ఇన్నాళ్లు అక్కడే నలిగిన జ్ఞాపకం.. ఇంతకాలానికి! | Actress Poorna About Baby Shower And Story Behind Her Gown | Sakshi
Sakshi News home page

తొలిసారి ఐ లవ్యూ.. దాని గుర్తుగానే ఈ గౌన్‌: పూర్ణ

Feb 11 2026 6:18 PM | Updated on Feb 11 2026 6:24 PM

Actress Poorna About Baby Shower And Story Behind Her Gown

నటి షామ్నా ఖాసిం అలియాస్‌ పూర్ణ రెండోసారి తల్లి కాబోతోంది. గతేడాది ఆగస్టులో తను రెండోసారి గర్భం దాల్చిన విషయాన్ని వెల్లడించింది. తాజాగా ఆమె తన బేబీ షవర్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. అందులో భర్త, కుమారుడితో కలిసి దిగిన పిక్స్‌ జత చేసింది. వీటిలో పూర్ణ లైట్‌ పింక్‌ కలర్‌ గౌన్‌లో అందంగా ముస్తాబైంది.

గర్వంగా ఉంది
అయితే ఈ డ్రెస్‌ వెనక ఓ స్టోరీ ఉందని చెప్పింది.  అతడు (పూర్ణ భర్త) నాకు తొలిసారి ఐ లవ్యూ చెప్పినరోజు ఈ గౌన్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. ఏళ్ల తరబడి ఈ డ్రెస్‌ కప్‌బోర్డులో అలాగే నలిగిపోతూ ఉంది. ఒక మంచిరోజుకోసం ఇన్నేళ్లుగా ఎదురు చూస్తోంది. ఇంతకాలానికి ఆ మంచి రోజు రానే వచ్చింది. మాతృత్వాన్ని సెలబ్రేట్‌ చేసుకునేరోజు దాన్ని ధరించాను. నా భర్త ఈ సెలబ్రేషన్స్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా అద్భుతంగా మలిచాడు. నా మనసు సంతోషం, ప్రేమతో ఉప్పొంగిపోతోంది. అలాగే నా డ్యాన్స్‌ స్కూల్‌లో పిల్లలు ఒక్కో స్టెప్పు వేస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది అని రాసుకొచ్చింది.

సినిమా
మలయాళ నటి పూర్ణ తెలుగులో.. శ్రీ మహాలక్ష్మి, సీమ టపాకాయ్‌, అవును, నువ్వలా నేనిలా, రాజుగారి గది, మామ మంచు అల్లుడు కంచు, సుందరి, అఖండ 2 వంటి పలు సినిమాలు చేసింది. గుంటూరు కారం మూవీలో కుర్చీ మడతపెట్టి పాటలో కనిపిస్తుంది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, కన్నడ భాషల్లోనూ యాక్ట్‌ చేసింది. 2022లో వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీని పెళ్లాడింది. ఆ మరుసటి ఏడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

 

 

చదవండి: ఆ సంతోషం, భావోద్వేగం మాటల్లో వర్ణించలేను: చిరంజీవి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement