ఐశ్వర్య అర్జున్‌కు బ్రహ్మనందం బర్త్‌ డే గిఫ్ట్.. అదేంటంటే? | Brahmanandam Gifts To Arjun Sarja Daughter Aishwarya Arjun | Sakshi
Sakshi News home page

Brahmanandam: అర్జున్‌ సర్జా కూతురికి బ్రహ్మనందం బర్త్‌ డే గిఫ్ట్.. అదేంటంటే?

Feb 11 2026 5:15 PM | Updated on Feb 11 2026 5:22 PM

Brahmanandam Gifts To Arjun Sarja Daughter Aishwarya Arjun

హీరో అర్జున్‌ సర్జా కుమార్తె ఐశ్వర్య, నిరంజన్‌ ప్రధాన పాత్రల్లో వస్తోన్న మూవీ సీతా పయనం. ఈ మూవీకి అర్జున్‌ సర్జానే దర్శకత్వం వహించారు. ఇందులో అర్జున్‌ మేనల్లుడు ధ్రువ సర్జా కెమియో రోల్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మనందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్యకు బ్రహ్మనందం సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ ఇచ్చారు. ఫిబ్రవరి 10న ఐశ్వర్య బర్త్ డే కావడంతో తానే స్వయంగా గీసిన శ్రీరాముడు, హనుమాన్‌ పెయింటింగ్‌ కానుకగా అందజేశారు. ఐశ్వర్య తన కూతురు లాంటిదని బ్రహ్మనందం ‍అన్నారు.

కాగా.. సీతా పయనం మూవీని శ్రీ రామ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై రూపొందించారు. కాగా.. ఈ చిత్రంలో  సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ, అర్జున్‌ మేనల్లుడు ధ్రువ సర్జా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement