మహేశ్‌బాబు- రాజమౌళి కాంబోలో యాక్షన్ అడ్వెంచరస్ మూవీని తెరకెక్కిస్తున్నారు. తొలిసారి వీరిద్దరి జతకట్టడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రంలో మందాకిని పాత్రలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కనిపించనుంది.
ఇటీవలే ఈ మూవీ నుంచి సించారీ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. తాజాగా రిలీజైన ప్రియాంక చోప్రా పోస్టర్ చూస్తే రెండు చేతులతో గన్ పట్టుకుని ఫుల్ అగ్రెసివ్ అండ్ యాక్షన్ మోడ్‌లో కనిపించింది. చీరకట్టులో ప్రియాంక గన్ పట్టుకున్న పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ చూస్తుంటే ప్రియాంక చోప్రా రోల్ పవర్‌పుల్‌గా ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్ కుంభగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఈ మూవీకి సంబంధించి బిగ్ ఈవెంట్ ప్లాన్ చేశారు రాజమౌళి. ఈనెల రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‌గా నిర్వహించన్నారు. ఈ కార్యక్రమాన్ని జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో టైటిల్ రివీల్ చేయనున్నట్లు సమాచారం.


