Live Updates
డీలిమిటేషన్ బిల్లుపై విపక్షాల ఆరోపణలకు అమిత్‌షా కౌంటర్
మహిళా బిల్లును ఎవరు వ్యతిరేకిస్తున్నారో చెప్పలేదు: ప్రియాంకా గాంధీ
- ప్రధాని మోదీ ప్రసంగంలో స్పష్టత లేదు: లోక్‌సభలో ప్రియాంకా గాంధీ
- మహిళా బిల్లును ఎవరు వ్యతిరేకిస్తున్నారో చెప్పలేదు
- మహిళా బిల్లును ముందు ప్రవేశపెట్టింది కాంగ్రెస్సే
- మహిళలకు కాంగ్రెస్ ఎంతో సేవ చేసినా క్రెడిట్ ఇవ్వలేదు
- హడావుడిగా బిల్లును తేవాల్సిన అవసరమేంటి
- ఇప్పుడు చర్చ మహిళా బిల్లు కోసం కాదు.. డీలిమిటేషన్‌పై
- మేం డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకం
విపక్షాలు చెప్పేవన్నీ అవాస్తవాలే : అమిత్‌షా
- డీలిమిటేషన్ బిల్లుపై విపక్షాల ఆరోపణలకు అమిత్‌షా కౌంటర్
- డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదు
- బిల్లుతో దక్షిణాదిలో పార్లమెంట్ స్థానాలు 129 నుంచి 195కు పెరుగుతాయి
- బిల్లుతో లాభం తప్ప నష్టం జరగదు
- బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి
- ఈ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు చాలా లాభం
- కర్ణాటక,తెలంగాణ బాగా లాభపడతాయి
- ఏపీలో సీట్లు 25 నుంచి 38 కి పెరుగుతాయి
- తెలంగాణలో 17 నుంచి 26 కు పెరుగుతాయి
- కేరళలో 20 సీట్లు 30 సీట్లు అవుతాయి
- తమిళనాడులో 39 సీట్లు 59 అవుతాయి
- కర్ణాటకలో 28 సీట్లు 42 అవుతాయి
- దక్షిణాది జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతాయి
- విపక్షాల అవస్తవాలు చెబుతున్నాయి
- అన్ని రాష్ట్రాలలో 50% సీట్లు పెరుగుతాయి
ఉత్తరాది లేదు.. దక్షిణాది లేదు : ప్రధాని మోదీ
- పంచాయతీలో రిజర్వేషన్లు ఉన్నప్పుడు దేశంలో రిజర్వేషన్లు ఎందుకు ఉండకూడదు
- 30ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ గురించి పోరాడుతున్నాం
- దేశాన్ని ముక్కలు చేసే అధికారం ప్రజలు మనకు ఇవ్వలేదు
- నాకు అన్నీ రాష్ట్రాలు సమానమే
- ఏ రాష్ట్రాని అన్యాయం జరగదు
- ఉత్తరాది లేదు దక్షిణాదిలేదు
- తమని అన్యాయం చేసిన వారిని మహిళలు అదును చూసి దెబ్బ కొడతారు
- ఈ బిల్లు ఎవరి పట్ల విపక్ష చూపించదు
- మహిళా బిల్లుకు అన్నీ పార్టీలు ఏకగ్రీవమవ్వాలి
- తన స్వార్ధం కోసం బిల్లు తెచ్చారని ప్రచారం చేస్తున్నారు
- మహిళలకు నేను ఫేవర్ చేయడం లేదు.. అది వారి హక్కు
- సాంకేతిక కారణాలు చూపించి 30ఏళ్ల పాటు బిల్లును ఆపారు
- విభజన రాజకీయాలు చేసే వారిని ప్రజలు దూరం పెట్టారు
- చిన్న రాష్ట్రం.. పెద్ద రాష్ట్రం అనేది ఉండదు
- దేశానికి నష్టం కలిగించే అంశాల్ని సభ్యులంతా ఖండించాలి
దేశ చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం : ప్రధాని మోదీ
- డీలిమిటేషన్,మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో చర్చ
- చర్చలో భాగంగా మాట్లాడుతున్న ప్రధాని మోదీ
- దేశ చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం
- చరిత్ర సృష్టించడానికి పార్లమెంట్‌కు ఇది సువర్ణావకాశం
- మహిళ రిజర్వేషన్ బిల్లు దేశ చరిత్రలో గొప్ప బిల్లు
- దేశంలో సగం జనాభాకు అధికారం ఇవ్వడం ఒక అద్భుత అవకాశం
- కాలాన్ని బట్టి మనం కూడా మారాలి
- దేశానికి సరికొత్త దిశను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం
- మహిళలకు అధికారం అంటేనే.. వికసిత్ భారత్ అని అర్ధం
- మహిళలకు అధికారం ఇస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారు.
- 30ఏళ్ల పాటు ప్రయత్నాలు జరిగినా కల సాకారం కాలేదు
- ఈ బిల్లును వ్యతిరేకిస్తే మహిళా లోకం క్షమించదు
- మహిశా బిల్లును వ్యతిరేకించిన వారిని మహిళలే ఎన్నికల్లో ఓడించారు
- వికసిత్ భారత్‌లో మహిళల పాత్ర కీలకం
- ఈ బిల్లును తేవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు
- బిల్లుకు మద్దతు ఇచ్చే పార్టీలకు రాజకీయ మనుగడ ఉంటుంది
- మహిళా బిల్లుకు అన్నీ రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలి
- వెనుకబడిన వచ్చా.. కానీ అందరిని కలుపుకుని ముందుకు తీసుకెళ్తున్నా
- వెనుకబడిన వర్గం నుంచి వచ్చిన నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించారు
- ఈ బిల్లు రాజకీయ పార్టీల కోసం తెచ్చింది కాదు.. ప్రజల కోసం తెచ్చింది.
ఈ బిల్లు కోసం చావడానికైనా సిద్ధం: తేజస్వి సూర్య
- లోక్‌సభలో మహిళా బిల్లుపై కొనసాగుతున్న చర్చ
- విరామం తీసుకున్న స్పీకర్ ఓం బిర్లా.. స్పీకర్ చైర్‌లో ఎన్‌కే ప్రేమచంద్రన్
- చర్చలో పాల్గొన్న బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య
- 1996 నుంచి మహిళా రిజర్వేషన్ల బిల్లు పెండింగ్‌లో ఉంది:తేజస్వి సూర్య
- గత ప్రభుత్వాలు ఈ బిల్లును విస్మరించాయి:తేజస్వి సూర్య
- ప్రధాని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది:తేజస్వి సూర్య
- దేశంలోని మహిళలందరి తరపున ప్రధాని మోదీకి ధన్యవాదాలు:తేజస్వి సూర్య
- నారీశక్తి బిల్లును విపక్షాలు అడ్డుకోవడం సరికాదు:తేజస్వి సూర్య
- దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి:తేజస్వి సూర్య
- దక్షిణాది రాష్ట్రాల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి:తేజస్వి సూర్య
- మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆలస్యమయ్యేలా కొత్తదారులు వెతుక్కుంటున్నాయి:తేజస్వి సూర్య
- డీలిమిటేషన్ సాకుగా చూపించి మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నాయి:తేజస్వి సూర్య
- రాజ్యాంగం ప్రకారం డీలిమిటేషన్ తప్పనిసరి : తేజస్వి సూర్య
- డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదు :తేజస్వి సూర్య
- ఈరోజు కోసం దేశం 40 ఏళ్లుగా ఎదురు చూస్తోంది: తేజస్వి సూర్య
- మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చావడానికైనా నేను సిద్ధం:తేజస్వి సూర్య
డీలిమిటేషన్‌ను రాజకీయాస్త్రంగా వాడుతున్నారు: గౌరవ్ గొగోయ్
- కేంద్రంపై కాంగ్రెస్ సీనియర్ నేత గౌరవ్ గొగోయ్ ఆగ్రహం
- మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టడం ఇదేం కొత్త కాదు
- గతంలో బిల్లు పెట్టినప్పుడు కూడా ఇవే మాటలు చెప్పారు
- మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం వీళ్లకు ఇష్టం లేదు.. అందుకే మార్పులు చేస్తున్నారు
- జనగణన తర్వాత డీలిమిటేషన్ అన్నారు
- ఇప్పుడేమో మహిళా రిజర్వేషన్ల పేరుతో డీలిమిటేషన్ చేస్తున్నారు
- మూడేళ్లలో ఏం నిర్ణయం వచ్చిందని మార్చారు?
- జనగణన, కులగణనలకు బీజేపీ వ్యతిరేకం
- మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లు తెచ్చారు
- హడావిడిగా ఈ బిల్లు తేవాల్సిన అవసరం ఏంటి?
- 815 స్థానాలు వస్తాయని కేంద్రం ఎలా చెబుతుంది?
- డీలిమిటేషన్‌ను రాజకీయ అస్త్రంగా వాడుతున్నారు
- డీలిమిటేషన్ కోసం కమిషన్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు
- డీలిమిటేషన్ బిల్లుకు, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు లింకు పెట్టొద్దు
- మహిళా రిజర్వేషన్ల ముసుగులో దొంగదారిలో డీలిమిటేషన్ చేయాలని చూస్తున్నారు
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేం వ్యతిరేకం కాదు.. డీలిమిటేషన్‌కు మాత్రమే వ్యతిరేకం
- మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఎప్పుడూ మా మద్దతు ఉంటుంది
మేఘవాల్ Vs గొగోయ్..
- మేఘవాల్ Vs గొగోయ్..
- మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిన సమయం వచ్చింది: మేఘవాల్.
- ఈ బిల్లుతో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది.
- డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి కూడా నష్టం జరగదు.
- 815 స్థానాల్లో మహిళల కోసం 272 సీట్లు రిజర్వ్ చేస్తున్నాం.
- మహిళలకు 1/3 వంతు సీట్లు పెరుగుతాయి.
- గొగోయ్ కౌంటర్..
- మహిళా బిల్లు సభలో ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కాదు: గౌరవ్ గొగోయ్.
- గతంలో బిల్లు పెట్టినప్పుడు కూడా ఇవే మాటలు చెప్పారు: గొగోయ్.
బిల్లుపై రేపు ఓటింగ్..
- లోక్‌సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం.
- లోక్‌సభలో మూడు బిల్లులపై చర్చకు 12 గంటలు కోరిన కేంద్రం.
- మూడు బిల్లులపై లోక్‌సభలో రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఓటింగ్.
- మహిళా రిజర్వేషన్ల కోసం రెండు రాజ్యాంగ సవరణలు తప్పనిసరి: అమిత్ షా
- మహిళా రిజర్వేషన్ల బిల్లుతో డీలిమిటేషన్ బిల్లు కలపడం అన్యాయం: డీఎంకే
- ఎన్నికల లబ్ధి కోసమే ఈ బిల్లులు తెచ్చారు: కేసీ వేణుగోపాల్
- బిల్లులపై రాజ్యసభలో ఎల్లుండి చర్చ
- చర్చ కోసం రాజ్యసభలో 10 గంటలు కేటాయింపు
Speaking in Lok Sabha, Union Minister Kiren Rijiju says, "The discussion will be held for 12 hours. The speaker should have the authority to extend the time for discussion. The voting on the bills will be done tomorow."
Speaker Om Birla says, "Discussion on these three bills… pic.twitter.com/8fNO9aMMUS— ANI (@ANI) April 16, 2026
అమిత్ షా ప్రసంగానికి విపక్షాల అడ్డగింత..
- డీలిమిటేషన్‌పై ప్రారంభమైన చర్చ.
- అమిత్ షా ప్రసంగాన్ని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు.
- నల్ల చొక్కాలతో సభకు హాజరైన డీఎంకే ఎంపీలు.
- మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి డీలిమిటేషన్ బిల్లు చాలా కీలకం: అమిత్ షా
డీలిమిటేషన్ బిల్లుపై చర్చ ప్రారంభం..
- లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లుపై చర్చ ప్రారంభం.
- చర్చ ప్రారంభించి అమిత్ షా.
డీలిమిటేషన్‌పై చర్చకు ఓకే..
- బిల్లుపై చర్చకు డివిజన్ కోరిన విపక్షాలు.
- డివిజన్‌కు స్పీకర్ ఓం బిర్లా అంగీకారం.
- 131 రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడంపై లోక్‌సభలో ఓటింగ్.
- మూడు బిల్లులపై చర్చకు అనుమతించేందుకు ఓటింగ్.
- ఓటింగ్‌లో పాల్గొన్న 333 మంది.
- అనుకూలం: 207
- వ్యతిరేకం: 126
- లోక్‌సభకు హాజరు కానీ ఎంపీలు: 86
- బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే, ఆర్‌ఎస్పీ, సీపీఐ(ఎం), ఎంఐఎం
207 Lok Sabha MPs vote for the introduction of the Constitution (One Hundred and Thirty-First Amendment) Bill, 2026. While 126 members voted against it. The Opposition members in the Lok Sabha had pressed for a division against the move to introduce the bill. pic.twitter.com/NMKwPrFd0q
— ANI (@ANI) April 16, 2026
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కామెంట్స్..
- డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎస్పీ, కేరళ ఆర్‌ఎస్పీ, టీఎంసీ, డీఎంకే, ఎంఐఎం.
- ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కామెంట్స్..
- డీలిమిటేషన్ బిల్లు ఇండియా ఫెడరిలిజంపై ఎటాక్.
- డీలిమిటేషన్ బిల్లుతో లబ్ది పొందేది ఉత్తరాది రాష్ట్రాలే.
- ప్రజాస్వామ్య, సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేక ఈ బిల్లు.
- దక్షిణాది ప్రాంతాల ప్రాతినిధ్యం లేకుండా బిల్లు ఉంది.
- ఈ బిల్లు రాష్ట్రా సమాఖ్య స్పూర్తికి విరుద్ధం: సీపీఐ(ఎం)
- బిల్లును వ్యతిరేకించిన కేరళ రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ.
బిల్లును వ్యతిరేకించిన ఐదు పార్టీలు..
- డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎస్పీ, కేరళ ఆర్‌ఎస్పీ, టీఎంసీ, డీఎంకే.
- కేంద్రం తెచ్చిన డీలిమిటేషన్ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం: డీఎంకే
- జనగణన ప్రక్రియ ప్రారంభమైంది: అమిత్ షా.
- ఇళ్లకు కులం అనేది ఉండదు.. అందుకే ఆప్షన్ పెట్టలేదు.
- జనాభా లెక్కల సేకరణలో కులం ఆప్షన్ అనేది పెట్టాం.
- కచ్చితంగా కుల గణన చేసి తీరుతాం.
- మతం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం.

అఖిలేష్ వర్సెస్ అమిత్ షా..
- లోక్‌సభలో ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం.
- బిల్లులపై అభ్యంతరం తెలిపిన విపక్షాలు.
- మహిళా రిజర్వేషన్లలో సబ్ కోటా డిమాండ్ చేస్తున్న అఖిలేష్ యాదవ్.
- ముస్లింలకు కూడా సబ్ కోటా ఇవ్వాలని అఖిలేష్ డిమాండ్.
- మహిళా బిల్లుపై మీకు ఎందుకంత తొందర.
- మేము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు.
- మూడు బిల్లులను వ్యతిరేకించిన ఎస్పీ.
- బిల్లు పూర్తిగా ప్రవేశపెట్టకుండానే అభ్యంతరమేంటని అమిత్ షా ప్రశ్నలు.
- చర్చ సమయంలో అన్నింటికి సమాధానం చెబుతామన్న అమిత్ షా.
- జన గణన ఎందుకు చేపట్టలేదని అఖిలేష్ అడుగుతున్నారు..
- దేశంలో జన గణణ ప్రక్రియ ప్రారంభమైందన్న అమిత్ షా.
- మత పరమైన రిజర్వేషన్లను తిరస్కరించిన అమిత్ షా.
- కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యలు..
- మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవు.
- బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నా: ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్.
Speaking in Lok Sabha, Union Home Minister Amit Shah says, "Akhilesh Yadav asked why the census is not being conducted. I want to inform the entire country that the census process has already begun. The government has taken a decision to conduct a caste census, and the… pic.twitter.com/C1e5enMCeq
— ANI (@ANI) April 16, 2026
బిల్లుపై మాటల యుద్ధం..
- కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కామెంట్స్..
- 2023లో మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చాం.
- 2024 నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశాం.
- 33 శాతం మహిళా రిజర్వేషన్లను 2024లో ఎందుకు అమలు చేయలేదు?.
- జనగణన తర్వాతే డీలిమిటేషన్ చేస్తామని అప్పుడు అన్నారు.
- ఇప్పుడు జనగణన కాకముందే బిల్లును ఎలా తెస్తారు?.
- రాజ్యాంగాన్ని కేంద్రం హైజాక్ చేయాలని చూస్తోంది.
- ఈ బిల్లుకు అసలు కారణాలు వేరే ఉన్నాయి..
- అమిత్ షా వ్యాఖ్యలు..
- బిల్లును సభలో పెట్టకుండానే ఎలా చర్చిస్తాం: అమిత్ షా.
- సభలో బిల్లు పెట్టాక.. మీ అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి.
- కేంద్రం తెచ్చిన బిల్లులను కేసీ వేణుగోపాల్ అవమానిస్తున్నారు.
మూడు బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం..
- మూడు బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం..
- లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం.
- బిల్లులు ఆమోదం పొందాలంటే ప్రతిపక్ష మద్దతు తప్పనిసరి.
- డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా నల్ల చొక్కాలు వేసుకొని పార్లమెంటుకు వచ్చిన డీఎంకే ఎంపీలు
రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రమాణం..
- లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు, జీవ్ అవర్ రద్దు.
- 131వ రాజ్యాంగ సవరణ బిల్లు-2026ను సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్.
- డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్న మేఘవాల్.
- కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు-2026ను ప్రవేశపెట్టనున్న అమిత్ షా..
- రాజ్యసభలో కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం జరుగుతోంది.
- మూడు బిల్లులపై చర్చకు లోక్‌సభలో 18 గంటలు, రాజ్యసభలో 10 గంటల సమయం కేటాయింపు
- మధ్యాహ్నం మూడు గంటలకు లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగం..
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం..
- పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం..
- మూడు బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- గాయని ఆశా భోస్లే మృతికి లోక్‌సభ సంతాపం
Three-day special session of Parliament with focus on women's reservation and delimitation begins
Photo source: Sansad TV/ YouTube pic.twitter.com/Q85C1YmS4c— ANI (@ANI) April 16, 2026
దక్షిణాదికి నష్టం జరగదు: రిజిజు
- కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కామెంట్స్..
- డీలిమిటేషన్‌తో దక్షిణాదికి ఎలాంటి నష్టం జరగదు.
- బిల్లుపై చర్చ సందర్భంగా అన్ని సందేహాలకు సమాధానం లభిస్తుంది.
- తమిళనాడు సీఎం స్టాలిన్ రాజకీయం చేస్తున్నారు.
- దక్షిణాది ప్రజలను కొందరు కావాలని తప్పు దారి పట్టిస్తున్నారు.
- ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి అన్యాయం జరగదు.
అఖిలేష్ యాదవ్ సీరియస్ కామెంట్స్..
- సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ కామెంట్స్..
- మేము మహిళల రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు
- ఈ బిల్లును తీసుకువస్తున్న విధానానికి వ్యతిరేకం.
- వారు దళితులకు, ముస్లింలకు, వెనుకబడిన తరగతులకు వ్యతిరేకంగా ఉన్నారు.
- మనం 33% రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నప్పుడు, సరైన సంఖ్యలో ఓటర్లు లేనప్పుడు రిజర్వేషన్లు ఎలా ఇవ్వగలం?
#WATCH | Delhi | On Women's reservation bill, Samajwadi Party MP Akhilesh Yadav says "Yeh khufiya logon ki gupt yojana hai...We are not against reservation for women, but against the way this bill is being brought. They are against Dalits, Muslims, and the Backwards classes. When… pic.twitter.com/qWqti8GpXz
— ANI (@ANI) April 16, 2026
పార్లమెంట్‌లో తీర్మానం..
- పార్లమెంట్‌లో తీర్మానం..
- మూడు బిల్లులను వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌లో తీర్మానం
- లోక్‌సభలో మూడు ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే ఎంపీ కనిమొళి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
- అలాగే, ప్రతిపక్షాలు ప్రత్యేక సమావేశం
- సభలో అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించేందుకు ప్రతిపక్ష నేతల సమావేశం.
- పార్లమెంటులోని మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సమావేశం కానున్నారు.
కేంద్రం భారీ కుట్ర: జైరాం రమేష్
- కేంద్రం భారీ కుట్ర: జైరాం రమేష్
- మహిళా రిజర్వేషన్ పేరిట కుట్ర అని జైరాం రమేష్ పోస్ట్
- ఈ బిల్లుల అసలు ఉద్దేశం మహిళా రిజర్వేషన్ కాదు.
- నియోజకవర్గాల పునర్విభజన ద్వారా రాజకీయ సమీకరణాలను మార్చడమేనని ఆరోపణ.
అన్యాయం జరిగితే ఊరుకోం: మిథున్ రెడ్డి
- వైఎస్సార్‌సీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి కామెంట్స్..
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తున్నాం
- వైఎస్ జగన్ మహిళల పక్షపాతి
- వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేశారు
- డీలిమిటేషన్ బిల్లులో రాష్ట్రానికి న్యాయం జరగాలి
- అన్ని రాష్ట్రాలలో 50% సీట్లు పెంచుతామని కేంద్రం చెప్పింది
- రిజర్వేషన్ల ఖరారు కోసమే 2011 జనాభా లెక్కలు పరిగణలోకి తీసుకుంటామని అంటున్నారు
- ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో క్లారిటీ ఇవ్వాలి
- జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష వేయవద్దు.
- అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తున్నాం: ఎంపీ గురుమూర్తి
- సాక్షి టీవీతో వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేము మద్దతిస్తున్నాం.
- మహిళలకు రాజకీయ, ఆర్థిక సామాజిక న్యాయం చేసిన ఘనత వైఎస్ జగన్‌ది
- మహిళను ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత వైఎస్ జగన్‌ది
- నామినేటెడ్ పోస్టుల్లో, కాంట్రాక్టులో 50% మహిళలకు ప్రాతినిధ్యం కల్పించారు
- ప్రభుత్వ పథకాలను మహిళల పేర్లతోనే అమలు చేశారు
- 33 లక్షల మంది మహిళలకు ఇల్లు పట్టాలు ఇచ్చారు
- డీలిమిటేషన్‌పై అనుమానాలను కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేయాలి
- అన్ని ప్రాంతాలకు సమ న్యాయం జరగాలి
- మహిళా రిజర్వేషన్లపై టీడీపీది నాటకం మాత్రమే
- గ్యాలరీలో మహిళలను కూర్చోబెట్టి ప్రేక్షకుల పాత్రకు పరిమితం చేస్తున్నారు.
స్టాలిన్ నిరసన
- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిరసన
- డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా స్టాలిన్ నిరసన
- కేంద్ర ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా సీఎం వినూత్న నిరసన.
- ఎంకే స్టాలిక్ నల్ల దుస్తులు ధరించి నల్ల జెండాను ఎగురవేశారు.
- డీలిమిటేషన్ బిల్లు ప్రతిని కాల్చివేశారు.
Namakkal | DMK President and Tamil Nadu CM MK Stalin, wearing black attire, today hoisted a black flag in protest against the Centre's delimitation move. He also burned a copy of the proposed Delimitation bill. pic.twitter.com/AYno2V8UCn
— ANI (@ANI) April 16, 2026
ముందుకు సాగుతాం: మోదీ
- ముందుకు సాగుతాం: మోదీ
- దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నామన్న మోదీ
- మహిళా సాధికారత దిశగా భారత్ ఒక చరిత్రాత్మక అడుగు వేయబోతోందని మోదీ వ్యాఖ్యలు.
- ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఎక్స్ వేదికగా ప్రకటన .
- మహిళా సాధికారత దిశగా మన దేశం ఒక చరిత్రాత్మక అడుగు వేయడానికి సిద్ధంగా ఉంది.
- మన తల్లులు, సోదరీమణుల గౌరవమే దేశం పట్ల గౌరవం.
- ఇదే స్ఫూర్తితో మనం ఈ దిశగా దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నాం అంటూ పోస్టు.
