‘నోటి మాటగా కాదు.. చట్టంలో పెట్టాల్సిందే’ | Must Be in Law: YSRCPs Demand on Key Bills | Sakshi
Sakshi News home page

‘నోటి మాటగా కాదు.. చట్టంలో పెట్టాల్సిందే’

Apr 17 2026 5:43 PM | Updated on Apr 17 2026 7:03 PM

Must Be in Law: YSRCPs Demand on  Key Bills

న్యూఢిల్లీ: డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌ బిల్లులకు తాము మద్దతిస్తామని, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెరగాలన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. ఈరోజు(శుక్రవారం, ఏప్రిల్‌ 17వ తేదీ) డీలిమిటిషన్‌, మహిళా రిజర్వేసన్‌ బిల్లులపై లోక్‌సభలో చర్చ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ డీలిమిటేషన‌‌, మహిళా రిజర్వేషన్‌ బిల్లులకు మేం  మద్దతిస్తాం. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెరగాలి. 

డీలిమిటేషన్‌ ప్రక్రియలో అన్ని పార్టీలకు సమాన భాగస్వామ్యం ఇవ్వాలి. రాష్ట్రాల్లో ప్రాంతీయ అసమానతలు లేకుండా సీట్ల సంఖ్య పెంచాలి. ప్రతి రాష్ట్రంలో కచ్చితంగా 50 శాతం సీట్లు పెంచే విషయం చట్టంలో పెట్టాలని మేం డిమాండ్‌ చేస్తున్నాం. ఇది కేవలం నోటి మాటగా చెప్తే మేం అంగీకరించం. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్‌లో చెప్పిన మాటలు అమలు కాలేదు’ అని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement