రూపాయి రికార్డు కనిష్టం 39 పైసలు తగ్గి 92.21కు | Rupee Plunges 47 Paise To Rs 92. 21 Against Dollar | Sakshi
Sakshi News home page

రూపాయి రికార్డు కనిష్టం 39 పైసలు తగ్గి 92.21కు

Mar 10 2026 3:01 AM | Updated on Mar 10 2026 11:47 AM

Rupee Plunges 47 Paise To Rs 92. 21 Against Dollar

చమురు ధరల పెరుగుదలతో దిగుమతుల బిల్లు పెరగనుంది. ఇందుకు డాలర్లలో చెల్లింపుల కారణంగా రూపాయి విలువకు చిల్లు పడింది. వెరసి డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ  39 పైసలు క్షీణించి సరికొత్త కనిష్టం 92.21 వద్ద ముగిసింది. 

పశ్చిమాసియాలో యుద్ధ భయాలు, ప్రధాన కరెన్సీలతో మారకంలో పుంజుకున్న డాలరు దేశీయంగా రూపాయిని దెబ్బతీసినట్లు  ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. రూపాయి ఒక దశలో 92.35కు చేరింది. ఇది ఇంట్రాడేలో రికార్డ్‌ కనిష్టం. కాగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 0.3% బలపడి 99.27కు చేరింది.  

Advertisement
 
Advertisement
Advertisement