ఇండియా-యూకే ట్రేడ్ డీల్ వ్యవసాయానికి జాక్‌పాట్‌ | India And UK Historic Free Trade Agreement, Indian Farmers Are Poised For A Major Boost With This Deal, Full Details Inside| Sakshi
Sakshi News home page

ఇండియా-యూకే ట్రేడ్ డీల్ వ్యవసాయానికి జాక్‌పాట్‌

Jul 25 2025 2:23 PM | Updated on Jul 25 2025 2:58 PM

Indian farmers are poised for a major boost with India UK FTA

భారత వ్యవసాయ రంగానికి ఇండియా-యూకే ఇటీవల సంతకం చేసిన కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (సీఈటీఏ) ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతీయ వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఎగుమతుల్లో 95% యూకే మార్కెట్‌లో సుంకం లేకుండా అనుమతించే వీలుంది. ఇది భారతీయ రైతులు, వ్యవసాయ ఎగుమతిదారులకు మార్కెట్ అవకాశాలను గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు. ఇటీవల కుదిరిన ఒప్పందం ప్రకారం వ్యవసాయానికి సంబంధించి కొన్ని ప్రధాన అంశాలు కింది విధంగా ఉన్నాయి.

జీరో-డ్యూటీ యాక్సెస్

  • బాస్మతి, బాస్మతియేతర బియ్యం

  • పండ్లు మరియు కూరగాయలు

  • మసాలా దినుసులు (పసుపు, మిరియాలు, యాలకులు)

  • ప్రాసెస్ చేసిన ఆహారాలు (ఊరగాయలు, మసాలా మిశ్రమాలు, పండ్ల గుజ్జులు, రెడీ టు ఈట్ భోజనం)

  • సముద్ర ఉత్పత్తులు (రొయ్యలు, ట్యూనా, ఫిష్ మీల్, ఫిష్ ఫీడ్)

  • పాడి, వంట నూనెలు, యాపిల్స్ సుంకం రాయితీ పరిధిలోకి రావు. ఇది కీలకమైన దేశీయ పరిశ్రమలను కాపాడుతుంది.

  • గతంలో 70 శాతం వరకు దిగుమతి సుంకాలను ఎదుర్కొన్న ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు జీరో డ్యూటీ పరిధిలోకి రానున్నాయి.

ఇదీ చదవండి: విస్కీ ధరలు తగ్గింపు..?

వచ్చే మూడేళ్లలో యూకేకు భారత వ్యవసాయ ఎగుమతుల్లో 20% వృద్ధి నమోదవుతుందని అంచనా. ఇది భారతదేశం తన 100 బిలియన్ డాలర్ల వ్యవసాయ ఎగుమతి లక్ష్యానికి చేరువ కావడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం 2.25 శాతం మాత్రమే ఉన్న బ్రిటన్ 5.4 బిలియన్ డాలర్ల సముద్ర దిగుమతుల్లో భారత్ వాటాను ఈ వాణిజ్య ఒప్పందం పెంచుతుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement