న్యూఢిల్లీ: అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా దేశీయంగా పసిడి ధరలు పెరిగాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,300 పెరిగి రూ. 1,32,900కి చేరింది. అటు వెండి సైతం కేజీకి రూ. 3,500 పెరిగి రూ. 1,83,500 పలికింది.
అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ధర ఒక దశలో సుమారు 15.10 డాలర్లు పెరిగి 4,223.76 డాలర్లకు చేరింది.


