నో ఇంజెక్షన్‌, రోజుకో పిల్‌ : యూఏఈ సంచలనం | UAE introduces firstever weight loss pill Foundayo | Sakshi
Sakshi News home page

నో ఇంజెక్షన్‌, రోజుకో పిల్‌ : యూఏఈ సంచలనం

Apr 17 2026 3:50 PM | Updated on Apr 17 2026 4:01 PM

UAE introduces firstever weight loss pill Foundayo

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఆరోగ్య రంగంలో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. ఊబకాయం (Obesity) తగ్గించుకోవడానికి ఇంజెక్షన్లతో పనిలేకుండా, రోజూ ఒక మాత్ర వేసుకుంటే సరిపోయే 'ఫౌండాయో' (Foundayo - orforglipron) అనే ఔషధానికి యూఏఈ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ప్రముఖ ఫార్మా కంపెనీ 'ఎలీ లిల్లీ' (Eli Lilly) దీనిని అభివృద్ధి చేసింది. ఎమిరేట్స్ డ్రగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణయంతో, ఇంజెక్షన్ల ద్వారా బరువు తగ్గించే చికిత్సలకు సూది అవసరం లేని ప్రత్యామ్నాయాన్ని ప్రవేశపెట్టిన ప్రపంచంలోని మొదటి దేశాలలో యూఏఈ ఒకటిగా నిలిచింది.


ఫౌండాయో  ప్రత్యేకతలు
టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు,  కొన్ని రకాల క్యాన్సర్లతో సహా తీవ్రమైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఊబకాయం ముడిపడి ఉన్న తరుణంలో ఈ ఆమోదం లభించింది.ఇప్పటివరకు బరువును తగ్గించుకునే చికిత్సలో  ఇంజెక్షన్‌లను తీసుకోవాల్సి వచ్చేది.  ఇపుడిక సూదితో పనిలేకుండానే  బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడానికి వాడే 'GLP-1' మందులు ఇంజెక్షన్ల రూపంలో ఉండేది.  కానీ ఫౌండాయో అనేది నోటి ద్వారా తీసుకునే మాత్ర. సులభమైన పద్ధతి కూడా. ఈ మాత్రను భోజనంతో సంబంధం లేకుండా రోజుకు ఒకసారి వేసుకోవచ్చు. ఇది రోగులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే ఈ మాత్రకు  USFDA ఆమోధం లభించింది.  ప్రయోగాల్లో ఇది 15శాతం వరకు బరువు తగ్గినట్టు తేలింది.   

ఎలా పని చేస్తుంది?
ఇది శరీరంలోని ఆకలిని నియంత్రించే హార్మోన్లలా పనిచేస్తుంది. దీనివల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది, ఆకలి తగ్గుతుంది, తద్వారా తక్కువ కేలరీలు తీసుకుంటారు. ఈ మాత్ర అందరికీ అందుబాటులో ఉండదు. ఇది సాధారణ లేదా సౌందర్య ఉపయోగం కోసం ఉద్దేశించినది కాదు. కేవలం వైద్యుని సిఫార్సుతో, కఠినమైన వైద్య పర్యవేక్షణలో మాత్రమే లభిస్తుంది. యూఏఈ వ్యాప్తంగా ఉన్న వైద్యులు ఈ మందును సిఫార్సు చేసే ముందు స్పష్టమైన అర్హత మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.

యూఏఈలోని ఫార్మసీలలో మే 2026 నుండి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఎవరు వాడకూడదు. చికిత్స ప్రారంభించే ముందు రక్త పరీక్షలు మరియు మెటబాలిక్ స్క్రీనింగ్ తప్పనిసరి. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 30 పైన ఉన్నవారు లేదా BMI 27 ఉండి రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారు దీనికి అర్హులు.

ఇదీ చదవండి: ఒకప్పుడు స్టార్‌ లీడర్‌.. చివరికి భార్యను హత్య చేసి, ఆత్మహత్య

ఫలితాలు, సైడ్ ఎఫెక్ట్స్ 
క్లినికల్ ట్రయల్స్ ప్రకారం, ఈ మాత్ర వాడిన వారు 72 వారాల కాలంలో సగటున 12.4% బరువు (సుమారు 12 కిలోలు) తగ్గినట్లు తేలింది. బరువుతో పాటు కొలెస్ట్రాల్ , రక్తపోటు కూడా తగ్గుతాయి. ప్రారంభ దశలో వికారం, జీర్ణక్రియ సమస్యలు ఉండవచ్చు. అందుకే వైద్యుల పర్యవేక్షణ అవసరం.

ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్‌ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి

ధర  ఎంత? 
యూఏఈలో దీని అధికారిక ధర ఇంకా ఖరారు కాలేదు. ఇన్సూరెన్స్ కంపెనీలు దీనిని కవర్ చేస్తాయనే దానిపై ధరను నియంత్రించవచ్చు. మరో బరువు తగ్గే ఔషం Novo Nordiskతో పోటీగా దీని ధర నెలకు సుమారు 149 డాలర్లుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

ఇదీ చదవండి: LPG Gas రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్‌లైన్ల ప్లాన్‌

నోట్‌ : బరువు తగ్గడం అనే ప్రక్రియ షార్ట్‌కట్‌లతో కాదు. కచ్చితమైన వ్యాయామం, ఆహార నియమాలు అవసరం. అలాగే వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి.   గర్భిణీలు, పాలిచ్చే తల్లులు,కొన్ని రకాల థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు  ఇలాంటి మందులను వాడకూడదని గమనించాలి.

Advertisement
 
Advertisement
Advertisement