భార్యపై గృహ హింసకు పాల్పడిన ఆరోపణలతో తిరుపతికి చెందిన NRI . జెస్వంత్ మనికొండ (36) ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ హింస మరియు కోర్టు రక్షణ ఉత్తర్వు ఉల్లంఘన ఆరోపణలపై కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (Milpitas Police Department–MPD) సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం అతణ్ని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఎల్మ్‌వుడ్ కరెక్షనల్ ఫెసిలిటీకి తరలించారు. తరువాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది.
గృహ హింస కేసుల్లో పోలీసులు, కోర్టులు వేగంగా స్పందిస్తేనే సత్వర న్యాయం జరుగుతుందని ఎన్జీవో ప్రతినిధి తరుణి పేర్కొన్నారు. ఇటువంటి కేసుల్లో బాధితులు ఆలస్యం చేయకుండా ధృవీకరించబడిన సహాయ సంస్థలను సంప్రదించాలని సూచించారు. ఎన్‌ఆర్‌ఐ కుటుంబాలలో గృహ హింస బాధితులకు చట్టపరమైన సహాయం, రక్షణ వ్యవస్థలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.


