అంత భారమా? | Radhika Apte recalls losing a major film after gaining weight on vacation | Sakshi
Sakshi News home page

అంత భారమా?

Dec 28 2025 3:16 AM | Updated on Dec 28 2025 3:16 AM

Radhika Apte recalls losing a major film after gaining weight on vacation

హీరోయిన్లు ఏ కాస్త బరువు పెరిగినా... ట్రోలింగ్‌ మొదలవుతుంది. మీమ్స్‌ చుట్టుముట్టి వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. మరోవైపు ‘బరువు పెరగడం’ అనేది నటీమణుల కెరీర్‌కు కూడా బ్రేక్‌లు వేస్తుంది. ‘ఇంత బరువు మాత్రమే ఉండాలి... ఈ రంగులో ఉంటేనే అందంగా ఉన్నట్లు... ఇలా నడిస్తేనే నడక... ఇలా నవ్వితేనే నవ్వు’ ఇలాంటి కృత్రిమ కొలమానాలు చిత్రపరిశ్రమలో బలంగా ఉన్నాయి. ఇలాంటి కొలమానాలు వినడానికి ఇబ్బందిగా ఉండడం మాత్రమే కాదు కెరీర్‌ పరంగా ఆర్టిస్టు లకు నష్టం కలిగిస్తాయి. ఇందుకు తాజా ఉదాహరణ నటి రాధికా ఆప్టే. ‘అద్భుత నటి’గా పేరు తెచ్చుకున్న రాధిక ఒక మెగా హిట్‌ సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయింది. 

ఇంతకీ ఏం జరిగింది? ఆమె మాటల్లోనే తెలుసుకుందాం...
‘ఒక పెద్దప్రాజెక్ట్‌లో భాగమయ్యే అవకాశం వచ్చింది. నన్ను దృష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్‌లో నా పాత్రను తీర్చిదిద్దారు. ఒక టూర్‌కు వెళ్లి వచ్చిన తరువాత నేను కాస్త బరువు పెరిగాను. అయితే అది నాకు ఇబ్బందికరమైన, అనారోగ్యకరమైన బరువేమీ కాదు. ఫొటోషూట్‌ తరువాత నా ఫొటోగ్రాఫ్స్‌ చూస్తూ.... దిస్‌ ఈజ్‌ సో ఫ్యాట్‌ అన్నారు. ఆప్రాజెక్ట్‌ నుంచి నన్ను తప్పించారు. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది. మూడు, నాలుగు కిలోల బరువు మంచి అవకాశాన్ని కోల్పోయేలా చేసింది.
లొంగిపోను.. బరువు పెరిగినప్పుడు బాధ పడతాను. బరువు తగ్గించుకోవాలనుకుంటాను.

బరువు గురించి అతిగా ఆలోచించడం కూడా ఒక సమస్యే. ఈ సమస్య నాకు గతంలో లేదు. ఎందుకంటే నేను సహజ సౌందర్యాన్ని నమ్ముతాను. సహజ సౌందర్యం అనే భావనకు ఎప్పుడూ కట్టుబడి ఉంటాను. ఈ సంఘటన నన్ను మరింత దృఢంగా మార్చింది’. ఒక వైపు కెరీర్, మరోవైపు తాను నమ్ముకున్న విలువలు... ఈ అంతర్గత సంఘర్షణ చివరికి ఆప్టేను థెరపీ వరకు తీసుకువెళ్లింది.

‘నేను నమ్ముకున్న విలువలకు కట్టుబడి ఉంటాను. అందానికి సంబంధించి మీ ఆలోచనలు, అభి్రపాయాలకు నేను లొంగిపోను’ అంటున్న రాధికా ఆప్టే వయసుకు సంబంధించి స్త్రీ, పురుషుల విషయంలో అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించింది. మొత్తానికైతే... ‘ఇండస్ట్రీ ఎక్స్‌పెక్టేషన్స్‌’ అనే భావన, హానికరమైన సౌందర్య ప్రమాణాలు నటీమణులపై ఎంత మానసిక ఒత్తిడి పెంచుతాయో చెప్పడానికి రాధికా ఆప్టే మాటలే సాక్ష్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement