రాహుల్‌ గాంధీకి ఎదురుదెబ్బ | Rahul Gandhi In Dual Citizenship Case Allahabad High Court Orders Case | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీకి ఎదురుదెబ్బ

Apr 17 2026 5:37 PM | Updated on Apr 17 2026 6:49 PM

Rahul Gandhi In Dual Citizenship Case Allahabad High Court Orders Case

సాక్షి, లక్నో:  లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ద్వంద్వ పౌరసత్వం (Dual Citizenship)  రాహుల్‌ గాంధీకి ఎదురుదెబ్బఆరోపణపై విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ శుక్రవారం ఆదేశించింది. ఈ విచారణను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని లేదా ఈ విషయాన్ని ఒక కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించి జరిపించాలని ఆదేశించింది.

రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న తన అభ్యర్థనను లక్నోలోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు జనవరి 28న తిరస్కరించగా, ఆ ఉత్తర్వును సవాలు చేస్తూ బీజేపీ కార్యకర్త ఎస్. విఘ్నేష్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్‌పై  కోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. కర్ణాటక నివాసి అయిన పిటిషనర్, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), అధికార రహస్యాల చట్టం, విదేశీయుల చట్టం, పాస్‌పోర్ట్ చట్టంలోని నిబంధనల కింద ఆరోపణలు చేస్తూ, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు.

ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్‌ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి

ఈ ఫిర్యాదును మొదట రాయ్‌బరేలీలోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో దాఖలు చేశారు. 2025 డిసెంబర్ 17న, హైకోర్టు ఈ కేసును లక్నోకు బదిలీ చేసింది. పౌరసత్వానికి సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని దిగువ కోర్టు పేర్కొంది. లక్నో కోర్టు తన అభ్యర్థనను కొట్టివేసిన తర్వాత పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.
 

ఇదీ చదవండి: టీసీఎస్‌ కేసు : మతమార్పిడి ఆరోపణల్లో సంచలన సాక్ష్యం

ఇదీ చదవండి:  నో ఇంజెక్షన్‌, రోజుకో పిల్‌ : యూఏఈ సంచలనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement