అమెరికాలోని జార్జియాలో ఉండే భారతీయ అమెరికన్‌కి చేదు అనుభవం ఎదురైంది. చేయని నేరానికి ఆరు వారాల జైలు శిక్ష అనుభవించారు. కానీ విచారణలో కోర్టు ఈ కేసు కొట్టి వేసింది. దీంతో ఆయన న్యాయాపోరాటానికి సిద్ధపడ్డారు. జార్జియాలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో ఒక చిన్నారిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడనే తప్పుడు ఆరోపణతో ఆరు వారాల పాటు జైలు శిక్ష అనుభవించిన భారతీయ అమెరికన్ 57 ఏళ్ల మహేంద్ర పటేల్ ఉదంతం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జార్జియాలోని అక్వర్త్‌లోని వాల్‌మార్ట్‌లోతన కొడుకును కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించా డని రెండేళ్ల బాలుడి తల్లి కరోలిన్ మిల్లర్ ఆరోపించింది. ఈ సంఘటనను వాల్‌మార్ట్ ఉద్యోగికి, తదనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 57 ఏళ్ల మహేంద్ర పటేల్‌ను 2025, మార్చి 24న అరెస్టు చేశారు. ఈ విషయంలో తనకి, పటేల్‌కి మధ్య బాబు కోసం "టగ్ ఆఫ్ వార్" జరిగిందని కూడా పేర్కొంది.
అయితే తాను నిరపరాధి నని మొదటినుంచి గట్టిగా వాదించారు మహేంద్ర పటేల్. 2025 మార్చి 18న, తాను వాల్‌మార్ట్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు, టైలెనాల్ (టాబ్లెట్స్) ఎక్కడ ఉన్నాయోమిల్లర్‌ను దిశానిర్దేశం చేయమని అడిగానని పటేల్ చెప్పాడు. అప్పుడు ఆమె కొడుకు బ్యాలెన్స్ కోల్పోతున్నాడని గమనించి, అతను పడిపోకుండా ఉండటానికి చేయి చాచానని చెప్పుకొచ్చాడు.
SHOCKING & SAD !!
Mahendra Patel has filed a federal civil rights lawsuit after being jailed for 47 days over a Walmart incident.
He was arrested after a shopper accused him of trying to kidnap her child.
Police video later showed no force, no injury, and no kidnapping… pic.twitter.com/cRlPZfwvEH— M9 USA🇺🇸 (@M9USA_) February 11, 2026
తప్పుడు ఆరోపణల వల్ల పటేల్ 46 రోజుల పాటు కాబ్ కౌంటీ జైలులో గడపాల్సి వచ్చింది. ఆరు వారాల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. చివరికి ఆగస్టు 2025లో జిల్లా అటార్నీ కార్యాలయం ఈ కేసును కొట్టివేసింది. రెండు పార్టీలు ఒక పరిష్కారానికి వచ్చాయని కోబ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ చెప్పింది.
నిజం నిరూపించిన సీసీటీవీ ఫుటేజ్
అతను బిడ్డను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించలేదని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిరూపితమైంది.పటేల్ చాలా ప్రశాంతంగా ఆమె పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లడం, ఆమె అతనికి 'థంబ్స్ అప్' చూపించడం స్పష్టంగా కనిపించింది. అలాగే మిల్లర్ చెప్పినట్లుగా అక్కడ ఎలాంటి పెనుగులాట జరగలేదు.
ఇదీ చదవండి: రైల్లో శాండ్‌విచ్...నెటిజన్ల రియాక్షన్స్ వైరల్ వీడియో
మానసిక వేదన, వ్యాపార నష్టం
ఈ అనుభవాన్ని "పీడకల"గా అభివర్ణించారు. ఈ దారుణమైన అనుభవం తనను మానసికంగా కుంగ దీసిందనీ, ఆర్థికంగా దెబ్బతీసిందని పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. "టైలెనాల్ కోసం వెళ్తే, నా జీవితంలోనే అతిపెద్ద తలనొప్పి ఎదురైంది" అని ఆయన పేర్కొన్నారు. తన కుటుంబం కూడా నరకం చూసిందన్నారు. ఒకవేళ వాల్‌మార్ట్ వీడియో లేకపోయి ఉంటే. ఆమె మాట వర్సెస్ నా మాటగా మారింది. నేనిక జైల్లో మగ్గిపోవాల్సి వచ్చేదన్నారు. ఆ ఫుటేజ్‌అక్షరాలా తన ప్రాణాన్ని కాపాడిందన్నారు.
సుమారు రూ. 210 కోట్లు
తాను అనుభవించిన మానసిక క్షోభకు పరిహారం చెల్లించాల్సిందిగా ఆయన దావా వేశారు. తనను అన్యాయంగా అరెస్ట్ చేసిన ఆక్వర్త్ నగరంపై, తప్పుడు ఫిర్యాదు చేసిన మిల్లర్‌పై , పోలీసులపై 25 మిలియన్ల డాలర్లు ( సుమారు (రూ.210 కోట్లు) నష్టపరిహారం కోరుతూ ఆయన దావా వేశారు.
ఇదీ చదవండి: ఇండియన్ ఫోటోగ్రాఫర్‌కు చిక్కిన తొమ్మిది రంగుల అద్భుతం
సీసీటీవీ ఫుటేజ్‌లో ఎలాంటి తప్పు కనిపించకపోయినా పోలీసులు కేసు నమోదు చేయడం అధికార దుర్వినియోగమేనని పటేల్ తరపు న్యాయవాది మార్క్ గ్రాస్‌మన్ అన్నారు.
ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ పోయింది.. కానీ ఒక్క క్షణం కూడా : జర్మనీ యువతి వైరల్ వీడియో


