డీలిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం : ఖర్గే | opposition parties oppose delimitation says Kharge | Sakshi
Sakshi News home page

డీలిమిటేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం : ఖర్గే

Apr 15 2026 6:37 PM | Updated on Apr 15 2026 6:40 PM

opposition parties oppose delimitation says Kharge

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని, కానీ కేంద్రం తీసుకొస్తున్న విధానం సరైనది కాదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ ‘రాజకీయ స్వార్థంతో డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చారు. డీలిమిటేషన్ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మాత్రం మద్దతు ఇస్తాం. ప్రభుత్వం విపక్షాలను అణగదొక్కాలని చూస్తోంది’ అని అన్నారు.

రేపటి నుంచి పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు వంటి కీలక బిల్లులపై చర్చ జరగనుంది. లోక్‌సభలో ఏప్రిల్ 16, 17 తేదీల్లో ఈ బిల్లులపై చర్చ, ఓటింగ్ జరగనుంది. మూడు బిల్లులపై చర్చకు మొత్తం 18 గంటల సమయం కేటాయించారు.

రాజ్యసభలో ఏప్రిల్ 18న చర్చ, ఓటింగ్ జరగనుంది. అక్కడ చర్చకు 10 గంటల సమయం కేటాయించారు. అదనంగా, ఏప్రిల్ 16, 17 తేదీల్లో రాజ్యసభ డిప్యూటీ ఛైర్‌పర్సన్ ఎన్నికపై కూడా చర్చ జరగనుందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement