మొటిమల చికిత్స కోసం వెళితే, దారుణం: రూ. 31 లక్షల దావా | Priyanka Chopra Facialist Sued For 31 Lakh By Woman for Chemical Peel treatment | Sakshi
Sakshi News home page

మొటిమల చికిత్స కోసం వెళితే, దారుణం: రూ. 31 లక్షల దావా

Dec 10 2025 4:53 PM | Updated on Dec 10 2025 4:55 PM

Priyanka Chopra Facialist Sued For 31 Lakh By Woman for Chemical Peel treatment

బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా ఎస్తెటిషియన్, కాలిఫోర్నియాకు చెందిన సెలబ్రిటీ ఫేషియలిస్ట్,  సోనియా డకార్‌కు భారీ  ఎదురు దెబ్బ తగిలింది. 2021, ఏప్రిల్‌లో  సోనియాకు చెందిన  బెవర్లీ హిల్స్ స్టూడియోలో జరిగిన కెమికల్ పీల్ ట్రీట్‌మెంట్ వల్ల తన ముఖం శాశ్వతంగా పాడైపోయిందని  ఆరోపిస్తూ  ఒక మహిళ దావా వేసింది.

మొటిమలనివారణ కోసం చికిత్స సమయంలో సోనియా తన ముఖంపై తెలియని పదార్థాన్ని పూయడంతో తనకు తీవ్రమైన గాయాలు, దాని వలన వచ్చాయని  బాధితురాలు విక్టోరియా నెల్సన్ పేర్కొంది. మోసం, చట్టవిరుద్ధమైన వ్యాపార పద్ధతులు , లైసెన్స్ లేని వైద్య వృత్తి ద్వారా తనకు జరిగిన నష్టానికి గాను రూ.  31.48 లక్షలకు మించి  నష్టపరిహారం  చెల్లించాలని పేర్కొంది. తనతోపాటు యువతులు నమ్మిన పరిశ్రమలో  మరింత పారదర్శకత తీసుకురావాలనేదే తన దావా లక్ష్యమని ఇన్‌స్టా పోస్ట్‌లో వెల్లడించింది.

 నవంబర్ 18న, అటార్నీ జనరల్ కార్యాలయం సోనియా డకార్‌పై ఫిర్యాదు చేసింది, ఆమె ఎస్టాబ్లిష్‌మెంట్ ,ఎస్తెటిషియన్స్ లైసెన్స్ రెండింటినీ శాశ్వతంగా రద్దు చేయాలని కూడా  విక్టోరియా డిమాండ్‌ చేసింది. తన తరపున నా లీగల్ టీమ్ కూడా సోనియాపై సివిల్ దావా వేసిందని తెలిపింది. విక్టోరియా గతంలో తన సోషల్ మీడియాలో ఎస్తెటిషియన్ క్లయింట్‌గా తన అనుభవాన్ని పంచుకుంది.తాను 2019 నుండి సోన్యా క్లయింట్‌గా ఉన్నానని ,  గతంలో పీల్‌తో సానుకూలప్రభావం ఉండటంతో,  ఇది మరొక చికిత్స కోసం  వారిని విశ్వసించేలా చేసింది. అయితే కెమికల్ పీల్ సమయంలో,  ముఖంపై తీవ్రమైన మంట, దురద వచ్చాయని తెలిపింది.  అయితే ద్రావణాన్ని కడిగిన తర్వాత, విక్టోరియా తనకు తీవ్రమైన కాలిన గాయాలు అయినట్లు గుర్తించింది. నెల రోజుల పాటు చికిత్స తీసుకుంటే చికిత్సలో గాయాలు నయమవుతాయని సోనియా ఆమెకు హామీ ఇచ్చిందని కూడా తెలిపింది. అయితే, 2021లో 18 సెషన్‌లు, 2022లో 12 సెషన్స్‌ కోసం దాదాపు  60 వేల డాలర్లు  ఖర్చు చేసింది. అయినా ముఖంపై ఇంకా కాలిన గాయాలు పోలేదని చెప్పింది. 2023 నుంచి సోనియా మాట్లాడటంమానేసింది. ఆమె చేస్తున్న మైక్రోనీడ్లింగ్ చికిత్సలు కూడా ఆ లైసెన్స్ పరిధిలోకి  రావని తనచు సమాచార అందిందని చెప్పుకొచ్చింది. అందుకే తనకు నష్టపరిహారం కావాలని డిమాండ్‌ చేస్తోంది. 

ఇదీ చదవండి: ప్రెస్‌ సెక్రటరీ సౌందర్యంపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

మరోవైపు బోర్బరింగ్ అండ్ కాస్మోటాలజీ బోర్డు ప్రకారం, సౌందర్య నిపుణులకు మెడికల్-గ్రేడ్ ఉత్పత్తులను ఉపయోగించడానికి లేదా మైక్రోనీడ్లింగ్ వంటి విధానాలను నిర్వహించడానికి లైసెన్స్ లేదు. సంబంధిత నిబంధనలలో వివరించిన విధంగా వారి అభ్యాస పరిధిని అర్థం చేసుకోవడం లైసెన్స్‌ దారుడి బాధ్యత అని బోర్డు  స్పష్టం చేసింది. 

కాగా కాలిఫోర్నియాకు చెందిన బెవర్లీ హిల్స్‌లోని ఫేషియలిస్ట్ సెలబ్రిటీ క్లయింట్లలో ప్రియాంక చోప్రా, మడోన్నా, గ్వినేత్ పాల్ట్రో, సోఫియా వెర్గారా, కిమ్ కర్దాషియాన్, మేగాన్ ఫాక్స్, డ్రూ బారీమోర్, కామెరాన్ డియాజ్ ఉన్నారు.

ఇదీ చదవండి: Indigo Crisis హర్ష్‌ గోయెంకా నో డిలే, నో డైవర్షన్‌ వైరల్‌ వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement