భార్యాభర్తల పోరుని వినోదాత్మకంగా చూపిస్తూ తీసిన కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా 'పురుష:' బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. పవన్ కల్యాణ్ బత్తుల హీరోగా పరిచయమవుతున్నాడు. వీరు వులవల దర్శకుడు. ఇప్పటికే కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు. తాజాగా హీరోయిన్ విషిక ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
తొలుత హీరోయిన్ వైష్ణవి పాత్రని 'కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా' అని పరిచయం చేశారు. 'పాపం అల్లాడి పోతున్నాడమ్మ బిడ్డ' అనే క్యాప్షన్‌తో హాసిని పాత్రని పరిచయం చేశారు. ఇప్పుడు విషిక పోస్టర్ రిలీజ్ చేశారు. వైష్ణవి, హాసిని కంటే విషిక పాత్ర మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. .
ఈ సినిమాలో వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే చిత్ర రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.


