ఆరోజు మా అమ్మ బంగారు గాజులు, నెక్లెస్‌లు దానం చేసింది.. మరి ఇప్పుడు? | Anand Mahindra Recalls Selfless Gold Donations By Indian Women Goes Viral | Sakshi
Sakshi News home page

అలా బంగారం దానం చేయడం ఇవాళ సాధ్యమేనా? ఆలోచింప చేసే ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌

Oct 24 2025 3:01 PM | Updated on Oct 24 2025 4:46 PM

Anand Mahindra Recalls Selfless Gold Donations By Indian Women Goes Viral

పారిశ్రామిక దిగ్గజంఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra) ఎప్పటికప్పడూ ఆసక్తికర ట్వీట్లతో ప్రజకు చేరువుగా ఉంటారు. ఆసక్తికరమైన ట్రావెల్స్‌, స్ఫూర్తిని కలిగించే విషయాలతో చైత్యన్యపరిచేలా ఉంటాయా ఆయన ట్వీట్స్‌. ఈసారి కూడా అలాంటి ఆసక్తికరమైన, ఆలోచింపచేసే ట్వీట్‌ని నెట్టింట షేర్‌ చేశారు. ఆ ట్వీట్‌ సారాంశం వింటే..ఇది నిజమే కదా..కచ్చితంగా ఇలా సాధ్యమేనా అనే సందేహం మెదులుతుంది మదిలో..

అదేంటంటే..1962లో చైనాతో జరిగిన యుద్ధంలో దేశానికి మద్దతుగా భారతీయ మహిళలు నిస్వార్థంగా బంగారు ఆభరణాలు ఇచ్చిన సంఘటన గురించి చెప్పుకొచ్చారు ఆనంద్‌ మహీంద్రా. అంతేగాదు అందుకు సంబంధించిన తన బాల్య జ్ఞాపకాన్ని కూడా షేర్‌ చేశారు. టాప్‌ పది దేశాల్లో కంటే బంగారం భారతీయ మహిళల వద్దే ఉంది అ‍న్న ట్వీట్‌కి ప్రతిస్పందనగా ఆయన ఇలా రాసుకొచ్చారు పోస్ట్‌లో. బంగారం ఏఏ దేశాల వద్ద ఎక్కువగా ఉంది అనే జాబితాను వివరిస్తూ..

యూఎస్ఏ: 8,133 టన్నులు
జర్మనీ: 3,351 టన్నులు
ఇటలీ: 2,451 టన్నులు
ఫ్రాన్స్: 2,437 టన్నులు
రష్యా: 2,332 టన్నులు
చైనా: 2,279 టన్నులు
స్విట్జర్లాండ్: 1,039 టన్నులు
జపాన్: 845 టన్నులు
నెదర్లాండ్స్: 612 టన్నులు
పోలాండ్: 448 టన్నులు

నాడు 1962లో, చైనాతో యుద్ధం జరగుతున్న సమయంలో రక్షణ ప్రయత్నాల నిమిత్తమై జాతీయ రక్షణ నిధిని కోరింది. మన దేశాన్ని రక్షించుకునేందేకు ప్రజలంతా తమ ఆభరణాలను, బంగారాన్ని దానంగా ఇవ్వాలని పౌరులకు విజ్ఞప్తి చేసింది. నేడు వేల కోట్ల ధర పలుకుతున్న బంగారాన్ని అప్పుడు దేశ రక్షణ కోసం సేకరించడం నాకు ఇంకా గుర్తు ఉంది అంఊ తన బాల్య జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. సరిగ్గా నాకు అప్పుడు ఏడేళ్లు. 

ముంబైలో మా అమ్మ పక్కన నిలబడి ఉండగా..ఆమె ఇది విని నిశబ్ధంగా తన బంగారు గాజులు, నెక్లెస్‌లలో కొన్నింటిని సేకరించి, వాటిని ఒక గుడ్డ థైలాలో ఉంచి, ట్రక్కుపై ఉన్న స్వచ్ఛంద సేవకులకు అందజేసిన ఘటన ఇప్పటికీ ఇంకా గుర్తుంది. ఇవాళ ఆ స్థాయిలో స్ఫూర్తి, స్వచ్ఛంద చర్యలు జరుగుతాయా అని ప్రశ్నించారు. అంతేగాదు నాకు ఆ జ్ఞాపకం జాతీయ స్థితిస్థాపకత అనేది విధాన సాధనాలపై మాత్రమే కాకుండా, ప్రజల సమిష్టి సంకల్పంపై ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తుంటుంది. అని రాశారు." అని పోస్ట్‌లో రాసుకొచ్చారు.

(చదవండి: Diwali 2025: ఆ గ్రామంలో దీపావళి ప్రాభవమే వేరు!)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement