వాణిజ్య ఒప్పందాలు హడావిడిగా చేసుకోము
దీర్ఘకాల దృష్టితోనే వ్యవహరిస్తాం
కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్
బెర్లిన్/న్యూఢిల్లీ: అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విషయంలో మరింత చేరువ అయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. సమీప భవిష్యత్తులోనే రెండు దేశాలు పారదర్శకమైన, సమతుల్యమైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోగలవన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఆధ్వర్యంలోని బృందం గత వారంలో వాషింగ్టన్‌కు వెళ్లి చర్చలు నిర్వహించడం తెలిసిందే. అయితే, భారత్ హడావిడిగా వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోదని . అమెరికా, ఐరోపా సహా పలు దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలపై సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తలకు తుపాకీ గురిపెట్టినట్టు లేదా నిరీ్ణత గడువులోపే ముగించేయాలన్న హడావిడితో భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోదన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచుకునే లక్ష్యంతో మంత్రి బెర్లిన్‌లో పర్యటిస్తున్న సందర్భంగా మాట్లాడారు.
దీర్ఘకాల దృష్టితోనే..
వాణిజ్య ఒప్పందాలను దీర్ఘకాల దృష్టితోనే భారత్ చూస్తుందని గోయల్ పేర్కొన్నారు. అమెరికా భారత ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో కొత్త మార్కెట్లలో అవకాశాలపైనా దృష్టి సారించినట్టు చెప్పారు. భారత్ షరతులతో కూడిన పారదర్శక దీర్ఘకాల ఒప్పందాన్ని పొందుతోందా? అంటూ ఎదునైన ఒక ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. జాతి ప్రయోజనాలు తప్పించి మరే ఇతర కోణంలోనూ భారత్ తన మిత్రులను నిర్ణయించుకోదు. ఈయూకి మిత్రుడి కాలేరంటూ నాతో ఒకరు అన్నారు. దాన్ని నేను అంగీకరించను. అలాగే, రేపు మరొకరు కెన్యాతో కలసి పనిచేయలేరని అంటారు. అది కూడా ఆమోదనీయం కాదు అని అన్నారాయన