आज से शुरू हो रही संसद की विशेष बैठक में हमारा देश नारी सशक्तिकरण के लिए ऐतिहासिक कदम उठाने जा रहा है। हमारी माताओं-बहनों का सम्मान राष्ट्र का सम्मान है और यही भावना लेकर हम इस दिशा में दृढ़ता से आगे बढ़ रहे हैं।
व्युच्छन्ती हि रश्मिभिर्विश्वमाभासि रोचनम्।
ता त्वामुषर्वसूयवो… pic.twitter.com/8KWT1WLSje— Narendra Modi (@narendramodi) April 16, 2026
ప్రతిపక్షాలు వ్యతిరేకం
- ప్రతిపక్షాలు వ్యతిరేకం
- ప్రతిపక్ష ఇండియా కూటమి మాత్రం ఈ బిల్లులపై స్పష్టమైన వైఖరిని ప్రకటించింది.
- డీలిమిటేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించింది.
- 21 ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొని ఈ అంశంపై వ్యూహం రచించారు.
- మహిళా రిజర్వేషన్లకు తమ మద్దతు ఉన్నప్పటికీ, వాటిని డీలిమిటేషన్‌తో అనుసంధానం చేయడంపై తీవ్ర అభ్యంతరం.
- ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్ల ఆధారంగానే 2029 ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్.
మద్దతు కీలకం..
- కేంద్రం ప్రవేశ పెట్టనున్న మూడు బిల్లుల్లో ముఖ్యమైనది రాజ్యాంగ సవరణ బిల్లు.
- లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుంచి గరిష్ఠంగా 850కి పెంచే ప్రతిపాదన.
- 2011 జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే విధంగా ప్రతిపాదనలు.
- మిగతా రెండు బిల్లులు డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినవి.
- రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం.
- ప్రస్తుతం సభలో ఉన్న సభ్యుల సంఖ్యను బట్టి చూస్తే కనీసం 360 మంది మద్దతు అవసరం.
- అధికార ఎన్డీఏ కూటమికి సుమారు 292 మంది సభ్యుల మద్దతు ఉండగా,
- మరో 68 మంది మద్దతు కీలకంగా మారింది.
- సభకు హాజరైన సభ్యులలో 2/3 మెజారిటీ సాధిస్తే సరిపోతుందన్న అంశం కూడా చర్చకు వస్తోంది.
డీలిమిటేషన్ దంగల్
- కేంద్రం, విపక్షాలు నువ్వా, నేనా?
- నేటి నుంచే పార్లమెంటు ప్రత్యేక భేటీ
- మహిళా రిజర్వేషన్ల చట్టానికి సవరణ
- నేడు లోక్‌సభలో బిల్లు పెట్టనున్న కేంద్రం
- మూడొంతుల మెజారిటీ ఉంటేనే ఆమోదం
- కేంద్రానికి విపక్షాల మద్దతు తప్పనిసరి
- సభ ముందుకు 2 డీలిమిటేషన్ బిల్లులు.
నేడు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు
- నేడు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు
- మహిళా రిజర్వేషన్ బిల్లు, డీ లిమిటేషన్ బిల్లు, పునర్విభజన కమిషన్ బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 55, 81,82,170,330,332, 334A లకు సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లులు రూపకల్పన
- లోక్‌సభలో సీట్లు గరిష్టంగా 850 వరకు పెంచుకునేలా బిల్లు రూపకల్పన
- మూడు బిల్లులపై ఒకేసారి చర్చ, ఓటింగ్
- జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలలో 50% సీట్లు పెంచుతామన్న అంశం లిఖితపూర్వకంగా బిల్లులో లేకపోవడంపై సందేహాలు
- ఈ అంశంపై పార్లమెంట్‌లో స్పష్టత ఇస్తామని, పునర్విభజన కమిషన్ అన్ని రాష్ట్రాల్లో సమానంగా పెంచుతుందంటున్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు
- పార్లమెంట్ నిర్దేశించిన జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన
- పునర్విభజన ప్రకారం ఏపీలో లోక్‌సభ సీట్లు 38, తెలంగాణలో ఎంపీ సీట్లు 25కి పెరిగే అవకాశం
- 50% ఫార్ములా ప్రకారం పెంచితే యథావిధిగా పార్లమెంట్‌లో తెలంగాణ మూడు శాతం, ఏపీకి 4 శాతం వాటా
- దక్షిణాది రాష్ట్రాలకు 24% వాటా
- 2011 జనాభా లెక్కల ప్రకారం సీట్లు పెంచితే దక్షిణాదికి నష్టం జరిగే అవకాశం.


