డీలిమిటేషన్.. ఢిల్లీలో బీసీ సంఘాల మెరుపు ధర్నా | Delimitation: Bc Leaders Protest At Delhi | Sakshi
Sakshi News home page

డీలిమిటేషన్.. ఢిల్లీలో బీసీ సంఘాల మెరుపు ధర్నా

Apr 17 2026 4:53 PM | Updated on Apr 17 2026 5:52 PM

Delimitation: Bc Leaders Protest At Delhi

సాక్షి, ఢిల్లీ: కులగణన తర్వాతనే డీలిమిటేషన్ చేపట్టాలని ఢిల్లీలో బీసీ సంఘాలు మెరుపు ధర్నా నిర్వహించాయి. డీలిమిటేషన్ పత్రాలను చింపివేసి బీసీ నేతలు నిరసనలు తెలిపారు. డీలిమిటేషన్ వల్ల బీసీలకు ఎలాంటి  ప్రయోజనం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి అన్నారు. పెంచిన అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు మహిళల పేరుతో మళ్లీ అగ్రకులాలకు దక్కుతాయన్నారు.

దేశవ్యాప్తంగా బీసీ కులగణన పూర్తి చేసి జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలి. మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్ కోట కల్పించాలి. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తాo’’ అని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

బీసీలు బీజేపీని క్షమించరు: మాజీ ఎంపీ వీహెచ్‌
బీసీ ప్రధాని అయి ఉండి బీసీలకే మోదీ ద్రోహం చేస్తున్నారు. మహిళా బిల్లులో బీసీ సబ్ కోట కల్పించకపోతే బీసీలు బీజేపీని క్షమించరు. బీజేపీ బీసీలకు చేస్తున్న మోసంపై ఊరూరా తిరిగి చెప్తాo

 పోరాడతాం: బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్
మహిళా బిల్లు పేరుతో బీసీలను రాజకీయంగా తొక్కి పెట్టాలని చూస్తున్నారు. దేశంలోని 40 కోట్ల మంది బీసీ మహిళల అక్రందనను కేంద్రం పట్టించుకోవడం లేదు. స్థానిక సంస్థలలో లాగానే చట్టసభల్లో కూడా బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచకుండా డీలిమిటేషన్ చట్టం చేస్తే ఉపయోగం లేదు. బీసీ హక్కుల కోసం బీసీ సంఘాలతో కలిసి దేశవ్యాప్తంగా పోరాడతాం

బీసీలంటే పార్టీలకు చిన్న చూపు: శంకర్రావు
దేశంలో బీసీలను పట్టించుకునే నాధుడే లేడు. బీసీలు అంటే అన్ని పార్టీలకు చిన్న చూపు. బీసీల ఓట్ల మీద ఉన్న ప్రేమ సీట్ల మీద లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలను చేర్చకపోతే కేంద్రంపై తిరగబడతాం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement