rajesh agarwal
-
ఔషధ ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు అంతర్జాతీయ వాణిజ్య రూపు రేఖలను మారుస్తున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ అన్నారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు భారతీయ ఔషధ రంగంపై కొంత మేర ప్రభావం చూపుతున్నాయన్నారు. అయితే ఈ రంగంలో సవాళ్లను అధిగమించేందుకు వినూత్న ఆవిష్కరణలు, పరిష్కార మార్గాలపై ఫార్మా వర్గాలు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఫార్మా ఎగుమతుల వృద్ధికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు. భారత ఫార్మాస్యూటికల్స్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) సహకారంతో కేంద్ర వాణిజ్య శాఖ ఏర్పాటు చేసిన ‘చింతన్ శివిర్’ను రాజేశ్ అగర్వాల్ శనివారం ప్రారంభించారు.దేశీయ మార్కెట్ లక్ష్యంగా ఔషధాలు‘ప్రపంచ జనాభాలో 18 నుంచి 19 శాతం భారత్‌లోనే ఉండటం ఫార్మా రంగానికి అతిపెద్ద మార్కెట్‌గా నిలుస్తోంది. జనరిక్స్ తయారీలో భారత్ అగ్రస్థానంలో ఉన్నా ఏపీఐ, ఇంటర్మీడియెట్ల తయారీని స్థానికంగా పెంచడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలి. ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాలకు భారతీయ ఔషధాలు ఎగుమతి అవుతున్నా అనేక దేశాలకు 10శాతం కంటే తక్కువ ఎగుమతులు ఇక్కడ నుంచి జరుగుతున్నాయి.ఫార్మా రంగంలో బయోలాజిక్స్, బయోసిమిలర్స్ వంటి కొత్త పోకడలకు అనుగుణంగా మారాలి. కొత్త పేటెంట్ల అభివృద్ధిలో భాగస్వామ్యం వహించడంతోపాటు ఆవిష్కరణలపై మరింత దృష్టి పెట్టాలి. భౌగోళికంగా విచ్ఛిన్న పరిస్థితులున్న నేపథ్యంలో దిగుమతుల సరఫరా గొలుసును సురక్షితంగా ఉంచడానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అన్వేషిస్తున్నాం. 38 దేశాల ఆర్థిక వ్యవస్ధతో అనుసంధానమయ్యేలా 9 విదేశీ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని కొత్త మార్కెట్లకు విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నాం’ అని రాజేశ్ అగర్వాల్ వెల్లడించారు.సీఈఓలతో సమావేశంచింతన్ శివిర్‌లో భాగంగా ఫార్మా సీఈఓలతో ముఖాముఖి సమావేశం జరిగింది. మార్కెట్ అవకాశాలను ఉపయోగించుకోవటం, నియంత్రణ– నిబంధనల అమలు, ఎగుమతుల వృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఢిల్లీలో వచ్చే సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్న 12వ అంతర్జాతీయ ఫార్మా, హెల్త్‌కేర్ ఎగ్జిబిషన్ ఐపెక్స్–2026 షెడ్యూల్‌ను ఈ సందర్భంగా ప్రకటించారు. ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రాజ భాను అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషి, కేంద్ర వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శులు మోహిత్ యాదవ్, సత్యప్రకాశ్ టీఎల్ పాల్గొన్నారు. -
అమెరికాతో త్వరలో డీల్..!
బెర్లిన్/న్యూఢిల్లీ: అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విషయంలో మరింత చేరువ అయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. సమీప భవిష్యత్తులోనే రెండు దేశాలు పారదర్శకమైన, సమతుల్యమైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోగలవన్న ఆశాభావం వ్యక్తం చేశారు. భారత వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఆధ్వర్యంలోని బృందం గత వారంలో వాషింగ్టన్కు వెళ్లి చర్చలు నిర్వహించడం తెలిసిందే. అయితే, భారత్ హడావిడిగా వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోదని . అమెరికా, ఐరోపా సహా పలు దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలపై సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తలకు తుపాకీ గురిపెట్టినట్టు లేదా నిరీ్ణత గడువులోపే ముగించేయాలన్న హడావిడితో భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోదన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచుకునే లక్ష్యంతో మంత్రి బెర్లిన్‌లో పర్యటిస్తున్న సందర్భంగా మాట్లాడారు. దీర్ఘకాల దృష్టితోనే.. వాణిజ్య ఒప్పందాలను దీర్ఘకాల దృష్టితోనే భారత్ చూస్తుందని గోయల్ పేర్కొన్నారు. అమెరికా భారత ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో కొత్త మార్కెట్లలో అవకాశాలపైనా దృష్టి సారించినట్టు చెప్పారు. భారత్ షరతులతో కూడిన పారదర్శక దీర్ఘకాల ఒప్పందాన్ని పొందుతోందా? అంటూ ఎదునైన ఒక ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. జాతి ప్రయోజనాలు తప్పించి మరే ఇతర కోణంలోనూ భారత్ తన మిత్రులను నిర్ణయించుకోదు. ఈయూకి మిత్రుడి కాలేరంటూ నాతో ఒకరు అన్నారు. దాన్ని నేను అంగీకరించను. అలాగే, రేపు మరొకరు కెన్యాతో కలసి పనిచేయలేరని అంటారు. అది కూడా ఆమోదనీయం కాదు అని అన్నారాయన -
మైక్రోమ్యాక్స్ సోలార్ పవర్
న్యూఢిల్లీ: దేశీ మొబైల్, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్ తాజాగా పునరుత్పాదక ఇంధన రంగంలోకి ప్రవేశించింది. సోలార్ ప్యానెళ్ల తయారీ కోసం స్టార్టప్ ఎనర్జీ పేరిట సంస్థను ఏర్పాటు చేసింది. నివాస గృహాలు, కమర్షియల్, పారిశ్రామిక అవసరాలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన సోలార్ ప్యానెళ్లను తయారు చేయడంపై ఇది దృష్టి పెడుతుందని మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్ ఎండీ రాజేశ్ అగర్వాల్ తెలిపారు. అధునాతన ఆటోమేషన్ సామర్థ్యాలతో స్టార్టప్ ఎనర్జీ తయారీ ప్లాంటును ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం చైనాకు చెందిన జిన్చెన్ సంస్థతో వ్యూహాత్మక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు వివరించారు. దీని కింద 5 గిగావాట్ల అధునాతన సోలార్ మాడ్యూల్స్ తయారీ లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త తరం సోలార్ సొల్యూషన్స్‌పై పరిశోధనలు, అభివృద్ధి కోసం స్టార్టప్ ఎనర్జీ వ్యూహాత్మక భాగస్వామ్యాలను కుదుర్చుకుంటుందని చెప్పారు. -
లాలు కూతురికి కష్టాలు.. సీఏ అరెస్టు
-
లాలు కూతురికి కష్టాలు.. సీఏ అరెస్టు
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ కుమార్తె మీసాభారతికి కష్టాలు ముంచుకొచ్చాయి. ఆమె దగ్గర చార్టర్డ్ అకౌంటెంటుగా పనిచేస్తున్న రాజేశ్ అగర్వాల్‌ను మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టుచేసి ఢిల్లీలోని ఒక కోర్టులో ప్రవేశపెట్టారు. న్యూఢిల్లీలోని బిజ్వసాన్ ప్రాంతంలోని ఒక ఫాంహౌస్ కొనుగోలు చేయడానికి ఒక షెల్ కంపెనీ ద్వారా మీసాభారతి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ గత వారం ఆరోపించారు. ఆ కంపెనీ షేర్ల అమ్మకాలు, కొనుగోళ్ల పేరు మీద మీసాభారతి తన దగ్గర ఉన్న నల్లధనాన్ని తెల్లగా మార్చుకున్నారని ఆయన చెప్పారు. 2002 సంవత్సరంలో కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో మిషాలి ప్యాకర్స్ అండ్ ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని పెట్టారని, దానికి చిరునామాను కూడా నాటి లాలు అధికార నివాసం అయిన నెం.25, తుగ్లక్‌రోడ్ బంగ్లాను చూపించారని, ఆ తర్వాత 2005-06లో ఆ కంపెనీ మూసేశారని మోదీ తెలిపారు. రూ. 10 ముఖవిలువ గల తన కంపెనీ షేర్లను షాలిని హోల్డింగ్స్ యజమాని వీరేంద్ర జైన్‌కు రూ. 100 చొపఉపన 2008 అక్టోబర్ నెలలో మీసాభారతి అమ్మారు. తద్వారా రూ. 1.20 కోట్లను అక్రమంగా కూడబెట్టారన్నది ప్రధాన ఆరోపణ. 11 నెలల తర్వాత ఆమె మళ్లీ జైన్ నుంచి అవే షేర్లను రూ. 10 చొప్పున కొన్నారని చెప్పిన మోదీ.. దానికి సంబంధించిన పత్రాలను కూడా చూపించారు. 2008-09 సంవత్సరంలో ఆమె ఢిల్లీలో రూ. 1.41 కోట్లతో ఫాంహౌస్ కొన్నారని, దాని ప్రస్తుత విలువ సుమారు రూ. 50 కోట్లు ఉంటుందని వివరించారు. కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో రూ. 50 కోట్లు సంపాదించడం ఇంకెవరికైనా సాధ్యమా అని ఆయన అడిగారు. మోదీ ఆరోపణల నేపథ్యంలోనే మీసాభారతి చార్టర్డ్ అకౌంటెంట్ రాజేశ్ అగర్వాల్‌ను పట్టుకున్నారా, మరేవైనా ఇతర ఆధారాలున్నాయా అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. -
క్రిమిసంహారకాల రేట్ల పెంపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముడిసరుకుల ధరల పెరుగుదల, రూపాయి మారకం హెచ్చుతగ్గుల నేపథ్యంలో క్రిమిసంహారకాల రేట్లను 10-15 శాతం మేర పెంచుతున్నట్లు ఇన్సెక్టిసైడ్స్ ఇండియా ఎండీ రాజేష్ అగర్వాల్ తెలిపారు. విడతల వారీగా ఈ రెండు నెలల్లో (డిసెంబర్, జనవరి) 30 ఉత్పత్తుల ధరలు పెంచుతున్నట్లు చెప్పారు. రాబోయే కొన్నాళ్లలో ముడిసరుకుల రేట్లు మరో 5-10% పెరగొచ్చని మంగళవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్ర మార్కెట్ నుంచి ఆదాయం సుమారు 50 శాతం పెరిగి రూ. 150 కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇది సుమారు రూ. 100 కోట్లు. ఇక గతేడాది మొత్తం టర్నోవరు రూ. 650 కోట్లు కాగా ఈసారి రూ. 900 కోట్లు అంచనా వేస్తున్నట్లు అగర్వాల్ పేర్కొన్నారు. మరోవైపు, గడచిన నాలుగేళ్లుగా ఉత్పత్తి సామ ర్థ్యం పెంపుపై సుమారు రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. తాజాగా రాజస్థాన్‌లో నిర్మిస్తున్న ఆరో ప్లాంటు జనవరికల్లా అందుబాటులోకి రాగలదన్నారు. ఇక దేశీయ పరిజ్ఞానంతో క్రిమిసంహారకాల తయారీపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని అగర్వాల్ చెప్పారు. ఇందులో భాగంగా జపాన్‌కి చెందిన ఒత్సుక అగ్రిటెక్నో సంస్థతో కలిసి పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రాథమికంగా దీనిపై రూ. 50 కోట్లు, తదుపరి నాలుగేళ్లలో మరో రూ. 50 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అగర్వాల్ వివరించారు. అటు, కంపెనీ రాబడులు మరింత పెరిగిన పక్షంలో వచ్చే రెండేళ్ల వ్యవధిలో కొంత వాటాల విక్రయం ద్వారా విస్తరణకు కావాల్సిన నిధులను సమకూర్చుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.


