నిబంధనలకు మట్టి | - | Sakshi
Sakshi News home page

నిబంధనలకు మట్టి

Feb 13 2026 5:30 AM | Updated on Feb 13 2026 5:30 AM

నిబంధ

నిబంధనలకు మట్టి

రెచ్చిపోతున్న మట్టి మాఫియా

అనుమతులు గోరంత..తవ్వేది కొండంత

ఇదీ ఇరిగేషన్‌ అధికారుల తీరు

కోడూరు నియోజకవర్గంలో మట్టి బంగారమైంది. అవినీతి అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో నిబంధనలకు మట్టిగొట్టి, యథేచ్ఛగా తరలిస్తున్నారు. పచ్చనేతల సిఫార్సులున్నవారు.. అడిగినంత రొక్కం చెల్లించిన వారికి నిబంధనలు అతిక్రమించి అనుమతులిచ్చేస్తున్నారు.. అడిగేవారులేరని వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులకు పలు అడ్డంకులు సృష్టిస్తున్నారు.

పుల్లంపేట: మండలంలోని చెరువుల్లో మట్టి తరలింపు యథేచ్ఛగా కొనసాగుతోంది. మట్టి తరలింపునకు ఇరిగేషన్‌ అధికారులు అనుమతులు ఇవ్వాల్సివుంది. రైతులు తమ పొలాల్లో పంటలు పండించేందుకు మట్టి మార్పిడి చర్యలు చేపడుతుంటారు. ఇందుకు చెరువు మట్టి శ్రేష్టమని దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఇరిగేషన్‌ అధికారులు రైతుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. పైగా మట్టి తరలింపు కోసం లంచం పుచ్చుకుని అనుమతులు మంజూరు చేసిన అధికారికి రైతులు తీసుకెళుతున్న మట్టిపై నిఘా లేకపోవడంతో మంజూరు చేసిన క్యూబిక్‌ మీటర్ల కంటే అధికంగా మట్టిని తరలించి, చెరువులను చెరిపేస్తున్నారు. దేవసముద్రం చెరువులో మట్టి తోలకానికి అనుమతులు మంజూరు చేయకూడదని రెవెన్యూ అధికారులు ఇరిగేషన్‌ అధికారులకు నివేదికలు ఇచ్చినా తహసీల్దార్‌ ఆదేశాలను ధిక్కరిస్తూ ఇరిగేషన్‌ అధికారులు ఆదాయమే పరమావధిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా మండలంలోని దేవసముద్రం చెరువులో గతేడాది ఆగస్టు 4వ తేదీన నిహాన్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి అనే రైతులు తమ పొలానికి మట్టి తోలుకోవడానికి మండల ఇరిగేషన్‌ ఏఈకి దరఖాస్తు చేసుకోగా అనుమతుల కోసం ఆ శాఖ ఈఈకి నివేదించారు. కాగా సంబంధిత రైతులు కేవలం వైఎస్సార్‌ సీపీకి చెందిన వ్యక్తులు కావడంతో అనుమతులు తిరస్కరించారు. వీరు దరఖాస్తులు చేసుకోవడానికి పదిరోజుల ముందు.. జూలై 19వ తేదీన పుల్లారెడ్డిపల్లెకు చెందిన రైతు రమాదేవికి అనుమతులు మంజూరు చేయడం విశేషం. పొలాలకు మట్టి తరలింపులో సైతం అధికారులు రాజకీయాలు చేయడం విచిత్రంగా ఉంది. దీనికితోడు దేవసముద్రం గ్రామానికి చెందిన సుధీర్‌రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి అనే రైతులు మట్టి కోసం అనుమతులు కోరగా రూ.50వేలు డిమాండ్‌ చేసినట్లు వారు పేర్కొన్నారు. రెండు విడతలుగా రూ.5 వేలు చొప్పున ఫోన్‌పే ద్వారా ఇరిగేషన్‌ ఏఈ నాగేంద్రకు డబ్బులు జమ చేసినట్లు పేర్కొన్నారు. కాగా రైతుల ఫిర్యాదు మేరకు చాలాకాలం తర్వాత ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన ఏఈని వివరణ కోరగా ‘మీరెవరండి.. నేను మీకు సమాధానం చెప్పాలా, మీరేమి నా పైఅధికారులా..’ అని బెదిరింపులకు దిగారు. మీకేమైనా సమాధానం కావాలంటే రాతపూర్వకంగా వినతిపత్రం అందిస్తే మీరు కోరిన సమాచారం ఇస్తానని చెప్పారు. తాను డబ్బులు డిమాండ్‌ చేయలేదని, చెరువు గండ్లు పడతాయనే ఉద్దేశంతో అనుమతులు ఇవ్వలేదని తెలిపారు.

వైఎస్సార్‌ సీపీ సానుభూతి పరులమని..

వైఎస్సార్‌ సీపీ సానుభూతి పరులమనే ఏకై క కారణంతో మట్టి తోలకానికి ఇరిగేషన్‌ అధికారులు అనుమతులు ఇవ్వలేదు. జూలై, సెప్టెంబర్‌ నెలల్లో అనుమతులు మంజూరు చేసిన అధికారులు ఆగస్టులో అనుమతులు మంజూరు చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. – సుధీర్‌రెడ్డి,

ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు, వైఎస్సార్‌ సీపీ

యథేచ్ఛగా చెరువు మట్టి తరలింపు

అడిగినంత డబ్బులివ్వలేదని..

ఇరిగేషన్‌ ఏఈ నాగేంద్రనాయక్‌ అడిగినంత డబ్బులు ఇవ్వలేదనే కారణంగా మట్టి తోలకానికి అనుమతులు తిరష్కరించారు. అప్పటికీ నా శక్తి కొలది రెండు సార్లు రూ.5 వేలు చొప్పున ఫోన్‌పే చేశాను.

– వెంకటసుబ్బారెడ్డి, దేవసముద్రం

నిబంధనలకు మట్టి1
1/4

నిబంధనలకు మట్టి

నిబంధనలకు మట్టి2
2/4

నిబంధనలకు మట్టి

నిబంధనలకు మట్టి3
3/4

నిబంధనలకు మట్టి

నిబంధనలకు మట్టి4
4/4

నిబంధనలకు మట్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement