జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వార్డుల పునర్విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు.
	హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వార్డుల పునర్విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా వార్డుల పునర్విభజన పూర్తి చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంజీని విభజించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు.
	
	పునర్విభజనతో జీహెచ్ఎంసీ వార్డులు సంఖ్య 150 నుంచి 200 వరకు పెరిగే అవకాశం కనబడుతోంది. పునర్విభజన పూర్తైన తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుత తెలుస్తోంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
