ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర భామ సురభి జ్యోతి నాగిన్ సీరియల్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. అంతే కాకుండా ఖుబూల్ హై, ఇష్క్ బాజ్, కోయి లౌట్ కే ఆయా హై సీరియల్స్‌తో మెప్పించింది. ఆ తర్వాత కొన్నేళ్లపాటు నటుడు సుమిత్ సూరితో ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ.. 2024లో పెళ్లి పీటలెక్కి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
తాజాగా ఈ ముద్దుగుమ్మ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌లో మా ఇంటికి కొత్త మెంబర్ రానున్నారని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. మా గొప్ప సాహసయాత్ర ప్రారంభమవుతుంది.. ఈ జూన్‌లో లిటిల్ లవ్ మా ఇంటికి వస్తోందంటూ సంతోషం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.
కాగా.. సురభి- సుమిత్ హాంజి-ద మ్యారేజ్ మంత్ర అనే మ్యూజిక్ వీడియోలో కలిసి నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఆమె భర్త సుమిత్ సూరి 2013లో నటుడిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. వాట్ ద ఫిష్, బబ్లూ హ్యాపీ హై సినిమాలు.. ద టెస్ట్ కేసు, హోమ్ వెబ్ సిరీసుల్లోనూ నటించాడు.


