న్యూఢిల్లీ: డీలిమిటేషన్ బిల్లుకు వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. గతంలో కూడా తాము ఈ బిల్లుకు మద్దతు తెలిపామని, మరోసారి అదే వైఖరిని పునరుద్ఘాటించామన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలు ఉన్నా, 50 శాతం పెంపుతో ఆ సంఖ్య 38కి చేరుతుందన్నారు. రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల మధ్య రాజకీయ ప్రాతినిధ్యంలో సమతుల్యత ఉండాలని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. డీలిమిటేషన్‌తో దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందన్న ఆందోళన అవసరం లేదన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచుతామని బిల్లులో స్పష్టంగా చెప్పారన్నారు. డీలిమిటేషన్ బిల్లుపై రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.


