పసిడి భారీ పతనం.. 4000 డాలర్ల దిగువకు ధర! | Gold Price Down Know The Reason Here | Sakshi
Sakshi News home page

పసిడి భారీ పతనం.. 4000 డాలర్ల దిగువకు ధర!

Nov 13 2026 7:04 AM | Updated on Nov 13 2026 7:04 AM

Gold Price Down Know The Reason Here

అంతర్జాతీయంగా పసిడి ధర మళ్లీ 4,000 డాలర్ల కిందికి పడింది. స్పాట్‌ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 121 డాలర్లు (3.01%) క్షీణించి 3,879 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్‌ బలపడటంతో ఒకానొక దశలో 3.60% శాతం నష్టపోయి 3,857 డాలర్ల కనిష్టాన్ని తాకింది. ''ఒకవేళ డాలర్‌ ఇండెక్స్‌ 103 కీలక స్థాయిని దాటి బలపడితే, 104.50 వరకు చేరుకోవచ్చు. ఈ పరిణామం పసిడి ధరలపై మరింత ఒత్తిడిని పెంచుతుంది'' అని మిరే అసెట్‌ షేర్‌ఖాన్‌ కమోడిటీ హెడ్‌ ప్రవీణ్‌ సింగ్‌ తెలిపారు. వెండి కూడా 3.56% నష్టపోయి చేసి 50.19 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

దేశీయంగా పసిడి ధర వరుసగా మూడో రోజూ తగ్గుముఖం పట్టింది. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9% స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ.2,200 పతనమై రూ.1,43,400కి చేరుకుంది. కాగా కేజీ వెండి ధర ఎలాంటి మార్పు లేకుండా రూ.1,87,500 వద్ద ముగిసింది.

డాలర్‌ మారకంలో రూపాయి విలువ 41 పైసలు బలహీనపడి ఇంట్రాడే కనిష్ట స్థాయి 94.12 వద్ద ముగిసింది. ఫెడరల్‌ రిజర్వ్‌ కఠినతర ద్రవ్య విధాన వైఖరి వాఖ్యలతో డాలర్‌ బలపటడం, డిసెంబర్‌లో ఆర్‌బీఐ మరో పావు శాతం రెపో రేటు పెంపు ఖాయమనే సంకేతాలతో దేశీయ కరెన్సీ కరిగిపోయిందని ఫారెక్స్‌ ట్రేడర్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement