breaking news
ghmc wards
-
జీహెచ్ఎంసీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
హైదరాబాద్: వచ్చే నెల మూడోవారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నడంతో అధికార పార్టీ టీఆర్ఎస్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందుగానే జీహెచ్ఎంసీ వార్డుల రిజర్వేషన్లపై దృష్టిసారించింది. ఈ మేరకు శుక్రవారం వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్రిజర్వ్డ్ 44, బీసీ - 50, ఉమెన్ జనరల్- 44, ఎస్సీ-10, ఎస్టీ-2 కాగా, మొత్తం 150 సీట్లలో సగం సీట్లు మహిళలకే రిజర్వేషన్లను ప్రకటించినట్టు పేర్కొంది. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ క్యాడర్ పెరిగినప్పటికీ, గ్రేటర్లో స్థానికంగా క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేదు. ఎలాగైనా జీహెచ్ఎంసీపై జెండా ఎగరేయాలనేది లక్ష్యం. జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తిగా స్థానిక సమస్యలపై ఆధారపడ్డవి కావడంతో ప్రజల్లో నమ్మకం కలిగించేందుకే వ్యూహాత్మకంగా వందరోజుల టార్గెట్‌ను అమలుచేయాలని తొలుత భావించారు. స్వచ్ఛ భారత్‌ను కూడా ఎన్నికలకు అనుకూలంగా మలచుకునేందుకు దీంతోపాటే ఇతర అంశాలనూ జోడించారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. -
గవర్నర్ ను కలిసిన టీ బీజేపీ నేతలు
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం ఉదయం గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని వార్డుల విభజనపై వారు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఇష్టా రాజ్యంగా వార్డులను విభజించారని బీజేపీ నేతలు నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ కలిసిన వారిలో శాసనసభాపక్ష నేత డాక్టర్ కె. లక్ష్మణ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పలువులు బీజేపీ నేతలు ఉన్నారు. -
పాత‘వే’!?
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియకు బ్రేక్ పడుతుందా? పాత మార్గంలోనే ఎన్నికలకు వెళ్లనున్నారా? ఇప్పటికే ఉన్న 150 డివిజన్లే కొనసాగుతాయా? ప్రస్తుత పరిణామాలు... రాజకీయ పార్టీల ‘లెక్కలు’ పరిశీలిస్తే... పెంచడం కంటే ఉన్న వాటితోనే సర్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారులు ఈ లెక్క తేల్చే పనిలో ఉన్నారు. - డివిజన్ల విభజనపై పునరాలోచన - ప్రస్తుతం ఉన్న 150కే పరిమితం? - పెంపు యోచనపై మల్లగుల్లాలు - బలాబలాలపై పార్టీల లెక్కలు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ వార్డుల (డివిజన్ల) పునర్విభజన కథ మళ్లీ మొదటికొచ్చింది. 2011 జనాభా లెక్కల మేరకు డివిజన్లలోని జనాభా మధ్య వ్యత్యాసం దాదాపు సమానంగా (పది శాతం తే డాకు మించకుండా) ఉండాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లను 200కు పెంచేందుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ పునరాలోచనలో పడింది. 200 డివిజన్లపై వివిధ వర్గాల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలు... టీఆర్ఎస్ ప్రభుత్వ రాజకీయ అవసరాలు.. ఇతర పరిణామాల నేపథ్యంలో డివిజన్లను ఎప్పటిలాగా 150కే పరిమితం చేయాలనే యోచనలో ఉన్నట్లు తె లిసింది. డివిజన్లను హేతుబద్ధీకరించినప్పటికీ సంఖ్య మాత్రం 150కే పరిమితం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తప్పనిసరి అనుకుంటే 172కు పెంచాలనే మరో ఆలోచనలోనూ ఉన్నట్లు తెలిసింది. ఈమేరకుఅధికారులు మళ్లీ కసరత్తు మొదలు పెట్టారు. 150... 172... 200 డివిజన్లకు జనాభాను ‘విభజించే’ పనిలో పడ్డారు. ఉన్నత స్థాయి నిర్ణయం మేరకు ఎన్ని డివిజన్లు చేయాలనుకున్నా... సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో హేతుబద్ధీకరణ చర్యలు చేపట్టారు. 2011 లెక్కల మేరకు గ్రేటర్ జనాభా 67,31,790. ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లనే హేతుబద్ధీకరిస్తే... ఒక్కోదానిలో సగటున 44,879 మంది, 172 డివిజన్లు చేస్తే 39,138 మంది, 200 డివిజన్లు చేస్తే 33,659 మంది వంతున ఉండాలని లెక్కలు వేశారు. నియోజకవర్గాల వారీగా ఎన్నేసి డివిజన్లు వస్తాయో లెక్కలు తీస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 200 చేస్తే శివార్లలో ఎక్కువ డివిజన్లు వచ్చే అవకాశం ఉంది. పునర్వ్యవస్థీకరణ పూర్తయ్యాక... రిజర్వేషన్ల అమలుకు బీసీల గణన చేపట్టాల్సి ఉంది. ఆ తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి ఇదీ సంగతి: ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లలో కొన్నింటిలో అత్యధికంగా, మరికొన్నింటిలో అత్యల్పంగా జనాభా ఉందని... అన్నిటిలో దాదాపు సమానంగా ఉండేలా పునర్వ్యవస్థీకరణ చేయాలనేది హైకోర్టు తీర్పు సారాంశం. వ్యత్యాసాల వల్ల కొన్ని డివిజన్లకు నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని కొందరు కోర్టుకు వెళ్లడంతో...న్యాయ స్థానం దీనిపై స్పందించింది. పార్టీల లెక్కలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల డీలిమిటేషన్ అంశం మొదటికి వస్తుండటంతో రాజకీయ పార్టీల్లో కూడికలు, తీసివేతలు మొదలయ్యే అవకాశం ఉంది. 200 వార్డులకు విస్తరిస్తే... 2008 కంటే ముందు ఉన్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వంద డివిజన్లు... జీహెచ్ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీల్లో మరో వంద డివిజన్లు అవుతాయి. దీంతో రాజకీయంగా కొన్ని పార్టీలకు నష్టం... మరికొన్ని పార్టీలకు లాభం కలిగే అవకాశ ం ఉంది. తాజాగా చేస్తున్న కసరత్తులో 172 లేదా 150కి పరిమితం చేస్తే శివార్లలో కొత్త డివిజన్ల సంఖ్య అతి స్వల్పంగానే పెరగనుంది. ఈ నేపథ్యంలో డివిజన్లను 200 లేదా 172 లేదా 150కి కుదిస్తే లాభ నష్టాలు ఎలా ఉంటాయన్న అంశంపై అన్ని రాజకీయ పక్షాలు కూడికలు, తీసివేతల్లో నిమగ్నం కానున్నాయి. -
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వార్డుల పునర్విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా వార్డుల పునర్విభజన పూర్తి చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంజీని విభజించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. పునర్విభజనతో జీహెచ్ఎంసీ వార్డులు సంఖ్య 150 నుంచి 200 వరకు పెరిగే అవకాశం కనబడుతోంది. పునర్విభజన పూర్తైన తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుత తెలుస్తోంది.