breaking news
Surbhi Jyoti
-
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్
ప్రముఖ బుల్లితెర నటి సురభి జ్యోతి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తనకు పాప పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. జూన్ 13న తనకు కుమార్తె జన్మించినట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. మా ఇంటికి కుమార్తె వచ్చేసింది.. ఈ సమయంలో మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయాయని పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు, స్నేహితులు సురభికి అభినందనలు చెబుతున్నారు.కాగా.. సురభి జ్యోతి బాలీవుడ్లో 'ఖుబూల్ హై' అనే సీరియల్‌తో బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత నాగిని-3 సీరియల్స్‌తో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను గర్భవతి అని ప్రకటించిన బుల్లితెర భామ తాజాగా బిడ్డకు వెల్కమ్ చెప్పింది. ఆమె తన ప్రియుడు సుమిత్ సూరిని అక్టోబర్ 27, 2024న వివాహం చేసుకుంది. వీరి వివాహం ఉత్తరాఖండ్‌లోని ఆహానా రిసార్ట్‌లో గ్రాండ్‌గా జరిగింది.కాగా.. ఆమె భర్త సుమిత్ రిషికేశ్ నటుడిగా మాత్రమే కాదు.. నిర్మాత కూడా రాణిస్తున్నారు. పలు వాణిజ్య ప్రకటనలలో నటించాడు. అంతేకాకుడా గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన 'వార్నింగ్' చిత్రంతో బాలీవుడ్లో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 'ఖత్రోన్ కే ఖిలాడి' 4వ సీజన్లో కూడా కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. -
హెబ్బాపటేల్ గ్లామరస్ లుక్.. వేకేషన్లో ధనశ్రీ వర్మ చిల్..!
బాలీవుడ్ బ్యూటీ సురభి జ్యోతి బేబీ బంప్ లుక్..పెళ్లి ఫోటోలు షేర్ చేసిన బిగ్‌బాస్ పునర్నవి..హీరోయిన్ హెబ్బా పటేల్ గ్లామరస్ పిక్స్..వేకేషన్లో చిల్ అవుతోన్న కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ..హీరోయిన్ సమంత స్మైలీ లుక్స్.. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన నాగిని బ్యూటీ.. సోషల్ మీడియాలో పోస్ట్
ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర భామ సురభి జ్యోతి నాగిన్ సీరియల్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. అంతే కాకుండా ఖుబూల్ హై, ఇష్క్ బాజ్, కోయి లౌట్ కే ఆయా హై సీరియల్స్‌తో మెప్పించింది. ఆ తర్వాత కొన్నేళ్లపాటు నటుడు సుమిత్ సూరితో ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ.. 2024లో పెళ్లి పీటలెక్కి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌లో మా ఇంటికి కొత్త మెంబర్ రానున్నారని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. మా గొప్ప సాహసయాత్ర ప్రారంభమవుతుంది.. ఈ జూన్‌లో లిటిల్ లవ్ మా ఇంటికి వస్తోందంటూ సంతోషం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.కాగా.. సురభి- సుమిత్ హాంజి-ద మ్యారేజ్ మంత్ర అనే మ్యూజిక్ వీడియోలో కలిసి నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఆమె భర్త సుమిత్ సూరి 2013లో నటుడిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. వాట్ ద ఫిష్, బబ్లూ హ్యాపీ హై సినిమాలు.. ద టెస్ట్ కేసు, హోమ్ వెబ్ సిరీసుల్లోనూ నటించాడు. View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti)


