ఉంది. మొత్తం రూ.1,35,82,953 కోట్ల నష్టం మూటగట్టుకుంది. ఉపాధి, ఆదాయంలో వ్యవసాయం గణనీయమైన వాటాను కలిగి ఉన్న ఆర్థిక వ్యవస్థల్లో ఈ నష్టాలు ఆహార భద్రత, గ్రామీణ స్థిరత్వానికి తీవ్ర పరిణామాలను కలిగిస్తాయి. మత్స్య సంపద సైతం..యూఎస్ఏ 22 శాతం లేదా రూ.63.5 లక్షల కోట్ల నష్టాలతో రెండవ స్థానంలో ఉంది. తరచూ వచ్చే కరువులు, తుపాన్లు, అలాగే తీవ్ర ఉష్ణోగ్రతలు ఇందుకు కారణం. రూ.54 లక్షల కోట్ల నష్టంతో ఆఫ్రికా టాప్–3లో చోటు సంపాదించింది. విపత్తుల కారణంగా వ్యవసాయ జీడీపీలో 7.4 శాతం ఆఫ్రికా కోల్పోతోంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే అతిపెద్ద భారం ఆఫ్రికాకే. ఫిజీ, మాల్దీవులు, జమైకా, క్యూబా వంటి స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ (ఎస్ఐడీఎస్) తుపాన్లు, వరదలు, సముద్ర మట్టం పెరుగుదల వంటి విపత్తులకు ప్రపంచంలోనే అత్యంత ప్రభావితమయ్యే దేశాల్లో ఒకటిగా ఉన్నాయి. 1985–2022 మధ్య సముద్ర వేడి గాలులు రూ.58,509 కోట్ల నష్టాలను కలిగించాయి. ఇది ప్రపంచ మత్స్య సంపదలో 15 శాతం ప్రభావితం చేసింది. మత్స్య, ఆక్వాకల్చర్ రంగం 50 కోట్ల మంది ప్రజల జీవనోపాధికి మద్దతు ఇస్తోంది. విప్లవాత్మక మార్పులు.. కరువులు, వరదలు మొదలుకుని తెగుళ్లు, వేడి గాలుల వరకు.. ఈ ప్రకృతి విపత్తులు ఆహార ఉత్పత్తి, జీవనోపాధి, పోషకాహారాన్ని దెబ్బతీస్తున్నాయి. విపత్తుల వల్ల తలెత్తే సంక్షోభం నుంచి వ్యవసాయ ఆహార వ్యవస్థలను గట్టెక్కించడానికి మాత్రమే డిజిటల్ ఆవిష్కరణలు పరిమితం కాలేదు.ముందస్తు చర్యలతో డేటా ఆధారిత స్థితిస్థాపకత నిర్మాణానికి మారడంలో సాయపడుతున్నాయి. ప్రమాదాలను పర్యవేక్షించడం, ముందస్తు హెచ్చరికలను అందించడం, రైతులు వేగంగా నిర్ణయం తీసుకోవడంలో డిజిటల్ టెక్నాలజీలు ఇప్పటికే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయని నివేదిక వివరించింది. గేమ్ చేంజర్‌గా.. వ్యవసాయ విపత్తు ప్రమాదాలను తగ్గించే విషయంలో డిజిటల్ వినియోగం గేమ్ చేంజర్‌గా నిలిచిందని ఎఫ్ఏఓ నివేదిక కితాబిచి్చంది. కృత్రిమ మేధస్సు (ఏఐ), రిమోట్ సెన్సింగ్, మొబైల్ కనెక్టివిటీ, డ్రోన్స్, సెన్సార్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాధనాలు ఇప్పుడు రైతులకు కావాల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వేగంగా అందిస్తున్నాయని తెలిపింది. ఇవి ముందస్తు హెచ్చరిక, సలహా సేవలు, బీమా, ముందస్తు చర్యలను మెరుగుపరుస్తున్నాయని వెల్లడించింది. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (జీఐఈడబ్ల్యూఎస్) వంటి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు పెట్టుబడి పెట్టిన ప్రతి డాలర్‌కు ఏడు డాలర్ల వరకు రాబడిని ఇవ్వగలవని నివేదిక తెలిపింది. -
వ్యవసాయ ఆదాయం.. పన్ను భారం లెక్కింపు
గత రెండు వారాలుగా వ్యవసాయ భూముల గురించి, వ్యవసాయ ఆదాయం గురించి తెలుసుకున్నాం. మూడో వారం ముచ్చటగా వ్యవసాయ ఆదాయం వల్ల పన్ను భారం ఎలా లెక్కించాలో ఉదాహరణలతో తెలుసుకుందాం. ఈ కాలమ్‌లో చెప్పిన ఉదాహరణలలో ప్రస్తావించిన వ్యవసాయ ఆదాయం, చట్టప్రకారం నిర్దేశించిన రూల్స్‌ను బట్టి లెక్కించినదిగా అనుకోండి. కేవలం వ్యవసాయ ఆదాయమే ఉంటే.. ఒక వ్యక్తి సంవత్సర ఆదాయం పూర్తిగా వ్యవసాయం నుంచే వచ్చి, ఇతరత్రా ఆదాయమేమీ లేదనుకుందాం. అలాంటప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి పన్నుభారం ఏర్పడదు. నూటికి నూరుపాళ్లు మినహాయింపే. దీని ప్రకారం చాలా మంది చిన్నకారు/సన్నకారు రైతులకు ఇన్‌కంట్యాక్స్ పడదు. కేవలం వ్యవసాయేతర ఆదాయం ఉండి, వ్యవసాయం మీద ఆదాయం లేకపోతే.. సవ్యసాచి అనే వ్యక్తి వయస్సు 60 సంవత్సరాల లోపు ఉందనుకుందాం. అతను రెసిడెంటు అయి ఉండి, వ్యాపారం కలిగి ఉన్న వ్యక్తి అనుకుందాం. సాధారణంగా ట్యాక్సబుల్ ఇన్‌కం రూ. 14,00,000. 2025–26 ఆరి్థక సంవత్సరానికి ఈ వ్యక్తి కొత్త పద్ధతిని ఫాలో అయితే, శ్లాబులు/రేట్ల ప్రకారం పన్ను భారం రూ. 90,000 ఉంటుంది. విద్యా సుంకం అదనం. ఇదే సవ్యసాచికి రూ. 9,00,000 వ్యవసాయం మీద ఆదాయంగా వస్తోంది. ఇది కాకుండా పైన చెప్పిన రూ. 14,00,000 ఆదాయం కూడా ఉంది. ఇప్పుడు పన్ను ఎలా లెక్కించాలంటే..A. వ్యవసాయ ఆదాయం, వ్యవసాయేతర ఆదాయం కలిపితే మొత్తం ఆదాయం రూ. 23,00,000. దీనిపై పన్ను= రూ. 2,90,000B. వ్యవసాయ ఆదాయం, బేసిక్ లిమిట్ మాత్రమే కలిపితే మొత్తం ఆదాయం రూ.13,00,000. దీనికి సంబంధించి రిబేటు = రూ. 75,000 ఇప్పుడు (A) నుంచి (B)ని తీసివేస్తే, అంటే రూ. 2,90,000 నుంచి రిబేటు రూ. 75,000 తీసివేస్తే కట్టాల్సిన పన్ను భారం రూ. 2,15,000గా ఉంటుంది. దీనికి విద్యా సుంకం అదనం.ఇప్పుడు విశ్లేషణలోకి వెళ్దాం..మొత్తం వ్యవసాయేతరం మీద ఆదాయం వచి్చందనుకోండి, రూ. 2,90,000 పన్ను కట్టాలి. రూ. 2,90,000 ఎక్కువగా భావించి, ఇందులో కొంత ఆదాయం, అంటే రూ. 9,00,000 వ్యవసాయం అని అన్నాం అనుకోండి. రూల్సు ప్రకారం ఆధారాలన్నీ ఉన్నాయనుకుంటే, రూ. 75,000 రిబేటు వస్తుంది. ఈ మేరకు పన్ను భారం తగ్గుతుంది. అందరూ కేవలం రూ. 14,00,000 మీద పన్ను చెల్లిస్తే సరిపోతుంది, వ్యవసాయ ఆదాయం మీద మినహాయింపు వస్తుందని అనుకుంటారు. ఈ ఊహ అబద్ధం. నిజం కాదు. ఇక్కడో వల, మెలిక ఉన్నాయి. ఈ రెండింటి మీద ఆదాయాన్ని కలిపి స్థూల పన్ను భారాన్ని లెక్కిస్తారు. (రూ. 14,00,000 + 9,00,000)బేసిక్ లిమిట్కి వ్యవసాయ ఆదాయం కలిపి పన్ను లెక్కిస్తారు (రూ. 4,00,000 + రూ. 9,00,000)చెల్లించాల్సిన పన్ను (5) – (6)దీనికి విద్యా సుంకం అదనంరూ. 9,00,000 వ్యవసాయ ఆదాయం కలపడంతో శ్లాబు మారుతుంది. పెద్ద శ్లాబులోకి వెళ్తారు.బేసిక్ లిమిట్కి వ్యవసాయ ఆదాయం కలిపితే అది తక్కువ / లేదా చిన్న శ్లాబులో ఉంటుంది. పై శ్లాబుకి వెళ్లడం వల్ల పన్ను భారం పెరుగుతుంది.రూ. 9,00,000 మీద అదనంగా రూ. 1,25,000 కట్టాల్సి వస్తోంది. వాస్తవానికి పన్ను భారమే ఉండదనుకుంటే, అది ఏకంగా రూ. 1,25,000కు పెరిగింది. మరో కేసు. 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి. జీతం రూ. 8,00,000, వ్యవసాయం మీద ఆదాయం రూ. 4,00,000. పాత పద్ధతిని ఎంచుకుని, పన్ను లెక్కిస్తే రూ. 1,72,500 అవుతుంది. అందులో నుంచి రూ. 42,500 రిబేటు తీసివేయగా రూ. 1,30,000 చెల్లించాలి. విద్యా సుంకం అదనం.కొత్త పద్ధతైనా, పాత పద్ధతైనా, ఇలా కలపడాన్ని పార్షియల్ ఇంటిగ్రేషన్ ( partial integration) అంటారు. దీని వల్ల పన్ను భారం పెరుగుతుంది.అయితే, వ్యవసాయ ఆదాయం కలపడం వల్ల, వ్యవసాయేతర ఆదాయం పెద్ద శ్లాబులోకి వెళ్లింది. ఆ మేరకు పన్ను భారం పెరిగింది. కానీ, రిబేటు ఇవ్వడం వల్ల పన్ను భారం తగ్గుతుంది.పన్ను భారాల పంపిణీ న్యాయబద్ధంగా ఉండేలా, పన్ను విధింపులో సమానత్వాన్ని పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా దీన్ని భావించాలి. ఏదైతేనేం, వ్యవసాయ ఆదాయాన్ని ఒక ట్యాక్స్ ప్లానింగ్ మార్గంగా భావించి, పన్ను ఎగవేత వైపు వెళ్లేవారికి ఇదొక హెచ్చరిక. -
Income Tax: వ్యవసాయ ఆదాయం అంటే..?
గతవారం వ్యవసాయ భూముల అమ్మకం, క్యాపిటల్ గెయిన్ గూర్చి తెలుసుకున్నాము. కొందరు పాఠకులు అసలు ‘వ్యవసాయ ఆదాయం’ ఏమిటని అడుగుతున్నారు. ఆదాయపన్ను చట్టంలో వ్యవసాయ ఆదాయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ ఆదాయం మీద పన్ను భారం లేదు. పూర్తిగా మినహాయింపే! అయితే ఇది కేవలం రైతులకు మాత్రమే కాదు రైతులుగా వ్యవసాయం చేసే వారికి కూడా ఈ మినహాయింపులు ఇస్తారు. అంటే భూమికి ఓనరే కావల్సిన అవసరం లేదు. కొన్ని షరతులు ఉన్నాయి. తెలుసుకోండి. వ్యవసాయ భూమి దేశంలోనే ఉండాలి. ఇందుకు సంబంధించి కాగితాలు ఉండాలి. అవి న్యాయబద్ధంగా ఉండాలి. సర్వే నెంబర్లు... పోరంబోకు భూములు, అడవులు, మెట్టభూములు, ఇసుక మెట్టలు, బంక మట్టివి మొదలగునవి చెప్పి మోసం చేయకండి. వ్యవసాయానికి అనువైన భూమిగా ఉండాలి. పట్టా పుస్తకాలు, పాస్ బుక్‌లు, అమ్మకం పత్రాలు, మ్యూటేషన్ వివరాలు ఉండాలి. వీటి ద్వారా హక్కులు, పరిమాణం, సరిహద్దులు, కొలతలు, యాజమాన్య స్థితి, ల్యాండ్ రికార్డు తదితర రికార్డులుండాలి. ఆ నిర్దేశిత వ్యవసాయ భూమి ద్వారా ఆదాయం ఏర్పడాలి. అది అద్దె కావచ్చు. పాడి పంటలు అమ్మగా నికరంగా మిగిలింది కావచ్చు. ఫామ్ హౌస్ మీద ఆదాయం కావచ్చు. అయితే ఆదాయం చేతికొచ్చినట్లు ఆధారాలుండాలి. రశీదులు, అగ్రిమెంట్లు, వ్యవసాయ కమిటీలు, పంపినట్లు రశీదు క్రయవిక్రయాలకు కాగితాలు మొదలైనవి. ఎంత పంట పండింది? పరిమాణం ఎంత? ఎక్కడ దాచారు? ఎంత దాచారు? సొంత వాడకం ఎంత? మార్కెట్ యార్డులకు ఎలా తరలించారు? ఎంత ధరకు అమ్మారు? ఎవరికి అమ్మారు? నగదు ఎలా వచ్చింది? బ్యాంకులో జమ ఎంత? తదితర వివరణలు ఉండాలి. అలాగే ఖర్చులు వివరాలు... అంటే సాగుబడికెంత? లేబర్‌కి ఎంత? విత్తనానికి ఎంత? పురుగు మందులకు ఎంత? ఎరువులకు ఎంత? యంత్రాల పనిపట్లపై ఎంత ఖర్చు చేశారు? కరెంటు ఎంత? బట్వడా ఎంతిచ్చారు ? ట్రాక్టరు బాడుగ, నీటి పారుదల, గోదాములు ఖర్చు తదితరాలపై సరైన కాగితాలుండాలి. పంటల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయమై ఉండాలి.కౌలు ద్వారా వచ్చినది వ్యవసాయ ఆదాయమే.. అయితే అగ్రిమెంట్లు ఉండాలి. ఒకటి గుర్తుంచుకోండి. నిజానికి రైతుకి నెలసరి ఆదాయం 2021–22లో సగటున రూ.12,698గా ఉంది. ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంది. ఇక మిగిలింది ఎంత ? గొర్రె తోకంత. కానీ ఆదాయపు పన్ను శాఖ వారి రికార్డుల ప్రకారం ఏడాదికి కోటి రూపాయల వ్యవసాయ ఆదాయం ప్రకటించిన వారి సంఖ్య సుమారు 3,000 మంది. అందుకని వారి డేగ కన్ను కచ్చితంగా ఉంటుంది గుర్తుపెట్టుకొండి. కింద వివరాలు, ఉదాహరణలు గమనించండి విత్తనాల అమ్మకాలు, మొక్కలు, పూలు, పాదులు, ల్యాండ్ మీద అద్దె, వ్యవసాయం చేసే భాగస్వామ్య సంస్థలో భాగస్వామికిచ్చే వడ్డీ, పంట అమ్మకం పంట నష్టం అయితే ఇన్సూరెన్సు వారిచ్చే పరిహారం, అడువులలో చెట్లు ఇవన్నీ వ్యవసాయం మీద ఆదాయం కిందకు వస్తాయి. ఈ కిందివి వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయాలు కావుభూమి బదిలీ చేసిన తరువాత వచ్చిన ఎన్యూటీ బకాయి అద్దెల మీద వడ్డీ కౌలు తీసుకున్న వారు డబ్బులు చెల్లించకపోతే బదులుగా ప్రామిసరీ నోటు ఇచ్చి.., వాటి మీద వచ్చే వడ్డీ అటవీ సంపద అమ్మకం అంటే చెట్లు, పండ్లు, పూలు, అడవి గట్టి వంటివి అడవి నుంచి దొంగిలించినవి అమ్మివేయగా వచ్చేవి. పొలాల్లో సముద్రపు నీరు రావడం వలన ఏర్పడ్డ ఉప్పు అమ్మకం ద్వారా ఆదాయం వడ్డీ కమీషన్ చేపల అమ్మకం ఫైనాన్సింగ్లోని రాయితీ వెన్న, చీజ్ అమ్మకం పౌల్ట్రీ ఆదాయం డెయిరీ మీద ఆదాయం తేనెటీగల పెంపకం చెట్లు నరకడం ద్వారా వచ్చిన ఆదాయం ఫామ్ హౌజ్‌ని టీవీ, సీరియల్స్ షూటింగ్‌లకు అద్దెకిస్తే వచి్చన ఆదాయం విదేశాల నుంచి వచి్చన వ్యవసాయ ఆదాయం వ్యవసాయ కంపెనీ ఇచ్చే డివిడెండ్లు టీ పంటలో ఆదాయం 40%, మిగతా 60% వ్యవసాయం మీద ఆదాయం కాఫీలో 25%, (పండించి అమ్మితే) రబ్బర్ 95% కాఫీ... చికోరితో/లేదా చికోరి లేకుండా 40%చివరిగా, వ్యవసాయ ఆదాయం రూ.5,000 కు మినహాయింపు అందరికీ ఉంటుంది. దీనితో పాటు వ్యవసాయేతర ఆదాయం ఉన్నవారికి రెండింటిని కలిపి పన్ను భారం లెక్కిస్తారు. దీని వల్ల కొంత పన్ను భారం పెరుగుతుంది. కేవలం వ్యవసాయం మీద ఆదాయం ఇతరత్రా టాక్సబుల్ ఇన్కమ్ లేకపోతే పన్నుభారం లేదు. -
వ్యవసాయ రంగాన్ని కాపాడరా?
వ్యవసాయ రంగం (Agriculture sector) పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దివాళాకోరు విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతు న్నారు. రోజురోజుకూ వ్యవసాయాన్ని వదిలి గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్ళి కూలీ నాలి చేసుకొనే దుఃస్థితిలో రైతులున్నారు. పంటలు దెబ్బతింటే నష్ట పరిహారం అందక, వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడులు వెళ్ళక, తెచ్చిన అప్పులు తీర్చలేక, మానసిక ఒత్తిడికి గురై రాష్ట్రంలో ప్రతి యేటా 450 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడు తున్నారు. వీటికి ప్రభుత్వాల వైఫల్యమే ప్రధాన కారణం. అందరికీ అన్నం పెట్టే రైతన్న నేడు అడుక్కోవలిసిన అధోగతి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2021–22 నాటి వ్యవసాయ ప్రణాళికను ప్రకటించటం నిలిపివేసింది. దాన్ని నేడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నది. 2014 నుండి 2025 వరకు కరువులు, వరదల వలన ప్రతిసంవత్సరం పెద్ద ఎత్తున పంటల నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వాల సహకారం లేకపోవడంతో రైతుల్లో అయోమయ స్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక కమిషన్ (2015–20), 15వ ఆర్థిక కమిషన్ (2020–25) ద్వారా ప్రకృతి వైపరీత్యాల వలన నష్ట పోయిన రైతులకు పరిహారం ప్రకటించింది. అయినా, ఇప్పటి వరకు సక్రమంగా రైతులకు అది అందకపోవడం విచారకరం. 2023లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలు ప్రకృతి వైపరీత్యాల సహాయం కొరకు కేంద్ర ప్రభు త్వానికి లేఖలు రాసింది. కేంద్ర బృందాలు వచ్చి, పరిశీలించి వెళ్ళాయి తప్ప, ఎలాంటి సహాయం ఇవ్వలేదు. 2021–26 సంవత్సరానికి 15వ ఆర్థిక కమిషన్ కింద అన్ని రాష్ట్రాలకు కలిపి 1.61 లక్షల కోట్ల నిధులు కేటాయించారు. తెలంగాణకు మాత్రంఅందులో కేవలం రూ. 2,872 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం రికమండ్ చేసిన వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం లేదు. రాష్ట్రంలో కల్తీ విత్తన వ్యాపా రులపై పీడీ యాక్ట్ పెడతామని గొప్పగా ప్రకటించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఒక్క లైసెన్సును కూడా రద్దు చేయలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం రైతులకు సరిపడా ఎరువులు అందించలేకపోతోంది. దీనికితోడు కృత్రిమ కొరతను సృష్టించి ఎరు వుల ధరలు అడ్డగోలుగా పెంచుతున్నారు వ్యాపారులు. కేంద్రం ఎరువులపై సబ్సిడీ బాగా తగ్గించడంతో ధరలు విపరీతంగా పెరుగు తున్నాయి. 2022–23లో కేంద్రం రూ. 2,51,369 కోట్లు సబ్సిడీ ఇవ్వగా, 2025–26లో రూ. 1,67,227 కోట్లకు సబ్సిడీని తగ్గించింది. ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయం చేయా లని ప్రచారం చేస్తూనే మరోవైపు నానో యూరియా, నానో డీఏపీ లను ఉత్పత్తి చేసి ధరలు పెంచారు. (బిహార్ మాదే.. ఇక బెంగాల్ వంతు : కేంద్రమంత్రి చాలెంజ్)రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులుండగా... బ్యాంకులు 42 లక్షల మందికే రుణాలిస్తున్నాయి. మిగిలిన వారు ప్రైవేటు రుణాలు తెచ్చుకుంటున్నారు. వారంతా 5 ఎకరాలు లోపు ఉన్న... సన్న, చిన్నకారు రైతులు, కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా వ్యవసాయ రంగం సమగ్రంగా అభివృద్ధి చెందా లంటే పాలకులు కండ్లు తెరిచి, వ్యవసాయ నిపుణులు, రైతుసంఘాల ప్రతినిధులు సూచించిన ప్రకారం వ్యవసాయ ప్రణాళికలు రూపొందించాలి. రైతు సమస్యలను పరిష్కరించటానికి అన్ని రకాల చర్యలు చేపట్టి వారిని ఆదుకోవాలి. -జూలకంటి రంగారెడ్డి మాజీ శాసన సభ్యులు, తెలంగాణ రైతు సంఘం ఉపాధ్యక్షులు -
అంకాలమ్మ గూడూరు గ్రామ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి: వైఎస్ అవినాష్
-
పత్తి రైతుకు మరో పాడుకాలం
పత్తి రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను చూడగా, 1990ల కాలం అని వార్యంగా గుర్తుకు వస్తున్నది. అప్పుడు దేశంలోని పలు రాష్ట్రాలలో పత్తి రైతులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ రాష్ట్రాలలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని విదర్భ అయితే లెక్కలేనన్ని ఆత్మహత్యలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి 30 సంవత్సరాలు గడిచిన తర్వాత అటువంటి విపత్కర పరిస్థితి ఇంకా ఏర్పడనైతే లేదు; కానీ, నెమ్మదిగా రూపు తీసుకుంటున్న పరిణామాలను చూడగా, ఆ దుఃస్థితి పునరావృతం కాగలదేమోననే అనుమానం కలుగుతున్నది.1990లలో జరిగిందేమిటి?పత్తికి, నూలు వస్త్రాలకు భారతదేశం క్రీస్తు పూర్వం నుంచే పేరెన్నిక గన్నది కాగా, బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగిందే మిటో తెలిసిందే. అక్కడి మిల్లుల కోసం ఇక్కడి రైతును కొల్లగొట్టి, స్థానిక చేనేత పరిశ్రమను ధ్వంసం చేసి, నేత కార్మికుడిని ఆకలి చావుల పాలు చేశారు. స్వాతంత్య్రానంతరం 1990లు వచ్చేసరికి అధికాదాయం పేరిట పత్తి పంటను విపరీతంగా ప్రోత్సహించి, అమ్మకాలను మాత్రం అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేసి, ధరలతో ఆటలాడారు. రైతు మరో పంటకు మారలేక, అక్కడే నిలవలేక, అప్పుల బాధకు తాళలేక, చావును ఎంచుకున్నాడు. ఆ సరికే భారత దేశపు డబ్ల్యూటీవో సభ్యత్వం, పశ్చిమ దేశాలకు కలసి వచ్చిన స్వేచ్ఛా వాణిజ్యం రైతు ఆత్మహత్యకు ఉరితాళ్లను పేనాయి.డబ్ల్యూటీవో సమయంలో వ్యవసాయం, పాడి, మత్స్య ఉత్పత్తుల విషయమై ఇండియా, చైనా, బ్రెజిల్ తదితర దేశాలు ఒక్కటై గట్టిగా నిలబడి కొన్ని రాయితీలు సాధించాయి. ఆయా రంగాలపై కోట్లాదిమంది ఆధారపడి జీవిస్తున్నందున వాటిని కాపాడుకునేందుకు పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతులపై తగినన్ని సుంకాలు విధించే హక్కు సంపాదించటం వాటిలో ఒకటి. ముఖ్యంగా అమెరికా తమ రైతులకు పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తుండగా, ఇతర దేశాలు ఆ పని చేయరాదని ఆంక్షలు విధించటాన్ని అంగీకరించబోమన్నది మరొకటి. ఇంత జరిగినా పాశ్చాత్య దేశాలు పత్తి కొనుగోళ్లు, తమ పత్తి ఎగుమతులు, అందుకు కోటాలు, వస్త్రాల ఎగుమతిలో కోటాలు వగైరా ఎత్తుగడలతో సృష్టించిన సమస్యలు తక్కువ కాదు. అధిక దిగుబడి వంగడాలపై వారిదే ఆధిపత్యం అయ్యింది. దీనంతటి ప్రభావాలు బట్టల మిల్లులు, పత్తి వ్యాపారులపై కన్నా పత్తి రైతుపైనే పడింది. ఇపుడు, స్వేచ్ఛా వాణిజ్యం తమకు లాభసాటిగా లేనట్లు భావిస్తున్న ప్రస్తుత అమెరికా ప్రభుత్వం, డబ్ల్యూటీవో నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించజూస్తుండటంతో, పత్తి రైతుకు 1990ల కాలం వలె కారు మేఘాలు తిరిగి కమ్ముకొస్తున్నాయి.అమెరికా ఒత్తిడితమ కొత్త వ్యూహంలో భాగంగా స్వేచ్ఛా వాణిజ్యాన్ని గాలికి వదలిన అమెరికా, వేర్వేరు దేశాలతో విడివిడిగా వాణిజ్య ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నది. అందుకోసం చర్చల పేరిట ఒత్తిడి, బ్లాక్‌మెయిలింగ్ పద్ధతిని అనుసరిస్తున్నది. ఇతరులను దారికి తెచ్చు కునేందుకు మొదటనే సుంకాలను భారీ ఎత్తున పెంచివేసి, అవతలి దేశాలు వాటి సుంకాలను తాము చెప్పినట్లు మార్చాలని, ఎత్తి వేయాలని షరతులు పెడుతున్నది. తమ పత్తి, మొక్కజొన్న, సోయా వంటి ఉత్పత్తులకు పూర్తిగా గేట్లు తెరవాలంటున్నది. లేనట్లయితే, సుంకాలూ, వాణిజ్యాలతో సంబంధం ఉన్న రంగాలలోనే గాక,లేని విషయాలలోనూ ఏకపక్షపు చర్యలు తీసుకోగలమని హెచ్చరిస్తున్నది.ఈ పరిస్థితుల మధ్య జరిగిందే అమెరికన్ పత్తి దిగుమతులపై ఉండిన 11 శాతం సుంకాన్ని భారత ప్రభుత్వం అకస్మాత్తుగా ఎత్తివేయటం. ఆ ఎత్తివేత మొదట గత ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే జరుగగా, తిరిగి డిసెంబర్ వరకు పొడిగించారు. ఇది తాత్కాలిక చర్య అని పైకి చెప్తున్నారు గానీ, నమ్మదగినట్టు లేదు. ఎందుకంటే, ఇదే సమయంలో అమెరికాతో కొత్త వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఆ ఒప్పందం ఈ సంవత్సరం ఆఖరు నాటికి జరగవచ్చునని భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్‌తో పాటు అమెరికన్ అధికారులు కూడా చెప్తున్నారు. అందు వల్ల, ఇప్పుడు తాత్కాలికం అంటున్నది దీర్ఘకాలికం కాగల ప్రమాదం పొంచి ఉంది. లేదా కనీసం 11 శాతం సుంకం గణనీయంగా తగ్గవచ్చు. ఏది జరిగినా ఇక్కడి పత్తి రైతుకు తీవ్ర ప్రమాదమే!సుంకం ఎత్తివేత ప్రత్యేకంగా అమెరికాకు మాత్రమే చేయలేరు గనుక మౌలికంగానే రద్దు కావటంతో అమెరికా సహా వేర్వేరు దేశాల నుంచి పత్తి నిల్వలు వచ్చిపడటం మొదలైంది. భారత ప్రభుత్వం తన నష్టాలు తాను చేయటం మొదలు పెట్టింది. గతంలో రైతులు ఎంత పత్తి తెచ్చినా కొనుగోలు చేస్తుండిన కాటన్ కార్పొరేషన్, ఎకరానికి 12 క్వింటాళ్లు మాత్రమేనని ఈసారి సీజన్‌కు ముందు షరతు విధించింది. పంట మార్కెట్‌కు రావటం మొదలైన తర్వాత తన ప్రకటనను తానే ఉల్లంఘిస్తూ 7 క్వింటాళ్లు మాత్రమే అంటు న్నది. తక్కిన పంటను వ్యాపారులు మద్దతు ధర కన్న తక్కువకు కొంటున్నా అధికారులు మాట్లాడటం లేదు. ఇదిగాక, ‘కపాస్ కిసాన్’ అనే కొత్త నిబంధన ఒకటి తీసుకువచ్చి, అందుకు అవస రమైన స్మార్ట్ ఫోన్లు లేని, ఆ సాంకేతికత తెలియని సామాన్య రైతులను యాతనలకు గురి చేయటం మొదలు పెట్టింది. ఇక, పత్తిలో తేమ నిబంధనలు ఎప్పుడూ ఉన్నవే.ఒప్పందం ఇంకెలా ఉండగలదో!అధికారికంగా సుంకాల ఎత్తివేత నుంచి మొదలుకొని, క్షేత్ర స్థాయిలో ఈ విధమైన ఎత్తుగడలు గానీ, కొత్త కాదు. అదే కథ తిరిగి నడుస్తున్నది. అమెరికా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం లొంగిపోతున్న తీరును చూసినప్పుడు, పత్తి రైతుకు 1990ల నాటి పరిస్థితి పునరావృతం కాగలదేమోననే భయం కలుగుతుండటం అందువల్లనే! మనం మరొకటి గమనిస్తున్నట్లు లేము. పత్తితో పాటు మొక్కజొన్నను, సోయాను కూడా అమెరికా బలవంతంగా ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నది. అందుకు సహకరిస్తున్నారా అనే అనుమానం కలిగేట్లు, మొక్కజొన్న పంటను రైతుల నుంచి కొనుగోలు చేయటంలోనూ పత్తి పంట తరహా షరతులు విధిస్తున్నారు. ఎకరానికి 18 క్వింటాళ్లు మాత్రమే కొనగలమన్నది ఆ నిబంధన. దీనిని బట్టి, అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఎట్లుండవచ్చునో ఎవరి ఊహ వారు చేయవచ్చు.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
రాష్ట్రమంతటా భూముల సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత వ్యవసాయ భూముల సర్వేకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సర్వే శాఖ ఆధ్వర్యంలో ఇటీవల నియమించిన 3,500 మందికిపైగా లైసెన్స్డ్ సర్వేయర్లు, ఇప్పటికే ఆ శాఖలో పనిచేస్తున్న సర్వేయర్లతో ఈ సర్వేను చేపట్టాలని యోచిస్తోంది. ఇందుకుగాను రాష్ట్రంలోని అన్ని గ్రామీణ జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేయాలని జిల్లాల కలెక్టర్లకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం నుంచి అక్టోబర్ మూడో వారంలోనే ఉత్తర్వులు వెళ్లాయి. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే గ్రామాలను ఎంపిక చేసే కసరత్తు ప్రారంభించారు. అయితే, కలెక్టర్లు తొలి విడతలో ఎంపిక చేసిన గ్రామాల జాబితాలో మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల సీసీఎల్ఏ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించిన మేరకు 200లోపు ఎకరాలున్న గ్రామాలు, సర్వే సమస్యలు తక్కువగా ఉండే గ్రామాలను ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రామాల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని, ఈ నెలలోనే సర్వేను పైలట్ పద్ధతిలో ప్రారంభిస్తారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. హద్దుల నిర్ధారణ... భూదార్ జారీ భూముల సర్వేలో భాగంగా ప్రతి భూకమతానికి హద్దులు నిర్ణయించనున్నారు. డీజీపీఎస్ ద్వారా సేకరిచిన డాటాను క్యూజీఐఎస్ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేసి భూభారతి పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని, ఇందుకోసం సర్వే సిబ్బందిని వినియోగించుకోవాలని రెవెన్యూ శాఖ చెప్పింది. సర్వే అనంతరం ప్రతి భూకమతం హద్దులు నిర్ణయించడంతోపాటు ఆ కమతాలకు ఆధార్ తరహాలో భూదార్ కార్డులు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న సర్వే అనంతర ఫలితాలను బట్టి రాష్ట్రమంతటా సర్వే నిర్వహిస్తామని అంటున్నారు. -
వ్యవసాయంలో పరిశోధనలను ప్రోత్సహించాలి
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో పెరిగిపోతున్న వాతావరణ పరమైన సవాళ్లను అధిగమించేందుకు వీలుగా పరిశోధన, అభివృద్ధికి (ఆర్అండ్డీ) మరిన్ని నిధుల సాయం అందించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు నిపుణులు సూచించారు. ఈ దిశగా విధానపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన బడ్జెట్ ముందస్తు సమావేశంలో వ్యవసాయ రంగం, ఆర్అండ్డీ సంస్థల నుంచి 12 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగం ప్రస్తుత స్థాయి నుంచి మరింత ప్రగతి సాధించేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యల గురించి వారు తమ సూచనలు అందించారు. వ్యవసాయరంగ కార్యదర్శి దేవేష్ చౌదరి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ ఎంఎల్ జట్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం సానుకూలంగా జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వ్యవసాయం, అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను నిపుణులు ప్రస్తావించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్య క్రమంలో చర్యలు తీసుకోవాలని కోరినట్టు వెల్లడించాయి. వ్యవసాయంలో ఆర్‌అండ్‌డీకి వాస్తవ నిధుల కేటాయింపులు గత రెండు దశాబ్దాల కాలంలో తగ్గినట్టు ఈ సమావేశంలో పాల్గొన్న భారత్ క్రిషక్ సమాజ్ చైర్మన్ అజయ్ వీర్ జఖార్ తెలిపారు. పంటల బీమాను తిరిగి సమీక్షించాలని, చాలా మంది రైతులు దీని విషయంలో అసంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. వ్యవసాయ ముడి పదార్థాల విక్రయ వివరాలను వర్తకులు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసే విధానం ఉండాలని కోరారు. అలాగే, కనీస మద్దతు ధరలను ప్రకటిస్తున్న పంట ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు విధించాలని అభిప్రాయపడ్డారు.ప్రముఖ ఆర్థికవేత్తలతోనూ భేటీ మరోవైపు ప్రముఖ ఆర్థికవేత్తలైన సాజిద్ చినాయ్, నీల్కాంత్ మిశ్రా, ధర్మకృతి జోషి, రిధమ్ దేశాయ్, సోనల్ వర్మ, ఇందిరా రాజారామన్ తదితరులతోనూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. 2026–27 బడ్జెట్‌కు సంబంధించి ప్రముఖ ఆర్థికవేత్తలతో ఇది తొలి సమావేశమని ఆర్థిక శాఖ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ప్రకటించింది. -
వ్యవసాయ భూములు.. క్యాపిటల్ గెయిన్స్..
భూమి, ప్లాటు, జాగా.. ఇలాంటివి అమ్మితే ఏర్పడే క్యాపిటల్ గెయిన్స్ స్వభావరీత్యా పన్నుకి గురి అవుతాయి. అయితే, గ్రామాల్లో ఉన్న వ్యవసాయ భూములు అమ్మితే ఏర్పడే క్యాపిటల్ గెయిన్స్ మీద ఎలాంటి పన్నుభారం ఏర్పడదు.గ్రామాల్లో వ్యవసాయ భూమి అంటే ఏమిటి..ఇన్‌కం చట్టంలో గ్రామీణ వ్యవసాయ భూమి అంటే ఏమిటో వివరించారు. ఇలాంటి పొలాన్ని చట్టం ప్రకారం క్యాపిటల్ అసెట్‌గా పరిగణించరు. అసలు అది క్యాపిటల్ అసెట్ కాదు కాబట్టి, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడదు. ఒక మున్సిపాలిటీ, అందులో ఉన్న జనాభా 10,000 కన్నా తక్కువ ఉండి, ఈ రెండు కండీషన్లకు అనుగుణంగా ఉన్న ప్రాంతంలోని పొలాన్ని వ్యవసాయ భూమి అంటారు. అలాగే మున్సిపాలిటీ బైట, జనాభా 10,000 దాటినప్పుడు దూరాన్ని బట్టి పరిగణనలోకి తీసుకుంటారు.జనాభా సంఖ్య10,000 దాటి 2 కి.మీ. లోపల1,00,000 దాటి 2కి.మీ.దాటి 6 కి.మీ. లోపల10,00,000 దాటి 6కి.మీ.దాటి 8 కి.మీ. లోపలమున్సిపాలిటీ పొలిమేర హద్దుల నుంచి కొలుస్తారు. జనాభా సంఖ్యను బట్టి, దూరాల లోపల ఉంటేనే గ్రామీణ వ్యవసాయ భూమి కింద లెక్కిస్తారు. ఈ రోజు గ్రామంలో ఉన్న జనాభా సంఖ్య తీసుకోరు. తాజా జనాభా లెక్కల గణన ప్రకారం పరిగణిస్తున్నారు. అంటే ప్రస్తుతానికి చివరగా 2011లో జనాభా లెక్కింపు జరిగినది. 2021లో జరగలేదు. 2027లో జరుగుతుంది. దూరం అంటే నడక దూరం కాదు, వైమానిక దూరం.వ్యవసాయ భూమి అమ్మితే..పైన చెప్పిన షరతులకు లోబడి భూమి ఉండి, ఆ భూమి అమ్మితే పన్ను భారం ఉండదు. ఆదాయానికి కూడా పన్ను భారం ఉండదు. అయితే, చాలా మంది వ్యవసాయ భూమి మీద బంగారం పండుతుందని చెప్తారు. ఆస్తిపరులు, రాజకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీ వాళ్లు, పారిశ్రామికవేత్తలు, బడా బడా ఆఫీసర్లు ఉన్నారు. మహానగరాల్లో మసలుతూ, వ్యవసాయం మీద ఆదాయం ఉందని, పొంతన లేని లెక్కలు చూపిస్తుంటారు. వరి వంగడంలో నుంచి ‘‘సిరి’’ పండిందని, యాపిల్ చెట్టుకి బంగారం పళ్లు కాశాయని చెప్పిన ఎందరో రాజకీయ నాయకులు, తనిఖీలు చేసినప్పుడు, అడ్డంగా బుక్ అయిపోయారు.పెద్ద పెద్ద సినిమా స్టార్లు, తాము చిత్ర రంగాన్ని ఏలుతున్నా, వ్యవసాయదార్లమని చెప్పుకుంటున్నారు. అలాగే కంపెనీలు కూడా. ఒక ఆర్టీఐ జవాబు ప్రకారం 2011లో 6,50,000 మంది వ్యక్తులు డిక్లేర్ చేసిన వ్యవసాయ ఆదాయం సుమారు రూ. 2,000 లక్షల కోట్లు!! అయితే, ఆదాయ పన్ను శాఖ వారు స్రూ్కటినీ చేస్తున్నారు. శాటిలైట్ ద్వారా పరీక్ష చేస్తున్నారు. అసలు పొలం ఉందా లేదా.. ఉంటే ఏం పండుతుంది.. అది ఎలా అమ్ముతారు.. ఎక్కడ అమ్ముతారులాంటి విషయాలు తెలుసుకుంటున్నారు.సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే, వ్యవసాయం మీద పన్నుభారం లేదు. వ్యవసాయ భూములు అమ్మితే పన్నుభారం లేదు. వచ్చిన మొత్తం మీద ఏమాత్రం పన్ను కట్టకుండా వైట్ రంగు వేసుకోవచ్చు. అయితే, ఆ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే ఆదాయం, వడ్డీ, డివిడెండ్ల రాబడి మీద పన్నుభారం ఉంటుంది. ఇక రూ. 50,00,000 దాటినా టీడీఎస్ ఉండదు. అయితే, అర్బన్ ల్యాండ్‌ని క్యాపిటల్ అసెట్‌గా పరిగణిస్తారు. అమ్మగా ఏర్పడ్డ క్యాపిటల్ గెయిన్స్ మీద పన్ను వేస్తారు. రూ. 50,00,000 దాటితే టీడీఎస్ 1 శాతం వర్తిస్తుంది.అర్బన్ ల్యాండ్ స్వల్పకాలికం అయితే, శ్లాబు ప్రకారం పన్ను విధిస్తారు. దీర్ఘకాలికం అయితే, 20 శాతం విధిస్తారు. అర్బన్ ల్యాండ్ అమ్మి వ్యవసాయ భూమి కొంటే పన్నుండదు. అలాగే కంపల్సరీ అక్విజిషన్, పన్ను విధింపు, మినహాయింపు ఉన్నాయి. అర్బన్ ల్యాండ్ అమ్మగా ఏర్పడ్డ క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు పొందాలంటే 54ఎఫ్ ప్రకారం ఇల్లు కొనొచ్చు. 54ఈసీ ప్రకారం గుర్తింపు పొందిన బాండ్లలో రీఇన్వెస్ట్ చేయొచ్చు.లేని ఆదాయాన్ని చూపించకండి. లేని ఆస్తిని చూపించకండి. దొంగ లెక్కలు చూపించకండి. అన్నదాత ముసుగులో అసలు నిజాన్ని దాచి, దోచి అధికారుల దృష్టిలో పడకండి. -
సాగుకు ఏఐ దన్ను
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఏడు టెక్నాలజీలు వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని మార్చివేయనున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఒక నివేదికలో తెలిపింది. జనరేటివ్ ఏఐ, రోబోటిక్స్, శాటిలైట్ ఆధారిత రిమోట్ సెన్సింగ్, నానో టెక్నాలజీ, కంప్యూటర్ విజన్, ఎడ్జ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) మొదలైనవి వీటిలో ఉన్నట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధికి భరోసా ఏర్పడటంతో పాటు ఉత్పాదకత పెరిగేందుకు కూడా ఈ సాంకేతికతలు దోహదపడతాయని వివరించింది. ఇటు పరిశ్రమ అటు విద్యావేత్తలతో సంప్రదింపుల మేరకు రూపొందించిన ఈ నివేదికలో భారత్‌లో కేస్ స్టడీస్‌ను డబ్ల్యూఈఎఫ్ ప్రత్యేకంగా ప్రస్తావించింది.అంతర్జాతీయంగా వ్యవసాయం సంక్షోభాల్లో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఈ రిపోర్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లోకి వలసలు పెరగడం, వాతావరణంలో పెను మార్పులు, నేల..నీరులాంటి సహజ వనరులు వేగంగా తగ్గిపోతుండటం మొదలైన అంశాలన్నింటి వల్ల ఉత్పాదకతకు, వ్యవసాయంపై ఆధారపడిన వారి జీవనోపాధికి ముప్పు ఏర్పడుతోందని నివేదిక తెలిపింది.పెరుగుతున్న జనాభాకి తగ్గట్లుగా 2050 నాటికి ప్రపంచం మరింత భారీ స్థాయిలో ఆహారాన్ని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంటుందని ఐక్యరాజ్య సమితిలో భాగమైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ పేర్కొంది. రైతుల సగటు వయస్సు 60 ఏళ్లకు చేరుతుండటం, 71 శాతం జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోతుండటం, మూడో వంతు నేల సారం తగ్గిపోతుండటంలాంటి సవాళ్ల మధ్య దీన్ని సాధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించింది. ఐసీఎంఆర్ పరిశోధనలు, ఫసల్ బీమాతో ప్రయోజనాలు .. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) దేశీయంగా ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని నిలబడగలిగే వరివంగడాన్ని రూపొందించడాన్ని కేస్ స్టడీగా తీసుకోవచ్చని నివేదిక తెలిపింది. సంప్రదాయ పద్ధతిలో సాగును మెరుగుపర్చేందుకు ఉపయోగించే విధానాల్లో పెద్దగా కచి్చతత్వం లేకపోవడం, దిగుబడి రావడానికి సుదీర్ఘ సమయం పట్టేయడంలాంటివి ఉంటున్నాయి. దీన్ని అధిగమించేందుకు ఐసీఏఆర్ పరిశోధకులు సీఆర్ఐఎస్పీఆర్ ఆధారిత జీనోమ్ ఎడిటింగ్‌ను ఉపయోగించి రెండు వరి వంగడాలను తయారు చేశారు.డీఆర్ఆర్ 100 పేరిట రూపొందించిన మొదటి వెరైటీలో కరువు, వాతావరణంపరమైన ఒత్తిళ్లను తట్టుకునే సామర్థ్యం మెరుగ్గా ఉంది. దీంతో దిగుబడి 19 శాతం పెరిగి, ఉద్గారాలు 20 శాతం మేర తగ్గాయి. ఇక పూసా డీఎస్టీ రైస్ 1 వెరైటీలో చూస్తే ఉప్పు, క్షార గుణాలు ఎక్కువగా ఉన్న నేలల్లో సైతం ఇది వరుసగా 9.66 శాతం, 30.4 శాతం మేర దిగుబడులను సాధించింది. దీనితో దిగుబడి 20 శాతం పెరిగే అవకాశం ఉందని రిపోర్ట్ తెలిపింది. అటు పంట బీమాకు సంబంధించి భారత్‌లో అమలవుతున్న ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనను (పీఎంఎఫ్‌బీవై) కూడా నివేదిక ప్రస్తావించింది. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఆధారిత సొల్యూషన్ .. మరింత వేగవంతంగా, కచి్చతత్వంతో క్లెయిమ్‌లను సెటిల్ చేయడానికి ఉపయోగపడుతోందని పేర్కొంది.నివేదికలో మరిన్ని అంశాలు.. ⇒ పంటల పెరుగుదల, పర్యవేక్షణ, సంరక్షణ విషయంలో సంప్రదాయ ధోరణులను మార్చే సామర్థ్యం ఏడు సరికొత్త టెక్నాలజీలకు ఉంది. ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడే పంటలను తీర్చిదిద్దేందుకు, ఉత్పాదకతను పెంచేందుకు ఇవి దోహదపడగలవు. ⇒ స్వయంచాలిత రోబోటిక్స్, కచ్చితత్వంతో కూడుకున్న సాగు పర్యవేక్షణ మొదలైన వాటిల్లో ఈ టెక్నాలజీలన్నింటినీ మేళవించి ఉపయోగిస్తే మరింత మెరుగైన ఫలితాలు రావచ్చు. ⇒ ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొనగలిగే సామర్థ్యంతో 20% తక్కు ఉద్గారాలను వెలువరించే వరి వంగడాలను రూపొందించడం, చెరకులో కచి్చతత్వంతో కూడుకున్న సాగును అమలు చేయడంతో దిగుబడులు 40 శాతం పెరిగాయి. సరఫరా వ్యవస్థ రిస్కులను అంచనా వేసేందుకు రిమోట్ సెన్సింగ్ ఉపయోగపడుతోంది. ⇒సాగు వ్యవస్థలను కొత్తగా తీర్చిదిద్దేందుకు, ఉత్పాదకతపరమైన ఒత్తిళ్లను తగ్గించేందుకు మరి న్ని డీప్–టెక్ ఆవిష్కరణల అవసరముంది. సాంకేతిక పురోగతిని సత్వరం అందిపుచ్చుకునే విధానాలను నియంత్రణ సంస్థలు అమలు చేయాలి. ⇒ వర్షపాతం ఒక పద్ధతిగా లేకపోవడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ఇప్పటికే పలు హారి్టకల్చర్ పంటల్లో 65% మేర నష్టాలకు దారి తీస్తున్నాయి. -
రైతుల కోసం.. స్మార్ట్ ఫార్మ్ సెంటర్స్
భారతదేశంలోనే అతిపెద్ద ధాన్య వాణిజ్య వేదిక అయిన ఆర్య.ఏజీ.. దేశవ్యాప్తంగా 25 స్మార్ట్ ఫార్మ్ సెంటర్లు ప్రారంభించింది. ఈ సెంటర్లు రైతుల సమస్యలను పరిష్కరిస్తాయి. దీనికోసం టెక్నాలజీ, డేటా బేస్డ్ వంటి వాటిని ఉపయోగిస్తుంది. లాభదాయక వ్యవసాయ పర్యావరణాన్ని రూపొందించాలనే ఉద్దేశ్యంతో సంస్ట ముందుకు సాగుతోంది.ప్రతి స్మార్ట్ ఫార్మ్ సెంటర్.. ఒక వ్యవసాయ కేంద్రంగా పనిచేస్తుంది. రైతులు ఎదుర్కునే.. పంటలకు సంబంధించిన సవాళ్లను ఇది పరిష్కరిస్తుంది. ఈ సెంటర్లు భూసార పరీక్షలు (సాయిల్ టెస్ట్), స్థానిక వాతావరణ సమాచారం, డ్రోన్ ఇమేజింగ్ వంటివాటికి సంబంధించిన విషయాలను రైతులకు వెల్లడిస్తూ.. వారికి శిక్షణ ఇస్తాయి.ఆర్య.ఏజీ స్మార్ట్ ఫార్మ్ సెంటర్లు రైతులు సాగు చేసే ప్రతిదశలోనూ సహాయపడతాయి. ఇవన్నీ విత్తనాలు, నీటిపారుదల నుంచి పంట ప్రణాళిక & ఫైనాన్సింగ్ వరకు.. మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతాయి. ఇవి నియోపెర్క్, భారత్‌రోహన్, ఫార్మ్‌బ్రిడ్జ్, ఫిన్హాట్, ఫైల్లో వంటివాటితో పాటు కంపెనీ కమ్యూనిటీ వాల్యూ చైన్ రిసోర్స్ పర్సన్స్ సహకారంతో అభివృద్ధి చేశారు. -
YS Jagan: వ్యవసాయం దండగ అన్నావ్.. మరి నువ్వు ఏం తింటున్నావ్
-
వైఎస్ జగన్ హయాంలో ఉపాధి కల్పన జోరు
సాక్షి అమరావతి: ప్రజలకు ఉపాధి కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ 2023–24 ఆరి్థక సంవత్సరంలో గణనీయమైన మెరుగుదల నమోదు చేసిందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లో సేవల రంగంలో ఉపాధి ధోరణులను విశ్లేషాతూ నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది. ఏపీలో వ్యవసాయ రంగం తరువాత 2023–24లో సేవల రంగంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించినట్లు నివేదిక పేర్కొంది. ఆ ఏడాది సేవల రంగంలో జాతీయ సగటును మించి ఏపీలో ఉపాధి కల్పన ఉందని నివేదిక తెలిపింది.2023–24లో సేవల రంగంలో జాతీయ సగటు ఉపాధి కల్పన 29.7 శాతం ఉండగా.. ఏపీలో 31.8 శాతం మంది ఆ రంగంలో ఉపాధి పొందినట్టు నివేదిక పేర్కొంది. 2011–12లో సేవల రంగంలో 27.7 శాతం ఉపాధి కల్పిస్తే.. 2023–24లో ఏపీలోని సేవల రంగంలో 78 లక్షల మంది ఉపాధి పొందడంతో ఆ వాటా 31.8 శాతానికి పెరిగినట్టు నివేదిక స్పష్టం చేసింది. 2011–12లో మహారాష్ట్ర సేవల రంగంలో ఉపాధి కల్పనలో టాప్‌లో ఉండగా 2023–24లో మూడో స్థానానికి పడిపోయిందని, కర్ణాటక రెండో స్థానం నుంచి నాల్గో స్థానానికి దిగజారగా.. ఆంధ్రప్రదేశ్ 9వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకి గణనీయమైన మెరుగుదల నమోదు చేసినట్టు నివేదిక తెలిపింది. -
ఎం.ఎస్. స్వామినాథన్ జీవితగాథ పుస్తకాన్ని ఆవిష్కరించిన కమల్‌హాసన్
వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యుశాస్త్ర నిపుణుడు ఎం.ఎస్. స్వామినాథన్ జీవితగాథను 'ఎం.ఎస్. స్వామినాథన్: ది మ్యాన్ హూ ఫెడ్ ఇండియా' పుస్తకాన్ని ప్రముఖనటుడు కమల్ హాసన్ చెన్నైలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఈ పుస్తకం రచయిత్రి, ఆయన మేనకోడలు, ప్రియంవద జయకుమార్ ఎం.ఎస్. స్వామినాథన్‌తో తన అనబంధాన్ని పంచుకున్నారు. "నేను ఆయనను ఎంతగానో ఆరాధించాను, రాయాలనుకున్నాను. నా అభిమానిని. చిన్నతనంలో ఆయనను చూసి పెరిగిన వ్యక్తి. కానీ నేను ఆయన గురించి విన్న అనే విశేషాలు పుస్తకంలోకి రాలేదు. అందుకే ఆయన జీవితాన్ని గురించి ఒక పుస్తకం రాయాల్సిన సమయం ఆసన్నమైందని నేను అనుకున్నాను. అదే సమయంలో భారతదేశాన్ని నిర్వచించాను. నిజంగి ఇది ఎం.ఎస్. స్వామినాథన్ కథ. ఆయలన కలగన్న ఆశ, స్థితిస్థాపకత కలిగిన భారతదేశం కథ. భారతదేశం యొక్క ఎప్పటికీ చెప్పలేని స్ఫూర్తి మరియు ఎప్పటికీ వదులుకోలేని స్ఫూర్తిని మీకు తెలుసు, దీనిని ఆయన తరం భారతీయులు ఉదాహరణగా చూపించారు."అని పేర్కొన్నారు. గొప్ప శాస్త్రవేత్త... చక్కటి వ్యవహర్త ఉన్నత విద్యావంతులున్న ఉమ్మడి కుటుంబంలో మాన్‌కోంబు సాంబశివన్ స్వామి నాథన్ (M.S. Swaminathan) జన్మించారు (1925). తండ్రి బాటలో మెడిసిన్ చదివి కుంభకోణంలోని వాళ్ల హాస్పిటల్‌ను నడిపే అవకాశం; ఐపీఎస్‌కు ఎంపికైనందున అటు వైపుగానూ కెరీర్ మలుచుకునే వీలు ఆయనకు ఉండినాయి. కానీ లక్షల మంది చావు లకు కారణమైన బెంగాల్ క్షామం(1943) వేసిన ముద్ర ఆయన్ని వ్యవసాయం వైపు నడిపించింది. వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యుశాస్త్ర నిపుణుడిగా ఆయన కృషిని చెప్పే పుస్తకం ‘ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా’. ఆయన మేనకోడలు రాసిన జీవిత కథ. స్వాతంత్య్రానంతర భారతదేశం ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య... తిండి గింజల కరువు. ‘ఏదైనా ఆగుతుంది కానీ వ్యవసాయం ఆగదు’ అన్నారు నెహ్రూ. సోమవారాలు పస్తులుండమని పిలుపు నిచ్చారు లాల్ బహదూర్ శాస్త్రి. ‘బ్లడీ అమెరికన్ల’ ముందు చేయి చాచకుండా ఉండే మార్గాల కోసం వెతికారు ఇందిరా గాంధీ. ఒక దశలో ‘పీఎల్ 480’ పథకం కింద అమెరికా పంపే గోధుమలే దిక్కు. ఓడలు దిగితేగానీ నోళ్లు ఆడని పరిస్థితి. ఈ దిగుమ తులకు చెల్లించాల్సిన మూల్యం విదేశాంగ విధానంలో స్వతంత్రంగా నిలబడలేకపోవడం. అలాంటి స్థితిలో స్వామినాథన్ దేశంలో హరిత విప్లవానికి బాటలు పరిచారు. ‘చరిత్ర ఆయనకు అవకాశం ఇచ్చింది, దాన్ని ఆయన రెండు చేతులా అందుకున్నారు’అంటారు రచయిత్రి.VIDEO | Chennai, Tamil Nadu: Actor, politician Kamal Haasan launches book on 'MS Swaminathan - The Man who fed India' authored by Priyambada Jayakumar. (Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/HfsbGoozj4— Press Trust of India (@PTI_News) November 2, 2025 గాలికి పడిపోకుండా నిలబడే పొట్టి రకం గోధు మల మీద గామా కిరణాలతో ‘ఐండియన్ అగ్రికల్చర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్’లో స్వామినాథన్ ప్రయోగాలు చేశారు. దానికోసం ‘ఆటమిక్ ఎనర్జీ కమిషన్’ సాయంతో ‘గామా గార్డెన్’ ఏర్పాటుచేశారు. వ్యవ సాయం కోసం అన్ని రంగాలూ సహకరించుకోవాలంటారాయన. ఈ దశలోనే పొట్టి రకం హైబ్రిడ్ గోధు మలను మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ విజయవంతంగా పరీక్షించారని తెలిసి, స్వామినాథన్ ఆయనకు ఉత్తరం రాశారు(1963). దానివల్ల పదేళ్ల కాలం కలిసొస్తుంద నేది ఆయన ఆలోచన. ఇక వంద కేజీల చొప్పున వచ్చిన ఆ నాలుగు రకాల విత్తనాలను ఇక్కడి నేలలకు అనుగుణంగా కల్యాణ్ సోనా, సోనాలిక లాంటి విత్తనాలుగా మార్చి, వ్యవస్థలోని అన్ని అడ్డంకులను అధిగమించి, రైతుల అనుమానాలను తీర్చి, దిగు బడుల ‘చమత్కారాన్ని’ చూపించి, ఇండియా వచ్చిన నార్మన్ బోర్లాగ్‌నే ఆశ్చర్యపరిచేలా చేశారు స్వామి నాథన్. నాలుగు హెక్టార్లతో మొదలైన ప్రయోగం, 1968 నాటికి పది లక్షల హెక్టార్లకు విస్తరించింది. ఈ మధ్యలోనే విక్రమ్ సారాభాయి సహకారంతో రైతుల కోసం దూరదర్శన్‌లో ‘కృషి దర్శన్’ మొదలైంది (1967). సైన్సు శక్తి, విధాన నిర్ణయం, రైతుల ఉత్సాహం – కలగలిసి ‘యూఎస్ ఎయిడ్’కు చెందిన విలియమ్ గాడ్ నోటి నుంచి తొలిసారిగా వెలువడిన మాట ‘గ్రీన్ రివల్యూషన్’ అనేది విజయవంతమైంది. 1981లో ఫిలిప్పైన్స్‌లోని ‘ఇంటర్నేషనల్ రైస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్’ డైరెక్టర్ జనరల్ పదవి ఆయన్ని వరించింది. ఆ స్థానంలోకి వెళ్లిన మొదటి ఆసియన్ ఆయన. ఐఆర్64 లాంటి పాపులర్ వరి రకం ఈ కాలంలోనే వచ్చింది. ప్రణాళికా సంఘం, వ్యవసాయ మంత్రిత్వ శాఖల్లోనూ పనిచేసిన స్వామినాథన్ పాత్ర ఇండియాకే పరిమితం కాలేదు. చైనా, పాకిస్తాన్,ఇండోనేషియా, మయన్మార్, టాంజానియా, ఇథియో పియా లాంటి ఎన్నో దేశాల్లో వరి పరిశోధనాకేంద్రాలు ఏర్పాటయ్యేలా సహకరించారు. టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన అత్యంత ప్రభావశీల ఆసి యన్ల జాబితాలోని ముగ్గురు భారతీయుల్లో స్వామి నాథన్ ఒకరు (మిగిలిన ఇద్దరు: గాంధీజీ, టాగూర్). ‘పది జీవితాల్లో కూడా సాధించలేనిది ఆయన ఒక్క జీవితంలో సాధించారు’ అంటారు రచయిత్రి. ముగ్గురు కూతుళ్ల తండ్రిగా, స్వతంత్ర భావాలున్న భార్య మీనా భర్తగా ఆయన కుటుంబ విశేషాలు మేళవిస్తూ పది అధ్యాయాలుగా రాసిన పుస్తకమిది. ఫిలిప్పైన్స్ వదిలివచ్చేటప్పుడు టగలాంగ్‌లో వీడ్కోలు ఉపన్యాసం చేసి ఆశ్చర్యపరిచారు మీనా. రైతుల కోసం నియమించిన జాతీయ కమిషన్‌తో సహా పదుల కమి టీలకు చైర్మన్‌గా వ్యవహరించి; రామన్ మెగసెసే, వరల్డ్ ఫుడ్ ప్రైజ్, భారతరత్న లాంటి గౌరవాలు పొందిన ఎంఎస్ తన జీవితంతోనే ఆశ్చర్యపరిచారు.- ఎడిటోరియల్ టీం(M.S. Swaminathan: The Man Who Fed India)ఎం.ఎస్. స్వామినాథన్: ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా (జీవిత చరిత్ర)రచన : ప్రియంవద జయకుమార్ -
రైతుల కడుపు కొట్టేలా దిగుమతులా?
కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇటీవలి బెర్లిన్ గ్లోబల్ డైలాగ్ సమావేశంలో సరైన వైఖరినే ప్రదర్శించారు. భారతదేశం తలకు పిస్తోలు గురి పెట్టి ఎవరూ బలవంతంగా ఒప్పందాలపై సంతకాలు చేయించలేరని తెగేసి చెప్పారు. అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థి తులను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన ధైర్యంగా పలికిన మాటలు నాకొక పాత సంఘటనను గుర్తుకు తెచ్చాయి. ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప్రధాన కార్యాలయం రోమ్‌లో ఉంది. ఒకప్పుడు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా కూడా ఉన్న జగ్జీవన్ రామ్ కోపంతో దాని సమావేశం నుంచి ఒక సారి వాకౌట్ చేశారని చెబుతారు. వ్యవసాయ శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఎం.ఎస్. స్వామినాథన్ చెప్పిన దాని ప్రకారం, ‘‘మీ వ్యవసాయ ఎగుమతులను మాపై రుద్దాలని చూస్తే సహించేది లేదు’’ అని అమెరికా సీనియర్ అధికారి ఒకరికి జగ్జీవన్ రామ్ నిస్సంకోచంగా చెప్పారు. ‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వివిధ హోదాలలో దాదాపు అందరు వ్యవసాయ మంత్రుల వద్ద పని చేశారు కదా! మీకు ఎవరు ఉత్తమమైన వ్యవసాయ మంత్రిగా తోచా’రని అడిగినపుడు స్వామినాథన్ పై ఉదంతం చెప్పారు. జగ్జీవన్ రామ్ 1974 నుంచి 1977 వరకు వ్యవసాయ, సేద్యపు నీటి శాఖ మంత్రిగా పనిచేశారు. కాచుకుని ఉన్న అమెరికావిస్తారమైన భారతీయ వ్యవసాయ మార్కెట్లోకి అడుగు పెట్టాలని అమెరికా ఏనాటి నుంచో కాచుకుని ఉందని మనం గుర్తుంచుకోవాలి. అమెరికాతో సాగుతున్న వాణిజ్య చర్చలలో భారత్ ఇంతవరకు దృఢ వైఖరినే అనుసరిస్తూ వస్తోంది. వ్యవసాయ, పాడి పరిశ్రమ, మత్స్య సంపదల రంగాలను కాపాడుకుని తీరుతామని చెబుతోంది. కానీ, మన దేశంలోని కొన్ని బలమైన వర్గాలు ఎప్పుడూ బహుళ జాతి కంపెనీల ప్రయోజనాలను కాపాడేందుకు మొగ్గు చూపుతూ వస్తున్నాయి. ఆత్మనిర్భరత సాకుతో అవి తమ వైఖరిని సమర్థించుకుంటున్నాయి. అమెరికా సంస్థలకు ద్వారాలు తెరిస్తే– దేశంలోని పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, పాడిపరిశ్రమ, యాపిల్, ఇతర పండ్ల విభాగాల వారి ప్రయోజనాలను పణంగా పెట్టినట్లు అవుతుంది. అమెరికా సహజంగానే తన తదుపరి లక్ష్యంగా మొదట వరిని, తర్వాత గోదుమలను ఎంచుకుంటుంది. అమెరికా సిసలైన ప్రయోజనాలు వీటిలోనే ఇమిడి ఉన్నాయి. జన్యుపరంగా సవరించిన (జీఎం) యాపిల్స్, మొక్కజొన్న, సోయాబీన్ల ప్రవేశం వివాదాస్పదంగా మారడంతో, దానికి సంబంధించిన కార్యనిర్వాహక పత్రాన్ని నీతి ఆయోగ్ ఇప్పటికే ఉపసంహరించుకుంది. సుంకాలు లేని విధంగా పత్తి దిగుమతికి అనుమతిస్తున్నట్లుగానే, పాలు, పాల ఉత్పత్తులకు కూడా మార్కెట్ ద్వారాలు తెరవడం సముచితంగా ఉంటుందని వాదించే ఆర్థికవేత్తలు కొందరు తయారయ్యారు. కానీ, వారొక సంగతిని గ్రహించడం లేదు. అమెరికాలో సుమారు 8,000 మంది పత్తి రైతులున్నారు. అక్కడి వ్యవసాయ క్షేత్ర సగటు పరిమాణం 600 హెక్టార్లు. వారికి ఏటా లక్ష డాలర్లకు పైగా సబ్సిడీ అందుతుంది. అది అంతర్జాతీయ ధరలను తగ్గిస్తుంది. ఫలి తంగా, అభివృద్ధి చెందుతున్న దేశాలలోని రైతులు దెబ్బతింటారు. మన దేశంలో పత్తి రైతులు 98 లక్షల మందికి పైగా ఉన్నారు. వారి కమతాలు సగటున 1 నుంచి 3 ఎకరాలు మాత్రమే. చౌక ధరలకు, సబ్సిడీ దిగుమతులను అనుమతిస్తే, అసలే అంతంత మాత్రంగా ఉన్న వారి బతుకు బండలవుతుంది. దానికి బదులు, దేశీయ పత్తి పరిశ్రమ మన రైతులకు అండగా నిలిస్తే, అది నిజంగా ఉభయ తారకమైనది అవుతుంది. పత్తి దిగుమతిపై సుంకాలు పైసా కూడా లేకుండా చేయడం ద్వారా, భారత్ తన రైతులను తోడేళ్ళ బారిన పడేసినట్లయింది. చౌక దిగుమతులతో రైతులకు నష్టంపప్పు ధాన్యాల విషయంలో సరఫరా–డిమాండ్ సూత్రం పనిచేయడం లేదు. పప్పు ధాన్యాల విస్తీర్ణం 3.07 కోట్ల హెక్టార్ల నుంచి గత ఐదేళ్ళలో 2.76 కోట్ల హెక్టార్లకు కుంచించుకుపోయింది. దానివల్ల డిమాండ్ కొద్దిగా పెరిగినా, ఆ మేరకు రైతుల మార్కెట్ యార్డు ధరలు ఏమీ పెరగలేదు. నిజానికి, వాటి ప్రస్తుత మార్కెట్ ధరలు, ప్రకటించిన కనీస మద్దతు ధరల కన్నా సుమారు 30 శాతం తక్కువగా ఉన్నాయి. దిగుబడి తగ్గడం వల్ల ఏర్పడిన వెలితిని చౌక దిగుమతులు భర్తీ చేయడమే దానికి కారణం. ఆ దిగుమతులు కూడా అవసరమైన దానికన్నా రెండింతలున్నాయి. చాలా రకాల చిక్కుళ్ళు సుంకాలు లేకుండా దిగుమతి అయ్యాయి. ఒక్క 2024–25లోనే 7.6 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకున్నారు. అలాగే, 2020 –21లో పప్పు ధాన్యాల దిగుమతికి రూ. 12,153 కోట్లను వెచ్చిస్తే, గడచిన ఐదేళ్ళలో దిగుమతి వ్యయం ఇప్పటికే అంటే 2024–25లో రూ. 47,000 కోట్లను దాటినట్లు వార్తలు సూచిస్తున్నాయి. వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించే నెపంతో జీఎం సోయా గింజల దిగుమతిని సమర్థించుకుంటున్నారు. నిజానికి, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోని సోయా రైతులు గిట్టుబాటు ధర కోసం లబోదిబోమంటున్నారు. సోయాబీన్ కనీస మద్దతు ధరను క్వింటాల్ కు రూ. 5,328గా నిర్ణయించగా, మార్కెట్ ధరరూ. 3,500 నుంచి రూ. 4,000 మధ్య ఊగిసలాడుతోంది. ఒత్తిళ్లకు లొంగకూడదు!కేంద్రం తగిన నియమ, నిబంధనలను రూపొందించేంత వరకు జీఎం ఆహార పదార్థాల దిగుమతి, అమ్మకాలను నిలిపి వేయాలని రాజస్థాన్ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. దిగుమతులకు అది కాస్త బ్రేకు వేయవచ్చు. జీఎం సోయాబీన్ దిగుమతులకు ద్వారాలు తెరవవలసిందని అమెరికా గతంలోనూ మనపై ఒత్తిడి తెచ్చింది. బయోటెక్నాలజీ –ఫుడ్ సెక్యూరిటీ ఫోరమ్ (ఢిల్లీ) చేపట్టిన ఉద్యమం వల్ల, ఎట్టకేలకు భారతీయ రేవులకు అమెరికా సోయా బీన్ చేరగానే దాన్ని (దేశీయ ఉత్పత్తితో కలపకుండా) వేరుగా ఉంచా లని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఆదేశించింది. అమెరికా సరఫరాదారులు తమ దేశంలోని సీనియర్ అధికారుల మద్దతుతో ఆ చర్యను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. కానీ, భారత్ ఆ ఒత్తిడికి తలొగ్గ లేదు. ఇప్పుడూ అదే రకమైన వైఖరిని అనుసరించాలి. ఆహార పదార్థాలను నౌకల నుంచి దించుకొనే దయనీయమైన పాత రోజులలోకి భారత్ మళ్ళీ జారి పోకూడదు.దేవీందర్ శర్మవ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
రైతులకు బ్యాంకులు రుణాలు ఎందుకు ఇవ్వవంటే..
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, గ్రామీణ అభివృద్ధిని పెంచడానికి వ్యవసాయ రుణాలు చాలా ముఖ్యం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను వ్యవసాయ రుణాలు పెంచాలని తరచుగా ఆదేశిస్తున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సకాలంలో రుణం అందడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, రైతుల జీవనోపాధికి కీలకం. అయితే ఈ దిశగా కేంద్రం చేస్తున్న కృషికి అనుగుణంగా బ్యాంకులు వీటి పంపిణీని ఆశించినంతగా పెంచడం లేదు. అందుకు కొన్ని సవాళ్లను ఎదురవుతున్నాయనే వాదనలున్నాయి.నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్(NPA) భయంవ్యవసాయ రంగంలో అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వాల రుణమాఫీ పథకాల ప్రకటన కారణంగా రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది. దీని ఫలితంగా బ్యాంకులకు మొండి బకాయిలు (NPA) పెరిగే అవకాశం ఉంది. పెద్ద పరిశ్రమల మొండి బకాయిలతో పోలిస్తే రైతుల మొండి బకాయిలు తక్కువగా ఉన్నప్పటికీ బ్యాంకులకు ఇది ఆందోళనగా మిగిలిపోతుంది.రుణాల దుర్వినియోగంకొందరు రుణగ్రహీతలు వ్యవసాయం పేరుతో బంగారం తాకట్టు రుణాలు తీసుకుని వాటిని రియల్ ఎస్టేట్ లేదా ఇతర వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం (ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో) బ్యాంకు అధికారులు తనిఖీల్లో గుర్తిస్తున్నారు. దీనివల్ల రుణం పొందిన ప్రయోజనం నెరవేరకపోవడం, రాయితీ వడ్డీ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయి. ఈ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆర్బీఐ కఠిన మార్గదర్శకాలు తీసుకువచ్చింది.పూచీకత్తు సమస్యలుచిన్న, సన్నకారు రైతులకు, కౌలు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. కౌలు రైతుల విషయంలో సరైన ధ్రువీకరణ వ్యవస్థ లేకపోవడంతో వారికి రుణాలు అందడం లేదు.వ్యవసాయ క్షేత్రాల పరిశీలన సవాళ్లుగ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రుణాల పంపిణీ తర్వాత అవి నిజంగా వ్యవసాయ అవసరాలకు వాడుతున్నారా లేదా అని తనిఖీ చేయాలి. అందుకు బ్యాంకులకు తగినంత మానవ వనరులు, మౌలిక సదుపాయాలు లేకపోవడం ఒక సమస్యగా ఉంది.రుణమాఫీ జాప్యంగత ప్రభుత్వాల హయాంలో రుణమాఫీ పథకాలు ప్రకటించినప్పటికీ వాటి అమలులో జాప్యం జరుగుతుంది. దానివల్ల రైతులు పాత రుణాలను రెన్యూవల్ చేసుకోలేకపోతున్నారు. దీని ఫలితంగా బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి.ఇదీ చదవండి: భారత రైల్వేలో అపార అవకాశాలు -
యంత్రం సాగుకు తంత్రం
యంత్రం.. సాగుకు తంత్రం అన్న విషయాన్ని ఉమ్మడి శామీర్‌పేట రైతులు గుర్తించారు. దీంతో వ్యవసాయానికి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి మేలైన దిగుబడులను రాబడుతున్నారు. ఎకరాకు గంటల సమయం పట్టే మందుల పిచికారీకి డ్రోన్ల సాయంతో కేవలం పది నిమిషాల్లోనే పూర్తి చేస్తున్నారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. దుక్కుల నుంచి మొదలు కోతల వరకూ అన్ని రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వరి నాట్లకు రైస్ ట్రాన్స్ ప్లాంటర్, డ్రమ్ సీడర్, మందు పిచికారీకి డ్రోన్లు, స్ప్రేయర్లు వంటివి వినియోగిస్తున్నారు. – శామీర్‌పేట ఉమ్మడిశామీర్పేట మండలంలో రైతులు వరి, మొక్కజొన్న పంటలతోపాటు కూరగాయల సాగు పెరిగింది. అధిక వర్షాలకు పంట రంగు మారుతుండడంతో మందులు పిచికారీ చేయాల్సి వస్తోంది. అయితే కూలీల కొరత, పెరిగిన పెట్టుబడులతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో కొంత మంది రైతులు డ్రోన్ల సహాయంతో పంటలకు మందులు పిచికారీ చేయిస్తున్నారు. కొంత మంది డ్రోన్లు అద్దెకు నడుపుతున్నారు. డ్రోన్లు ఎకరా పంటకు కేవలం పది నిమిషాల్లో పిచికారీ చేస్తున్నాయి. చదవండి: 84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!నేరుగా మొక్కలపై మందులను పిచికారీ చేయడంతో మందులు కూడా వృథా కావడం లేదు. ఇద్దరు, ముగ్గురు కూలీలు చేసే పని ఒక్క డ్రోన్ చేస్తుంది. దీంతో ఇటు సమయం.. ఆటు డబ్బు రెండూ ఆదా అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఎకరాకు 10 నిమిషాలు.. డ్రోన్ సహాయంతో ఎకరా పంటకు 10 నిమిషాల్లో మందులు పిచికారి పూర్తవుతుంది. నేను నాలుగు ఎకరాల్లో వరి పంట సాగుచేస్తున్నాను. దీనికి యూరియా స్ప్రే చేయించాలంటే ఇద్దరు కూలీలు ఒక రోజంతా కష్టపడాలి. డ్రోన్ సాయంతో నాలుగు ఎకరాలకు గంటలో పూర్తిచేశాం. ఎకరాకు డ్రోన్ అద్దె రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. – సంజీవరెడ్డి, రైతు, అలియాబాద్ వ్యవసాయ పనులకు కూలీల కొరత ఏర్పడింది. పొరుగు జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వలస కూలీలపై అధారపడాల్సి వస్తోంది. డ్రోన్ స్ప్రే ద్వారా ఎకరాకు 10 నిమిషాల్లో పూర్తవుతుంది. సమయం ఆదాతో పాటు కూలీల సమస్య తీరుతుంది. డ్రోన్ అద్దెకు తీసుకోవడంతో ఖర్చులు తగ్గుతాయి. – రమేష్ వ్యవసాయ అధికారి, శామీర్‌పేట -
తప్పని యూరియా కష్టాలు
-
యూరియా.. యాతన
కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన నువ్వుల శ్రీనివాసరావు పదెకరాలు కౌలుకు చేస్తున్నారు. ఈ సీజన్లో ఎంటీయూ 1318 రకం వరి పంట సాగు చేశారు. తొలి విడతలో అతికష్టమ్మీద మూడు కట్టల యూరియా మాత్రమే దొరికింది. రోజుల తరబడి పడిగాపులు కాసినా రెండో విడతలో నిరాశే మిగిలంది. దీంతో చేసేది లేక అధిక ఖర్చు అయినా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారు. అదే యూరియా దొరికితే ఎకరాకు రెండు కట్టల చొప్పున రూ.533తో సరిపోయేది. కాంప్లెక్స్ ఎరువులు వాడుతుండటంతో రూ.3 వేల దాకా ఖర్చు అవుతోంది. అంటే దాదాపు ఆరు రెట్లు అదనపు భారం పడింది. పైగా ఒక్కో సొసైటీలో ఒక్కో ధర. లోడింగ్, రవాణా ఖర్చులు దీనికి అదనం. గతంలో ఎరువులకు ఎకరాకు రూ.3 వేలు ఖర్చయితే ప్రస్తుతం రూ.8 వేలకు పైగా ధారపోయాల్సి వస్తోందని ‘సాక్షి’ ఎదుట రైతు వాపోయాడు.ఎన్టీఆర్ జిల్లా పురుషోత్తపట్నానికి చెందిన రైతు మైనేని దుర్గాప్రసాద్ 17 ఎకరాలు కౌలుకు తీసుకొని 1318 వరి వేశారు. రెండో విడతగా కట్ట యూరియా కోసం నాలుగుసార్లు పనులు మానుకుని వచ్చినా మీ టోకెన్ నెంబర్ రాలేదంటూ తిప్పి పంపిస్తున్నారు. బయట మార్కెట్లో బస్తా రూ.300 నుంచి రూ.500 దాకా అడుగుతున్నారు. పైగా కాంప్లెక్స్ ఎరువులతో పాటు పురుగుల మందులు అంటగడుతున్నారు. యూరియా దొరక్కపోవడంతో చేసేది లేక 20ః20 వేశాడు. ఈ ప్రభుత్వం అదునుకు యూరియా కూడా అందించలేకపోతోందని, ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ఆక్రోశిస్తున్నాడు. ఈ ప్రభావంతో ఈసారి దిగుబడులు తగ్గిపోతాయని తీవ్ర ఆందోళన చెందుతున్నాడు.సాక్షి, అమరావతి: ఒకపక్క యూరియా కరువు.. మరోవైపు ఏ పంటకూ మద్దతు ధరలు లేక అన్నదాతలు అల్లాడుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని దయనీయమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. యూరియా కోసం క్యూలైన్లు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఆత్మగౌరవాన్ని దిగమింగుకుని రోజుల తరబడి పడిగాపులు కాసినా అరకట్ట దొరకడం గగనంగా మారింది. ఎంత తిరిగినా యూరియా దొరక్క ఖరీదైన కాంప్లెక్స్ ఎరువుల కొనుగోలుతో పెట్టుబడి ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. రైతన్నకు భరోసా కల్పించాల్సిన సర్కారు.. దిక్కులు చూస్తోంది. అటు పెట్టుబడి సాయం అందక.. ఇటు ఉచిత పంటల బీమాకు దూరమై రైతన్నలు అల్లాడుతున్నారు. పంట నష్టపోతే కనీసం కరువు సాయం కూడా అందని దుస్థితి నెలకొంది. వరి ప్రస్తుతం పొట్ట దశకు చేరుకున్న తరుణంలో రెండో విడతగా ఇవ్వాల్సిన యూరియా కోసం కటకటలాడుతున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలనలో యూరియా కోసం తమ అగచాట్లను అన్నదాతలు మొర పెట్టుకున్నారు. కూటమి సర్కారు నిర్లక్ష్యం, అసమర్థతపై మండిపడుతూ గత ఐదేళ్లలో ఎప్పుడూ ఇంతటి దయనీయ పరిస్థితులు లేవని చెబుతున్నారు.పనులు వదిలేసి సొసైటీల వద్ద పడిగాపులు..గత ప్రభుత్వ హయాంలో గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా కావాల్సినంత యూరియా అందుబాటులో ఉండేది. కియోస్క్‌లో బుక్ చేసుకున్న 24 గంటల్లోనే తమ కళ్లాలకు సరఫరా చేసేవారు. ఫలితంగా లోడింగ్, అన్‌లోడింగ్‌తో పాటు రవాణా ఖర్చుల రూపంలో బస్తాకు రూ.20–50 వరకు ఆదా అయ్యేది. ఆ ఐదేళ్లలో ఏ ఒక్క రోజూ విత్తనాలు, యూరియా కోసం ఎక్కడా క్యూలైన్లు కనిపించిన దాఖలాలు లేవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎంత కావాలంటే అంత యూరియా దొరికేది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాదిగా పరిస్థితి మారిపోయింది. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. రైతు సేవా కేంద్రాల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాల సరఫరాకు మంగళం పాడారు. సబ్సిడీ విత్తనాలకూ కోత పెట్టారు. మరోవైపు ఎరువుల సరఫరాను సొసైటీలకు పరిమితం చేశారు. దీంతో ఎరువుల కోసం సీజన్లో పొలం పనులు మానుకుని మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సిన దుస్థితి దాపురించింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో దాదాపు 10 రోజుల పాటు పొలం పనులు వదిలేసి సొసైటీల వద్ద పడిగాపులు కాస్తేగానీ అరకట్ట దొరకడం గగనమైపోయింది. టీడీపీ కూటమి నేతల సిఫార్సు మేరకు సరఫరా జరుగుతుండటంతో సన్న, చిన్న కారు రైతులు అల్లాడుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సీసీ ఆర్సీ కార్డులున్న వారు సైతం యూరియా దొరక్క ప్రైవేటు వ్యాపారుల వద్ద నిలువు దోపిడికి గురవుతున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో నూటికి 70–80 శాతం మంది కౌలు రైతులే. వీరంతా రెండో విడతలో కూడా యూరియా దొరక్క యాతన అనుభవిస్తున్నారు. బాపట్ల జిల్లా ఆవులవారిపాలెంలో యూరియా కోసం రైతుల పడిగాపులు (ఫైల్) పక్కదారి పట్టిన యూరియా..వ్యవసాయ సీజన్లో 10 శాతానికి మించి పనులు సాగని జూన్, జూలైలోనే దాదాపు 35 శాతం యూరియా అమ్మకాలు జరగడం చూస్తే అదంతా నల్ల బజారుకు చేరిపోయిందని అర్ధమౌతుంది. డిమాండ్ సాకుగా చేసుకుని టీడీపీనేతలు యూరియాను అధికధరలకు అమ్ముకున్నారు. వరి పొలాలకు యూరియా ఇవ్వాల్సిన తరుణంలో సర్కారు చేతులెత్తేసింది. పెద్ద ఎత్తున నిల్వలు పక్కదారి పట్టినా కళ్లప్పగించి చూసింది. దీంతో కట్ట యూరియా కోసం రైతన్నలు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూరియా సరఫరాలో అలసత్వాన్ని ఎండగడుతూ రైతులకు అండగా వైఎస్సార్సీపీ పోరుబాట చేపట్టే వరకు చంద్రబాబు సర్కారు మేలుకోలేదు. పరిస్థితి చేయి దాటిపోవడంతో అదునుకు యూరియా దొరక్క రైతులు ఖరీదైన కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేయాల్సి వస్తోంది. యూరియా కట్ట రూ.266.50 కాగా సొసైటీల్లోనే రూ. 25 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.500 వరకు గుంజుతున్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో బస్తా రూ.600–700 వరకు పిండుతున్నట్లు రైతులు చెబుతున్నారు. బలవంతంగా కాంప్లెక్స్ ఎరువులతో పాటు అవసరం లేని పురుగు మందులను అంటగడుతుండడంతో ఎకరాకు రూ.5 వేలకు పైగా అదనపు భారం పడుతోందని వాపోతున్నారు. ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో సొసైటీలను పరిశీలించగా చాలా చోట్ల యూరియా నిల్వలే లేవు. డిమాండ్‌కు సరిపడా లేక రైతులు ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్న పరిస్థితులు కనిపించాయి.అదునుకు అందకపోతే..శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాతో పాటు ఉత్తర కోస్తాలో ఎకరాకు 75–80 కేజీలు యూరియా అవసరం. గిరిజన ప్రాంతాల్లో 55–69 కిలోలు వినియోగించాలి. వర్షాధార ప్రాంతాల్లో మూడు విడతల్లో 100–125 కేజీలు, నీటిపారుదల ప్రాంతాల్లో నాలుగు విడతల్లో 80–90 కిలోల చొప్పున పంటలకు యూరియా వేస్తారు. వర్షాధార ప్రాంతాల్లో విత్తే సమయంలో తొలి విడతగా, 30–35 రోజుల మధ్య రెండో విడత, మిగిలింది 50–55 రోజుల మధ్య వేస్తారు. నీటిపారుదల ప్రాంతాల్లో నాట్లు వేసిన 7–10 రోజుల్లో తొలి విడత, 25–30 రోజుల్లో 2వ విడత, 45–50 రోజుల మధ్య మూడో విడత, చివరగా 60–65 రోజుల మధ్య నాలుగో విడత యూరియా అవసరం ఉంటుంది. తొలిదశలో యూరియాతో పాటు డీఏపీ లేదంటే కాంప్లెక్స్ ఎరువులు వేస్తారు. రెండో విడతలో యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువు 20–25 కేజీలు వేస్తారు. చివరి రెండు దశల్లో యూరియా ఎక్కువగా అవసరం ఉంటుంది. మూడో దశకు యూరియా అందకపోతే పంట ఏపుగా ఎదగదు. దుబ్బులో పిలకలు తగ్గిపోతాయి. చివరి దశలో యూరియా అదునుకు ఇవ్వకుంటే కంకి సైజు తగ్గిపోవడం, గింజ బరువు తగ్గిపోవడం జరుగుతుంది. 3, 4వ దశల్లో నత్రజని అందకపోతే దిగుబడి గణనీయంగా 5–10 బస్తాల వరకు తగ్గిపోతుంది.రెండో దశలోనూ కటకట..ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం వరి పంట పొట్ట దశకు చేరుకుంది. కృష్ణా డెల్టా పరిధిలో ఎకరాకు దాదాపు రెండు బస్తాల యూరియా వాడతారు. రెండో విడతలోనూ మెజార్టీ రైతులకు యూరియా అందకపోవడంతో చేసేది లేక కాంప్లెక్స్ ఎరువులను వినియోగించారు. యూరియాలో 46 శాతం నత్రజని ఉంటుంది. అదే కాంప్లెక్స్ ఎరువు (20ః20)లో 20 శాతం మాత్రమే నత్రజని, 20 శాతం ఫాస్పేట్ ఉంటాయి. తీవ్ర కొరత కారణంగా రెండు మూడు విడతల్లో 20 కేజీల చొప్పున వేయాల్సిన యూరియాకు బదులుగా 20ః20 కాంప్లెక్స్ ఎరువులను వినియోగించారు. యూరియాలో ఉండే నత్రజని కోసం దాదాపు 60 కేజీల కాంప్లెక్స్ ఎరువులను వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే 20 కేజీల యూరియాకు రూ.135 ఖర్చవుతుండగా, 60 కేజీల కాంప్లెక్స్ కోసం దాదాపు రూ.1,600 వరకు వెచ్చించాల్సిన అగత్యం తలెత్తింది. ఈ లెక్కన 2–3 విడతల్లో 45 కేజీల యూరియా బస్తాకు కేవలం రూ.266.50 ఖర్చు చేస్తే సరిపోయేది. కానీ కాంప్లెక్స్ ఎరువుల వినియోగం వల్ల దాదాపు రూ.3,200 వ్యయం అయింది. అంటే ఐదారు రెట్లు అదనంగా రైతుల నెత్తిన భారం పడింది. అయినప్పటికీ పంట ఎదుగుదల కానరాక ఈసారి దిగుబడులు తగ్గిపోతాయన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. కనీసం ఎకరాకు 5 బస్తాలకు పైగా దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరియా కోసం తోపులాట..తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం టేకులపల్లి పీఏసీఎస్ పరిధిలో యూరియా పంపిణీ గందరగోళంగా మారింది. యూరియా వచ్చినట్లు తెలియడంతో చౌటపల్లి, గానుగపాడు, జీకొత్తూరు, తదితర గ్రామాల రైతులు ఆదివారం ఉదయం ఆరు గంటలకే సొసైటీ వద్దకు పోటెత్తారు. పోలీసులు తొమ్మిది గంటల సమయంలో అక్కడికి చేరుకోగా మూడు గంటల పాటు రైతులు పడిగాపులు కాశారు. క్యూలైన్లు ఏర్పాటు చేసేలోపే పీఏసీఎస్ సిబ్బంది టోకెన్ల పంపిణీ ప్రారంభించడంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. వారిని నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేశారు. పోలీసులు, సహకార సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంపై తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.మాధురి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీఎస్ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని జిల్లా సహకార అధికారికి సిఫారసు చేశారు.శ్రీకాకుళం జిల్లా మజ్జిలిపేటలో యూరియా కోసం బారులు తీరిన రైతులు (ఫైల్) పలుకుబడి ఉన్న వాళ్లకే ఇస్తున్నారునాకు సొంతంగా అరకెరం భూమి ఉంది. కౌలుకు ఏడెకరాలు తీసుకొని ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేసా. యూరియా కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందిపడ్డాను. యూరియా దొరక్క కాంప్లెక్స్ వాడుతున్నాం. సొసైటీలో ఎకరాకు అరకట్టకు మించి ఇవ్వడం లేదు. ఇది ఏ మూలకు సరిపోతుంది. ఊర్లో పలుకుబడి ఉన్న వాళ్లకు మాత్రమే ఇస్తున్నారు. మాలాంటి బక్క రైతులను పట్టించుకునేవారు కరువయ్యారు..బహిరంగ మార్కెట్లో యూరియా దొరకడం లేదు. ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. అదును యూరియా కూడా అందించడం ఈ ప్రభుత్వం చేతకావడం లేదు. – తెన్నేటి శ్రీనివాసనాయక్, తెన్నేరు, కృష్ణా జిల్లాఅరకట్ట ఏ మూలకు సరిపోతుందిఆరుకట్టలు. పురుషోత్తపట్నం నుంచి మంతెన తీసుకెళ్తున్నారు.ఎకరాకు అరకట్ట ఇచ్చారు. చాలడం లేదు. 33 ఎకరాల సొంత భూమి భూమి ఉంది. ఉదయం నాలుగు గంటల నుంచి వెయిట్ చేస్తే..ఆరు కట్టలు ఇచ్చారు. మూడు విడతల్లో కట్ట వెయ్యాలి. కానీ అరకట్టే ఇస్తున్నారు. అమ్మోనియా వేస్తునాం.– కిరణ్..పురుషోత్తçపట్నం, కృష్ణా జిల్లాఅందరికీ సరిపెట్టాలంటున్నారు20 ఎకరాలు..10 కట్టలు ఇచ్చారు. ఒక కోటా వేసాం. అధిక వర్షాలకు పంట మునిగిపోయింది. పంట పోయింది. మళ్లీ నాట్లు వేసాం. రెండో విడతలో యూరియా దొరక్క అగచాట్లు పడుతున్నాం. ఎకరాకు అరకట్ట ఇస్తున్నారు,. చాలా ఇబ్బంది ఉంది. అడిగితే అందరికి సరిపెట్టాలి కదా అంటున్నారు.2వేలకు పైగా అదనంగా ఖర్చు 15 ఎకరాల్లో వరి వేశా. 11 కట్టలిచ్చారు. పైగా సొసైటీలోనే కట్ట రూ.270 తీసుకుంటున్నారు. రెండో విడత యూరియా దొరక్క 20ః20 వేసాం. బస్తాకు రూ.1350 చొప్పున రెండు బస్తాలు వేయాల్సి వచ్చింది. దాదాపు 2వేలకుపైగా అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది.– పిన్నబోయిన కొండలరావు, కృష్ణా జిల్లారైతులకు బాబు ఎగ్గొట్టిన బకాయిలిలా..⇒ కేంద్రంతో నిమిత్తం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సూపర్ సిక్స్‌లో హామీ ఇచ్చారు. దీన్ని తుంగలో తొక్కి 53.58 లక్షల మందికి రూ.20 వేల చొప్పున రూ.10,716 కోట్లు తొలి ఏడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.5 వేల చొప్పున రూ.2342.92 కోట్లతో సరిపెట్టారు. గత ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే దాదాపు 7 లక్షల మందికి కోతపెట్టారు.⇒ ఎన్నడూ లేని విధంగా గడిచిన 15 నెలల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయి 300 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఏ ఒక్కరికీ పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు.⇒ ఎన్నికల కోడ్ కారణంగా ఉచిత పంటల బీమా పథకం కింద 2023–24 సీజన్‌కు సంబంధించి రైతుల తరపున చెల్లించాల్సిన రూ.930 కోట్ల ప్రీమియం సొమ్ములు కంపెనీలకు చెల్లించలేదు. ఫలితంగా ఆ సీజన్లో కరువు, వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న దాదాపు 11 లక్షల మంది రైతులకు రూ.1385 కోట్ల బీమా పరిహారం అందకుండా చేశారు.⇒ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖరీఫ్–2024–25 ఉచిత పంటల బీమా పథకం కింద రైతుల తరపున చెల్లించాల్సిన రూ.833.92 కోట్లు ఇప్పటి వరకు చెల్లించలేదు.⇒ రబీ–2024–25 సీజన్ నుంచి స్వచ్ఛంద నమోదు పద్ధతిన అమలు చేసిన ఫసల్ బీమా కోసం ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన రూ.88.09 కోట్లు ఇప్పటి వరకు కంపెనీలకు జమ చేయలేదు. ఈ కారణంగా దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా బీమా పరిహారం నేటికీ రైతులకు అందని పరిస్థితి నెలకొంది.⇒ 2023–24 సీజన్‌కు సంబంధించి ఎన్నికల కోడ్‌తో పాటు వివిధ సాంకేతిక కారణాలతో 3.91 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు ఎగ్గొట్టారు.⇒ సున్నా వడ్డీ రాయితీ కింద ఖరీఫ్–2023 సీజన్‌కు సంబంధించి 2024 సీజన్లో 6.31లక్షల మందికి జమ చేయాల్సిన రూ.132 కోట్లు నేటికీ జమ చేయలేదు.