దక్షిణాదిలో పెరగనున్న పార్లమెంట్‌ స్థానాలు ఎన్నంటే : అమిత్‌షా | Amit Shah says delimitation will benefit South states | Sakshi
Sakshi News home page

దక్షిణాదిలో పెరగనున్న పార్లమెంట్‌ స్థానాలు ఎన్నంటే : అమిత్‌షా

Apr 16 2026 6:42 PM | Updated on Apr 16 2026 7:09 PM

Amit Shah says delimitation will benefit South states

సాక్షి,న్యూఢిల్లీ: డీలిమిటేషన్‌ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగనుందంటూ విపక్షాల ఆరోపణలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కౌంటర్‌ ఇచ్చారు. 

బిల్లుతో దక్షిణాదిలో పార్లమెంట్‌ స్థానాలు 129 నుంచి 195కు పెరుగుతాయి. బిల్లుతో లాభం తప్ప నష్టం జరగదు. బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఈ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు చాలా లాభం. కర్ణాటక, తెలంగాణ బాగా లాభపడతాయి. ఈ బిల్లుతో తెలంగాణలో ఎంపీల సంఖ్య 17 నుంచి 26కు.. ఏపీలో ఎంపీ సీట్లు 25 నుంచి 38కి పెరుతాయి. 

అలాగే తమిళనాడులో 59కి, కర్ణాటకలో 28 నుంచి 42 స్థానాలు.. కర్ణాటకలో 28 నుంచి 42 స్థానాలకు పెరుగుతాయి. మేం సందేహాలకు సమాధానం ఇస్తాం.. వాకౌట్‌ చేయాల్సిన పనిలేదని విపక్షాల ఆరోపణలకు అమిత్‌షా ఎద్దేవా చేశారు. కాగా, జనాభా మార్పులను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటరీ, రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల సరిహద్దులను పునర్‌ నిర్వచించే ప్రక్రియనే డీలిమిటేషన్‌ అంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement