ప్రభాస్ హీరోగా వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది.ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ సంక్రాంతి పోటీలో నిలిచింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.
ఈ ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్ రిద్ది కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. హీరో ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. నీ వల్లే నేను ది రాజాసాబ్‌లో మూవీ నటిస్తున్నానని తెలిపింది. నాకు ఈ అద్భుతమైన అవకాశమిచ్చిన ప్రభాస్‌కు రుణపడి ఉంటానని తెలిపింది. ఈ రోజు ఈవెంట్‌కు మీరు నాకిచ్చిన శారీనే ధరించానని సంతోషం వ్యక్తం చేసింది. ఈ రోజు కోసం మూడేళ్లుగా ఈ శారీని కట్టుకోలేదని భావోద్వేగానికి గురైంది. నా లైఫ్‌లో నీలాంటి పర్సన్ పరిచయం కావడం నా అదృష్టమని రిద్ధికుమార్ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. కాగా.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది.
Riddhi కి Saree ఇచ్చిన ప్రభాస్.. She reveals it on stage!
I'm wearing the saree that you gave me
I saved it for 3 years
Just to wear it tonight
Grateful to have you in my life.#Prabhas #RiddhiKumar pic.twitter.com/8BXLXdj16Z— M9 NEWS (@M9News_) December 27, 2025
Thank you #riddhikumar gaaru 3 years wait chesi
Ee day kosam ah saree wear chesaru 🫡🫡🫡🫡🫡🫡#TheRajaSaab pic.twitter.com/QSIQiF510G— PrabhasPandu (@Dreamer_998) December 27, 2025