⇒ 2024–25 సీజన్లో వరుస వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు సంబంధించి 4.50 లక్షల మందికి చెల్లించాల్సిన మరో రూ.650 కోట్లు ఇప్పటికీ జమ చేయలేదు. ఈ విధంగా దాదాపు రూ.23,584 కోట్లు కూటమి సర్కారు రైతులకు ఎగ్గొట్టింది.మద్దతు ధర కరువు..సీజన్ ఆరంభంలోనే ధరల పతనం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. నెల్లూరులో మాసూళ్లకు వచ్చిన సన్నరకాలకే మద్దతు ధర కరువైంది. మద్దతు ధర ప్రకారం పుట్టికి (850 కేజీలు) రూ.19,720 దక్కాల్సి ఉండగా రూ.14వేల నుంచి రూ.15 వేలు మాత్రమే పలుకుతోంది. అదీ కూడా కొనేవారు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏ పంటకూ కనీస మద్దతు ధరలు దక్కడం లేదు. మార్కెట్లో జోక్యం చేసుకొని ధరలు పతనం కాకుండా అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది. ఉల్లి కిలో 50 పైసలకు పడిపోయింది. జీ–9 రకం అరటి టన్ను రూ.4–6 వేలకు పడిపోగా చీని (బత్తాయి) ధర టన్ను రూ.6–12వేలకు పతనమైంది. ఉల్లి రైతుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా క్వింటా రూ.1,200 చొప్పున తమ వద్ద ఉల్లిని కొనుగోలు చేయాలని రైతులు కోరుతుంటే వారిని మభ్యపుచ్చేందుకు హెక్టార్‌కు రూ.50 వేల సాయం అంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టింది. తొలి ఏడాది పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి రెండో విడతలో 7 లక్షల మందికి కోతపెట్టింది. ఉచిత పంటల బీమాను అటకెక్కించి బీమా ప్రీమియం భారాన్ని రైతుల నెత్తిన మోపింది. ఏడాదిగా కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం ఎగ్గొట్టడంతో రైతులకు దక్కాల్సిన రూ.2 వేల కోట్లకుపైగా పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. కరువు బారిన పడి నష్టపోయిన రైతులకు పైసా పరిహారం ఇవ్వలేదు. కౌలు రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టింది. సున్నా వడ్డీ రాయితీకి చాప చుట్టేసింది.గత ప్రభుత్వం ఆదుకుంది ఇలా..వైఎస్సార్సీపీ హయాంలో 39.01 లక్షల మంది రైతుల నుంచి రూ.67,906 కోట్ల విలువైన 3.60 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించి అండగా నిలిచింది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడమే కాదు.. ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్ లో జోక్యం చేసుకొని వ్యాపారులతో పోటీపడి రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి కనీస మద్దతు ధరలు దక్కేలా చర్యలు తీసుకుంది. సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు గ్రామస్థాయిలోనే పంటల ధరలను పర్యవేక్షించింది. టమాటా, ఉల్లి, బత్తాయి, పొగాకు, పత్తి తదితర పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేయడం ద్వారా వ్యాపారుల్లో పోటీని పెంచింది. ఇలా ఐదేళ్లలో రికార్డు స్థాయిలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి అండగా నిలిచింది. -
కన్నీటి సాగు.. సీమ రైతు గగ్గోలు
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాల్లో వ్యవసాయ రంగంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉల్లి, టమాటా, మామిడి, చీనీ, అరటి తదితర పంటలకు కనీస మద్దతు ధరలు దక్కక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటను కొనే వారు లేక నష్టాల బారిన పడుతున్నారు. మార్కెట్లో జోక్యం చేసుకొని ధరల పతనాన్ని అడ్డుకోవల్సిన రాష్ట్ర ప్రభుత్వం తమకేమీ సంబంధం లేదన్నట్టుగా చేష్టలుడిగి చూస్తుండడంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయి అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో ఉద్యాన పంటలు 45.75 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, రాయలసీమ జిల్లాల్లో 19.25 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 346 లక్షల టన్నుల దిగుబడులొస్తుండగా, అందులో సగానికి పైగా.. అంటే 221 లక్షల టన్నుల (63.9 శాతం) దిగుబడులు రాయలసీమ నుంచే వస్తున్నాయి. పండ్లు, కూరగాయలు, పూల ఉత్పత్తిలో అగ్రస్థానం రాయలసీమదే. రాష్ట్ర వ్యాప్తంగా 213 లక్షల టన్నుల పండ్ల ఉత్పత్తి జరుగుతుండగా, అందులో 40 లక్షల టన్నుల అరటి, 22.35 లక్షల టన్నుల చీనీ (బత్తాయి) ఉత్పత్తి రాయలసీమ జిల్లాల నుంచే వస్తోంది. మామిడి దిగుబడులు 49 లక్షల టన్నులు కాగా, దాంట్లో 15 లక్షల టన్నులు రాయలసీమ జిల్లాల నుంచే వస్తున్నాయి. రాష్ట్రంలో టమాటా ఉత్పత్తి 42.46 లక్షల టన్నులు కాగా, ఇందులో 41 లక్షల టన్నులు రాయలసీమ జిల్లాల నుంచే వస్తున్నాయి. ఉల్లి దిగుబడులు 10 లక్షల టన్నులు కాగా, దాంట్లో 7–8 లక్షల టన్నులు రాయలసీమ జిల్లాల నుంచే అందుతోంది. ధరల పతనంతో గగ్గోలు » గతేడాది కూడా రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా సాగయ్యే డ్రాగన్ ఫ్రూట్‌తో పాటు బొప్పాయి, కర్బూజా, పుచ్చకాయ తదితర పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రనష్టాలు చవిచూశారు. ఈ ఏడాది జూలై, ఆగస్టులో «ధర లేక లక్షలాది మంది మామిడి రైతులు నష్టపోగా, తాజాగా ప్రస్తుత ఖరీఫ్‌లో సీజన్ ఆరంభంలోనే ఉల్లి, టమాటా, అరటి, చీనీ వంటి పంటల ధరల పతనంతో సీమ రైతులు విలవిల్లాడి పోతున్నారు. » టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వక పోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ధర లేక కోతకొచ్చిన పంటను చేలల్లోనే వదిలేçస్తుండగా, కొనేవారు లేక రోడ్డుపక్కన పారబోయడం, మేకలు, గొర్రెల మేతకు పెడుతున్న ఘటనలు రోజూ సర్వసాధారణమయ్యాయి. ప్రస్తుతం రైతుల నుంచి క్వింటా ఉల్లి రూ.300 – రూ.400, టమాటా రూ.200– రూ.600కు మించి కొనడంలేదు. » రాయలసీమలో పండే జీ–9 అరటి టన్ను రూ.4 వేల నుంచి రూ.6 వేలు, చీనీ (బత్తాయి) టన్ను రూ.6 వేల నుంచి రూ.12 వేలకు మించి ధర పలకడం లేదు. ఉల్లి క్వింటా రూ.1,200కు తక్కువ కాకుండా కొనుగోలు చేస్తామని నమ్మబలికిన ప్రభుత్వం.. వారం తిరక్కుండానే కొనుగోళ్లను నిలిపివేసింది. మార్కెట్–మద్దతు ధర మధ్య వ్యత్యాసం ఇస్తామంటూ రైతులను ఏమార్చేందుకు యత్నిస్తోంది. » ధర లేక, కొనేవారు లేక పెద్ద ఎత్తున రైతులు పంటను తీసేస్తున్నారు. గతేడాది «ధరల పతనంతో మొదలైన సంక్షోభం ఈ ఏడాది కూడా కొనసాగుతుండడం రైతులను కలవర పెడుతోంది. గిట్టుబాటు ధరకు అమ్ముకోవాల్సిన ప్రధాన పంట ఉత్పత్తులను తక్కువ ధరకు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి రైతులకు దాపురించింది. కనీసం పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి లేక అల్లాడి పోతున్నారు. 1/3 వంతు కూడా సాగవ్వని వేరుశనగ వ్యవసాయ పంటల విషయానికి వస్తే రాష్ట్రంలో సాధారణ విస్తీర్ణం 77.88 లక్షల ఎకరాలు కాగా, రాయలసీమ జిల్లాల్లో 26.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. దీంట్లో 12.43 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట మాత్రమే సాగవుతోంది. ఈ ఏడాది 14 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు లక్ష్యం కాగా, కేవలం 4లక్షల ఎకరాలకు మించి సాగవ్వని పరిస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల వల్ల వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో 19–42 శాతం మధ్యే సాగైన పంటలను చూస్తుంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖరీఫ్‌లో సీమలో ఆగస్టు 7 వరకు అనావృష్టితో ఒక్క కర్నూలు జిల్లాలో తప్ప మిగిలిన జిల్లాల్లో సాగు అంతంత మాత్రంగానే జరిగింది. సాగైన చోట కూడా వర్షాభావ పరిస్థితులకు తోడు అధిక వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. నష్టం భరించలేక చీనీ చెట్లు నరికేస్తున్నా ఈ రైతు పేరు సి.కేశవ. వైఎస్సార్ కడప జిల్లా లింగాల గ్రామానికి చెందిన ఈయన 3 ఎకరాలలో చీనీ తోట సాగు చేశారు. 20 ఏళ్లుగా చీనీ పంటను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. 2023–24లో మంచి దిగుబడులతో పాటు రికార్డు స్థాయిలో ధర లభించింది. టన్ను రూ.25 వేలకు పైగా ధర పలికింది. ప్రస్తుతం దిగుబడి బాగా వచ్చినా, మార్కెట్ యార్డులో వ్యాపారులు సిండికేట్ అయ్యారు. కొనే వారు లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ప్రస్తుతం క్వింటా రూ.3 వేల నుంచి రూ.7 వేలకు మించి పలకడం లేదు. ధరలు పతనం కావడంతో ఈ ఏడాది రూ.3 లక్షల మేర నష్టపోవాల్సి వచ్చింది. ఈ నష్టాన్ని భరించలేక చీనీ చెట్లను నరికి వేస్తున్నా అంటూ ఈ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.ధర చూస్తుంటే ఏడుపొస్తోంది ఐదెకరాల్లో టమాటా సాగు చేశాను. ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టా. వాతావరణం బాగోలేకపోవడంతో దిగుబడులు తగ్గాయి. ఎకరాకు 400 బాక్సులు (10 టన్నులు) రావాల్సింది కేవలం 50 బాక్సులు (1.25 టన్నులు) మాత్రమే వచ్చింది. ప్యాపిలి మార్కెట్‌కు 20 బాక్సులు తీసుకొస్తే బాక్స్‌కు రూ.200కు మించి ధర లభించలేదు. 2023–24లో బాక్స్ రూ.600కు అమ్ముకున్నా. ఆ ఏడాది కిలో రూ.24 పలుకగా, ప్రస్తుతం రూ.6కు మించి రావడం లేదు. బహిరంగ మార్కెట్లో, సూపర్ మార్కెట్లలో మాత్రం కిలో రూ.40–50కి పైగానే అమ్ముతుండటం చూసి ఏడుపొస్తోంది. – ప్రసాద్, ప్యాపిలి, కర్నూలు జిల్లా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు రావాలి రాయలసీమ జిల్లాల్లో అత్యధికంగా సాగయ్యే టమాటా, అరటి, చీనీ, ఉల్లి పంట ఉత్పత్తులను కొనేవారు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది మామిడి, బొప్పాయి సహా ప్రధాన ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలను చవిచూశారు. ఇంతటి దారుణ పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవు. ఇదే పరిస్థితి కొనసాగితే సీమ రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ధరల స్థిరీకరణ ద్వారా మార్కెట్లో జోక్యం చేసుకొని ధరల పతనాన్ని అడ్డుకోవడంతో పాటు ప్రతీ రైతుకు కనీస మద్దతు ధర దక్కేలా చూడాల్సిన బాధ్యత ఉంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ -
పొలం పంటల కన్నా.. ఇంటి పంటలే బెటరా?
పంటలు అనగానే మనకు ఆరుబయట పొలంలో పండించే పంటలే (అవుట్డోర్ ఫార్మింగ్) గుర్తుకొస్తాయి. కానీ, ఆధునిక కాలంలో ఇండోర్ పంటలా (ఇంటి పంటలా), అవుట్డోర్ పంటలా అని వివరణ అడగాల్సిన పరిస్థితి. మేడపైన ఇంటి పంటలు, పెరటి తోటలు, వర్టికల్ గార్డెన్స్, పాలీహౌస్ పంటలు.. ఇలా అనేక రకాలుగా ఇవ్వాళ పంటలు పండించుకుంటున్నాం. వాతావరణ పరిస్థితులు ఆరుబయట అనుకూలంగా లేనప్పుడు పాలీహౌస్‌లు, భవంతుల్లో ప్రత్యేక వాతావరణ పరిస్థితులు కల్పించి మరీ సాగు చేస్తున్నాం. రూరల్ అగ్రికల్చర్, అర్బన్ అగ్రికల్చర్‌గా కూడా విడమర్చి మాట్లాడుకుంటున్నాం. అయితే, ఇండోర్ ఫార్మింగ్‌లో (Indoor Farming) చాలా విషయాలను మనం నియంత్రించగలం కాబట్టి ఆరుబయట సాగుతో పోల్చితే అన్నీ మెరుగ్గానే ఉంటాయన్న గ్యారంటీ ఏమీలేదు. అక్కడ ఉండే ఇబ్బందులు అక్కడా ఉంటాయి. అయితే, ఇండోర్ ఫార్మింగ్ పద్ధతుల్లో ఏయే ఆహార భద్రతా చిక్కులొస్తాయి? సాధారణ వ్యవసాయానికి దీనికీ ఏమి తేడాలుంటాయి? అనే అంశంపై చర్చ చాలాకాలంగానే ఉన్నప్పటికీ అధ్యయనాల, ప్రమాణాల లోపం వెంటాడుతూ ఉంది. ఈ కొరత తీర్చడానికి ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (యూఎన్ ఎఫ్ఏవో) ఇటీవల ఒక నివేదికను వెలువరించింది. ఆరుబయట పంటలు పండించటంతో పోల్చితే ఇంట్లో పండించే పంటలతో ప్రయోజనాలేమి ఉన్నాయి? ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి?.. ఇటువంటి ఆసక్తికరమైన వివరాలను ఆ నివేదికలో చర్చించారు. వాటిని రేఖామాత్రంగా పరిశీలిద్దాం..ఆధునిక ఇండోర్ వ్యవసాయంతో ముడిపడి ఉన్న ఆహార భద్రత (Food Security) ప్రమాదాలు, నియంత్రణలపై మొట్టమొదటి సమగ్ర సమీక్షా నివేదికను ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) నివేదికలో సాకల్యంగా చర్చించింది. ఇండోర్ వ్యవసాయం లేదా నియంత్రిత పర్యావరణ వ్యవసాయం (కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అగ్రికల్చర్ – సీఈఏ) వల్ల ఒనగూడే ప్రయోజనాలు అనేకం. స్థిరత్వంతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకత, వాతావరణ మార్పులకు అనుకూలత, ఆహార భద్రతను మెరుగుపరచడం వంటివాటిని ఎఫ్ఏవో ఈ జాబితాలో చేర్చింది.ప్రస్తుత రోజుల్లో, సాంప్రదాయకంగా ఆరుబయట పండించే ఆకుకూరలతో పాటు మైక్రోగ్రీన్, బేబీ లీఫ్ వంటి స్వల్పకాలిక పంటల ఇండోర్ వ్యవసాయమే వాణిజ్యపరంగా లాభదాయకంగా మారిందని నివేదిక చెబుతోంది. ప్రపంచవ్యాప్త పరిస్థితులు ముఖ్యంగా సంపన్న చలి ప్రాంత పాశ్చాత్య, ఐరోపా దేశాలను దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాటగా దీన్ని మనం పరిగణించాలి. ఎందుకంటే.. మన దేశంలో ఇండోర్ వ్యవసాయం ఇంకా శైశవ దశలోనే ఉంది. ఈ పరిమితిలోనే ఈ నివేదికలోని అంశాలను పరిశీలిద్దాం.ఏ వ్యవసాయమైనా ఆరోగ్యదాయకమైన, రోగకారకం కాని భద్రమైన ఆహారోత్పత్తే లక్ష్యంగా సాగుతుంది. అయితే, సాంప్రదాయ వ్యవసాయం కంటే ఇండోర్ వ్యవసాయమే సులభంగా నిర్వహించదగిన ఆహార భద్రత ప్రమాదాలతో కూడి ఉంటుందని తరచుగా భావిస్తుంటారు. అయితే, ఇండోర్ పంటలకు సంబంధించిన ఆహార భద్రత సమస్యలు సాధారణంగా సాంప్రదాయ బహిరంగ వ్యవసాయంలో కనిపించే సమస్యల అంతటి తీవ్రంగానే ఉంటాయని ఎఫ్ఏవో నివేదిక (FAO Report) నొక్కి చెబుతోంది. విత్తనాలు, మట్టికి బదులుగా వాడే పదార్థాలు, నీటికి సంబంధించి సూక్ష్మక్రిములతో కూడిన కాలుష్య ప్రమాదాలు పొంచి ఉంటాయి. అలాగే మొలకల ఉత్పత్తిలోనూ సమస్య రావచ్చు.బహిరంగ వ్యవసాయంతో పోల్చినప్పుడు ఇండోర్ వ్యవసాయంలో అంతర్లీనంగా ఉన్న కొన్ని అనియంత్రిత కాలుష్య సమస్యలు ఉండవు. బహిరంగ వాతావరణంలో సూక్ష్మక్రిముల పోటీ, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, ఎండ సోకటం వల్ల కొన్ని సహజ వ్యాధికారకాలు నశిస్తాయి. ఇండోర్ వ్యవసాయంలో వ్యాధికారకాలు ఎక్కువ కాలం సమస్యను సృష్టించే వీలుంటుంది. ఇందులో విత్తనాలు, నీరు, మట్టికి బదులుగా వాడే పదార్థాలు, ఎరువులు వంటి ఉత్పాదకాల జీవ భద్రతపై నియంత్రణకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.ఇండోర్ వ్యవసాయంలో అధిక తేమ, నీటి ఆధారిత వ్యవస్థలు వాడతాం కాబట్టి సూక్ష్మక్రిములతో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇండోర్ వ్యవసాయంలో సూక్ష్మక్రిముల వల్ల వచ్చే ప్రమాదాలు రసాయనాలతో వచ్చే ప్రమాదాల కంటే చాలా విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయినప్పటికీ, పర్యావరణ కాలుష్యం, పొలాస్టిక్ పరికరాల సంబంధిత పదార్థాల నుంచి వెలువడే కాలుష్యం వంటి రసాయన సమస్యలను కూడా నివేదిక పేర్కొంది.ఆర్థిక పోటీకి నిలబడితేనే భవిష్యత్తు‘ఇండోర్ వ్యవసాయం వాతావరణ మార్పుల్ని తట్టుకొని స్థిరమైన దిగుబడినిచ్చే విషయంలో గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ ఈ సామర్థ్యాన్ని ఆచరణలో నిజం చేయడానికి బలమైన ఆహార భద్రతా పద్ధతులు, పర్యవేక్షణ చాలా అవసరం’ అని ఎఫ్ఏవో నివేదిక రూపుకల్పనలో కీలకంగా వ్యవహరించిన ఆహార భద్రతా అధికారి మసామి టకేచి అన్నారు.‘సాంప్రదాయ పంటల సాగుతో తక్కువ ఖర్చుతో ఉత్పత్తిని వెలువరించగలిగే విషయంలో ఆర్థికంగా పోటీకి నిలవగలగడమే ఇండోర్ వ్యవసాయం విజయానికి కీలకం’ అని డాక్టర్ కీత్ వారినర్ అన్నారు. ఈ నివేదికను రూపొందించిన బృందంలోని గ్వెల్ఫ్ విశ్వవిద్యాలయ నిపుణుల్లో కీత్ ఒకరు. ‘అదే సమయంలో, ఇండోర్ పొలాల లోపల నియంత్రిత వాతావరణ పరిస్థితులు వ్యాధికారక సూక్ష్మజీవుల మనుగడకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి అవి లోపలికి ప్రవేశించకుండా నిరోధించడమే తొలి ప్రాధాన్యతగా ఉండాలి. అప్రమత్తతకు నవీన ఆవిష్కరణలు తోడైతే ఇండోర్ వ్యవసాయం సురక్షితంగా, స్థిరంగా పెరుగుతుంది. భవిష్యత్తు బాగుంటుంది..’ అని డా. కీత్ వివరించారు.‘ఇండోర్ ఫార్మింగ్’కు పేర్లెన్నో!?ఇండోర్ వ్యవసాయాన్ని వివిధ రకాలుగా వ్యవహరిస్తున్నారు. ‘రక్షిత వ్యవసాయం‘ అనే పదంతో ‘ఇండోర్ ఫార్మింగ్’ను 13వ శతాబ్దంలో మొదటి సారి వాడారు. బయటి వాతావరణానికి దూరంగా ఉంచే సౌకర్యాల మధ్య పెరిగే మొక్కలనే అర్థంలో వాడారు. ఆ తర్వాత కాలంలో ‘ఇండోర్ వ్యవసాయం‘ అనే పదానికి ‘పట్టణ వ్యవసాయం‘, ‘మొక్కల కర్మాగారం‘, ‘గ్రీన్హౌస్‘, ‘హాట్‌హౌస్‘, ‘గ్లాస్‌హౌస్‘ వంటి అదనపు పదాలు తోడయ్యాయి. ఇవన్నీ పర్యాయపదాలుగా ఉపయోగించబడుతున్నాయి. ఇందులోని వివిధ పద్ధతులను, వాటి భాగాలను వివరించడానికి ఉపయోగించే పదాలను నిర్వచించాల్సిన అవసరం ఏర్పడింది.పట్టణ వ్యవసాయం: నగరాలు, పట్టణ ప్రాంతాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆహారాన్ని పండించడం, ప్రాసెస్ చేయడం, పంపిణీ చేయడం.ఇండోర్ వ్యవసాయం: ఆరుబయట కాకుండా మూసివున్న వాతావరణంలో పంటలను పెంచే ఏవైనా పద్ధతులు. ఒక గదిలో మొక్కలను పెంచే వ్యవసాయ వ్యవస్థను వివరించేందుకు వాడే పదం.గ్రీన్హౌస్: గ్రీన్హౌస్ అనేది నియంత్రిత పర్యావరణ నిర్మాణం. ఇది ఉష్ణోగ్రత, సూర్యకాంతి వంటి పరిస్థితులను మారుస్తుంది. మొక్కల పెరుగుదలను సులభతరం చేస్తుంది, ముఖ్యంగా సహజ వాతావరణ పరిస్థితులు తక్కువ అనుకూలంగా ఉన్న వాతావరణాలలో దీన్ని వాడతారు. గ్లాస్‌హౌస్, పాలీ వినైల్ క్లోరైడ్ గ్రీన్హౌస్, పాలిథిలిన్ గ్రీన్హౌస్ ఇవన్నీ దీనికి పర్యాయపదాలే.చదవండి: ఒక్కసారి నాటు.. ఆరు సార్లు కోతలునియంత్రిత పర్యావరణ వ్యవసాయం: పట్టణ, పట్ణణాల చుట్టూ గలప్రాంతాల్లో ఆరుబయట, మట్టిలో గాని, మట్టిలేకుండా గాని చేసే వ్యవసాయం.మొక్కల కర్మాగారం: కృత్రిమ/సహజ/సౌర కాంతిని ఉపయోగించి అధిక నాణ్యత గల పంటలను నిరంతరం ఉత్పత్తి చేసే భవనం.– పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్ -
జీఎస్టీ తగ్గింపుతో వ్యవసాయం పురోగతి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం జనరల్ సర్వీస్ గూడ్స్ (జీఎస్టీ) శ్లాబులను ఈనెల 22వ తేదీ నుంచి తగ్గించనున్న నేపథ్యంలో వ్యవసాయరంగం పురోగతికి మార్గం సుగమం అవుతోంది. వ్యవసాయ పరికరాల ధరలు భారీగా తగ్గడం రైతులకు మేలు చేకూర్చేది అయితే.. అదే సమయంలో పాల ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపు శ్వేతవిప్లవానికి మరింత ఊతం ఇస్తుందని భావిస్తున్నారు. వ్యవసాయానికి వినియోగించే పలు పరికరాలపై జీఎస్టీ తగ్గింపు అనుకూలంగా ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వివిధ రకాల పరికరాల వినియోగంలో రూ. 5 వేల నుంచి దాదాపు రూ. 1.90 లక్షలు రైతులకు ఆదా అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పరికరాల తగ్గింపు ఒకటైతే.. రైతులు విక్రయించే పాలతో చేసే ఉత్పత్తులపై కూడా జీఎస్టీ తగ్గింపు వల్ల వీటి వినియోగం పెరగడం, దీని వల్ల ఉత్పత్తులు పెరిగి రైతులకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంటున్నారు. దాదాపు 10 కోట్ల మంది పాల ఉత్పత్తిదారులకు జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రయోజనం చేకూరుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది, పాలు, పన్నీర్‌పై జీఎస్టీని పూర్తిగా తొలగించడంతో పాల ఉత్పత్తిదారులతోపాటు, వినియోగదారులకు కూడా మేలు జరుగనుంది. సహకార సంఘాలు, ఆహారాలను శుద్ధిచేసే పరిశ్రమలు తయారుచేసే చీజ్, పాస్తా, నమ్కీన్, జామ్స్, జెల్లీ, ఫ్రూట్ పల్ప్, ఆహార పానీయాలపై కొత్త జీఎస్టీ విధానంలో ఐదు శాతానికి తగ్గించనున్నారు. ఈ ధరను తగ్గించడం వల్ల కుటుంబంపై నెలసరి భారం కొంతమేరకు తగ్గుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 1,800 సీసీ ఉండే ట్రాక్టర్లు, అలాగే రైతులు వినియోగించే అమ్మోనియా, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్‌లపై కూడా జీఎస్టీ తగ్గిస్తున్నట్లు అధికారవర్గాలు వివరించాయి. బయో పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్పై ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్టీ శ్లాబును ఐదు శాతానికి తగ్గించడం వల్ల రైతులపై భారం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయానికి ఆలంబనగా ఉంటుందని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగానికి ఈ తగ్గింపు కారణంగా ప్రయోజనం చేకూరనుంది. డెయిరీ రంగంలో రైతులు, మహిళా సంఘాలకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. రైతులు వినియోగించే కొన్ని పరికరాల ధరలు ప్రస్తుతం జీఎస్టీ తగ్గింపు వల్ల ఏ మేరకు తగ్గుతాయో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ధరలు తగ్గేవాటిలో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి. -
సచివాలయం వద్ద బీఆర్ఎస్ నేతల మెరుపు ధర్నా.. హరీష్ పరుగులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అగ్రికల్చర్ కమిషనరేట్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోడ్డుపై బైఠాయించి నిరసనలకు దిగారు. కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ ఆరోపిస్తున్నారు. దీంతో, పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. తెలంగాణలో యూరియా కొరతపై బీఆర్ఎస్ నేతలు నిరసనలకు దిగారు. అగ్రికల్చర్ కమిషనర్‌కి ఎరువుల సంక్షేమం పైన వినతి పత్రం ఇచ్చిన అనంతరం కమిషనరేట్ కార్యాలయంలో వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎరువుల కొరత సమస్య పైన సరైన వివరాలు అందించి పరిష్కార మార్గాలు చూపించేదాకా కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించారు. ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ నినాదాలు చేస్తున్నారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు చేశారు. రైతన్నకు కష్టం వస్తే ఆంక్షలు లెక్క చేయం, ఇనుప కంచెలను లెక్క చేయం..యూరియా రైతుల హక్కు... అది అందకుండా చేయడం కాంగ్రెస్, బీజేపీల తప్పు..#CongressFailedTelangana #CongressBetrayedFarmers pic.twitter.com/NwQiloWaKE— Harish Rao Thanneeru (@BRSHarish) August 30, 2025దీంతో, వారిని పోలీసులు అరెస్ట్ చేసి.. అనంతరం విడుదల చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించారు. సచివాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో సచివాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. యూరియా సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. పండగపూట కూడా రైతన్నలను రోడ్లపై నిలబెట్టింది ఈ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. “గణపతి బప్పా మోరియా – కావాలయ్యా యూరియా” అంటూ నినదించారు. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నినాదాలు చేశారు. రైతన్నలకు యూరియా వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సంక్షోభంపై వారు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సభ్యులు గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ఖాళీ యూరియా బస్తాలతో నిరసన తెలిపారు. యూరియా సంక్షోభంకు కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నినాదాలు చేశారు. -
జీడీపీ జిగేల్!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు అంచనాలను మించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికం (క్యూ1)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.8 శాతం వృద్ధి సాధించింది. ఇది 5 త్రైమాసికాల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. 2024 జనవరి–మార్చి క్వార్టర్లో వృద్ధి రేటు 8.4 శాతం తర్వాత మళ్లీ గరిష్ట స్థాయి ఇదే. ఆర్బీఐ అంచనా అయిన 6.5 శాతం మించి వృద్ధి నమోదైంది. వ్యవసాయం, తయారీ రంగాలు బలంగా రాణించడం ఇందుకు దోహదం చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2024–25) క్యూ1లో జీడీపీ 6.5% వృద్ధి చెందగా, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో 7.4% వృద్ధి నమోదైంది. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) ఈ వివరాలను విడుదల చేసింది. ‘2025–26 క్యూ1లో స్థిరమైన ధరల ఆధారంగా అసలైన జీడీపీ (జీవీఏ) రూ.47.89 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. 2024–25 క్యూ1లో ఇది రూ.44.42 లక్షల కోట్లుగా ఉంది. అంటే 7.8% వృద్ధికి సమానం’ అని ఎన్ఎస్వో తెలిపింది.ఆదుకున్న సాగు, సేవలు.. → ముఖ్యంగా వ్యవసాయ రంగం రాణించింది. 3.7 శాతం వృద్ధి చెందింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ రంగంలో వృద్ధి 1.5 శాతమే. → తయారీ, నిర్మాణ రంగంలో వృద్ధి 7.7%కి పెరిగింది. గత క్యూ1లో ఇది 7.6%. → సేవల రంగం 9.3 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఇది 6.8 శాతంగా ఉంది. సేవల విభాగంలో వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్, ప్రసార సేవలకు సంబంధించి వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన 5.4 శాతం నుంచి 8.6 శాతానికి పెరిగింది. ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, వృత్తి సేవలకు సంబంధించి వృద్ధి రేటు 6.6% నుంచి 9.5 శాతానికి పెరిగింది.→ ముఖ్యంగా మైనింగ్ రంగంలో పనితీరు బలహీనపడింది. ఈ రంగంలో వృద్ధి మైనస్ 3.1%గా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో మైనింగ్ రంగం 6.6 శాతం వృద్ధి చెందింది. → ఎగుమతుల వృద్ధి సైతం 6.3 శాతానికి పరిమితమైంది. గతేడాది ఇదే క్వార్టర్లో 8.3 శాతం పెరగడం గమనార్హం.→ జూన్ త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి 5.2 శాతంగా ఉంది. దీంతో ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని భారత్ నిలబెట్టుకుంది.2025–26 జీడీపీ అంచనాల్లో మార్పు లేదు.. అమెరికా ప్రతీకార, పెనాల్టీ సుంకాలు విధించినప్పటికీ, క్యూ1లో బలమైన పనితీరు నమోదైన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 6.3–6.8 శాతం మధ్య ఉంటుందన్న మా అంచనాలను యథావిధిగా కొనసాగిస్తున్నాం. – వి.అనంత నాగేశ్వరన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు -
ఆగ్రోఫారెస్ట్రీ మేడ్ ఈజీ..!
అడవి, పొలం వేర్వేరు...అడవిలో విత్తిన పంటలు ఉండవు.. పొలంలో చెట్లు ఉండవు.. అయితే, ‘ఆగ్రోఫారెస్ట్రీ’లో రెండూ కలగలిసి ఉంటాయి. దీన్ని ‘అటవీ వ్యవసాయం’ అనొచ్చు. పొలాల మధ్యలోనే కాదు గట్ల మీద కూడా మచ్చుకు ఒక చెట్టు కూడా లేని వ్యవసాయ భూములు మన గ్రామాల్లో విస్తారంగా కనిపిస్తాయి. చెట్టు నీడ పడిన చోట పంట మొక్కలు సరిగ్గా పెరగవని ఉన్న చెట్లు కొట్టెయ్యటం మనకు తెలిసిందే. విస్తారమైన పొలాల మధ్య ఒక్క చెట్టూ లేని ప్రాంతాలు కూడా కనిపిస్తున్నాయి. 3–6 నెలల్లో పూర్తయ్యే పంటలను ఎప్పటికప్పుడు విత్తుకొని, పంటయ్యాక శుభ్రం చేసి దున్ని పెట్టుకునే అలవాటు వల్ల వ్యవసాయ భూములు నిస్సారంగా మారిపోతున్నాయి. ఈ దుస్థితి మారాలి.అంటే, పంట భూముల్లోకి తిరిగి చెట్లను ప్రవేశపెట్టాలి. అందుకని, ‘ఆగ్రోఫారెస్ట్రీ’ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం చొరవ చూపుతోంది. స్వల్పకాలిక పంటలు సాగు చేసే పొలాల్లోనూ ఆదాయాన్నిచ్చే రకరకాల చెట్లు, పశువులను కలిపి పెంచటాన్ని.. ఆగ్రోఫారెస్ట్రీని.. ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. రైతుల ఆర్థిక ప్రయోజనం కోసం, పనిలో పనిగా పర్యావరణ సేవల కోసం ఈ అటవీ వ్యవసాయాన్ని పెంపొందించాలన్నది లక్ష్యం. విలువైన కలప చెట్లను పెంచుతున్న రైతులు ఆ చెట్లు ఎదిగిన తర్వాత నరికి అమ్ముకోవటానికి సవాలక్ష ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ బాధల నుంచి రైతులను ఒడ్డునపడెయ్యటం ద్వారా చెట్ల పెంపకాన్ని పంట పొలాల్లోనూ ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. వాస్తవానికి, రైతులు తమ పొలాల్లో పెంచే (ముఖ్యంగా విలువైన కలప జాతి) చెట్ల నరికివేత సమయంలో పొందాల్సిన అనుమతుల ప్రక్రియ ఇప్పుడు చాలా సంక్లిష్టంగా ఉంది. దీన్ని సులభతరం చేస్తూ ఇటీవలే నమూనా నియమాలను విడుదల చేసింది కేంద్రం. ఈ రైతుల కోసం ఒక ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొన్న రైతులు ఆన్లైన్లోనే అనుమతులు తీసుకునే ఏర్పాటు చేస్తోంది. అయితే, ఆగ్రోఫారెస్ట్రీపై సరికొత్త నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి, అమలు చేయాల్సి ఉంది! ఆ నియమాలేమిటో చూద్దాం...ఆగ్రోఫారెస్ట్రీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో భారత పర్యావరణ, అటవీ, క్లైమెట్ ఛేంజ్ మంత్రిత్వ శాఖ వ్యవసాయ భూమిలో పెంచిన చెట్లను నరకటం, రవాణా చేయటానికి సంబంధించిన నియమ నిబంధనలను సులభతరం చేసే నమూనా నియమ నిబంధనలను ఇటీవల ప్రకటించింది. ప్రైవేట్ భూమిలో చెట్ల పెంపకాన్ని సులభతరం చేయడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, నేలను పునరుద్ధరించడం, డిజిటల్ ట్రేసబిలిటీ ద్వారా అధికారిక అనుమతుల తిప్పలు తగ్గించడం.. తద్వారా విదేశీ కలప దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయ భూమిలో పెరిగిన చెట్లను నరికివేతకు స్పష్టమైన నియమాలు ఇప్పటి వరకు లేకపోవటంతో నమూనా నియమనిబంధనలను కేంద్రం రూపొందించింది. అయితే, సాధారణ పంట పొలాలను అటవీ వ్యవసాయ క్షేత్రాలుగా మార్చేందుకు దోహదపడే ఈ ‘నమూనా నియమాల’ ప్రయోజనాలు ఎంత వరకు రైతులకు అందుతాయనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం, అమలు తీరుపై ఆధారపడి ఉంటుంది. కేంద్రం చెప్పినంత మాత్రాన రాష్ట్రాలు వాటిని విధిగా అనుసరించాల్సిన బాధ్యత లేదు. రూ. లక్ష కోట్ల కలప దిగుమతి మన దేశం ప్రతి సంవత్సరం దాదాపు రూ. లక్ష కోట్ల విలువైన కలపను దిగుమతి చేసుకుంటున్నది. చెక్క ఫర్నీచర్, తలుపులు, కిటికీలు చాలా వరకు మలేషియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా లేదా ఇండోనేషియా నుండి దిగుమతి చేసుకున్న కలపతో తయారవుతున్నాయి. అదే సమయంలో, మన దేశంలో, అటవీ వ్యవసాయం చేయడానికి అనువైన కోట్ల హెక్టార్ల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది. కానీ, కారణం ఏదైతేనేమి, మన దేశంలోని రైతులు ఈ భారీ మార్కెట్‌ను ఉపయోగించుకోలేక΄ోయారు. భారతీయ రైతులు ఇంత ఆశాజనకమైన అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? అని ప్రశ్నించుకునే సందర్భం వచ్చింది. కోట్లాది మంది రైతులు ప్రతిరోజూ తమ ΄÷లాలను జాగ్రత్తగా చూసుకుంటుంటారు. ఆ సాగు భూమిని ‘చెట్లతో కూడిన వ్యవసాయం’ కోసం ఉపయోగించడం ద్వారా కలప దిగుమతికి స్వస్తి చెప్పవచ్చు. అటవీ వ్యవసాయం కేవలం కలప గురించి మాత్రమే కాదు. ఇది నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, పంట దిగుబడిని పెంచడానికి, ఆహార భద్రతను పరిపూర్ణం చేయటంలో, వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. నదులను పునరుద్ధరించడంలో చెట్ల ఆధారిత వ్యవసాయం ఎలా సహాయపడుతుందో చూపే ఉద్యమ ఉదాహరణలు ఉన్నాయి. అయినా, ఇన్నాళ్లూ అటవీ వ్యవసాయం విస్తరించక΄ోవటానికి కారణాలు ఉన్నాయి.చట్టపరమైన చిక్కుఒక మారుమూల గ్రామంలో మీరు ఒక రైతు అని ఊహించుకోండి. కలపకు పెరుగుతున్న డిమాండ్ చూసి, మీ భూమిలో అధిక విలువైన కలప చెట్లను నాటారు. మొక్కలు కొని, గుంతలు తవ్వి నాటారు. నీటి΄ారుదల ఏర్పాటు చేశారు. చెట్లను ఏళ్ల తరబడి జాగ్రత్తగా చూసుకున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడిగాను, ఒక రకమైన బీమాగా కూడా భావించి ఆశలు పెంచుకున్నారు. కానీ చివరకు చెట్లు నరికే సమయం వచ్చినప్పుడు, సమస్య వచ్చిపడుతుంది. మీ సొంత వ్యవసాయ భూమిలో చెట్లు పెరిగినప్పటికీ, వాటిని మీ వ్యవసాయ ఉత్పత్తులుగా చట్టం పరిగణించదు! చట్టబద్ధంగా, అవి ‘అటవీ ఉత్పత్తుల’ కిందకు వస్తాయి. పెరిగిన చెట్లను నరకాలంటే సంక్లిష్టమైన అనుమతులు అవసరం అవుతాయి. అటవీ, రెవెన్యూ, వ్యవసాయ శాఖల నుంచి ఆమోదాలు తీసుకోవాలి. అనుమతుల కోసం తరచుగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పటికే రోజువారీ బాధ్యతలతో తీరిక లేకుండా ఉండే రైతులకు ఈ పనులు సులభం కాదు.2014 తర్వాత ఆశాజనకమైన కదలిక ఈ పరస్థితుల్లో మార్పు తేవటానికి ఆశాజనకమైన విధాన మార్పులు జరుగుతున్నాయి. రైతులు చెట్లను వ్యవసాయ పంటలతో అనుసంధానించడాన్ని ప్రోత్సహించడానికి జాతీయ అటవీ వ్యవసాయ విధానాన్ని 2014లో అమల్లోకి తెచ్చారు. 2018లో ఒక నిపుణుల కమిటీ చెట్ల ఆధారిత వ్యవసాయ క్షేత్రాలను ప్రధాన స్రవంతి వ్యవసాయంలోకి తీసుకురావడం ద్వారా ‘అడవుల వెలుపల చెట్టు’న్న ప్రాంతాన్ని విస్తరించాలని సిఫారసు చేసింది. ఈ విధానాలు మంచి ఉద్దేశ్యంతో కూడినవే అయినప్పటికీ, అవి నిజంగా కీలక సమస్యను పరిష్కరించలేదు. అదేమిటంటే.. ప్రైవేట్ వ్యవసాయ భూముల్లో పెంచే చెట్లకు సంబంధించిన చట్టపరమైన స్థితి మారలేదు.ఈ సమస్య 1927 నాటి ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ నాటిది. ఇది వలసరాజ్యాల కాలం నాటి చట్టం. ప్రైవేట్ భూమిలో పండించిన కలపతో సహా అన్ని రకాల కలపలను ‘అటవీ ఉత్పత్తులు’గానే నిర్వచించింది. దీని అర్థం రైతులు తాము పెంచిన చెట్లను నరకడానికి లేదా రవాణా చేయడానికి అటవీ శాఖ అనుమతులు తీసుకోవటం అవసరం. ఈ పాత నిబంధన దాదాపు ఒక శతాబ్దం పాటు 2023 వరకు అమలులో ఉంది. అటవీ సంరక్షణ చట్టానికి 2023లో ఒక మైలురాయి వంటి సవరణ జరిగింది. అధికారికంగా అడవిగా నోటిఫై అయిన భూమికి లేదా 1980 అక్టోబర్ 25 నాటికి ప్రభుత్వ రికార్డులలో అడవిగా నమోదైన భూమికి మాత్రమే వర్తిస్తుందని, రైతుల పొలాలకు వర్తించదని ఈ సవరణ స్పష్టం చేసింది. సరళంగా చెప్పాలంటే, రైతులు ఇప్పుడు తమ వ్యవసాయ భూమిలో చెట్లను పెంచుకోవచ్చు. వాటిని నరికితే జరిమానా పడుతుందనే ఆందోళన లేకుండా ఆగ్రోఫారెస్ట్రీ సాగు చేసుకోవచ్చు.సొంత భూమిలో పెంచిన చెట్లను నరకడానికి, రవాణా చేయటానికి మాత్రం అనుమతులు తప్పనిసరి అనే మరో ప్రధాన అడ్డంకి మిగిలే ఉంది. ప్రతి రాష్ట్రం కొన్ని జాతుల చెట్ల జాబితాను రూపొందించింది. వీటిని నరకాలన్నా లేదా కలప రవాణా చేయాలన్నా ప్రత్యేక అనుమతి అవసరం. తరచూ మారే ఈ నియమనిబంధనలు రైతులను గందరగోళపరుస్తూ ఉంటాయి.ఎన్టిపిఎస్కు స్పందన కరవురైతులకు ఈ అనుమతులు ఇవ్వటం కోసమని 2020లో ‘నేషనల్ ట్రాన్సిట్పాస్ సిస్టమ్’(ఎన్‌టిపిఎస్) కేంద్రం ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటివరకు, ఇది పెద్దగా ఆదరణ పొందలేదు. దాదాపు 950 మంది రైతులు మాత్రమే ఈ ప్లాట్ఫామ్లో నమోదు చేసుకున్నారు. కాబట్టి, ఆగ్రోఫారెస్ట్రీ నిబంధనలను మరింత సరళీకరించాల్సిన అవసరాన్ని గుర్తించిన కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2025 జూన్‌లో ‘వ్యవసాయ భూమిపై చెట్ల నరికివేతకు నమూనా నియమాల’ను ప్రకటించింది. అన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని ఏకీకృత, రైతు స్నేహ పూర్వక వ్యవస్థ ఏర్పాటుకు ఇవి వీలు కల్పిస్తున్నాయి.కొత్త నియమాలు చెబుతున్నదేమిటి?నేషనల్ టింబర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎన్‌టీఎంఎస్) రైతులు తమ పొలాల్లో పెంచుతున్న చెట్లను నమోదు చేసుకోవడానికి, పర్మిట్లను ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. ఇది జాప్యాన్ని తగ్గిస్తుంది. రైతులు తమ తోటల భూములను ఎన్‌టీఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. భూమి యాజమాన్యం, ఊరు, నాటిన జాతులు, నాటిన తేదీలు వంటి వివరాలను అందించాలి. చెట్లను జియోట్యాగ్ చేసిన ఫోటోలను కూడా అప్లోడ్ చేయాలి. కాలానుగుణంగా కొత్త సమాచారాన్ని జోడించాలి.9 చెట్లకు ఆటోమేటిక్ అనుమతిపది చెట్ల కంటే తక్కువ పెంచుతున్న రైతులు చెట్ల ఫోటోలను అప్లోడ్ చేసిన తర్వాత ఈ పోర్టల్ ద్వారా ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ)ను, చెట్లు నరకడానికి, రవాణా చేయటానికి ఆటోమేటిక్‌గా అనుమతులు పొందవచ్చు. 10 కంటే ఎక్కువ చెట్లు ఉన్న రైతులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. గుర్తింపు పొందిన ఏజెన్సీ క్షేత్రస్థాయిలో పరిశీలించి ధ్రువీకరించిన తర్వాత అనుమతి మంజూరవుతుంది.2016 నాటి కలప ఆధారిత పరిశ్రమల (స్థాపన – నియంత్రణ) మార్గదర్శకాల ప్రకారం ఏర్పడిన రాష్ట్ర స్థాయి కమిటీలు ఈ నియమాలను అమలు చేస్తాయి. విధానాల సరళీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇస్తాయి. చెట్ల నరికివేత కోసం దరఖాస్తులను ధ్రువీకరించడానికి అటవీ నిర్వహణ లేదా వ్యవసాయ అటవీశాస్త్రంలో నైపుణ్యం కలిగిన ఏజెన్సీలను కూడా ఈ కమిటీలు ఎంప్యానెల్ చేస్తాయి. డివిజనల్ ఫారెస్ట్ అధికారులు కాలానుగుణంగా ధ్రువీకరణ సంస్థల పనితీరును పర్యవేక్షిస్తారు. ఈ నియమాలు రైతులు అధికారిక చిక్కుల్లో చిక్కుకోకుండా కలప చెట్లను పెంచడం, నరకడం, విక్రయించే ప్రక్రియను సులభతరం చేయడానికి దోహదపడతాయి. అదే సమయంలో ప్రతి రాష్ట్రం స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడానికి వీలు ఉండటం విశేషం. రాష్ట్రాలు వీటిని ఆమోదిస్తేనే ఆగ్రోఫారెస్ట్రీ రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.ఆకు విలువ రూ.5!చెట్టు అందించే పర్యావరణ సేవలు అన్నీ ఇన్నీ కాదు. తనపైన పడిన వర్షాన్ని వేర్ల ద్వారా భూమిలోకి ఇంకింపజేస్తుంది. ఏడాది పొడవునా పచ్చగా ఉంటుంది. పక్షులకు ఆవాసాన్ని కల్పిస్తుంది. పక్షులు పంటలపై పురుగుల్ని ఏరుకొని తిని రైతుకు మేలు చేస్తాయి. పక్షుల విసర్జితాలు పంట భూమిలో సూక్ష్మజీవరాశిని పెంచి సారవంతం చేస్తాయి. చెట్టు ఆకులు రాల్చుతుంటుంది. ఆ ఆకులు భూమిలో కలిసి భూసారం పెరుగుతుంది. భూమి లోపలి పొరల్లో నుంచి చెట్టు గ్రహించిన పోషకాలను ఆ ఆకుల ద్వారా నేలను సారవంతం చెయ్యటానికి చెట్టు ఆకులు రాల్చుతూ ఉంటుంది. అందుకే, ‘రాలే ప్రతి ఆకూ రూ.5తో సమానం’ అని ప్రసిద్ధ సేంద్రియ వ్యవసాయ రైతు శాస్త్రవేత్త దివంగత డాక్టర్ ఎల్. నారాయణరెడ్డి అన్నారు. అటవీ వ్యవసాయంలో అనేక రకాలు...సాధారణ ఆగ్రోఫారెస్ట్రీచెట్ల మధ్య పంటల సాగు. పండ్ల చెట్లు లేదా కలప చెట్లు లేదా పశువుల మేతకు పనికొచ్చే ఆకులనందించే జాతుల చెట్ల వరుసల మధ్య సీజనల్ పంటలు పండిస్తారు.సిల్వోపాస్టర్చెట్ల మధ్య పచ్చిక బయళ్ళుంటాయి. అందులో పశువులు మేస్తూ పెరుగుతాయి. జంతువులకు చెట్లు నీడనిస్తాయి. కలుపు నియంత్రించడంలో జంతువులు సహాయపడతాయి.ఆగ్రోసిల్వో పాస్టోరల్చెట్లు, పంటలు, జంతువులు కలిసి పెరిగే క్షేత్రం. ఒక చక్కని ఉదాహరణ: ఇంటి తోట. ఇక్కడ వివిధ రకాల కూరగాయ మొక్కలు, పండ్ల చెట్లు, జంతువులు.. అన్నీ కలిసి పెరిగే వ్యవస్థ. అటవీ వ్యవసాయం మనకు కొత్తది కాదు, పురాతనమైనదే.కానీ, ఆధునిక అటవీ వ్యవసాయ పద్ధతులు సమకాలీన వ్యవసాయ, పర్యావరణ సవాళ్లకు ప్రకృతి ఆధారిత పరిష్కారంగా సరికొత్త ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.విండ్బ్రేక్లుతీవ్ర గాలి, ధూళి నుంచి పంటలు, పశువులు, భవనాలను రక్షించడానికి చెట్లు, పొదలను వరుసలుగా నాటుతారు. పతంగి రాంబాబుసాక్షి, సాగుబడి డెస్క్(చదవండి: ఐదు దొంతర్ల సాగులో శిక్షణ : ఏటా రూ.3 లక్షల నికరాదాయం) -
పొలాల్లో ప్లాస్టిక్ భూతం! బయోపాస్టిక్‌లూ విషపూరితమే!
వ్యవసాయంలో ప్లాస్టిక్ వస్తువుల వాడకం విపరీతంగా పెరుగుతోంది. మల్చింగ్ షీట్లు, మొలక ట్రేలు, డ్రిప్ లైన్లు, చెరువు లైనర్ షీట్లు, పాలీహౌస్‌ల నిర్మాణంతో పాటు ఆహార పదార్థాల నిల్వ, ప్యాకేజింగ్, రవాణా క్రమంలోనూ విరివిగా ప్లాస్టిక్ వాడుతున్నారు. పంట భూముల్లో మిగిలిపోయే పాలిథిన్ అవశేషాలు ఇప్పుడు హెక్టారుకు 300 కిలోలకన్నా ఎక్కువట. ప్లాస్టిక్ వస్తువుల్లో 16 వేల రకాల రసాయనాలు ఉంటాయి. వీటిలో 4,200 రసాయనాలు అత్యంత విషపూరితమైనవి. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఇవి తీవ్ర హాని చేస్తున్నాయని ప్లాస్ట్కెమ్ ప్రాజెక్టు శాస్త్రవేత్తల బృందం గతేడాది గుర్తించింది. కాబట్టి, ప్లాస్టిక్ వాడకంలోను, వాడిన వాటిని పారేయటంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులు మానవ సమాజానికి తిరుగులేని ప్రయోజనాలను అందిస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ ‘అరికట్టలేని సంక్షోభం’గా మారిపోయింది. కృత్రిమ రసాయనాలతో సింథటిక్ ప్లాస్టిక్ వస్తువులను 1907లో మొట్టమొదట తయారు చేశారు. 1950 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా 2 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వస్తువులు ఉత్పత్తి అయ్యేవి. ఇప్పుడు ఏటా 45 కోట్ల మెట్రిక్ టన్నులకు మించిపోయింది. ఇందులో, వాడేసిన ప్లాస్టిక్ వస్తువుల్లో కేవలం 9 శాతాన్ని మాత్రమే సేకరించి, తిరిగిఉపయోగించుకుంటున్నాం.91% శాతం ప్లాస్టిక్ వస్తువులు మట్టిలోనో, నీటిలో కలిసిపోతున్నాయి. ప్రతి సంవత్సరం 1.9 కోట్ల నుంచి 2.3 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు నీటి ద్వారా సరస్సులు, నదులు, సముద్రాలను కలుషితం చేస్తున్నాయి. 1.3 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు మట్టిలో పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు కనపడని చోటేదీ ఇప్పుడు మిగల్లేదు. మన అడవులు, నేల, నీరు, గాలిని కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు కలుషితం చేస్తున్నాయి. కంటికి కనిపించనంత చిన్న ప్లాస్టిక్ ముక్కలు (మైక్రోప్లాస్టిక్‌లు) జంతువులు, మొక్కలు, పండ్లు, మానవ శరీరాల్లోకి కూడా ప్రవేశించాయి. ఒక లీటరు మంచినీటి సీసాలో దాదాపు 2,40,000 చిన్న ప్లాస్టిక్ ముక్కలు ఉన్నాయని ఇటీవలి అధ్యయనంలో తేలింది.చదవండి: Vitamin D deficiency ఎన్నో ఆరోగ్య సమస్యలుప్లాస్టిక్ పదార్థాలు ప్రపంచంలోని ప్రతి మూలలోకి చొరబడ్డాయి. మనం తాగే నీరు, తినే ఆహారం, పీల్చే గాలిని కూడా కలుషితం చేశాయి. వీటిని బాధ్యతతో వాడుకోవటం, వాడిన ప్లాస్టిక్‌ను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా పద్ధతి ప్రకారం సేకరించి తిరిగి ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీలో వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనలో ప్రతి ఒక్కరూ సమష్టిగా చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వ్యవసాయంలో ప్లాస్టిక్‌తో ముప్పువ్యవసాయంలో ప్లాస్టిక్ వస్తువుల వాడకం గత కొన్ని దశాబ్దాలుగా అలవాటైంది. ఆధునిక కాలంలో వాణిజ్య పద్ధతుల్లో వ్యవసాయం తీవ్రతరం కావటంతో దీని వాడకం మరింత పెరుగుతోంది. నేల ఉష్ణోగ్రతను విజయవంతంగా నియంత్రించడం, కలుపు పెరుగుదలను చాలా వరకు అరికట్టడం, నేలలో తేమ నష్టాన్ని నిరోధించడం కోసం వ్యవసాయ భూముల్లో మల్చింగ్ షీట్(పాలిథిన్ ఫిల్మ్)ను విస్తృతంగా వాడటం మన దేశంలో మొదలుపెట్టింది కొద్ది సంవత్సరాల క్రితమే. అయితే, అభివృద్ధి చెందిన దేశాల్లో 1950లలోనే ప్రారంభమైంది. ఈ పద్ధతి పత్తి, మొక్కజొన్న తదితర పంటల సాగు ఖర్చును తగ్గించటంతో పాటు దిగుబడిని సగటున 30 శాతం పెంచుతోంది. ప్లాస్టిక్‌ను ఇప్పుడు మల్చింగ్ షీట్, మొలక ట్రేలు, డ్రిప్ లైన్లు, చెరువు లైనర్ షీట్లు, పాలీహౌస్‌లు, ఆహార నిల్వ, ప్యాకేజింగ్, రవాణాలో విరివిగా ఉపయోగిస్తున్నారు. పంట భూముల్లో మిగిలిపోయే పాలిథిన్ అవశేషాలు ఇప్పుడు హెక్టారుకు 300 కిలోలకన్నా ఎక్కువగానే ఉన్నాయని ఒక అధ్యయనం చెబుతోంది.ఇదీ చదవండి: నటి పరిణీతి ప్రెగ్నెన్సీ.. నో కోల్డ్‌వార్..పెద్దమ్మ ఫుల్ హ్యాపీఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) వ్యవసాయంలో ప్లాస్టిక్‌ల వినియోగాన్ని అంచనా వేసే ఒక కీలక నివేదికను విడుదల చేసింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా పంటలు, పశువుల ఆహారోత్పత్తుల సాగు నుంచి విక్రయం వలకు వివిధ దశల్లోని విలువ గొలుసులో 1.2 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడారు. ఆహార ప్యాకేజింగ్‌లో 3.73 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తులను ఉపయోగించారని ఎఫ్ఏవో లెక్క తేల్చింది. ప్లాస్టిక్ వాడకంపై నియంత్రణ అవసరమనే విషయమై 3 దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్నాయి. పది రోజుల శిఖరాగ్రసభ జెనీవాలో ఈ నెల 15న ముగిసింది. భారత్ సహా 184 దేశాలకు చెందిన 3,700 మంది ప్రతినిధులు ఏకాభిప్రాయానికి రాలేక ఎటువంటి ఒడంబడికా చేసుకోలేదు. ముప్పయ్యేళ్లుగా ఇదే తంతు. మన దేశంలో పరిస్థితేంటి?వ్యవసాయంలోప్రపంచవ్యాప్తంగా వాడుతున్న ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో సగం ఆసియా దేశాల్లోనే వినియోగిస్తు న్నారు. వాడేసిన ప్లాస్టిక్‌ను తగులబెట్టడం, పూడ్చిపెట్టటం లేదా చెత్తకుప్పల్లో పోయటం మనకు తెలిసిందే. అయితే, దీనికి సంబంధించిన ఏ లెక్కలూ దొరకవు. ఎందుకంటే, వ్యవసాయ ప్లాస్టిక్ కాలుష్యం గురించి ఆలోచించేవారే కరువు. మన దేశంలో 90 శాతం గ్రామాల్లో చెత్త యాజమాన్య వ్యవస్థలే లేవు. ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్లు ఎక్కడపడితే అక్కడ పారెయ్యటమే. 67 శాతం మంది మామూలు చెత్తతో పాటు ప్లాస్టిక్ చెత్తను కూడా కాల్చేస్తున్నారని ఒక అధ్యయనం చెబుతోంది. దేశంలోని 6.65 లక్షల గ్రామాలు, 2.68 లక్షల పంచాయతీల్లో ప్రతి ఏటా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తుంటాయి. వీటిలో క్లైమేట్ ఛేంజ్ యాక్షన్ ప్లాన్‌ను చేర్చాలి. అందులో వ్యవసాయ, వ్యవసాయేతర ప్లాస్టిక్ నిర్వహణను కూడా జోడించాలి. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ప్లాస్టిక్‌కు బదులు పంట వ్యర్థాలతో, వత్తుగా పంటలతోనే సజీవ ఆచ్ఛాదన చేస్తూ ఉంటారు. ఆ పద్ధతులపై అవగాహన కలిగించి, ప్రోత్సహించే పథకాలను తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలిథిన్ మల్చింగ్ షీట్లతో ఇదీ ముప్పు వ్యవసాయ భూముల్లో వేసిన ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ వ్యర్థాలు మిగిలిపోతాయి. వేసిన నెలల్లోనే చిరిగి పోతుంది. కాబట్టి దాని ముక్కలన్నిటినీ మట్టిలో నుంచి ఏరెయ్యటం సాధ్యపడదు.నేల ఆరోగ్యాన్ని, పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీస్తుంది. వ్యవసాయ భూముల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు నేల సారాన్ని తగ్గిస్తుంది. పంట భూమి లోపలికి గాలి ప్రసరించటం కూడా అవసరం. ప్లాస్టిక్ షీట్ కింద మట్టిలో గాలి ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. నేల ఆరోగ్యంగా ఉండాలంటే అందులో సూక్ష్మజీవులు ఆరోగ్యంగా ఉండాలి. మల్చింగ్ షీట్ వీటికి ప్రతికూలంగా పనిచేస్తుంది. వేర్లు, మొత్తంగా మొక్కల పెరుగుదలపై ప్లాస్టిక్ ప్రతికూలంగా పని చేస్తుంది. మట్టిలోని వానపాములు వంటి మేలు చేసే జీవరాశికి హాని కలుగుతుంది. వాటి పోషణ దెబ్బతింటుంది.వానపాములు బొరియలు చేసుకుంటూ మట్టిపైకి వచ్చి వదిలే విసర్జితాలే నేలను సారవంతం చేస్తాయి. ఆ ప్రక్రియ ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల దెబ్బతింటుంది. ప్లాస్టిక్ సూక్ష్మ ముక్కల (మైక్రోప్లాస్టిక్‌ల)ను మొక్కలు వేర్ల ద్వారా గ్రహించి, ఆకుల్లో, పువ్వుల్లో, కాయల్లో, గింజల్లోకి చేర్చుతాయి. ఆ భూమిలో పండే ఆహారోత్పత్తుల ద్వారా మైక్రోప్లాస్టిక్స్ ఆహారంలోకి, మానవ శరీరాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. వ్యవసాయంలో ప్లాస్టిక్ కాలుష్యంపై పాలకులు పట్టించుకోవటం లేదు. అధ్యయనాలూ జరగక పోవటం దురదృష్టకరం. ఈ నిర్లక్ష్యం వ్యవసాయాన్ని, యావత్ పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది.పంట పొలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను జాగ్రత్తగా సేకరించి, రీసైకిల్ చేసే వారికి పంపటం ద్వారా ఈ ముప్పును కొంత తగ్గించవచ్చు. అయితే, దీని గురించి రైతులకు చైతన్యం కలిగించే వారు కరువయ్యారు. అర్బన్ ప్రాంతాల్లోని ఇళ్లలో ప్రజలు వాడిన ప్లాస్టిక్ సేకరణ, రీసైక్లింగ్‌పై కార్యాచరణ ప్రణాళికల్లోనూ వ్యవసాయ ప్లాస్టిక్ వ్యర్థాల ఊసే లేదు. అగ్రి ప్లాస్టిక్ సమస్యపై అవగాహన ఇటీవలే ముందుకు వస్తుండటం దీనికి కారణం. ఈ నేపథ్యంలో వ్యవసాయ ప్లాస్టిక్ వస్తువుల సుస్థిర వినియోగం, నిర్వహణపై ఎఫ్ఏవో గత అక్టోబర్‌లో వాలంటరీ గైడ్‌లైన్స్‌ను ప్రకటించింది. మల్చింగ్ షీట్లతో ముప్పేమిటో తెలుసా?ఆధునిక పంట పొలాల్లో ప్లాస్టిక్ షీట్లు విస్తారంగా కనిపిస్తుంటాయి. ఇవి చాలా పల్చటి ప్లాస్టిక్‌తో తయారు చేసినవి. పొలంలో పరచిన ఒక సంవత్సరంలో చిరిగిపోతాయి. అవి ఎంత పలచనంటే.. ఒక కిలో మల్చింగ్ షీట్ కట్టను 700 చదరపు అడుగుల వ్యవసాయ భూమిపై పరచడానికి సరిపోతుంది. దాని వల్ల ఉపయోగాలున్నాయి. అయితే, అంత భూమిని అనేక విధాలుగా నాశనం చేస్తోందన్నది కూడా వాస్తవం.బయోపాస్టిక్‌లూ విషపూరితమే! పెట్రోలియం ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా మొక్కల ఆధారంగా బయోప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తున్నారు. మొక్కజొన్న, బంగాళదుంపలు, చెరకు, సుగర్బీట్ అనే దుంపల ద్వారా బయోప్లాస్టిక్‌లను తయారు చేస్తారు. అయితే, ఇవి కూడా పూర్తిగా మేలైనవనుకోవటానికి లేదు. బయోప్లాస్టిక్ వస్తువుల తయారీలో వాడే ముడి పదార్థాలను ఈ మొక్కలనుంచి తీసుకుంటు న్నప్పటికీ.. బయోప్లాస్టిక్‌ను తయారు చేసే క్రమంలో గట్టితనం, రంగు తదితర గుణాల కోసం రసాయనిక ప్రక్రియల్లో వాడే వేలకొద్దీ సింథటిక్ రసాయనాలు చాలా విషపూరితమైనవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. స్వీడన్‌లోని గోథెన్బర్గ్ విశ్వవిద్యాలయంలో ఎకోటాక్సికాలజీ–పర్యావరణ శాస్త్ర ప్రొఫెసర్ బెథానీ అల్మ్రోత్ ఇలా స్పందించారు: ‘చాలా మందికి ప్లాస్టిక్‌లోని విషతుల్య పదార్థాల గురించి తెలియదు. ప్లాస్టిక్‌లతో పనిచేసే వ్యక్తులకు కూడా బయోప్లాస్టిక్లలోని టాక్సిన్స్ గురించి సరైన సమాచారం లేదు. అందుకని, ప్లాస్టిక్లు పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ముప్పుగా మారకుండా ఉండాలంటే, మొదట వాటి వాడకం తగ్గించాలి. వాడేసిన ప్లాస్టిక్ వస్తువుల్ని పారేసే అలవాట్లను మనందరం పనిగట్టుకొని మార్చుకోవాలి’ అంటున్నారామె. కాబట్టి, ప్రజల్లో ప్లాస్టిక్ చైతన్యం పెరగాలి. బయోప్లాస్టిక్ తయారీని పాతికేళ్ల క్రితమే కనుగొన్నప్పటికీ ప్రస్తుతం వీటి ఉత్పత్తి మొత్తం ప్లాస్టిక్ వాడకంలో ఒక్క శాతానికే పరిమితమైంది.4,200 ప్లాస్టిక్ రసాయనాల్లో విషం! మనం దైనందిన జీవితంలో వాడే ప్లాస్టిక్ వస్తువులు పెట్రోకెమికల్స్తోనే తయారవుతున్నాయి. ఈ ప్లాస్టిక్ వస్తువుల్లో 16 వేల రకాల రసాయనాలు ఉంటాయి. ఇవన్నీ హాని చేసేవి కాదు. వీటిలో 4,200 రసాయనాలు మాత్రం అత్యంత విషపూరితమైనవి. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఇవి తీవ్ర హాని చేస్తున్నాయని ప్లాస్ట్కెమ్ ప్రాజెక్టు శాస్త్రవేత్తల బృందం గతేడాది గుర్తించింది. మరో 10 వేల ప్లాస్టిక్ రసాయనాల విషతుల్యత ఎంత అనేదానిపై ఇప్పటికీ తగినంత సమాచారం లేదని బృందం తెలిపింది. ప్లాస్టిక్ వస్తువుల్లోని రసాయనాలు 70 శాతం అసాంక్రమిక వ్యాధుల(ఎన్సీడీలు) వ్యాప్తికి ఒకానొక ముఖ్యకారణమని అంచనా. -
సాగుకు ఉరి..!
సాక్షి, అమరావతి: వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో.. వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించేలా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రైతుల వ్యవసాయ భూములను కాపాడాల్సిందిపోయి వాటిని ప్రైవేట్ వ్యక్తులు, రియల్ ఎస్టేట్ సంస్థల చేతుల్లో పెట్టేలా ఆయన కంకణం కట్టుకుని పని చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందులో భాగంగానే ‘నాలా’ (నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ యాక్ట్) చట్టం రద్దుకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. దీనిపై త్వరలో ఆర్డినెన్స్ ఇచ్చేందుకు టీడీపీ కూటమి సర్కారు సిద్ధమైంది. ఇప్పటికే యాజమాన్య హక్కులు దక్కిన 13.59 లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ్ భూములను ఫ్రీజ్ చేసిన చంద్రబాబు సర్కారు ఆ రైతులను రోడ్డున పడేసింది. తాజాగా ‘నాలా’ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను రియల్ వ్యాపారులు, తమ అనుంగు పారిశ్రామికవేత్తలకు సులభంగా దక్కేలా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. దశాబ్దాలుగా ‘నాలా’ చట్టం రాష్ట్ర రైతాంగానికి, వ్యవసాయ రంగానికి రక్షణగా నిలిచింది. అలాంటి దాన్ని రద్దు చేయడానికి కూటమి ప్రభుత్వం ఉపక్రమించడం పట్ల తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. రియల్ ఎస్టేట్, పారిశ్రామిక వృద్ధికి ఈ చట్టం అడ్డుగా ఉందనే సాకుతో దీన్ని రద్దు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతుండటాన్ని వ్యవసాయ రంగ నిపుణులు తప్పుబడుతున్నారు. ఇక సాగు భూములకు రక్షణ ఏది? నాలా చట్టం మనుగడలో లేకపోతే వ్యవసాయ భూములను అత్యంత సులభంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు, వాణిజ్య అవసరాలు, పరిశ్రమలకు అప్పగించేందుకు మార్గం సుగమం అవుతుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్రయోజనాల కోసం వినియోగించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2006లో ‘నాలా’ చట్టాన్ని తెచ్చారు. వ్యవసాయ భూములను ఇష్టానుసారంగా ఇతర ప్రయోజనాల కోసం వినియోగించకుండా నియంత్రించేందుకే ఈ చట్టాన్ని రూపొందించారు. భూ వినియోగ మార్పిడి చేసుకుంటే ప్రస్తుతం ఆ భూమి విలువపై 5 శాతం పన్ను కట్టాలి. అలాగే కొన్ని ఇతర పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనివల్ల తాము సులభంగా భూములు పొందలేకపోతున్నామంటూ రియల్ ఎస్టేట్, వ్యాపార సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలు చెబుతూ వస్తున్నాయి. నాలా చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నాయి. నిజానికి అడ్డగోలుగా జరిగే భూ వినియోగ మార్పిడిని ఈ చట్టం సమర్థంగా అడ్డుకుంది. రియల్ ఎస్టేట్ దందాలను కొంతమేరనైనా అడ్డుకోవడం వల్లే ఇప్పుడున్న సాగు భూమి మిగిలి ఉందని వ్యవసాయ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆహార భద్రతకు ముప్పు.. నాలా చట్టం అమలులో లేకుంటే వ్యవసాయ భూములు యథేచ్చగా రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయమని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయి తిండి గింజలకు కొరత ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నాయి. భూ మార్పిడిపై నియంత్రణ కరువవడంతో అటవీ ప్రాంతాలు, నీటి వనరులు, వ్యవసాయ యోగ్యమైన భూములు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొంటున్నాయి. దీర్ఘకాలంలో ఇది పర్యావరణ సమతుల్యతను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. నాలా చట్టం లేకుంటే భూ మార్పిడిపై ఎటువంటి నియంత్రణ లేనందున రియల్ ఎస్టేట్ సంస్థలు, బడా వ్యాపారవేత్తలు భూములను చౌకగా దక్కించుకుని రైతులను మోసం చేసే అవకాశం ఉందనే ఆందోళన నెలకొంది. అన్నదాతల గురించి ఆలోచించరా? రాష్ట్రంలో అభివృద్ధికి నాలా చట్టం అడ్డంకిగా ఉందని, దీన్ని రద్దు చేస్తేనే పెట్టుబడులు వస్తాయని చెబుతున్న చంద్రబాబు వ్యవసాయం, భూమినే నమ్ముకున్న అన్నదాతల మనోభావాలు, భావోద్వేగాల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం పెద్ద పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ లాబీలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. దీనివల్ల సామాన్య రైతులకు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. నాలా చట్టాన్ని రద్దు చేస్తే చిన్న, సన్నకారు రైతులు తమ భూములను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈవీఎస్ శర్మ ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. వ్యవసాయ భూములు తగ్గిపోవడం, ఆహార ధాన్యాల కొరత, ధరల పెరుగుదల, గ్రామీణ ఆరి్థక వ్యవస్థ కుంటుపడటం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.ప్రజా ప్రయోజనాలకు విఘాతం‘నాలా’ రద్దుపై ప్రభుత్వానికి రిటైర్డ్ ఐఏఎస్ శర్మ లేఖ ‘నాలా’ చట్టాన్ని రద్దు చేయడం వల్ల చిన్న రైతుల జీవనోపాధికి తీవ్ర నష్టం కలుగుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు లేఖ రాశారు. రాష్ట్ర ఆహార భద్రతను నిర్లక్ష్యం చేయడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని, రద్దు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. ‘పరిశ్రమలు, ఇతర ప్రయోజనాల కోసం భూములు తీసుకునేందుకు ఆహార భద్రత లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయడం బాధాకరం. దీనివల్ల వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవించే లక్షలాది మంది చిన్న రైతులు, సాంప్రదాయ మత్స్యకారులు, సహకార డెయిరీ సంస్థలపై ఆధారపడ్డ చిన్న పాల ఉత్పత్తిదారులు తీవ్రంగా ప్రభావితమవుతారు. ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ పేరుతో వేలాది ఎకరాలు సేకరిస్తూ ప్రభుత్వం ఆహార భద్రతను నిర్లక్ష్యం చేసింది. ప్రైవేట్ రంగ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం విధానాలను మార్చుకోవడం వల్ల రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములైన లక్షలాది మంది నష్టపోతారు. ప్రభుత్వ విధానాలు అభివృద్ధికి దోహదం చేయాలి. అంతేగానీ ప్రైవేటు కంపెనీల లాభాలు పెంచడం కోసం కాదని గుర్తించాలి’ అని లేఖలో పేర్కొన్నారు. రిలయన్స్‌కు కోరుకున్న చోట 5 లక్షల ఎకరాలు.. నాలా చట్టం రద్దు నిర్ణయం రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్తల కోసమే. ఈ చట్టం అమలులో ఉంటే భూములు అడ్డగోలుగా వారి చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉండదు. ఎలా పడితే అలా భూములు తీసుకునే వీలుండదు. వారికి దొడ్డిదారిన మేలు చేసేందుకు ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నారు. రిలయన్స్ సంస్థకు 5 లక్షలు ఎకరాలు ఎక్కడ అడిగితే అక్కడ ఇవ్వాలని సీఎం ఏకంగా కలెక్టర్ల సమావేశంలోనే ఆదేశించారు. చాలా సంస్థలకు భూములివ్వడానికి రెడీ అయ్యారు. పెద్దవారికి భూములు ఇవ్వడానికి కావాల్సిన అన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నారు. – వై.కేశవరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు
మహిళలు అనుకోవాలేగానీ ఏదైనా సాధించి తీరతారు. అది వ్యవసాయం, వ్యాపారం అయిన పట్టుబట్టి విజయం సాధించాడంలో మహిళలు ముందంజలో ఉంటారు. అనేకమంది మహిళల విజయ గాథలే దీనికి అక్షర సత్యాలు. వారి సంకల్ప బలం అలాంటిది. అలా చిన్న వయసులోనే సక్సెస్ ఫుల్ మహిళలలో ఒకరిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు పూణేకు చెందిన మహిళా రైతు. క్యాప్సికం (Capsicum ) సాగుతో ఏకంగా ఏడాది రూ. 4 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. పదండి ఆమె సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని కల్వాడి గ్రామానికి చెందిన విద్యావంతురాలు ప్రణిత వామన్. పుణెలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ కాలేజీ నుంచి ఎంబీఏ అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్లో పట్టా పుచ్చుకుంది. ఎంబీఏ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీతో పనిచేసిన నేపథ్యంలో తనకెంతో ఇష్టమైన వ్యవసాయం వైపే మొగ్గు చూపింది. తనకంటూ సొంతంగా ఎదగాలని, తద్వారా మరో పదిమందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుగా సాగింది. తన తమకున్న పొలంలో క్యాప్సికం సాగు ప్రారంభించింది. ఆమె ఆశయానికి ఉపాధ్యాయుడిగా పనిచేసి, రిటైరయ్యి, వ్యవసాయం చేసుకుంటున్న తండ్రి ప్రోత్సాహం కూడా లభించింది.చదవండి: కేబీసీ 17లో కోటి గెల్చుకున్న తొలి వ్యక్తి..కానీ 7 కోట్ల ప్రశ్న ఏంటో తెలుసా?తండ్రి ప్రోత్సాహం రూ. 20 లక్షల పెట్టుబడి2020లో తనకున్న కొద్దిపాటి భూమిలో క్యాప్సికం సాగు ప్రారంభించింది. తనకున్న పాలిహౌజ్ నైపుణ్యానికి తోడుగా ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ లభించింది. పాలీహౌస్ సాగు అంటూ వ్యవసాయంలో లేటెస్ట్ హైటెక్ వ్యవసాయం అని చెప్పవచ్చు. తీవ్రమైన వాతావరణ మార్పులను ఎదుర్కొంటూ, ఉష్ణోగ్రత, తేమ , ఇతర పారామితులను నిర్వహించడం ద్వారా ఏడాది పొడవునా లాభదాయకమైన సాగు చేయడం.అలా రూ. 20 లక్షలు పెట్టుబడితో తన సాగుకు డ్రిప్ ఇరిగేషన్ పద్దతిని ఎంచుకుంది. ఒక్కో మొక్క ధర రూ. 10. చొప్పున బారామతి నుంచి నారును తీసుకొచ్చి నాటింది. మూడు నాలుగు నెలలకే క్యాప్సికం పంట చేతికి అందింది. దాదాపు 40 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. కానీ కరోనా వైరస్,లాక్ డౌన్ సంక్షోభం ముంచుకొచ్చింది. అయినా అధైర్య పడకుండా ఆన్లైన్ మార్కెటింగ్ ఎంచుకుంది.ప్రస్తుతం పాతిక ఎకరాలు, ఏడాదికి రూ. 4 కోట్లుమొదటి పంటలో 40 టన్నుల ఎరుపు, పసుపు ,ఆకుపచ్చ బెల్ పెప్పర్స్ దిగుబడి వచ్చింది. వాటిని కిలోకు రూ. 80 చొప్పున అమ్మింది. ఫలితంగా రూ. 32 లక్షల టర్నోవర్‌తో, తొలి ఏడాదిలోనే రూ. 20 లక్షల పెట్టుబడిని తిరిగి వచ్చేసిందని ప్రణీత స్వయంగా తెలిపింది. తొలి ఏడాదిలోనే రూ. 20 లక్షల పెట్టుబడిగాను సుమారు రూ. 12 లక్షలు లాభం వచ్చింది. ఈ ఉత్సాహంతో మరింత ధైర్యంగా అడుగులు వేసింది. 2021లో 25 ఎకరాలకు తన పరిధిని విస్తరించుకుంది. పాలిహౌస్ విధానంలో క్యాప్సికం పంటను సాగు కొనసాగిస్తోంది. ఇందులో 10 ఎకరాలు సొంత పొలం కాగా, మరో 15 ఎకరాలు లీజుకు తీసుకుంది అలా ఖర్చులు పోను ఏడాదికి రూ. 2.25 కోట్ల లాభంతో విజయవంతమైన యువమహిళా రైతుగా నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్‌పేజీపై మెరిసిన సమంత -
వ్యవసాయ, అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయాల పరిధిలోని వివిధ వ్యవసాయ, అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు మొదటిదశ సంయుక్త కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు రిజిస్ట్రార్ డాక్టర్ సీహెచ్.విద్యాసాగర్ తెలిపారు. ఈ కౌన్సెలింగ్ రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ప్రతిరోజు ఉదయం 9.30 గంటలకు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా వ్యవసాయ కూలీల పిల్లలకు తొలిసారిగా బీఎస్సీ (అగ్రికల్చర్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) సీట్లలో ప్రత్యేక కోటా అమలు చేస్తున్నట్టు తెలిపారు. బీఎస్సీ(అగ్రికల్చర్)లో 15 శాతం సీట్లు, బీఎస్సీ(ఫుడ్ టెక్నాలజీ) కోర్సులో 15 శాతం సీట్లు వ్యవసాయ కూలీల పిల్లలకు కేటాయించినట్టు చెప్పారు.విద్యార్థులు 4వ తరగతి నుంచి 12వ తరగతుల విద్యాభ్యాసంలో కనీసం నాలుగేళ్లు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లో చదివినవారు ఈ ప్రత్యేక కోటాకు అర్హులని తెలిపారు. విద్యార్థి లేదా, వారి తల్లిదండ్రుల పేరుపై ప్రభుత్వం జారీ చేసిన గ్రామీణ ఉపాధిహమీ పథకం కార్డు కలిగి ఉన్నవారే ఈ కోటకు అర్హులన్నారు. పై అర్హతలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని చెప్పారు. పూర్తి వివరాలు విశ్వ విద్యాలయ వెబ్సైట్ www.pjtau.edu.in లో చూడొచ్చని రిజి్రస్టార్ పేర్కొన్నారు. -
ఇండియా-యూకే ట్రేడ్ డీల్ వ్యవసాయానికి జాక్‌పాట్
భారత వ్యవసాయ రంగానికి ఇండియా-యూకే ఇటీవల సంతకం చేసిన కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (సీఈటీఏ) ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతీయ వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఎగుమతుల్లో 95% యూకే మార్కెట్లో సుంకం లేకుండా అనుమతించే వీలుంది. ఇది భారతీయ రైతులు, వ్యవసాయ ఎగుమతిదారులకు మార్కెట్ అవకాశాలను గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు. ఇటీవల కుదిరిన ఒప్పందం ప్రకారం వ్యవసాయానికి సంబంధించి కొన్ని ప్రధాన అంశాలు కింది విధంగా ఉన్నాయి.జీరో-డ్యూటీ యాక్సెస్బాస్మతి, బాస్మతియేతర బియ్యంపండ్లు మరియు కూరగాయలుమసాలా దినుసులు (పసుపు, మిరియాలు, యాలకులు)ప్రాసెస్ చేసిన ఆహారాలు (ఊరగాయలు, మసాలా మిశ్రమాలు, పండ్ల గుజ్జులు, రెడీ టు ఈట్ భోజనం)సముద్ర ఉత్పత్తులు (రొయ్యలు, ట్యూనా, ఫిష్ మీల్, ఫిష్ ఫీడ్)పాడి, వంట నూనెలు, యాపిల్స్ సుంకం రాయితీ పరిధిలోకి రావు. ఇది కీలకమైన దేశీయ పరిశ్రమలను కాపాడుతుంది.గతంలో 70 శాతం వరకు దిగుమతి సుంకాలను ఎదుర్కొన్న ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు జీరో డ్యూటీ పరిధిలోకి రానున్నాయి.ఇదీ చదవండి: విస్కీ ధరలు తగ్గింపు..?వచ్చే మూడేళ్లలో యూకేకు భారత వ్యవసాయ ఎగుమతుల్లో 20% వృద్ధి నమోదవుతుందని అంచనా. ఇది భారతదేశం తన 100 బిలియన్ డాలర్ల వ్యవసాయ ఎగుమతి లక్ష్యానికి చేరువ కావడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం 2.25 శాతం మాత్రమే ఉన్న బ్రిటన్ 5.4 బిలియన్ డాలర్ల సముద్ర దిగుమతుల్లో భారత్ వాటాను ఈ వాణిజ్య ఒప్పందం పెంచుతుందని భావిస్తున్నారు. -
ఆ సోయి ఎరిగే దశకు చేరేది ఎప్పుడు?
బ్రెజిల్లో జూలై మొదటి వారంలో ముగిసిన ‘బ్రిక్స్’ దేశాల సదస్సులో... తదుపరి 2026 డిసెంబర్లో జరిగే సమావేశం ఆతిథ్య బాధ్యత ఇండియాది అయింది. దాంతో – ఆ కూటమిలో సీనియర్ సభ్యదేశంగా ఇక్కడ మూడవ ‘టర్మ్’ కూడా ప్రభుత్వంలో కొనసాగు తున్న ఎన్డీఏ విధానాలలోని ‘బ్రిక్స్’ స్ఫూర్తిని ‘గ్లోబల్’ దృష్టి నుంచి సూక్ష్మ స్థాయి సమీక్షగా చూడటం తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే, 2001లో మొదలైన ‘బ్రిక్స్’ కూటమి సమీప దేశాలను కలుపు కొని విస్తృతమై 2025 నాటికి ‘గ్లోబల్ సౌత్’ భావన స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఉపాంగమైన ‘యూఎన్డీపీ’ సభ్యదేశాలకు 2030 నాటికి అమలు లక్ష్యంగా ఇచ్చిన 17 ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’ (ఎస్డీజీ) విష యమై ‘బ్రిక్స్’ సభ్యదేశాల ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి అని చూసినప్పుడు... బ్రెజిల్ పర్యావరణం ప్రధానంగా తన ప్రాధా న్యతలు ఎంచుకుని, ‘ధరిత్రికి శ్వాస’గా పరిగణించే అమెజాన్ చిత్తడి అడవుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. అందుకు భిన్నంగా ఒకప్పటి ‘హరిత విప్లవ’ దేశమైన ఇండియా ‘గ్లోబల్ ఐటీ పవర్ హౌస్’గా ఐటీ మ్యాన్‌పవర్ సర్వీసులు యూరోపి యన్ దేశాలకు అందించే వనరుగా ఉంది.దాంతో యూఎన్డీపీ ఎస్డీజీ జాబితాలోని చివరి రెండు అంశాలపై మన ‘స్టాండ్’ ప్రశ్నార్థకం అయింది. అధిక జనాభాతో అసంఖ్యాకంగా ఉన్న మానవ వనరులను పర్యావరణ హితానికి ఏ మేరకు దేశం వాడుతున్నదన్నది ‘పాలసీ’ చర్చ అవుతున్నది. ఉదాహరణకు పదేళ్ళ క్రితం తెలంగాణ అనే ఒక కొత్త రాష్ట్రాన్ని కేంద్రం ఏర్పాటు చేయవలసి వస్తే, ఆ కారణంగా వట్టి చేతులతో మిగిలిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతము–ప్రజలు దృష్టి నుంచి కొన్నేళ్ల పాటు అయినా అమలు చేయాల్సిన ఒక ‘పబ్లిక్ పాలసీ’ని రూపొందించే విషయమై కేంద్ర, రాష్ట్రాలు మిన్నకుండి పోయాయి. రెండు చోట్ల ఏర్పడ్డవి కొత్త ప్రభుత్వాలు కావడంతో వాటి రాజకీయ ప్రయోజనాల ముందు రాష్ట్ర ప్రయోజనాలు చిన్నవి అయ్యాయి. అయితే, ఇవి వేటితోనూ పనిలేని ‘నీతి ఆయోగ్’ ప్రతి మూడు నెలలకు జిల్లాల వారీగా ఎస్డీజీ లక్ష్యాలను మదింపు చేయాలి కనుక, అది ఆ యా ప్రభుత్వాల రాజకీయాలతో పనిలేకుండా అధికారుల వెంట పడుతున్నది. దాంతో ‘నీతి ఆయోగ్’కు జవాబుదారీ కావడం అనేది వారికి తప్పనిసరి అయింది. ఇలా ఇప్పుడు ఇవేవీ ఎవ్వరూ ‘లైట్’ తీసుకునేవి కావు. ఇందులో ‘లెజిస్లేచర్’ బాధ్యత కూడా ఉన్నప్పటికీ, ‘బ్యూరోక్రసీ’ కనుక తమ విధుల్లో వెనకబడితే అది సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుంది. మరి అధికారులను ప్రభుత్వం వారి పని వారిని చేసుకోనిస్తున్నదా? వారి అనుభవానికి తగిన బాధ్యతలు అప్ప గిస్తున్నదా అంటే అది వేరే చర్చ. రేపు ఏదైనా జిల్లాలో పెరిగిన శాంతిభద్రతల సమస్య వల్ల మేము ఎస్డీజీ లక్ష్యాలు సాధించ లేకపోయాం అని కలెక్టర్ అంటే, అందుకు ఆ జిల్లా పోలీస్ ఎస్పీ వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. ‘గుడ్ గవర్నెన్స్’ సాధన దిశలో అన్ని శాఖల సమష్టి కృషి ఇక్కడ అనివార్యం. అప్పట్లో అలా అప్పగించిన పనిచేసి చూపించడం వల్లనే 2024 నాటికి ‘నీతి ఆయోగ్’ ఎంపిక చేసిన ఏలూరు, పార్వతీపురం జిల్లాల కలెక్టర్లు ఢిల్లీ నుంచి అవార్డులు అందు కున్నారు.మళ్ళీ ప్రధాన విషయానికి వస్తే, కేంద్రం–రాష్ట్రాలకు అప్ప గించిన ప్రాధాన్యతాంశాలను పక్కన పెట్టి ‘వరల్డ్ క్లాస్ కేపిటల్’, ‘క్వాంటమ్ వ్యాలీ’, ‘క్రియేటివ్ సిటీ’, ‘డ్రోన్ సిటీ’ అంటూ మన సొంత ఎజెండా ఎత్తుకుంటే, వ్యవసాయం ప్రధానం అయిన రాష్ట్రంలో ఏడాదిలోనే భూమి పుత్రుల నుంచి వెల్లువెత్తే సమస్యల తీవ్రత ఎలా ఉంటుందో ఈ ఏడాది మొదటి 6 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్ విషయంలో చూశాం. మిర్చి, పొగాకు, మామిడి, పంటల రైతుల సమస్యలు చివరికి శాంతి భద్రతల విషయంగా మారడం అనేది పెద్ద జాబితాలోని కొన్ని అంశాలు మాత్రమే. అది అలా ఉంచి అస్సలు ఎస్డీజీ లక్ష్యాలు రూపొందించడంలోనే యూఎ న్డీపీ సున్నితమైన సూక్ష్మదృష్టి గమనిస్తే స్పష్టం అవుతున్నది. ఈ 17 అంశాల జాబితాలోని 12వది – ‘బాధ్యతాయుతమైన విని యోగం–ఉత్పత్తి’, పదిహేన వది ‘జీవావరణం’. ఈ రెండు కూడా ప్రాధాన్యతల విషయంలో గందరగోళంలో ఉన్న కొత్తద యిన ఏపీకి నేరుగా వర్తించే అంశాలు. ఇక్కడే మరోసారి బ్రెజిల్–ఇండియా ప్రాధాన్యతలలోని వైరుద్ధ్యాన్ని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇండియా ‘గ్లోబల్ ఐటీ పవర్ హౌస్’గా పరిణమించడం వరకు బాగుంది. మరి మన ఎకానమీ మాన్యుఫ్యాక్చర్ రంగం నుంచి సర్వీసుల రంగా నికి బదిలీ అయ్యాక, ఏ సర్వీసుల్లో ఏ కులాల ప్రజలు ఉన్నారు అనే వర్గీకరణ అక్కరలేదా? ఎందుకంటే, ‘కులం’ మన దేశానికి మాత్రమే ప్రత్యేకమైన అంశం. మరి వ్యవసాయం ప్రధానం అయిన దేశంలో యాంత్రీకరణను తెచ్చి, అందరూ ‘సర్వీస్’ రంగంలోనే ఉపాధి అవకాశాలు వెతుక్కోవాలి అన్నప్పుడు, కనీస అర్హతలు లేని అసంఖ్యాక శ్రేణులు జీవిక కోసం మళ్ళీ ఎవరిపై ఆధారపడేట్టుగా మన ‘పాలసీలు’ నిర్దేశిస్తున్నాయి? ఆర్థిక సంస్కరణలతో ‘ప్రైవేట్’ రంగం ‘రాజ్యం’ కార్యక్షేత్రంలోకి చొచ్చుకురావడం తెలిసి జరిగిందే అయినప్పటికీ, ఒక దేశం ‘ఎకానమీ’ వ్యవసాయం ప్రధానం అయినప్పుడు, రాజకీయ కారణాలతో ఏర్పడ్డ ఏపీ వంటి కొత్త రాష్ట్రం విషయంలో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం అయినా, స్థూలంగా అది ఒక ‘లైన్’ తీసుకుని దాని అమలుకు ఒక ‘పాలసీ’ని అనుసరించాలా, వద్దా? మరది ఎటువంటిది అయ్యుండాలి? ఇటు వంటి సోయి ఎరిగే దశకు మనం చేరేది ఎప్పుడు?జాన్సన్ చోరగుడివ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత


