breaking news
Priyanka Chabra
-
పెళ్లికళ వచ్చేసింది
సినిమా ఇండస్ట్రీలో ఏది జరిగినా ఒక ట్రెండ్‌లా నడుస్తుంటుంది. ఒక సినిమా హిట్ అయితే అలాంటి ఫార్ములాతో వరుసగా సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడు బాలీవుడ్లో పెళ్లిళ్ల ట్రెండ్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. మొన్నే ‘దీప్‌వీర్’ (దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్) ఒక్కటయ్యారు. డిసెంబర్ 2న ప్రియానిక్ (ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్) జో«ద్‌పూర్‌లో పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లి పనులన్నీ సక్రమంగా జరగాలని ముంబైలోని ప్రియాంకా చోప్రా నివాసంలో బుధవారం పూజ చేశారు. పెళ్లి పీటలెక్కనున్న ఈ జాబితాలోకి తాజాగా రాఖీ సావంత్, శ్వేతాబసు ప్రసాద్ చేరారు. శ్వేతాబసు ప్రసాద్ బాయ్‌ఫ్రెండ్, దర్శకుడు రోహిత్ మిట్టల్ జూన్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 13న వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారని బాలీవుడ్ టాక్. మరోవైపు ఎప్పటికప్పుడు ఏదోఒక సెన్సేషన్తో వార్తల్లో నిలిచే రాఖీసావంత్ కూడా పెళ్లి కూతురు కాబోతున్నట్టు ప్రకటించారు. టెలివిజన్ యాక్టర్ దీపక్ కలాల్‌ను వివాహం చేసుకోబుతున్నట్టు సోషల్ మీడియాలో తెలిపారామె. డిసెంబర్ 31 సాయంత్రం 5: 55 నిమిషాలకు వీరి వివాహం లాస్ ఏంజెల్స్‌లో జరగనున్నట్టు పేర్కొన్నారు. ‘‘మేం ఒక్కటవ్వాలనుకుంటున్నాం. ఇండస్ట్రీలో చాలా మంది ఒక్కటవుతున్నారు. ఇదే రైట్ టైమ్ అనిపించింది. అందరి ఆశీర్వాదం మాకు కావాలి’’ అని రాఖీ సావంత్ బాలీవుడ్ మీడియాకు తెలిపారు. సో.. బాలీవుడ్‌కి పెళ్లికళ వచ్చేసిందన్నమాట. -
అతడు... ఆమె... ఓ స్కూటర్
వెన్నెల కిషోర్, ప్రియాంక చాబ్రా జంటగా రూపొందిన చిత్రం ‘అతడు... ఆమె.. ఓ స్కూటర్’. గంగారపు లక్ష్మణ్ దర్శకుడు. అమరేంద్రరెడ్డి నిర్మాత. ఈ నెల 23న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రెండున్నర గంటల పాటు కడుపుబ్బా నవ్వించే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. థియేటర్లతో పాటు జింగ్రీల్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, విదేశాల్లో ఈ చిత్రాన్ని వీక్షించాలనుకునేవారు... మూడు డాలర్లు వెచ్చించి ఈ సైట్లో చూడొచ్చని వెన్నెల కిషోర్ తెలిపారు. అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ప్రియాంక చాబ్రా కృతజ్ఞతలు చెప్పారు. బిజినెస్ విషయంలో కూడా సంతృప్తిగా ఉన్నామని చిత్రసమర్పకుడు ముత్తు కుమారస్వామి ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా కథా రచయిత జగదీష్ బాగ్లీ కూడా పాల్గొన్నారు.