breaking news
anveshana
-
Youtuber: ఇక నా వల్ల కాదు! అన్నీ ఆపేస్తున్నా
-
అన్వేష్, అనసూయలతో లాభ పడుతుంది ఎవరు..?
మహిళల దుస్తుల గురించి మాట్లాడుతూ వారి శరీర భాగాలను సామాన్లతో పోల్చిన బూతు నటుడు శివాజీ… ఈ పదం పెద్ద రచ్చకు దారి తీసింది. ఆ తరువాత చిన్మయి, అనసూయల ఎంట్రీతో మరింత చర్చకు ఛాన్స్ ఇచ్చారు. చివరకు యూట్యూబర్ అన్వేష్ తన దరిద్రపు మాటలతో చిచ్చు పెట్టాడు. కోట్లాదిమంది పూజించే దేవుళ్ల మీద నీచమైన భాషలో అన్వేష్ చేసిన వ్యాఖ్యలు ఎవరూ క్షమించరు. ఆపై సుప్రసిద్ధ ప్రవచనకర్త డా. గరికిపాటి నరసింహారావుని ప్రస్తావించలేని భాషలో బూతులు తిట్టడం తన పతనానికి తనే పునాదులు వేసుకున్నాడు. అంతటితో ఆగని ఈ నీచుడు వేరే దేశంలో తాను 14 ఏళ్ల అమ్మాయిని బలాత్కరించినట్టు ఒక ఆడియోలో ఓపెన్ అయ్యాడు. ఇదీ చాలా తీవ్రమైన అలిగేషన్. ఆ ఆడియో నిజమైతే తనని ఉరితీసిన తప్పులేదని చెప్పవచ్చు. అయితే, ఇక్కడ అసలు విషయాన్ని పక్కన పెట్టి కొందరు సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ తమ సొంత ప్రయోజనాల కోసం అన్వేష్ ఉదంతాన్ని ఉపయోగించుకుంటున్నారు. తమకు వ్యూస్‌తో పాటు సబ్స్రైబర్స్ను పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారు. తనను తిడుతూ వీడియోలు పోస్ట్ చేస్తే చాలు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. దాంతో డబ్బు చేసుకునే పనిలో యూట్యూబర్స్ ఉన్నారు. గతంలో ఇదే ఇన్ఫ్లూయెన్సర్స్ తమ పేజీలో బూతు కంటెంట్‌తో పాటు హీరోయిన్ల అర్ధనగ్న ఫోటోలను షేర్ చేసిన సందర్భాలు ఉన్నాయి.అన్వేష్ చుట్టూ మీడియాశివాజీ మాట్లాడిన వ్యాఖ్యలకు తను క్షమాపణ చెప్పాడు.. అందరూ ఒప్పుకున్నారు కూడా.. కానీ అన్వేష్ క్షమాపణలు ఒప్పుకోలేదు. ఈ ట్రాక్‌ను సోషల్‌మీడియాలో పదేపదే నాన్చుతూ ఉన్నారు. కొన్ని ప్రధాన మీడియా ఛానల్స్ విచక్షణ మరచి ఉదయం నుంచి రాత్రి వరకు అన్వేష్ గురించే జపం చేస్తున్నాయి.. ఏకంగా ప్రధాన పత్రికలో ఎడిటోరియల్ కాలమ్‌లో మీడియా అధినేతలు కూడా అన్వేష్ గురించి రాసుకొచ్చారు. ఇదంతా అన్వేష్ మీద కోపమూ కాదు.. అలాగని మహిళల మీద ప్రేమా కాదు. కేవలం వారి స్వప్రయోజనాల కోసం వారు తెరలేపిన బిగ్ గేమ్.. జనాలు చూస్తున్నారు.. వారు వీడియోలు క్రియేట్ చేసి డబ్బు చేసుకుంటున్నారు. ఇలా ఒక్కసారిగా అన్వేష్ చుట్టూ సోషల్‌మీడియా తిరుగుతుంది. వీరందరికీ మహిళల మీద ప్రేమ ఉంటే.. హీరోయన్ల నాభిపై ఆపిల్, ద్రాక్ష పళ్లు విసిరినప్పుడు ఎందుకు రాయలేదు. పైగా ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటూ ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు మహిళలను ఉద్దరిస్తున్నామని చెబుతున్న ఈ సో కాల్డ్ సోషల్‌మీడియా పేజీలు, ప్రధాన కొన్ని మీడియా ఛానల్స్ కూడా హీరోయన్లను క్లోజ్ అప్ కెమెరాలతో ఇబ్బంది పెట్టిన సందర్భాలే ఉన్నాయి.అన్వేష్ ట్రాప్‌లో నెటిజన్లుఅన్వేష్ మొదట బెట్టింగ్ యాప్స్ మీద వీడియోలు చేశాడు. అప్పుడు కూడా బూతులతోనే రెచ్చిపోయాడు. కానీ, ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. అయితే, ఆ ఎపిసోడ్ తర్వాత మహాభారతం మీద సిరీస్ వీడియోలు చేశాడు.. పెద్దగా ఫలితం లేదు. ఇలాంటి సమయంలో శివాజీ చేసిన చిల్లర వ్యాఖ్యలు తనకు వరంగా మారాయి. శివాజీ మాటలను కొందరు తప్పుబట్టారు.. మరికొందరు సమర్థించారు. అది వేరే సంగతి.. కానీ, అన్వేష్ మాత్రమే చాలా ఎక్స్ట్రీమ్గా అభ్యంతరకరమైన భాషలో శివాజీపై విరుచుకుపడ్డాడు. రాయలేని బూతులు కూడా వాడాడు. దీంతో ఒక్కసారిగా మళ్లీ సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాడు.ఇదంతా చూస్తుంటే పక్కా ప్లాన్‌తోనే అన్వేష్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అన్వేష్‌పై చాలామంది యూట్యూబర్స్ విరుచుకపడుతున్నా సరే తనుమాత్రం ఎవరినీ టార్గెట్ చేస్తూ వీడియో చేయలేదు. కానీ, తాజాగా ఒక ప్రముఖ యూట్యూబర్ (Aye Jude)పై ఒక వార్నింగ్ వీడియోతో అన్వేష్ రెచ్చిపోయాడు. ఇక్కడ Aye Judeకు భారీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మంచి కంటెంట్‌తోనే వీడియోస్ చేస్తూ ఆకట్టుకుంటాడు. మిలియన్ల కొద్ది వ్యూస్ వున్నాయి. కాబట్టే అన్వేష్ అతన్ని మాత్రమే టార్గెట్ చేశాడు. అదే సమయంలో ఆ యూట్యుబర్కు కూడా అన్వేష్ లాంటి తిమింగళమే కావాలి. గతంలో యూట్యూబర్ Aye Jude చేస్తున్న వీడియోలపై అభ్యంతరం చెబుతూ చాలామంది యూట్యుబర్స్ వీడియోలు చేశారు. కానీ, తను మాత్రం ఎప్పుడు కూడా ఎవరికీ రిప్లై ఇవ్వలేదు. కేవలం అన్వేష్ మీద మాత్రమే కౌంటర్‌గా వీడియో చేశాడు. ఈ క్రమంలో వారిద్దరికీ కావాల్సింది ఒక్కటే.. బాగా అమ్ముడుపోయే కంటెంట్.. అందుకే ఇలాంటి టాపిక్‌ను ఎత్తుకుని పదేపదే సోషల్‌మీడియాలో వారితో పాటు మరికొంతమంది ఇన్ఫ్లూయెన్సర్స్ వీడియోలు చేస్తున్నారు. వారు మాత్రం తమ వీడియోలతో డబ్బు చేసుకుంటున్నారు. యువత మాత్రం ఆ ట్రాప్‌లో చిక్కుకుని కామెంట్లు పెడుతున్నారు. షిర్డీ సాయి బాబాను చాలామంది ఇష్టంగా పూజిస్తారు. నటి మాధవీలత పిచ్చికూతలు కూసినా సరే పెద్దగా అభ్యంతరం ఎవరూ చెప్పడం లేదు. దేవుళ్ల మీద పిచ్చికూతలు కూసి రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలు చట్టాలు మారుస్తే అన్వేష్ లాంటి వారందరూ సరైన దారిలోకి వస్తారు.బెట్టింగ్ యాప్స్ వెనుక అన్వేష్బెట్టింగ్ యాప్‌లను బ్యాన్ చేయడానికి వెనుక అన్వేష్ పాత్ర ఎక్కువ ఉందని ఎవరైనా ఒప్పుకుని తీరుతారు. ఈ అంశంలో తను సుదీర్ఘమైన పోరాటం చేశాడు. చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని బ్యాన్ చేసింది. బెట్టింగ్ యాప్స్ వల్ల 2025లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1500 మందికి పైగా యువకులు చనిపోయారని లెక్కలు ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన భయ్యా సన్నీ యాదవ్, హర్షసాయి వంటి స్టార్ యూట్యుబర్స్తో పాటు సినీ నటులు కూడా కోర్టు మెట్లు ఎక్కారు. ఈ ప్రక్రియలో అన్వేష్ పాత్ర చాలా కీలకంగా ఉంది. అందుకే ప్రస్తుత సీపీ సజ్జనార్ కూడా గతంలో అతనితో ఒక లైవ్ వీడియోలో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ మీద అతను చేస్తున్న పోరాటాన్ని ఆయన మెచ్చుకున్నారు. కానీ,తాజాగా అన్వేష్ చేసిన చిల్లర వ్యాఖ్యలు తన వినాశనానికి దారితీసేలా ఉన్నాయి.(అన్వేష్ ఉదంతంపై సోషల్‌మీడియాలో ఏం జరుగుతుందో ఒక ఫన్నీ వీడియోతో కొందరు ఇలాంటి వీడియో కూడా రెడీ చెశారు) View this post on Instagram A post shared by arshadahmed (@arshadahmed.m) -
ఛానల్ బ్లాక్.. బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్?
-
వీసీ సజ్జనార్ హెచ్చరిక.. వీళ్లను తక్షణమే అన్‌ఫాలో చేయండి
బెట్టింగ్ యాప్స్, వాటిని ప్రమోట్ చేస్తున్న సోషల్‌మీడియా ఇన్‌ప్లూయెన్సర్లకు టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ (VC Sajjanar) చుక్కలు చూపుతున్నారు. ఇంతకాలం కొనసాగిన తమ ఆగడాలకు ఆయన ఫుల్స్టాప్ పెడుతున్నారు. కాసులకు కక్కుర్తిపడి వాటికి ప్రచారం చేయొద్దని ఇప్పటికే ఆయన పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ వారిలో మార్పు రాకపోవడంతో కేసులు నమోదు అయ్యేలా చైతన్యం తీసుకొచ్చారు. దీంతో చాలామంది యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేఖంగా ఆయనతో చేతులు కలిపేందుకు ముందుకు వస్తున్నారు.మొన్న వైజాగ్ లోకల్ బాయ్ నాని, నిన్న భయ్యా సన్నీ యాదవ్.. నేడు హర్ష సాయిల బాగోతాన్ని వీసీ సజ్జనార్ ‘ఎక్స్’ వేదికగా బయటపెట్టారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని సోషల్ మీడియాలో వారు విడుదల చేసే వీడియోల వల్ల అమాయకులు ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారికి బానిసలవుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో వారి బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో యూట్యూబర్ హర్ష సాయి గురించి సజ్జనార్ ఇలా చెప్పుకొచ్చారు. 'హర్ష సాయి చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో ఈ వీడియోలో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట. ఏమైనా బుద్దుందా అసలు!ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం కూడా లేదు. వీళ్లకు డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం.. ఎవరూ ఎక్కడ పోయినా, సమాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్నమైన వాళ్లకు సంబంధం లేదు. ఈయనకు రూ. 100 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు ఆఫర్ చేశారట. అంత మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్‌ని మార్కెట్లో పెట్టి కోట్లకు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్లనా.. మీరు ఫాలో అవుతోంది. వెంటనే ఈ బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్సర్లను అన్‌ఫాలో చేయండి. వారి అకౌంట్లను రిపోర్ట్ కొట్టండి. ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి.' అంటూ ఆయన సూచించారు. దీంతో సోషల్‌మీడియాలో సజ్జనార్ పేరు మారుమ్రోగిపోతుంది.వాళ్లకు చుక్కులు చూపించిన అన్వేష్ముఖ్యంగా యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్న తెలుగు ట్రావెలర్ నా అన్వేషణ.. 'అన్వేష్' చాలారోజుల నుంచే బెట్టింగ్ యాప్స్‌పై వ్యతిరేఖంగా పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో వందల కొద్ది వీడియోలను తన యూట్యుబ్‌లో పోస్ట్ చేశాడు. అసలు బెట్టింగ్ యాప్స్ వల్ల జరిగే నష్టాలను తెరపైకి తీసుకొచ్చాడు. ఆపై వాటిని ప్రమోట్ చేస్తున్న లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి, ఇమ్రాన్ వంటి వారిని హెచ్చరిస్తూనే పలు వీడియోలతో వారికి చుక్కులు చూపించాడు. దీంతో అన్వేష్‌కు మద్ధతుగా చాలామంది నెటిజన్లు నిలిచారు. ఈ క్రమంలో వీసీ సజ్జనార్ కూడా అన్వేష్‌తో ఒక లైవ్ వీడియో ప్రోగ్రామ్ చేశారు. దానిని తన యూట్యూబ్‌లో ఆయన షేర్ చేయడంతో సుమారు రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎంతో మంది IPS, IASలు ఉన్నారు. కానీ, బెట్టింగ్ యాప్స్ మీద మాట్లాడింది సజ్జనార్ సార్ మాత్రమే అంటూ ఆయన అభిమానులు కామెంట్ రూపంలో చెబుతున్నారు. ఈ వీడియోతో రెండు రాష్ట్రాల తెలుగువారి మనసులు గెలిచేసావ్ అంటూ అన్వేష్‌పై ప్రశంసలు వస్తున్నాయి. అన్వేష్ లాంటి యూట్యూబర్‌ను ఫాలో అవుతున్నందుకు చాలా గర్వపడుతున్నానని ఒక నెటిజన్ పేర్కొనడం విశేషం. ఐపీఎస్ సజ్జనార్‌తో ఇంటర్వ్యూ చేసిన అన్వేష్‌కు సోషల్‌మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆ వీడియో కింద కామెంట్లు అన్నీ కూడా వారిని ప్రశంసిస్తూ ఉండటం విశేషం. చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట. బుద్దుందా అసలు!ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం లేదు.… pic.twitter.com/h0Vyxl2vXh— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 15, 2025 -
రెండోరోజూ దొరకని అన్వేష్ ఆచూకీ
జియ్యమ్మవలస:మండలంలోని రావాడ వట్టిగెడ్డలో సోమవారం గల్లంతైన విద్యార్థి జి.అన్వేష్ ఆచూకీ రెండోరోజూ లభించలేదు. జాలర్లతో వెతికించినా తమ కుమారుడి ఆచూకీ దొరకక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.కురుపాం మండల కేంద్రంలో శోభలతాదేవి కాలనీకి చెందిన అన్వేష్ అదే కాలనీకి చెందిన స్నేహితులతో వట్టిగెడ్డలో సోమవారం ఈతకొట్టి గల్లంతైన విషయం విదితమే. సోమవారం సాయంత్రం చీకటి పడినంత వరకు ఈతగాళ్లతో వెతికించినా అన్వేష్ ఆచూకీ దొరకక పోవడంతో మంగళవారం కూడా రావాడలో చేపలు పట్టే జాలర్లతో పార్వతీపురం సీఐ వి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వెతికించారు.సాయంత్రం 5 గంటల వరకు వెతికినా ఆచూకీ దొరకలేదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పప్పల పాపారావు తెలిపారు. అన్వేష్ ఆచూకీ దొరకక పోవడంతో తల్లిదండ్రులు, దగ్గర బంధువులు,స్నేహితులు రావాడ వట్టిగెడ్డకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దర్యాప్తు ముమ్మరం చేయాలి కురుపాం: రెండో రోజు గాలించినా అన్వేష్ ఆచూకీ తెలియరాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కురుపాం పోలీస్టేషన్‌కు చేరుకుని అన్వేష్ ఏమయ్యాడో వెంటనే విచారణ వేగవంతం చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న అన్వేష్ స్నేహితులను విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే అన్వేష్ ఆచూకీ లభించడం లేదని మండిపడ్డారు. దీంతో కురుపాం ఎస్సై ఎన్.అశోకచక్రవర్తి మాట్లాడుతూ సంఘటన తమ పరిదిలో జరగక పోయినా గల్లంతైన అన్వేష్ కురుపాం వాసి కావడంతో చినమేరంగి-కురుపాం పోలీసు సిబ్బంది దర్యాప్తు ముమ్మరంగానే నిర్వహిస్తున్నామని నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని అన్వేష్ బంధువులు, తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. -
గీత స్మరణం
పల్లవి : పపగ పపగ పపగ పపగ... పపగ పస... పపగ పస... ఎదలో లయ ఎగసే లయ ససమా నినిరీ... ససమా నినిరీ... గగగ మమమ ససస ససస ససస ఎదలో లయ ఎగసే లయ ఎగసి ఎగిరి ఎదలో ఒదిగి శుకమా స్వరమా పికమా పదమా శుకమా చరణం : 1 గాగా ఆ... ఆ... దివ్యమే నీ దర్శనం శ్రావ్యమేలే స్పందనం శోధనే నా జీవనం సాధనేలే జీవితం జతలే శ్రుతులై పలికే ఆలాపన వెతికి వెతికి బ్రతుకే అన్వేషణ నాలో నేడే విరులవాన ॥ చరణం : 2 కోకిలగీతం... తుమ్మెదనాదం... (2) జలజల పారే సెలగానం ఘుమఘుమలాడే సుమరాగం అరెరె... ఆ... ఆ... ఆ... కొండ కోన... ఎండ వాన... ఏకమైన ప్రేమగీతం... ఔనా... మైనా... నీవే... నేనా శుకపికముల కలరవముల స్వర లహరులలో పలికే చిలుక పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ సససస.... దదదద...పపపప...రిరిరిరి....నినినిని... సససస రిరిరిరి....నినినిని... సససస పలికే చిలుక పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ విరుల తెరలో జరిగేదేమో మరులే పొంగి పొరలిన వేళ ॥ సససస... సససస... చరణం : 3 విహంగమా... సంగీతమా... (2) సంగీతమే విహంగమై చరించగా స్వరాలతో వసంతమే జ్వలించగా ఎన్నాళ్లు సాగాలి ఏకాంత అన్వేషణ అలికిడి ఎరుగని తొలకరి వెలుగులలో ॥ చిత్రం : అన్వేషణ (1985), రచన : వేటూరి సంగీతం : ఇళయురాజా, గానం : ఎస్.జానకి - నిర్వహణ: నాగేశ్


