అర్జున్ సర్జాకు గిఫ్ట్‌ ఇచ్చిన ట్యాంక్ బండ్ శివ.. వీడియో వైరల్ | Tank Bund Shiva Special Gift To Hero Arjun Sarja At Seetha Payanam Pre Release Event, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Arjun Sarja: అర్జున్ సర్జాకు గిఫ్ట్‌.. ట్యాంక్ బండ్ శివ ఎమోషనల్ స్పీచ్

Feb 11 2026 4:41 PM | Updated on Feb 11 2026 4:53 PM

Tank Bund Shiva Gifts To Hero Arjun Sarja at Pre Release Event

హీరో అర్జున్‌ సర్జా కుమార్తె ఐశ్వర్య, నిరంజన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన లేటేస్ట్ మూవీ సీతా పయనం. ఈ మూవీకి అర్జున్‌ దర్శకత్వం వహిస్తూ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీని శ్రీ రామ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 14న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ, అర్జున్‌ మేనల్లుడు ధ్రువ సర్జా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు అర్జున్‌, ఆయన కూతురు ఐశ్వర్య. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాస్యనటుడు బ్రహ్మనందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవెంట్‌లో ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ట్యాంక్ బండ్‌ శివను ఘనంగా సత్కరించారు.

ఈవెంట్‌కు హాజరైన ట్యాంక్ బండ్ శివ.. వేదికపై ఎమోషనల్‌ స్పీచ్ ఇచ్చారు. తన భార్య వల్లే జీవితానికి అర్థం తెలిసొచ్చిందని అన్నారు. ఒక దొంగలా కాకుండా దొరలా బ్రతకాలని తన దగ్గరే నేర్చుకున్నానని అన్నారు. ఈ సందర్భంగా అర్జున్‌ సర్జాకు ఓ అరుదైన బహుమతి ఇచ్చారు. ఆయన సినిమాల్లోని ఫోటోలతో ఓ ఫ్రేమ్‌ను అర్జున్‌కు బహుకరించారు ట్యాంక్ బండ్ శివ దంపతులు. దీంతో అర్జున్ ‍సర్జా ఆనందం వ్యక్తం చేశారు. సమాజం కోసం నిస్వార్థ సేవ చేస్తున్న ట్యాంక్‌ బండ్‌ శివకు లక్ష రూపాయల చెక్‌ను అర్జున్ సర్జా అందజేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement