ప్రముఖ ఇన్వెస్టర్, పాపులర్ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. అమెరికా డాలర్ స్థిరత్వం గురించి ఎప్పుడూ విమర్శలు చేసే ఆయన మరోసారి యూఎస్ కరెన్సీ గురించి వ్యాఖ్యానించారు.
బ్రిక్స్ దేశాలు కొత్త కరెన్సీని ప్రకటించాయన్న పుకారు వార్తను ప్రస్తావిస్తూ ఇక అమెరికా డాలర్ పని అయిపోయింది.. ‘‘బై బై యూఎస్ డాలర్’’ అంటూ తన ‘ఎక్స్’ పోస్ట్ లో రాసుకొచ్చారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల సమూహం బ్రిక్స్ బంగారం మద్దతు ఉండే "యూనిట్" అనే "డబ్బు"అని ప్రకటించాయి అన్నారు. ‘అప్రమత్తంగా ఉండండి.. నష్టాలపాలవ్వొద్దు’ అని యూజర్లకు సూచించారు.
‘నా అంచనా ఏమిటంటే యూఎస్ డాలర్ల పొదుపు చేసేవాళ్లు అత్యంత నష్టపరులు అవుతారు. మీరు యూఎస్ డాలర్లను కలిగి ఉంటే... అధిక ద్రవ్యోల్బణం మిమ్మల్ని తుడిచిపెట్టవచ్చు. నేను నా మంత్రానికి కట్టుబడి ఉన్నాను, బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథర్‌లను కలిగి ఉన్నాను’ అని రాసుకొచ్చారు.
బంగారం, వెండిపై దీర్ఘకాలంగా పెట్టుబడులు పెడుతున్న కియోసాకి.. ఇటీవలి సంవత్సరాలలో బిట్ కాయిన్, ఎథేరియంలను డాలర్ క్షీణత నుంచి కాపాడుకునే ఆస్తులుగా పేర్కొంటున్నారు.
BIG BREAKING $ NEWS:
BRICS: Brazil, Russia, India, China, South Africa announces the “UNIT”
a gold backed “money.”
BYE BYE US DOLLAR!!!!!
Stand by, stay awake, stay tuned in.
DONT BE A LOSER
My forecast is Savers of US dollars biggest losers.
If you own US Dollars…. Hyper…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 5, 2025


