పారిశ్రామిక దిగ్గజం హర్ష్ గోయెంకా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ..తన అభిమానులతో పలు స్ఫూర్తిదాయక విషయాలను పంచుకుంటుంటారు. అలానే ఈసారి సరికొత్త వీడియోతో మన ముందుకు వచ్చారు. ప్లీజ్ పిల్లలను అలా పెంచొద్దంటూ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఆ వీడియోని పంచుకుంటూ..పోస్టులో ఇలా రాసుకొచ్చారు. మనం పిల్లలను అసౌకర్యాన్ని తట్టుకోలేని విధంగా పెంచుతున్నామని అన్నారు. తల్లిదండ్రులుగా జీవితానికి సిద్దం చేయడమే మన పని తప్ప జీవితాన్ని సుఖవంతం చేయడం కాదని అన్నారు.
పిల్లలు విసుగు చెందినా, ఆటలో ఓడిపోయినా, ఉపాధ్యాయుడి చేత మందలించబడినా లేదా స్నేహితుడితో విభేదించినా తల్లిదండ్రులు కొన్నిసార్లు ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఎలా తొదరపడతారో ఆ వీడియో హైలెట్ చేస్తోంది. తమ పిల్లలు జీవితాల నుంచి ప్రతి కష్టాన్ని తొలగించే ప్రయత్నంలో తల్లిదండ్రులు వాళ్లను సవాళ్లను ఎదుర్కోవడం ఎలానో నేర్చుకోకుండా చేస్తున్నారని అన్నారు.
ఇలా మనం వాళ్లకు అన్ని సౌకర్యాలు, కంఫర్ట్‌లు ఇస్తూ కష్టం తెలియకుండా పెంచితే..రేపు పెద్దయ్యాక ఉద్యోగం చేస్తున్నప్పుడూ తన పై అధికారి నుంచి ఎదురైన విమర్శను ఎలా ఎదుర్కొంటాడని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇంటర్వ్యూలో ఎదురైన తిరస్కరణలు, స్నేహితుడి నుంచి ఎదురై అవమానం లేదా మోసాలను ఎలా తట్టుకుంటాడు అని ఆ వీడియోలో ఒక వ్యక్తి అడుగుతుండటం స్పష్టంగా చూడొచ్చు. పిల్లలను సంరక్షించే ప్రయత్నంలో మనం జీవితానికి సిద్దం చేసేలా పెంచడంలో విఫలమవుతున్నామని ఎత్తి చూపారు హర్ష్ గోయెంకా
ప్రేమ అంటే ఎల్లప్పుడూ వాళ్లకెదురైనా సమస్యలను తక్షణమే పరిష్కరించడం కాదని, వారి మాట వినడం, మద్దతు ఇవ్వడం, తమ సమస్యను తామే పరిష్కరించుకోగలిగే అవకాశాన్ని ఇవ్వడం అని అన్నారు. పిల్లలకు తప్పకుండా సహనం, దృఢత్వం, నిరాశను తట్టుకునే సామర్థ్యాన్ని నేర్పించాలని తల్లిదండ్రులకు హర్ష్ గోయెంకా సూచించారు. ఇది నిజ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, సందర్భాలకు ఎలా స్పందించి, తట్టుకుని నిలబడాలో నేర్పిస్తుందని అన్నారు.
నెటిజన్లు కూడా నిజం సార్ కరెక్ట్‌గా చెప్పారు..వాస్తవికతను అర్థం చేసుకునేలా పెంచాలి, తేలికగా తీసుకోకూడదని నేర్పాలని అన్నారు. పేరెంట్స్ అతి జాగ్రత్తగా కంటే..ధైర్యం, సహనం, నిరాశ వంటి వాటి గురించి పరిచయం చేస్తూ ..దృఢంగా ఉండేలా పిల్లలను పెంచాలంటూ పోస్టులు పెట్టారు
We are raising children who are increasingly unfamiliar with discomfort. As parents, our job is to prepare them for life, not make life comfortable for them. https://t.co/j5wNdbCKBS
— Harsh Goenka (@hvgoenka) November 28, 2026
ఇదీ చదవండి: అల్లరితోనే ఆరోగ్యం!


