ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై చర్చ కొనసాగుతోంది.అయితే, ఈ కీలక బిల్లలుపై చర్చ జరిగే సమయంలో సొంత పార్టీ నేతల గైర్హాజరుపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా సెటైర్లు వేశారు.
రాజ్యసభ ఉపనాయకుడి పదవి నుంచి నన్ను తొలగించారు. అయినా సరే మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై చర్చ జరుగుతుంటే సభకు నేను హాజరయ్యాను. మరి వాళ్లద్దరేరి అంటూ ఆప్ పార్టీ ప్రతినిధి, పార్టీ నూతన రాజ్య సభ ఉపనాయకుడిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.
నా పార్టీకి చెందిన నాయకుడు, నా స్థానంలో కొత్త నియమితులైన ఉప నాయకుడు కూడా సభలో లేరు. ఆప్ ఇటీవల తొలగించబడిన ఉప నాయకుడిని నేను. నేను సభలోనే ఉన్నాను. నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని అన్నారు.
రాజ్యసభలో ఆప్ ఉప నాయకుడి పదవి నుంచి చద్దాను ఇటీవల తొలగించడంతో పాటు, సభలో ఆయన మాట్లాడే సమయాన్ని కూడా పార్టీ తగ్గించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ నిర్ణయంపై పార్టీలో విభేదాలు ఉన్నాయన్న ఊహాగానాలకు ఈ పరిణామం ఆజ్యం పోసింది.


