సెలబ్రిటీలు కనిపిస్తే చాలు సెల్ఫీ ప్లీజ్ అని జనాలు వెంటపడతారు. ఎయిర్‌పోర్టులోనూ ఇలాంటి దృశ్యాలు తరచూ కనిపిస్తూ ఉంటాయి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) వెంట సైతం ఫ్యాన్స్.. ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ అని వెంటపడుతూ ఉంటారు. అందుకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ప్రియాంకను ఇద్దరు అభిమానులు పదేపదే ఆటోగ్రాఫ్ అడిగారు.
పీఆర్ స్టంట్?
తను కూడా వారి అభ్యర్థనను తిరస్కరించకుండా రెండుసార్లు ఆటోగ్రాఫ్ ఇచ్చింది. ఇది చూసిన జనాలు ఇది కచ్చితంగా పీఆర్ స్టంటే, వాళ్లసలు అభిమానులే కాదని విమర్శించడం మొదలుపెట్టారు. ఈ వైరల్ వీడియోపై హాలీవుడ్ నటి బెల్లా థోర్న్ స్పందించింది. 'ఇది పీఆర్ స్టంట్ అని నేననుకోవడం లేదు. వాళ్లు ఆమెను విమానాశ్రయం లోపల నుంచి వెంబడిస్తున్నారు.
అది నిజం కాదు
వీలైనన్ని సార్లు ప్రియాంక సంతకాన్ని సేకరించారు. ఆ ఆటోగ్రాఫ్స్‌ని వారు ఆన్‌లైన్‌లో అమ్ముకుంటారు. నేను కూడా మొదట మీలాగే పొరబడ్డాను. కానీ వాళ్లిద్దరూ ఆమెను వదిలిపెట్టలేదు. తన వెంటపడ్డారు. దాంతో ప్రియాంక.. మంచితనంతో ఓపికగా అడిగిన ప్రతిసారి సంతకం చేసిందంతే! అని చెప్పుకొచ్చింది.
తెలుగులో ఎంట్రీ
ఇకపోతే బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిపోయిన ప్రియాంక చోప్రా చాలాకాలం తర్వాత ఇండియన్ సినిమాకు రీఎంట్రీ ఇస్తోంది. అది కూడా తెలుగు సినిమా వారణాసితో! టాలీవుడ్‌లో ఇదే తన తొలి మూవీ కావడం విశేషం. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం 2027లో విడుదల కానుంది.
చదవండి: పవన్ తండ్రికి క్యాన్సర్.. నోరు తిరగక, తిండి తినక..


