అన్వేష్‌, అనసూయలతో లాభ పడుతుంది ఎవరు..? | Social media Influencers Big Trap On Youtuber Anvesh | Sakshi
Sakshi News home page

అన్వేష్‌, అనసూయలతో లాభ పడుతుంది ఎవరు..?

Jan 5 2026 3:15 PM | Updated on Jan 5 2026 5:31 PM

Social media Influencers Big Trap On Youtuber Anvesh

మహిళల దుస్తుల గురించి మాట్లాడుతూ వారి శరీర భాగాలను సామాన్లతో పోల్చిన బూతు నటుడు శివాజీ… ఈ పదం పెద్ద రచ్చకు దారి తీసింది. తరువాత చిన్మయి, అనసూయల ఎంట్రీతో మరింత చర్చకు ఛాన్స్‌ ఇచ్చారు. చివరకు యూట్యూబర్ అన్వేష్ తన దరిద్రపు మాటలతో చిచ్చు పెట్టాడు. కోట్లాదిమంది పూజించే దేవుళ్ల మీద నీచమైన భాషలో అన్వేష్చేసిన వ్యాఖ్యలు ఎవరూ క్షమించరు. ఆపై సుప్రసిద్ధ ప్రవచనకర్త డా. గరికిపాటి నరసింహారావుని ప్రస్తావించలేని భాషలో బూతులు తిట్టడం తన పతనానికి తనే పునాదులు వేసుకున్నాడు. అంతటితో ఆగని ఈ నీచుడు వేరే దేశంలో తాను 14 ఏళ్ల అమ్మాయిని బలాత్కరించినట్టు ఒక ఆడియోలో ఓపెన్అయ్యాడు. ఇదీ చాలా తీవ్రమైన అలిగేషన్‌. ఆ ఆడియో నిజమైతే తనని ఉరితీసిన తప్పులేదని చెప్పవచ్చు

అయితే, ఇక్కడ అసలు విషయాన్ని పక్కన పెట్టి కొందరు సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్తమ సొంత ప్రయోజనాల కోసం అన్వేష్ఉదంతాన్ని ఉపయోగించుకుంటున్నారు. తమకు వ్యూస్తో పాటు సబ్స్రైబర్స్ను పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారు. తనను తిడుతూ వీడియోలు పోస్ట్‌ చేస్తే చాలు మిలియన్ల కొద్ది వ్యూస్వస్తున్నాయి. దాంతో డబ్బు చేసుకునే పనిలో యూట్యూబర్స్‌ ఉన్నారు. గతంలో ఇదే ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ తమ పేజీలో బూతు కంటెంట్తో పాటు హీరోయిన్ల అర్ధనగ్న ఫోటోలను షేర్చేసిన సందర్భాలు ఉన్నాయి.

అన్వేష్‌ చుట్టూ మీడియా
శివాజీ మాట్లాడిన వ్యాఖ్యలకు తను క్షమాపణ చెప్పాడు.. అందరూ ఒప్పుకున్నారు కూడా.. కానీ అన్వేష్ క్షమాపణలు ఒప్పుకోలేదు. ట్రాక్ను సోషల్మీడియాలో పదేపదే నాన్చుతూ ఉన్నారు. కొన్ని ప్రధాన మీడియా ఛానల్స్విచక్షణ మరచి ఉదయం నుంచి రాత్రి వరకు అన్వేష్గురించే జపం చేస్తున్నాయి.. ఏకంగా ప్రధాన పత్రికలో ఎడిటోరియల్కాలమ్లో మీడియా అధినేతలు కూడా అన్వేష్గురించి రాసుకొచ్చారు. ఇదంతా అన్వేష్మీద కోపమూ కాదు.. అలాగని మహిళల మీద ప్రేమా కాదు. కేవలం వారి స్వప్రయోజనాల కోసం వారు తెరలేపిన బిగ్గేమ్‌.. జనాలు చూస్తున్నారు.. వారు వీడియోలు క్రియేట్చేసి డబ్బు చేసుకుంటున్నారు

ఇలా ఒక్కసారిగా అన్వేష్చుట్టూ సోషల్మీడియా తిరుగుతుంది. వీరందరికీ మహిళల మీద ప్రేమ ఉంటే.. హీరోయన్ల నాభిపై ఆపిల్‌, ద్రాక్ష పళ్లు విసిరినప్పుడు ఎందుకు రాయలేదు. పైగా ఆలోచన ఎలా వచ్చింది అంటూ ఎంకరేజ్చేశారు. ఇప్పుడు మహిళలను ఉద్దరిస్తున్నామని చెబుతున్న సో కాల్డ్సోషల్మీడియా పేజీలు, ప్రధాన కొన్ని మీడియా ఛానల్స్కూడా హీరోయన్లను క్లోజ్అప్కెమెరాలతో ఇబ్బంది పెట్టిన సందర్భాలే ఉన్నాయి.

అన్వేష్ట్రాప్లో నెటిజన్లు
అన్వేష్మొదట బెట్టింగ్యాప్స్మీద వీడియోలు చేశాడు. అప్పుడు కూడా బూతులతోనే రెచ్చిపోయాడు. కానీ, ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. అయితే, ఎపిసోడ్తర్వాత మహాభారతం మీద సిరీస్వీడియోలు చేశాడు.. పెద్దగా ఫలితం లేదు. ఇలాంటి సమయంలో శివాజీ చేసిన చిల్లర వ్యాఖ్యలు తనకు వరంగా మారాయి. శివాజీ మాటలను కొందరు తప్పుబట్టారు.. మరికొందరు సమర్థించారు. అది వేరే సంగతి.. కానీ, అన్వేష్మాత్రమే చాలా ఎక్స్ట్రీమ్గా అభ్యంతరకరమైన భాషలో శివాజీపై విరుచుకుపడ్డాడు. రాయలేని బూతులు కూడా వాడాడు. దీంతో ఒక్కసారిగా మళ్లీ సోషల్మీడియాలో వైరల్అయ్యాడు.

ఇదంతా చూస్తుంటే పక్కా ప్లాన్తోనే అన్వేష్చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అన్వేష్పై చాలామంది యూట్యూబర్స్విరుచుకపడుతున్నా సరే తనుమాత్రం ఎవరినీ టార్గెట్చేస్తూ వీడియో చేయలేదు. కానీ, తాజాగా ఒక ప్రముఖ యూట్యూబర్‌ (Aye Jude)పై ఒక వార్నింగ్వీడియోతో అన్వేష్రెచ్చిపోయాడు. ఇక్కడ Aye Judeకు భారీ సబ్స్క్రైబర్స్ఉన్నారు.  మంచి కంటెంట్‌తోనే వీడియోస్‌ చేస్తూ ఆకట్టుకుంటాడు. మిలియన్ల కొద్ది వ్యూస్‌ వున్నాయి. కాబట్టే అన్వేష్‌ అతన్ని మాత్రమే టార్గెట్చేశాడు

అదే సమయంలో యూట్యుబర్కు కూడా అన్వేష్లాంటి తిమింగళమే కావాలి. గతంలో యూట్యూబర్‌  Aye Jude చేస్తున్న వీడియోలపై అభ్యంతరం చెబుతూ చాలామంది యూట్యుబర్స్వీడియోలు చేశారు. కానీ, తను మాత్రం ఎప్పుడు కూడా ఎవరికీ రిప్లై ఇవ్వలేదు. కేవలం అన్వేష్మీద మాత్రమే కౌంటర్‌గా వీడియో చేశాడు. క్రమంలో వారిద్దరికీ కావాల్సింది ఒక్కటే.. బాగా అమ్ముడుపోయే కంటెంట్.. 

అందుకే ఇలాంటి టాపిక్ను ఎత్తుకుని పదేపదే సోషల్మీడియాలో వారితో పాటు మరికొంతమంది ఇన్ఫ్లూయెన్సర్స్వీడియోలు చేస్తున్నారు. వారు మాత్రం తమ వీడియోలతో డబ్బు చేసుకుంటున్నారు. యువత మాత్రం ట్రాప్లో చిక్కుకుని కామెంట్లు పెడుతున్నారు.  షిర్డీ సాయి బాబాను చాలామంది ఇష్టంగా పూజిస్తారు. నటి మాధవీలత పిచ్చికూతలు కూసినా సరే పెద్దగా అభ్యంతరం ఎవరూ చెప్పడం లేదు. దేవుళ్ల మీద పిచ్చికూతలు కూసి రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలు చట్టాలు మారుస్తే అన్వేష్లాంటి వారందరూ సరైన దారిలోకి వస్తారు.

బెట్టింగ్ యాప్స్వెనుక అన్వేష్‌‌
బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయడానికి వెనుక అన్వేష్పాత్ర ఎక్కువ ఉందని ఎవరైనా ఒప్పుకుని తీరుతారు. అంశంలో తను సుదీర్ఘమైన పోరాటం చేశాడు. చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని బ్యాన్చేసింది. బెట్టింగ్యాప్స్వల్ల 2025లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1500 మందికి పైగా యువకులు చనిపోయారని లెక్కలు ఉన్నాయి. బెట్టింగ్యాప్స్ప్రమోట్చేసిన భయ్యా సన్నీ యాదవ్, హర్షసాయి వంటి స్టార్యూట్యుబర్స్తో పాటు సినీ నటులు కూడా కోర్టు మెట్లు ఎక్కారు. ప్రక్రియలో అన్వేష్పాత్ర చాలా కీలకంగా ఉంది. అందుకే ప్రస్తుత సీపీ సజ్జనార్కూడా గతంలో అతనితో ఒక లైవ్వీడియోలో మాట్లాడారు. బెట్టింగ్యాప్స్మీద అతను చేస్తున్న పోరాటాన్ని ఆయన మెచ్చుకున్నారు. కానీ,తాజాగా అన్వేష్చేసిన చిల్లర వ్యాఖ్యలు తన వినాశనానికి దారితీసేలా ఉన్నాయి.

(అన్వేష్‌ ఉదంతంపై సోషల్‌మీడియాలో ఏం జరుగుతుందో ఒక ఫన్నీ వీడియోతో కొందరు ఇలాంటి వీడియో కూడా రెడీ చెశారు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement