Delimitation
-
50 శాతం ఫార్ములాతో దక్షిణాదికి మేలు
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 50 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా 1996 సెప్టెంబర్ 13న మహిళా ఎంపీలందరూ పార్టీలకతీతంగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఏకతాటిపైకి వచ్చారు. లోక్‌సభలో ఈ విషయంపై గళమెత్తారు. మహిళా బిల్లును జాయింట్ కమిటీకి పంపడంపై దివంగత నేత సుష్మా స్వరాజ్ ‘దేశ మహిళలపై జరిగిన భారీ కుట్ర’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బిల్లును జాయింట్ కమిటీకి పంపి వెంటనే లోక్ సభను రద్దు చేశారు. దీంతో మళ్లీ మహిళా బిల్లు పార్లమెంటు ముందుకు రావడానికి 27 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. మోదీ ప్రభుత్వం 2023లో ‘నారీశక్తి వందన్ అధినియం’ బిల్లు తీసుకొచ్చింది. 2034 నాటికి రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉండగా, 2029 నాటికే మహిళలకు హక్కులు కల్పించాలనే సదుద్దేశంతో ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి, రాజ్యాంగ సవరణ తీసుకురావాలని మోదీ ప్రభుత్వం చూసింది. కానీ, స్వార్థ రాజకీయ కుట్రల వల్ల దేశ జనాభాలో 50%గా ఉన్న మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించి, డీలిమిటేషన్ ద్వారా మరిన్ని ఎక్కువ సీట్లలో పోటీచేసే అవకాశం చేజారింది. మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ఈ రెండు చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగినవి. మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించడం, ప్రాంతీయ సమతుల్యతను కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలపరచడం– ఇవి రెండూ దేశ భవిష్యత్తును నిర్ధారించే కీలకమైన అంశాలు.దాదాపు 3 దశాబ్దాలుగా ఈ బిల్లును తీసుకురావాలని, మహిళా లోకానికి సాధికారత కల్పించాలని చర్చోపచర్చలు జరుగుతున్నప్పటికీ, కాంగ్రెస్, వారి మిత్రపక్షాలు దీన్ని అడ్డుకున్నాయి. 1996లో దేవేగౌడ హయాంలో... ఆ తర్వాత 1998, 1999, 2002లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఈ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంది. ఎన్డీయే ఒత్తిడితో యూపీఏ హయాంలో 2008–10 మధ్యలో ఈ బిల్లును ప్రవేశపెట్టినా, తమ మిత్రపక్షాలతో కలిసి ముందుకు సాగకుండా చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది. అనవసర దుష్ప్రచారండీలిమిటేషన్పై చర్చలు మొదలైనప్పటినుంచే, విపక్షాలు దక్షిణాదిపై ఎక్కడలేని ధృతరాష్ట్ర ప్రేమను కురిపించాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే... తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని గగ్గోలు పెట్టాయి. కాంగ్రెస్ ఆడిన ఈ నాటకానికి డీఎంకే, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు వంతపాడాయి. దక్షిణాదికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనీయమని ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే చెప్పినా దుష్ప్రచారం ఆగలేదు.అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న సీట్లకు 50% సీట్లు పెంచేందుకు తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్లును కేంద్రం ప్రత్యేక పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న 129 సీట్లు 50% పెరిగి 195 సీట్లకు చేరే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 సీట్లు 26కు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 స్థానాలు 38కి పెరిగేందుకు వీలుండేది. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న 39 సీట్లు 59కి, కర్ణాటకలో 28 నుంచి 42కు, కేరళలో 20 నుంచి 30కి సీట్లు పెంచేలా మోదీ సర్కారు సరికొత్త ఫార్ములాను రూపొందించింది. దీని ద్వారా దక్షిణాది సీట్లకు ‘జనాభా ప్రాతిపదికన’ నష్టం జరగకుండా, ఆ మాటకొస్తే ప్రత్యేకమైన లాభం జరిగేలా ఈ ఫార్ములా మేలు చేకూర్చేది. దీనివల్ల ఆ యా పార్టీలకు ఏం ఒరిగిందో తెలియదు కానీ... 70 కోట్ల మంది మహిళలకు, 30 కోట్ల మంది దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు మాత్రం అన్యాయం జరిగింది. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యాన్ని మరింతగా పెంచే అవకాశాన్ని కూడా కాంగ్రెస్, వారి మిత్ర పక్షాలు దెబ్బకొట్టాయి. ప్రస్తుతం దక్షిణాదిలో ఎస్సీలకు 21 స్థానాలు, ఎస్టీలకు 5 స్థానాలు రిజర్వేషన్లుండగా... 50% సీట్లను పెంచితే, ఎస్సీలకు 32 స్థానాలు, ఎస్టీలకు 8 స్థానాలు దక్కేందుకు వీలుండేది. అలాచేస్తే దక్షిణాదికి నష్టంమహిళా బిల్లు విషయంలోనే కాదు, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాల విషయాల్లోనూ కాంగ్రెస్ ఇలాగే వ్యవహరించింది. ట్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు, ముస్లిం మహిళలకు న్యాయం జరుగుతుందని తెలిసినా వ్యతిరేకించింది. ఆర్టికల్ 370 రద్దు చేసి దేశ సమగ్రతను బలపరిచే ప్రయత్నం చేసినప్పుడూ వ్యతిరేకించింది. రైతుల అభివృద్ధి కోసం తెచ్చిన సంస్కరణలను రాజకీయ కారణాలతో వ్యతిరేకించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్థంలేని కొత్త ఫార్ములాను తీసుకొచ్చారు. దీని ప్రకారం... తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 సీట్లు 15కు తగ్గుతాయి. ఇది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయం. రేవంత్ రెడ్డి ఫార్ములా ప్రకారం తెలంగాణే కాదు, దక్షిణాది రాష్ట్రాలన్నీ నష్టపోతాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన కాకుండా, ఈ ఫార్ములా ప్రకారం... ఏపీ 16 సీట్లు, తెలంగాణ 11 సీట్లు, కర్ణాటక 16 సీట్లు, కేరళ 16 సీట్లు, తమిళనాడు 27 సీట్లు... ఇలా మొత్తం దక్షిణాది రాష్ట్రాలు 86 సీట్లు నష్టపోనున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలు. దక్షిణాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మహిళలు చైతన్యవంతులు. చాలా సందర్భాల్లో ఇది నిరూపితమైంది. మహిళల గౌరవం, దేశ సమగ్రత, దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి అడ్డుకట్ట వేసిన పార్టీలు చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయం. జి.కిషన్ రెడ్డివ్యాసకర్త కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి -
దక్షిణాదికి ద్రోహం చేసిన విపక్షాలు
‘‘నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. ఇది ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడానికీ, ప్రతి పౌరుడి ఓటుకు సమాన విలువను కల్పించడానికీ ఉద్దేశించినది. జనాభా మార్పులకు అనుగుణంగా ప్రజల గొంతుక పార్లమెంటులో బలంగా వినిపించాలంటే డీలిమిటేషన్ అవసరం. ఏ ఒక్క రాష్ట్రానికి, ముఖ్యంగా జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వబోం. సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతూనే, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యం.’’ పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేసిన స్థిర సంకల్పం ఇది. కానీ ఏం జరిగింది? మోదీని ఓడించామన్న వికృతానందం కోసం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలు ఓడించాయి. వారు చెప్పింది దక్షిణాదికి అన్యాయం జరగకుండా చేశామని! వాస్తవంలో దక్షిణాదికి అన్యాయం చేశారు. జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరిగితే దారుణంగా నష్టపోయేది దక్షిణాదినే. ఏ మాత్రం నిష్పత్తి తగ్గకుండా, పార్లమెంట్ సీట్లు పెంచే 50 శాతం ఫార్ములాను కాలదన్నిన కాంగ్రెస్ తీరుతో దక్షిణాది సమస్యలను ఎదుర్కోబోతోంది. భారతదేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేయగల ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు గతంలోనే పార్లమెంటులో ఆమోదం పొందింది. ఇప్పుడు మళ్లీ ఎందుకని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆనాటి బిల్లులో లోక్‌సభ సీట్ల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ఉంది. అప్పటివరకూ ఆగకుండా ముందుగానే దక్షిణాదికి న్యాయం చేస్తూ డీలిమిటేషన్ ద్వారా 2029లోనే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే నియోజకవర్గాల పునర్విభజన అనివార్యమని చట్టం చెబుతోంది. ఈ ప్రక్రియను వివాదాస్పదం చేయడం ద్వారా విపక్షాలు దక్షిణాది గొంతు కోస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సంక్షోభంలో ప్రాతినిధ్య వ్యవస్థభారత ప్రజాస్వామ్య సౌధానికి పునాది వంటి ప్రాతినిధ్య వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 1973లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా ఖరారైన 543 లోక్‌సభ స్థానాల సంఖ్యను నాటి 54.8 కోట్ల జనాభా అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. అప్పట్లో సగటున ప్రతి 10 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించేవారు. గత ఐదు దశాబ్దాల్లో దేశ జనాభా దాదాపు మూడు రెట్లు పెరిగి 145 కోట్లకు చేరుకున్నా, పార్లమెంటులోని సీట్ల సంఖ్య స్తబ్ధుగా ఉండిపోయింది. దీనివల్ల నేడు ఒక్కో ఎంపీ సుమారు 26.70 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించాల్సి వస్తోంది. ప్రపంచంలోని మరే ఇతర ప్రజాస్వామ్య దేశంలోనూ ఒక ప్రజా ప్రతినిధిపై ఇంతటి జనాభా భారం లేదు. ఇది ఓటరుకు, ప్రతినిధికి మధ్య ఉండాల్సిన సాన్నిహిత్యాన్ని తగ్గించడమే కాకుండా, ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని కూడా నీరుగారుస్తోంది. 1976లో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సీట్ల సంఖ్యను 2001 వరకు మార్చకూడదని స్తంభింపజేశారు. జనాభా నియంత్రణ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాలు నష్టపోకూడదనేది నాటి ప్రధానఉద్దేశ్యం. ఆ తర్వాత 2002లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ గడువును మరో 25 ఏళ్లు పొడిగించి 2026 వరకు మార్చకూడదని నిర్ణయించారు. ఈ సుదీర్ఘ కాలంలో అనేక కొత్త జిల్లాలు, పట్టణాలు రూపుదిద్దుకున్నా, నియోజకవర్గాల సరిహద్దులు పెరిగిన జనాభాకు అనుగుణంగా విస్తరించకపోవడం వల్ల ఓటు విలువలో భారీ వ్యత్యాసాలు తలెత్తాయి. ఒక నియోజకవర్గంలో 15 లక్షల మంది ఓటర్లు ఉంటే, మరో చోట 30 లక్షల మంది ఉండటం ప్రాతినిధ్య సమానత్వానికి విరుద్ధం. ఈ స్తబ్ధతను బద్దలు కొట్టాల్సిన చారిత్రక ఆవశ్యకత ఏర్పడింది. 2026తో ఈ గడువు ముగియనుండటంతో, కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన అనివార్యం. ఇది సీట్ల పెంపు మాత్రమే కాదు, ప్రజాస్వామ్య పునర్నిర్మాణ ప్రక్రియ.దక్షిణాదికి న్యాయం జరగాలంటే...మహిళా రిజర్వేషన్లు చట్టసభల్లో ఆమోదం పొందితే సరిపోదు. అవి క్షేత్రస్థాయిలో ఆచరణాత్మకంగా అమలు కావాలంటే శాస్త్రీయమైన పునర్విభజన ప్రక్రియ కీలకం. రాజ్యాంగంలోని 128వ సవరణ స్పష్టంగా చెబుతున్నట్లుగా, ఈ రిజర్వేషన్లు అమల్లోకి రావాలంటే ముందుగా జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి కావాలి. ఆ తర్వాతే డీలిమిటేషన్ కమిషన్ నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించాలి. ఏయే నియోజకవర్గాలను మహిళలకు రిజర్వ్ చేయాలి, వాటిని రొటేషన్ పద్ధతిలో ఎలా మార్చాలి అనే అంశాలు ఊహాజనితంగా కాకుండా, జనాభా లెక్కల ఆధారంగానే జరగాల్సి ఉంటుంది. ఈ క్రమానుగత ప్రక్రియను విస్మరించి రిజర్వేషన్లు అమలు చేయాలని చూడటం రాజ్యాంగబద్ధమైన చిక్కులకు దారితీస్తుంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లోనే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే విపక్షాల వాదన ఆకర్షణీయంగా అనిపించినా, అది ఆచరణలో సమస్యలను సృష్టిస్తుంది. భారత సమాఖ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య సమతుల్యతను కాపాడటం, జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన రాష్ట్రాల ప్రయోజనాలను రక్షించడం ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాలు. ప్రస్తుతం మన పార్లమెంటులో సీట్ల కేటాయింపు 1971 జనాభా లెక్కల ఆధారంగా జరుగుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం, కేవలం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే, అది దక్షిణాది రాష్ట్రాల పాలిట రాజకీయ మరణ శాసనంగా మారుతుందనడంలో సందేహం లేదు. జనాభా విస్ఫోటనాన్ని అరికట్టడంలో విఫలమైన రాష్ట్రాలకు పార్లమెంటులో అధిక సీట్లు కేటాయించడం అంటే, క్రమశిక్షణతో వ్యవహరించిన దక్షిణాదిని శిక్షించడమే అవుతుంది. ఈ అసమానతను తొలగించడానికి 50 శాతం పెంపు ఫార్ములా ఏకైక పరిష్కార మార్గం. ఈ విధానం ప్రకారం, జనాభా పెరుగుదలతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సీట్లను నేరుగా 50 శాతం పెంచుతారు. దీనివల్ల రాష్ట్రాల మధ్య పొలిటికల్ రేషియో ఏమాత్రం మారదు. జనాభా లెక్కల ప్రకారం వెళ్తే తీవ్రంగా నష్టపోయే ఆంధ్రప్రదేశ్ (+13), తెలంగాణ (+9), తమిళనాడు (+20), కర్ణాటక (+14), కేరళ (+10) రాష్ట్రాలకు ఈ ఫార్ములా ద్వారా గణనీయమైన అదనపు సీట్లు లభిస్తాయి. ఇది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అస్తిత్వానికి అసలైన రక్షణ కవచం. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కావాలన్నా ఈ పునర్విభజన ప్రక్రియ పూర్తి కావడం సాంకేతికంగా అవసరం. సీట్ల సంఖ్యను పెంచకుండా రిజర్వేషన్లు అమలు చేస్తే అది మరిన్ని చిక్కులకు దారితీస్తుంది. సీట్ల సంఖ్యను పెంచి, అందులో మహిళలకు సీట్లు కేటాయించడం ద్వారా అందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తర్కాన్ని అర్థం చేసుకోకుండా రాజకీయ విద్వేషంతో విపక్షాలు పునర్విభజనను అడ్డుకున్నాయి. జనాభా నియంత్రణ అనే దేశభక్తిని పాటించినందుకు దక్షిణాదికి రాజకీయ శిక్ష పడకుండా అడ్డుకోవాల్సిన చారిత్రక బాధ్యతను కాంగ్రెస్, డీఎంకే లాంటి పార్టీలు విస్మరించాయి.ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి వ్యాసకర్త బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు -
బిల్లు వీగిపోవడమంటే బీజేపీ ఓడిపోవడమే: రేవంత్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: విపక్షాల ఐక్యతతో కేంద్రం ఓడిపోయిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిన్న సవరణతో మహిళా రిజర్వేషన్లు పెంచవచ్చు. సీట్లు పెంచడానికి మహిళా రిజర్వేషన్లు ముసుగు వేశారని మండిపడ్డారు. బీజేపీ విధానాలకి ఓటమి ఇది అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘దక్షిణ భారతానికి జరిగే అన్యాయాన్ని అడ్డుకున్నాం. మహిళా బిల్లు చాటున డీలిమిటేషన్ బిల్లును తెచ్చారు. ఎన్డీయే నిజాయితీగా బిల్లును తీసుకురాలేదు. బిల్లు వీగిపోవడం అంటే బీజేపీ ఓడిపోవడమే. బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని కాలరాయాలని చూసింది. ప్రధాని మోదీ కుట్రలను కాంగ్రెస్ సమర్థవంతంగా అడ్డుకుంది. దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలను కాంగ్రెస్ ఎండగట్టింది. ఇది రాజకీయ విధానాల ఓటమి కాదు.. బీజేపీ విధానాల ఓటమి. రాజ్యాంగం మార్చడానికి, రిజర్వేషన్లు రద్దు చేసేందుకు అబ్ కీబార్ చార్ సౌ అన్నారు బీజేపీకి 400 సీట్లు ఇచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేవారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువస్తే రేపే మద్దతు ఇస్తాం. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ కోటా పెట్టాలి. హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ జరగాలి అని వ్యాఖ్యలు చేశారు. 2023 మహిళా బిల్లును యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎంతో మంది మహిళా నేతలను కాంగ్రెస్ తయారుచేసింది’ అని చెప్పుకొచ్చారు. -
లోక్ సభలో రచ్చ రచ్చ.. డీలిమిటేషన్ తో సౌత్ కి నిజంగా నష్టమేనా
-
విపక్షాలు శిక్ష అనుభవించక తప్పదు: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు పెద్ద తప్పు చేశాయని అన్నారు. శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు పెద్ద తప్పు చేశాయి. కోట్ల మంది మహిళలకు విపక్షాలు సమాధానం చెప్పాలి. రాబోయే రోజుల్లో ఆ పార్టీలు శిక్ష అనుభవించక తప్పదు’’ అని అన్నారు. పండుగ చేసుకుంటున్నారా?: కిరణ్ రిజిజుమహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవడం ఘోరమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. కాంగ్రెస్‌తో పలుమార్లు సంప్రదింపులు జరిపాం. అయినా అడ్డుకున్నారు. మహిళా బిల్లును అడ్డుకుని పండుగ చేసుకోవడం దుర్మార్గం. ఈ బిల్లు ఎలా అప్రజాస్వామికమో రాహుల్ గాంధీ చెప్పాలి అని కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. మూడు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన కేంద్రం.. మహిళా రిజర్వేషన్లతో పాటు డీలిమిటేషన్ సంబంధిత మొత్తం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే శుక్రవారం సాయంత్రం రాజ్యాంగ సవరణ-131పై లోక్‌సభలో ఓటింగ్ జరగ్గా మెజారిటీ చేరుకోలేక ఆ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. మహిళా రిజర్వేషన్లకు తాము ఏమాత్రం వ్యతిరేకం కాదని.. ఎన్డీయే ప్రభుత్వం రాజకీయానికి దిగిందని.. డీలిమిటేషన్ అంశాన్ని ఈ రిజర్వేషన్లతో ముడిపెట్టడంతోనే ఓడించామని విపక్షాలు చెబుతున్నాయి. అయితే డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగదని.. మహిళా రిజర్వేషన్ల విషయంలో తాము చిత్తశుద్ధితోనే వ్యవహరించామని ఇటు కేంద్రం అంటోంది. -
మోదీకి బిగ్ షాక్.. పార్లమెంట్ లో ఎదురుదెబ్బ..
-
జనగణన పూర్తి కాకుండానే డీలిమిటేషన్ బిల్లు.. దక్షిణాదికి జరిగే నష్టం ఇదే!
-
లోక్‌సభలో గట్టెక్కని మహిళా బిల్లు... అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు... మూడింట రెండొంతుల మెజారిటీ సాధనలో మోదీ సర్కారు విఫలం
-
గెలవదని తెలిసే బిల్లు విషయంలో ముందుకెళ్లారా?
-
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టమా?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టమా? పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై లోక్‌సభలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. అయితే.. ఈ డీలిమిటేషన్‌తో రాష్ట్రాలకు నష్టమా? రాష్ట్రాల మధ్య వివాదాలు జరుగుతాయా? దీనిపై పాలిటీ విశ్లేషకుడు, యూపీఎస్సీ సివిల్స్, పోటీ పరీక్షల మెంటార్ మెన్నేని సంతోష్‌రావు వివరణ లైవ్‌లో మీకోసం.. -
LIVE: డీలిమిటేషన్ తో... రాష్ట్రాల మధ్య యుద్ధం .?
-
‘నోటి మాటగా కాదు.. చట్టంలో పెట్టాల్సిందే’
న్యూఢిల్లీ: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు తాము మద్దతిస్తామని, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెరగాలన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. ఈరోజు(శుక్రవారం, ఏప్రిల్ 17వ తేదీ) డీలిమిటిషన్, మహిళా రిజర్వేసన్ బిల్లులపై లోక్‌సభలో చర్చ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ డీలిమిటేషన, మహిళా రిజర్వేషన్ బిల్లులకు మేం మద్దతిస్తాం. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెరగాలి. డీలిమిటేషన్ ప్రక్రియలో అన్ని పార్టీలకు సమాన భాగస్వామ్యం ఇవ్వాలి. రాష్ట్రాల్లో ప్రాంతీయ అసమానతలు లేకుండా సీట్ల సంఖ్య పెంచాలి. ప్రతి రాష్ట్రంలో కచ్చితంగా 50 శాతం సీట్లు పెంచే విషయం చట్టంలో పెట్టాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ఇది కేవలం నోటి మాటగా చెప్తే మేం అంగీకరించం. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్లో చెప్పిన మాటలు అమలు కాలేదు’ అని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. -
డీలిమిటేషన్.. ఢిల్లీలో బీసీ సంఘాల మెరుపు ధర్నా
సాక్షి, ఢిల్లీ: కులగణన తర్వాతనే డీలిమిటేషన్ చేపట్టాలని ఢిల్లీలో బీసీ సంఘాలు మెరుపు ధర్నా నిర్వహించాయి. డీలిమిటేషన్ పత్రాలను చింపివేసి బీసీ నేతలు నిరసనలు తెలిపారు. డీలిమిటేషన్ వల్ల బీసీలకు ఎలాంటి ప్రయోజనం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి అన్నారు. పెంచిన అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు మహిళల పేరుతో మళ్లీ అగ్రకులాలకు దక్కుతాయన్నారు.దేశవ్యాప్తంగా బీసీ కులగణన పూర్తి చేసి జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలి. మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్ కోట కల్పించాలి. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తాo’’ అని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.బీసీలు బీజేపీని క్షమించరు: మాజీ ఎంపీ వీహెచ్బీసీ ప్రధాని అయి ఉండి బీసీలకే మోదీ ద్రోహం చేస్తున్నారు. మహిళా బిల్లులో బీసీ సబ్ కోట కల్పించకపోతే బీసీలు బీజేపీని క్షమించరు. బీజేపీ బీసీలకు చేస్తున్న మోసంపై ఊరూరా తిరిగి చెప్తాo పోరాడతాం: బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్మహిళా బిల్లు పేరుతో బీసీలను రాజకీయంగా తొక్కి పెట్టాలని చూస్తున్నారు. దేశంలోని 40 కోట్ల మంది బీసీ మహిళల అక్రందనను కేంద్రం పట్టించుకోవడం లేదు. స్థానిక సంస్థలలో లాగానే చట్టసభల్లో కూడా బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచకుండా డీలిమిటేషన్ చట్టం చేస్తే ఉపయోగం లేదు. బీసీ హక్కుల కోసం బీసీ సంఘాలతో కలిసి దేశవ్యాప్తంగా పోరాడతాంబీసీలంటే పార్టీలకు చిన్న చూపు: శంకర్రావుదేశంలో బీసీలను పట్టించుకునే నాధుడే లేడు. బీసీలు అంటే అన్ని పార్టీలకు చిన్న చూపు. బీసీల ఓట్ల మీద ఉన్న ప్రేమ సీట్ల మీద లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలను చేర్చకపోతే కేంద్రంపై తిరగబడతాం -
సొంత పార్టీ నేతలపై రాఘవ్ చద్దా సెటైర్లు
ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై చర్చ కొనసాగుతోంది.అయితే, ఈ కీలక బిల్లలుపై చర్చ జరిగే సమయంలో సొంత పార్టీ నేతల గైర్హాజరుపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా సెటైర్లు వేశారు.రాజ్యసభ ఉపనాయకుడి పదవి నుంచి నన్ను తొలగించారు. అయినా సరే మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై చర్చ జరుగుతుంటే సభకు నేను హాజరయ్యాను. మరి వాళ్లద్దరేరి అంటూ ఆప్ పార్టీ ప్రతినిధి, పార్టీ నూతన రాజ్య సభ ఉపనాయకుడిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. నా పార్టీకి చెందిన నాయకుడు, నా స్థానంలో కొత్త నియమితులైన ఉప నాయకుడు కూడా సభలో లేరు. ఆప్ ఇటీవల తొలగించబడిన ఉప నాయకుడిని నేను. నేను సభలోనే ఉన్నాను. నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని అన్నారు. రాజ్యసభలో ఆప్ ఉప నాయకుడి పదవి నుంచి చద్దాను ఇటీవల తొలగించడంతో పాటు, సభలో ఆయన మాట్లాడే సమయాన్ని కూడా పార్టీ తగ్గించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ నిర్ణయంపై పార్టీలో విభేదాలు ఉన్నాయన్న ఊహాగానాలకు ఈ పరిణామం ఆజ్యం పోసింది. -
ఆ బిల్లులకు వైఎస్సార్సీపీ మద్దతు
ఢిల్లీ: మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులకు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. నియోజకవర్గాల పెంపుపై ప్రభుత్వం చెబుతున్న విషయాలు లిఖితపూర్వకంగా బిల్లులో పెట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రాంతీయ వ్యత్యాసాలు లేకుండా చూడాలని.. అన్ని పార్టీలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలని కోరారు. డీలిమిటేషన్ ప్రక్రియ విపక్షాలను అణచివేసేదిగా ఉండకూడదన్నారు.మహిళా రిజర్వేషన్‌కు సంపూర్ణ మద్దతిస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. సంక్షేమ పథకాలన్నీటిని మహిళలకు భాగస్వామ్యం కల్పించారు. ఇళ్ల పట్టాలు మహిళల పేర్లతోనే ఇచ్చారు. నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తూ పట్టుబడ్డారు. అసభ్యకరమైన వీడియోలు బయటపడ్డాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫిర్యాదు చేసిన మహిళపైనే కేసులు పెడుతున్నారు. మహిళలను వేధిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి. సూత్రప్రాయంగా ఈ బిల్లులను అంగీకరిస్తున్నాము. కానీ, మేము లేవనెత్తిన అన్ని అంశాలను ప్రభుత్వం నివృత్తి చేయాలి’’ అని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. -
‘ఇదో ట్రాప్.. మోదీ, అమిత్ షా హామీలను నమ్మలేం’
సాక్షి, చెన్నై: నియోజకవర్గాల పునర్విభజన బిల్లు విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి సంచలన ఆరోపణలకు దిగారు. ఈ బిల్లు తమిళనాడు ఉనికినే దెబ్బతీసేలా ఉందని అన్నారు. డీలిమిటేషన్‌పై మొదటి నుంచి ఆయన కేంద్రంపై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకవేళ బిల్లు పాస్ అయితే గనుక న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని అంటున్నారాయన.‘‘లోక్‌సభ సాక్షిగా మోదీ, అమిత్ షా ఇచ్చిన హామీలను నమ్మలేం. నోటి మాటతో కాదు.. చట్ట సభల్లో రక్షణ కల్పించాలి. చట్ట సవరణ పేరుతో కొత్త కుట్రలు.. రాష్ట్రాల హక్కులు కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే కమిషన్‌కు అపరిమిత అధికారాలు కట్టబెట్టారు. ఇది రాజకీయ వ్యూహమే తప్ప.. దేశ ప్రయోజనం కోసం ఎంతమాత్రం కాదు. ..తమకు కావాల్సిన రాష్ట్రాల్లో సీట్లు పెంచుకోవడమే వాళ్ల ఉద్దేశం. ఇది దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నంలో భాగంగా జాగ్రత్తగా వేసిన ఓ ఉచ్చు. జనాభా నియంత్రణ పాటించే ఇక్కడి రాష్ట్రాలకు శిక్షలా ఉంది. మెజారిటీ ఉందని ఏది పడితే అది చేయడం సరికాదు. ఈ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం ఆగదు’’ అని స్టాలిన్ ఉద్ఘాటించారు.డీలిమిటేషన్‌ను మహిళా రిజర్వేషన్ల బిల్లు ముసుగులో చేస్తున్నారని కేంద్రంపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీని వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాదిస్తున్నారు. అయితే.. కేంద్రం మాత్రం ఎలాంటి అన్యాయం జరగదని.. తమది భరోసా అని చెబుతోంది. పైగా డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు 125 నుంచి 195కి చేరతాయి అని బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. రాజ్యాంగ సవరణతో కూడిన ఈ బిల్లు పాస్ కావాలంటే సభలో 2/3 మెజారిటీ అవసరం. అంటే.. 360కి అవసరంకాగా ఎన్డీయే బలం 294నే ఉంది. ఇంకో 66 సీట్లు అవసరం. దీంతో మోదీ సర్కార్ ఎలా గట్టెక్కుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
రేవంత్ హైబ్రిడ్ ఫార్ములా.. ఎంఐఎం ప్లాన్: కిషన్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: డీలిమిటేషన్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్‌పై తెలంగాణ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. మహిళల రిజర్వేషన్లకు మజ్లిస్ వ్యతిరేకం అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా.. అసదుద్దీన్ చెప్పినది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘డీలిమిటేషన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. నార్త్, సౌత్ మధ్య యుద్ధం వస్తుందని మాట్లాడుతున్నారు. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు సమ న్యాయం చేస్తామని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు. రెవెన్యూ ఎక్కువగా వస్తుందని హైదరాబాద్‌లోనే రేవంత్ అసెంబ్లీ సీట్లు పెంచుతారా?. డబ్బు ఎక్కువగా ఉన్న వారికి ఎక్కువ ఓటు విలువ ఇస్తారా? అని ప్రశ్నించారు.మహిళల రిజర్వేషన్లకు మజ్లిస్ వ్యతిరేకం. హైదరాబాద్‌లో తమ సీట్లు పోతాయని మజ్లిస్ భయం. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కుమ్మకై తెలంగాణలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తన ఫార్ములాను రేవంత్ రెడ్డి ద్వారా అసదుద్దీన్ చెప్పించారు. నియోజకవర్గాలు పెరిగితే మహిళలు, యువతకు కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త నాయకత్వం వస్తే తమ పీఠాలు కదులుతాయని మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ సహా విపక్షాలు అడ్డుకుంటున్నారు. ఎంఐఎం మహిళలకు వ్యతిరేక రాజకీయాలు చేస్తోంది. మహిళా రిజర్వేషన్‌కు అడ్డుపడాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ను ఎంఐఎం కలిపింది. మహిళలను అనగదొక్కే పార్టీ మజ్లిస్ పార్టీ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీ రాజకీయ పార్టీ ప్రధాని మోదీ ఫొటోను వాళ్ల ఆఫీసుల్లో పెట్టుకోవాలి. ఏపీలో లోక్‌సభ సీట్లు 25 నుంచి 38కి పెరుగుతాయి. తమిళనాడులో లోక్‌సభ సీట్లు 39 నుంచి 59కి పెరుగుతున్నాయి. సౌత్‌లో పెరిగినట్టుగానే నార్త్‌లో కూడా లోక్‌సభ సీట్లు పెరుగుతాయి. దేశమంతా ఒకే నిష్పత్తిలో సీట్లు పెరుగుతున్నప్పుడు వచ్చిన నష్టమేంటి?. సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని అడ్డుకోవాలి. గెజిట్ నోటిఫై కాకుండా రాజ్యాంగ సవరణ చేయలేం. అన్ని పార్టీలతో మాట్లాడినప్పుడు ఒప్పుకుని పార్లమెంట్‌కు వచ్చాక అడ్డుకోవడమేంటి? అని ప్రశ్నించారు. -
3 ప్రాంతాల్లోనూ సమానంగా కేటాయించాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: ‘రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సీట్లు సమానంగా ఉండాలి. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో సీట్లను సమానంగా కేటాయించాలి. అప్పుడే డీలిమిటేషన్‌కు సార్థకత ఉంటుంది. సీట్ల పంపకాలు సరిగా జరగకపోతే వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. ఇబ్బందులు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలి..’ అని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు కారణంగా ఏపీలో ఒక్క సీటు తగ్గినా, రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఒప్పుకోబోమని వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఏపీలో ఎంపీ సీట్లు 25 నుంచి 38 స్థానాలకు పెరుగుతాయని కేంద్ర హోంమంత్రి ప్రకటించినప్పటికీ రాష్ట్రంలో మూడు ప్రాంతాలకూ సరైన విధంగా సీట్లు కేటాయింపు జరగకపోతే చూస్తూ ఊరుకోబోమన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్రకు సరైన ప్రాధాన్యత దక్కాల్సిందేనన్నారు. డీలిమిటేషన్ వల్ల రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు డీలిమిటేషన్ బిల్లు, పునర్విభజన కమిషన్ బిల్లులకు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. అనంతరం వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఇతర ఎంపీలు ‘సాక్షి’తో మాట్లాడారు. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని వైఎస్సార్సీపీ ఎంపీలు గుర్తు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని మహిళలకు పెద్దపీట వేశారన్నారు. నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లతోపాటు అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, చేయూత, మహిళల పేరిటే ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు లాంటివి మహిళా సాధికారత, సామాజిక హోదా పెంపునకు దోహదపడ్డాయన్నారు.పొదుపు సంఘాల పునరుజ్జీవం: పీవీ మిథున్‌రెడ్డి‘వైఎస్సార్ ఆసరా/సున్నా వడ్డీ ద్వారా మహిళల రుణాలను మాఫీ చేయడంతోపాటు పొదుపు సంఘాలకు వైఎస్ జగన్ ప్రాణం పోశారు. వైఎస్సార్ చేయూత ద్వారా 45–60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక సహాయం అందించారు. అమ్మఒడి ద్వారా పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌దే. సామాజిక న్యాయంలో భాగంగా మహిళల పేరిటే ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి రికార్డు సృష్టించారు. మహిళల భద్రత కోసం దిశ యాప్ ప్రవేశపెట్టి అండగా నిలిచారు’ అని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఎల్లప్పుడూ మహిళల పక్షపాతి అని గుర్తు చేశారు.మహిళా భద్రతకు పెద్దపీట: ఎంపీ అవినాశ్రెడ్డివైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల్లో 75 శాతం నిధులు మహిళలకే కేటాయించి మహిళా పక్షపాతిగా నిలిచారని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు దిశ యాప్ లాంటి వాటితో మహిళా భద్రతకు పెద్దపీట వేశారన్నారు. జెడ్పీ చైర్పర్సన్, మునిసిపల్ పదవుల్లో 50 శాతానికి పైగా మహిళలకే ఇచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌దేనని గుర్తు చేశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లకు మద్దతు ప్రకటించడమే కాకుండా అన్ని రంగాలలో వైఎస్సార్సీపీ వారిని ప్రోత్సహించిందని తెలిపారు.అన్ని ప్రాంతాల్లో సీట్లు సమానంగా ఉండాలి: వైవీ సుబ్బారెడ్డిరాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సీట్లు సమానంగా ఉండాలి. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో సీట్లను సమానంగా కేటాయించాలి. అప్పుడే డీలిమిటేషన్‌కు సార్థకత ఉంటుంది. మూడు ప్రాంతాల్లో సీట్ల పంపకాలు సరిగా జరగకపోతే వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. ఏ ప్రాంతానికి నష్టం జరగడానికి వీల్లేదు. ఒక ప్రాంతానికి తగ్గించి.. మరో ప్రాంతానికి పెంచితే అనేక ఇబ్బందులను ఎదుర్కొనాల్సిన పరిస్థితులు వస్తాయి. అటువంటి ఇబ్బందులు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది.లక్షల మంది మహిళలకు ఇళ్లు: ఎంపీ గురుమూర్తిరాష్ట్రంలో 33 లక్షల మంది మహిళల ఇంటి కల నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్‌దే అని తిరుపతి ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా గూడు లేక అవస్థ పడుతున్న వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు అందచేసి అండగా నిలిచారన్నారు. మహిళలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో న్యాయం చేసింది జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. మహిళలకు ఎల్లప్పుడూ మంచి చేసే ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. మహిళా రిజర్వేషన్లపై టీడీపీది కపట నాటకమని దుయ్యబట్టారు. టీడీపీ అధిష్టానం మహిళలను గ్యాలరీలో కూర్చోబెట్టి ప్రేక్షక పాత్రకే పరిమితం చేసిందని విమర్శించారు.మహిళలకు పదవులు వైఎస్ జగన్ చలవే: ఎంపీ డాక్టర్ తనూజారాణివైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ మహిళలకు పెద్ద ఎత్తున పదవులు ఇవ్వబట్టే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు మహిళలకు పదవులు ఇచ్చారని అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి చెప్పారు. దళిత మహిళను హోంమంత్రిగా చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కిందన్నారు. తొలిసారిగా మహిళకు ఉపముఖ్యమంత్రి పదవి సైతం జగన్ హయాంలోనే దక్కిందన్నారు. వైఎస్ జగన్ నాడు దళిత మహిళలకు పెద్ద పదవులు ఇచ్చారు కాబట్టే ఆయన చలవతో ఇవాళ హోంమంత్రి పదవిలో దళిత మహిళ ఉన్నారని గుర్తు చేశారు. ఎంపీ బైరెడ్డి శబరి అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో యథేచ్ఛగా మహిళలపై దాడులు జరుగుతుంటే బైరెడ్డి శబరి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రజాప్రతినిధులే మహిళలను లైంగికంగా వేధిస్తుంటే బైరెడ్డి శబరికి కనపటడం లేదా అని నిలదీశారు. సీఎం చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసేందుకే శబరి లోక్‌సభలో ఇష్టానుసారం మాట్లాడారని విమర్శించారు. -
దక్షిణాదిపై కక్షసాధింపే..
సాక్షి, న్యూఢిల్లీ: జనాభా నియంత్రణ పాటించి దేశ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలపై డీలిమిటేషన్ పేరుతో కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. గురువారం లోక్‌సభలో ఆయన మాట్లాడారు. ‘‘దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే కుట్రలో భాగంగానే బీజేపీ సర్కార్ ఈ బిల్లులను తీసుకొచ్చింది. దేశ జీడీపీలో 30 శాతం వాటాతో పాటు అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్న దక్షిణాదికి ఎంపీ సీట్ల కోతతో శిక్ష విధించడం దారుణం. జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు తక్కువ సీట్లు, జనాభా పెంచిన ఉత్తరాదికి ఎక్కువ సీట్లు ఇవ్వడం ఇదెక్కడి న్యాయం?. అస్సాం, జమ్మూకశ్మీర్‌లలో ముస్లింల ప్రాతినిధ్యాన్ని తగ్గించినట్లే ఇప్పుడు దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ కుట్రను అమలు చేసి ముస్లిం ఎంపీలు లేకుండా చేయాలని చూస్తున్నారు. దక్షిణాదికి, మైనార్టీలకు అన్యాయం జరగకుండా జనాభాతో పాటే ఆర్థిక పనితీరుకు కూడా ప్రాధాన్యం ఇస్తూ కెనడా తరహా ‘హైబ్రిడ్ మోడల్’ను అమలు చేయాలి’’ అని ఆయన సూచించారు. -
డీలిమిటేషన్ దంగల్‌కు... రంగం సిద్ధం!
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 నుంచే అమలు చేసేందుకు మోదీ సర్కారు తలపెట్టిన కీలక కసరత్తు నిర్ణాయక దశకు చేరింది. రిజర్వేషన్ల చట్టం సత్వర అమలు, అందుకు వీలుగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు–2026, డీలిమిటేషన్ బిల్లు–2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట (సవరణ) బిల్లు–2026ను కేంద్రం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో వాటి డిమాండ్ మేరకు ఈ అంశంపై డివిజన్ (ఓటింగ్)కు స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. బిల్లుకు అనుకూలంగా 251 ఓట్లు, వ్యతిరేకంగా 185 ఓట్లు వచ్చాయి. అనంతరం మూడు బిల్లులనూ కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌సభ నిబంధన 66లోని ప్రొవైజోను సస్పెండ్ చేసి డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల బిల్లులను ఒకేసారి పరిశీలించి ఆమోదించేందుకు అనుమతివ్వాలంటూ కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ తీర్మానం ప్రవేశపెట్టారు. బిల్లులు రాజ్యాంగ సవరణతో ముడిపడ్డాయి గనుక ఇందుకు అనుమతించాలని కోరారు. స్పీకర్ అనుమతితో బిల్లులపై మొదలైన చర్చ గురువారం అర్ధరాత్రి దాకా సుదీర్ఘంగా సాగింది. బిల్లుకు అనుకూలంగా అధికార, వ్యతిరేకంగా విపక్ష సభ్యుల వాదనలతో సభ హోరెత్తిపోయింది. బిల్లులపై ఓటింగ్‌కు శుక్రవారం సాయంత్రం నాలుగింటికి ముహూర్తం ఖరారైంది. వాటిలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదానికి మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి. మోదీ సర్కారుకు అందుకు అవసరమైన సంఖ్యా బలం లేని నేపథ్యంలో బిల్లు ఎలా గట్టెక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. దాంతో ఓటింగ్‌పై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హోరాహోరీ వాదనలు పార్లమెంటు మూడు రోజుల ప్రత్యేక సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం లోక్‌సభ సమావేశం మొదలవగానే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును విపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించడంతో దానిపై 40 నిమిషాల పాటు తీవ్ర చర్చ జరిగింది. చివరికి డివిజన్ ఓటింగ్ అనంతరం సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. కేంద్రపాలిత ప్రాంతాల చట్ట (సవరణ) బిల్లును హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. తర్వాత చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగొయ్ మోదీ సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. మహిళా రిజర్వేషన్ల సాకుతో లోక్‌సభ స్థానాలను అడ్డదిడ్డంగా పెంచుకుని రాజకీయ లబ్ధి పొందడమే బీజేపీ అసలు లక్ష్యమంటూ మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల నిమిత్తం పార్లమెంటు గతంలోనే చట్టం చేశాక మళ్లీ దానికి మార్పులను ప్రతిపాదించడం వెనక మతలబు ఏమిటని కాంగ్రెస్ సభ్యుడు కె.సి.వేణుగోపాల్ కేంద్రాన్ని నిలదీశారు. రాజ్యాంగ సవరణ బిల్లును ఇతర బిల్లులతో కలిపి చర్చకు చేపట్టరాదంటూ అభ్యంతరం వెలిబుచ్చగా దాన్ని అమిత్ షా తోసిపుచ్చారు. ఒకే అంశానికి సంబంధించిన పక్షంలో వాటిని ఉమ్మడిగా చర్చకు చేపట్టిన ఉదంతాలు గతంలో ఉన్నాయని స్పీకర్ బిర్లా స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి అంతమే! రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు రూపంలో దేశ ప్రజాస్వామ్యంపై మోదీ సర్కారు బాహాటంగా దాడికి దిగిందని కాంగ్రెస్ సభ్యురాలు ప్రియాంకా గాంధీ వద్రా దుయ్యబట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే దేశంలో ప్రజాస్వామ్యమే పూర్తిగా అంతమైపోతుందని అభిప్రాయపడ్డారు. లోక్‌సభ స్థానాలను పెంచకుండా ప్రస్తుత 543 సీట్లకే మహిళా రిజర్వేషన్లను వర్తింపజేయడంలో కేంద్రానికి ఇబ్బందేమిటని ఆమె నిలదీశారు. సవరణ బిల్లు, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని వేణుగోపాల్ ఆరోపించారు. వాటి విషయంలో ఇంత హడావుడి ఎందుకని సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లకు తమ పార్టీ మద్దతిస్తుందని స్పష్టం చేస్తూనే, జనగణన జరుగుతుండగానే ఈ హడావుడి కసరత్తు ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు. బిల్లు ఉద్దేశాలను వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సంక్షిప్తంగా ప్రసంగించారు. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి కూడా మహిళా రిజర్వేషన్లను అమలు చేయకపోతే వారికి తీరని నష్టం జరుగుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలు, లోక్‌సభ స్థానాల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయమూ జరగబోదని స్పష్టం చేశారు. ‘‘బిల్లును వ్యతిరేకించే పార్టీలు పూడ్చుకోలేని విధంగా నష్టపోవడం ఖాయం. అది మాకే లబ్ధి చేకూరుస్తుంది’’ అని అన్నారు. అనంతరం విపక్షాల ప్రసంగాల మధ్యలో అమిత్ షా అప్పుడప్పుడూ జోక్యం చేసుకుంటూ వాటి వాదనలను తిప్పికొడుతూ వచ్చారు. డీలిమిటేషన్ అనంతరం దక్షిణాది రాష్ట్రాల బలం ఇప్పటితో పోలిస్తే మరింత పెరుగుతుందే తప్ప తగ్గబోదని సోదాహరణంగా వివరించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశాక కూడా పురుషులకు గానీ, ఏ రాష్ట్రానికి గానీ ఎలాంటి అన్యాయమూ జరగొద్దనే లోక్‌సభ, అసెంబ్లీల్లో స్థానాలను 50 శాతం మేరకు పెంచుతున్నట్టు వెల్లడించారు. నల్ల దుస్తులతో డీఎంకే మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ డీఎంకే సభ్యులు నల్ల దుస్తులతో సభకు హాజరయ్యారు. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని ఆ పార్టీ సభ్యుడు టి.ఆర్.బాలు డిమాండ్ చేశారు. ప్రతిపాదత బిల్లుల అసలు లక్ష్యం డీలిమిటేషనే తప్ప మహిళా రిజర్వేషన్ల అమలు కాదని ఆరోపించారు. కె.సుబ్బరాయన్ (సీపీఐ), ఎన్.కె.ప్రేమ్‌చంద్రన్ (ఆరెస్పీ) తదితర విపక్ష సభ్యులు మాట్లాడుతూ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. జేడీ(యూ) తదితర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సభ్యులు బిల్లులకు మద్దతుగా మాట్లాడారు. ముహూర్తం... సాయంత్రం 4! మూడు బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్ మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసేందుకు మోదీ సర్కారు ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై శుక్రవారం సాయంత్రం నాలుగింటికి లోక్‌సభ కీలక ఓటింగ్ చేపట్టనుంది. స్పీకర్ ఓం బిర్లా గురువారం సభలో ఈ మేరకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం మోదీ తన చాంబర్లో కీలక భేటీ జరిపారు. అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అధ్యక్షుడు నితిన నబీన్, పలు ఎన్డీఏ పక్షాల నేతలు తదితరులు అందులో పాల్గొన్నారు. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మద్దతు కూడగట్టడంపై వారంతా చర్చలు జరిపారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని కాంగ్రెస్‌తో పాటు పలు కీలక విపక్ష పార్టీలు బుధవారమే ప్రకటించడం తెలిసిందే. అధికార ఎన్డీఏ కూటమికి పార్లమెంటు ఉభయ సభల్లోనూ సొంతంగా మూడింట రెండొంతుల మెజారిటీ లేదు. ఈ నేపథ్యంలో లోక్‌సభలో శుక్రవారం జరిగే ఓటింగ్‌లో బిల్లు ఎలా గట్టెక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. -
దక్షిణాదిలో పెరగనున్న పార్లమెంట్ స్థానాలు ఎన్నంటే : అమిత్‌షా
సాక్షి,న్యూఢిల్లీ: డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగనుందంటూ విపక్షాల ఆరోపణలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కౌంటర్ ఇచ్చారు. బిల్లుతో దక్షిణాదిలో పార్లమెంట్ స్థానాలు 129 నుంచి 195కు పెరుగుతాయి. బిల్లుతో లాభం తప్ప నష్టం జరగదు. బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఈ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు చాలా లాభం. కర్ణాటక, తెలంగాణ బాగా లాభపడతాయి. ఈ బిల్లుతో తెలంగాణలో ఎంపీల సంఖ్య 17 నుంచి 26కు.. ఏపీలో ఎంపీ సీట్లు 25 నుంచి 38కి పెరుతాయి. అలాగే తమిళనాడులో 59కి, కర్ణాటకలో 28 నుంచి 42 స్థానాలు.. కర్ణాటకలో 28 నుంచి 42 స్థానాలకు పెరుగుతాయి. మేం సందేహాలకు సమాధానం ఇస్తాం.. వాకౌట్ చేయాల్సిన పనిలేదని విపక్షాల ఆరోపణలకు అమిత్‌షా ఎద్దేవా చేశారు. కాగా, జనాభా మార్పులను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటరీ, రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల సరిహద్దులను పునర్ నిర్వచించే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయం చేయొద్దు
-
రేవంత్‌ది ఫూలిష్ ప్రతిపాదన.. లోక్‌సభలో తేజస్వీ సూర్య
సాక్షి, న్యూఢిల్లీ: డీలిమిటేషన్ విషయంలో ప్రతిపక్షాలు చేస్తోంది రాద్ధాంతమేనని.. మహిళా రిజర్వేషన్ల బిల్లు అడ్డుకోవడమే వాళ్ల ధ్యేయంగా కనిపిస్తోందని బెంగళూరు సౌత్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. గురువారం కేంద్రం ప్రవేశపెట్టిన మూడు కీలక బిల్లులపై చర్చ సందర్భంగా ఆయన విపక్షాలపై ధ్వజమెత్తారు. 1996 నుంచి మహిళా రిజర్వేషన్ల బిల్లు పెండింగ్‌లో ఉంది. గత ప్రభుత్వాలు ఈ బిల్లును విస్మరించాయి. కానీ, ప్రధాని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని మహిళలందరి తరపున ప్రధాని మోదీకి ధన్యవాదాలు. కానీ, మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆలస్యమయ్యేలా ప్రతిపక్షాలు కొత్తదారులు వెతుక్కుంటున్నాయి. రాజ్యాంగం ప్రకారం డీలిమిటేషన్ తప్పనిసరి. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజలను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తున్నాయి. తమిళనాడులోనూ కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. కానీ, డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు. డీలిమిటేషన్ వద్దని ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ, అదే జరిగితే కేరళలో పది సీట్లు పెరుగుతాయి. ఇది కేరళకు లాభమే గానీ నష్టం కాదు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న వాదనలో అర్థమే లేదు. డీలిమిటేషన్ సాకుగా చూపించి మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవాలని విపక్షాలు చూస్తున్నాయి. 1996లో మొదలైన మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పుడు ఓ కొలిక్కి వస్తోంది. ఈరోజు కోసం దేశం 40 ఏళ్లుగా ఎదురు చూస్తోంది. 2029లో అమలయ్యే మహిళా రిజర్వేషన్లతో దేశం అభివృద్ధిలో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. సూర్యనారీశక్తి బిల్లును విపక్షాలు అడ్డుకోవడం సరికాదు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చావడానికైనా నేను సిద్ధం’’ అని తేజస్వీ సూర్య ప్రసంగించారు.సీఎం రేవంత్ ప్రతిపాదనపై స్పందిస్తూ.. డీలిమిటేషన్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వాదనను చర్చ సందర్భంగా తేజస్వీ సూర్య తప్పుబట్టారు. ‘‘రేవంత్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆయన హైబ్రిడ్ వాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. జీఎస్డీపీ ఆధారంగా సీట్ల సంఖ్య పెంచమని రేవంత్ అన్నారు. ఆ సలహా ఆయనకు ఎవరు ఇచ్చారో తెలియదు. ఆయనత ఎచ్చిన ప్రతిపాదన ఫూలిష్‌గా ఉంది. జీఎస్డీపీ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ఆ లెక్కన సీట్ల సంఖ్య మారుతూ ఉండాలా?. ఆదాయం ప్రకారం ఓట్లు ఇస్తే అంబానీకి లక్ష ఓట్లు ఇవ్వాలి. రాజ్యాంగం ప్రకారం.. ఒకరికి ఒక్క ఓటే ఉంటుంది. డీలిమిటేషన్ ఏపీ, తెలంగాణలో 52 శాతం సీట్లు పెరుగుతాయి. తమిళనాడులో 49 సీట్లు పెరుగుతున్నాయి. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో 23.9 శాతం సీట్లు పెరుగుతాయి. ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్ల పెంపు అనేది రాజ్యాంగబద్ధమే. డీలిమిటేషన్‌తో సీట్ల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు న్యాయమే జరుగుతుంది’’ అని తేజస్వీ అన్నారు. -
అమిత్ షా Vs కేసీ వేణుగోపాల్.. బిల్లుపై మాటల యుద్ధం
-
డీలిమిటేషన్ బిల్లులపై చర్చకు లైన్ క్లియర్
సాక్షి, న్యూఢిల్లీ: 131 రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడంపై లోక్‌సభలో గురువారం ఓటింగ్ జరిగింది. డీలిమిటేషన్ బిల్లులపై చర్చకు విపక్షాలు డివిజన్ కోరాయి. అందుకు స్పీకర్ ఓం బిర్లా అంగీకరించారు. సభలో ఉన్న మొత్తం 333 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అనుకూలంగా 207, వ్యతిరేకంగా 126 మంది ఓటు వేశారు. మరో 86 మంది సభకు హాజరే కాలేదు. దీంతో డీలిమిటేషన్ బిల్లులపై సభలో చర్చకు మార్గం సుగమమైంది. అంతకు ముందు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాక.. మూడు కీలక బిల్లులను లోక్‌సభలో కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘావాల్, అమిత్ షాలు ప్రవేశపెట్టారు. అయితే.. రాజ్యాంగ విరుద్ధంగా 131 సవరణ బిల్లు తీసుకొచ్చారని.. తక్షణమే దానిని వెనక్కి తీసుకోవాలని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లుపై చర్చకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ డివిజన్ కోరగా.. చివరకు అత్యధిక ఓట్లు చర్చకు అనుకూలంగా పడ్డాయి.చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులను లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. లోక్‌సభ సీట్లను 550 నుంచి గరిష్ఠంగా 850కి పెంచడంతోపాటు 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు.. అలాగే లోక్‌సభ- అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లు ఉన్నాయి. -
లోక్‌సభలో డీలిమిటేషన్ మంట
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే లోక్‌సభ వేడెక్కింది. డీలిమిటేషన్, 131 రాజ్యాంగ సవరణ బిల్లులను గురువారం కేంద్రం ప్రవేశపెట్టింది. ఆ వెంటనే ఎన్డీయే కూటమి, కాంగ్రెస్-మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. 2023లోనే మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చాం. 2024 నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశాం. ఆ టైంలోనే 33 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదు?. జనాభా లెక్కలు, మహిళా రిజర్వేషన్ బిల్లుల తర్వాతే డీలిమిటేషన్ ఉంటుందని అన్నారు. ఇప్పుడేమో రాజ్యాంగ విరుద్ధంగా ఈ బిల్లు తీసుకొచ్చారు. బిల్లుకు అసలు కారణం వేరే ఉంది. రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం హైజాక్ చేయాలని చూస్తోంది.131 రాజ్యాంగ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ‘‘కేంద్రం తెచ్చిన బిల్లులను కేసీ వేణుగోపాల్ అవమానించారు. బిల్లును సభలో పెట్టకుండా ఎలా చర్చిస్తాం?. బిల్లు పూర్తిగా ప్రవేశపెట్టకుండానే అభ్యంతరం ఏంటి?. సభలో బిల్లు పెట్టాక మీ అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. చర్చల సమయంలో అన్నింటకీ సమాధానం చెబుతాం’’ అని బదులిచ్చారు. అయితే బిల్లులను సభలో ప్రవేశపెట్టడంపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.Congress MP KC Venugopal opposes the introduction of Constitution (One Hundred and Thirty-First Amendment) Bill, 2026, Union Territories Laws (Amendment) Bill, 2026 and Delimitation Bill, 2026. pic.twitter.com/vTpO7phzQL— ANI (@ANI) April 16, 2026చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులను లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. లోక్‌సభ సీట్లను 550 నుంచి గరిష్ఠంగా 850కి పెంచడంతోపాటు 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, లోక్‌సభ- అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లు ఉన్నాయి. ఇందులో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు. మిగతా రెండూ చట్టపరమైన బిల్లులు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి. మిగతా రెండింటికీ సాధారణ మెజారిటీ సరిపోతుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్‌సభ ప్రారంభమైన వెంటనే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వీటిని ప్రవేశపెట్టారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే ఇంకో బిల్లును హోంమంత్రి అమిత్ షా సభ ముందు ఉంచారు. అనంతరం వీటిపై చర్చ సభలో చేపట్టారు. ఈ బిల్లులపై నేటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్లో చర్చించనున్నారు. ఈ మూడింటిపై ఒక్కో సభలో 18 గంటలపాటు ఎంపీలు మాట్లాడుతారు. ప్రధాని మోదీ ఈ సాయంత్రం లోక్‌సభలో ప్రసంగించే అవకాశం ఉంది. రాజ్యసభలో 18న చర్చ ఉంటుంది. -
బీజేపీకి ఝలక్.. స్టాలిన్ వినూత్న నిరసన
చెన్నై: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా మూడు ప్రధాన బిల్లులను కేంద్ర ప్రభుత్వం నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. మహిళా రిజర్వేషన్లు అమలు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), కొత్త డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు వంటి అంశాలను కలిగి ఉన్న ఈ బిల్లులపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లును ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రం తీరు పట్ల వినూత్నంగా నిరసన తెలిపారు.పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. బిల్లుకు పూర్తిగా వ్యతిరేకమని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఎంకే స్టాలిక్ నల్ల దుస్తులు ధరించి నల్ల జెండాను ఎగురవేశారు. అలాగే, డీలిమిటేషన్ బిల్లు పేపర్లను కాల్చివేశారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా స్టాలిన్.. ‘ఈ ప్రతిఘటన తమిళనాడు అంతటా వ్యాపించాలి! ఫాసిస్ట్ బీజేపీ అహంకారం కూలిపోవాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్ల వద్ద నల్ల జెండాలు ఎగురవేయాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.Namakkal | DMK President and Tamil Nadu CM MK Stalin, wearing black attire, today hoisted a black flag in protest against the Centre's delimitation move. He also burned a copy of the proposed Delimitation bill. pic.twitter.com/AYno2V8UCn— ANI (@ANI) April 16, 2026అంతేకాకుండా.. గత హిందీ వ్యతిరేక ఆందోళనలతో పోలుస్తూ.. గతంలో తమిళనాడు నుండి వచ్చిన ప్రతిఘటన ఢిల్లీని లొంగిపోయేలా చేసిందని, అటువంటి ఉద్యమమే ప్రస్తుత ప్రతిపాదనను సవాలు చేస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఈ బిల్లు తమిళులను వారి సొంత భూమిలో శరణార్థులుగా మారుస్తుందని ఆయన ఆరోపించారు. బీజేపీ అహంకారాన్ని అణచివేయడానికి ఈ ఆందోళన ద్రావిడ భూమి అంతటా వ్యాపిస్తుందని ఆయన అన్నారు. మరోవైపు.. డీఎంకే ఎంపీలు కూడా నల్ల దుస్తులు ధరించి నేడు పార్లమెంట్ సమావేశంలో పాల్గొననున్నారు.ఇదిలా ఉండగా.. పార్లమెంట్లో ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టనుండగా, ఒక్కో సభలో 18 గంటలపాటు చర్చకు అవకాశం ఇవ్వనున్నారు. ఇక ప్రతిపక్ష ఇండియా కూటమి మాత్రం ఈ బిల్లులపై స్పష్టమైన వైఖరిని ప్రకటించింది. డీలిమిటేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించింది. దీంతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందుతుందా? లేక ప్రతిపక్షాల వ్యతిరేకతతో నిలిచిపోతుందా? అన్నది ఉత్కంఠగా మారింది.#WATCH | Chennai | Late DMK patriarch M. Karunanidhi's daughter, Selvi Karunanidhi, joins DMK protest against the Centre's proposed delimitation bill pic.twitter.com/EomzwcjQ4X— ANI (@ANI) April 16, 2026 -
డీలిమిటేషన్ బిల్లుపై విపక్షాల ఆరోపణలకు అమిత్‌షా కౌంటర్
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, డీ లిమిటేషన్ బిల్లు, పునర్విభజన కమిషన్ బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. -
డీలిమిటేషన్‌పై కేంద్రం క్లారిటీ
ఢిల్లీ: డీలిమిటేషన్‌పై కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం ఉన్న సీట్లకు 50 శాతం పెంచుతున్నట్లు పేర్కొంది. బిల్లులో ఈ విషయం స్పష్టంగా ఉందన్న సమాచార శాఖ.. పార్లమెంట్ చర్చ సందర్భంగా మరింత క్లారిటీ ఇస్తామని తెలిపింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఢిలిమిటేషన్ ఉంటుందన్న అపోహలను కేంద్రం కొట్టిపారేసింది. ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.తమిళనాడులో 58కి, కేరళంలో 30కి పెరుగుతాయన్న కేంద్రం.. డీలిమిటేషన్‌తో దక్షిణాదిలో సీట్లు తగ్గవని తెలిపింది. రాష్ట్రాలకు చట్టబద్ద రక్షణ ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బిల్లులోని అంశాలను ముక్కలుగా చదవి విశ్లేషించొద్దని కేంద్రం పేర్కొంది. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని, అందుకోసం లోక్‌సభ స్థానాలను భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.డీలిమిటేషన్ 2011 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా తాజాగా జరుగుతున్న జనగణన ప్రాతిపదికన జరగాలని ఆప్, ఆర్జేడీ వంటి పార్టీలు డిమండ్ చేస్తున్నాయి. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదానికి ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఇందుకు విపక్షాల మద్దుతు మోదీ ప్రభుత్వానికి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. పార్లమెంటు సమావేశాలకు విధిగా హాజరు కావాలంటూ బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.రేపటి (ఏప్రిల్ 16, గురువారం) నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే మోదీ సర్కారు హడావుడిగా మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలను తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. మరోవైపు డీలిమిటేషన్‌తో తమకు తీవ్ర అన్యాయం జరగనుందని దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం లేవనెత్తుతున్నాయి. ఈ ప్రక్రియను పార్లమెంటులోనే సవాలు చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశాయి. -
డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం : ఖర్గే
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని, కానీ కేంద్రం తీసుకొస్తున్న విధానం సరైనది కాదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ ‘రాజకీయ స్వార్థంతో డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చారు. డీలిమిటేషన్ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మాత్రం మద్దతు ఇస్తాం. ప్రభుత్వం విపక్షాలను అణగదొక్కాలని చూస్తోంది’ అని అన్నారు.రేపటి నుంచి పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు వంటి కీలక బిల్లులపై చర్చ జరగనుంది. లోక్‌సభలో ఏప్రిల్ 16, 17 తేదీల్లో ఈ బిల్లులపై చర్చ, ఓటింగ్ జరగనుంది. మూడు బిల్లులపై చర్చకు మొత్తం 18 గంటల సమయం కేటాయించారు.రాజ్యసభలో ఏప్రిల్ 18న చర్చ, ఓటింగ్ జరగనుంది. అక్కడ చర్చకు 10 గంటల సమయం కేటాయించారు. అదనంగా, ఏప్రిల్ 16, 17 తేదీల్లో రాజ్యసభ డిప్యూటీ ఛైర్పర్సన్ ఎన్నికపై కూడా చర్చ జరగనుందని సమాచారం. -
దక్షిణ రాష్ట్రాలకు ఇదేనా ప్రతిఫలం?
చెన్నై: మోదీ సర్కారు తలపెట్టిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి ఫైర్ అయ్యారు. డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నల్లజెండాలు ఎగురవేయాలని తమిళనాడు ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించబోమని మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఈ మేరకు ఎక్స్‌లో వీడియో సందేశం విడుదల చేశారు."నల్ల జెండాలు ఎగరనివ్వండి! భారతదేశ ప్రగతికి దోహదపడినందుకు మాకు శిక్ష విధిస్తారా? తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలకు ఇదేనా ప్రతిఫలం? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని యోచిస్తున్న డీలిమిటేషన్ సవరణ బిల్లు.. తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక భారీ చారిత్రక అన్యాయం. డీలిమిటేషన్‌కు నిరసనగా రేపు తమిళనాడు వ్యాప్తంగా ఇళ్లపైనా, బహిరంగ ప్రదేశాల్లోనూ నల్ల జెండాలు ఎగురుతాయి. తమిళనాడు గళాన్ని గౌరవించి వెనక్కి తగ్గడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తే, తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. డీఎంకే అధ్యక్షుడిగా, అన్నింటికంటే ముఖ్యంగా ఆత్మగౌరవం గల తమిళుడిగా ఇది నా హెచ్చరిక'' అని స్టాలిన్ తన సందేశంలో పేర్కొన్నారు.ఎంపీలతో అత్యవసర భేటీనియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్లో చర్చకు రానున్న నేపథ్యంలో డీఎంకే ఎంపీలతో స్టాలిన్ ఈ రోజు ఉదయం అత్యవసర భేటీ నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఎంపీలతో ఆయన చర్చించారు. కాగా, గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్టాలిన్‌కు ఓటమి భయం: అన్నామలైస్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు అన్నామలై స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో స్టాలిన్ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. డీలిమిటేషన్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వివాదం చేస్తున్నారని ఆరోపించారు. కోయంబత్తూరులో అన్నామలై మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ వీలైనంత త్వరగా అమలు చేయాలని తమిళనాడు మహిళలు కోరుకుంటున్నారని చెప్పారు. తమిళనాడులో ఈసారి భారీ మెజారిటీతో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, డీఎంకే ప్రభుత్వం పోవాలని భావిస్తున్నారని చెప్పారు. భారీ మెజారిటీతో ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. உயரட்டும் கருப்புக்கொடி!தமிழ்நாடு போராடும்! தமிழ்நாடு வெல்லும்!இந்தியாவின் வளர்ச்சிக்காகப் பாடுபட்ட குற்றத்துக்காக தமிழ்நாடு உள்ளிட்ட தென்மாநிலங்களுக்குத் தண்டனையா? ஒன்றிய பா.ஜ.க. அரசு நாளை நாடாளுமன்றத்தில் கொண்டுவரவுள்ள #Delimitation சட்டத்திருத்தம் தமிழ்நாட்டுக்கும்,… pic.twitter.com/6gbEAHvNn4— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) April 15, 2026 చదవండి: గెలిస్తే ఏఐ యూనివర్సిటీ, మంత్రిత్వ శాఖ -
డీలిమిటేషన్‌పై బీజేపీ కొత్త కుట్ర: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: డీలిమిటేషన్‌పై కొత్త కుట్రకు తెర లేపారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ కొత్త కుట్రకు తెర లేపుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో మా ప్రజల స్వరం తగ్గిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చంచారు. అలాగే, మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది.మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా మాట్లాడుతూ..‘డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాదికి అన్యాయం జరిగితే పెను ఉద్యమం తప్పదు. ఈ విషయంలో మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. మూడేళ్ల క్రితం తీసుకున్న దృఢమైన నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం. మేమంతా గర్వించదగ్గ భారతీయులం. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాలం మేము. జనాభా నియంత్రణతో పాటు వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా అన్యాయం చేయడం సమంజసం కాదు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి, వాటి ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం.దేశ అత్యున్నత వేదిక అయిన పార్లమెంటులో మా ప్రజల స్వరాన్ని అణచివేయాలని చూస్తే.. మేము మాత్రం నిశ్శబ్దంగా చూస్తూ ఊరుకోము. అవసరమైతే కేసీఆర్ ముందుండి కొట్లాడుతారు. దక్షిణ భారతీయుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తాం. ఇప్పటికైనా ఢిల్లీ పాలకులు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని, విజ్ఞత ప్రదర్శించాలి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మా మద్దుతు ఉంటుంది’ అని స్పష్టం చేశారు. -
లోక్‌సభ స్థానాలు 850కి పెంపు!
సాక్షి, న్యూఢిల్లీ: 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని, అందుకోసం లోక్‌సభ స్థానాలను భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో లోక్‌సభలో స్థానాల సంఖ్య ప్రస్తుతమున్న 543 నుంచి 850 దాకా పెరిగే అవకాశముంది! వీటిలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 815కు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గరిష్టంగా 35కు మించకుండా స్థానాలుంటాయి. మహిళలకు 33 శాతం లెక్కన వాటిలో గరిష్టంగా 280 నుంచి 281 స్థానాల దాకా రిజర్వు చేయనున్నారు. దీనికి వీలు కల్పించేందుకు ఉద్దేశించిన 3 బిల్లులను గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది.2029కి ముందే మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు, అందుకోసం లోక్‌సభ స్థానాల పెంపుకు వీలు కల్పించేలా రాజ్యాంగ (131వ)సవరణ బిల్లు–2026, దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు వీలుగా డీలిమిటేషన్ బిల్లు–2026, ఈ ప్రక్రియను ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరి అసెంబ్లీలకు కూడా వర్తింపజేసేందుకు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు–2026 వీటిలో ఉంటాయి. ఈ మూడు బిల్లులకూ ఈ ప్రత్యేక సమావేశాల్లోనే పార్లమెంటు ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటి ముసాయిదా ప్రతులను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంగళవారం ఎంపీలందరికీ పంపింది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం త్వరలో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కానుంది.లోక్‌సభ స్థానాల తుది సంఖ్యను పునర్విభజన కసరత్తు అనంతరం కమిషనే ఖరారు చేయనుంది. ఈ కారణంగానే పెరగనున్న లోక్‌సభ స్థానాల సంఖ్యను రాజ్యాంగ సవరణ బిల్లులో స్పష్టంగా పేర్కొనలేదు. ‘అన్ని రాష్ట్రాలకు కలిపి గరిష్టంగా 815కు మించకుండా, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35కు మించకుండా లోక్‌సభ స్థానాలుండాలి’అని మాత్రమే తెలిపారు. లోక్‌సభతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో స్థానాల సంఖ్యను 50 శాతం పెంచాలని మోదీ సర్కారు నిర్ణయించడం తెలిసిందే.ఇందుకోసం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటూ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టనున్నట్టు రాజ్యాంగ సవరణ బిల్లులో వెల్లడించారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పెంపుకు వీలుగా రాజ్యాంగంలోని పలు అధికరణలకు సవరణలను కూడా ప్రతిపాదించారు. నారీశక్తి వందన్ అధినియమ్‌గా పేర్కొనే మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలకు పార్లమెంటు ప్రత్యేక భేటీలో ఆమోదం పొందనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే వెల్లడించడం తెలిసిందే. ఈ ప్రక్రియ ఆలస్యమైతే చట్టసభల్లో విధాన నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆశిస్తున్న మహిళలందరికీ తీవ్ర అన్యాయం జరుగుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. 2029 నుంచే అమలయ్యేలా... మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2023లో పార్లమెంటు ఆమోదించడం తెలిసిందే. దీని ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీల్లో 33 శాతం సీట్లను మహిళలకు ప్రత్యేకిస్తారు. అయితే ఈ చట్టం 2034కు ముందు అమల్లోకి వచ్చే పరిస్థితులు లేవు. మహిళా రిజర్వేషన్లు అమలవాలంటే ప్రస్తుతం కొనసాగుతున్న జనగణన–2027 ప్రక్రియ ముగిసి, ఆ లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పుననర్విభజన చేపట్టాల్సి ఉండటమే అందుకు కారణం. కానీ మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 నుంచే అమల్లోకి తేవాలని మోదీ సర్కారు భావిస్తోంది. ‘‘తదుపరి జనగణన, దాని తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియకు చాలా సమయం పడుతుంది.కానీ లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు వీలైనంత త్వరగా అమలయ్యేలా చూడటం చాలా ముఖ్యం. అందుకు అనుగుణంగా మహిళా రిజర్వేషన్ల చట్టానికి అవసరమైన సవరణలు చేపట్టడమే లక్ష్యం’’అని ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లు ముసాయిదాలో కేంద్రం పేర్కొంది. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న, అంటే 2011 జనాభా లెక్కల ఆధారంగానే లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టనున్నట్టు వెల్లడించింది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వు చేసే స్థానాలను రొటేషన్ పద్ధతిలో కేటాయిస్తారని తెలిపింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు 15 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి. అనంతరం వాటి పొడిగింపుపై పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుంది. మూడు బిల్లులపై 18 గంటల చర్చ మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉద్దేశించిన మూడు కీలక బిల్లులను గురువారం లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టనుంది. రాజ్యంగ (131వ సవరణ) బిల్లు–2026, డీలిమిటేషన్ బిల్లు–2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు–2026పై గురు, శుక్రవారాల్లో సభలో చర్చ జరగనుంది. అందుకు 18 గంటల సమయం కేటాయించారు. అనంతరం వాటిపై ఓటింగ్ చేపడతారు. తర్వాత మూడు బిల్లులపై శనివారం రాజ్యసభలో 10 గంటల పాటు చర్చ, అనంతరం ఓటింగ్ జరుగుతాయి. గురు, శుక్రవారాల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నిక కూడా జరుగుతుందని పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి.లోక్‌సభ స్థానాల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు లబ్ధి?లోక్‌సభ నియోజకవర్గాల పెంపులో దామాషా ప్రాతినిధ్య విధానాన్ని ప్రాతిపదికగా తీసుకోనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ స్థానాలను గరిష్టంగా 850 దాకా పెంచాలని రాజ్యాంగ సవరణ బిల్లు–2026లో కేంద్రం ప్రతిపాదించింది. ‘‘వాటిని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించే విషయంలో దామాషా విధానాన్ని అనుసరించనున్నారు. దీనిద్వారా దక్షిణాది రాష్ట్రాలకే ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశముంది’’అని కేంద్ర వర్గాలు వివరించాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం లోక్‌సభలో వెల్లడించే అవకాశమున్నట్టు తెలిపాయి.నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోనున్న విషయం తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలు కొన్ని దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణను సమర్థంగా పాటిస్తూ వస్తున్నాయి. దాంతో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే వాటిలో జనాభా పెరుగుదల తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేపడితే తమకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గి ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం పెరుగుతుందని విపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి.వాడీవేడిగా సమావేశాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే మోదీ సర్కారు హడావుడిగా మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలను తెరపైకి తెచి్చందని కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. మరోవైపు డీలిమిటేషన్‌తో తమకు తీవ్ర అన్యాయం జరగనుందని దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం లేవనెత్తుతున్నాయి. ఈ ప్రక్రియను పార్లమెంటులోనే సవాలు చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశాయి.డీలిమిటేషన్ 2011 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా తాజాగా జరుగుతున్న జనగణన ప్రాతిపదికన జరగాలని ఆప్, ఆర్జేడీ వంటి పార్టీలు డిమండ్ చేస్తున్నాయి. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదానికి ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఇందుకు విపక్షాల మద్దుతు మోదీ ప్రభుత్వానికి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా సాగడం ఖాయంగా కని్పస్తోంది. పార్లమెంటు సమావేశాలకు విధిగా హాజరు కావాలంటూ బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. డీలిమిటేషన్‌కు కమిషన్ ⇒ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వం ⇒ సభ్యులుగా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ⇒ ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది సభ్యులులోక్సభ, అసెంబ్లీ స్థానాల పునర్ వ్యవస్థీకరణ కోసం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కానుంది. దానికి సుప్రీంకోర్టు ప్రస్తుత, లేదా రిటైర్డ్ న్యాయమూర్తి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, లేదా ఎన్నికల కమిషనర్‌తో పాటు సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సభ్యులుగా ఉంటారు. ఈ ప్రక్రియలో రాష్ట్రాల భాగస్వామ్యం నిమిత్తం ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది చొప్పున అసోసియేట్ సభ్యులను నియమిస్తారు. వీరిలో ఐదుగురు ఎంపీలను లోక్‌సభ స్పీకర్, ఐదుగురు ఎమ్మెల్యేలను రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు నామినేట్ చేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధులు 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు భారీగా వలసలు పెరగడం, జనాభా పెరుగుదల రేటులో మార్పులతో నియోజకవర్గాల మధ్య సమతుల్యత దెబ్బతిన్నదని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆరి్టకల్ 81, ఆరి్టకల్ 55కు కీలక సవరణలు చేస్తూ 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగా నియోజకవర్గాలను పునర్ వ్యవస్థీకరించనున్నారు. -
ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రెండు చట్టాలు, రాజ్యాంగ సవరణకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లను అమలుపరిచే విషయంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు. నియోజకవర్గాల పునర్విభజనను దానికి ముడిపెట్టడం, నియోజకవర్గాల సంఖ్య పెంపు ప్రతిపాదనలపైనే అభ్యంతరాలున్నాయి.చట్ట సభల్లో మహిళలకు మూడో వంతు స్థానాలు రిజర్వు చేయాలన్న ప్రతిపాదన దేశంలో దశాబ్దాలుగా నలుగుతోంది. చట్టం చేయాలన్న ఆలోచనలోనే పలు అవరోధాలు ఎదురై ఎట్టకే లకు 2023లో చట్టం ఏర్పడింది. అది కూడా 2024 సార్వత్రిక ఎన్ని కల వాకిట్లో ఆదరాబాదరాగా వచ్చిందే! అమలు ఎప్పట్నుంచి అన్న ప్రశ్న అప్పట్లోనే వివాదాస్పదమైంది. 2026 తర్వాత అందుబాటులో ఉండే తాజా జనాభా లెక్కలు, వాటి ఆధారంగా జరిగే నియోజక వర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్ అమలు పరచాలని నిర్ణయించి, దాన్నే చట్టంలో పొందుపరిచారు. కోవిడ్ కారణంగా 2021లో జరగని జనగణన 2025లో చేపట్టి ఏడాదిలో పూర్తి చేస్తారనీ, వెంటనే పునర్విభజన జరిపి 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు జరపొచ్చనీ భావించారు. కానీ, 2025లో జన గణన మొదలు కాలేదు. ఇప్పుడు చేపట్టినా వచ్చే సంవత్సరం మధ్య నాటికి పూర్తిచేయడం, ఆపై పునర్విభజన కమిషన్ ఏర్పరచి తాజా గణాంకాలతో ఆ ప్రక్రియను పూర్తిచేసి 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు కష్టమనే కొత్త అభిప్రాయం బలపడింది. దాంతో, ఇక రిజర్వేషన్ల అమలు 2034 ఎన్నికల్లోనే అనుకుంటు న్నారు. ఉన్నట్టుండి ‘లేదు లేదు, తాజా జనగణనతో నిమిత్తం లేకుండా పాత లెక్కలతోనే పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు చేసేద్దాం’ అని ఎన్డీయే పెద్దన్న బీజేపీ తీసిన కొత్త రాగమే భిన్నాభిప్రాయాలకు కారణమైంది.మహిళా ఓట్లపై గురిచట్ట సభల్లో మూడో వంతు సీట్లు మహిళలకు ఇప్పించడంలో మాకున్నంత పట్టుదల మరెవరికీ లేదని బీజేపీ నాయకత్వం చాటు కోవాలనుకుంటోంది. అందుకే తెలివిగా రిజర్వేషన్ అంశాన్ని పునర్విభజనతో ముడిపెట్టింది. 2023 మహిళా రిజర్వేషన్ చట్టంలో ఉన్నట్టుగా 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కలు, వాటి ఆధారంగా జరిగే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్ అంటే అది తప్పనిసరిగా జాప్యమౌతుంది. 2029లో కాకుండా రిజర్వేషన్ల అమలు 2034కు వెళుతుంది. కానీ, 2029 లోపే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే కాకుండా అంతకుముందే జరిగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా, కర్టాటక, తెలంగాణ – పది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్ని కల్లోనూ మహిళా ఓట్ల మొగ్గుతో లబ్ధి పొందవచ్చు అన్నది బీజేపీ ఎత్తుగడ. ఈ అంశంపై జరిగే చర్చ ద్వారా ఈ నెల 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగాల్సివున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మహిళా ఓటర్లనూ మచ్చిక చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందన్నది ఆశ! తాజా జనాభా లెక్కలు వచ్చాక, జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల సంఖ్యను పెంచితే ఉత్తరాది–దక్షిణాది రాష్ట్రాల వ్యత్యాసం మరింత పెరుగుతుంది. దానికి విరుగుడుగా, కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్న లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యకు ఏకరీతిలో అంతటా 50 శాతం పెంచడం ద్వారా ఎవరికీ ఇబ్బంది ఉండదని ప్రచారం చేసేట్టు వ్యూహ రచన చేశారు. మరింత చర్చకు డిమాండ్పునర్విభజనలో నియోజకవర్గాల సంఖ్య పెంపుపై మరింత చర్చ జరగాలని విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి. పెంపు వెంటనే చేపడితే మూడో వంతు సీట్లు (50 శాతం పెంపు ద్వారా) కొత్తగా వస్తాయి కనుక మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు పరచడంలో ఎవరికీ ఇబ్బందులుండవని పాలక పక్షం వివరిస్తోంది. అలా జరిగితే, తమకు రాజకీయంగా పట్టున్న అధిక జనాభా రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగి ఆధిక్యత లభిస్తుంది. తక్కువ మోతాదులో సీట్లు పెరిగే దక్షిణా రాష్ట్రాల్లో తమకు ఎలాగూ పట్టు లేదు కనుక ఆయా రాష్ట్రాల్లో ఆధిపత్యం కోసం ఆరాటపడాల్సిన రాజకీయ అవసరం ఉండదనేది భరోసా! దీన్నే దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. జనాభా పెరుగుదలకు కారణమైన వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచి బహుమతినిస్తారా అని అవి ప్రశ్నిస్తున్నాయి.చట్టసభల్లో ఇప్పుడున్న సంఖ్యలోనే మూడో వంతు స్థానాలు మహిళలకు కేటాయిస్తూ రిజర్వేషన్ అమలు పరచాలని కాంగ్రెస్ అంటోంది. ఇందుకు పదిహేనేళ్లనాటి 2011 జనాభా లెక్కలు కాకుండా, వెంటనే జనగణన ముమ్మరం చేసి, 2027 మే నాటికి లభించే తాజా గణాంకాల్ని రిజర్వేషన్ల ఖరారుకు వాడుకోవాలని సూచిస్తోంది. ‘ఇండియా’ కూటమి అభిప్రాయం నేడు జరగనున్న వారి భేటీలో తేలవచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేష న్ను జీఎస్డీపీకి లింక్ పెట్టాలని కొత్త ప్రతిపాదన తెచ్చారు. దీనికి ఇతర రాష్ట్రాలు, పార్టీలు ఏ మేరకు మద్దతిస్తాయో చూడాలి.ప్రత్యామ్నాయం పరిష్కారంనియోజకవర్గాల పెంపు విషయంలో ఏ పద్ధతి అనుసరించాల న్నది ప్రశ్నార్థకంగా మారింది. అందరు ఓటర్లు విలువ సమానంగా, ఒకటిగానే ఉండాలని మొదట్లో భావించారు. ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్యను, భౌగో ళిక స్వరూపాలను మార్చాలని నిర్ణయించారు. ఇందుకుగానూ ప్రతి పదేళ్లకోసారి ‘పునర్విభజన కమిషన్ల’ ఏర్పాటు ప్రతిపాదించారు. 1951, 1962, 1972లో అలా కమిషన్లు ఏర్పడ్డాయి. లోక్‌సభ స్థానాల సంఖ్య 494 నుండి 522కు, 543కు పెరుగుతూ వచ్చింది. జనాభా ప్రాతిపదికగా నియోజక వర్గాల సంఖ్యను పెంచితే జనాభా నియంత్రణ లక్ష్యాలకు విరుద్ధంగా ఉంటుందనే ఆలోచన 1972 తర్వాత వచ్చింది. అందుకే నాటి లోక్‌సభ స్థానాల సంఖ్య 543కు కట్టడి విధించి, 2000 సంవత్సరం వరకు సంఖ్యను మార్చొ ద్దని నిర్ణయించారు. ఈ మేరకు 42వ రాజ్యాంగ సవరణ (1976)తో ఒకసారి, 84వ రాజ్యాంగ సవరణ (2002) ద్వారా మరోసారి సంఖ్యను పెంచకుండా 2026 వరకు కట్టడి చేయాల్సి వచ్చింది. 1913 నుండి ‘ప్రతినిధుల సభ’ సభ్యుల సంఖ్యను అమెరికాలో 435కి కట్టడి చేసినట్టు మన దగ్గర కూడా కట్టడి చేయడమో, మరో హేతుబద్ధమైన ప్రత్యామ్నాయ విధానాన్నో వెతకాలి. జనాభా ప్రాతిపదికన ఏకరీతి సర్దుబాటు లోక్‌సభ స్థానాల్లో జరిపి, జనాభా నియంత్రించిన వారికి ప్రోత్సాహాలిచ్చే పద్ధతి రాజ్యసభ స్థానాల్లో కల్పించవచ్చనే సూచన వస్తోంది. అంతే తప్ప, ఏపీ సీఎం చంద్ర బాబు చెబుతున్నట్టు ‘ఇబ్బడి ముబ్బడిగా పిల్లల్ని కనండి, మనకు నియోజక వర్గాలు పెరిగి ప్రాతినిధ్యం పెరుగుతుంది’ అన్నది పరి ష్కారం కాదు. అది తప్పు అవుతుంది.దిలీప్ రెడ్డివ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రిసెర్చి సంస్థ డైరెక్టర్ -
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: డీలిమిటేషన్‌పై ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లోక్‌సభ సీట్ల పెంపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లేఖలో మూడు అంశాలను రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌ను సీట్ల పెంపుతో కలపడం సరికాదన్న రేవంత్.. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాదికి నష్టం అన్నారు.ఆర్థిక, అభివృద్ధి ప్రమాణాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్ సూచించారు. హైబ్రిడ్ మోడల్‌ను అనుసరించాలన్నారు. అన్ని పార్టీలతో చర్చలు జరపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దేశ ఐక్యతకు న్యాయమైన ప్రతినిధిత్వం కీలకమన్న రేవంత్.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. ప్రస్తుత 543 సీట్లతోనే మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, సీట్ల పెంపు మూడు వేర్వేరు అంశాలు. డిలిమిటేషన్‌ను సీట్ల పెంపుతో కలపడం సరైంది కాదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని.. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు నష్టపోతాయని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర రాష్ట్రాలకు అధిక రాజకీయ శక్తి వెళ్తుంది. దక్షిణ రాష్ట్రాల వాణి పార్లమెంట్లో తగ్గే ప్రమాదం ఉంది. ఆర్థికంగా ఎక్కువగా దేశానికి తోడ్పడుతున్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. హైబ్రిడ్ మోడల్ ద్వారా సమతౌల్యం సాధించవచ్చు. సీట్లలో సగం జనాభా ఆధారంగా, మిగతా సగం ఆర్థిక ప్రమాణాల ఆధారంగా ఇవ్వాలి. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో చర్చలు జరపాలి. న్యాయం, సమాన ప్రతినిధిత్వం లేకపోతే దేశ ఐక్యత దెబ్బతింటుంది’’ అని సీఎం రేవంత్ లేఖలో పేర్కొన్నారు.తమిళనాడు సీఎంకు లేఖ: తమిళనాడు సీఎంకు కూడా రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. లోక్‌సభ సీట్లను ప్రోరాటా పద్ధతిలో పెంచే ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా నిలబడాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్‌కు లేఖ రాశారు సీఎం. మహిళల రిజర్వేషన్, డిలిమిటేషన్, లోక్‌సభ సీట్ల పెంపు అనే మూడు వేర్వేరు అంశాలను కలిపి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.లోక్‌సభ సీట్లను 543 నుంచి 850కు పెంచి ప్రోరాటా పద్ధతిలో పంచితే దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందని అప్రమత్తం చేశారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకునే రాష్ట్రాలు నష్టపోతూ, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లాభపడే పరిస్థితి వస్తుందని అన్నారు. అందుకే అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగేలా హైబ్రిడ్ మోడల్‌ను పరిశీలించాలని, ఈ అంశంపై రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన కోరారు. -
కేంద్రానికి ఇదే నా చివరి హెచ్చరిక: సీఎం స్టాలిన్
సాక్షి, చెన్నై: డీలిమిటేషన్ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. పార్లమెంట్లో గనుక డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే, తమిళనాడులో ఇప్పటివరకు చూడని స్థాయిలో భారీ ఉద్యమాన్ని చేపడతానని ఆయన స్పష్టం చేశారు.మంగళవారం తన సోషల్ మీడియాలో స్వయంగా సీఎం స్టాలిన్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘అదే గనుక జరిగితే నా రాష్ట్ర ప్రజలతో కలిసి రోడ్డుపై బైఠాయిస్తాను. 1960 నాటి డీఎంకే ఉద్యమాన్ని మళ్లీ పరిచయం చేస్తాను. కేంద్రానికి, ప్రధానికి ఇదే నా చివరి హెచ్చరిక’’ అని ప్రకటించారాయన. ఆయన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.డీలిమిటేషన్ అంటే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన. ఈ ప్రక్రియలో దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని, ఉత్తర రాష్ట్రాలకు అధిక ప్రాతినిధ్యం లభిస్తుందని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో.. తమిళనాడు ప్రజల హక్కులను కాపాడేందుకు తాను వెనుకాడబోనని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు.డీలిమిటేషన్ అంశంపై తమిళనాడులో ఇప్పటికే డీఎంకే కార్యకర్తలు, మిత్రపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్టాలిన్ హెచ్చరికతో ఉద్యమానికి మరింత ఊపిరి లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.Hon’ble Prime Minister, this is Tamil Nadu’s final warning.மாண்புமிகு பிரதமர் அவர்களே, இது தமிழ்நாட்டின் இறுதி எச்சரிக்கை!#TNwillFightTNwillWin pic.twitter.com/v9wkYYM6MO— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) April 14, 2026 -
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై సంచలన వ్యాఖ్యలు
-
మహిళా రిజర్వేషన్లు, డీ లిమిటేషన్‌పై మోదీని ప్రశ్నించిన రేవంత్
సాక్షి, హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ల పెంపు, డీ లిమిటేషన్ వేరువేరు అంశాలు అంటూ ప్రధాని మోదీకి ప్రశ్నలు సంధించారు సీఎం రేవంత్. మహిళా రిజర్వేషన్‌ను అంశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా..‘మహిళా రిజర్వేషన్ల పెంపు, డీ లిమిటేషన్ వేరువేరు అంశాలు. మహిళా రిజర్వేషన్లకు దేశమంతా మద్దతు ఇస్తుంది. కానీ, లోక్‌సభ సీట్ల పునర్విభజనపై అనేక సందేహాలు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా అసెంబ్లీ సీట్లకు మహిళా కోటాను వెంటనే అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్‌ను అంశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. జనాభా ఆధారంగా లోక్‌సభ పునర్విభజనను ముందుకు తెచ్చే ప్రయత్నాలు ఆపాలి. బీజేపీ చేసే ప్రయత్నం బీజేపీకి మాత్రమే లాభం. బీజేపీ కుట్రతో దక్షిణాది రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. బీజేపీ చర్య దేశాన్ని బలహీనపరుస్తుంది. పార్టీ ప్రయోజనాల కన్నా జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. ఢిల్లీలో నారీ శక్తి వందన్ సమ్మేళన్ కార్యక్రమం మోదీ ప్రసంగిస్తున్న సమయంలో సీఎం రేవంత్ ఇలా వ్యాఖ్యలు చేయడం విశేషం. పార్లమెంటు కొత్త చరిత్ర లిఖించడానికి చేరువలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 21వ శతాబ్దం మహిళలకు చెందిందని చెప్పారు. 21వ శతాబ్దంలో అతి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నామని పేర్కొన్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయం మహిళలకు అంకితం చేస్తున్నామని తెలిపారు. -
డీలిమిటేషన్ బిల్లు ఈ నెలలోనే!
న్యూఢిల్లీ: లోక్‌సభ స్థానాల పెంపు బిల్లుకు పార్లమెంటు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదముద్ర పడేలా కనిపిస్తోంది. ఇందుకు మోదీ సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఏప్రిల్ మూడోవారంలో ప్రత్యేకంగా రెండు నుంచి మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. జనవరి 28న ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ ప్రకారం గురువారం నిరవధికంగా వాయిదా పడాల్సి ఉంది. ‘‘అందుకు బదులుగా, ఏప్రిల్ మూడో వారంలో ఉభయ సభలు ఏ తేదీన భేటీ అయ్యేదీ సభాపతులు గురువారం ప్రకటిస్తారు. సమావేశాలను అప్పటిదాకా వాయిదా వేస్తున్నట్టు పేర్కొంటారు’’అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లోక్‌సభతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల సంఖ్యను 50 శాతం మేరకు పెంచాలని ఎన్డీఏ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయానికి రావడం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా గత వారం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు పలు కాంగ్రెసేతర పార్టీల నేతలతో కూడా పంచుకు న్నారు. ఆ సందర్భంగా ఆయన వెల్లడించిన వివరాల మేరకు లోక్‌సభ స్థానాల సంఖ్య 543 నుంచి 816కు పెరగనుంది. వాటిలో 273 స్థానాలను మహిళలకు రిజర్వు చేయనున్నారు. లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’చట్టాన్ని 2023లోనే పార్లమెంటు ఆమోదించడం తెలిసిందే. అయితే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు పూర్తయిన అనంతరమే ఆ చట్టం అమల్లోకి రానుంది. అయితే 33 శాతం మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి జరగబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కూడా వర్తింపజేయాలని మోదీ సర్కారు భావిస్తోంది. అందుకు వీలుగా రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ‘‘అలాగే డీలిమిటేషన్ చట్టాన్ని సవరిస్తూ మరో సాధారణ సవరణ బిల్లు కూడా ప్రవేశపెడతారు. వాటికి పార్లమెంటు ఆమోదం లభిస్తే అవి చట్ట రూపం పొంది 2029 మార్చి 31 నుంచి అమల్లోకి వస్తాయి. ఫలితంగా 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆ ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుకు వీలవుతుంది’’అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్థానాల సంఖ్యను 50 శాతం పెంచుతున్నందున వాటిలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ స్థానాల సంఖ్య కూడా ఆ మేరకు పెరగనుంది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుతమున్న 25 నుంచి 37 లేదా 38కి పెరుగుతుంది. వాటిలో 12 నుంచి 13 సీట్లు మహిళలకు, రిజర్వు చేస్తారు. అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి 262 లేదా 263కు పెరగనుంది. వాటిలో 86 నుంచి 87 స్థానాలను మహిళలకు ప్రత్యేకిస్తారు. తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయి. వాటిలో 8 నుంచి 9 సీట్లు మహిళలకు రిజర్వు చేస్తారు. అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరుగుతాయి. వాటిలో 59 స్థానాలను మహిళలకు ప్రత్యేకిస్తారు. నియోజకవర్గాల పెంపుకు 2027 జనాభా లెక్కలను కాకుండా 2011 గణాంకాలనే ప్రాతిపదికగా తీసుకోవాలని మోదీ సర్కారు నిర్ణయించింది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పెంపు విషయమై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రధాన పారీ్టలతో ఎన్డీఏ ఇంకా సంప్రదింపులు జరపాల్సి ఉంది. -
నియోజకవర్గాల పునర్విభజన.. అనివార్యం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికలలోపు నియోజకవర్గాల పునర్విభజన అనివార్యమని రాజకీయ పరిశీలకుడు జోతిర్మయరెడ్డి అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉత్తర –దక్షిణాది రాష్ట్రాల మధ్య జనాభా వైరుద్యం నెలకొన్న నేపథ్యంలో దామాషా పద్దతిన పెంచటమే మేలని ఆయన చెప్పారు.బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాలో 182 శాసనసభ స్థానాలు, 26లోక్‌సభ స్థానాల ఏర్పాటు జరుగుతుందని పేర్కొన్నారు. మహిళలకు సైతం 60 స్థానాలు రిజర్వు అవుతాయని, అయితే వాటిని లాటరీ పద్దతిన ఎంపకి చేసే అవకాశం ఉంటుందని జ్యోతిర్మయరెడ్డి వెల్లడించారు. -
సర్వత్రా డీలిమిటేషన్ చర్చ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నియోజకవర్గాల పునర్విభ జన హాట్ టాపిక్‌గా మారింది. రానున్న సాధారణ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ జరుగుతుందనే సమాచారంతో.. పల్లె, పట్నం, చిన్నా, పెద్దా రాజకీయ నేతలనే తేడా లేకుండా పునర్విభజన గురించిన చర్చే జరుగుతోంది. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు, అధికారులు కూడా ఈ అంశంపైనే ఎక్కువగా మాట్లాడుకోవడం కన్పించింది. ముఖ్యంగా సెంట్రల్, నార్త్, సౌత్ తెలంగాణల్లో ఎక్కడ ఎన్ని అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే దానిపై ఆసక్తి నెలకొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరిగితే సెంట్రల్ తెలంగాణగా పరిగణించే హైదరాబాద్ చుట్టూ ఉండే మేడ్చల్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, పటాన్చెరు, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలు విడిపోయి అత్యధిక సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో సెంట్రల్ హైదరాబాద్ ఓటర్లను ఆకర్షించగలిగే పార్టీలు సులువుగా అధికారం దక్కించుకునే విధంగా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిపోతుందనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల జనాభాలో మార్పురాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మొత్తం 33 జిల్లాలు ఏర్పడ్డాయి. వీటికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా లభించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగే పునర్విభజన ఆయా జిల్లాల పరిధిలోనే ఉండనుంది. కొత్త జిల్లాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, ఈ మేరకు నియోజకవర్గాల జనాభాలో మార్పు ఉంటుందని, ఇందుకోసం ప్రత్యేక అనుమతి తీసుకుంటారనేది నిపుణుల భావన. జిల్లా, రాష్ట్రం యూనిట్గానియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్ల కేటాయింపునకు చాలా కాలంగా ఓ పద్ధతి పాటిస్తున్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల కోసం జిల్లా యూనిట్‌గా, ఎస్టీ నియోజకవర్గాల కోసం రాష్ట్రం యూనిట్‌గా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ ఒకటి లేదా రెండు స్థానాలు ఎస్సీలకు రిజర్వు అయ్యే అవకాశాలున్నాయి. ఇక ఎస్టీ రిజర్వుడు స్థానాల విషయానికి వస్తే రాష్ట్రం మొత్తం వారి జనాభా ఆధారంగా మొత్తం స్థానాలను నిర్ధారించి, ఆ మేరకు ఎస్టీల జనాభా ఎక్కువ ఉండే నియోజకవర్గాలను రిజర్వు చేయనున్నారు. రొటేషన్ పద్ధతిలో మహిళా కోటాఈసారి మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కూడా అమలయ్యే అవకాశాలున్న నేపథ్యంలో 60 అసెంబ్లీ స్థానాలు రొటేషన్ పద్ధతిలో రిజర్వు అవుతాయని, పదిహేనేళ్లలో ఈ రొటేషన్ పూర్తయి రాష్ట్రంలోని అన్ని స్థానాలకూ మహిళలు ప్రాతినిధ్యం వహిస్తారని తెలుస్తోంది. అయితే ప్రతిసారి ప్రతి జిల్లాలో ఒకటి నుంచి మూడు స్థానాలు మహిళలకు రిజర్వు అయ్యే అవకాశాలున్నాయి. అదే విధంగా లోక్‌సభ స్థానాల విషయానికి వస్తే ప్రస్తుతమున్న 17కు తోడు అదనంగా పెరిగే 9 స్థానాలు మహిళలకే రిజర్వు కానున్నాయి. పదవుల సంఖ్యలోనూ మార్పులుప్రస్తుతం జరుగుతున్న చర్చకు అనుగుణంగా శాసన, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయితే, ఆ మేరకు పలు పదవుల సంఖ్య కూడా మారనుంది. ముఖ్యంగా శాసనమండలిలోనూ సగం స్థానాలు పెరుగుతాయని రాజకీయ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణ శాసనమండలిలో 40 మంది సభ్యులుండగా, పునర్విభజన అనంతరం అది 60కి చేరనుంది. దీంతో పాటు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ సభ్యులు కూడా పెరగనున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఏడుగురు రాజ్యసభ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, పునర్విభజన అనంతరం ఆ సంఖ్య 11కు చేరనుంది. ఇక రాష్ట్ర మంత్రివర్గం సైజు కూడా పునర్విభజన అనంతరం పెరగనుంది. మొత్తం ఎమ్మెల్యేల్లో 15 శాతం మంది మంత్రులుగా పనిచేసే అవకాశం ఉండడంతో ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో ముఖ్యమంత్రితో కలిపి మంత్రుల గరిష్ట సంఖ్య 18గా ఉంది. అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో 17 మంది మంత్రులుగా పనిచేయవచ్చు. అదే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మంత్రివర్గం సంఖ్య 27కు చేరనుంది. అయితే పునర్విభజన బిల్లుకు, ఇతర అంశాలకు సంబంధం లేని మండలి నుంచి మంత్రివర్గం వరకు ప్రత్యేక బిల్లుల ద్వారా సవరణలు చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?నియోజకవర్గాల పునర్విభజనతో రాజకీయంగా ఎవరికి లబ్ధి కలుగుతుందనే చర్చ కూడా జరుగుతోంది. అయితే రాజకీయాలకతీతంగా, డీలిమిటేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా, జనాభా లెక్కలు, భౌగోళిక సరిహద్దుల ఆధారంగా జరిగే ఈ ప్రక్రియ ద్వారా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది ఇప్పటికిప్పుడే చెప్పే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులంటున్నారు. పునర్విభజన సమయంలో నియోజకవర్గాల కూర్పు, ఆయా నియోజకవర్గాలకు కేటాయించే రిజర్వేషన్లు, నగర ప్రాంతాల్లో పెరిగే స్థానాలు, గ్రామీణ ప్రాంతాల అసెంబ్లీ నియోజకవర్గాల స్వరూపంలో జరిగే మార్పులను బట్టి ఈ లబ్ధిని అంచనా వేయగలుగుతామని చెబుతున్నారు. అయితే సెంట్రల్ తెలంగాణలో సీట్లు భారీగా పెరిగిన పక్షంలో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్లకు కొంత మేలు జరగవచ్చని, గ్రామీణ తెలంగాణలో సీట్లు ఎక్కువగా పెరిగితే కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఆలాంటి తప్పు కేంద్ర ప్రభుత్వం చేస్తుందని అనుకోను: కేటీఆర్
హైదరాబాద్: నియోజకవర్గాల డిలిమిటేనేషన్‌ను స్వాగతిస్తున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డిలిమిటేషన్ అనేది ఎప్పుడో జరగాలని, ఇప్పటికే ఆలస్యమైందన్నారు. ఏపీ విభజన చట్టంలోనే నియోజకవర్గ పునర్విభజన హామీ ఉందన్నారు కేటీఆర్. ఈ మేరకు మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ పార్లమెంట్లో దక్షిణాదికి 24 శాతం ప్రాతినిధ్యం ఉంది. దానిని యథావిధిగా కొనసాగించాలి. కేంద్రం దక్షిణానికి అన్యాయం చేస్తుందని నేను అనుకోను. దక్షిణాది కుటుంబ నియంత్రణను బాగా పాటించింది. కుటుంబ నియంత్రణ పాటించని వారికి నజరానా.. పాటించిన వారికి జురుమానా అంటే కుదురదు. ఆలాంటి తప్పు ప్రభుత్వం చేస్తుందని అనుకోను. డీలిమిటేషన్ జరిగితే ప్రజలకు సేవ చేసే అవకాశం ఎక్కువ మందికి వస్తుంది. అశ్వారావుపేటలో ఒక లక్షా 30వేల ఓట్లు ఉంటే.. శేరిలింగంపల్లిలో 9లక్షల ఓట్లు ఉన్నాయి. డిలిమిటేషన్‌తో ఈ వ్యత్యాసం పోతుంది’ అని అన్నారు కేటీఆర్ఇక ఫార్ములా రేస్ కేసు గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల డైవర్షన్ కోసమే ఈ ఫార్ములా కేసు. చార్జ్‌షీట్. ప్రజల దృష్టిని మరల్చడానికి చార్జ్‌షీట్ వ్యవహారం. ఫార్ములా ఈ-రేసింగ్ కేసు లొట్టపీస్ కేసు. నేను మొదటి నుంచి చెప్తొన్న.. ఇది లొట్ట పీస్ కేసు. న్యాయస్థానాల్లో ఫార్ములా ఈ -రేసు కేసు నిలబడదు. ఈకేసులో ఎవరికైతే లబ్ధి జరిగిందని చెప్తున్నారో.. వారితో రేవంత్ దావోస్ లో మంతనాలు జరిపారు. కక్ష ఉంటే నామీద తీర్చుకోండి. అధికారులను ఎందుకు బలి చేస్తున్నారు?, డబ్బులు చెల్లింపుపై నేనే మంత్రిగా నిర్ణయం తీసుకున్నాను. దమ్ముంటే నామీద చర్యలు తీసుకోవాలి. ఎక్కడా డబ్బులు దారి మళ్ళలేదు. తప్పు జరగలేదు. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సక్షన్ జరిగింది. అరెస్ట్‌ల గుంరించి రేవంత్ రెండేళ్ళుగా చెప్తూనే ఉన్నారు. రిమాండ్‌కు పంపేది కోర్టులు.. రేవంత్ రెడ్డి కాదు’ అని పేర్కొన్నారు. -
GHMC: డీ లిమిటేషన్‌కు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) వార్డుల పునరి్వభజన (డీలిమిటేషన్)కు బ్రేక్ పడింది. డివిజన్ల పునరి్వభజన సహేతుకంగా లేదనే ఆరోపణల నేపథ్యంలో డీలిమిటేషన్ ప్రక్రియను తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. నగర శివార్లలోని 20 పురపాలికలు, ఏడు నగర పాలక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ 300 వార్డులు పునరి్వభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ప్రజల నుంచి అభ్యంతరాలను కూడా స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ రేపో, మాపో విడుదల కాగలదనుకుంటున్న తరుణంలో తాజా పరిణామం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక నోటిఫికేషన్ ఈ నెల 9వ తేదీన జారీ కాగా, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో 22వ తేదీ వరకు కూడా ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరించారు. పునరి్వభజనపై దాదాపు 6వేల అభ్యంతరాలు, ఫిర్యాదులు అందాయి. వాటిల్లో అర్హత కలిగిన, సమంజసమైనవిగా భావించిన అన్నింటినీ పరిష్కరించినట్లు అధికారులు పేర్కొన్నారు. అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, ముమ్మర కసరత్తుతో రేయింబవళ్లు పనిచేసి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఇక తుది నోటిఫికేషన్ జారీ కావడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వారి ఆదేశాల మేరకు తుది నోటిఫికేషన్‌ను పెండింగ్‌లో పెట్టినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఎందుకో..? వచ్చే సంవత్సరం జరగాల్సిన ఎస్ఐఆర్, జనగణనను దృష్టిలో ఉంచుకొని డీలిమిటేషన్‌ను త్వరితంగా పూర్తిచేయాలని పురపాలకశాఖ భావించింది. దానికి తగ్గట్టుగానే చకచకా డివిజన్లు, సర్కిళ్ల హద్దులకు ఈ నెలాఖరులోపు తుదిరూపు ఇవ్వాలని నిర్ణయించింది. పారీ్టలకతీతంగా అటు ప్రజాప్రతినిధుల నుంచి, ఇటు ప్రజల నుంచి కూడా కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులందడం, పలువురు ప్రజాప్రతినిధులు లిఖితపూర్వకంగా అభ్యర్థనలు, తదితరమైన వాటి నేపథ్యంలో తుది నోటిఫికేషన్ వెలువరిస్తే, హడావుడిగా ముగించారని విమర్శలు వెల్లువెత్తుతాయనే అభిప్రాయంతో ప్రభుత్వం ప్రస్తుతానికి బ్రేకులు వేయాలని భావించినట్లు తెలిసింది. అధికారపార్టీ ప్రజాప్రతినిధుల నుంచి కూడా ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం కావడంతో డివిజన్ల పేర్లు, హద్దులు, కార్పొరేషన్ల విభజనపై అచితూచి అడుగువేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచి్చనట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది. జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలికి ఫిబ్రవరి పదోతేదీ వరకు గడువుండటాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని తుది నివేదికకకు విరామమిచి్చనట్లు తెలుస్తోంది.విలీనంపై వివరణివ్వండి సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో సమీప మున్సిపాలిటీలను విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన న్యాయ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 28కి వాయిదా వేసింది. ఔటర్ రింగ్ రోడ్ లోపలి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ జారీ చేసిన ఆర్డీనెన్స్‌లను సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు చెందిన బీ రాజు హైకోర్టులో మూడు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్ తుక్కుగూడ మున్సిపాలిటీలో ఓటరు. వివాదాస్పదంగా విలీనం చేసిన మున్సిపాలిటీల్లో ఇది ఒకటి. పిటిషనర్ రాబోయే మున్సిపల్ ఎన్నికలకు పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థి అని.. విలీనం కారణంగా భూభాగ పరిధి, పాలన, స్వరూపం, జనాభా మార్పులతో ప్రత్యక్షంగా ప్రభావితమవుతున్నారు. ఆర్డినెన్స్ జారీకి ముందు తుక్కగూడ కార్పొరేషన్‌తో సంప్రదింపులు జరపాల్సి ఉంది. అలా చేయకుండా ఏకపక్షంగా విలీనం చేపట్టినందున ఆర్డినెన్స్ 9, 10, 11ల అమలును నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం–1955కు చేసిన సవరణలను ఆపి వేయాలి’అని కోరారు. కౌంటర్ దాఖలుకు కొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. -
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై దాఖలైన పిటిషన్లు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. జీహెచ్ఎంసీ వార్డుల విభజనలో జోక్యం చేసుకోమని హైకోర్టు స్పష్టం చేసింది. వార్డుల విభజన అభ్యంతరాలపై హైకోర్టులో 80కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. అభ్యంతరాల గడువు పూర్తైనందున పిటిషన్ల విచారణను హైకోర్టు ముగించింది.కాగా, శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్ల వరకు పెరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను పరిపాలన సౌలభ్యం కోసం 300 వార్డులుగా విభజించారు. విలీనానికి ముందు 750 చదరపు కిలోమీటర్ల పరిధిలో 150 వార్డులుగా ఉన్నప్పుడు కొన్ని వార్డుల్లో ఎక్కువ జనాభా, కొన్నింటిలో తక్కువ జనాభా ఉంది. ఒక వార్డు రెండు నియోజకవర్గాల పరిధిలో ఉండేది. ఇలాంటి వాటికి తావులేకుండా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని 300 వార్డులుగా విభజించినట్లు జీహెచ్ఎంసీ చెబుతోంది. -
ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై స్టే ఇవ్వాలని కోరిన పిటిషనర్లు
-
జీహెచ్ఎంసి డీలిమిటేషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసి డీలిమిటేషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డీలిమిటేషన్‌పై అభ్యంతరాలు స్వీకరించే గడువును మరో రెండు రోజులు పొడిగించింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీహెచ్ఎంసీ 24 గంటల్లోపు జనాభా వివరాలు, వార్డుల వారీగా మ్యాప్‌ను పబ్లిక్ డొమైన్లో ఉంచాలి. పౌరులు రెండు రోజుల్లోపు తమ అభ్యంతరాలను సమర్పించాలి. వాదనలో అడ్వకేట్ జనరల్, సెన్సస్ కమిషనర్ ఇచ్చిన డిసెంబర్ 31 డెడ్‌లైన్ గురించి ప్రస్తావించారు. డెడ్‌లైన్ దగ్గర పడుతున్నందున.. రెండు రోజులకు మించి గడువు పొడిగించడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల న్యాయవాదులు మూడు రోజులు గడువు ఇవ్వాలని కోరగా.. హైకోర్టు రెండు రోజులు సరిపోతుందని తేల్చిచెప్పింది.అంతకుముందు జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్య పెంపుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా పిటిషనర్లు, ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా, రాష్ట్ర ప్రభుత్వ తరఫున హైకోర్టులో వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.డీలిమిటేషన్‌పై ముందస్తు సమాచారం ఇవ్వలేదని పిటిషనర్లు వాదించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రభాకర్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ మ్యాప్‌ను పబ్లిక్ డొమైన్లో ఉంచలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనికి ప్రతిగా పునర్విభజన మ్యాప్‌ను హైకోర్టుకు సమర్పించామని ఏజీ చెప్పారు. నియోజకవర్గాల సరిహద్దులు మార్చకుండా వార్డుల విభజన మాత్రమే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. పై విధంగా స్పందించింది. -
MLA Talasani: సొంత నిర్ణయాలు తీసుకుంటే ఊరుకోం..
-
డీలిమిటేషన్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచేలా నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)కు కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ‘ఈ పిటిషన్లో చట్టబద్ధత ఏదీ కనబడలేదు. అందుకే దీన్ని డిస్మిస్ చేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. 2014 నాటి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26ను అమలు చేయాలని... దాని ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు డీలిమిటేషన్ ప్రక్రియను కేంద్రం ప్రారంభించేలా ఆదేశించాలని ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు.కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన జమ్మూ–కశ్మీర్లో నియోజకవర్గాల పునర్వీభజన కోసం నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం.. ఇదే విషయంలో ఏపీ, తెలంగాణను మినహాయించడం వివక్షేనని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం జమ్మూ–కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కోసం జారీ చేసిన నియోజకవర్గాల పునర్వీభజన నోటిఫికేషన్ నుంచి ఏపీ, తెలంగాణను మినహాయించడం రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3)కి లోబడే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ఉందని, దాని ప్రకారం 2026 తర్వాత నిర్వహించే తొలి జనాభా లెక్కల అనంతరమే నియోజకవర్గాల పునర్వీభజన ప్రక్రియను చేపట్టడం సాధ్యమవుతుందని తేల్చిచెప్పింది. అనుమతిస్తే ఇక పిటిషన్ల వరద: సుప్రీం ధర్మాసనం జమ్మూ–కశ్మీర్లో ఇప్పటికే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడంపై పిటిషనర్ చేసిన వివక్ష వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మధ్య నియోజకవర్గాల పునర్విభజనలో వర్తించే నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయని, అందుకే జమ్మూకశ్మీర్‌కు జారీ చేసిన నోటిఫికేషన్‌ను రాష్ట్రాల పరిస్థితులతో సరిపోల్చడం తగదని వ్యాఖ్యానించింది. ఇలాంటి విజ్ఞప్తులను స్వీకరిస్తే దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి పిటిషన్లు వరదలా కోర్టులను ముంచెత్తే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. అలాంటి పరిణామాలకు తాము తలవంచలేమని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది. -
తెలుగు రాష్ట్రాలకు సుప్రీం షాక్
-
ఏపీ, తెలంగాణలో డీలిమిటేషన్ ఇప్పట్లో కుదరదు: సుప్రీంకోర్టు
సాక్షి, ఢిల్లీ: ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. రాజ్యాంగం పరిధికి లోబడే ఏపీ విభజన చట్టం సెక్షన్లు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం తీర్పును వెలువరించింది.ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో డీలిమిటేషన్ చేయాలని సుప్రీంకోర్టులో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పిటిషనర్.. జమ్ముకశ్మీర్‌లో డీలిమిటేషన్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది.రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కి లోబడి మాత్రమే ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్-26ను ప్రత్యేకంగా వేరుగా చూడలేం. ఆర్టికల్ 170 ప్రకారం 2026 తర్వాత అందుబాటులోకి వచ్చే జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ ఉంటుంది. రాజ్యాంగం పరిధికి లోబడే ఏపీ విభజన చట్టం సెక్షన్లు ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. రాజ్యాంగం పరిధిలోనే డీలిమిటేషన్ జరగాలి. లేకుంటే ఇలాంటి డిమాండ్లకు వరద గేట్లు ఎత్తినట్లే అవుతుంది. జమ్ముకశ్మీర్‌తో పాటు ఏపీ, తెలంగాణ డీలిమిటేషన్‌ను కలిపి చూడలేం అని స్పష్టం చేసింది. -
రంగారెడ్డిలో ఎక్కువ.. నిజామాబాద్‌లో తక్కువ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ శాసనసభ వచ్చే ఎన్నికల అనంతరం 153 మందితో కొలువు దీరనుంది. అందులో ఏకంగా 50 మంది మహిళా సభ్యులు ఉండనున్నారు. కొత్తగా రాష్ట్రంలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. 2027 మార్చికి జనాభా లెక్కలు పూర్తి కాగానే, నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ (డీలిమిటేషన్) పని ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేయనుంది. తెలంగాణ శాసనసభకు 2028 నవంబర్–డిసెంబర్లో జరిగే ఎన్నికలు కొత్త నియోజకవర్గాలతో నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల నుంచే మహిళలకు 33% రిజర్వేషన్ కూడా వర్తించనుంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతోపాటు ప్రస్తుతం ఉన్న కొన్ని నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దుల్లోనూ మార్పులు జరుగుతాయి. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సగటు జనాభా ప్రామాణికంగా...ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 2,30,064 జనాభా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పేర్కొన్న విధంగా తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాల్సి ఉంది. కానీ వివిధ రాజకీయ కారణాలతో దానిని వాయిదా వేస్తూ వచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాల పునర్విభజనను జాప్యం చేస్తున్నారంటూ ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సమాధానమిస్తూ.. కొత్త జనాభా లెక్కలు రాగానే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపింది. కోర్టు కేసుతో సంబంధం లేకుండానే 2027 తర్వాత దేశమంతా పునర్విభజన చేస్తుండటంతో రాష్ట్రంలో నియోజకవర్గాల్లో చేర్పులు, మార్పులు, కొత్త నియోజకవర్గాల ఏర్పాటు అనివార్యం కానున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధిక స్థానాలు 2011 జనాభా లెక్కలతోపాటు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ తాజా అంచనాల మేరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 9 శాసనసభ స్థానాలు పెరగనున్నాయి. అవన్నీ ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న శివారు ప్రాంతాల్లోనే కావటం విశేషం. జాతీయ సగటును మించి, విద్య, ఉపాధి, ఐటీ, ఫార్మా, సినిమా, ఇతర అవకాశాల కోసం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు పెరిగిన వలసల తాకిడి కారణంగా నగరంలో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. పునర్విభజనలో గ్రేటర్ హైదరాబాద్‌లో కనీసం పది అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ కోర్‌సిటీ (హైదరాబాద్ జిల్లా)లో రెండు, గ్రేటర్ హైదరాబాద్‌లో భాగమైన శివార్లలోని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, రాజేంద్రనగర్, మహేశ్వరం తదితర నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాలన్నీ విడిపోయి కొత్తగా 9 కొత్త నియోకజవర్గాలు ఏర్పాటు కానున్నాయి.ఖమ్మం జిల్లాలో ప్రత్యేక పరిస్ధితిడీలిమిటేషన్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యేక పరిస్థితి ఏర్పడనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లా జనాభా 27,97,370. అయితే, ఆ జిల్లా నుంచి 5 మండలాలు ఏపీలో విలీనం కావటం, కొన్ని మండలాలు ములుగు జిల్లాల్లోకి వెళ్లటంతో జిల్లా జనాభా గణనీయంగా తగ్గిపోయింది. అయినా, ఆదివాసీ ప్రాంతాలు, భౌగోళిక పరిస్థితుల కారణంగా ఆ జిల్లాలో శాసనసభ స్థానాలు తగ్గించకుండా అదనంగా రెండుస్థానాలు పెంచే అవకాశం ఉంది.డీలిమిటేషన్ ఇలా..– దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు పూర్తి కాగానే నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏర్పాటయ్యే కమిషన్ రాజకీయ పక్షాలు, ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తుంది. కొత్త జిల్లాల మేరకు ఒక మండలం ఒకే నియోజకవర్గం, ఒకే జిల్లాలో ఉండే విధంగా భౌగోళిక మార్పులు చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో పలు నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో కూడా ఉండగా, వాటిని ఒకే జిల్లా పరిధిలోకి తీసుకొస్తారు.– రాష్ట్ర మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గంలో ఉండాల్సిన సగటు జనాభాను నిర్ణయిస్తారు. 2001 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్న గత కమిషన్ తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి 2,30,064 సగటు జనాభాగా నిర్దారించింది. అయితే ఈ సగటుకు 10 శాతం జనాభా తక్కువ లేదా ఎక్కువైనా ఉండొచ్చు.– 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జనాభాను సగటుగా తీసుకుని డీలిమిటేషన్ చేయటంతో తెలంగాణలో అంతకు ముందు 107 ఉన్న అంసెబ్లీ స్థానాలు 119కి పెరిగాయి. 12 స్థానాలు ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిపోయాయి.– డీలిమిటేషన్లో కొండప్రాంతాలు, గిరిజనులు, ఇతర ప్రత్యేక కారణాలను కూడా పరిగణనలోకి తీసుకుని నియోకజవర్గాలు ఏర్పాటు చేస్తారు. కొండలతో, విసిరేసినట్లు ఉండే హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహోల్ – స్పితి అసెంబ్లీ నియోజకవర్గం 25 వేల జనాభాతోనే ఏర్పాటైంది. సిక్కింలోని సాంగ్మో అసెంబ్లీ స్థానం సైతం తక్కువ జనాభాతో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 6,98,000 మందితో అత్యధిక జనాభా కలిగిన శాసనసభ నియోజకవర్గంగా శేరిలింగంపల్లి రికార్డుకెక్కింది. ఢిల్లీలోని చాందినీచౌక్, యూపీలోని ఘజియాబాద్‌లు సైతం జనాభా పరంగా అదిపెద్ద నియోజకవర్గాలే. -
స్టాలిన్.. కేంద్రం.. ఓ న్యాయ కమిషన్..
ఈ మధ్య కాలంలో, కేంద్ర విధానాలపై దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభజించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన.. తాజాగా దక్షిణాది రాష్ట్రాల్లో కాకను పెంచుతోంది. కేంద్రంతో, దక్షిణాది రాష్ట్రాలు తగవు పెట్టుకోవడానికి ఇదొక్కటే కారణం కాదు. కేంద్ర ప్రభుత్వం.. ముఖ్యంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈమధ్య తీసుకుంటోన్న కొన్ని కీలక నిర్ణయాలు.. దక్షిణాది రాష్ట్రాల్లోని ఎన్డీయేతర ప్రభుత్వాల అధినేతల్లో తీవ్ర అసంతృప్తిని పెంచుతున్నాయి. అసంతుష్ట సీఎంల జాబితాలో.. తమిళనాడు ప్రభుత్వాధినేత ఎంకే స్టాలిన్ ముందు వరుసలో ఉన్నారు.కేంద్ర ప్రభుత్వ విధానాలు, వైఖరికి నిరసనగా స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసే పనిలో పడ్డారు. తొలుత, త్రిభాషా విధానంపై.. తమిళనాడులోని అన్ని రాజకీయ పక్షాలనూ.. తన దారిలోకి తెచ్చుకున్నారు. ముందు నుంచీ హిందీ వ్యతిరేక విధానాన్ని ఒంట పట్టించుకున్న తమిళ ప్రజలకు, తాము ఎక్కడ దూరమవుతామోనని, అక్కడి అన్ని పార్టీలూ, త్రిభాషా విధానాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఇదే ఊపులో.. స్టాలిన్, జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలను పునర్విభజించాలన్న అంశంపై, దక్షిణాదిలోని అన్ని రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మధ్యనే చెన్నైలో ఎన్డీయేతర పక్షాలతో భేటీని కూడా నిర్వహించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి కీలక మద్దతుదారుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్ప.. మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లోని కీలక పార్టీలన్నీ స్టాలిన్ ఆందోళనతో ఏకీభవించాయి. కేంద్ర ప్రభుత్వ దూకుడును నిలువరించాలని తీర్మానించాయి.తొలి తమిళ సీఎంలు.. కీలక కమిషన్లు..ఎన్డీయేతర పక్షాల భేటీ తర్వాత, మలి అడుగుగా, ఇప్పుడు, స్టాలిన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను తాజాగా నిర్వచించేందుకు, ఈ బంధాలు మెరుగయ్యే అవకాశాలపై అధ్యయనం కోసం ఏకంగా ఓ న్యాయ కమిషన్నే నియమించాలని నిర్ణయించారు. తగిన సిఫారసుల కోసం, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు.. మంగళవారం (15-04-2025) నాడు తమిళనాడు అసెంబ్లీలో కీలక ప్రకటన కూడా చేశారు. తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యంగా డీఎంకే నేతృత్వంలోని సర్కారు ఇలా కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై కమిషన్లను నియమించడం ఇదే తొలిసారి కాదు. 1969 ఫిబ్రవరిలో.. తొలిసారి ముఖ్యమంత్రి అయిన ఎం.కరుణానిధి, ఎనిమిది నెలల్లోనే ఇదే అంశంపై, రిటైర్డ్ న్యాయమూర్తి, జస్టిస్ రాజమన్నార్ నేతృత్వంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా.. తొలిసారిగా సీఎం పదవీ బాధ్యతలు చేపట్టిన స్టాలిన్, తండ్రి చూపిన బాటలోనే.. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై తానూ కమిషన్‌ను నియమించడం విశేషం.రాష్ట్రాలు నియమించే కమిషన్ల వల్ల ప్రయోజనముందా?కేంద్ర, రాష్ట్ర సంబంధాల పటిష్టతపై కమిషన్ల ఏర్పాటు అంశం కొత్తదేమీ కాదు. 1969లో డీఎంకే అప్పటి అధినేత కరుణానిధి వేసిన జస్టిస్ రాజమన్నార్ కమిషన్‌తో మొదలు పెడితే, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా, 1983లో, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్‌సింగ్ సర్కారియా కమిషన్, అనంతరం, 2007లో.. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్మోహన్ పూంచీ వేసిన కమిషన్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై సునిశితంగా అధ్యయనం చేసి సిఫారసులను చేశాయి.జస్టిస్ రాజమన్నార్ కమిటీ, జస్టిస్ సర్కారియా కమిటీలు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యతకు.. ప్రధాని నేతృత్వంలో, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని సూచించాయి. జస్టిస్ పూంచీ కమిటీ కూడా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపిణీ అంశంలో.. ప్రణాళిక, ఆర్థిక సంఘాల మధ్య సమన్వయానికి ఓ నిపుణుల కమిటీ ఉండాలని సూచించింది. రాష్ట్రాలు ఏర్పాటు చేసిన కమిటీలే కాదు, స్వయంగా కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీల సిఫారసులూ బుట్టదాఖలు కావడం శోచనీయం. ఇప్పుడు తాజాగా స్టాలిన్ నియమించే జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ చేసే సిఫారసులను, ఎటూ కేంద్రానికే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ సిఫారసులపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది.. ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు.మరి స్టాలిన్ దూకుడు ఎందుకు?తమిళనాడు అసెంబ్లీకి ఏడాది కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. గడచిన ఐదేళ్ల కాలంలో, స్టాలిన్ తన పాలనతో రాష్ట్రంపై విశిష్ట ముద్రనేదీ వేయలేదన్న భావన ఉంది. కాబట్టి, వచ్చే ఎన్నికల్లో మళ్లీ ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే, కచ్చితంగా, స్థానికుల సెంటిమెంట్‌ని రగిలించడమే సరైనదని స్టాలిన్ భావిస్తున్నారని స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం, నీట్ విధానాన్ని ప్రవేశ పెట్టినప్పుడు, ఇటీవలే త్రిభాషా విధానాన్ని ప్రతిపాదించినప్పుడు.. వాటిని వ్యతిరేకించడంలో స్టాలిన్ ముందు వరుసలోనే నిలిచారు. ఇప్పుడు, దక్షిణాది విశాల ప్రయోజనాల పేరిట, డీలిమిటేషన్ ప్రక్రియను ప్రధాన అస్త్రంగా మలచుకుని, స్టాలిన్, తమిళుల హృదయాల్లో.. తనను తాను, జాతీయ స్థాయి నాయకుడిగా ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. కేంద్రంపై పోరు, దాని వెనుక మర్మం ఏమైనా, స్టాలిన్ తాజా వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాలి. - పి.విజయ్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్. -
కేంద్రంతో దక్షిణాది రాష్ట్రాలు అమీ తుమీ!
జనసంఖ్య ప్రాతిపదికగా నియోజక వర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరుగుతుందనే ప్రకటనపై పార్లమెంట్‌లోనూ, బయటా దక్షిణాది రాష్ట్రాల వారు ప్రకంపనలు పుట్టిస్తున్నారు. ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నియోజకవర్గాలు లభించే అవకాశం ఉండడంతో పార్లమెంట్లో తక్కువ జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గిపోతుంది. అదే సమయంలో జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఇందువల్ల అధికారం, పరిపాలన, అభివృద్ధి వంటి అంశాల్లో దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుందనీ, ఫలితంగా దక్షిణాదిలో అస్తిత్వ సంక్షోభం రాజుకుంటుందనేది నిపుణుల మాట.కుటుంబ నియంత్రణ నిక్కచ్చిగా పాటించడం వలన దక్షిణ భారత జనాభా ఉత్తర భారత జనాభా కంటే బాగా తగ్గిన సంగతి తెలిసిందే. నిజానికి దక్షిణ భారతం (South India) ప్రకృతి వనరులూ, మానవ వనరుల పరంగా ఉత్తరాదికన్నా శక్తిమంతంగా ఉంది. దీని అంతటికీ కారణం శతాబ్దాలుగా బౌద్ధ జీవన సాంస్కృతిక వికాసమేనని చెప్పక తప్పదు. ఉత్తర భారతంతో పోల్చినప్పుడు, దక్షిణ భారతం అహింసాత్మకంగా ఉంది. శాంతియుతంగా వుంది. విద్యాపరంగా బలంగా ఉంది. అక్షరాస్యతలో ముందు ఉంది. స్త్రీ విద్యలో ముందు ఉంది. చరిత్ర, సంస్కృతులను పరిశీలించినా దక్షిణాదికి ప్రత్యేక స్థానం ఉన్నట్లు స్పష్టమవుతుంది. రక్తపాత రహిత కుల నిర్మూలన ఉద్యమం కొనసాగుతోందిక్కడ. అతి ప్రాచీన భాషలు మాట్లాడే ఆదివాసీలు ఎందరో ఇక్కడ ఉన్నారు. శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, చోళులు, విజయనగరరాజులు... ఇలా ఎందరో రాజులు, చక్రవర్తులు ఈ నేల సుభిక్షం కావడానికి తమ యుద్ధనైపుణ్యాన్నీ, పాలనా చాతుర్యాన్నీ ప్రదర్శించారు.ఈ రోజు ఢిల్లీ వాయు కాలుష్యంతో ఆక్సిజన్ లేక జీవన సంక్షోభంలో వుంది. దానికి ప్రత్యామ్నాయ రాజధాని వంటి హైదరాబాద్ దక్షిణాది నగరమే కదా. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ (BR Ambedkar) ఆనాడే హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేసుకోమని చెప్పారు. హైదరాబాద్ ఇటు దక్షిణాది వారికి, అటు ఉత్తరాది వారికి, పశ్చిమ భారతానికీ సెంటర్‌గా ఉంటుందని కూడా ఆయన చెప్పారు. విద్య, సాంకేతిక రంగాల్లో దక్షిణ భారతదేశం ఇప్పటికే ముందు ఉంది. ఐటీ, సాఫ్ట్వేర్, సాంకేతిక ఉత్పత్తుల ఎగుమతుల్లో దక్షిణాది రాష్ట్రాలే ముందున్నాయి. అలాగే ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థల్లో మన తెలుగువారితోపాటు మిగతా దాక్షిణాత్యులే ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్న సంగతీ తెలిసిందే. అరకొరగా ఉన్న వనరుల నుంచే ఈ స్థాయికి చేరారు మనవారు.ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యపై కేంద్ర పెత్తనాన్ని పెంచే ప్రతిపాదన ముందుకు వచ్చింది. వర్సిటీలు, కళాశాలల్లో అధ్యాపకులు, బోధనా సిబ్బంది నియామకం, పదోన్నతికి కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణకు ‘మార్గదర్శకాలు–2025’ పేరిట విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) ఇటీవల ఒక ముసాయిదాను విడుదల చేసింది. అందులోని అంశాలు బాగా వివాదాస్పదమవు తున్నాయి. ఇప్పటిదాకా విశ్వవిద్యాలయాల అధిపతులైన ఉప కులపతుల నియామకం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంది. నూతన ముసాయిదా ప్రకారం ఆ అధికారం ఛాన్స్లర్లుగా ఉన్న గవర్నర్ల చేతుల్లోకి వెళ్తుంది. ఈ మార్పును బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. తమిళనాడు (Tamil Nadu), కేరళ వంటివి నూతన ముసాయిదాను వ్యతిరేకిస్తూ చట్ట సభల్లో తీర్మానం కూడా చేశాయి. వైస్ ఛాన్స్లర్ల నియామక ప్రక్రియను కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకోవడాన్ని అవి వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర చర్యలతో ఉన్నత విద్యపై తమ పట్టును పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని ఆయా రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర– రాష్ట్ర సంబంధాలు బలహీనమవ్వడం గమనార్హం.చదవండి: ప్రజలు భయపడే పరిస్థితి కల్పిస్తే దిక్కెవరు? ఈ పరిస్థితుల్లో డీలిమిటేషన్ అంశం ముందుకు రావడంతో దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంతో అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (CM Stalin) నిరసన గళాన్ని వినిపించడంలో ముందున్నారు. ఆయన చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశానికి దక్షిణ భారతానికి చెందిన బీజేపీయేతర పార్టీలు చాలావరకూ హాజరయ్యాయి. ఈ విషయంలో అన్నీ ఒకే విధమైన నిరసనను వ్యక్తం చేయడం స్వాగతించవలసిన విషయం. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి ఎటువంటి నష్టం రాదని కేంద్ర పాలకులు అంటున్నా... అది ఎలాగో ఇంతవరకూ వివరించలేదు. కేంద్రం సముచితంగా వ్యవహరించకపోతే దేశంలో అశాంతి రేగే ప్రమాదాన్ని చెన్నై (Chennai) సమావేశ ధోరణి చూస్తే అర్థమవుతుంది.- డాక్టర్ కత్తి పద్మారావు దళితోద్యమ నాయకులు -
KSR Comment: డీలిమిటేషన్ పై స్పష్టంగా చెప్పిన జగన్
-
జనాభా ఆధారంగా డీలిమిటేషన్ వద్దు
సాక్షి, హైదరాబాద్: జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంటు స్థానాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టరాదంటూ సీఎం గురువారం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. సీఎం ప్రసంగం అనంతరం ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. తీర్మానంపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ప్రధాన మంత్రులు ఇందిరాగాందీ, వాజ్‌పేయి జనాభా లెక్కన కాకుండా, ఉన్న 543 పార్లమెంటు సీట్లనే కొనసాగిస్తూ పునర్విభజన చేశారని గుర్తుచేశారు. అదే విధానాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డీలిమిటేషన్‌పై పలు వివరాలను సీఎం సభ ముందుంచారు. సంప్రదింపుల తర్వాతే ముందుకెళ్లాలి ఎవరినీ సంప్రదించకుండా కేంద్రం ఇష్టారీతిగా డీలిమిటేషన్‌ను చేపట్టడం మంచిది కాదని సీఎం అన్నారు. ‘లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు, అనుసరించబోయే విధానాలు, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు లేకుండా జరుగుతున్న తీరుపై సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు, భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల తర్వాతే పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని ఈ సభ కోరుతోంది. కేంద్ర లక్ష్యాలకు అనుగుణంగా జనాభా నియంత్రణను సమర్ధంగా అమలు చేసిన రాష్ట్రాలకు పునర్విభజన ప్రక్రియ శాపంగా మారకూడదు. అందుకే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు సీట్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలి. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ఇప్పుడున్న నియోజకవర్గాల సరిహద్దుల మార్పులు చేర్పులు చేపట్టాలి. తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచి మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. ప్రాతినిథ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో నిర్దేశించిన మేరకు 119 అసెంబ్లీ స్థానాలను 153కు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తోంది. అందుకే అవసరమైన మేరకు రాజ్యాంగ సవరణలు చేపట్టాలని ఈ సభ కేంద్రాన్ని కోరుతోంది’అని సీఎం తెలిపారు. గత విధానాలకు విరుద్ధంగా మోదీ చర్యలు గతంలో నాలుగుమార్లు పార్లమెంటు స్థానాల పునర్విభజన జరిగినప్పుడు అనుసరించిన విధివిధానాలనే రాజ్యాంగంలో పొందుపర్చారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ అందుకు విరుద్ధంగా వెళ్తున్నారని విమర్శించారు. ‘1971 జనాభా లెక్కల తర్వాత పునర్విభజన ప్రతిపాదన వచ్చినప్పుడు నాటి ప్రధాని ఇందిరాగాం«దీ.. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే రాష్ట్రాల మధ్య అంతరం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం చెడిపోతుందని భావించి.. 25 ఏళ్లపాటు పాతవాటినే కొనసాగించాలని నిర్ణయించారు. ఆ సంఖ్య ప్రకారమే వాటి పునర్విభజన చేయాలని చట్టాన్ని సవరించారు. 543 స్థానాలకుగాను దక్షిణాది 6 రాష్ట్రాల్లో ఉన్న 130 నియోజకవర్గాలను పునర్విభజించారు. 2006 తర్వాత జరిగిన పునర్విభజనలో నాటి ఉమ్మడి రాష్ట్రంలో 42 నియోజకవర్గాలను ఎస్సీ, ఎస్టీ జనాభా ఆధారంగా మొత్తం సంఖ్య పెరగకుండా పునర్వి భజించారు. 2002 జనాభా లెక్కల తర్వాత నాటి ప్రధాని వాజ్‌పేయి కూడా ఇందిరాగాంధీ విధానాన్నే అనుసరించి మరో 25 ఏళ్లపాటు అదే సంఖ్య కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం అందుకు భిన్నంగా పనిచేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల ఆందోళన తెలిపేందుకు ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, ప్రజా ప్రతినిధులతో చెన్నైలో సమావేశం నిర్వహించారు. కానీ, కేంద్రం అలాంటి నిర్ణయమే తీసుకోలేదని కొందరు కేంద్ర మంత్రులు అంటున్నారు. వారి మాటలు అర్ధసత్యమేనని నేను చెప్తున్నా’అని పేర్కొన్నారు. దక్షిణాది ప్రమేయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం విధించిన జనాభా లక్ష్యాలను దక్షిణాది రాష్ట్రాలు పకడ్బందీగా అమలుచేస్తే.. ఉత్తరాది రాష్ట్రాలు విఫలమయ్యాయని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ‘దక్షిణాదిలో జనన మరణాల మధ్య అంతరం 1.8 శాతం మాత్రమే ఉంది. 543 ఎంపీ సీట్లలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల వాటా 24 శాతం. ప్రస్తుత జనాభా ఆధారంగా పునర్విభజన జరిగితే అది 19 శాతానికి తగ్గుతుంది. అప్పుడు దక్షిణాది ప్రమేయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఏర్పడుతుంది. ఇది దక్షిణాదికి క్షేమకరం కాదు. అందుకే రాజకీయాలకు అతీతంగా మనం గళం విప్పాలి. రాష్ట్రంలో భట్టి విక్రమార్క, కేకే, జానారెడ్డిల ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి, ఉమ్మడి మాటగా కేంద్రానికి వినిపించాలని నిర్ణయించారు. అందులో భాగంగా సభలో ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నాం. తెలుగు రాష్ట్రాలపై వివక్ష తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 153కు, ఏపీలో 225కు పెంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచినా.. కేంద్రం దాన్ని అమలు చేయలేదు. ఈ విషయాన్ని నేను పార్లమెంటులో ప్రస్తావించినప్పుడు 2026లో జనాభా లెక్కల తర్వాతే అది సాధ్యమని బదులిచ్చింది. కానీ, కేంద్రంలోని ప్రధాన పార్టీ తన ప్రయోజనాల కోసం జమ్మూకశ్మీర్, సిక్కింలో అసెంబ్లీ స్థానాల పునర్విభజన ప్రక్రియ చేపట్టింది. ఇది ద్వంద్వ వైఖరి కాదా? పార్లమెంటులో 24 శాతం ప్రాతినిథ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు.. పన్నుల రూపంలో జీడీపీకి 36 శాతం సమకూరుస్తున్నాయి. కానీ తిరిగి కేంద్రం నుంచి మనకు వస్తోంది చాలా తక్కువ. కేంద్రానికి మనం రూపాయి చెల్లిస్తే.. తిరిగి వస్తోంది 42 పైసలు మాత్రమే. అదే బిహార్ ఒక రూపాయి చెల్లిస్తే.. తిరిగి ఆ రాష్ట్రానికి కేంద్రం రూ.6.06 అందిస్తోంది. ఉత్తరప్రదేశ్‌కు రూ.2.73, మధ్యప్రదేశ్‌కు రూ.1.70 చొప్పున అందిస్తోంది. ఇంతకాలం ఆర్థిక ప్రయోజనాలను వదులుకున్నా, ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యాన్ని వదులుకునేందుకు మనం సిద్ధంగా లేము. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పక్షాలు కలిసికట్టుగా పోరాట ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలో అన్ని దక్షిణాది రాష్ట్రాల పార్టీలతో హైదరాబాద్‌లో ఓ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని పార్టీలు అందులో భాగస్వాములు కావాలి’అని సీఎం పిలుపునిచ్చారు. ఈ తీర్మానంపై సీఎం మాట్లాడిన తర్వాత ఇతర పక్షాల అభిప్రాయాన్ని తీసుకోకుండానే, సభ ఏకగ్రీవంగా ఆమో దించిందని స్పీకర్ ప్రకటించారు. -
డీలిమిటేషన్ కు జనాభా ఒక్కటే ప్రాతిపదిక కాకూడదు: సీఎం రేవంత్ రెడ్డి
-
మోదీ అంటే భయమా.. దక్షిణాదిపై స్పందనేది బాబు?
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం దక్షిణాది రాష్ట్రాలలో కాక పుట్టిస్తోంది. చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 14 రాజకీయ పార్టీల నేతల సమావేశం ప్రస్తుత జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గట్టిగానే చెప్పగలిగింది. ఈ సమావేశానికి హాజరు కాకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ కూడా తన అభిప్రాయాలను విస్పష్టంగా తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ కాపీని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు పంపించారు.తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ అంశం వల్ల ఏ రాష్ట్రానికి నష్టం జరగదని, ఇంకా చర్చ జరగలేదని చెబుతుంటే మరో కేంద్రమంత్రి బండి సంజయ్ మాత్రం చెన్నై సమావేశాన్ని దొంగల భేటీగా పోల్చి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సంజయ్ ఇప్పటికీ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ అంశంపై మాట్లాడడానికి నోరు పెగులుతున్నట్లు లేదు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పునర్విభజన వల్ల నష్టం జరుగుతుందని అనుకోవడం లేదని చెబుతున్నారు. వీరిద్దరు బీజేపీతో కూటమి కట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.గతంలో చంద్రబాబు నాయుడు తను కూటమిలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే ఊరుకోబోనని కనీసం కబుర్లయినా చెప్పేవారు. ఇప్పుడు ఆ ధైర్యం కూడా చేయలేకపోవడం గమనార్హం. పాతికేళ్లపాటు పునర్విభజన వద్దని చెన్నై భేటీలో పాల్గొన్న నేతలు కోరారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో వచ్చే సమస్యకు జగన్ తన లేఖ ద్వారా పరిష్కార మార్గాలు వివరించారు. పాతికేళ్ల నిషేధమన్న డిమాండ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదన్న సంగతి గుర్తుంచుకోవాలి. పాతికేళ్లలో ఉత్తరాది జనాభా మరింత పెరగదని ఈ నేతలు గ్యారంటీ ఇవ్వగలరా అన్న ప్రశ్న వస్తుంది. అందువల్ల ఇప్పుడే పునర్విభజన వ్యవహారానికి ఒక పద్దతైన పరిష్కార మార్గం ఆలోచించాలని చెప్పక తప్పదు.వైఎస్ జగన్ తన లేఖలో పేర్కొన్నట్లు ఆయా రాష్ట్రాలకు ప్రస్తుతం పార్లమెంటులో ఉన్న వాటాను యథాతథంగా కొనసాగించడానికి ప్రయత్నాలు జరిగితే బాగుంటుంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణలు అవసరం అవుతాయి. ఇదే ఉద్దేశం చెన్నై భేటీలో పాల్గొన్న నేతలందరికీ ఉన్నప్పటికీ, వారి తక్షణ డిమాండ్ మాత్రం పునర్విభజన వద్దన్నది కావడం గమనార్హం. అయితే, పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా నియోజకవర్గాలు పెరగకపోతే ఎన్నికైన ఎంపీలకు అవి అలవికానివిగా మారతాయి. ఉదాహరణకు ఇప్పుడు 17 లక్షల నుంచి 19 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉంటే, అది పాతిక లక్షలకు ఒక నియోజకవర్గంగా మారవచ్చు. అదే సమయంలో ఏ రాష్ట్రానికి దీనివల్ల నష్టం జరగకూడదన్నది అంతా ఒప్పుకోవాలి.ఈ సమస్యకు ప్రధాన కారణం ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా నియంత్రణ సరిగా లేకపోవడం, దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా జనాభా పెరుగుదలను నియంత్రించడం. దీనివల్ల జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను నిర్ణయిస్తే ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మొదలైన రాష్ట్రాలలో కొత్త నియోజకవర్గాలు భారీ ఎత్తున వస్తాయి. దక్షిణాదిలో మాత్రం ఆ స్థాయిలో పెరగవు సరికదా కేరళ వంటి చోట్ల నియోజకవర్గాలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 48 సీట్లు పెరిగితే ఆ రాష్ట్రం ఎంపీలు చెప్పినట్టుగా వినాల్సిన పరిస్థితి కేంద్రానికి వస్తుంది. యూపీతోపాటు బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి కొద్ది రాష్ట్రాలే దేశాన్ని శాసించే పరిస్థితి రావచ్చు. ఈ పరిణామం ఒకరకంగా నియంతృత్వ ధోరణికి దారి తీయవచ్చన్నది దక్షిణాది రాష్ట్రాల నేతల భయం.జనాభా ప్రాతిపదికన పునర్విభజన రాజకీయ నేతలకే కాదు.. దక్షిణాది ప్రజలకు కూడా నష్టం కలిగించే అంశమే. నిధుల పంపిణీ వంటి వాటిలో ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ వాటా వస్తుంటే, ఉత్తరాదికి అధిక వాటా వెళ్తోంది. ఈ అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ, యూపీ నుంచి కేంద్రానికి అందే రూపాయి పన్ను అందితే, తిరిగి ఆ రాష్ట్రానికి 2.73 రూపాయలు వెళుతున్నాయని తెలిపారు. బీహార్‌కు రూపాయికి ఆరు రూపాయలకు పైగా నిధులు వెళుతుంటే తమిళనాడుకు 29పైసలు, కర్ణాటకకు 14 పైసలు, తెలంగాణకు 41 పైసలు, కేరళకు 66 పైసల వాటా మాత్రమే నిధులు వస్తున్నాయని వివరించారు. ఈ వివక్షతో పాటు ఇప్పుడు లోక్‌సభ నియోజకవర్గాలు కూడా తగ్గితే ఉత్తరాది, దక్షిణాది అంతరం బాగా పెరిగే ప్రమాదం ఉంటుంది. దేశ సమగ్రత భావానికి ఇది విఘాతం కలిగిస్తుంది. అనవసరమైన అపోహలకు దారి తీస్తుంది.కేరళ ముఖ్యమంత్రి విజయన్ కూడా ఉత్తరాదిన నియోజకవర్గాలు పెరిగితే బీజేపీ లబ్ది పొందుతుందని, దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా చెన్నై సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ది పథంలో వెళుతున్న దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధంగా కేంద్ర నిర్ణయాలు ఉండరాదని అన్నారు. బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టులను ఉత్తరాదికే పరిమితం చేశారని ఆయన వ్యాఖ్యానించారు.వైఎస్ అధినేత జగన్ మాత్రం కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా చెప్పిన విధంగా దామాషా పద్దతిలో లోక్‌సభ సీట్ల సంఖ్యను నిర్ణయించాలని, తదానుగుణంగా రాజ్యాంగ సవరణలు చేయాలని ప్రతిపాదించారు. చెన్నై భేటీలో తమిళనాడు, కేరళ, పంజాబ్, తెలంగాణ ముఖ్యమంత్రులు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ కూడా హాజరు కావడం విశేషం. పంజాబ్‌లోని పరిస్థితులు, ఐఎన్డీఏతో ఉన్న సంబంధాల రీత్యా హాజరై ఉండవచ్చు. నవీన్ పట్నాయక్ వర్చువల్‌గా పాల్గొని తన అభిప్రాయాలు తెలియచేశారు. తదుపరి భేటీ హైదరాబాద్‌లో జరుగుతుందని ప్రకటించారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే భేటీకి ప్రధాన ప్రత్యర్ధి అయిన బీఆర్ఎస్ ఎంతవరకు హాజరు అవుతుందన్నది సందేహమే. ఇప్పటికే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి పక్షాలు పాల్గొన్న సమావేశానికి బీఆర్ఎస్ వెళ్లడంపై బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని విమర్శలు చేస్తుంది. ఒడిషా నుంచి బీజేడీ నేతలు హైదరాబాద్ వస్తారా? రారా? అన్నది చెప్పలేం. ఎటుతిరిగి డీఎంకే, వామపక్షాలు కాంగ్రెస్‌తో కలిసే ఉంటున్నాయి కనుక వారికి ఇబ్బంది ఉండదు. ఇక వైఎస్సార్సీపీ అధినేత వ్యూహాత్మకంగా వ్యవహరించి భేటీకి వెళ్లకుండా, అలాగని తన అభిప్రాయాలు దాచుకోకుండా ప్రధానమంత్రికే ఏకంగా లెటర్ రాశారు. దానివల్ల దక్షిణాదికి అన్యాయం జరగరాదని ఆయన డిమాండ్ చేసినట్లయింది. అదే సమయంలో కాంగ్రెస్ కూటమి పక్షాలు అధికంగా ఉన్న భేటీకి ఆయన హాజరు కాకుండా జాగ్రత్తపడ్డారు. ఇంతవరకు వైఎస్సార్సీపీ అటు ఎన్డీయే వైపుకానీ, ఇటు ఇండియాకూటమివైపు కానీ ఉండకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తోంది.ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేనలు మాత్రం దీనిపై మాట్లాడలేకపోతున్నాయి. సాధారణంగా అయితే గతంలో తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందని భావిస్తే పొత్తుల గురించి పట్టించుకోకుండా మాట్లాడతానని చంద్రబాబు అనేవారు. గుజరాత్ మత కలహాల అంశంలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంటులో దీనిపై చర్చ జరిగి ఓటింగ్ సమయానికి జారి పోయినప్పటికీ, కొన్నిసార్లు అయినా మాట్లాడేవారు. అలాగే ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ యూపీ, బీహార్ రాష్ట్రాలకు అధిక వాటాలో కేంద్రం నుంచి నిధుల వెళ్లే తీరుతెన్నులపై గతంలో ధ్వజమెత్తేవారు. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ మైనార్టీలకు అన్యాయం జరిగితే ఊరుకోబోనని మాట వరుసకైనా అనేవారు. కానీ, ఇప్పుడు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు అంటే ఏం భయమో తెలియదు కానీ.. ఏపీతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉన్న నియోజకవర్గాల పునర్విభజనపై మాత్రం స్పందించడం లేదు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడినా, మాట్లాడకపోయినా పెద్దగా పట్టించుకోరు. ఆయనకు దీనిపై పెద్దగా అవగాహన కూడా ఉండకపోవచ్చు. కానీ, తానే మోదీని ఎదిరించగలనని గతంలో చెప్పుకున్న చంద్రబాబు వంటి సీనియర్ నేత, ఇప్పుడు ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో ఇంత నష్టం జరుగుతుంటే కేంద్రాన్ని గట్టిగా నిలదీయ లేకపోవడం ఆయన ఎంతగా బలహీనపడ్డారో తెలియ చేస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విభజన కుట్ర
‘స్టాలిన్ దున్నపోతు ఈనిందని అందరికీ ఆహ్వానాలు పంపితే దక్షిణాదికి చెందిన ప్రాంతీయ పార్టీల నేతలు ఆ దూడను కట్టేయడానికి చెన్నైకి పరుగులు పెట్టారు.’ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరిగిపోతోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశం అచ్చంగా ఇలాగే జరిగింది. అన్యాయం జరిగిపోతోందని బీజేపీని గుడ్డిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న పార్టీలు ఆ సమావేశానికి వెళ్లాయి. చెన్నైలో ఓ స్టార్ హోటల్లో కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించిన సమావేశంలో ఒక్కరంటే ఒక్కరైనా ఎలా అన్యాయం జరుగుతుందో చర్చించారా? జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల విభజన జరుగుతుందనీ, దక్షిణాదిలో జనాభా తగ్గి పోయారనీ, ఉత్తరాదిలో పెరిగిపోయారనీ, అందుకే దక్షిణాదికి సీట్లు తగ్గుతాయనీ వీరంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. నిజానికి ఈ ప్రక్రియలో ఇంతవరకూ ఒక్క అడుగు కూడా పడలేదు. ముందుగా జనాభా లెక్కలు పూర్తి చేయాలి. అప్పుడే ఉత్తరాదిలో ఎంత పెరిగారు, దక్షిణాదిలో పెరిగారా, తగ్గారా అన్న స్పష్టత వస్తుంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటవుతుంది. జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన చేస్తారన్నది కూడా అపోహే! అలా అయితే ఈశాన్య రాష్ట్రాలకు 25 లోక్‌సభ సీట్లు ఉండేవా? ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని పదే పదే చెబుతున్న ప్రధాని, కేంద్ర హోంమంత్రి... ఏ రాష్ట్రానికీ ఒక్క సీటు కూడా తగ్గదని వివిధ సందర్భాల్లో స్పష్టం చేశారు. 2023లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ డీలిమిటేషన్ ప్రక్రియను 2026 తర్వాత జనగణన డేటా ఆధారంగా చేపట్టాలని ప్రభుత్వం యోచి స్తోందని ప్రకటించారు. ప్రతి ఓటరుకూ సమాన ప్రాతి నిధ్యం లభించేలా చేస్తామన్నారు. ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడేలా డీలిమిటేషన్ ఉంటుందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్థానిక జనాభా వైవిధ్యం, గిరిజన సముదాయాల ప్రాతినిధ్యాన్ని కాపాడేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘డీలిమిటేషన్ అనేది కేవలం స్థానాల సంఖ్యను పెంచడం లేదా తగ్గించడం కాదు, ప్రజాస్వామ్యంలో సమానత్వాన్ని స్థాపించే ప్రక్రియ’ అని స్పష్టం చేశారురాజకీయ అలజడి కోసమే...అయినా దక్షిణాదిలోని కొన్ని ప్రాంతీయ పార్టీలు కాకి లెక్కలను ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు 42 లోక్‌సభ స్థానాలుంటే, పునర్విభజన తరు వాత 34 అవుతాయని చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు ప్రస్తుతం 129 స్థానాలుంటే వీటి సంఖ్య 103కు పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజ స్థాన్, బిహార్ రాష్ట్రాలలోని స్థానాల సంఖ్య 174 నుంచి 204 స్థానాలకు చేరుకుంటుందని అంటున్నారు. నిజానికి ఈ లెక్కలు ఇచ్చింది ఓ విదేశీ సంస్థ. ‘కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్’ అనే సంస్థ ‘ఇండియాస్ ఎమర్జింగ్ క్రైసిస్ ఆఫ్ రిప్రజెంటేషన్’ అనే నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదిక తప్ప, డీలిమిటేషన్ సీట్లపై మరో రిపోర్టు లేదు.కేంద్రం నుంచి అసలు లేదు. అయినా ఓ విదేశీ సంస్థ రిపోర్టును పట్టుకుని దేశంలో రాజకీయ అలజడి రేపడానికి డీఎంకే ప్రయత్నిస్తూంటే, ఆ పార్టీ ట్రాప్‌లో ఇతర పార్టీలు పడుతున్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదనీ, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసు కోలేదనీ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. లోకసభ నియోజకవర్గాల పునర్విభజన గతంలో 2002లో ప్రారంభమైంది. 2008లో అమలులోకి వచ్చింది. ఈ ప్రక్రియ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం జరిగింది. 2002లో డీలిమిటేషన్ చట్టం ఆమోదించిన తర్వాత, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌లో ఎన్నికల కమిషన్ సభ్యులు, రాష్ట్రాల నుండి ప్రతినిధులు ఉన్నారు. 2001 జనాభా లెక్కల ఆధారంగా ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను సమన్వయం చేశారు. దీని ప్రకారం, జనాభా పెరుగుదలకు అనుగుణంగా నియోజకవర్గాల సరిహద్దులు సవరించారు. మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య మాత్రం మారలేదు. నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ వివిధ రాష్ట్రాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, పౌరుల నుండి సూచనలు స్వీకరించింది. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని, సరిహద్దులను ఖరారు చేశారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఇంకా విస్తృత సంప్రతింపులకు కమిటీలు వేస్తారు.పరుష వ్యాఖ్యలు ఎందుకు?ఉత్తరాదివాళ్ళు పందుల్ని కన్నట్లుగా పిల్లల్ని కంటున్నారనీ, అక్కడ బహుభర్తృత్వం ఉంటుందనీ డీఎంకేకు చెందిన మంత్రి దురై మురుగన్ వ్యాఖ్యానించారు. ఉత్తరాదివారిని కించపరిచి తమిళనాడు డీఎంకే నేతలు ఏం సాధించాలనుకుంటున్నారు? ఉత్తరాది వారిలో దక్షిణాదిపై ఏకపక్షంగా వ్యతిరేకత పెంచే కుట్రలో భాగంగానే ఇలాంటి పనులు చేస్తున్నారు. తమిళనాడు డీఎంకే పాలన నాలుగేళ్లు నిండ కుండానే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది. అందుకే ఉత్తరాదిపై విషం చిమ్మి, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో దక్షిణాది సెంటిమెంటుతో గెలవాలనుకుంటున్నారు.హక్కుల కోసం పోరాటం చేయడం ప్రజాస్వామ్య హక్కు. కానీ ప్రాంతాల వారీగా భావోద్వేగాలు కలిగి ఉండే సమస్యల పట్ల పోరాడేటప్పుడు, విభజనవాదం చెలరేగే ప్రమాదం ఉంది. ప్రత్యేక ద్రవిడ దేశం కావాలని గతంలో కొంత మంది తమిళ నేతలు ప్రకటనలు కూడా చేశారు. ఇలాంటి విభ జనవాదుల మధ్య దేశాన్ని సమైక్యంగా ఉంచుకోవడం ఇప్పుడు అత్యంత ముఖ్యం. ప్రత్యేక దేశం అనే మాట వినిపించిందంటే, అది విభజన వాదమే! దీన్ని ఏ మాత్రం ప్రోత్సహించకుండా,దక్షిణాది తన ప్రాధాన్యాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేస్తే అది మంచి ప్రజాస్వామ్య విధానం అవుతుంది.ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి వ్యాసకర్త బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు -
వైవిధ్య వైరుద్ధ్యాలు
ఒక కుటుంబం నుంచి, సమాజం నుంచి, ఒక దేశం వరకు వైవిధ్యాలు అనేకం ఉంటాయి. వాటిని వైరుద్ధ్యాలుగా మారకుండా చూసుకోవటంలోనే విజ్ఞత ఉంటుంది. ఆ విధంగా చూసినపుడు, లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభ జనపై తలెత్తిన వివాదం ఒక వైవిధ్య స్థితి నుంచి వైరుద్ధ్య స్థాయికి చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ఈ నెల 22న చెన్నైలో జరిగిన సమావేశం దేశానికంతా ఒక హెచ్చరిక వంటిదని చెప్పాలి. నియోజక వర్గాల పునర్విభజనతో ముడిపడి మరొక రెండు అంశాలు కూడా ఉన్నాయన్నది గుర్తించవలసిన విషయం. ఒకటి – హిందీ భాషను హిందీయేతర రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నారనే ఫిర్యాదు. ఈ విషయం చెన్నైలో చర్చకు రాలేదు. కానీ ఎప్పటినుంచో ఉన్నదే. రెండవది – దక్షిణ–ఉత్తర భారతాల మధ్య సాధారణ రూపంలోనే ఉన్నాయనే విభేదాలు. ఈ భావన నియోజక వర్గాల పునర్విభజనకు, హిందీ భాషకు పరిమితమైనది కాదు. ఇటువంటి భావనలకు గల చరిత్ర మూడు దశలలో కనిపిస్తుంది. ఒకటి– ఉత్తరాది వారికి దక్షిణాది వారిపట్ల ఎప్పుడూ చిన్నచూపేనన్నది. రెండు – దాక్షిణాత్యుల రంగురూపులు, భాషా సంస్కృతులు, ఆహార విహారాల పట్ల స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉన్నదనే ఈసడింపు దృష్టి. మూడవది–ఈ రెండింటికన్నా ప్రమాదకరమైనది, ప్రాచీనమైనది. అది ఆర్య–ద్రవిడ వాదనలు. వివాదాలకు ఆస్కారం ఇచ్చేలా...మరే దేశంలోనూ లేనంతటి వైవి«ధ్యాలు ఇక్కడ ఉన్నాయి. సాంస్కృతికంగా, విశ్వాసాలపరంగా ఒక ఏక రూపత, కనీసం స్థూలమైన విధంగా, అనాదిగా ఉండిన ప్పటికీ, బ్రిటిష్ వలస పాలన ముగిసినాక చరిత్రలో మొదటిసారిగా మొత్తం నాలుగు చెరగులకూ కలిపి భౌగోళికంగా, రాజకీయంగా దేశానికి ఏకరూపత సిద్ధించింది. వైవిధ్యాలను సరిహద్దులు చెరిపివేసి ఒకటి చేసే ప్రయత్నాలు 1885లో కాంగ్రెస్ వ్యవస్థాపన కాలం నుంచి మొదలై, 1947లో స్వాతంత్య్ర సాధన, 1950 నుంచి రాజ్యాంగం అమలు, 1951–52లో మొదటి సార్వత్రిక ఎన్నికలతో ఒక రూపానికి వచ్చాయి. వైవిధ్యాలు వైరు ద్ధ్యాలుగా మారగల అవకాశాలకు ఆ విధంగా ముగింపు పలికినట్లయింది. కనీసం అందుకు ఒక బలమైన ప్రాతిప దిక సూత్రరీత్యా ఏర్పడింది. దానిని అదే ప్రకారం స్థిర పరచి మరింత పటిష్ఠం చేయవలసిన బాధ్యతను చరిత్ర పాలకులకు అప్పగించింది. అందుకు పునాదుల స్థాయిలో భంగపాట్లు జరిగాయని అనలేముగానీ, వేర్వేరు సాయుల్లో జరుగుతూ వస్తున్న దాని పర్యవసానమే ప్రస్తుత వివాదాలు.ఇటువంటి వివాదాలకు కేంద్ర ప్రభుత్వం ఆస్కార మివ్వనట్లయితే చెన్నై సమావేశపు అవసరమే ఉండేది కాదు. ఆ సమావేశం దరిమిలా కేంద్ర హోంమంత్రిఅమిత్ షా ఏమీ స్పందించలేదుగానీ, దక్షిణాదికి చెందిన ముగ్గురు బీజేపీ మంత్రులు మాట్లాడుతూ, విభజనకు సంబంధించి ఇంకా నిర్ణయం జరగలేదు, విధివిధానాలు రూపొందలేదు, ప్రకటనేమీ వెలువడలేదు, అటువంటపుడు ఈ సమావేశాలు, విమర్శలు ఎందుకని ప్రశ్నించారు. విధివిధానాల రూపకల్పన, ప్రకటన జరగక పోవచ్చు. కానీ నష్టపోతా మనుకునే రాష్ట్రాలకు స్థూలమైన అభిప్రాయాలు కలగకుండా ఎట్లా ఉంటాయి? వారు ఆ విషయమై మాట్లాడకుండా ఎట్లా ఉంటారు?ఇటువంటి విషయాలలో చర్చలు ఒక ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలో ముందునుంచే జరుగుతాయి తప్ప, అంతా ముగిసిపోయే వరకు ఆగవు. విషయం వివాదాస్పదమవుతున్న సూచనలు కనిపించినప్పుడు చర్చలు మరింత అవసరం. కానీ అమిత్ షా అదేమీ చేయకుండా, దక్షిణాదికి ఎటువంటి నష్టం ఉండ దనీ, అక్కడి స్థానాలు ఇప్పటికన్నా పెరుగుతాయనటం మొదలుపెట్టారు. ఇందులో ఒక చాతుర్యం ఉంది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు రెండింటికీ స్థానాలు ఇప్పటికన్న పెరిగినా, దక్షిణాదికన్న ఉత్తరాదికి పెరిగేవి చాలా ఎక్కువని, ఆ విధంగా రెండు ప్రాంతాల మధ్య గల ప్రస్తుత వ్యత్యాసం బాగా ఎక్కువవుతుందని అంచనా. అమిత్‌షా ఈ కోణాన్ని దాచిపెడుతున్నారు. అట్లాగాక ఏ వ్యత్యాసమూ, నష్టమూ ఉండదనుకుంటే ఆయన ఆ మాటను దక్షిణ రాష్ట్రాలను సమావేశపరచి వివరించాలి.సమావేశం అవసరం!చెన్నైలో జరిగిన సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశానికి పార్టీ తేడాలు లేకుండా పలువురు హాజరయారంటేనే, విభజన ప్రతిపాదనలు ఎటువంటి అనుమానాలను కలిగిస్తున్నాయో అర్థమవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాల్గొనటం. ఎందుకంటే, దేశమంతటాగల ఆ పార్టీ ఇటువంటి వైఖరి తీసుకుంటే వారికి ఉత్తరాదిన వ్యతిరేకత రాగలదనీ, ఆ భయంతో వారు హాజరు కాకపోవచ్చుననీ బీజేపీ అంచనా వేసింది. కానీ విభజనకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు ఖర్గే ముందుగానే మాట్లాడారు.ఇందులో రెండవవైపున చూస్తే, విభజనకు అనుకూలించటం వల్ల బీజేపీ దక్షిణాదిన నష్టపోగలదనే అభిప్రాయం ఉన్నా, ఆ పార్టీ అదే వైఖరికి కట్టుబడి ఉంటున్నది. దీనిని బట్టి ఇరువురూ, ఆయా ప్రాంతాలలో ప్రజాభిప్రాయాలు ఎట్లున్నా తమ వైఖరులను మార్చుకోదలచలేదని అర్థమవుతున్నది. దాని పర్యవసానాలు ఏమిటన్నది తర్వాతి విషయం. అది సూత్రబద్ధమైన వైఖరి అనుకుంటే మాత్రం ఆ మేరకు వారిని మెచ్చుకోవాలి.ఈ వైవిధ్యాలన్నీ వైరుద్ధ్యాలుగా మారి తీవ్ర స్థాయికి వెళ్ళకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలను సమావేశపరచాలి. ఈ విషయమై తమ అభిప్రాయాన్ని ఒక తీర్మానంగా ఆమోదించిన చెన్నై సమావేశం, ఆ తీర్మాన ప్రతిని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల కాలంలోనే ప్రధాని మోదీకి అందజేయగలమని ప్రకటించింది. ఆయన ఆ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం మంచిదవుతుంది. చెన్నైలో తీర్మానించినట్లు విభజనను 25 సంవత్సరాల వరకు గాక, దక్షిణాదికి ఆమోదయోగ్యమయే ప్రత్యామ్నాయాన్ని కనుగొనే వరకు నిరవధికంగా వాయిదా వేయటం మంచిది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఉత్తర – దక్షిణ సంకటం
ఊహించినట్లే జరుగుతోంది. ‘డీలిమిటేషన్’ భూతం మనల్ని వెంటాడుతోంది. జనాభా లెక్కలు దగ్గర పడిన కొద్దీ అది మనకు ఇంకా చేరువ అవుతోంది. అయినా మోదీ ప్రభుత్వం ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటోంది. కానీ ‘నియోజక వర్గాల పునర్విభజన’ భయాలు అలా కొట్టేయదగినవి కావు. ఎందుకని? కారణం వెరీ సింపుల్. ఇందులో బుర్ర బద్దలు కొట్టుకోవల్సిందేమీ లేదు. నియోజక వర్గాలు జనాభాపరంగా సైజులో సమానంగా ఉండాలి. ఇప్పుడలా లేవు. కాబట్టి దేశవ్యాప్తంగా నియోజక వర్గాలు ఒకే సైజులో ఉండేట్లు వాటిని పునర్ విభజించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో, జనసంఖ్య వేగంగా పెరిగిన రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో కంటే ఎక్కువ నియోజక వర్గాలు ఏర్పడతాయి. మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 వద్దే స్థిరంగా ఉంచేట్లయితే, జనాభా నియంత్రణ పటిష్ఠంగా అమలు చేసిన రాష్ట్రాల్లో సహజంగానే నియోజకవర్గాల సంఖ్య తగ్గుతుంది. ఆ మేరకు ఇతర రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి. ఒకరి నష్టం మరొకరికి లాభం అవుతుంది. సంఖ్య పెరిగినా ఒరిగేదేంటి?మిలన్ వైష్ణవ్, జేమీ హింట్సన్‌ల అధ్యయనం సూచించిందిదే! అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ పార్లమెంటు నియోజకవర్గాలు తగ్గు తాయి. ఉదాహరణకు కేరళ, తమిళనాడు చెరో 8 సీట్లు కోల్పోతాయి. ఆంధ్ర, తెలంగాణలు రెంటికీ కలిపి చూస్తే అవీ ఇన్ని స్థానాలు నష్ట పోతాయి. కర్ణాటక నుంచి 2 స్థానాలు ఎగిరిపోతాయి. జనాభాను నియంత్రించిన ఇతర రాష్ట్రాలూ ఇలాగే దెబ్బతింటాయి. పశ్చిమ బెంగాల్ నాలుగు, ఒడిషా మూడు, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమా చల్ ప్రదేశ్ ఒక్కో నియోజకవర్గం పోగొట్టుకుంటాయి. ఇక అనేక ఉత్తరాది రాష్ట్రాల స్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ జాబితాకు 11 స్థానాలు అదనంగా కలుస్తాయి. బిహార్ 10, రాజస్థాన్ 6, మధ్యప్రదేశ్ 4 సీట్లు పెంచుకుంటాయి. ఫలితంగా, 543లో 226 సీట్లతో ఇప్పటికే ఆధిపత్యం చలాయిస్తున్న ‘హిందీ హార్ట్‌ల్యాండ్’ డీలిమిటేషన్ అనంతరం తన ప్రాబల్యాన్ని విశేషంగా 259కి పెంచుకుంటుందని యోగేంద్ర యాదవ్ తేల్చారు. దక్షిణాది రాష్ట్రాలు అన్నిటికీ కలిపి ప్రస్తుతం 129 సీట్లు ఉన్నాయి. పునర్విభ జన అనంతరం ఇవి 26 సీట్లు కోల్పోతాయని యోగేంద్ర యాదవ్ లెక్క గట్టారు. దీంతో పార్లమెంటులో వాటి ప్రాతినిధ్యం, పలుకుబడి గణనీయంగా క్షీణిస్తాయని వేరే చెప్పనక్కర్లేదు.డీలిమిటేషన్ సమయంలో దీన్ని దృష్టిలో పెట్టుకుని లోక్ సభ సీట్ల సంఖ్య పెంచే వీలుందని అంటున్నారు. ఇది కొంచెం నయం. కానీ అలా చేస్తే సమస్య తీవ్రత తగ్గుతుందా? మొత్తం స్థానాల సంఖ్య పెంచినా, ప్రతి రాష్ట్ర నియోజకవర్గాలూ అదే నిష్పత్తిలో పెరుగుతాయి. అదీ ఉత్తరాదికే అనుకూలిస్తుంది. ఉత్తరాది–దక్షిణాది నిష్పత్తి ప్రకారం చూస్తే, దక్షిణాది రాష్ట్రాలకు ఒరిగేదే ఉండదు. వాటి సీట్ల సంఖ్య పెరిగినా ప్రయోజనం ఉండదు. వాటి ప్రాతినిధ్యం, పలుకు బడి పూర్వస్థితికి అంటే ఇప్పటి స్థాయికి చేరుకోవు. కాబట్టి, ఈ చర్య కూడా దక్షిణాది భయాలను తొలగించేది కాదు. పరిస్థితి ఏమీ మారదు. ఆ మధ్య ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ లెక్క వేసింది. సమస్యను ఈ గణాంక విశ్లేషణ తేటతెల్లం చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఐదు దక్షి ణాది రాష్ట్రాలకు కలిపి మొత్తం 543లో 129 సీట్లు ఉన్నాయి. అంటే 24 శాతం. ప్రస్తుత లోక్ సభ సీట్ల సంఖ్యను 790కి పెంచారే అనుకుందాం. అప్పుడు ఈ రాష్ట్రాల నియోజకవర్గాలు 152కి పెరుగుతాయి. నిజమే. కానీ మొత్తంలో వాటి వాటా కేవలం 19 శాతానికి కుదించుకు పోతుంది. తమిళనాడు విషయం చూస్తే, దాని వాటా ఇప్పుడున్న 7.2 నుంచి 5.4 శాతానికి పడిపోతుంది.ఏ విధంగా చూసినా దక్షిణాది రాష్ట్రాల క్షోభ అర్థం చేసుకో దగినదే!ఉత్తరాది బాధకానీ రెండో వైపు నుంచి చూస్తే, ఉత్తరాదిదీ సంకట స్థితే! ఆర్. జగన్నాథన్ గణాంక విశ్లేషణ ప్రకారం, మారిన జనాభా నేపథ్యంలో కేరళ పార్లమెంటు సభ్యుడు సగటున 18 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అదే రాజస్థాన్ ఎంపీ సగటున 33 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ రకంగా చూసుకుంటే తమకు ఉండవలసిన వారి కంటే చాలా తక్కువ మంది ఎంపీలు ఉన్నారని, ఇది అన్యాయమని హిందీ బెల్టు కూడా వాదించగలదని జగన్నాథన్ అభిప్రాయపడుతున్నారు. ఇది నిజంగా భారత ప్రజాస్వామ్యానికే డైలమా! అసలు సమస్య ఇది: నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఉత్తరాది ఆందోళన పరిష్కారం అవుతుంది. అయితే, ఈ చర్య దక్షిణా దికి క్షోభ కలిగిస్తుంది. యోగేంద్ర యాదవ్ వాదిస్తున్నట్లు డీలిమి టేషన్‌ను వాయిదా వేయడం – లేదా శాశ్వతంగా రద్దు చేయడం ద్వారా యథాతథ స్థితి కొనసాగించవచ్చు. దక్షిణాది భయాలు తొలగి పోతాయి. మరి ఉత్తరాది వారు తమకు జరుగుతుందని భావిస్తున్న అన్యాయం మాటేమిటి? అది అలాగే మిగిలిపోతుంది. కాబట్టి, ఎలా చేసినా ఏదో ఒక పక్షం నష్టపోవడం తప్పదు.మరి దీనికి పరిష్కారం లేదా? ఇది చిటికేసినంత సులభంగా పరిష్కరించే సమస్య అయితే కాదు. నిజం చెప్పాలంటే, మన ప్రజా స్వామ్యం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో కచ్చితంగా ఇదొకటి. వాస్తవానికి వ్యవస్థలో పెను ఉపద్రవానికి దారి తీయగల ఒక నిర్మాణలోపం ఇది. దీన్ని తేలిగ్గా తీసిపారేయడమో, దాటవేయడమో సరైన వైఖరి కాదు. సవాలును సవాలుగా స్వీకరించి అమీతుమీ తేల్చుకోవాల్సిందే. ఇదంత సులభం కాకపోవచ్చు. పోనీ మరొక ప్రత్యామ్నాయం ఉందా?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు, కేసీఆర్‌పై సోము వీర్రాజు అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, విశాఖ: దక్షిణాది రాష్ట్రాల సమావేశం, స్టీట్ప్లాంట్ ఉద్యోగుల దీక్షపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల సమావేశం కోతికి కొబ్బరికాయ దొరికినట్టుందని అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేస్తున్న వారికి బుర్ర ఉందా? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేసే వారు మన వాళ్ళు కాదంటూ ఆరోపించారు.విశాఖలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. డీలిమిటేషన్ అంటూ డీఎంకే రాజకీయం చేస్తోంది. ఏ రాష్ట్రంలో అయినా సీట్లు తగ్గాయని, పెరిగాయని డ్రాఫ్ట్ ఏదైనా రిలీజ్ అయిందా?. మా ముందు చాలామంది ఎన్నో కలలు కన్నారు.. అన్నీ కరిగిపోయాయి. మా ముందు ఎగిరే మీ రాష్ట్రాలు కూడా ఉండవు.. మీరూ ఉండరు. డీఎంకే ఎక్కువకాలం ఉండదు. లక్కీగా అయినా తెలంగాణ ముఖ్యమంత్రి స్క్వేర్ ఫీట్‌కు ఇంత అని లెక్కల్లో ఉన్నారు. మాదే స్టాండర్డ్ ఉన్న పార్టీ అని వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో ఉక్కు ఉద్యమంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేస్తున్న వారికి బుర్ర ఉందా?. స్టీల్ ప్లాంట్ నష్టాలకు కార్మిక నాయకులే కారణం. కార్మిక నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు?. కార్మికులు కష్టపడుతుంటే కార్మిక నాయకుల కళ్ళు మండుతున్నాయి. జపాన్‌లో అయితే ఈ కార్మిక నాయకులను ఏం చేసేవారు. తిన్నది అరగక ఉద్యమం చేస్తున్నారా అని ఉద్యమ నాయకులని అడగాలి. స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేసే వారు మన వాళ్ళు కాదు. వాళ్ళు చైనా బాగుండాలని కోరుకుంటారు.. వాళ్లని నమ్మవద్దు. ప్లాంట్‌కు ప్యాకేజీ ఇచ్చాం ఇంకేం కావాలి అని ప్రశ్నించారు.అలాగే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అధికారం అంటే అభివృద్ధి కోసం పనిచేయాలి. ప్రజల అభివృద్ధి కోసం కాకుండా కేసీఆర్ కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం పని చేశారు. కల్లల్లో ఒత్తులు వేసుకొని అభివృద్ధి చేసి చూపిస్తాం అని కామెంట్స్ చేశారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు
-
బీజేపీవైపు దక్షిణాది.. అందుకే డీలిమిటేషన్ డ్రామా: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దేశంలో డీలిమిటేషన్‌పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదని కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. స్టాలిన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్ డీలిమిటేషన్ మీటింగ్ పెట్టారని అన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ జతకట్టిపోవడం వాళ్ల చీకటి ఒప్పందానికి నిదర్శనమని ఘాటు విమర్శలు చేశారు.కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ..‘డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్లు పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపం మరోసారి బయటపడింది. దక్షిణాదికి అన్యాయం చేసి బీజేపీ బలపడాలని అనుకోవడం లేదు. దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదని కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే కుట్ర చేస్తున్నాయి. చెన్నై సమావేశానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ జతకట్టిపోవడం వాళ్ల చీకటి ఒప్పందానికి నిదర్శనం. దేశంలో లేని సమస్యను సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. లేని డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయి.తమిళనాడులో కుటుంబ, అవినీతి పాలన నడుస్తోంది. డీలిమిటేషన్‌పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీపై తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం. కుటుంబ, అవినీతి పార్టీలు మోదీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఎలాంటి వివక్ష లేకుండా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి జరగాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారు. స్టాలిన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. తండ్రీకొడుకులు అక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. భాషల పేరు మీద దక్షిణాదికి అన్యాయం చేయాలని బీజేపీ అనుకోవడం లేదు. దక్షిణాది ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు డీలిమిటేషన్ మీటింగ్ పెట్టారు. కాంగ్రెస్ కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ, కర్ణాటకలో అధికారం బీజేపీదే. డీలిమిటేషన్ చేయాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. ఇంకా జనాభా లెక్కల సేకరణే జరగలేదు’ అని చెప్పుకొచ్చారు. డీలిమిటేషన్ గురించి గతంలో ఉన్న చట్టాలు కాంగ్రెస్ తీసుకొచ్చినవే. ఏదో జరిగిపోతుందని కేటీఆర్, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆరు గ్యారంటీలపైన రేవంత్ దృష్టి పెడితే బాగుంటుంది. నిన్న జరిగిన సమావేశంలో ఆయా రాజకీయ పార్టీలు వారి స్వప్రయోజనం కోసం మాట్లాడుతున్నాయి. గతంలో ఇవే రాజకీయ పార్టీలు రాజ్యాంగం మారుస్తారని ప్రచారం చేశారు. ఏది జరిగినా ఏ ప్రాంతానికి అన్యాయం జరగదు. అవినీతి, కుటుంబ పార్టీలు చేస్తున్న వాటిని ప్రజలు తిప్పికొట్టాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సయోధ్యని కుదుర్చే పనిలో ఎంఐఎం ఉంది అని వ్యాఖ్యలు చేశారు. -
దక్షిణ భారత్ మెడపై నియోజకవర్గాల పునర్విభజన కత్తి
-
న్యాయం జరిగే వరకు… ధర్మం గెలిచే వరకు: సీఎం రేవంత్ కవితాత్మక ట్వీట్
హైదరాబాద్: డీలిమిటేషన్ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ అంశంలో మౌనంగా ఉండలేమంటూ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ఈరోజు(శనివారం) తమిళనాడులోని చెన్నై వేదికగా డీలిమిటేషన్ అంశంపై జరిగిన సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి పలువురు నేతలు హాజరయ్యారు. దీనికి సీఎం రేవంత్ కూడా హాజరయ్యారు. అయితే అనంతరం ఒక ట్వీట్ చేశారు రేవంత్.ఈ పుణ్యభూమి …తూర్పు నుండి పడమర వరకు…ఈ ధన్యభూమి …ఉత్తరం నుండి దక్షిణం వరకు… అంబేద్కర్ మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్ల సమాఖ్య స్ఫూర్తిని… సామాజిక న్యాయాన్ని, సమాన హక్కులను పొందింది.ఈ స్ఫూర్తిని, న్యాయాన్ని, హక్కులను…కేవలం రాజ్య విస్తరణ కాంక్షతో…రాజకీయ ప్రయోజన ఆకాంక్షతో… డీ లిమిటేషన్ ను అస్త్రంగా ప్రయోగించి…విచ్ఛిన్నం చేస్తామంటే మౌనంగా ఉండలేం.ఉత్తరాదిని గౌరవిస్తాం… దక్షిణాది హక్కుల విషయంలో రాజీపడం. అది డీ లిమిటేషన్ ఐనా… విద్యా వ్యవస్థపై పెత్తనమైనా… అంగీకరించేది లేదు…ఈ ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టింది… ఇక హైదరాబాద్ ఆకారం ఇస్తుంది… న్యాయం జరిగే వరకు… ధర్మం గెలిచే వరకు’ అంటూ ట్వీట్ చేశారు రేవంత్.ఈ పుణ్యభూమి …తూర్పు నుండి పడమర వరకు…ఈ ధన్యభూమి …ఉత్తరం నుండి దక్షిణం వరకు… అంబేద్కర్ మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్ల సమాఖ్య స్ఫూర్తిని… సామాజిక న్యాయాన్ని, సమాన హక్కులను పొందింది. ఈ స్ఫూర్తిని, న్యాయాన్ని, హక్కులను…కేవలం రాజ్య విస్తరణ కాంక్షతో…రాజకీయ ప్రయోజన…— Revanth Reddy (@revanth_anumula) March 22, 2025 -
ఆలు లేదు.. చూలు లేదు.. డీలిమిటేషన్‌పై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: డీలిమిటేషన్‌కు విధి విధానాలు ఇంకా ఖరారే కాలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కొందరు తీరు ఆలు లేదు.. చూలు లేదు.. అన్నట్లుగా ఉందంటూ చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ సమావేశంపై ఆయన వ్యాఖ్యానించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు కేంద్రమంత్రి శంకుస్థాపన చేశారు.అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాదికి అన్యాయం అంటూ అపోహలు సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే అపోహలు సృష్టిస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీపై విషం కక్కడమే వారి అజెండా అని.. దక్షిణాదిపై మోదీకి ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం జరగదని కిషన్‌రెడ్డి అన్నారు. డీలిమిటేషన్‌పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నా పార్టీ బీజేపీ. దక్షిణాది అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. దక్షిణ భారతదేశానికి సంబంధించి వీళ్ల సర్టిఫికెట్ అవసరం లేదు’’ అంటూ కిషన్‌రెడ్డి మండిపడ్డారు.‘‘అన్ని ప్రాంతాలకు బీజేపీ సమ న్యాయం చేస్తోంది. స్టాలిన్‌కు దురద పుడితే రేవంత్, కేటీఆర్ వెళ్లి గోకుతున్నారు. డీలిమిటేషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే లేని పోని హడావుడి చేస్తున్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం కేంద్రం మీద బురద చల్లుతున్నారు’’ అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
‘డీలిమిటేషన్ మీటింగ్.. కోడిగుడ్డుపై ఈకలు పీకడం అంటే ఇదే’
సాక్షి, ఢిల్లీ: తమిళనాడు ఎన్నికలలో డీఎంకే పార్టీ ఓడిపోబోతుందని.. అందుకే డీలిమిటేషన్‌పై ఆరోపణలు చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన దక్షిణ భారత దేశం వెనుకబడి పోతుందంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని మాట్లాడుతున్నారు. డీలిమిటేషన్ వలన తమిళనాడుకు కొద్దీమేర మాత్రమే నష్టం జరుగుతుంది. తమిళనాడు మినహా దేశంలో, ఏ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదు’’ అని అరవింద్ పేర్కొన్నారు.‘‘తమిళనాడు రాష్ట్ర అంశాన్ని మాత్రమే బూచిగా చూపి దక్షిణాదికేదో జరుగుతున్నట్టు స్టాలిన్ ప్రచారం చేస్తున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అంటారు. 1971 దేశ జనాభా 41 కోట్లు ఉంటే, ఇప్పుడు సుమారు 140 కోట్లకు పెరిగింది. దేశంలో ముస్లిం జనాభా ఏడువందల శాతం పెరిగింది. హిందువుల జనాభా 300 శాతం పెరిగింది, అసలు సమస్య ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలు కాదు.. దేశంలో ముస్లింల సంఖ్య పెరగడమే’’ అంటూ అరవింద్ వ్యాఖ్యానించారు.‘‘ఈ సమస్యను పరిష్కరించేందుకు కామన్ సివిల్ కోడ్, ఎన్ఆర్సీకి సపోర్ట్ చేస్తారా?. స్టాలిన్, ఉదయ్ నిధి స్టాలిన్ లాంటి దుర్మార్గులు ఏ కమ్యూనిటిలో ఉండకూడదు. తెలంగాణలో 80 శాతం మైనార్టీలను బీసీల్లో కలిపారు. మేం అధికారంలోకి వచ్చాక బీసీల నుంచి మైనారిటీలను తొలగిస్తాం. మతపరమైన రిజర్వేషన్లు అమలు చేయం’’ అని అరవింద్ చెప్పారు. -
హైదరాబాద్ వేదికగా ‘ఢీ’లిమిటేషన్
చెన్నై: జనాభా ప్రతిపాదికన కేంద్రం నియోజక వర్గాల పునర్విభజన (Delimitation) జరపబోతోందన్న ప్రచారం దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఒక్కటిగా తొలి అడుగు వేశాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలో చెన్నైలో శనివారంనాడు దక్షిణాది రాష్ట్రాల పార్టీల సమావేశం జరిగింది. కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్‌ను తాము వ్యతిరేకించడం లేదని.. అది న్యాయంగా ఉండాలన్నదే తమ అభిమతమని అని అక్కడ హాజరైన ప్రతినిధుల తరఫున స్టాలిన్ ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఏకం అయ్యాయని, ఈ ఘనత స్టాలిన్‌కే దక్కుతుందని సీఎం రేవంత్ అన్నారు. ఈ క్రమంలో తెలంగాణలోనూ డీలిమిటేషన్ మీటింగ్ పెట్టాలని ఆయన ప్రతిపాదించారు.ఆ ప్రతిపాదనకు స్టాలిన్ అంగీకారం తెలిపారు. చెన్నై మీటింగ్‌కు కొనసాగింపుగా తదుపరి జేఏసీ సమావేశం హైదరాబాద్(Hyderabad Delimitation Meeting)లో ఉండనుందని స్టాలిన్ ప్రకటించారు. సమావేశంతో పాటు బహిరంగ సభ కూడా ఉంటుందని సీఎం రేవంత్ ప్రకటించారు. ఏప్రిల్ 15వ తేదీన ఈ సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.ఇక.. చెన్నైలో జరిగిన జేఏసీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమమార్ తదితరులు పాల్గొన్నారు. -
తమిళనాడు స్పూర్తితో కేంద్రంతో కొట్లాడుదాం డీలిమిటేషన్‌పై కేటీఆర్
-
YS Jagan: మాకు అన్యాయం చేయొద్దు!
-
డీలిమిటేషన్‌పై ప్రధానికి వైఎస్ జగన్ లేఖ
అమరావతి, సాక్షి: నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఓ లేఖ రాశారు. వచ్చే ఏడాది(2026) జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధానిని వైఎస్ జగన్ కోరారు. ‘‘గత 15 ఏళ్లలో దక్షిణ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింది. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్(Delimitation) ప్రక్రియ గనుక చేపడితే.. తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ దక్షిణాది రాష్ట్రాల్లో నడుస్తోంది. ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమినేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుంది. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడండి.. .. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలి. అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరైన భాగస్వామ్యం ఉంటుంది. అందుకే దక్షిణాన సీట్ల తగ్గింపు లేకుండా చూడాలి. ఈ కోణంలో ఆలోచించి డీలిమిటేషన్ చేపట్టాలని కోరుకుంటున్నా. అటు లోక్‌సభ ఇటు రాజ్యసభలో.. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా రాబోయే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు నిర్వహించాలని కేంద్రాన్ని కోరుకుంటున్నా’’ అని ప్రధాని మోదీని వైఎస్ జగన్ లేఖలో కోరారు. 👉పూర్తి లేఖ కోసం ఇక్కడ క్లిక్ చేయండిమరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్రంలోని బీజేపీకి తమిళనాడు అధికార పక్షం డీఎంకేకు మధ్య రాజకీయ సమరం జరుగుతోంది. ఈ క్రమంలో శనివారం(మార్చి 22న) తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ లేఖ సారాంశాన్ని డీంఎకేకు కూడా పంపించారు. -
డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయి: రేవంత్ రెడ్డి
Delimitation JAC meeting Updates..👉కేటీఆర్ కామెంట్స్: ఇది కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని.. నిధులు కేంద్రీకృతం కావడంతో పాటు.. ఆర్థిక నియంతృత్వానికి దారితీస్తుందని దక్షిణాది భవిష్యత్తును కాలరాస్తుందని కేటీఆర్ వివరించారు. దేశం ప్రజాస్వామిక దేశమైనా… భిన్న అస్తిత్వాలు, సంస్కృతులు కలిగిన ఒక సమాఖ్య రాష్ట్ర అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేసీఆర్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాలపాటు తెలంగాణ ఉద్యమం నడిపించారు. తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలు స్ఫూర్తి తీసుకుంటాము. అస్తిత్వం కోసం, హక్కుల కోసం కొట్లాడటంలో తమిళనాడు స్ఫూర్తినిచ్చింది. ద్రవిడ ఉద్యమం సమైక్య దేశంలో తమ హక్కులు సాధించుకోవడానికి రాష్ట్రాలకు ఒక దిక్సూచి లెక్క పనిచేస్తుంది...కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత డిలిమిటేషన్ వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత విధానాల వలన దక్షిణాదికి అనేక నష్టాలు జరుగుతున్నాయి. దేశ అభివృద్ధి కోసం పని చేసినందువలన ఈ రోజు నష్టం జరుగుతుంది. మనమంతా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్యం మంద బలం ఆధారంగా నడవరాదు. మందబలం ఉన్నందువలన నియంతత్వం రావద్దు. దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తూ… దేశాన్ని వెనక్కి నెడుతున్న రాష్ట్రాలకి ఈ డిలిమిటేషన్ విధానం లాభం చేకూరుస్తుంది. పరిపాలన ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి కానీ దానివల్లనే తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి.👉దేశానికి 36% జిడిపిలో భాగస్వామ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు శిక్షింపబడుతున్నాయి. డీలిమిటేషన్ అంశం కేవలం పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గడానికి పరిమితం కాదు. ఆర్థికపరమైన నిధుల కేటాయింపుల్లో కూడా తీవ్రమైన నష్టం జరగబోతుంది. వీటి కేటాయింపుల్లో కూడా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉన్నది. ఆర్థిక వనరుల కేంద్రీకృతం జరగడం వలన భవిష్యత్తులోనూ ప్రస్తుతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నిధుల కేటాయింపులు అన్యాయం మరింతగా పెరుగుతుంది.👉దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్త కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ వివక్ష అన్యాయం మరింత పెరిగింది. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దీన్ని మరింత పెంచేలా డీ లిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులన్ని ఉత్తరాదికే పరిమితం అవ్వడం ఇందుకు ఒక ఉదాహరణ. బీజేపీ సారధ్యంలోని కేంద్రం ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపైన పుండుపైన ఉప్పురుద్దినట్టుగా వ్యవహరిస్తున్నది👉ఆదర్శవంతమైన సమైక్య రాష్ట్ర దేశంలో ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం పైన ఆదిపత్యం చలాయించే విధంగా ఉండరాదన్నది ప్రజాస్వామ్యస్ఫూర్తి. ఇది కేవలం ఉత్తర దక్షిణాది రాష్ట్రాల వ్యవహారం కాదు అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ప్రాంతాలకు నష్టం జరుగుతున్న అంశం. కేవలం జనాభా ఆధారంగా సీట్ల పెరుగుదల గనుక జరిగితే దేశ సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉన్నది. మనమంతరం భారతీయులం…అయితే మనందరికీ ఆయా ప్రాంతాల అస్తిత్వం ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. విభిన్న భాషలు సాంస్కృతిక అస్తిత్వాలతో కూడిన ఒక సమైక్య దేశం అన్న విషయాన్ని మర్చిపోకూడదు. వెనుకబడిన రాష్ట్రాలకు నిధులు ఇచ్చే అంశాన్ని మేము ఏమి వ్యతిరేకించడం లేదు కానీ… నిధుల కేటాయింపుల వివక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.👉1971 తర్వాత ఉన్న పార్లమెంటు సీట్లు కేటాయింపు తర్వాత జరిగిన జనాభా నియంత్రణ వలన ఈరోజు దక్షిణాదికి నష్టం జరగడం అన్యాయం. జనాభా నియంత్రణను దేశ అభివృద్ధి కోసం దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమైనందువలన వారికి ఈ రోజు డీలిమిటేషన్లో లబ్ధి జరగడం ఏ విధంగా కూడా సరైంది కాదు. ఇది దేశాన్ని వెనుక వేసిన వాళ్లకి రివార్డు ఇవ్వడం లాంటిది. దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోయే 2047 నాటికి సూపర్ పవర్ కావాలి అంటే అభివృద్ధి సాధించిన రాష్ట్రాలకు ప్రోత్సాహం లభించాలి కానీ శిక్ష కాదు. డిలిమిటేషన్ అనేది ఆర్థిక అభివృద్ధి పరిపాలన అభివృద్ధి వంటి అంశాల పైన జరగాలి కానీ కేవలం పరిపాలన పైన కాదు. ఈ అంశంలో జరుగుతున్న నష్టం పైన మాట్లాడకుంటే చరిత్ర మనల్ని క్షమించదు. భవిష్యత్తు తరాలు ఈరోజు మన మౌనాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాయి.👉తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ కారణంగా పార్లమెంట్లో మన ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. మన గొంతు వినిపించే వాళ్లు తగ్గిపోతారు. మన అభిప్రాయానికి విలువ లేకుండా పోతుంది. భవిష్యత్ శ్రేయస్సుకు భంగం కలుగుతుంది. స్త్రీల హక్కులకు కూడా భంగం కలుగుతుంది. 👉తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కామెంట్స్..‘దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ అమలైంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ అమలుకాలేదు. ఆర్థిక అభివృద్ధి, జీడీపీ, ఉద్యోగ కల్పనలో దక్షిణాది ముందుంది. బాగా పని చేసిన మనకు శిక్ష వేస్తారా?. న్యాయబద్దం కాని డీలిమిటేషన్‌పై మనం బీజేపీని అడ్డుకోవాలి. ఇది రాజకీయ అసమానతలకు దారి తీస్తుంది. డీలిమిటేషన్ రాజకీయంగా దక్షిణాదిని పరిమితం చేస్తుంది. గతంలో వాజ్‌పేయి కూడా లోక్‌సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్ చేశారు. దక్షిణాది నుంచి వెళ్తుంది ఎక్కువ.. వస్తున్నది తక్కువ. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి రూపాయి వెళ్తే వస్తున్నది మాత్రం 42 పైసలే. బీహార్ రూపాయి పన్ను కడితే.. ఆరు రూపాయాలు పోతున్నాయి. యూపీకి రూపాయికి రెండు రూపాయల మూడు పైసలు వెనక్కు వస్తున్నాయి. దక్షిణాది రాజకీయంగా గొంతు వినిపించే అవకాశాన్ని కోల్పోతుంది. మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా మారతాం. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయి.👉తమిళనాడు రాజధాని చెన్నై వేదికగా డీలిమిటేషన్‌పై సీఎం స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరాయ్ విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేడీ ప్రతినిధి హాజరయ్యారు. ఈ భేటీకి బెంగాల్ తృణముల్ కాంగ్రెస్ దూరంగా ఉంది.👉ఇక, ఈ సమావేశంలో డీలిమిటేషన్‌పై నేతలు చర్చించనున్నారు. ఫెయిర్ డీలిమిటేషన్ నినాదంతో సమావేశం జరగనుంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌ను ఆయా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. కుటుంబ నియంత్రణ కఠినంగా అమలు చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గి, నియోజకవర్గాలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన న్యాయంగా జరగాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. சென்னையில் நடைபெறும் கூட்டு நடவடிக்கை குழு ஆலோசனைக் கூட்டத்தில் பங்கேற்க வருகை தந்த அனைத்து தலைவர்களையும் மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு @mkstalin அவர்கள் வரவேற்றார். #FairDelimitation pic.twitter.com/0Ject5TUiA— DMK (@arivalayam) March 22, 2025 👉అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే రాష్ట్రాలు ముఖ్యమంత్రులు, కీలక నేతలు చెన్నైకి చేరుకున్నారు. Honourable Chief Minister of Telangana Thiru @revanth_anumula Avl arrives in Chennai ahead of the crucial JAC meeting against unfair delimitation. Leaders from 14+ parties will unite tomorrow to discuss the pressing issue of delimitation and its impact on state rights.… pic.twitter.com/mhhpbaUH8b— DMK (@arivalayam) March 21, 2025Honourable Chief Minister of Punjab Thiru. @BhagwantMann arrives in Chennai ahead of the crucial JAC meeting against unfair delimitation. Leaders from 14+ parties will unite tomorrow to discuss the pressing issue of delimitation and its impact on state rights.… pic.twitter.com/g2uo33Tw5i— DMK (@arivalayam) March 21, 2025 -
నెగ్గేదెలా?
లోక్‌సభలో ఐదు దక్షిణాది రాష్ట్రాల దామాషా ప్రాతినిధ్యానికి ముప్పు వాటిల్లబోతోంది. వాటి మెడపై డీలిమిటేషన్ కత్తి వేలాడుతోంది. ఈ ఉపద్రవం తప్పాలంటే కేంద్రం మెడ వంచాలి. దీనికోసం దక్షిణాది తరఫున తమిళనాడు ముందుండి కేంద్రంపై పోరాటం చేస్తోంది. భారత సమాఖ్య పట్ల ఏకీభావం ప్రతిష్టంభనలో పడింది. ఈ నేపథ్యంలో, డీలిమిటేషన్ మరో 30 ఏళ్లు వాయిదా వేయాలని తమిళనాడు అఖిల పక్ష సమావేశం డిమాండ్ చేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ , ‘వన్ నేషనిజం’ అంటూ బీజేపీ సమస్యను జటిలం చేస్తోంది. భాషావివాదం మీద పార్లమెంటులో మాట్లాడుతూ, తమిళనాడుకు నిజాయితీ లేదని, అనాగరిక రాష్ట్రమని నిందిస్తూ ఆ రాష్ట్రానికి విద్యానిధులు తొక్కిపట్టింది. సమాఖ్య విషయంలో కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయత కొరవడింది. కాబట్టే బీజేపీ కూటమి యేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు తమిళనాడు నేతృత్వంలో కేంద్రంపై ధ్వజమెత్తుతున్నాయి. డీలిమిటేషన్ చిక్కుముడికి పరిష్కారాలు లేకపోలేదు. రాజ్యసభ స్వరూపం మార్చడం వీటిలో ఒకటి. రాష్ట్రాల సరైన ప్రాతినిధ్యానికి వేదికగా దాన్ని రూపొందించాలి. అలాగే సంఖ్యాపరంగా లోక్‌సభ సైజు పెంచడం ద్వారా, పెద్ద రాష్ట్రాలు అదనపు స్థానాలు పొందినా, ఇతరత్రా ఏ రాష్ట్రం నష్టపోకుండా చూడవచ్చు. అధిక జనాభా ఉన్న యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల సరిహద్దులు మార్చడం మరో మార్గం. ఆర్థిక వృద్ధి అనివార్యతలు, రాష్ట్రాల నడుమ నెలకొన్న సామాజిక ఆర్థిక అంతరాలు సమాఖ్య స్ఫూర్తి పునాదులను బలహీన పరుస్తున్నాయి. రాష్ట్రాల పునర్ విభజన చట్టంతో భాషా సమస్య పరిష్కారమైన పిదప, సమాఖ్య ఏకీభావతకు ఎదురవుతున్న తొలి సవాలు ఇదే. దీన్ని ఎదుర్కొనేందుకు ఇప్పుడు కావల్సింది సమాఖ్య సూత్రానికి అన్ని వైపుల నుంచీ బలమైన మద్దతు.విశ్వాసం కల్పించాల్సింది కేంద్రమే!చరిత్ర చూసినట్లయితే, పాలనలోనూ, నిధుల పరంగానూ కేంద్రీకృత విధానాలే ఉన్నాయి. సంకీర్ణ రాజకీయాలు రాజ్యమేలుతున్న రోజుల్లో సైతం ప్రాంతీయ పార్టీలు పాత వ్యవస్థను సవాలు చేయలేదు. దీంతో సమాఖ్య సూత్రం గట్టిగా వేళ్ళూన లేదు. ద్రవ్యపరంగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణ తగ్గలేదు. పన్నుల్లో 50 శాతం రాష్ట్రాలకు పంచాలని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ రాష్ట్రాల తరఫున కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అయితే ఇది రాజకీయ పటా టోపంగానే మిగిలి పోయింది. ఆ రోజుల్లో యథా తథ స్థితిని అనుసరించడమే రాజకీయ సంస్కృతిగాఉండేది. పేద రాష్ట్రాలకు జాతీయ పన్నుల్లో అధిక వాటా లభించడం తరహా సమన్యాయ సూత్రానికి రాష్ట్రాలన్నీ ఇష్టపూర్వకంగానే తలలూ పాయి. ప్రాతినిధ్య అసమానతను అంగీకరించాయి.సమాఖ్య ఏకాభిప్రాయం మీద ఆర్థిక వృద్ధి ప్రభావం పడుతోంది. పన్నుల హేతుబద్ధీకరణ, నియంత్రిత మార్కెట్లు, రాష్ట్రాల సరిహద్దులు దాటి విస్తరించే సేవలు వంటి అవసరాలకు కేంద్రీకృత వ్యవస్థ ఎన్నో రకాలుగా ఉపయుక్తం అవుతుంది. ఇలా జరగడం వల్ల రాష్ట్రాల స్వయంప్రతిపత్తి కూడా అంతే స్థాయిలో తగ్గుతుంది. నిధుల పంపిణీ పరంగా కొత్త వివాదాలు ఉత్పన్నమవుతాయి.ఈ వివాదాలను విశ్వసనీయంగా పరిష్కరించే శక్తి కేంద్రానికి మునుపటి కంటే ఎక్కువ అవసరమవుతుంది.వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం లోకి మారడం వల్ల ఉత్పన్నమైన వివాదాలు ఇందుకు నిదర్శనం. రాష్ట్రాలు తమ పన్ను విధింపు హక్కును వదులుకోవడంతో, పన్ను ఆదాయంలో తమ వాటా ఎంత అన్నది ప్రధానంగా మారింది. రాష్ట్రాల నడుమ ఆర్థిక అంతరం హెచ్చింది. ఆర్థికంగా బలమైన దక్షిణాది రాష్ట్రాలు సమన్యాయాన్ని సవాలు చేయసాగాయి. 16వ ఫైనాన్స్ కమిషన్ ఎదుట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేవనెత్తిన అంశం ప్రస్తావనార్హం: ‘కర్ణాటక సమకూర్చే ప్రతి రూపాయిలో ప్రస్తుత ఫార్ములా ప్రకారం తిరిగి వెనక్కు వచ్చేది కేవలం 15 పైసలు’ అని ఆయన వాపోయారు. తమిళ నాడు కూడా ఇదే వాదన చేసింది. డీలిమిటేషన్ మీద ఆందోళనలు సైతం అదే మాదిరివి.భిన్న ప్రాంతాల నడుమ ఆర్థిక అసమానతలు పెరిగిపోవడమే లక్షణంగా మారిన ఈ దేశంలో ఈ సమదృష్టి సూత్రం ఎంతవరకు ఆచరణ సాధ్యం? కానప్పుడు, పన్ను ఆదాయాల పంపిణీ ఫార్ములాను సంతులన పరచుకుంటూ అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలకూ కలిపి ఒక ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయడం వంటి వేరే మార్గాలు కేంద్రానికి లేవా? అలాగే సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నామన్న విశ్వస నీయ సంకేతం ఇవ్వాల్సిన, కొత్త ఏకాభిప్రాయాన్ని తీసుకురావల్సిన బాధ్యత కేంద్రం మీదే ఉంటుంది. సమాఖ్య విధానం పట్ల బీజేపీ ఒంటబట్టించుకున్న అసహనం సమస్య పరిష్కారాన్ని జటిలం చేస్తోంది. స్వయంప్రతిపత్తి గల జమ్ము – కశ్మీర్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు గుంజుకుని, వాటిని కేంద్రం పెత్తనం కిందకు తెచ్చుకోవడం వల్ల ఏర్పడిన పరిణామాలు, రాష్ట్రాలకు పన్నుల్లో దక్కాల్సిన వాటాను తనకు మాత్రమే దఖలు పడే సెస్సులు, సర్ చార్జీల విధింపు ద్వారా కుదించివేయడం, అలాగే కేంద్రం సేవలో ఉండేలా కొత్త పాలనా సంస్కృతిని ప్రోత్సహించడం... ఇవన్నీ సమాఖ్య పట్ల కేంద్ర అసహనానికి నిదర్శనాలు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలు కేంద్రంపై రాజకీయంగా ధ్వజమెత్తడం, రాజీలేని వైఖరి ప్రదర్శించడం మినహా మరేం చేయగలవు? సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు తమ హక్కుల కోసం బేరసారాలు జరిపే హక్కు ఎన్ని పరిమితులకు లోబడి ఉందో ప్రస్తుత డీలిమిటేషన్ చిక్కుముడి వెల్లడిస్తోంది. డీలిమిటేషన్‌ను ఎంతకాలం వీలైతే అంతకాలం వాయిదా పడేలా చేయాలన్న స్టాలిన్ ఆలోచన ఫలితమే ప్రస్తుత ప్రతిష్టంభన! ఎంతో కష్టపడి సాధించుకున్న అమూల్యమైన భారత సమాఖ్య ఈ క్రమంలోమరింత బలహీన పడుతుంది.యామినీ అయ్యర్ వ్యాసకర్త బ్రౌన్ యూనివర్సిటీలో విజిటింగ్ సీనియర్ ఫెలో(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఓటమి భయంతోనే తమిళనాడులో కొత్త డ్రామా: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి స్టాలిన్ డీలిమిటేషన్, త్రిభాష విధానంపై రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. త్రిభాషా విధానంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని డీఎంకే వితండవాదం చేస్తోంది. డీలిమిటేషన్, జాతీయ విద్యావిధానంపై దివాలాకోరుతనంతో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. 2026 తమిళనాడు ఎన్నికల్లో ఓటమి నుంచి తప్పించుకోవడానికి డీఎంకే తప్పుడు ప్రచారం చేస్తోంది. దీన్ని బూచిగా చూపించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులో లిక్కర్ సరఫరాలో కుంభకోణం తెరపైకి వచ్చింది. డీఎంకే నేతలు కోట్ల రూపాయలు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ స్కాం దృష్టి మళ్లించడానికే డీఎంకే.. దక్షిణాదికి అన్యాయం అనే వాదనను లేవనెత్తింది. త్రిభాషా విధానం బ్రిటిష్ కాలం నుంచే అనేక సంవత్సరాలుగా అమలు జరుగుతోంది. త్రిభాషా విధానంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఎన్నికల ఎత్తుగడలో భాగంగా ఓటమి భయంతో స్టాలిన్ బురద జల్లుతున్నారు అని వ్యాఖ్యలు చేశారు. -
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్వహించబోయే జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్వి భజన (డీ లిమిటేషన్) చేపడితే దక్షిణాది రాష్ట్రా లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యాన్ని తగ్గించాలనుకోవడం దారుణమని విమర్శించారు.ఈ అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న చెన్నైలో నిర్వహించే సమావేశానికి హాజరై బీఆర్ఎస్తో పాటు తెలంగాణ వాదనను వినిపిస్తామని తెలిపారు. తమిళ నాడు పురపాలక శాఖ మంత్రి కె.ఎన్.నెహ్రూ, రాజ్యసభ ఎంపీ ఎన్.ఆర్.ఎలాంగో బృందంతో తెలంగాణ భవన్లో కేటీఆర్ గురువారం సాయంత్రం సమావేశమయ్యా రు. డీలిమిటేషన్‌కు వ్య తిరేకంగా నిర్వహిస్తున్న సమావేశానికి రావాల్సిందిగా డీఎంకే బృందం బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం అందజేసింది.ఈ సందర్భంగా ఇరుపక్షాలు మీడియాతో మాట్లాడాయి. ‘డీ లిమిటేషన్ మీద దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం ఇది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సమష్టిగా పోరాడితేనే దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. 1970–80 దశకంలో కుటుంబ నియంత్రణ సమర్ధవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాల సంఖ్యను కొత్తగా చేసే జనగణన ఆధారంగా నిర్ణయిస్తామని కేంద్రం చెప్పడం అన్యాయం.ఇదే జరిగితే పార్లమెంట్లో ఈ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుంది. స్టాలిన్ ఏర్పాటు చేస్తున్న అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ తరపున హాజరుకావాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు. 22న చెన్నైలో జరిగే సమావేశానికి హాజరై బీఆర్ఎస్తోపాటు తెలంగాణ వాదనను బలంగా వినిపిస్తాం’అని కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో అన్ని పార్టీలతో చర్చించి ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామని డీఎంకే నేతలు ప్రకటించారు. అంతకుముందు డీఎంకే నేతలను కేటీఆర్ సత్కరించారు. -
దక్షిణాదిపై బీజేపీ పగబట్టింది: రేవంత్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: డీలిమిటేషన్ ప్రక్రియను ఒప్పుకునేది లేదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ విషయంలో తెలంగాణలోని అన్ని పార్టీలపై సమావేశం నిర్వహిస్తామని రేవంత్ చెప్పుకొచ్చారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో డీలిమిటేషన్‌పై మార్చి 22న తమిళనాడు ప్రభుత్వ నిర్వహించే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని డీఎంకే నేతలు, ఎంపీలు ఆహ్వానించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్ చూపించిన చొరవ అభినందనీయం. 22వ తేదీన తమిళనాడులో జరిగే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి వెళ్లే అంశంపై ఏఐసీసీ అనుమతి తీసుకొని వెళ్తాం. డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుంది. డీలిమిటేషన్ లిమిట్ ఫర్ సౌత్ లాగా ఉంది.డీలిమిటేషన్ ప్రక్రియను ఒప్పుకునేదే లేదు. ఉత్తరాది రాష్ట్రాల కన్నా దక్షిణాది రాష్ట్రాలు అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా రావాలని కోరుతున్నాం. డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి తన గళం కేంద్ర క్యాబినెట్లో వినిపించాలి. తెలంగాణలోని అన్ని పార్టీలపై సమావేశం నిర్వహిస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
రాజకీయ పార్టీలకు భట్టి,జనారెడ్డి బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి బహిరంగ లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజనపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని.. ప్రతి పార్టీని ఆహ్వానిస్తామని తెలిపారు.జనాభా ప్రాతిపదికన జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని.. జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలను ఆహ్వానించి చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరుకావాలని భట్టి విక్రమార్క, జానారెడ్డిలు సంయుక్తంగా బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రతి పార్టీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని.. త్వరలోనే తేదీ, వేదిక ప్రకటిస్తామని బహిరంగ లేఖ ద్వారా వారు స్పష్టం చేశారు. -
ఏంటి సీనియర్ మరీ ఇలా చేశారు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రకటనలు అవసరాన్ని బట్టి మారిపోతుంటాయి. ప్రజలకోసం ఇలా మాటమారిస్తే ఓకే కానీ.. ఆయనెప్పుడు రాజకీయాల కోసమే ఇలా చేస్తూంటారు. కొన్ని రోజులుగా ఆయన చేస్తున్న ఉపన్యాసాలను పరిశీలిస్తే.. పొంతన లేకుండా కనిపిస్తాయి. ఒకపక్క దేశం మొత్తమ్మీద నియోజకవర్గాల పునర్విభజన కోసం రంగం సిద్ధమవుతూంటే.. దానిపై ఆయన తన స్పష్టమైన నిర్ణయం చెప్పకుండా కప్పదాటు వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇదెలా ఉందంటే.. కడుపు నొప్పి అంటే తలనొప్పికి మందు ఇచ్చినట్లుగా ఉంది!. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాదిలో సీట్లు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ సక్రమంగా చేపట్టని కారణంగా పెరుగుదల ఎక్కువ ఉందని.. ఫలితంగా వారికి అక్కడ ఎక్కువ పార్లమెంటరీ స్థానాలు అందుబాటులోకి వస్తున్నాయన్న భావన చాలామందిలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలు అధిక జనాభాతో వచ్చే ముప్పును ముందుగానే గుర్తించి నియంత్రణ సమర్థంగా నిర్వహించినందుకు ఇక్కడి సీట్లలో పెద్దగా మార్పుల్లేకుండా పోనున్నాయి. 👉ఈ అంశంపై తమిళనాడు, కర్ణాటక, తలంగాణ ముఖ్యమంత్రులు ఇప్పటికే తమ అభ్యంతరాలను వ్యక్తం చేయగా.. చంద్రబాబు మాత్రం దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఒకడుగు ముందుకేసి నియోజకవర్గాల పునర్విభజన ఇదే పంథాలో సాగితే దక్షిణాది తిరగబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉత్తరాది రాష్ట్రాల ప్రభావం ఇప్పటికే ఎక్కువగా ఉందని.. సీట్లు పెరిగితే వారి ఆధిపత్యం మరింత పెరిగిపోతుంది. పార్లమెంటులోని ప్రస్తుత 543 లోక్‌సభ సీట్లను 753కు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దక్షిణాదిలో ప్రస్తుతం 129 సీట్లు ఉండగా.. డీలిమిటేషన్ తరువాత అత్యధికంగా 144 స్థాయికి చేరవచ్చు. ఏపీ, తెలంగాణల్లో చెరో మూడు సీట్లే పెరిగే అవకాశం ఉంటుంది. కేరళలో ఒక సీటు తగ్గుతుందట!. తమిళనాడులో రెండు సీట్లే పెరుగుతాయి. కర్ణాటకలో మాత్రం ఎనిమిది సీట్లు ఎక్కువ కావచ్చు. ఫలితంగా కొత్తగా ఏర్పాటయ్యే సీట్లను కలుపుకుని చూసినప్పుడు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం ప్రస్తుతమున్న 24 శాతం నుంచి నుంచి 19 శాతానికి పడిపోనుంది. 👉డీలిమిటేషన్ పూర్తి అయితే ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 48 స్థానాలు పెరిగి మొత్తం సంఖ్య 128 స్థానాలకు చేరనుంది. బీహార్ పార్లమెంటరీ స్థానాలు కూడా 40 నుంచి 70కి చేరతాయి. మధ్యప్రదేశ్‌లో 29 నుంచి 47 అవుతాయి. ఈ రకమైన పరిస్థితి వల్ల ఉత్తరాది గుత్తాధిపత్యం అధికం అవుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదిక కాకుండా 1971 నాటి లెక్కలు తీసుకోవాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. కొందరు మేధావులు విస్తీర్ణం ప్రాతిపదికగా డీలిమిటేషన్ చేస్తే ఈ సమస్య కొంత తగ్గవచ్చని అభిప్రాయపడుతున్నారు. నిజానికి దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులలో సీనియర్ చంద్రబాబు నాయుడు. ఆయన మాత్రం దీనిపై విభిన్నంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్, బీహారు రాష్ట్రాలు ఎక్కువమంది జనాభాతో దేశాన్ని కాపాడుతున్నాయని, ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని చంద్రబాబు సూచిస్తున్నారు. 2026 డీలిమిటేషన్ వల్ల లోక్‌సభ సీట్లలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఈ ప్రాంత నాయకులు అంతా బాధ పడుతుంటే చంద్రబాబు జనాభాను పెంచండని చెప్పి అసలు సమస్య జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. 👉గతంలో.. ఇదే చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఉత్తరాది రాష్ట్రాలు సరిగా పనిచేయడం లేదని, అందువల్ల వాటికి అధిక నిధులు ఇవ్వరాదని చెప్పేవారు. బాగా పనిచేస్తున్న ఏపీ తదితర రాష్ట్రాలకు తక్కువ నిధులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసేవారు. ఆ రాష్ట్రాలలో జనాభా నియంత్రణ లేకపోవడాన్ని ఆక్షేపించేవారు. కాని అన్ని అంశాలలో మాదిరే చంద్రబాబు ఇక్కడ కూడా యు టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. 👉కేంద్రంలోని బీజేపీని గట్టిగా నిలదీసే పరిస్థితిలో లేరు. ఎన్డీయే ప్రభుత్వం తెలుగుదేశం సీట్లపై ఆధారపడి ఉన్నా, చంద్రబాబు ఎందువల్లో ఎక్కువగా భయపడుతున్నారేమో అనే వ్యాఖ్యలు వస్తున్నాయి. అందుకే ధైర్యంగా డీలిమిటేషన్లో ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టంపై గొంతెత్తలేకపోతున్నారని అంటున్నారు. పైగా ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను పెంచి దేశాన్ని కాపాడుతున్నాయని చెబుతున్నారు. ఇది ఒక రకంగా ఆంధ్రతో సహా దక్షిణాదిని అవమానించడమే కదా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 👉జనాభా పెంచే విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలట. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే ఉంది కనుక, వారికి ఎక్కడ అసంతృప్తి వస్తుందో అని ఆయన మాట్లాడకపోగా అర్జంట్‌గా పిల్లలను కనండని చెబితే ఏమి చేయాలి? నిజంగానే ప్రజలు తమ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా జనాభాను పెంచితే ఎవరు పోషించాలి? చంద్రబాబు ఎన్నికల సమయంలో చేసే హామీలను నమ్మి ప్రజలు ఎలా మోసపోతున్నారో అంతా గమనిస్తున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. ఓ పాతికేళ్లకు దక్షిణాదిలో జనాభాను పెంచినా, అప్పటికి ఉత్తరాదిలో ఇంకా జనాభా పెరిగిపోతుంది కదా!. అందువల్ల ఆయన చెబుతున్న తర్కంలో హేతుబద్దత కనిపించదు. ఉత్తరాది, దక్షిణాది మధ్య ఒక సమతుల్యత రావడం అవసరం కాదా? దానిని వదలి ఉత్తరాది రాష్ట్రాల వారు దేశాన్ని కాపాడుతున్నారట.. అంటే దక్షిణాది వారు కాపాడడం లేదని చెప్పడమా?. తమిళనాడు సీఎం డిమాండ్‌పై చంద్రబాబు మాత్రం స్పందించడం లేదు. వచ్చే ఏడాది పునర్విభజన వల్ల నష్టం జరుగుతుందని అంతా చెబుతుంటే, ఇప్పుడు పిల్లలను కని జనాభాను పెంచండి అని అనడంవల్ల ఏమి ప్రయోజనం ఉంటుందో చంద్రబాబే చెప్పాలి. ఏది ఏమైనా.. కేవలం తక్షణ రాజకీయ ప్రయోజనాలకన్నా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడడంలో చంద్రబాబు పాత్ర తీసుకోకపోతే చరిత్ర ఆయనను క్షమిస్తుందా?. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఏడుగురు రాష్ట్ర సీఎంలకు స్టాలిన్ లేఖ
చెన్నై: కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న డీలిమిటేషన్ అంశంపై తమిళనాడు ఎంకే స్టాలిన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది సమాఖ్య వాదంపై స్పష్టమైన దాడిగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర పరిపాలనను శిక్షించడమేనని స్టాలిన్ పేర్కొన్నారు. దీనిపై స్పష్టమైన విముఖత వ్యక్తం చేస్తున్న స్టాలిన్.. ఏడుగురు సీఎంలకు లేఖలు రాశారు. దాంతో పాటు మాజీ సీఎంలకు ఆయన లేఖలు పంపినట్లు స్టాలిన్ పేర్కొన్నారు.ఈ అంశంపై తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ ఎక్స్’ వేదికగా మండిపడ్డారు స్టాలిన్. ‘ ఇది దేశ సమాఖ్యవాదంపై దాడి. రాష్ట్రాలను శిక్షించేందుకే ఈ కార్యాచరణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జనాభా నియంత్రణ, సుపరిపాలనపై పార్లమెంట్ లో మన గొంతు వినిపించుకుండా చేయడమే వారి లక్ష్యం. దీనికి మేం పూర్తిగా వ్యతిరేకం. ఇంత ఎంతమాత్ర సమ్మతం కాదు’ అని స్టాలిన్ పేర్కొన్నారు.ఈ డీలిమిటేషన్ అంశంపై మాట్లాడేందుకు కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం భగవత్ మాన్, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీలకు లేఖలు రాసినట్లు స్టాలిన్ తెలిపారు. The Union Govt's plan for #Delimitation is a blatant assault on federalism, punishing States that ensured population control & good governance by stripping away our rightful voice in Parliament. We will not allow this democratic injustice!I have written to Hon'ble Chief… pic.twitter.com/1PQ1c5sU2V— M.K.Stalin (@mkstalin) March 7, 2025 -
బీజేపీ Vs స్టాలిన్: పోరాటానికి తమిళులు కలిసి రండి.. సీఎం పిలుపు
చెన్నై: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తమిళనాడులో సీఎం స్టాలిన్ మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. హిందీ భాష విషయంలో కేంద్రంపై స్టాలిన్ నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే హిందీ కారణంగా 25 భారతీయ భాషలు కనుమరుగైపోతున్నాయని విమర్శించారు. తాజాగా మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. తమిళనాడుకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రతీ పౌరుడు కదలిరావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశారు.తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తాజాగా వీడియోలో మాట్లాడుతూ..‘ప్రస్తుతం తమిళనాడు రెండు ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. అవి త్రిభాష విధానం అమలు ఒకటి అయితే, మరొకటి నియోజకవర్గాల పునర్విభజన అంశం. త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించినందుకు మనకు రావాల్సిన నిధులను కేంద్రం నిలిపివేసింది. నియోజకవర్గాల విభజన తమిళనాడు ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేస్తోంది. కేంద్రం తన ఇష్టానుసారం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించాల్సిన సమయం వచ్చింది. వీటికి వ్యతిరేకంగా పోరాడేందుకు రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ముందుకు రావాలి. మన పోరాటాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అందరినీ కోరుతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో.. ఇప్పటికే కేంద్రం నిర్ణయాలను ఇప్పటికే పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. కర్ణాటక, పంజాబ్‌తో పాటు తెలంగాణ వంటి రాష్ట్రాలు సైతం దీనికి సంఘీభావం తెలిపాయి. తమిళనాడులో పార్లమెంటు నియోజకవర్గాలను తగ్గించబోమని చెబుతూనే.. ఇతర రాష్ట్రాల్లో పెంచమని హామీ ఇవ్వలేకపోతున్నారు. మా డిమాండ్ స్పష్టంగా ఉంది. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలు నిర్ణయించవద్దు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే వాటిని తమిళనాడు ప్రతిఘటిస్తుంది. విజయం సాధిస్తుంది’ అని చెప్పుకొచ్చారు.అంతకుముందు కూడా కేంద్రంపై స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. హిందీ కారణంగా దేశంలో 25 ఉత్తర భారతీయ భాషలు కనుమరుగైపోతున్నాయని విమర్శించారు. భోజ్‌పురి, మైథిలీ, బుందేలీ, గర్వాలీ, కుమావోని, మాగాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్గఢి, సంథాలీ, అంజికా ఇలా అనేక భాషలు మనుగడ కోసం ఎదురుచూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్లు హిందీ రాష్ట్రాలు కావు. వాటి అసలు భాషలు గతంలో కలిసిపోయాయి. తమిళనాడుకు అలాంటి పరిస్థితి రాకూడదనే ప్రతిఘటిస్తున్నాం. జాతి, సంస్కృతిని నాశనం చేయడానికి భాషలపై దాడి చేస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. ஒரே இலக்கு!தமிழ்நாடு போராடும்!தமிழ்நாடு வெல்லும்!#FairDelimitationForTN pic.twitter.com/zQ1hMIHGzo— M.K.Stalin (@mkstalin) February 28, 2025 -
Womens Reservation Bill 2023: తక్షణమే అమలు చేయండి
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ మోదీ సర్కారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుకు కాంగ్రెస్ పూర్తిగా మద్దతిస్తుందని ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటించారు. అయితే జన గణన, డీ లిమిటేషన్ వంటివాటితో నిమిత్తం లేకుండా బిల్లును తక్షణం అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. అలాగే మూడో వంతు రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీ మహిళలకు కూడా వర్తింపజేయాలన్నారు. బుధవారం లోక్‌సభలో మహిళా బిల్లుపై చర్చను విపక్షాల తరఫున ఆమె ప్రారంభించారు. రిజర్వేషన్ల అమలులో ఏ మాత్రం ఆలస్యం చేసినా అది భారత మహిళల పట్ల దారుణ అన్యాయమే అవుతుందని అన్నారు. ‘కుల గణన జరిపి తీరాల్సిందే. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్. ఇందుకోసం తక్షణం కేంద్రం చర్యలు చేపట్టాలి‘ అని పునరుద్ఘాటించారు. రాజకీయాలతో పాటు వ్యక్తిగతాన్నీ, భావోద్వేగాలను కూడా రంగరిస్తూ సాగిన ప్రసంగంలో సోనియా ఏమన్నారంటే... ‘దేశాభివృద్ధిలో మహిళల పాత్రను సముచితంగా గుర్తుంచుకునేందుకు, కృతజ్ఞతలు తెలిపేందుకు ఇది సరైన సమయం. అందుకే, నారీ శక్తి విధాన్ అధినియమ్‌కు కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా మద్దతిస్తుంది. దాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలి. ఆ దారిలో ఉన్న అడ్డంకులను తలగించాలి‘. వంటింటి నుంచి అంతరిక్షం దాకా... ‘మసిబారిన వంటిళ్ల నుంచి ధగధగా వెలిగిపోతున్న స్టేడియాల దాకా, అంతరిక్ష సీమల దాకా భారత మహిళలది సుదీర్ఘ ప్రయాణం. అటు పిల్లలను కని, పెంచి, ఇటు ఇల్లు నడిపి, మరోవైపు ఉద్యోగాలూ చేస్తూ అంతులేని సహనానికి మారుపేరుగా నిలిచింది మహిళ. అలాంటి మహిళల కష్టాన్ని, గౌరవాన్ని, త్యాగాలను సముచితంగా గుర్తించినప్పుడు మాత్రమే మానవతకు సంబంధించిన పరీక్షలో మనం గట్టెక్కినట్టు‘. స్వాతంత్య్ర పోరులోనూ నారీ శక్తి ‘దేశ స్వాతంత్య్ర సంగ్రామంలోనూ, అనంతరం ఆధునిక భారత నిర్మాణంలో కూడా భారత మహిళలు పురుషులతో భుజం కలిపి సాగారు. కుటుంబ బాధ్యతల్లో మునిగి సమాజం, దేశం పట్ల తమ బాధ్యతలను ఎన్నడూ విస్మరించలేదు. సరోజినీ నాయుడు, సుచేతా కృపాలనీ, అరుణా అసఫ్ అలీ, విజయలక్ష్మీ పండిట్, రాజ్ కుమార్ అమృత్ కౌర్, ఇంకా ఎందరెందరో మహిళామణులు మనకు గర్వకారణంగా నిలిచారు. గాం«దీ, నెహ్రూ, పటేల్, అంబేడ్కర్ తదితరుల ఆకాంక్షలు నెరవేర్చడంలో తమ వంతు పాత్ర పోషించారు‘. రాజీవ్ కల.. అప్పుడే సాకారం ‘చట్ట సభల్లో మహిళలకు సముచిత ప్రాతి నిధ్యం దక్కాలన్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ కల సగమే నెరవేరింది. బిల్లు ఆమోదం పొందినప్పుడే అది పూర్తిగా సాకారవుతుంది. నేనో ప్రశ్న అడగాలనుకుంటున్నా. భారత మహిళలు తమ రాజకీయ బాధ్యతలను తలకెత్తుకునేందుకు 13 ఏళ్లుగా వేచిచూస్తున్నారు. ఇప్పుడు కూడా వారిని ఇంకా ఆరేళ్లు, ఎనిమిదేళ్లు... ఇలా ఇంకా ఆగమంటూనే ఉన్నారు. భారత మహిళల పట్ల ఇలాంటి ప్రవర్తన సరైనదేనా?‘ మహిళా శక్తికి ప్రతీక ఇందిర... ఇక దివంగత ప్రధాని ఇందిరా గాంధీ వ్యక్తిత్వం భారత మహిళల శక్తి సామర్థ్యాలను తిరుగులేని ప్రతీకగా ఇప్పటికీ నిలిచి ఉంది. వ్యక్తిగతంగా నా జీవితంలో ఇది చాలా ముఖ్యమైన సందర్భం. మహిళలకు స్థానిక సంస్థల్లో మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ నా జీవిత భాగస్వామి, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తొలిసారిగా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. కానీ రాజ్యసభలో ఆ బిల్లును కేవలం ఏడు ఓట్లతో ఓడించారు. అనంతరం పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పాస్ చేయించింది. ఫలితంగా నేడు 15 లక్షలకు పైగా మహిళలు దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ప్రతినిధులుగా రాణిస్తున్నారు‘. -
అదొక్కటే ప్రమాణం కాదు! డీలిమిటేషన్‌పై అస్సాం సీఎం కీలక వ్యాఖ్యలు
డీలిమిటేషన్‌పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గాల విభజనకు జనాభా మాత్రమే ప్రాతిపదిక కాకూడదని హిమంత బిస్వాశర్మ అన్నారు. కొత్తగా రూపొందించిన నాలుగు జిల్లాల విలీనానికి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించిన ఒకరోజు తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి డీలిమిటేషన్ కోసం జిల్లాల విలీనానికి మంత్రి వర్గం ఆమోదం తెలపలేదని, కేవలం పరిపాలనపరమైన చర్యల కోసమే అలా చేశామని తేల్చి చెప్పారు. ఐతే ఈ డీలిమిటేషన్ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఈ విషయమై తాము పార్లమెంటు చేసిన చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని చెప్పారు. అలాగే జనాభాను నియంత్రించమని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను కోరిందని, కానీ కొన్ని ప్రాంతాల్లో దీన్ని పాటించలేదని ముఖ్యమంతి హిమంత బిస్వా శర్మ అన్నారు. అంతేగాదు తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతానికి ప్రస్తుత చట్టం ప్రీమియం ఇస్తుంది కాబట్టి పార్లమెంటులో ఈ విషయంపై చర్చ జరగాలన్నారు. ఈ డీలిమిటేషన్ అనేది దేశంలో లేదా శాసన సభ ఉన్న రాష్ట్రంలో ప్రాదేశిక నియోజకవర్గాల పరిమితులు లేదా సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియ. కానీ ఇది స్వదేశీయుల హక్కులను, భవిష్యత్తును రక్షించలేకపోయిందని అన్నారు. ఈ డీలిమిటేషన్ కసరత్తు మన సమాజాన్ని కాపాడుతుందని, అలాగే అసెంబ్లీ లోపల జనాభా మార్పును కాపాడుతుందని అన్నారు. దీన్ని రాజకీయేతర రాజ్యంగ కసరత్తుగా అభివర్ణించారు. కాగా విలీన ప్రణాళిక ప్రకారం..బిస్వనాథ్ జిల్లాను సోనిత్‌పూర్‌లో, హోజాయ్ను నాగావ్‌లో, తముల్పూర్ జిల్లాను బక్సాలో, బజలి జిల్లాను బార్పేట జిల్లాలో విలీనం చేశారు. ప్రస్తుతం అస్సాంలో డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతున్నందున జనవరి 1, 2023 నుంచి అస్సాం ప్రభుత్వం ఏ జిల్లాలు లేదా పరిపాలన విభాగాలలో ఎటువంటి మార్పులు చేయకూడదని నిర్దేశిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: ఘోర అగ్నిప్రమాదం..పలువురికి తీవ్ర గాయాలు) -
ఈ కశ్మీర్ లెక్క కరెక్టేనా?
కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ–కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) కమిషన్ ప్రతిపాదన అసంతృప్తి జ్వాలలను రగులుస్తున్నది. కేంద్రం నియమించిన డీలిమిటేషన్ కమిషన్ కొత్తగా జమ్మూలో ఆరు అసెంబ్లీ సీట్లు, కశ్మీర్లో ఒకటి ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించి, జనాభిప్రాయాన్ని కోరింది. ఈ ప్రతిపాదనలు బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చేవిగా ఉన్నాయనీ, జమ్మూ, కశ్మీర్‌ల మధ్య విభజన రేఖను గీసి వాటి మధ్య శత్రుత్వ భావం పెంచేలా ఉన్నాయనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి 2011 జనాభా గణాంకాలను బట్టి చూస్తే... మొత్తం 90 సీట్లలో కశ్మీర్‌కు ప్రస్తుతం ఉన్న 46 స్థానాలను 51 స్థానాలకు, జమ్మూకు ప్రస్తుత 37 సీట్లను 39కి పెంచాల్సి ఉంది. జమ్మూ కశ్మీర్లో ఉన్న రాజకీయ కేంద్రీకరణ, ఆధిపత్యంౖపై ఈ ప్రతిపాదన ఒక దాడి లాంటిది. 2019 ఆగస్టు 5న బీజేపీ నాయకత్వం లోని ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ సాధికారతను తగ్గించడానికి ప్రారం భించిన చర్యల్లో ఇదొక భాగం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత జనాభా లెక్కల ప్రకారం, జమ్మూ జనాభా కన్నా కశ్మీర్ జనాభా 15 లక్షల మంది ఎక్కువగా ఉన్నప్పటికీ కశ్మీర్‌కు 1, జమ్మూకు 6 కొత్త నియోజక వర్గాలను ఏర్పాటు చేయాలనడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవు తోంది. జమ్మూ కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరగాలనేది 1995 నుంచీ బీజేపీ ఎజెండాగా ఉంది. 2020 మార్చి 6న కేంద్ర ప్రభుత్వం జమ్మూ–కశ్మీర్లో నియోజక వర్గాల పునర్విభజన కోసం డీలిమిటేషన్ కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్ డిసెంబర్ 20న తన అసోసియేట్ సభ్యులైన ముగ్గురు నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీలు, ఇద్దరు బీజేపీ ఎంపీలకు మొత్తం మీద ఆరు కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనల గురించి చెప్పింది. తమ ప్రతి పాదనలపై డిసెంబర్ 31 లోపు ప్రతి స్పందించాలని కోరిందని ఎంపీలు పేర్కొన్నారు. కశ్మీర్‌కు మరిన్ని సీట్లు రావలసి ఉందనీ, ఈ ప్రతిపాదన తమకు ఏమాత్రం సమ్మతం కాదనీ ఎన్సీ ఎంపీ జస్టిస్ (రిటైర్డ్) హస్నెయిన్ మసూది అన్నారు. డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదనతో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో జమ్మూ సీట్లు 37 నుంచి 43కు, కశ్మీర్ సీట్లు 46 నుంచి 47కు పెరుగు తాయి. జమ్మూలోని కథువా, సంబా, ఉధంపూర్, దోడ, కిష్త్వార్, రాజౌరీ జిల్లాల్లో ఒక్కో నియోజక వర్గాన్ని, కశ్మీర్ లోయలోని కుప్వారా జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని అదనంగా ఏర్పాటు చేయాలని కమిషన్ ప్రతిపాదించింది. కథువా, సంబా, ఉధంపూర్ సెగ్మెంట్లలో హిందువులు అత్యధికంగా ఉన్నారు. జనాభా లెక్కల ప్రకారం కథువాలో 87.61 శాతం హిందూ జనాభా ఉంది. కాగా సంబాలో 86.33 శాతం, ఉధంపూర్‌లో 88.12 శాతం హిందువులు ఉన్నారు. కిష్త్వార్, దోరా, డజౌరీ జిల్లాల్లోనూ గణనీయంగా (37 శాతం నుంచి 45 శాతం) హిందువులు ఉన్నారు. పునర్విభజన కథ ఇదీ... అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఒకే పరిమాణంలో ఓటర్లు ఉండేలా చూసేందుకు డీలిమిటేషన్ చేపడతారు. చివరిసారి దేశంలో నియోజక వర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) 2002లో జరిగింది. జమ్మూ– కశ్మీర్లో మాత్రం 1995లో రాష్ట్రపతి పాలన ఉన్న కాలంలో జరిగింది. దానికి ముందు 1993లో తాత్కాలిక ప్రాతిపదికన జగ్మోహన్ డీలిమిటేషన్ ప్రక్రియ నిర్వహించారు. అప్పట్లో 87 అసెంబ్లీ సీట్లు ఉండాలని ప్రతిపాదిం చారు. అయితే 2002లో ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం 2026 వరకు డీలిమిటేషన్‌ను నిర్వహించడానికి వీల్లేకుండా రాష్ట్ర రాజ్యాంగాన్ని సవరించింది. కానీ 2008 నుంచి బీజేపీ డీలిమిటేషన్ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. జమ్మూ ప్రాంతానికి అసెంబ్లీ స్థానాల్లో తగిన వాటా వచ్చేందుకు డీలిమిటేషన్ అవసరం ఉందని ఆ పార్టీ వాదిస్తూ వచ్చింది. జమ్మూ కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేసిన అనంతరం 2020 మార్చి 6న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టడానికి కేంద్రం డీలిమిటేషన్ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ నిర్వహించిన ఓ సమావేశం (2021, ఫిబ్రవరి)లో బీజేపీ నాయకులు జమ్మూలో డీలిమిటేషన్‌కు కేవలం జనాభాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులనూ పరిగణనలోకి తీసు కోవాలని కమిషన్‌ను కోరారు. దీంతో జూన్‌లో కమిషన్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న మొత్తం 20 జిల్లాల్లో ఉన్న భౌగోళిక పరిస్థితులు, జనాభా విస్తరణ, జనసాంద్రత, ప్రజల రాజకీయకాంక్షలు లేదా నియోజకవర్గాలకు సంబంధించిన ఆకాంక్షల సమాచారాన్ని సమర్పించాలని ఆయా జిల్లా కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 20 నాడు ముసాయిదా డీలిమిటేషన్ ప్రతిపాదనలను... కమిషన్ అనుబంధ çసభ్యులైన జమ్మూ కాశ్మీర్ ఎంపీలు ఐదుగురికీ ఇచ్చి డిసెంబర్ 31 లోపు తమ అభిప్రాయాలు చెప్పాలని కోరింది. జమ్మూకు లభించాల్సినంత ప్రాతినిధ్యం లభించలేదనీ, అందు వల్ల నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనీ ఎప్పటినుంచో బీజేపీ డిమాండ్ చేస్తూ వస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జమ్మూలో 25 స్థానాలు గెలుచుకుని చరిత్రలో మొదటిసారిగా సంకీర్ణ ప్రభు త్వంలో భాగస్వామి అయింది. జమ్మూకు అసెంబ్లీలో తగిన ప్రాతి నిధ్యం లభించలేదంటున్న బీజేపీ వాదం సరికాదనే విమర్శా ఉంది. ఎందుకంటే గత డీలిమిటేషన్లో కూడా కశ్మీర్ లోయ కన్నా జమ్మూకే ఎక్కువ లాభం చేకూరింది. 1995లో జరిగిన నియోజక వర్గాల పునర్విభజనలో కశ్మీర్‌కు 46 సీట్లు కేటాయిస్తే, జమ్మూకు 37 స్థానాలు కేటాయించారు. అంటే మొత్తం రాష్ట్ర జనాభాలో 56.15 శాతం ఉన్న కశ్మీర్ జనాభాకు 55.42 శాతం ప్రాతినిధ్యం లభించిం దన్నమాట. అదే సమయంలో 43.84 శాతం ఉన్న జమ్మూ ప్రజలకు 44.57 శాతం ప్రాతినిధ్యం లభించింది. అంతేకాక, అంతకుముందు 1957లో జమ్మూ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీట్లకు రెట్టింపు స్థానాలు జమ్మూకు లభించాయి. కాగా, కశ్మీర్‌కు మొత్తం మీద 3 సీట్లు పెరగగా, జమ్మూ సీట్లు 7 పెరిగాయి. 1957లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల నాటికి కశ్మీర్‌కు 43 స్థానాలు కేటాయించగా, జమ్మూకు 30 స్థానాలు కేటాయించారు. లద్దాఖ్‌కు 2 సీట్లు ఇచ్చారు. జమ్మూ–కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత లద్దాఖ్ ఇప్పుడు జమ్మూ–కశ్మీర్లో భాగం కాదన్న సంగతి తెలిసిందే. డీలిమిటేషన్ ప్రకియ అంతా ముస్లిం జనాభా అధికంగా ఉన్న రాష్ట్రంలో హిందూ ముఖ్యమంత్రిని ప్రతిష్ఠించాలన్న బీజేపీ ‘కలల ప్రాజెక్టు’ను సాకారం చేయడానికే అని కశ్మీర్ లోయలో అధిక జనాభా భావిస్తోంది. 1947 నుంచి జమ్మూ–కశ్మీర్లో ఎన్నికైన ప్రభుత్వానికి ఒక్క గులాం నబీ ఆజాద్ తప్ప అందరూ కశ్మీర్ లోయకు చెందినవారే ముఖ్యమంత్రిగా నాయకత్వం వహించారు. డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదన కశ్మీర్‌లోయను, జమ్మూను విభజించే ధోరణిలో ఉందని కశ్మీర్ రాజకీయ నాయకులు మండి పడుతున్నారు. ‘‘జమ్మూ–కశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ ముసాయిదా ప్రతిపాదన మాకు సమ్మతం కాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూకు 6 జీట్లు, కశ్మీర్‌కు 1 స్థానం ఇవ్వడం న్యాయం కాద’’ని మాజీ సీఎం, ఎన్సీ ఉపాధ్యక్షులు ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. మరో మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రా టిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ... ‘‘2019 ఆగస్ట్‌లో తీసుకున్న చట్టవిరుద్ధ, రాజ్యాంగ వ్యతిరేకమైన నిర్ణ యాన్ని చట్టబద్ధం చేసే ప్రభుత్వాన్ని జమ్మూ కశ్మీర్లో స్థాపించడమే అసలు గేమ్ ప్లాన్’’ అని వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదన పూర్తిగా పక్షపాతంతో కూడుకుని ఉందని, కశ్మీర్లో ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవారికి ఇది ఒక షాక్ అని పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజాద్ ఘనీ విమర్శించారు. జస్టిస్ (రిటైర్డ్) రంజనా దేశాయ్ అధ్యక్షునిగా ఉన్న డీలిమిటేషన్ కమిషన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో... మొత్తం 20 జిల్లాలను 30 కేటగిరీలుగా విభజించి, కష్టతరమైన భౌగోళిక పరిస్థితులు, ఇతర దేశాల సరిహద్దుల్లో జీవించడం వంటి విషయాలను దృష్టిలో ఉంచు కుని అదనపు నియోజకవర్గాలను కేటాయించామని తెలియజేసింది. అలాగే జనాభా ప్రాతిపదికన మొదటిసారిగా మొత్తం 90 సీట్లలో 9 సీట్లు ఎస్టీలకు, 7 సీట్లు ఎస్సీలకు కేటాయించాలని ప్రతిపాదించామని కమిషన్ తెలిపింది. వాస్తవానికి 2011 జనాభా గణాంకాలను చూస్తే మొత్తం 90 సీట్లలో కశ్మీర్‌కు ప్రస్తుతం ఉన్న 46 స్థానాలను 51 స్థానాలకు, జమ్మూకు ప్రస్తుత 37 సీట్లను 39కి పెంచాల్సి ఉంది. – ఉమర్ మఖ్బూల్,శ్రీనగర్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్ట్ (‘ది వైర్’ సౌజన్యంతో) -
కశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజనలో సంక్లిష్టతలు
జమ్మూకశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో రాజకీయ మద్దతు తీసుకునే లక్ష్యంతోనే ప్రధాని నరేంద్రమోదీ ఇటీవలే అక్కడి రాజకీయ పార్టీలతో భేటీ అయ్యారు. పర్యవసానంగా నియోజకవర్గాల పునర్విభజన కమిటీ ఆ మధ్య జమ్మూకశ్మీర్‌ను సందర్శించి ఈ అంశంపై ప్రాథమిక సమాచార సేకరణ కోసం శ్రీనగర్, కిష్వార్, పహల్ గామ్, జమ్మూ ప్రాంతాల్లోని 290 పైగా బృందాలతో సమావేశమైంది. నియోజకవర్గాల పునర్విభజనకి మద్దతుగా చేసే ప్రధాన వాదన ఏదంటే అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ అంశమే. వీరు ప్రధానంగా 1947లో శరణార్థులుగా భారత్‌కు వచ్చినవారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వీరిని పశ్చిమ పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులుగా ప్రస్తావిస్తుంటారు. పైగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచాల్సిరావడం అనేది నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటుకు దారితీసింది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సీట్ల పంపిణీ 1981 జనాభా లెక్కల ప్రాతిపదికన జరిగింది. 2019 ఆగస్టులో ఆమోదం పొందిన జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కొత్తగా పెంచింది. దీంతో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మూకశ్మీర్ శాసనసభ స్థానాలు 83 నుంచి 90కి పెరగనున్నాయి. గత అసెంబ్లీలో కూడా ఎస్సీలకు రాజకీయపరమైన రిజర్వేషన్లు ఉనికిలో ఉండేవి. ఎస్సీల కోసం కేటాయించిన స్థానాల నుంచి పలువురు కీలక మంత్రులు గతంలో పదవులు చేపట్టగలిగారు. మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్ కూడా వారిలో ఒకరు. ప్రధానితో ఇటీవలి సమావేశానికి ఈయన్ని కూడా ఆహ్వానించారు. కశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తుందన్నది వాస్తవం. దీంట్లో ప్రధానంగా లబ్ధిదారులు గుజ్జర్లు. వీరు చాలావరకు ముస్లింలే. గత శాసనసభ ఎన్నికల్లో కశ్మీర్ లోయలోని లోలాబ్, కంగన్ అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను గుజ్జర్ అభ్యర్థులు ఎన్నికయ్యారు. జమ్మూలోని సురాన్ కోట్, మెంధర్, రాజౌరి, గులాబ్‌ఘర్, డర్హాల్, కాలాకోటె, గూల్ అర్నాస్ నియోజకవర్గాలకు కూడా గుజ్జర్ అభ్యర్థులే ప్రాతినిధ్యం వహించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, గుజ్జర్ల జనాభా పూర్వ రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 9 శాతంగా ఉండేది. జమ్మూకశ్మీర్ గత శాసనసభలో గుజ్జర్లకు 10.8 శాతం ప్రాతినిధ్యం ఉండేది. కశ్మీర్లో శాసన కార్యనిర్వాహక మార్పును మాత్రమే కోరుకుంటున్న రాజకీయ పార్టీలు అక్కడి గిరిజన అభ్యర్థులకు ఇకనైనా ప్రాధాన్యం ఇవ్వడంపై ఏమంత ఆసక్తిని ప్రదర్శించడం లేదు. కాబట్టి జమ్మూ కశ్మీర్ భవిష్యత్ శాసనసభలో కూడా గుజ్జర్ల ప్రాతి నిధ్యం 2014లో ఎన్నికైన గత అసెంబ్లీలో ఉన్న విధంగానే ఉంటుంది తప్పితే పెద్దగా మార్పు ఉండదు. కశ్మీర్లో కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మార్పు ఏమీ ఉండదు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్ ఎన్నికలలో ఓటు వేసే అర్హత ఉన్న వారి సంఖ్య కొద్దిగా మారింది. 2011 జనాభా లెక్కల ప్రకారం పూర్వ రాష్ట్రంలో బయటనుంచి వచ్చిన వారి వాస్తవ సంఖ్య 1.6 లక్షలు మాత్రమే. వాస్తవానికి, గత కొన్ని సంవత్సరాలుగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే డిమాండ్ జమ్మూకశ్మీర్‌లోని కొన్ని రాజకీయ పక్షాలనుంచి వచ్చింది. గత అసెంబ్లీలో కశ్మీర్ లోయలో 46 అసెంబ్లీ సీట్లు ఉండగా జమ్మూలో 37 స్థానాలుండేవి. 19వ శతాబ్దిలో విభిన్న సాంస్కృతిక, భౌగోళిక ప్రాంతాలను కలిపి సృష్టించిన జమ్మూకశ్మీర్ 1947లో కీలక మార్పులను చవిచూసింది. జమ్మూలోని చీనాబ్ లోయలో రెండు మతాల జనాభా కలిసివుండే అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించడం సంక్లిష్టంగా మారనుంది. పైగా గత అసెంబ్లీ కంటే ఇప్పుడు ఏర్పడనున్న అసెంబ్లీలో ఎస్టీలకంటే ఎస్సీలకు కాస్త ఎక్కువ సీట్లు లభ్యం కానున్నాయి. ఈ నేపథ్యంలో రీజియన్లకు, దిగువశ్రేణి ప్రాంతాలకు రాజకీయ, ఆర్థిక అధికారాన్ని సంస్థా గతీకరించేటప్పుడు అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరిపిన ఇతర ప్రాంతాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. - లవ్ పురి వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత -
కశ్మీరీల్లో అపనమ్మకాన్ని తొలగించాలి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి, రాష్ట్ర హోదాను బలవంతంగా తీసేయడంతో కశ్మీరీల్లో నెలకొన్న అపనమ్మకాన్ని కేంద్రప్రభుత్వం తొలగించాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూఖ్ అబ్లుల్లా సూచించారు. విశ్వాసాన్ని పాదుకొల్పే చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రతిపత్తి కల్పనతోపాటు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ముందుగానే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను ఇవ్వాలని ఆ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా కోరారు. కశ్మీర్లో రాజకీయాలకు పునరుజ్జీవం పోసేందుకు ప్రధాని మోదీతో అఖిలపక్ష సమావేశంలో తమ డిమాండ్లను స్పష్టం చేశాక శ్రీనగర్ చేరుకున్న ఫరూఖ్, ఒమర్‌లు శనివారం మీడియాతో మాట్లాడారు. తదుపరి కార్యాచరణ వివరాలను తమ పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) సభ్యులతో మాట్లాడాకే వెల్లడిస్తామని వారు చెప్పారు. ‘జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తిపై నాడు జవహర్ లాల్ నెహ్రూ ప్రజాభిప్రాయం ద్వారా సాకారం చేస్తానని మాటిచ్చి తర్వాత వెనకడుగు వేశారు. ఆ తర్వాత ప్రధాని పీవీ నరసింహారావు సైతం పార్లమెంట్ సాక్షిగా మాటిచ్చారు. మేమెన్నడూ స్వాతంత్య్రం కావాలని అడగలేదు. స్వతంత్ర ప్రతిపత్తే కావాలన్నాం. ఇప్పుడు అదెక్కడుంది?. రాష్ట్ర హోదా తీసేసి కశ్మీరీల్లో ఉన్న నమ్మకాన్ని కేంద్రం పోగొట్టుకుంది. ఇక మీదటైనా కేంద్ర ప్రభుత్వం నమ్మకం పెరిగేలా ఏదైనా చేస్తుందేమో చూస్తాం’ అని ఫరూఖ్ మీడియాతో అన్నారు. గుప్కార్ అలయన్స్‌కు ఇక ముగింపు పలకనున్నా రనే వాదనలను ఆయన కొట్టిపారేశారు. ‘నియోజక వర్గాల పునర్విభజన పూర్తయ్యాక ఎన్నికలు జరిపి ఆ తర్వాతే రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్రం చెబుతోంది. దీనికి మేం అస్సలు ఒప్పకోం. రాష్ట్ర హోదా ఇచ్చాకే ఎన్నికలు పెట్టండి’ అని ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. అఖిలపక్ష భేటీ తర్వాత గుప్కార్ అలయన్స్‌లో ఐక్యత లోపించిందనే వాదనను ఒమర్ తోసిపుచ్చారు. ‘ఆర్టికల్ 370ని రద్దు చేయాలనే తమ కలను బీజేపీ 70 ఏళ్ల తర్వాత సాకారం చేసుకుంది. మేం కూడా పోరాటంలో విజయం సాధించేందుకు 70 వారాలు.. 70 నెలలు.. అంతకంటే ఎక్కువ కాలం పట్టినా సరే ఎన్నాళ్లయినా పోరాడతాం’ అని ఒమర్ అన్నారు. -
'విభజన రాత్రిళ్లు జరిగిందనడం హాస్యాస్పదం'
సాక్షి, నల్గొండ : డీసీసీబీ సహకార బ్యాంకులకు నూతనంగా ఎన్నికైన పాలకవర్గాలకు రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కేంద్ర ప్రభుత్వం చట్టాలను అగౌరవ పరుస్తుందన్నారు. రాష్ట్ర విభజన రాత్రిళ్లు చేసుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించారు. డీలిమిటేషన్ ప్రక్రియ జమ్మూకశ్మీర్‌కే వర్తింస్తుందనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. పునర్విభజన చట్టాన్ని గౌరవించి రెండు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని పేర్కొన్నారు. పట్టణ ప్రగతి అనేది మంచి కార్యక్రమం అని, ఇలాంటి వాటికి రాజకీయాలు జోడించాల్సిన అవసరం లేదన్నారు. -
‘విజ్ఞప్తులు పట్టించుకోకుండా పునర్విభజన చేశారు’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని మున్సిపాలిటీల డీ లిమిటేషన్ అశాస్త్రీయంగా జరిగిందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్ ఆరోపించారు. మున్సిపాలిటీల పునర్విభజనకు సంబంధించి కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు బుధవారం గాంధీభవన్‌లో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పట్టించుకోకుండా మున్సిపాలిటీల పునర్విభజన చేశారని మండిపడ్డారు. 3385 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లలో కూడా అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి వారి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే వివిధ వేదికల ద్వారా న్యాయం కోసం పోరాడతామని తెలిపారు. వంశీచంద్ మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం వార్డుల విభజన చేసిందని ఆరోపించారు. దీనిపై పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కమిటీ సుదీర్ఘంగా చర్చిందని తెలిపారు. మున్సిపాలిటీల్లోని ప్రజలు వార్డుల పునర్విభజనపై ఏం కోరుకుంటున్నారో ఆ దిశగా పనిచేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పార్టీకి పూర్వ వైభవం తీసుకోస్తామని ధీమా వ్యక్తం చేశారు. పొన్నం మాట్లాడుతూ.. మున్సిపాలిటీ వార్డులకు సంబంధించిన వినతుల కోసం గుడువును పెంచాలని కోరారు. స్థానిక నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాదమని తెలిపారు. -
‘గ్రేటర్’లో ఉన్నా రూరల్ జిల్లాలోనే గీసుకొండ!
‘గ్రేటర్’లో ఉన్నా రూరల్ జిల్లాలోనే గీసుకొండ! మూడు డివిజన్లు, 17 పంచాయతీలూ రూరల్ జిల్లాలోకి.. అభ్యంతరం చెబుతున్న స్థానికులు గీసుకొండ : కొత్తగా ఏర్పాటు కానున్న వరంగల్ రూరల్ జిల్లాలోకి గీసుకొండ మండలం రాబోతోంది. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉండగా.. ఈ ప్రాంతం నగరాన్ని ఆనుకుని ఉండి, కొంత మేర గ్రేటర్ వరంగల్‌లో భాగమైనా జిల్లాల పునర్విభజనలో భాగంగా మొత్తం మండలాన్ని వరంగల్ రూరల్ జిల్లాలో చేర్చనున్నారు. ఈమేరకు కలెక్టర్ రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి పంపించిన తాజా నివేదికలో ఈ విషయాన్ని పొందుపరినట్లు తెలుస్తోంది. గతంలో 25 గ్రామపంచాయతీలతో గీసుకొండ మండలం ఉండగా.. ఎనిమిది గ్రామపంచాయతీలను గ్రేటర్ వరంగల్ 2013 ఆగస్టు 1న విలీనం చేశారు. దీంతో మండలంలోని రెడ్డిపాలెం, మొగిలిచర్ల, పోతరాజుపల్లి, గొర్రెకుంట, కీర్తీనగర్, ధర్మారం, జాన్‌పాక, గరీబ్‌నగర్, స్తంభంపెల్లి, వసంతాపూర్, దూపకుంట ప్రాంతాలు నగరంలోకి చేరగా వీటిని 2, 3, 4వ డివిజన్లుగా ఏర్పాటుచేసి ఎన్నికలు నిర్వహించారు. మిగిలిన 17 గ్రామపంచాయతీలకు సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు మండలానికి ఎంపీపీ, జెడ్పీటీసీ ఉన్నారు. తాజాగా జిల్లాల పునర్విభజన తెరపైకి రావడంతో నగరంలో విలీనమైన ప్రాంతం వరంగల్ జిల్లాలో, మిగతాది రూరల్ జిల్లాలో కొనసాగుతుందని అంతా భావించారు. కానీ మండలం మొత్తం వరంగల్ రూరల్ జిల్లా కిందికి వెళ్లనున్నట్లు ప్రతిపాదనల్లో పొందుపర్చడంతో స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. వరంగల్ జిల్లాలోనే మండలాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. కాగా, సంగెం మండలం నుంచి గ్రేటర్ వరంగల్‌లో విలీనమైన బొల్లికుంట, గాడెపల్లి గ్రామాలు ప్రస్తుతం 4వ డివిజన్లో ఉన్నాయి. ఈ రెండు గ్రామాలతో పాటు సంగెం మండలం మొత్తం కూడా వరంగల్ రూరల్ జిల్లాలోకి వెళ్లనుంది. -
అంతా అస్తవ్యస్తం
* డీలిమిటేషన్‌పై అభ్యంతరాలు * కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు * 15లోగా ప్రభుత్వానికి తుది నివేదిక సాక్షి, సిటీబ్యూరో: డీలిమిటేషన్ ముసాయిదాపై ప్రజలతో పాటు వివిధ రాజకీయ పక్షాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అస్తవ్యస్తంగా ఉందని ఆరోపిస్తూ కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై ప్రభుత్వానికి తుది నివేదిక అందించేందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో వాతావరణం వేడెక్కింది. మరోవైపు కొన్ని సర్కిల్ కార్యాలయాల నుంచి ప్రధాన కార్యాలయానికి ఇంకా తుది ప్రతిపాదనలు అందలేదు. ఏ సర్కిల్ నుంచి ఎన్ని అభ్యంతరాలు అందాయో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జనాభా దామాషాకు అనుగుణంగా డీలిమిటేషన్ చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ... కొత్తగా ఏర్పాటు చేస్తున్న డివిజన్లలో ఎక్కడ ఎంత జనాభా ఉందో... దాని స్వరూప స్వభావాలేమిటో తెలిపే మ్యాపులను అధికారులు ప్రజల ముందు ఉంచలేదు. దీనిపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అభ్యంతరాలను నామ్కేవాస్తేగా ఆహ్వానించారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మార్పులు చేస్తారా? లేక యధావిధిగా తుది జాబితా తయారు చేస్తారా? అనే అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిని త్వరితంగా పూర్తి చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ జనార్దన్‌రెడ్డి డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఒకటికి రెండు పర్యాయాలు అన్నీ పరిశీలించి తుది నివేదిక సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు. ముఖ్యంగా ఎల్బీనగర్ సర్కిల్లో అభ్యంతరాలను మరోమారు పరిశీలించి... ముఖ్యాంశాలను పరిగణనలోకి తీసుకొని తుది నివేదిక రూపొందించాల్సిందిగా సూచించారు. అలాగే పటాన్చెరు, ఆర్సీపురం సర్కిల్ నుంచి అందిన అభ్యంతరాలను పరిశీలించాల్సిందిగా సూచించారు. ఇంకా, పాతబస్తీ పరిధిలోని సర్కిల్ 4, 5, 7బి, అంబర్‌పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్ సర్కిళ్లలోనూ పరిశీలించాల్సిన కీలకాంశాలు ఉన్నాయని... వాటిని జాగ్రత్తగా సమీక్షించాలని సూచించినట్లు తెలిసింది. అస్తవ్యస్తంగా, అభ్యంతరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై డిప్యూటీ కమిషనర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించాలని ఆదేశించారు. వివిధ అంశాలపై 200కు పైగా అభ్యంతరాలు అందాయి. అభ్యంతరాలలో కొన్ని... * సర్కిల్-9బికి 36 ఫిర్యాదులు అందాయి. వీటిలో ఎక్కువగా కాచిగూడ డివిజన్ పేరును తొలగించడంపైనే ఉన్నాయి. * కుత్బుల్లాపూర్ సర్కిల్లో 20 ఫిర్యాదులు రాగా... షాపూర్ నగర్ పేరును కొనసాగించాలనే డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి. * మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్లకు సంబంధించి 14 అభ్యంతరాలు అందగా.. నేరేడ్మెట్, యాప్రాల్ డివిజన్ల పేర్లను కొనసాగించాలని ఎక్కువ మంది కోరారు. * సికింద్రాబాద్ సర్కిల్ నుంచి కేవలం 6 అభ్యంతరాలు మాత్రమే అందాయి. వీటిలో 4 చిలకలగూడ డివిజన్‌ను గల్లంతు చేయవద్దనే వచ్చాయి. * శేరిలింగంపల్లి-1 సర్కిల్లోని భెల్ ఎంఐజీ కాలనీని మెదక్ జిల్లాలోని పటాన్చెరు సర్కిల్లో నూతనంగా ఏర్పాటయ్యే భారతీ నగర్ డివిజన్లో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నారు. * శేరిలింగంపల్లి సర్కిల్-2 పరిధిలో మూడు ఫిర్యాదులు అందాయి. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను రెండు సర్కిళ్లలోనే ఉంచాలని స్థానిక ఎమ్మెల్యే కోరారు. * ఉప్పల్ సర్కిల్లో 21 అభ్యంతరాలు రాగా... ఉప్పల్ డివిజన్లో రామంతాపూర్‌కు చెందిన కాలనీలను కలప వద్దని స్థానికులు అభ్యంతరం చెప్పారు. * కొన్ని కాలనీలను సగం ఒక డివిజన్, మిగిలిన సగం మరో డివిజన్‌కు కేటాయించారని... అలా కాకుండా ఒక కాలనీని ఒకే డివిజన్లో వచ్చే విధంగా ఉంచాలని కోరారు. * కాప్రా సర్కిల్‌కు మొత్తం 40 అభ్యంతరాలు వచ్చాయి. వీటిలో ప్రతిపాదిత మల్లాపూర్, హౌసింగ్ బోర్డు, చర్లపల్లి డివిజన్లకు సంబంధించి ఎక్కువగా అభ్యంతరాలు వచ్చాయి. * వివిధ అంశాలపై మరికొన్ని సర్కిళ్ల నుంచి కూడా అభ్యంతరాలు అందాయి. బీసీ గణన 25 శాతమే బీసీ గణనకు మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించిన అధికారులు గురువారం వరకు దాదాపు 25 శాతం పూర్తి చేశారు. గ్రేటర్‌లోని మొత్తం జనాభా 70,68,495. ఇప్పటి వరకూ 17,56,715 మంది సర్వే పూర్తి చేశారు. ఇంకా 53,11,780 మంది సర్వే జరగాల్సి ఉంది. ఈనెల 18 లోగా ఇది పూర్తి చేయాల్సి ఉంది. ఇంత స్వల్ప వ్యవధిలో కచ్చితమైన సమాచారంతో సర్వే పూర్తి చేయడం అధికారులకు సవాల్‌గా మారింది. -
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వార్డుల పునర్విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా వార్డుల పునర్విభజన పూర్తి చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంజీని విభజించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. పునర్విభజనతో జీహెచ్ఎంసీ వార్డులు సంఖ్య 150 నుంచి 200 వరకు పెరిగే అవకాశం కనబడుతోంది. పునర్విభజన పూర్తైన తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుత తెలుస్తోంది. -
మళ్లీ పునర్విభజన..
►ఇప్పటికే 14 అసెంబ్లీ స్థానాలు, కొత్తగా మరో తొమ్మిది? ►2011 జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ►భారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాల సంఖ్య ►రాష్ట్రంలోనే అధిక స్థానాలతో నంబర్ వన్‌గా మారే అవకాశం ►ముక్కలుకానున్న పట్టణ సెగ్మెంట్లు రిజర్వేషన్లలోనూ మార్పులు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్ర రాజకీయాల్లో రంగారెడ్డి జిల్లా బలీయశక్తిగా అవతరించనుంది. 2019 నాటికి తెలంగాణ శాసనసభలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన జిల్లాగా రూపుదాల్చనుంది. నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి రావడంతో జిల్లా రాజకీయ ముఖచిత్రం మారనుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తు తం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను కాస్తా 153కు పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర పున ర్విభజన చట్టంలో కేంద్రం ప్రభుత్వం పొందుపరిచింది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో నియోజకవర్గాల పునర్విభజన అంశం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్తగా తొమ్మిది నియోజకవర్గాలు! 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరుగనుంది. దీంతో రాష్ట్రంలోనే అధిక జనాభా కలిగిఉన్న మన జిల్లాలో ఏకంగా తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు కొత్తగా ఏర్పడనున్నాయి. సగటున 2.30 లక్షల జనాభాను ప్రామాణికంగా చేసుకొని డీలిమిటేషన్‌ను చేసే అవకాశమున్న నేపథ్యంలో ఈ మేర నియోజకవర్గాల సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శరవేగంగా జరుగుతున్న నగరీకరణ నేపథ్యంలో జిల్లా జనాభా అరకోటిని దాటింది. దీంతో శాసనసభలో జిల్లా ప్రాతినిధ్యం పెరిగేందుకు అనువుగా నియోజకవర్గాల విభజనలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా శివారు అసెంబ్లీ స్థానాలు మూడు ముక్కలుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గ భౌగోళిక స్వరూపం, చారిత్రక నేపథ్యం, కనెక్టివిటీ, పరిపాలనాపరమైన ఇబ్బందులను ఎన్నికల కమిషన్ నియమించే డీలిమిటేషన్ కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుంది. మండలాలు, గ్రామ సరిహద్దులు చెరిగిపోకుండా ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించిన అనంతరం నియోజకవర్గాలను పునర్విభజిస్తారు. కేవలం నియోజకవర్గాల డీలిమిటేషనేకాకుండా రిజర్వుడ్ స్థానాల్లో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి. రాష్ట్ర జనాభా ప్రాతిపదికన వీటిని కూడా సవరిస్తారు. అయితే ఈ తతంగమంతా పూర్తికావడానికి కనీసం మూడేళ్లు పట్టే అవకాశంలేకపోలేదు. పెరిగే అసెంబ్లీ సెగ్మెంట్లు కలుస్తాయి తప్ప.. లోక్‌సభ సెగ్మెంట్లలో ఎలాంటి మార్పులుండవు. ప్రాంతాల మధ్య వ్యత్యాసం 2009లో పునర్విభజన జరిగినప్పుడు 2001 జనాభాను పరిగణనలోకి తీసుకోవడంతో నియోజకవర్గాల జనాభాలో వ్యత్యాసం భారీగా నమోదైంది. దీంతో గ్రామీణ, పట్టణ నియోజకవర్గాల మధ్య సమతుల్యత కొరవడింది. తాజాగా 2011 జనగణన ఆధారంగా చేపడుతుం డడంతో గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాల్సిన బా ధ్యత యంత్రాంగంపై ఉందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పెరగనున్న రిజర్వ్డ్ స్థానాలు.. ప్రస్తుతం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. ఇందులో రెండు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. తాజాగా నియోజకవర్గ పునర్విభజన చేపడితే రిజర్వ్డ్ స్థానాల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతమున్న రెండు రిజర్వ్డ్ స్థానాలకు అదనంగా మరో రెండు రిజర్వ్డ్ స్థానాలు ఏర్పడనున్నాయి. మొత్తం నాలుగు రిజర్వ్డ్ స్థానాల్లో మూడు ఎస్సీ స్థానాలు కాగా, ఒక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. పునర్విభజనకు ప్రామాణికాలు... ►ఒక్కో నియోజకవర్గానికి సగటు జనాభా 2.30 లక్షలు ►2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 53.57 లక్షలు ►దీంతో జిల్లాలో 23 అసెంబ్లీ స్థానాలు ఏర్పడనున్నాయి ►పట్టణ నియోజకవర్గాలన్నీ ముక్కలు కానుండగా, గ్రామీణ స్థానాల్లో భారీ మార్పులు చోటుచేసుకోన్నాయి. -
పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్
ఖమ్మం సిటీ : ఖమ్మం నగరపాలక సంస్థలో డివిజన్లను మళ్లీ పునర్విభజించాలని ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. నగరంలో 57 డివిజన్లు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ప్రక్రియను 31 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. కార్పొరేషన్ ఏర్పడి సుమారు రెండేళ్లవుతోంది. గత ఏడాది 50 డివిజన్లుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 2001 జనాభా లెక్కల ప్రకారం నగరాన్ని రైల్వే, రోడ్డు మార్గాలు, చేరువులను పరిగణనలోకి తీసుకుని డివిజన్లను ఏర్పాటు చేశారు. ఆతర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. అయితే.. అప్పటికే 2011 జనాభా లెక్కలు విడుదల కావడంతో టీడీపీకి చెందిన చిరుమామిళ్ల నాగేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డివిజన్లు రద్దు చేయాలని, తిరిగి 2011 జనాభా లెక్కల ప్రకారం డివిజన్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న డివిజన్లు ఐదు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నయని, దీని వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని, నిధులు సైతం సరిగా ఖర్చు చేయలేమని పిటిషన్లో తెలిపారు. దీనిపై వాదనలు విన్న కోర్టు డివిజన్లను రద్దు చేస్తూ గత ఏడాది ఆక్టోబర్‌లో ఆదేశాలు జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తిరిగి డివిజన్లను ఏర్పాటు చేయాలని సీడీఎంఏను ఆదేశించింది. ఈ క్రమంలో కొన్ని పరిణామాల నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈక్రమంలోనే సార్వత్రిక ఎన్నికల ముందు స్థానిక సంస్థలకు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశాలు వచ్చాయి. అయితే.. ఖమ్మం కార్పొరేషన్‌కు డివిజన్లు పునర్విభజన జరగకపోవడంతో దీని ఎన్నికలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే వాయిదా పడిన ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి డివిజన్లతోపాటు మేయర్, వార్డుల రిజర్వేష్లు కూడా మారనున్నాయి. -
ఎన్నికల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన
-
ఎన్నికల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన
రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నా, విభజనకు సంబంధించిన ప్రకటనలు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ప్రధాన ఎన్నికల కమిషనర్ సంపత్ 'సాక్షి'తో అన్నారు. మే 16న ఫలితాలు వచ్చినా పాత అసెంబ్లీ కాలం సమయం పూర్తయిన తర్వాత కొత్త అసెంబ్లీ నోటిఫై అవుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎన్నికల కమిషన్ చేతిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే తాము రాష్ట్రంలోని నియోజకవర్గాల పునర్విభజనపై దృష్టి పెడతామని సంపత్ తెలిపారు. నేరచరితులను, నల్లధనాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక పరిశీలకులను నియమించామని, ఎన్నికల కమిషన్ సిబ్బంది సహాయంతో ఇంటింటికీ తిరిగి ఓటర్లకు స్వయంగా ఓటర్ స్లిప్ ఇస్తుందని ఆయన వివరించారు. కొత్త ఓటర్ల నమోదుకు మార్చి 9వరకు గడువుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్ తెలిపారు.


