సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. జీహెచ్‌ఎంసీ వార్డుల విభజనలో జోక్యం చేసుకోమని హైకోర్టు స్పష్టం చేసింది. వార్డుల విభజన అభ్యంతరాలపై హైకోర్టులో 80కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. అభ్యంతరాల గడువు పూర్తైనందున పిటిషన్ల విచారణను హైకోర్టు ముగించింది.
కాగా, శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్ల వరకు పెరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ను పరిపాలన సౌలభ్యం కోసం 300 వార్డులుగా విభజించారు. విలీనానికి ముందు 750 చదరపు కిలోమీటర్ల పరిధిలో 150 వార్డులుగా ఉన్నప్పుడు కొన్ని వార్డుల్లో ఎక్కువ జనాభా, కొన్నింటిలో తక్కువ జనాభా ఉంది. ఒక వార్డు రెండు నియోజకవర్గాల పరిధిలో ఉండేది. ఇలాంటి వాటికి తావులేకుండా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని 300 వార్డులుగా విభజించినట్లు జీహెచ్‌ఎంసీ చెబుతోంది.


